English | Telugu

వచ్చింది జాతిరత్నాలు కాదు.. జాతి మొగుళ్లు!

కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ముందుంటారు మెగాబ్రదర్ నాగబాబు. 'జబర్దస్త్' షో సమయంలో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేసి వాళ్లను ప్రోత్సహించిన నాగబాబు.. ఆ షో నుండి బయటకి వచ్చిన తరువాత జీతెలుగులో 'అదిరింది' షోతో కొన్నాళ్ల పాటు అలరించారు. అయితే ఆ షోని ఎక్కువకాలం కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తరువాత 'ఖుషీఖుషీగా ' అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కమెడియన్లతో కామెడీ షో నిర్వహించారు నాగబాబు. అయితే ఇప్పుడు ఎక్కువమందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో యూట్యూబ్ పై ఫోకస్ పెట్టారు.

'అదిరింది' కామెడీ షోతో పాపులర్ అయిన సద్దాం, యాదమ్మ రాజు, భాస్కర్, హరిలతో 'బస్తీ బాయ్స్' అనే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టారు. ఈ సిరీస్ కి నాగబాబు కాన్సెప్ట్ అందించి.. ఇన్ఫినిటంతో కలిసి నిర్మించారు. తాజాగా 'బస్తీ బాయ్స్' ఫస్ట్ ఎపిసోడ్‌ను నాగబాబు యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు.. "వచ్చింది జాతి రత్నాలు కాదు.. జాతి మొగుళ్లు" అంటూ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టి యూట్యూబ్ లింక్ ని షేర్ చేశారు.

ఈ స్కిట్ లో నటించిన సద్దాం.. తనను తానే బాబు అని పేరు పెట్టేసుకొని.. బిల్డప్ ఇచ్చాడు. "యూట్యూబ్‌లో ఒక్కొక్క ట్యూబ్‌లు పగిలిపోతాయ్. వారం అంతా యూట్యూబ్‌లో ట్యూబ్‌లు పగలగొట్టేస్తాం" అంటూ హడావిడి చేస్తున్నాడు. పదహారు నిమిషాల నిడివితో ఉన్న 'బస్తీ బాయ్స్' వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో సద్దాం, భాస్కర్ లు కనిపించారు. తొలి ఎపిసోడ్ చాలా కామెడీతో అల‌రించింది. ప్ర‌స్తుతం 1.1 మిలియ‌న్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో నంబ‌ర్ వ‌న్‌గా ట్రెండ్ అవుతున్నారు 'బ‌స్తీ బాయ్స్‌'.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.