మచిలీ పట్నం ఎంపీ బాలశౌరి వైసిపికి గుడ్ బై ?
posted on Jan 12, 2024 @ 4:42PM
కృష్ణా జిల్లాలో ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసుపార్థసారథి టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో అదే జిల్లాలో వైసీపీ బీటలు వారుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి టికెట్ లేదనే ఖరారు కావడంతో ఆయన వైసీపీని దాదాపు వీడతారని ప్రచారం జరుగుతుంది. జనసేనలో చేరవచ్చని వార్తలు అందుతున్నాయి. ఎమ్మెల్యే పేర్నినానితో విభేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పేర్ని నానితో బాటు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు మరో మారు జగన్ దృష్టికి బాలశౌరి గూర్చి ఫిర్యాదు చేశారు. జగన్ అసంతృప్తి నేతలను సముదాయిస్తున్నప్పటికీ బాలశౌరిని వదులుకోవడం వైసీపీ అధినేతను వదులుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలశౌరి వైసీపీని వీడటం పెద్ద నష్టంమనే చెప్పాలి. దాదాపు రెండు సంవత్సరాల నుంచి వైసీపీ అధిష్టానికి జిల్లా నేతలు బాలశౌరికి టికెట్ ఇవ్వొద్దని వత్తిడి తెస్తున్నారు. జగన్ ఫోటో లేకుండానే బందరులో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి బాలశౌరి వైసీపీకి స్వస్థి పలికినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.