English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ రేలీజ్ డేట్ వాయిదా

బద్రీనాథ్ రేలీజ్ డేట్ ఎందుకు వాయిదా పడింది...? విషయానికొస్తే అల్లు అర్జున్ , తమన్నా జంటగా నటిస్తుండగా, వినాయక్ దర్శ్జకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం"బద్రీనాథ్". ప్రస్తుతం "బద్రీనాథ్" చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం అల్లు అర్జున్ మ్యారేజ్ సమయానికి అంటే మార్చ్ నెలలో "బద్రీనాథ్" రిలీజవ్వాల్సి ఉంది. కానీ ఈ చిత్రంలోని టెక్నికల్ ఇబ్బందుల కారణంగా (గ్రాఫిక్స్ వంటి పనులు) అల్లు అర్జున్ "బద్రీనాథ్" ఏప్రెల్ నెలలో రిలీజ్ చేస్తారని తెలిసింది. కాని ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవటం వల్ల, ఏప్రెల్ నెలలో రిలీజ్ చేయటం సాధ్యం కాదని.

అల్లు అర్జున్ బద్రీనాథ్ రిలీజ్ డేట్ వాయిదా తెలిసింది. ఇలా అల్లు అర్జున్ బద్రీనాథ్ రేలీజ్ డేట్ వాయిదాపడుతూండటం వల్ల యన్ టి ఆర్ "శక్తి", ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్", పవన్ కళ్యాణ్ "తీన్ మార్" వంటి పెద్ద చిత్రాలు ఈ అల్లు అర్జున్ బద్రీనాథ్ మూవీ కన్నా ముందుగా విడుదల కానున్నాయి. అందుకని ఈ అల్లు అర్జున్ బద్రీనాథ్ రిలీజ్ డేట్ ని "మే" నెలకు వాయిదా వేసినట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.