English | Telugu

రానా దమ్ మారో దమ్ సాంగ్ లాంచ్ వరల్డ్ కప్ లో

రానా దమ్ మారో దమ్ సాంగ్ లాంచ్ వరల్డ్ కప్ లో విడుదల చేయబడుతోంది. అది కూడా వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా రానా హిందీలో నటించిన "దమ్ మారో దమ్" చిత్రంలోని పాటను లాంచ్ చేయబోతున్నారు. ఈ రానా దమ్ మారో దమ్ సాంగ్ " కమాన్ ఇండియా దమ్ మారో దమ్" అంటూ సాగుతుందట. వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా ల మధ్య నాగపుర్ లో మార్చ్ 12 వ తేదీన జరుగుతుంది. ఈ రానా దమ్ మారో దమ్ సాంగ్ లాంచ్ కోసం రానా కూడా అక్కడికి వెళతారని తెలిసింది.

అలాగే రానా బాబాయ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కి కూడా క్రికెట్ అంటే ప్రాణం. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ చూసినట్టుంటుంది, అలాగే అన్న కొడుకు రానా నటించిన "దమ్ మారో దమ్"మూవీలోని సాంగ్ లాంచ్ కి కూడా హాజరయినట్టు ఉంటుందని ఆయన కూడా నాగపూర్ కి వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే నాగార్జున, అఖిల్ కూడా వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా ల మధ్య జరిగే మ్యాచ్ చూడటానికి నాగపూర్ కి వెళ్ళారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.