Read more!

English | Telugu

ఇంద్రజని "నువ్వు" అని సంబోధించిన ఆది..ఏకిపడేస్తున్న నెటిజన్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కమెడియన్స్ యాక్షన్ మస్త్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే జడ్జి ఇంద్రజ తనదైన స్టయిల్లో చేసే కామెడీ, డాన్స్, యాక్షన్ అన్నీటినీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ లో సీనియర్ నటీమణులంతా వచ్చి పార్టిసిపేట్ చేశారు. రాబోయే వారం షోలో సీనియర్ యాక్టర్ శైలజకి ఆదికి మధ్య తాడు లాగే ఆట పెట్టింది రష్మీ. "శైలజ గారి మీద గెలిస్తే ఆది గారు ఓడిపోయినట్టే" అని ఇంద్రజ చెప్పేసరికి "సరే మీరు రండి...మీ మీద గెలుస్తా" అంటూ కొంచెం ఓవర్ గా డైలాగ్ చెప్పేసరికి "నా మీద గెలిచినాయన చెన్నైలో ఉన్నారు నాకు ఒక్కరు చాలు"


అని ఇంద్రజ సీరియస్ గా కౌంటర్ వేసింది. అలా ఆది అపోజిట్ సైడ్ లో లేడీస్ మీద గెలిచేసరికి "ఇక మీరు చెన్నై వెళ్లి మీ ఆయన మీద గెలవండి" అని ఇంద్రజాకు ఉచిత సలహా ఇచ్చాడు ఆది. లేడీస్ ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ వాళ్ళ మీద చెత్త సెటైర్స్ వేస్తాడు అనే విషయంపై ఆది మీద చాలా రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒక సీనియర్ యాక్టర్ అని లేకుండా ఇలా అవమానించడం కరెక్టేనా అంటున్నారు ఇంద్రజ ఫాన్స్. అంతేకాదు ఈ షోలో నటకుమారి చేసిన ఒక సెగ్మెంట్ కి ఆమెను "ఏమే..నువ్వు మా ఇంట్లోంచి మంచాలు తీసుకొచ్చావ్" అంటూ చెప్పే డైలాగ్ మరీ వినడానికి వరస్ట్ గా ఉంది.  జడ్జి అంటే రెస్పెక్టెడ్ పోసిషన్ కానీ నువ్వు అని సంబోధించడం కరెక్ట్ కాదు. ఆది చాలా ఎక్కువ చేస్తున్నాడు..అంటూ కామెంట్స్ పెట్టారు.