English | Telugu

స్వయం కృషి లో మెగాస్టార్ గెస్ట్

స్వయం కృషి లో మెగాస్టార్ గెస్ట్ గా నటిస్తున్నారు. ఇదేంటి గతంలో కళా తపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో "స్వయంకృషి" అనే సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్, మళ్ళీ "స్వయం కృషి" చిత్రంలో గెస్ట్ గా నటించటమేమిటి...? ఈ అనుమానం మెడ మీద తలకాయ ఉన్నవారెవరికైనా వస్తుంది.

అయితే ఈ "స్వయంకృషి" మీరనుకుంటున్నట్లుగా తెలుగు సినిమా కాదు. ఇది కన్నడ భాషలో నిర్మిస్తున్న "స్వయంకృషి". కన్నడ భాషలో శివరాజ్ కుమార్ ( కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు) హీరోగా, వీరేంద్ర బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "స్వయం కృషి" లో మన మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి గెస్ట్ రోల్ లో అంటే అతిథి పాత్రలో నటిస్తున్నారు.

ఈ కన్నడ చిత్రం "స్వయం కృషి" కన్నడ హీరో శివరాజ్ కుమార్ కి వందవ చిత్రం కావటంతో ఈ చిత్ర నిర్మాత దర్శకుడు అయిన విరేంద్ర బాబు, హీరో శివరాజ్ కుమార్ కలసి మెగాస్టార్ ని కలసి ఈ "స్వయం కృషి" చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించేందుకు అంగీకరించేలా చేసినట్లు సమాచారం. మరి మెగాస్టార్ 150 వ చిత్రం పరిస్థితేంటో ఇంకా తెలియలేదు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.