English | Telugu

బ్రహ్మముడి పడిన రాజ్ కావ్యలిద్దరు ఒకే గదిలో ఉండగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -85 లో.. రాహుల్ ని కలవడానికి వచ్చిన స్వప్న తనతో మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళు నన్ను చీప్ గా చూస్తున్నారని రాహుల్ తో స్వప్న అంటుంది.  అలా తను అంటే.. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అని రాహుల్ తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు నాకు సంబంధం చూస్తున్నారని స్వప్న అనగానే.. తొందరగా పెళ్లి సెట్ అయితే నీ పీడ విరగడ అవుతుందని మళ్ళీ తన మనసులో అనుకుంటాడు రాహుల్. నువ్వు ఏం తొందర పడకు, ఇంట్లో సిట్యుయేషన్ బాలేదని రాహుల్ అంటాడు. నీతో గొడవ పడి.. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడానికి.. నాకు ఎంతో టైం పట్టదు.‌. కానీ నాకు ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వరు.. నన్ను కూడా కావ్య లాగా చూస్తారు.. అది నాకు నచ్చదని స్వప్న అంటుంది. సరే నేను వెళ్తాను.. నాకు మీటింగ్ ఉంది.. మళ్ళీ మనం.. పెళ్లి కూతురుగా నువ్వు, పెళ్లి కొడుకుగా నేను.. పెళ్లి పీటల మీద కలుద్దామని రాహుల్  బిస్కెట్ వేయగానే  అదంతా నమ్మి పొంగిపోతుంది స్వప్న.

ఏదైనా చేయాలి అనుకుంటే అంగవైకల్యం అడ్డు కాదు!

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి నటన చూసినవారు ఎవరైనా సరే ఇట్టే కనెక్ట్ ఐపోతారు. ఎందుకంటే చాలా నాచురల్ గా ఉంటుంది ఆమె యాక్షన్. అలాంటి కస్తూరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎవరితోనూ ఒక మాట పడదు..సినిమాలు, సీరియల్స్‌లో చాలా హోమ్లీ లుక్ లో కనిపిస్తుంది కస్తూరి.. బయట మాత్రం చాలా మోడరన్‌గా ఉంటుంది.  మోడరన్ లుక్ లో ఉండే ఫొటోస్ ని, వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. కస్తూరికి జాలి గుండె కూడా ఎక్కువే...తనకు వచ్చే దాంట్లో కొంత కాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేసింది. "ఈరోజు చాలా ప్రత్యేకమైన అభిమానిని కలిశాను. నా దగ్గరకు ప్రసాద్ లక్ష్మణ్ అనే ఒక  మూగ , చెవుడు ఉన్న ఒకతను వచ్చాడు.

సుమకి వార్నింగ్ ఇచ్చిన గోపీచంద్

సుమ అడ్డా షోకి ఈ వారం "రామబాణం" మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. డింపుల్-శ్రీవాస్ ఒక టీం గా, గోపీచంద్-గెటప్ శీను ఒక టీంగా గేమ్స్ ఆడించింది. ఇక ఇందులో ఒక సీన్ చేశారు గోపీచంద్ - సుమ. జయం మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గా చేశారు. "టైం అయ్యింది..ఈ టైంకి సుజాత గుడి దగ్గరకు వస్తానని చెప్పింది కదా" అని అనేసరికి "రాను రాను" అనే సాంగ్ పాడుతూ వచ్చింది సుమ. "అయ్యో మా సుజాత వస్తుంది అనుకున్నా కానీ సుమ వచ్చిందా..ఐతే నేను హీరోగా కాదు విలన్గా చేయడమే బెటర్ " అని అనేసరికి "మీరు హీరోగా చేయడమే కరెక్ట్..వెనక మీ సుజాత వస్తోంది" అని సుమ చెప్పడంతో డింపుల్ వచ్చి "వెళ్ళవయ్యా వెళ్ళు" అంది..

ఇంద్రజని "నువ్వు" అని సంబోధించిన ఆది..ఏకిపడేస్తున్న నెటిజన్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కమెడియన్స్ యాక్షన్ మస్త్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే జడ్జి ఇంద్రజ తనదైన స్టయిల్లో చేసే కామెడీ, డాన్స్, యాక్షన్ అన్నీటినీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ లో సీనియర్ నటీమణులంతా వచ్చి పార్టిసిపేట్ చేశారు. రాబోయే వారం షోలో సీనియర్ యాక్టర్ శైలజకి ఆదికి మధ్య తాడు లాగే ఆట పెట్టింది రష్మీ. "శైలజ గారి మీద గెలిస్తే ఆది గారు ఓడిపోయినట్టే" అని ఇంద్రజ చెప్పేసరికి "సరే మీరు రండి...మీ మీద గెలుస్తా" అంటూ కొంచెం ఓవర్ గా డైలాగ్ చెప్పేసరికి "నా మీద గెలిచినాయన చెన్నైలో ఉన్నారు నాకు ఒక్కరు చాలు"

‘ఆడ జన్మకు’ పాటతో అందరిని కదిలించిన సౌజన్య!

ఓటిటి వేదిక 'ఆహా' లో స్ట్రీమ్ అవుతున్న సింగింగ్ కాంపిటీషన్ తెలుగు ఇండియన్ ఐడల్ -2. ఈ షో రోజు రోజుకి అత్యంత వీక్షకాదరణ పొందుతుంది. ఈ షోకి జడ్జ్ లుగా సింగర్స్ గీతామాధురి, కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వ్యవహరిస్తుండగా.. యాంకర్ గా హేమచంద్ర చేస్తున్నాడు. ఈ షోలోకి ఎంతో మంది కంటెస్టెంట్స్ తమలోని సత్తా నిరూపించడానికి వస్తున్నారు. అయితే వారిలో ఎవరి సింగింగ్ అయితే బాగుంటందో వారిని ఎన్నుకోవడమనేది జడ్జెస్ కి కత్తి మీద సాములా అవుతుంది. ఎందుకంటే ప్రతీ కంటెస్టెంట్ తమ గాత్రంతో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోన్నారు.

అలా ఉండటం తనకి నచ్చట్లేదంట.. జల్సా చేస్తోన్న కృష్ణ, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -145 లో.. మురారి మాట్లాడకపోవడంతో ముకుంద ఒంటరిగా ఫీల్ అవుతుంది. అతను చేయని తప్పుకి ఎందుకు శిక్ష వేసారని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత మురారికి మెసేజ్ చేసి మాట్లాడాలని అనుకుంటుంది. నువ్వు నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే.. నీకే ప్రాబ్లమ్ అలాంటి ఆలోచనలేం పెట్టుకోకని అటువైపు నుండి మురారి రిప్లై ఇస్తాడు. చేసిందంతా ఆ కృష్ణే చేసింది.. మురారి అలా బాధపడడం నచ్చడం లేదని ముకుంద భావిస్తుంది. అలా అనుకొని కాసేపటికి భవాని దగ్గరికి వెళ్తుంది ముకుంద. 

డాన్సర్స్ అంటే చిన్నచూపు... గంట సేపు బేరాలాడతారు

ఢీ షోలో ఫేమస్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆ టీం అంతా చాలా బాధపడుతున్నారు. అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఒక్క మాట చెప్తే మేమంతా చూసుకునేవాళ్ళం కదా అంటూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆట సందీప్ ఒక ఛానల్ లో చైతన్య సూసైడ్ విషయానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు. "చైతన్య చాలా మంచివాడు. స్టేజి మీద ఎంత ఫన్నీగా ఉంటాడో బయట కూడా అలాగే ఉంటాడు. నేను లాస్ట్ మంత్ ఫోన్ చేసి ఒక ఈవెంట్ కి రమ్మని పిలిచాను ఫ్లయిట్ టికెట్ పంపిస్తాను అని కూడా చెప్పాను కానీ మంచి కవర్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందని చెప్పి నా దగ్గరకు రాలేకపోతున్నందుకు బాధపడ్డాడు. ఐతే ఇక్కడ ఫేమ్ సంపాదించుకుంటున్నాం కానీ డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం. వేరే షోస్ లో జబర్దస్త్ లాంటి వాటిల్లో వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు అని బాధపడ్డాడు. ఈ మాటైతే నిజం ఎందుకు అంటే ఈ డాన్సర్స్ కి కానీ, కొరియోగ్రాఫర్స్ కి కానీ ఈరోజుకి కూడా వేల్యూ లేదు.