Read more!

English | Telugu

బ్రహ్మముడి పడిన రాజ్ కావ్యలిద్దరు ఒకే గదిలో ఉండగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -85 లో.. రాహుల్ ని కలవడానికి వచ్చిన స్వప్న తనతో మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళు నన్ను చీప్ గా చూస్తున్నారని రాహుల్ తో స్వప్న అంటుంది.  అలా తను అంటే.. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అని రాహుల్ తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు నాకు సంబంధం చూస్తున్నారని స్వప్న అనగానే.. తొందరగా పెళ్లి సెట్ అయితే నీ పీడ విరగడ అవుతుందని మళ్ళీ తన మనసులో అనుకుంటాడు రాహుల్. నువ్వు ఏం తొందర పడకు, ఇంట్లో సిట్యుయేషన్ బాలేదని రాహుల్ అంటాడు. నీతో గొడవ పడి.. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడానికి.. నాకు ఎంతో టైం పట్టదు.‌. కానీ నాకు ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వరు.. నన్ను కూడా కావ్య లాగా చూస్తారు.. అది నాకు నచ్చదని స్వప్న అంటుంది. సరే నేను వెళ్తాను.. నాకు మీటింగ్ ఉంది.. మళ్ళీ మనం.. పెళ్లి కూతురుగా నువ్వు, పెళ్లి కొడుకుగా నేను.. పెళ్లి పీటల మీద కలుద్దామని రాహుల్  బిస్కెట్ వేయగానే  అదంతా నమ్మి పొంగిపోతుంది స్వప్న.

మరొకవైపు రాజ్, కావ్యల మౌనవ్రతం కొనసాగుతుంది. రాజ్ నన్ను ఆట పట్టిస్తున్నాడు కదా.. నేను తన సంగతి చెప్తానని భావించిన కావ్య.. కావాలనే దుమ్ము పట్టిన వాటిని దులుపుతుంది. అలా కావ్య దులుపుతుంటే పక్కనే ఉన్న రాజ్ కి ఆ దుమ్ము పడక శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కింద పడిపోతుంటాడు. అలా పడుతుండగా కావ్య పట్టుకుంటుంది. అప్పుడే రాజ్ కి ఆస్తమా ఉన్నట్లు కావ్య తెలుసుకుని ‌.. అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.. క్షమించండని సైగలతో చెప్తుంది. మరొకవైపు స్వప్న, రాహుల్ మాట్లాడుకోవడం వీడియో తీసిన అప్పు, కళ్యాణ్ లు వీడియో ఎలా వచ్చిందోనని చూసేసరికి.. అందులో మెమోరి కార్డ్ వెయ్యడం మర్చిపోతాడు రాహుల్. దాంతో ఆ కెమెరాలో ఏది రికార్డు అవ్వదు. అది చూసిన అప్పు కోపంతో కళ్యాణ్ ని పరిగెత్తించి మరీ కొడుతుంది. నువ్వు కావాలనే ఇదంతా చేసావ్ కదా.. మీ ఇంటి పరువు పోకూడదని.. రాహుల్ మీ ఇంటివాడే కాబట్టి కావాలనే ఆ వీడియో రికార్డు చెయ్యలేదు కదా అని అప్పు అనగానే‌‌.. అలా ఏం కాదు.. అన్నయ్య వదినలు బాగుండాలనే కోరుకుంటున్నానని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు స్వప్న ఒక్కతే ఇంటికి వెళ్తుంది. అలా తను ఒక్కతే రావడం చూసి‌న కనకం స్వప్నని కోప్పడుతుంది. వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్లారు.. వచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావేంటని కనకం అడిగేసరికి.. అప్పు వర్క్ ఉందంటూ వెళ్లినట్లుగా భయపడుతూ చెప్తుంది స్వప్న.

మరొకవైపు రాజ్, కావ్యల మౌనవ్రతం పూర్తవుతుంది. నేను చెప్పినట్లు చెప్పండని రాజ్ తో పంతులు గారు అంటాడు. నేను చెప్పనని రాజ్ మొండికేస్తాడు‌‌. ఆ తర్వాత  రాజ్ నానమ్మ మాట కాదనలేక పంతులు చెప్పినట్లు చేస్తాడు. ఈ బ్రహ్మముడి రేపటి వరకు ఇలాగే ఉండాలని పంతులు చెప్తాడు. రేపటి వరకు అంటే నేను ఎలా పడుకోవాలి.. తను నా గదిలోకి వద్దని రాజ్ అంటాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.