English | Telugu

వాళ్ళు తప్పు చేశారు.. భవాని ఏ శిక్ష వేస్తుందోనని రేవతి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌ -151లో.. భవాని తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. ముకుంద చెప్పిన మాటలన్నీ పదే పదే గుర్తుచేసుకుంటూ కృష్ణపై కోపాన్ని పెంచుకుంటుంది భవాని. మరోవైపు భవాని దగ్గరికి రేవతి వస్తుంది. అక్కా అని రేవతి పిలవగానే.. ఏంటి చెప్పు అని భవాని అడుగుతుంది. ఏంటక్కా అంత సీరియస్ గా ఉన్నారని రేవతి అడుగగా.. విషయమేంటో సూటిగా చెప్పమని భవాని అంటుంది. మీకు వ్యతిరేకంగా కృష్ణ, మురారి ప్రవర్తించడం తప్పే అక్క అని అనగా.. తప్పని ఒప్పుకున్నావ్ కదా.. ప్రాయశ్చిత్తం కచ్చితంగా జరుగుతుంది వెళ్లమని భవాని అంటుంది. ఆ తర్వాత రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 

ఇంటికి రమ్మని స్వప్న రాహుల్ కి గ్రీన్ సిగ్నల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-90లో.. కనకం ప్లాన్ సక్సెస్ కావడంతో పదహారు రోజుల పండుగ కోసం కావ్యని వాళ్ళ పుట్టింటికి పంపడానికి అపర్ణ ఒప్పుకుంటుంది. మరోవైపు రాజ్ తన గదిలో కోపంగా ఊగిపోతుంటాడు. తన గదికి వెళ్ళిన అపర్ణ.. కోపంగా ఉండకు.. ఆలోచించు.. ఓపికగా ఉండు.. ఇంకొన్ని రోజుల్లో కావ్య ఇంటి నుండి వెళ్ళిపోతుంది.. నువ్వు ఎంత ఓపికగా ఉంటే ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని కండిషన్ మీద ఇక్కడ ఉంచినట్టు ఎవరికీ చెప్పకు.. రెండు రోజుల్లో తన తప్పు అందరికి తెలుస్తుందని అపర్ణ  అంటుంది. వాళ్ళ ఆటలు సహించలేకపోతున్నా అమ్మ అని రాజ్ అంటాడు. కొన్ని రోజులు ఓపికగా ఉండమని అపర్ణ అంటుంది.

 సుధీర్ కంపెనీగా ఉంటే చాలా బాగుంటుంది అన్న రష్మీ

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే వారం షో మంచి ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. ఇందులో బ్రహ్మాజీ, రష్మీ, సింగర్స్ రేవంత్, శ్రీరామచంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళ కామెడీ మాములుగా లేదు. బ్రహ్మాజీ పంచులు అదిరిపోయాయి. ఇక బ్రహ్మాజీ, రష్మీ కామెడీ పీక్స్ ఈ షోలో. "డ్రై ఫ్రూప్ట్స్ ఎప్పుడు తినాలి" అని బ్రహ్మాజిని అడిగింది రష్మీ. "డ్రై గా ఉన్నప్పుడు తినాలి" అని ఆన్సర్ ఇవ్వడంతో..."కాదు ఎవరూ లేనప్పుడు తినాలి" అని కామెడీగా చెప్పింది రష్మీ.."జింక ముక్కు పక్కకు ఉంటుంది. పొడుగ్గా ఉండే జంతువు పేరేంటి" అని అడిగింది. రైనోసారస్...నీళ్ల ఎలుక" అని ఆన్సర్ ఇచ్చింది. దానికి బ్రహ్మాజీ రష్మీ చేతిని నిమిరాడు. "ఇది చేస్తే నవ్వెక్కడ వస్తది. నా ఆట నేను ఆడుకుంటా" అని చెప్పి స్టేజి మీదకు వెళ్ళిపోయి "ఊ అంటావా మావా" అనే సాంగ్ కి డాన్స్ చేసింది.