English | Telugu

యన్ టి ఆర్ పెళ్ళికి ప్లానింగ్

యన్ టి ఆర్ పెళ్ళికి ప్లానింగ్ చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా చేసుకుంటున్నాడు. యన్ టి ఆర్ తన పెళ్ళి ఎలా జరగాలో, ఎలా జరగాలో, పెళ్ళికి ఎవరెవరిని ఏ విధంగా పిలవాలో, పెళ్ళిలో ఎలాంటి వంటకాలు వడ్డించాలో ఇలా ప్రతీ విషయాన్ని యన్ టి ఆర్ తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడట. అలాగే యన్ టి ఆర్ తన పెళ్ళి వల్ల తను హీరోగా నటించే సినిమాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూనే తన హనీమూన్ ని కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ నటిస్తున్న మూవీ షూటింగ్ లో ఏప్రెల్ నెలాఖరు వరకూ పాల్గొని, పదిహేను రోజుల గ్యాప్ తీసుకుంటున్నారు.

అనంతరం బోయపాటి దర్శకత్వంలోని "గర్జన" చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు యన్ టి ఆర్. తర్వాత మే నెలలో పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకోవటానికి కేటాయించారు యన్ టి ఆర్. సాటి యువ హీరో బన్నీ మ్యరేజ్ ఘనంగా జరిగిన నేపథ్యంలో యన్ టి ఆర్ తన పెళ్ళి కూడా అంతకంటే ఇంకా ఘనంగా జరగేలా ఏర్పాట్లు చేసుకుండటున్నాడని సమాచారం. యన్ టి ఆర్ పెళ్ళి తన ఏర్పాట్లను ఒక నెల రోజుల ముందునుంచే మొదలు పెట్టినట్లు సమాచారం.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.