Read more!

English | Telugu

కిడ్నాప్ చేయాలన్న ఫ్యాన్..కొవ్వు తగ్గలేదా అంటూ వార్నింగ్!

సోషల్ మీడియాలో అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్ సమంతగా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్లు సంపాదించుకుంది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. అలాంటి అష్షు ఇన్స్టాగ్రామ్ లో "మీ ప్రశ్నలతో నన్ను షూట్ చేయండి" అని అడిగేసరికి చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఒక ఫ్యాన్ మాత్రం "కిడ్నాప్ చేయాలి నిన్నసలు" అనేసరికి "నన్ను భరించలేక రెండు నిమిషాల్లో వదిలేస్తారు మళ్ళీ" అని ఆన్సర్ చేసింది. ఇంకో ఫ్యాన్ "ఐ లవ్ యు" అని చెప్పేసరికి "ఈ పదాన్ని  మాత్రం చాలా ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాను..నువ్వు ఎవరో తెలీదు కానీ థాంక్యూ" అని చెప్పింది.

"నీ కోసం నేను, నా కోసం నువ్వు, మన ఇద్దరి కోసం ఈ పువ్వు, నువ్వే నా లవ్వు" అనేసరికి "తగ్గలేదా ఇంకా నీ కొవ్వు..జస్ట్ కిడ్డింగ్" అని రిప్లై ఇచ్చింది. అష్షు వేసుకున్న టీ షర్ట్ మీద పిల్లి బొమ్మ చూసి "జెర్రీ యాక్టీవ్ గా ఉన్నప్పుడు టామ్ ఎందుకు నిద్రపోతున్నాడు" అని అడిగిన ఫ్యాన్ కి  "నో ఐడియా...నేను షిన్ చాన్ ఫ్యాన్ ని" అని చెప్పింది. "నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు అక్క" అని అడిగేసరికి "నాకు ఎవరూ లేరు..నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ ని " అని చెప్పింది. "యూఎస్ఏ ఫోటోషూట్ కావాలి" అన్న ఫ్యాన్ కి " ఫోటోషూట్ కోసం నాకు డ్రెస్ కావాలి, దాని కోసం నేను షాపింగ్ చేయాలి, అందుకు ఎవరైనా నన్ను తీసుకెళ్ళాలి" అని ఆన్సర్ ఇచ్చింది. ఇక అష్షు "ఏ మాస్ట‌ర్ పీస్" పేరుతో రాబోతున్న మూవీలో  ఆద్య అనే పాత్ర‌లో కనిపించబోతోంది.