Read more!

English | Telugu

డాన్సర్స్ అంటే చిన్నచూపు... గంట సేపు బేరాలాడతారు

ఢీ షోలో ఫేమస్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆ టీం అంతా చాలా బాధపడుతున్నారు. అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఒక్క మాట చెప్తే మేమంతా చూసుకునేవాళ్ళం కదా అంటూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆట సందీప్ ఒక ఛానల్ లో చైతన్య సూసైడ్ విషయానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు. "చైతన్య చాలా మంచివాడు. స్టేజి మీద ఎంత ఫన్నీగా ఉంటాడో బయట కూడా అలాగే ఉంటాడు. నేను లాస్ట్ మంత్ ఫోన్ చేసి ఒక ఈవెంట్ కి రమ్మని పిలిచాను ఫ్లయిట్ టికెట్ పంపిస్తాను అని కూడా చెప్పాను కానీ మంచి కవర్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందని చెప్పి నా దగ్గరకు రాలేకపోతున్నందుకు బాధపడ్డాడు. ఐతే ఇక్కడ ఫేమ్ సంపాదించుకుంటున్నాం కానీ డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం. వేరే షోస్ లో జబర్దస్త్ లాంటి వాటిల్లో వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు అని బాధపడ్డాడు. ఈ మాటైతే నిజం ఎందుకు అంటే ఈ డాన్సర్స్ కి కానీ, కొరియోగ్రాఫర్స్ కి కానీ ఈరోజుకి కూడా వేల్యూ లేదు. 

ఎక్కడ ఏ ఈవెంట్ జరిగిన ముందుగా వచ్చేది డాన్సర్స్ లాస్ట్ లో వెళ్ళేది డాన్సర్స్ . ఎంత కష్టపడి డాన్స్ చేసినా వాళ్ళను మాత్రం చాలా చిన్నచూపు చూస్తారు. అది చాలా మారాలి. షోస్ లో సాంగ్ పెర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. వీళ్ళేం చేస్తారంటే సాంగ్ మంచిగా రావడం కోసం బ్యాకప్ లో ఎక్కువ మందిని పెట్టుకుంటారు, ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ ఇలా చాలా విషయాల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన  డబ్బులు సరిపోక అప్పులు చేసి మరీ చేస్తూ ఉంటారు. అదే సింగర్స్ విషయం తీసుకుంటే వాళ్ళు ఒక్కరే వచ్చి పాడతారు..బ్యాకప్ ఎవరూ ఉండరు. ప్రొడక్షన్ వాళ్ళు ఈ పాయింట్ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వాళ్లకు కూడా అన్నీ తెలుసు ఇనా  డాన్సర్స్ కి కొంత ఎక్కువ డబ్బులు పే చేయమంటే గంట సేపు బేరాలాడతారు. వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదు రోజులు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రొడక్షన్ వాళ్లేమో పది మందికే పేమెంట్ ఇస్తాం అంటారు. కొరియోగ్రాఫర్ కి ఒక ఇరవై మందిని పెడితే డాన్స్ బాగా వస్తుంది అనే ఐడియా ఉంటుంది. కానీ అక్కడ ఎక్స్ట్రా అమౌంట్  పే చేయరు. ఈ సమస్యకు పరిష్కారం లేదు...కానీ వర్కౌట్ చేస్తే మాత్రం కచ్చితంగా దీన్ని ఇక్కడితో ఆపొచ్చు." అంటూ సందీప్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.