English | Telugu

డెలివెరీ టైమ్‌కి కరోనా.. హరితేజ షాకింగ్ వీడియో!

బిగ్ బాస్ ఫేమ్ హరితేజ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ.. కోవిడ్ వల్ల పడిన ఇబ్బందుల గురించి చెప్పింది. డెలివెరీ టైమ్ లో తనకు కరోనా సోకిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో చాలా కష్టాలు పడ్డానని ఎమోషనల్ అయింది. తనకు పాప పుట్టిన సమయంలో అందరూ విషెస్ చెప్పారని.. కానీ అప్పుడు ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేనని చెప్పింది. తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా ఉన్నానని.. డెలివెరీకి వారం రోజుల ముందు చెకప్ చేయిస్తే అంతా బాగుందని.. నార్మల్ డెలివెరీ అవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంది. కానీ సడెన్ గా ఇంట్లో అందరికీ కోవిడ్ పాజిటివ్ రావడంతో.. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదని వాపోయింది.

డెలివెరీ సమయానికి డాక్టర్స్ డెలివెరీ చేయలేం.. మీకు పాజిటివ్ కాబట్టి కోవిడ్ హాస్పిటల్ కి వెళ్లమని చెప్పారని.. ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని.. ఆపరేషన్ చేసి బేబీని బయటకి తీశారని.. ఆ సమయంలో తన భర్త మాత్రమే తనతో ఉన్నారని చెప్పుకొచ్చింది. బేబీ పుట్టిన వెంటనే తన దగ్గర నుండి తీసుకు వెళ్లిపోయారని.. పాలు కూడా ఇవ్వలేకపోయానని.. వీడియో కాల్స్ లో పాపని చూసుకున్నానని.. ఆ సమయంలో చాలా బాధ అనుభవించానంటూ ఎమోషనల్ అయింది.

ఇంటికి వచ్చిన తరువాత కూడా అందరూ ఐసోలేషన్ లోనే ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయంలో ఎవరి సహాయం అడ‌గ‌లేకపోయామని.. స్నేహితులు తోడుగా ఉన్నారని వెల్లడించింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండమని కోరింది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా జరిగినా కూడా అధైర్య పడొద్దని చెప్పుకొచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా చాలా మంది మాస్క్ లు పెట్టుకోవడం లేదని.. ముందు నుండే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.