చైనా యుద్ధ తంత్రాలతో ప్రపంచం దిగ్భ్రాంతి
భవిష్యత్ యుద్ధ తంత్రాలంతా ఆటోమేటెడ్ అలాగే డిజిటల్‌గా మారుతున్నాయనడానికి చైనా మిలటరీ పరేడ్ నిదర్శనం. ఒకప్పుడు లక్షల సంఖ్యలో సైనికులు అవసరం. కానీ ఇప్పుడు సైనికులు తక్కువున్నా టెక్నాలజీతో దెబ్బకొట్టే మిలటరీ ఎక్విప్ మెంట్ అవసరం. ఈ పెరేడ్ తో చైనా తన లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించడం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందంటున్నారు.
గతంలో చైనీస్ వెపన్స్ అమెరికన్ లేదంటే రష్యన్ టెక్నాలజీ కాపీ ఆధారంగా ఉండేవి. కానీ ఇప్పుడు చైనా దేశీయంగా కెపాసిటీలను పెంచుకుంది. అయితే ఈ కొత్త ఆయుధాలు యుద్ధాల్లో ప్రూవ్ కాలేదు. ఎందుకంటే చైనా ఆధునిక యుగంలో ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఈ ఆయుధాలు ఎలా పని చేస్తాయో ఎవరికీ తెలియదు. పైగా అమెరికన్ ఎక్స్ పర్ట్స్ ఇవన్నీ పేపర్ వెపన్సే అంటున్నారు.
తమ బీ 2 బాంబర్ ఒక్కటి చాలు అంటున్నారు. జిన్‌పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపై కలిసి కనిపించడం ఈ మూడు దేశాల మధ్య బలమైన రాజకీయ కూటమిగా మారింది. ఇది పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఒక హెచ్చరికగా మారింది. ఎందుకంటే తైవాన్ స్ట్రెయిట్, అలాగే సౌత్ చైనా సీ లో అమెరికాకు చెక్ పెట్టే కెపాసిటీతో ున్నాయి. గతంలో జపాన్ చేసిన దురాక్రమణలపై జిన్ పింగ్ మాట్లాడడం కూడా ఆసియా పసిఫిక్ లో ఫ్యూచర్ లో ఉద్రిక్తతలు పెంచడానికి దారి తీయొచ్చు. ఈ పరేడ్ తో చైనా తన ఆయుధాలను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది.
మయన్మార్ వంటి దేశాలు ఇప్పటికే చైనా నుంచి ఆయుధాలను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా దగ్గరికి వద్దాం. చైనా మిలటరీ పరేడ్ ను చూసిన ట్రంప్ కామెంట్ చేయకుండా ఊరుకుంటారా? చైనా, రష్యా, నార్త్ కొరియా కలిసి USకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కుట్రలు చేస్తే ట్రంప్ భయపడుతారా? అది తెలియాలంటే.. అమెరికా, చైనా ఆయుధ సంపత్తి ఏంటో తెలుసుకోవాలి. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో అమెరికా, చైనా దగ్గర ఎంత ఆయుధ బలగం ఉందో చెప్పింది. చైనా దగ్గర 20 లక్షల 18 వేల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు.
అలాగే 10 లక్షల 15 వేల మంది రిజర్వ్ సైనికులున్నారు. అటు అమెరికా దగ్గర 10 లక్షల 39 వేల యాక్టివ్ ఆర్మీ, 8,45,000 రిజర్వ్ సైనికులు ఉన్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ విషయం చూస్తే.. చైనా దగ్గర 3,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఇందులో 1,200 ఫైటర్ జెట్‌లు, 400 బాంబర్‌లు, 400 డ్రోన్‌లు ఉండగా, అమెరికా దగ్గర 13,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. అందులో 1,800 ఫైటర్ జెట్‌లు, 600 బాంబర్‌లు 2 వేల డ్రోన్‌లతో ఆధిపత్యంతో ఉంది. ఇక నేవల్ కెపాసిటీ చూస్తే చైనా దగ్గర 370 వార్ షిప్స్ ఉన్నాయి. ఇందులో 3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 50 డిస్ట్రాయర్‌లు, 70 సబ్‌మెరైన్‌లతో చైనా ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళంగా ఉంది.
అటు అమెరికా దగ్గర 290 నేవీ వార్ షిప్స్ ఉన్నాయి. ఇందులో 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 70 సబ్‌మెరైన్‌లు, 90 డిస్ట్రాయర్‌లున్నాయి. కీలకమైన అణ్వాయుధాల విషయంలో చైనా దగ్గర 600 వార్‌హెడ్‌లు ఉన్నాయి. 2035 నాటికి 1,500కి విస్తరణ టార్గెట్ గా పెట్టుకున్నారు. అమెరికా దగ్గర 5,044 వార్‌హెడ్‌లు ఉన్నాయి. అయితే USతో పోలిస్తే చైనా దగ్గర అణ్వాయుధాలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా దగ్గర ఉన్న వాటికంటే పవర్ ఫుల్. చైనా క్షిపణుల్లో DF-41, DF-31, JL-3 వంటి ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, YJ సిరీస్ హైపర్‌సోనిక్ క్షిపణులున్నాయి. అమెరికా దగ్గర AGM-183A ARRW, HAWC హైపర్‌సోనిక్ మిసైల్స్, టామ్‌హాక్ క్రూయిజ్ క్షిపణులున్నాయి. ఇక సైబర్ స్పేస్ విషయంలో చైనా దగ్గర HQ-29 స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది.
అదే సమయంలో అమెరికాకు US సైబర్ కమాండ్ స్పేస్ ఫోర్స్, యాంటీ-శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. రోబోటిక్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ లో చైనాకు రోబోట్ వోల్వ్స్ ఉన్నాయి. GJ-11 డ్రోన్‌లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో సత్తా పెంచుకుంటుండగా.. అమెరికా దగ్గర MQ-9 రీపర్, RQ-4 గ్లోబల్ హాక్, XQ-58A డ్రోన్‌లు ఉన్నాయి. సో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. అయితే అమెరికా చైనా డిఫెన్స్ ఎక్విప్ మెంట్స్, వార్ స్ట్రాటజీల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అమెరికన్ ఫైటర్ జెట్‌లు F-22, F-35 లాంటివి యుద్ధాల్లో పరీక్షించారు. సాంకేతికంగా అడ్వాన్స్డ్. అయితే చైనా J-20, రోబోట్ డాగ్స్ కొత్త ఆవిష్కరణలు. వీటిని యుద్ధాల్లో పరీక్షించలేదు.
చైనా హైపర్‌సోనిక్ క్షిపణుల్లో ముందంజలో ఉంది. అయితే అమెరికా వేగంగా ఆ గ్యాప్‌ను తగ్గించుకుంటోంది. అటు అమెరికా 750కి పైగా విదేశీ సైనిక స్థావరాలను కలిగి ఉంది. ఇది అమెరికాకు యుద్ధాల విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. చైనాకు కేవలం 3-4 విదేశీ స్థావరాలే ఉన్నాయి. అంటే ఏ యుద్ధం చేసినా చైనా నుంచే చేయాలి. 2024 చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ ప్రకారం, చైనా సైనిక శక్తి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా నేవీ, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో అమెరికాను మించిపోయింది. అందుకే ట్రంప్ జాగ్రత్త పడుతున్నారు. చైనాకు రష్యా, నార్త్ కొరియా తోడైతే తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంలో అమెరికా ఉంది. అందుకే ఈ ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.