హైదరాబాద్ మహిళా పోలీసుల్లో అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ
posted on Sep 5, 2025 @ 9:26PM
హైదరాబాద్ నగర పోలీసులు ఈరోజు ఒక చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిపి సి.వి. ఆనంద్ మహిళా హార్స్ రైడర్స్‌ను ప్రవేశపెట్టారు. పదిమంది సాయుధ రిజర్వ్ మహిళా కానిస్టే బుళ్లు రెండు నెలల పాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో శిక్షణ పొంది, ఇప్పుడు గుర్రపు పోలీసు దళంలో భాగమయ్యారు. దేశంలోనే ఇదొక కీలకమైన నిర్ణయం అని హైదరాబాద్ కమిషనర్ తెలిపారు. ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, విఐపిల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగించనున్నారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకు న్నామని, మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో మొదటిసారి గా పాల్గొనబోతు న్నారని హైదరాబాద్ సిపి పేర్కొన్నారు.హైదరాబాద్ నగర పోలీసులు తమ డాగ్ స్క్వాడ్‌ను కూడా విస్తరిస్తు న్నారు. కిస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో శునకాలు ఎంత గానో సహాయప డుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 34 శునకాల తో పనిభారం ఎక్కువగా ఉన్నం దున, ఆ సంఖ్యను 54కు పెంచాలని నిర్ణయించుకున్నారు. అదనపు శునకాలను ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో విస్తృత శిక్షణ పొందిన తర్వాత బృందంలో చేర్చుకుంటామని సిపి అన్నారు.
ఇంకా బాంబులు, మాదక ద్రవ్యాలు, మరియు నేరస్తుల గుర్తింపు వంటి వాటిలో వీటిని వినియోగిస్తాము.శునకాల నాణ్యత ను మెరుగుపరచడా నికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుండి నాణ్యమైన శునకా లను ఎంపిక చేస్తోంది. మొదటి దశలో 12 శునకా లను సేకరించారు. భవిష్యత్తులో మరికొన్నిటిని తీసుకుంటామని సిపి తెలిపారు. ప్రస్తుతం నూతన ఉస్మా నియా జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన ఇటీవలి పరిణా మాల నేపథ్యంలో, గోషామహల్ పోలీస్ స్టేడియం ఆవరణ లోని గుర్రపు మైదానం మరియు అశ్విశాల వంటివా టిని కొత్త ప్రదేశానికి మార్చుతున్నారు.
ఈ కొత్త మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కోసం కొత్త భవ నాలు, స్వాధీనం చేసుకున్న వాహ నాల నిలుపుదల ప్రదేశాలు, కొత్త గుర్రపు శాలలు, మరియు పెరేడ్ గ్రౌండ్ వంటివి ఉంటాయని సి.వి ఆనంద్ తెలిపారు.11.5 ఎకరాల విస్తీర్ణంలో 60 శునకాల కోసం డాగ్ కెనాల్స్ మరియు మౌంటెడ్ యూనిట్ ను నిర్మిస్తాము. ఈ ప్రాజెక్టుకు సంబం ధించిన టెండర్లు సెప్టెంబర్ 8న పూర్తవుతాయని సిటీ కమిషనర్ తెలిపారు.
రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ తెలిపారు.సుమారు 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుందని, ట్యాంక్ బండ్ వద్ద మాత్రమే 50 వేల విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా ముందస్తు జాగ్రత్తగా అన్నిచోట్ల పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశాము. మొత్తం 29 వేల మంది పోలీసులు షిఫ్టుల లో విధులు నిర్వర్తి స్తారు. నిమజ్జన మార్గాలను పర్యవేక్షించడానికి సిసి కెమెరాలతో పాటుగా అదనంగా 250 సిసి కెమెరాలు మరియు 6 డ్రోన్ లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు.
గత సంవత్సరాల్లో డీజేల కారణంగా చాలా మంది యువకులు మరణించారని, వారి ఆరోగ్యం దెబ్బతింటుందని కమిషనర్ పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరం డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తిలో మతం కాకుండా ప్రజల ఆరోగ్యం ప్రధానమని, ఈ విషయంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా పోలీసులకు సహకరిస్తోందని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.