Read more!

English | Telugu

సుమకి వార్నింగ్ ఇచ్చిన గోపీచంద్

సుమ అడ్డా షోకి ఈ వారం "రామబాణం" మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. డింపుల్-శ్రీవాస్ ఒక టీం గా, గోపీచంద్-గెటప్ శీను ఒక టీంగా గేమ్స్ ఆడించింది. ఇక ఇందులో ఒక సీన్ చేశారు గోపీచంద్ - సుమ. జయం మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గా చేశారు. "టైం అయ్యింది..ఈ టైంకి సుజాత గుడి దగ్గరకు వస్తానని చెప్పింది కదా" అని అనేసరికి "రాను రాను" అనే సాంగ్ పాడుతూ వచ్చింది సుమ. "అయ్యో మా సుజాత వస్తుంది అనుకున్నా కానీ సుమ వచ్చిందా..ఐతే నేను హీరోగా కాదు విలన్గా చేయడమే బెటర్ " అని అనేసరికి "మీరు హీరోగా చేయడమే కరెక్ట్..వెనక మీ సుజాత వస్తోంది" అని సుమ చెప్పడంతో డింపుల్ వచ్చి "వెళ్ళవయ్యా వెళ్ళు" అంది..

నేనేందుకు వెళ్ళాలి నువ్వే వెళ్ళు అన్నాడు ఫన్నీగా గోపీచంద్ అనడంతో సుమ వచ్చి వెళ్ళు అంది..మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసాక వెళ్లకుండా ఎవడుంటాడు అంటాడు. డింపుల్ నువ్వు వెళ్ళు మేము మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఉంది అని సుమ అనడంతో డింపుల్ వెళ్ళిపోయింది. "మీరేదో చెప్పాలని పిలిచారు" అని అనేసరికి సుమ గొంతు పట్టుకున్నాడు గోపీచంద్. ఆ సడన్ ఎక్స్ప్రెషన్ కి అందరూ షాకయ్యారు. "మీరు బయట ఎన్ని ఈవెంట్లు..షోస్ చేసినా పర్లేదు.. నా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం  మీరే హోస్ట్ చేయాలి..అర్దమయ్యిందా" అని బెదిరించేసరికి " చెయ్యకపోతే" ఏమవుతుంది అని మళ్ళీ రివర్స్ లో అడిగేసరికి "ఇలా గాల్లో వేళ్ళాడదీస్తా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి చూపించాడు గోపీచంద్.