ధూల్ పేట్ లఖన్ సింగ్‌పై పీడీ యాక్ట్
posted on Sep 5, 2025 @ 9:17PM
ధూల్ పేట్ ను అడ్డగా మార్చుకుని గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న లేడీ డాన్ పై పీడియాక్ట్ నమోదుచేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే దూల్పేట్ లో గంజాయి వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాది స్తున్న మరో వ్యాపా రిపై కలెక్టర్ పీడి యాక్ట్ నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు...గంజాయి హోల్ సెల్ వ్యాపా రిగా ఎదిగిన ఓ వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో,ఎక్సైజ్ స్టేషన్లో 30కి పైగా కేసులు నమోద య్యాయి..పోలీసులు ఒక మారు, ఎక్సైజ్ రెండో మారు లకాన్ సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.. అయినా కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ తిరిగి గంజాయి దందా కొనసాగిస్తూనే ఉన్నాడు..
దూల్పేట్ లో నివాసం ఉంటున్న లఖన్ సింగ్ ఒరిస్సా లోని గంజాయి సాగు, అమ్మకం బడా వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. అంతే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదిం చాలని ఆలోచించిన లఖన్ సింగ్ ఒరిస్సా నుంచి నేరుగా 25 కిలోల నుంచి 100 కేజీల వరకు గంజా యిని పోలీసుల కంట పడకుండా ధూల్పేటకు తెప్పించి స్థానిక వ్యాపారులకు అమ్మకాలు జరుపుతూ...హాయిగా గంజాయి దందా కొనసాగిస్తున్నాడు.
ఎనిమిది నెలల్లోనే లఖాన్ సింగ్ మూడుమార్లు 25 కేజీల, 27,26 కేజీల గంజాయిలతో ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి బృందానికి పట్టుపడ్డాడు. అంతే కాదు ఇతనిపై మంగళ హార్ట్, దూల్పేట్, నారాయణగూడ తో పాటు మరో స్టేషన్లో పదికి పైగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టు కున్న కేసులు నమోదయ్యాయి. దూల్పేట్ లో గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై కూడా పీడీ యాక్ట్ పెట్టడంతో నిందితు రాలు జైల్లో ఉన్నారు.
ఇప్పుడు తాజాగా లఖాన్ సింగ్ పై కూడా హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడియాట్ ఇంపోస్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం పిడి యాక్ట్ పెట్టాలని చేసిన సిఫార్సు మేరకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఇచ్చినటు వంటి పీడీ యాక్ట్ ఉత్తర్వులను దూల్పేట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మధుబాబు లఖాన్ సింగ్ కు యాక్ట్ నోటీసులను అందించారు.