English | Telugu

దొంగల ముఠా ట్రైలర్ లాంచ్

ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తీసిన "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ లాంచింగ్, మార్చ్ 11 వ తేదీ రాత్రి, హైదరాబాద్ సినీ మ్యాక్స్ లో జరిగింది. ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ చూసిన అందరికీ ఈ ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ చాలా బాగుందనిపించేలా ఆ ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ ఉంది. ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ లాంచింగ్ తో పాటు ఈ "దొంగల ముఠా" చిత్రం మేకింగ్, "దొంగల ముఠా" చిత్రంలోని ఒకే ఒక పాటను"టైటిల్ సాంగ్", "దొంగల ముఠా" చిత్రంలోని కొన్ని సీన్లను ప్రదర్శించారు. అనంతరం "దొంగల ముఠా" చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశం జరిపింది. ఈ పాత్రికేయుల సమావేశంలో "దొంగలముఠా" చిత్ర దర్శకుడు రామ్ గోపాల వర్మ మాట్లాడుతూ ఈ చిత్రానికి కేవలం ఆరున్నర లక్షలు మాత్రమే ఖర్చయిందనీ, అరవై అయిదు వేలు మాత్రమే టెక్నీషియన్లకు, లొకేషన్ల రెంట్‍ కూ ఖర్చయిందనీ అన్నారు. వర్మ"దొంగల ముఠా" చిత్రం తీయటానికి వాడిన "కేనన్ డి 5" కెమెరాలు అయిదు వాడినట్లు చెప్పారు.

అయినా "దొంగల ముఠా" చిత్రం క్వాలిటీ చాలా బాగా వచ్చిందని అన్నారు. మామూలు కెమెరాతో సినిమా తీసేటప్పుడు లైటింగ్ మార్చుకోటానికే సమయం అంతా వృధా అవుతుందనీ, ఈ "కేనన్ డి 5" కెమెరాలతో లైట్లు అటూ ఇటూ మార్చాల్సిన అవసరం లేకుండా సహజమైన లైటింగ్ తో, సహజమైన శబ్దాలతోనే సినిమా తీయొచ్చని నిరూపించటానికే తానీ చిత్రాన్ని తీశానని వర్మ తెలిపారు. ఈ"దొంగల ముఠా" చిత్రం థియేటర్లలో కేవలం ఒక్క షో ఆడినా తాను విజయంసాధించినట్లేననీ, తన నిర్మాతకు లాభాలొస్తాయనీ వర్మ అన్నారు. ఈ చిత్రంలోని` టైటిల్ సాంగ్ ని "మిరపకాయ్" చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ షూట్ చేయటం విశేషం. ఈ సమావేశంలో హీరో రవితేజ, సుబ్బరాజు, హరీష్ శంకర్, ఆర్ పి పట్నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని మార్చ్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .