Read more!

English | Telugu

అలా ఉండటం తనకి నచ్చట్లేదంట.. జల్సా చేస్తోన్న కృష్ణ, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -145 లో.. మురారి మాట్లాడకపోవడంతో ముకుంద ఒంటరిగా ఫీల్ అవుతుంది. అతను చేయని తప్పుకి ఎందుకు శిక్ష వేసారని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత మురారికి మెసేజ్ చేసి మాట్లాడాలని అనుకుంటుంది. నువ్వు నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే.. నీకే ప్రాబ్లమ్ అలాంటి ఆలోచనలేం పెట్టుకోకని అటువైపు నుండి మురారి రిప్లై ఇస్తాడు. చేసిందంతా ఆ కృష్ణే చేసింది.. మురారి అలా బాధపడడం నచ్చడం లేదని ముకుంద భావిస్తుంది. అలా అనుకొని కాసేపటికి భవాని దగ్గరికి వెళ్తుంది ముకుంద. 

భవాని దగ్గరికి వెళ్ళిన ముకుంద.. ఏంటి అత్తయ్య ఒంటరిగా ఉన్నారని అడుగుతుంది. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు.. ఎటైనా వెళ్ళిపోదామని అనుకుంటున్నా.. అందుకే ఇప్పటి నుండే ఒంటరితనం అలవాటు చేసుకుంటున్నానని భవాని అంటుంది. కృష్ణ తప్పు చేస్తే మురారిని దూరం పెట్టడం ఎందుకు అత్తయ్యా.. ఆ కృష్ణే మీ కూతురిని మీకు దూరం చేసింది.. మీ కొడుకును దూరం చేసింది.. అలా తనని వదిలేస్తే ఎలా అత్తయ్య.. తనని ఇంట్లో నుండి పంపించేయండి అత్తయ్య అని భవానితో ముకుంద అంటుంది. కృష్ణ చెప్పినట్టు మురారి వినడం తప్పే కదా.. మురారి కూడా తప్పు చేసినట్లేగా.. అయినా కృష్ణ చెప్తే మురారి విని తప్పు చేసినట్లుగా.. నీ మాట విని నేను తప్పు చేస్తే.. వాడికి నాకు తేడా ఏం ఉంది. నువ్వేం ఆలోచించకు.. వెళ్ళు ప్రశాంతంగా ఉండమని ముకుందతో భవాని అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి లు డాన్స్ చేస్తూ సరదాగా ఉంటారు. కృష్ణ.. నువ్వు నిజంగానే ఎంత బాగా డాన్స్ చేస్తున్నావో.. అయినా నువ్వు ఇంత మందిని డామినేట్ చేస్తున్నావ్.. ముఖ్యంగా మా పెద్దమ్మని అని మురారి అనగానే.. నిజంగా నేను అంత డామినేటెడా అని కృష్ణ అడుగుతుంది. నువ్వు డామినేటెడ్ కాదు.. డైనమిక్ వి ఎంతైనా పోలీస్ కూతురువి కదా.. ఇంకా పోలీసోడి భార్యవి.. నేను కట్టిన తాళి నీ మెడలో ఉందని మురారి అనగానే.. కృష్ణ డల్ అవుతుంది. మురారి మళ్ళీ సరదాగా మాట్లాడుతాడు. మరొకవైపు భవానికి జ్వరం రావడంతో.. రేవతి టాబ్లెట్ తీసుకొని వస్తుంది. నాకేం అవసరం లేదు.. నీ కొడుకు కోడలికి సపోర్ట్ చేస్తూ.. ఎక్కడ లేని అమాయకత్వం నటిస్తున్నావని రేవతిని అంటుంది భవాని. దాంతో రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ముకుందకి ఎదురుపడుతుంది రేవతి. మురారీతో అక్క మాట్లాడకని చెప్పింది కదా అని‌ ముకుందని అడుగుతుంది రేవతి. మురారి బాధగా  ఉంటే చూడలేక మాట్లాడుతున్నానని ముకుంద అంటుంది. మురారిని చూసుకోవడానికి.. ఆ ఎడ్డి మొహంది ఉంది కదా అని రేవతి అంటుంది. అప్పుడే కృష్ణ అదంతా చూస్తూ.. అడవి పిల్ల, తింగరిపిల్ల, ఎడ్డీ మొహం.. ఇప్పుడు నా పేరు ఇంకొకటి కొత్తగా యాడ్ అయ్యింది అన్న మాట అని కృష్ణ అనుకుంటుంది. 

ఆ తర్వాత కృష్ణ, మురారిలు బయటకు వెళ్తారు. వాళ్ళని అలా వదిలేస్తే ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో చూసారా.. ఇంట్లో తినొద్దన్నారని బయటకు వెళ్లారు.. అంత కృష్ణ వల్లనే అని ఈశ్వర్, ప్రసాద్ లతో ముకుంద అంటుంది. కృష్ణ తప్పే కాదు.. మురారి తప్పు కూడా అని ఈశ్వర్ అంటాడు. వీళ్లేంటి మురారిని తప్పు పడుతున్నారని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.