Read more!

English | Telugu

వైరల్ గా మారిన రీతూ చౌదరి ఎమోషనల్ వీడియో!

రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. హీరోయిన్ మెటీరియల్ రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తుంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన  ఫొటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

రీతూ చౌదరి ఎమోషనల్ అవుతూ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. అందులో తనేం చెప్పిందంటే.. రీతు బర్త్ డే మే 4 అంట.. కాబట్టి ఆ రోజున తనకి ఇష్టమైన వస్తువులను ఎవరైనా లేనివారికి ఇద్దామని అనుకుంటుందంట.. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుండి తనకి ఒకటి చెప్పేవాడంట.. నువ్వు అన్ని బట్టలు అలా కొంటూ వదిలేస్తున్నావ్.. కొన్ని వేసుకుంటున్నావ్.. కొన్ని అసలు వేసుకోవట్లేదు.‌. అలా వేస్ట్ చేసే బదులు.. లేని వారికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేవారంట. అందుకని తనకి చాలా ఇష్టమైన బట్టలను తన బర్త్ డే రోజు లేనివారికి ఇద్దామని అనుకుంటుందంట.. ఎవరికైనా కావాలనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయమని రీతూ చెప్పింది.

రీతూ వాళ్ళ నాన్న జ్ఞాపకాలన్నీ తనతో పాటు ఆ గదిలో ఉన్నాయంటూ చూపిస్తూ ఎమోషనల్ అయింది. ప్రతీ పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ ని కలసి తన పుట్టిన రోజుని జరుపుకుంటుందంట రీతూ. అయితే ఈ సారి తన దగ్గర ఉన్న బట్టలని లేనివారికి ఇచ్చి తన నాన్న చెప్పిన మాటను నెరవేర్చాలని చూస్తుందంట. అయితే తను ఈ వీడియోలో వాళ్ళ నాన్నతో బాండింగ్ ఎలా ఉండేదో చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది రీతూ. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష ఆదరణ లభిస్తుంది.