English | Telugu

పవన్ కళ్యాణ్‍ తీన్ మార్ ఆడియో ఎక్కడ...?

పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో ఎక్కడ జరుగుతుంది...? పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "జల్సా" చిత్రానికి కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం ఆడియో ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలిసిందే. ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో కూడా ఆ రేంజ్ కి తగ్గకుండా దేవీ శ్రీ ప్రసాద్ అందించినట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం యోక్క ఆడియోని ఎక్కడ విడుదల చేయబోతున్నారనేది మిలియన్‍ డాలర్ క్వశ్చిన్ గా మిగిలింది.

స్వయం కృషి లో మెగాస్టార్ గెస్ట్

స్వయం కృషి లో మెగాస్టార్ గెస్ట్ గా నటిస్తున్నారు. ఇదేంటి గతంలో కళా తపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో "స్వయంకృషి" అనే సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్, మళ్ళీ "స్వయం కృషి" చిత్రంలో గెస్ట్ గా నటించటమేమిటి...? ఈ అనుమానం మెడ మీద తలకాయ ఉన్నవారెవరికైనా వస్తుంది. అయితే ఈ "స్వయంకృషి" మీరనుకుంటున్నట్లుగా తెలుగు సినిమా కాదు. ఇది కన్నడ భాషలో నిర్మిస్తున్న "స్వయంకృషి". కన్నడ భాషలో శివరాజ్ కుమార్ ( కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు) హీరోగా, వీరేంద్ర బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "స్వయం కృషి" లో మన మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి గెస్ట్ రోల్ లో అంటే అతిథి పాత్రలో నటిస్తున్నారు.