విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే !

  ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో విశాఖలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఋషికొండ ఐటీ హిల్ లోని మిలీనియం టవర్స్ లో ఈ సంస్థ కార్యకలాపాలకు అనువుగా భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ మిలీనియం టవర్ లోని 16 17 బ్లాక్ లకు తీసేసి కంపెనీ పేరుతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తొలిదశలో రెండు షిఫ్ట్ లలో 2000 మంది ఉద్యోగులతో కార్యకర్తల అప్పాలు ప్రారంభించనున్నారు. ఈ సంఖ్యను క్రమంగా 6000కు పైగా పెంచే అవకాశాలు ఉన్నాయి.  అందుకు తగ్గ భవనాలను మిలీనియం టవర్స్ లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఒప్పందం చేసుకున్న ఐటీ కంపెనీ ఇదే . తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తూనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు టిసిఎస్ ప్రయత్నిస్తుంది. 1370 కోట్ల పెట్టుబడితో 12000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక దిశగా ఐటి హిల్ 3 పై 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది.  

కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది : సీఎం చంద్రబాబు

  2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసగించారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయిని కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని సీఎం తెలిపారు. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు.. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారని చంద్రబాబు తెలిపారు.  కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైందని ఆయన తెలిపారు. 738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామని దీంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారిందని సీఎం తెలిపారు. అందుకే శతాబ్దాలు గడిచినా... కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది.. అప్పుడే చాలా బాధపడ్డాను.. ఈ పరిస్థితి మార్చాలనుకున్నాని ఆయన తెలిపారు. 1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను. శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చామని తెలిపారు. కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించాని సీఎం తెలిపారు. రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను... రతనాల సీమ చేస్తానమని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టితే..గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు  

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని కేబినేట్ నిర్ణయం

  రాష్ట్రంలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని  తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్ మార్చనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో  42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు శాసన సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేసే అవకాశముంది. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపైనా కీలక చర్చ జరిగే అవకాశముంది. 

కరెన్సీ నోట్లతో గణనాథుడికి అలంకరణ

గణపతి నవరాత్రి ఉత్సావాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి పందిళ్లను నిర్వాహకులు వినూత్న రీతిలో అలంకరణలు చేస్తున్నారు. అయితే మంగళగిరిలో కొలువైన గణపతిని అలంకరించే విషయంలో నిర్వాహకులు మరింత వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా గణనాథుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం ఏకంగా 2 కోట్ల 35 లక్షల రూపాయల కరెన్సీని ఉపయోగించారు.  గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులో వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారిని రూ.2.35 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు  పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

ఏపీని వదలంటున్న వానలు.. వచ్చే నెలలో రెండు అల్పపీడనాలు!

ఆంధ్రప్రదేశ్ ను వానలు వదలనంటున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్న ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నెలలో మరో రెండు అప్పపీడనాల కారణంగా మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   దశలో సెప్టెంబర్ నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా  వేస్తోంది. సెప్టెంబర్ మూడో తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్యదిశ గా పయనించి సెప్టెంబర్ ఐదు నాటికి వాయుగుండం గా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.  వీటి కారణంగా సెప్టెంబర్ మొదటి రెండు వారాలూ ఏపీకి , మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

శివలింగాకృతిలో రెండు టన్నుల లడ్డూ!

గణపతి నవరాత్రులు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. గణేష్ మండప నిర్వాహకులు వినూత్నంగా ఆలోచనలు చేసి వివిధ రూపాలలో గణనాథులను ప్రతిష్టించి సృజనను చాటుకుంటున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ స్వీట్ షాప్ నిర్వాహకుడు గణపతికి సమర్పించే లడ్డూ విషయంలో కూడా కొత్తగా ఆలోచించారు. శివలింగాకృతిలో రెండు టన్నుల భారీ లడ్డూను రూపొందించారు.   విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్స్ లో అక్కడి నిర్వాహకులు లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహా గణపతికి నైవేద్యంగా ఈ లడ్డూను సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్  తెలిపారు.  15 మంది సిబ్బంది నాలుగు రోజుల పాటు శ్రమించి, 8 అడుగుల ఎత్తు, 2 వేల కిలోల బరువు   లడ్డూని శివలింగం ఆకృతిలో తయారు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఇది అత్యంత భారీ లడ్డూ అని చెప్పిన ఆయన.. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించే అవకాశం ఉందన్నారు.  ఈ భారీ లడ్డూను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి  భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం (ఆగస్టు 29) రాత్రి దీనిని గాజువాకకు తరలించారు.  

ప్రియుడి కోసం భర్తను అంతమొందించిన భార్య

  తన భర్త నిద్రలో చనిపోయాడంటూ ఓ భార్య 100 డయల్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్య చేకితులయ్యారు.  అనుమానాస్పద మృతి కేసునమోదు చేసుకొని విచారించగా పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలడంతో.. పోలీసులు ఎంక్వ యిరీ చేయడం మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి... దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... జెల్లెల్ల శేఖర్ (40), చిట్టి (33) దంపతులు వీరు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ రోడ్ నెంబర్ సెవెన్‌లో  నివాసం ఉంటున్నాడు. శేఖర్ డ్రైవర్‌గా  పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడ ప్పుడు రెండు మూడు రోజులు లేదంటే వారం రోజులు బయటికి వెళ్తూ ఉంటాడు. అయితే డ్రైవింగ్ వృత్తిపై భర్త బయటికి వెళ్లిన సమయంలో చిట్టి కి హరీష్‌తో పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే భార్య ప్రవర్తన పై అనుమానం కలిగి భర్త శేఖర్ పలుమార్లు తన భార్య చిట్టిని హెచ్చరించాడు.  కానీ చిట్టి ప్రవర్తన లో మార్పు రాలేదు ప్రియుడిని విడిచి ఉండలేక పోయింది. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ఫ్లాన్ వేసింది. పథకం ప్రకారమే చిట్టి తన ప్రియుడు హరీష్ తో కలిసి నిద్రపోతున్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్రలో చనిపో యాడంటూ లబో దిబో మొత్తు కుంటూ 100 కి ఫోన్ చేసింది... తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా చిట్టి ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వినాయక నిమజ్జనం ఊరేగింపులో పేలుడు

  నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న వినాయక విగ్రహంతో పాటు టపాసులు ఒక్కసారిగా పేలడంతో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అప్పసముద్ర గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఈ ఊరేగింపులో ఒక ట్రాక్టర్‌లో వినాయక విగ్రహాన్ని, మరో ట్రాక్టర్‌లో బాణాసంచాను ఉంచి తీసుకువెళ్తున్నారు.  ఊరేగింపులో జరుపుతున్న బాణాసంచా ట్రాక్టర్‌లో ఉన్న టపాసులపై పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పదిమంది చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి ఆర్తనాదాలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన చిన్నారులను వింజమూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స జరుగుతోంది. ఈ ఘటనతో గ్రామంలోని బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యా సంస్థల్లో ఫేషియల్ రెకగ్నిషన్ తప్పనిసరి : సీఎం రేవంత్‌

  స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ,బోధన సిబ్బందికి ఫేషియల్ రెకగ్నిషన్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలని ఆ విషయం నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. ప్ర‌తి విద్యాసంస్థ‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్దతిలో పీఈడీలను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు.  బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని విద్యా అధికారులకు సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, టాయిలెట్ గదులు, ప్రహరీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని మఖ్యమంత్రి తెలిపారు. కంటైన‌ర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు.  అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు .మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి తేవడం ద్వారా నాణ్య‌తా‌ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నం తేలికవుతుందని అధికారులకు సూచించారు.  

డ్రగ్స్ దందాలో కొత్తరకం మాఫియా

  పుష్ప సినిమా ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే... అదే తరహాలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు కూడా సంచలనం సృష్టి స్తున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. ఓ మాఫియా కొత్తరకం డ్రగ్స్ దందాకు తెరలేపారు. ఈ ముఠాలు పుష్ప సినిమాను మించి.. కొత్త కొత్త తరహాలో  డ్రగ్స్ సరఫరా చేస్తు న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికా రులు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ ఉంటే... మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలు రకరకాల వస్తువుల మాటున వివిధ రకాల డ్రగ్స్ లను ఏదేచ్ఛగా సరఫరా చేస్తున్నారు  ప్రముఖ యూనివర్సిటీ లో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఈగల్ టీమ్ గుర్తించి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో కీలక పాత్ర వహించిన ముగ్గురు విద్యార్థు లను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ యూని వర్సిటీ డ్రగ్స్ కేసులో సంచలమైన విష యాలు బయట పడ్డాయి. ఈ విద్యార్థులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతుం దని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిం చగా... కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్న ట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 10 కొరియర్ సంస్థల నుంచి 100 కోట్ల రూపాయల డ్రగ్స్ తరలించినట్లుగా అధికారులు గుర్తించారు.  ఈ డ్రగ్స్ ముఠాలు నగర శివారు ప్రాంతాల్లో  ఉన్న మెడికల్ కాలేజీలు మరియు ఇంజ నీరింగ్ కాలేజీల విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ విక్రయాలు జరుపు తున్నారు అయితే ఈ డ్రగ్స్ ముఠాలు పుష్ప సినిమా తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్, ఆయుర్వేద ఉత్పత్తులు ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలు మొత్తం 36 రకాల వస్తువుల తినుబండారాల మాటున డ్రగ్స్ ని హైదరాబాదు నగరానికి పంపిస్తున్నారు. కొరియర్ సర్వీసులలో డ్రగ్స్ తో కూడిన వస్తువులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు పుస్తకాల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  ఈ ముఠాలు ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా యూనివర్సిటీ హాస్టల్ లోపలికి మారుతి కొరియర్స్ ద్వారా ఓజీ డ్రగ్స్ పుస్తకాల మధ్యలో పెట్టి పంపిస్తు న్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు కాస్మెటిక్ డబ్బాలో డ్రాప్స్ పెట్టి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా మల్నాడు డ్రగ్స్ నిందితులకు ఫుడ్ ఆర్టికల్స్ రూపంలో డ్రస్ సరఫరా చేశారు.. అంతేకాకుండా పలువురు వ్యాపారవేత్తలకి ఫుడ్ ఆర్టికల్స్ మధ్యలో డ్రగ్స్ పెట్టి పంపిస్తున్నారు. మరికొందరికి మట్టి గాజుల మాటున ఎఫిడ్రిన్ పొట్లాలను కొరియర్ ద్వారా డ్రగ్స్ తరలిస్తు న్నారు. కొరియర్ సంస్థలు కమిషన్కు కక్కుర్తి పడి డ్రగ్స్ ముఠాలకు సహక రిస్తున్నట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు..

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నిట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఆయన హతమార్చేందుకు కొందరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడని జగదీశ్ అని సమాచారం.  ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ శ్రీకాంత్ విచారణ జరుపుతుమన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి చర్చిస్తున్న రౌడీషీర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో అంశం తన దృష్టిలో ఉందని ఎస్పీ.  విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నని ఎస్పీ తెలిపారు

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని సుప్రీంలో పిటిషన్

  లంబాడీలను, బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు పిటిషన్ వేశారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని, వేరే రాష్ట్రల నుండి వచ్చి గిరిజనుల హక్కులను కొల్లగొడుతున్నారని  ఎమ్మెల్యే తెల్లం  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మిగిలిన ఎస్టీ కులాలతో పోలిస్తే  మెరుగైన స్థానంలో ఉన్నారని ఆ పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అలాంటి వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిన కోయ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి విచారణ జరిపే అవకాశం ఉంది.

డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భారత్‌కు టెక్నాలజీ హబ్‌గా వైజాగ్ నగరం ఎదుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటకులు విశాఖను పర్యావరణరహితంగా మార్చాలి తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం కోరారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.  వైజాగ్‌లో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా ఈ నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా వైజాగ్ ఎంపికైందని గుర్తు చేశారు. ఈ విశాఖ నగరం.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని వివరించారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని.. ఇది మనమంతా గర్వపడే అంశమని సీఎం తెలిపారు. హాప్ ఆన్ హాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కి.మీ మేర పరుగులు పెట్టనున్నాయి. రూ. 250తో రోజాంతా ప్రయాణించవచ్చు.

మూసీ వరద.. జంటనగరాల్లో పలు చోట్ల రాకపోకలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు పైకెత్తి 4100 క్యూసెక్కుల నీటినీ, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 23వందలక్యూసెక్కుల నీటిని మూసిలోకి వదలడంతో మూసీనది మహోగ్రరూపం దాల్చింది.  దీంతో  బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద ధాికి  బ్రిడ్జ్ పిల్లర్లు  డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జిని మూసివేయడంతో అంబర్ పేట, దిల్ షుక్ నగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.  

తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు.. మరో ఆరు రోజులు వానలే వానలు

ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వదలడం లేదు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మరో ఆరు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఆంధ్రప్రదేశ్ లోని ఆరు జిల్లాలు, ఉత్తర తెలంగాణలకు వర్షం ముప్పు అధికంగా ఉందని పేర్కొంది.  ఏపీలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇలా ఉండగా ఏపీలోని ఆరు ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ  కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 

కొనసాగుతున్న లేడీ డాన్ అరుణ విచారణ

  లేడీ డాన్ నిడిగుంట అరుణను ఒంగోలు జైలు వద్ద కోర్ట్ అనుమతులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఒంగోలు జైలు నుండి  కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అరుణను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు  విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం సాయంత్రం అరుణను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తారు.  ఈ విచారణ లోనే అరుణ నుండి మరిన్ని విషయాలు రాబట్టడం తో పాటు ఆమె ఫోన్ లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీంతో అరుణ ఫోన్‌లో  ఎలాంటి సమాచారం ఉంది. ఆ సమాచారం బయట వస్తె ఎలాంటి  రహస్యాలు బయటకు వస్తాయి. అనేది తీవ్ర ఉత్కంఠ  నెలకొంది. ఇదే సమయంలో లేడీ డాన్ అరుణ తో సన్నిహితంగా వున్న అనేక మంది పెద్దలు గుండెల్లో గుబులు మొదలైంది. రాబోయే మూడు రోజులు కొందరికి అగ్నిపరీక్ష కానుంది

రిషికొండ ప్యాలెస్‌‌లో ఊడిన పెచ్చులు..పరిశీలించిన డిప్యూటీ సీఎం

  విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్యాలెస్‌‌లో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో ఫాల్స్ సీలింగ్ షీట్లు విరిగిపడినాయి. పైకప్పు లోపాలతో లోపలికి వర్షం నీరు వచ్చింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  విశాఖపట్నం పర్యటనలో ఉన్నడిప్యూటీ సీఎం ... మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కల్యాణ్‌కు వివరించారు.  గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ నూతన భవనాల నిర్వహణకే దాదాపు కోటి రూపాయల బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోందని అధికారులు పవన్‌కు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది" అని వ్యాఖ్యానించారు.  రుషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను  పవన్ ఆదేశించారు.

ఏపీకి బుల్లెట్ ట్రైన్ : సీఎం చంద్రబాబు

  అమరావతి మీదగా ఆంధ్రప్రదేశ్‌‌కి బుల్లెట్ రైలు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి గంటకు ఫ్లైట్ ఉండేలా ఎయిర్ ఫోర్టులు తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాదిని కలిపే మార్గాలన్నీ  ఏపీ నుంచే వెళ్తుంటాయి. అమరావతి- చెన్త్నె- బెంగళూరు నగరాల మధ్య బుల్లె రైళ్లు రానున్నాయి సీఎం తెలిపారు.ఇందుకోసం హైదరాబాద్ – చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి  మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్‌డీఏ గుండా వెళ్తుంది.