ఫిలింనగర్ భూ వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు

  జూబ్లీహిల్స్ లోని దక్కన్ కిచెన్ వ్యవహారం ఎటు తేలడం  లేదు.. దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన ఈ కిచెన్ వ్యవహారం పైన కోర్టులో సుదీర్ఘంగా నడుస్తుంది.. దక్కన్ కిచెన్ లోకి అక్రమంగా చొరబడి తమని మోసం చేశారని చెప్పి నందకుమార్ పైన హీరో వెంకటేష్ ,సురేష్ బాబులు పిర్యాదు చేశారు.. సురేష్ బాబు స్థలంలోకి ఉన్న దక్కన్ కిచెన్ ని అధికారులు కూల్చివేసి నందకుమార్‌ను పంపించివేసి స్థలాన్ని దగ్గుబాటి కుటుంబానికి అప్పగించారు.  దక్కన్ కిచెన్ వ్యవహారంలో తాను తీవ్ర స్థాయి లో నష్టపోయానని, తనకు అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండా నిర్మాణాలను కూల్చి వేసి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారని హీరో వెంకటేష్ , సురేష్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు.. గతంలో దక్కన్ హోటల్ కూల్చి వేసిన విషయం తెలిసిందే... అయితే నందకుమార్ దక్కన్ హోటల్ నడుపుతున్నాడు.  నందకుమార్ ను   ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు ..కానీ నందకుమార్ కోర్టును ఆశ్రయిం చాడు. అయితే అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా సురేష్ బాబు కొంతమంది అధికారులతో కలిసి దక్కన్ హోటల్ కూల్చివేశారు.  దీంతో నందకుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెరకు కోర్టులో విచారణ కొనసా గుతున్నది.. అయితే నందకు మార్ గత 18 నెలలుగా తాను కోర్టులో పోరాడు తున్నానని, తన హోటల్ ను అన్యా యంగా కూల్చివేశారని... నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేను అప్రూవర్గ మారినందుకే నా మీద 12 అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు... కోర్టు ఎన్ని మార్లు చెప్పినా కూడా సురేష్ బాబు, వెంకటేష్  కోర్టు కు హాజరు కావడం లేదు. అంతేకాకుండా సురేష్ బాబు అతని కుటుంబ సభ్యులు కోర్టు విచారణకు రాకుండా కేసును విత్‌డ్రా చేసుకోక పోతే నన్ను చంపే స్తానని బెదిరింపు లకు గురి చేస్తున్నా రని నందకుమార్ వాపోయాడు. ఇప్పటికే కోర్టు సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ లను కోర్టు కు రావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది ..అప్పుడు హీరో వెంకటేష్ తో పాటు సురేష్ బాబులు రాని పక్షంలో చర్యలకు ఆదేశాలు ఇస్తామని కోర్టు హెచ్చరించింది.

నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆడియో వైరల్‌

  నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్  అతడి అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. లేడీ డాన్ అరుణ తనను చంపాలని  స్కెచ్ వేస్తుందని జగదీష్  చెప్పగానే  జగదీష్ పై శ్రీకాంత్ మండిపడ్డారు. అంతా నువ్వే చేశావ్ అంటూ జగదీష్‌ను   శ్రీకాంత్ తిట్ల దండకం అందుకున్నారు. అరుణ  ఎక్కడ.. ఎక్కడ డబ్బులు వసూలు చేసిన విషయాలు జగదీష్  వెల్లడించారు. మీ గ్యాంగ్‌లో  నుంచి  పక్కకు వస్తే చంపేస్తారా అని శ్రీకాంత్‌ను ఆయన ప్రశ్నించారు.   ఖైదీలు జైలు నుంచి ఫోన్ లు ఏలా  మాట్లాడ గలుగుతున్నారు. రౌడీ షీటర్‌ల  వెనుక ఎవరి హస్తం ఉందని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవిత శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ అలివేలి శ్రీకాంత్...మరో రౌడీ షీటర్ జగదీష్ లో మద్య ఫోన్లో వాగ్వివాదం జరిగింది.నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న ఒక రౌడీ షీటర్‌ శ్రీకాంత్ తో హాస్పిటల్‌లో నిడిగుంట అరుణ  సన్నిహితంగా మెలిగిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

కుప్పకూలిన హాస్టల్ భవనం!

గురుకుల పాఠశాల హాస్టల్ భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఆ సమయంలో హాస్టల్ లో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలో బుధవారం (సెప్టెంబర్ 10)ఈ ఘటన జరిగింది. హాస్టల్ భవనం కుప్పకూలిన సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భవనం కూలిన సమయంలో హాస్టల్ ముందు ఉన్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరి చాలా కాలమైంది. ఈ విషయమై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

నేపాల్ లోని భారతీయుల సహాయార్ధం హెల్స్ లైన్ నంబర్లు

నేపాల్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందు కోసం నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. నేపాల్ లోని భారత్ కు చెందిన వివిధ రాష్ట్రాలకు చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు నేపాల్ లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం ఆ దేశంలోని రాయబార కార్యాలయం 977 – 980 860 2881 /  977 – 981 032 6134 నంబర్లను ప్రకటించింది. ఈ నెంబర్లకు సాధారణ కాల్స్ తో పాటు వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చని తెలిపింది.  నేపాల్ లో  చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల వివరాలు తెలుసుకుని వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చుందుకు మంత్రి నారా లోకేష్ తన హిందుపూర్ పర్యటనను రద్దు చేసుకుని సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో సమీక్ష నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు నేపాల్ లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే...  ఢిల్లీలోని ఏపీ భవన్ : +91 9818395787, రియల్ టైమ్ గవర్నెన్స్: 08632381000, హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సాప్: +91 8500027678, ఇమెయిల్: helpline@apnrts.com అలాగే  info@apnrts.com, లను సంప్రదించాలని మంత్రి లోకేష్ తెలిపారు.  

అంబానీ సెక్యూరిటీ అన్ లిమిటెడ్!

ఇదిగో ఈ వీడియో లాంగ్ షాట్ చూస్తున్నారా? కొన్ని వందల మంది క్యూ కట్టి వెళ్తున్నారు చూశారా? వీరంతా ఏ మిలటరీ పరెడ్ కీ వెళ్లడం లేదు. మరే సైనిక కార్యక్రమానికీ హాజరు కావడం లేదు. ఆ మాటకొస్తే వీరెవరూ అసలు సైనిక విభాగానికి చెందిన వారు కానే కారు. వీరు జస్ట్ ఒక వ్యక్తి, సింగిల్ పర్సన్ కి సెక్యూరిటీగా పని చేస్తున్నారంతే.. ఏంటి అంతలా నోరెళ్లబెట్టేశారు? ఎస్ మీరు విన్నది కరెష్టే.. ఇంతకీ ఆ వ్యక్తి ఆ సింగిల్ పర్సన్ ఎవరనేగా మీ డౌటనుమానం. అయితే   చెవులు రిక్కించి మరీ వినండి.. ఆ వ్యక్తి మరెవరో కాదు ముఖేష్ అంబానీ ముద్దులు కొడుకు అనంత్ అంబానీ. పేరుకు తగ్గట్టే ఆయన సెక్యూరిటీ కూడా అనంతంగానే ఉంది కదూ? అనంత్ అంబాని ఒక క్లబ్ కి ఇంత భారీ ఎత్తున వస్తుండగా.. జనమంతా కలసి.. వీడియోలు తీశారు. అదిగో చూడండి చూడండి.. ప్రపంచ ఎనిమిదో వింత వస్తోంది చూడండీ.. అంటూ వారు వీడియోలో కాసేపు ఊరించి ఊరించి చూపించారు. ఎవరో ఏంటో ఏ విచిత్రమో చూపించవచ్చనుకుంటాం. కానీ ఇది అంతకన్నా మించిన వింతే. ఒక వ్యక్తికి ఇన్ని వందల మంది రక్షణ విభాగమా!? ఆయనేమైనా సినీ సెలబ్రిటీనా? క్రికెట్ వీరుడా? రాజకీయ నాయకుడా? అని మనకు అనిపించవచ్చుగానీ.. ఆయన అంతకన్నా మించి.. అంబానీలంటే మరేంటనుకున్నారు. ముంబై ఇండియన్స్ వంటి పెద్ద పెద్ద జట్లకు జట్లను కొనగలరు. ఇంకా వారి వ్యాపార సామ్రాజ్యం ఈ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏషియాలో టాప్ త్రీ పొజిషన్. ఇంకా మాట్లాడితే.. ముంబైలో వారిల్లే ఒక టూరిస్ట్ అట్రాక్షన్. ఇక ఫోర్బ్స్ జాబితాలో నిత్యం తొణికిసలాడే పేరది. అంబానీ అంటే అది సిరిసంపదలకే బ్రాండ్ అంబాసిడర్ లాంటి పేరు. మరి ఆ మాత్రం ఉండదా ఏంటి??? అనంటారు ఆర్ధిక రంగ నిపుణులు. కేవలం అనంత్ అంబానీ సెక్యూరిటీకే ఏటా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదేమో!

తిరుడా తిరుడీ!.. చోరీ చేస్తే ఆ కిక్కే వేరప్పా!

తిరుడా తిరుడీ అంటే  తమిళంలో దొంగా దొంగది అని అర్ధం. అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటే.. కాదనడం లేదు. కానీ.. ఒక మహిళా సర్పంచ్   పద్దెనిమిదేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ చోర కళతో దొంగతనాలు చేస్తున్నారు.  అయినా ఇదేం పిచ్చి? ఇదేం క్రేజీ? అని ప్రశ్నిస్తే..  చోరీ చేయండం మంచి కిక్ ఇచ్చే రియాల్టీ గేమ్ షో.. అంటారామె. ఏదో ఇప్పుడిలా చిక్కి పోయామని ఫీలవుతున్నాను గానీ.. దొంగతనం చేసి దొరక్కుండా దాన్ని మన పరం చేసుకోవడం అంటే ఆ మజాయే వేరు అంటారు  తమిళనాడుకు చెందిన భారతి. ఈమె గత 18 ఏళ్లుగా తిరుపత్తూరు జిల్లా, సరియంపట్టు అనే గ్రామానికి సర్పంచ్ గా పని చేస్తున్నారు. అధికార డీఎంకే పార్టీకి చెందిన ఆమె. ఇల్లూ- వాకిలీ- నగా- నట్రాతో  లైఫ్ లో మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉన్నట్టు ఆమెకు చేతి వాటం కాస్త ఎక్కువ. మొన్న ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె చేసిన చిలిపి పనేంటంటే.. పక్క సీట్లో ఉన్న మహిల బంగారు చైను దొంగతనం చేయడం.  ఇదేం పాడుబుద్ధమ్మా! నీకు చూస్తుంటే కలిగినింటి దానిలాగానే ఉన్నావని అడగ్గానే.. సారీ సారీ తప్పయిపోయింది క్షమించండి. నాకు గత కొంతకాలంగా ఈ దొంగతనాలు చేయడం ఒక అలవాటు. అదేంటో తెలీదు.. అలా చేస్తే నాకు భలే కిక్ అనిపిస్తుంది. ఏమనుకోకండే అని వారితో చెప్పడంతో.. వారికి ఈమెను ఏమనాలో అర్ధం కాలేదట. దీంతో తిరుడీ తిరుడీ అంటూ తమిళంలో తిట్టేసుకుని పోలీస్ కంప్లయింట్ చేశారట. దీంతో ఇప్పుడు ఆ సర్పంచ్ దొంగను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.  

ఎన్ఎస్ఈ చైర్మన్ గా తెలుగు తేజం ఇంజేటి శ్రీనివాస్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్ గా తెలుగుతేజం ఇంజేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఇంజేటి ఎన్ఎస్ఈ చైర్మన్ గా మంగళవారం (సెప్టెంబర్ 10)  బాధ్యతలు చేపట్టారు. వచ్చింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) మాజీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ ఇటీవలే ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా చేరారు. గతంలో ఆయన కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. గత రెండేళ్లుగా ఎన్ఎస్ఈ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఎన్ఎస్ఈ తొలి పబ్లిక్ ఇష్యూకి రెడీ అవుతున్న సమయంలో ఇంజేటి శ్రీనివాస్ నాయమకం జరిగింది.   కార్పొరేట్, ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, కార్పొరేట్, దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి భిన్న రంగాల్లో  నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉన్న ఇంజేటి కీలక సమయంలో ఎన్ఎస్ఈ చైర్మన్ గా నియమితులయ్యారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీఏ (ఆనర్స్) పూర్తి చేసిన ఇంజేటి శ్రీనివాస్ 1983లో ఒడిశా కేడర్ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సీఎం రేవంత్‌ భేటీ

  ఢిల్లీలో  సీఎం రేవంత్‌రెడ్డి  జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సమావేశం అయ్యారు. రీజిన‌ల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్‌) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ప‌నుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక‌, కేబినెట్ అనుమ‌తులు ఇప్పించాల‌ని గ‌డ్క‌రీకి విన్నవించారు. రావిర్యాల - ఆమ‌న్‌గ‌ల్‌ - మ‌న్న‌నూర్ ర‌హ‌దారిని నాలుగు వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిగా నిర్మించాల‌ని సూచించారు.  అలాగే, మ‌న్న‌నూర్‌ - శ్రీ‌శైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్యమంత్రి కోరారు. హైద‌రాబాద్‌ - మంచిర్యాల మ‌ధ్య నూత‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా మంజూరు చేయాల‌ని విన్నవించారు. హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు

మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు

  డ్రగ్స్ ముఠాలపై ఈగల్ టీమ్ ఉక్కు పాదం మోపింది... ఎలాగైనా సరే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ముఠా లపై కొరడా ఝళిపిస్తూ... డ్రగ్స్ అనే మహమ్మారిని పూర్తిగా రూపుమా పేందుకు ఈగల్ టీం నడుం బిగించింది... ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు. రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ ఫోర్స్ విదేశీ పౌరుడు ఒన్యేసి ఎసోం కెన్నెత్ మ్యాక్స్వెల్ ఇమ్మన్యుయెల్ బెడియాకో డ్రగ్స్ అమ్ముతూ పట్టు పడ్డాడు.  అయితే ఈగల్ టీం  మ్యాక్స్వెల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో.... 150 అకౌంట్లో ద్వారా నైజీరియాకు డబ్బులు పంపిస్తు న్నట్లుగా వెల్లడైంది.  మాక్స్వెల్ సుమారు రూ.68 లక్షల కమిషన్ సంపాదించాడని ఆ డబ్బును తన భార్య, మరిది  అకౌంట్లోకి తరలించాడని వెల్లడైంది. ఒకే ఒక నైజీరియన్ ఇంత పెద్ద స్థాయిలో వ్యాపారం చేయడం ఏంటా అని ఈగల్ టీం కూపిలాగడంతో చాలా విషయాలు బయట పడ్డాయి. దీంతో 24 ప్రత్యేక ఈగల్ టీంలు మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై ,గోవా, రాజస్థాన్ ,గుజరాత్  రాష్ట్రాలలో ఆపరే షన్ నిర్వహించారు.   ఈ క్రమంలోనే ఉత్తమ్ సింగ్, చేతన్ మమా  నియా, దుర్గా రామ్,చేతన్ సింగ్,చగన్ లాల్ ఆధ్వర్యంలో ఒక పటిష్టమైన హవాలా నెట్వర్క్ బయట పడింది. ఉత్తమ్ సింగ్ , భరత్ కుమార్ గోవాలోని నైజీరియన్ల వద్ద నుండి ప్రతిరోజు 25 లక్షల మనీ వసూలు చేసి వారానికి రూ.2.1 కోట్ల హవాలా ఆపరేటర్ల ద్వారా డబ్బుల పంపిణీ చేసేవారు.  అయితే నైజీరియన్లు బేబీ ఫ్రాక్స్, కుర్తాలు, టీ- షర్ట్ లు, మానవ కేశం, కిరాణా సరుకుల ఎక్స్ పోర్ట్ పేరుతో  ముంబై మరియు చెన్నై పోర్టు ల ద్వారా లాగోస్ కి సముద్ర మార్గం ద్వారా డబ్బులు రవాణా చేసేవారు. ఈ విషయం గుర్తించిన 24 ప్రత్యేక ఈగల్ టీములు మహా రాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా, ఢిల్లీ రాష్ట్రాలలో దాడులు చేసి 20 మంది డ్రగ్ మనీ లాండర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈగల్ టీం ఈ కేసులో 50 మంది నిందితులను పట్టుకున్నారు.

మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టిన నిరసనకారులు

  నేపాల్ మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. చైనా సానుభూతిపరుడైనా ఆయనపై గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖనాల్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.  సోషల్‌ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్‌ జెడ్‌ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు.  మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్‌ ఇంటిని ముట్టడించారు. ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు.

ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దుకూడు

  ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సహా నలుగురిపై న్యాయ విచారణకు ఏసీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎఫ్ఈఓ లను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ అనుమతి కొరకై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందుకు  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, గవర్నర్ అనుమతి అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.  ఫార్ములా ఈ కారు రేస్ లో అవకతవకలు జరిగి నట్లుగా సమాచారం రావడంతో వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై తొమ్మిది నెలల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ తో పాటు అర్వింద్ కుమార్ ను కూడా విచారించి వారి స్టేట్మెంట్లను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ కారు రేస్  స్పాన్సర్షిప్  చేసిన సంస్థల నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి  రూ. 44 కోట్ల రూపాయల ఎలక్షన్ బ్రాండ్స్ లాభం వచ్చినట్లు అధికారులు గుర్తించారు.  ఈ విధంగా  క్విడ్ ప్రో కో  జరిగినట్టుగా  ఏసిబి అధికారులు నిర్ధారించారు. ఏసీబీ అధికారులు 9 నెలల పాటు ఫార్ములా ఈ కార్ రేస్ లో విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి  నివేదిక సమర్పించారు. గత కేబినేట్ అనుమతి లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో 19 డిసెంబర్‌ 2024న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ.54.88 కోట్లకుపైగా నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో క్విడ్‌ప్రోకో జరిగినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు 

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

  ఢిల్లీ  పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల తెలంగాణలో భారీ వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదకను  నిర్మాలా సీతారామన్‌కు అందజేశారు.   విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన తెలంగాణకు వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చలు జరిపారు.సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

అల్లు అర్జున్‌కు నోటీసులు... ఎందుకంటే?

  టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మా ణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ బన్నీకి  జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లో రెండేండ్ల కిందట అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరుతో భవనాన్ని నిర్మించారు. అయితే గీతా ఆర్ట్స్‌తో పాటు అల్లు ఆర్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు, ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.  సుమారు 1226 గజాల స్థలంలోని ఈ భవనానికి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్‌ 4 అనుమతి కూడా ఉంది. కాగా, ఇటీవల నాలుగో అంతస్తుపైన అక్రమ నిర్మాణాన్ని చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందు కున్న వెంటనే జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-18 డీఎంసీ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. ఎటువంటి అనుమతి లేకుండా నాలుగవ అంతస్తు పైన అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని దీనిని వెంటనే కూల్చివేయాలి. కానీ అందుకు బన్నీ కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారు. అయితే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ అల్లు అర్జున్ కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఏపీలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

  ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలపై  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని కీలక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు చేసినట్లు  ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆమె  పేర్కొన్నారు.  మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌లో ఈవీఎంలు వాడారు. ఈవీఎంల కొనుగోలు,వినియోగంపై త్వరలో నిర్ణయం.’’ తీసుకుంటామని  కమిషనర్‌ నీలం సాహ్ని తెలిపారు. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెెలిసిందే.  అయితే ఈ ఎన్నికల్లో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళ అధికారి

  దేశంలో ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారట్లేదు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని  నార్సింగి మునిసిపల్ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక  రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది.  మరోవైపు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు పట్టుబడ్డాక ఆమె కన్నీరు పెట్టురు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో  కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సోదాలు నిర్వహించారు.

గ్రూప్‌-1 మెయిన్స్ ఫలితాలు రద్దు : హైకోర్టు

  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మార్చి 10న ప్రకటించిన మెయిన్స్ ఫలితాలు ఆధారంగా  జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను కోర్టు రద్దు చేసింది. మళ్లీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఉన్నత న్యాయస్థానం  ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని తెలిపింది. అందులో క్వాలిపై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది.  ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సంజయ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్‌-1 వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జులై 7న న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించారు.  

నేపాల్ లో రాజకీయ సంక్షోభం.. దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు

దుబాయ్ కి పారిపోయిన ప్రధాని మంత్రుల నివాసాలపై దాడులు పార్లమెంటును ముట్టడించిన ఆందోళనకారులు  ప్రధాని ఓలీ రాజీనామా నేపాల్ లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత చర్య ఆ ప్రభుత్వాన్ని పీకల్లోతు సంక్షోభంలోకి నెట్టివేసింది. పదుల సంఖ్యలో మరణాలకు కారణమైంది. మంత్రుల రాజీనామాలకూ దారి తీసింది. చివరకు ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్ధకం అన్న పరిస్థితిని కల్పించింది.  అంతెందుకు ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దుబాయ లో ఆశ్రయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారంటేనే పరిస్థితి తీవ్రత ఏంటన్నది అర్ధమౌతుంది. ఇంతకీ  ఈ పరిస్థితి రావడానికి కారణమేంటంటే..   దేశంలో సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధం విధించడం. అలా నిషేధించడానికి ఓలీ సర్కార్ కారణాలేవైనా చెప్పొచ్చుగాక.. కానీ ఆ నిషేధం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆశాంతికి దారి తీసింది. జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలకు దిగేలా చేసింది. ఆ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం, పోలీసు కాల్పులకు దారి తీయడం, పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం చకచకా జరిగిపోయాయి. ఇంత జరిగిన తరువాత ఓలీ ప్రభుత్వం దిగి వచ్చింది. తన నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తపమూ వ్యక్తం చేయకుండానే సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకుంది. అంత మాత్రాన పరిస్థితి చక్కబడుతుందని భావించే పరిస్థితులు కనిపించడం లేదు.  చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఓలీ  సోమవారం (సెప్టెంబర్ 8) అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని  అధికారికంగా  సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్   అధికారికంగా వెల్లడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇద్దరు కేబినెట్ మంత్రులు ఓలీపై విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేశారు. ఇప్పటికే ఓలీ తీరుకు వ్యతిరేకంగా నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. తాజాగా వ్యవసాయ మంత్రి రామ్ నాథ్ అధికారి సైతం తన పదవికి రాజీనామా చేశారు.    మరి కొందరు మంత్రులు కూడా అదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి,   ప్రధానంగా సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత రోడ్లపైకి వచ్చింది.  నేపాల్‌లో ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌తో సహా 26 సామాజిక మాధ్యమ వేదికల యాప్ లు సెప్టెంబర్ 4నుంచీ నిలిచిపోయాయి.  ఒక్క రెండు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. తొలుత ఈ ఆందోళనలను అణచివేయాలని చూసిన ఓలీ సర్కార్ పోలీసులనే కాదు, సైన్యాన్నీ మోహరించింది. రాజధాని నగరం ఖాడ్మండూ సహా ప్రలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించింది. అయితే ప్రజాగ్రహాన్ని అణచడంలో కానీ, తగ్గించడంలో కానీ ఇవేవీ పని చేయలేదు.  సరే ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం అసలు సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధం విధించడానికి కారణమేంటా అని చూస్తే.. దేశంలో చట్టాలను పాటిస్తామని డిక్లరేషన్ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమ వేదిక సంస్థలకు నేపాల్ సర్కార్ గడువు విధించింది. ఆ గడువులోగా వాటి నుంచి స్పందన లేకపోవడంతో కొన్నిటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలా నిషేధానికి గురైన వాటిలో  కమ్యూనికేషన్ కు ప్రాణాధారంలాంటి మెసేజింగ్ యాప్ లు ఉండటమే నేపాల్ ప్రజల అశాంతికి కారణమైంది. పెద్ద సంఖ్యలో నేపాలీయులు విదేశాలలో నివసిస్తున్నారు. దీంతో అక్కడ నివసించే వారు ఇక్కడ ఉన్న తమ వారితో కాంటాక్ట్ చేయడానికీ, అలాగే ఇక్కడి వారు విదేశాలలో ఉన్న తమవారితో  కాంటాక్ట్ లో ఉండడానికి మెసేజింగ్ యాప్ లో వారధులు. అటువంటి యాప్ లు నిషేధం కారణంగా పని చేయకపోవడంతో అశాంతి ప్రబలింది. ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు తగ్గి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా.. జనం నిరసనలను వదిలేలా కనిపించడం లేదు. మొత్తంగా ఓలీ ప్రభుత్వం అవినీతి మయం, అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమంటూ గళమె త్తుతున్నారు. ప్రభుత్వం పతనమయ్యే వరకూ పోరాటాన్ని వదిలేది లేదంటున్నారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభం పీక్స్ కు చేరింది.  ప్రధాని ఓలి ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేసినా అల్లర్లు అదుపులోకి రాలేదు. నిరసనకారులపై పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీ ఛార్జీ చేసినా ఫలితం లేకపోయింది.  ప్రధాని ఓలి  దుబాయ్ కు పరారైపోయారు. సైన్యం ఒత్తిడితో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇక  మాజీ ప్రధానమంత్రి, మంత్రుల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.   అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి విధ్వం సానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలూ కొనసాగుతునే ఉన్నాయి. నేపాల్‌ ప్రధాని , ప్రభుత్వ ప్రతినిధి, సమాచార, కమ్యూనికేషన్‌ మంత్రి నివా సానికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దేశ పార్లమెంట్‌ భవనాన్నీ ముట్టడించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది.  ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఓలీ మంగళవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు  చేశారు. ఇప్పటికే ఉప ప్రధానికి బాధ్యతలు అప్పగించిన ఆయన ఆరోగ్యం సాకుగా చూపుతో అఖిలపక్ష సమావేశం తరువాత దుబాయ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అమెరికా సుంకాల యుద్ధం వెనుక అసలు కథ ఇదేనా?

భారత్, అమెరికాల మధ్య సంబంధాలు చెడటానికి అసలు కారణం.. అగ్రరాజ్య అధినేత టారిఫ్ వార్ ఒక్కటే కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలు కథ  వేరే ఉందంటున్నారు. ట్రంప్ కోరినట్లుగా  జన్యుపర విత్తనాల (Genetic seeds) ఒప్పందానికి  భారత్ అంగీకరించకపోవడమే అసలు కారణంగా చెబుతున్నారు. ఒక వేళ భారత్ జెనిటిక్ సీడ్స్ ఒప్పందానికి అంగీకరించి ఉంటే..   అమెరికా విత్తనసంస్థ మాన్ శాంటో ఏజెంట్ బేయర్  పెత్తనం చెలాయిస్తారు. జెనిటిక్ సీడ్స్ పేటెంట్ పొందిన సంస్థ కసారి   దేశంలోకి అనుమతిస్తే.. ఇక అంతే సంగతులు.  ఆ విత్తనం విత్తితే తరతరాలు ఆ సంస్థకు సొమ్ములు చెల్లిస్తూ ఉండాల్సిందే. అంతే కాదు దేశీయ విత్తన సంస్థలు మూడపడాల్సింది. అలాగే రైతువారీ విత్తన సేకరణకు ఫుల్ స్టాప్ పడాల్సిందే.  స్వదేశీ వ్యవసాయ పరిశోధనలు ఇక  గతించిన చరిత్రగా మారిపోతాయి. . 1950, 1960లలో అంటే ఇండియాలో ఇంకా హరిత విప్లవం మొదలు కాని రోజులలో  అమెరికా పీఎల్ 480 పేరుతో గోధుమలను సరఫరాచేసేది. అయితే ఆ సరఫరాకు అమెరికా విధించిన షరతులు దేశానికి ఆమోదయోగ్యం కాకపోవడం వల్లనే దేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.  ఇప్పుడు అమెరికాలో తయారవుతున్న జెనిటిక్ క్రాప్స్  మొక్కజోన్న,సోయా తదితరాలు  మనిషిని చంపవు కానీ శరీరాన్ని గుల్లు చేసే రసాయినాలు కలిగి ఉంటాయి. ఆ కారణంగా అమెరికా జెనిటిక్ క్రాప్స్ ను ఇక్కడ దేశీయంగా వినియోగిస్తే..  మందుల వినియోగాన్ని విపరీతంగా పెరిగిపోతుంది. ఒళ్లు, జేబూ కూడా గుల్ల అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా స్పష్టంగా ఉదాహరణ ఇవ్వాలంటే.. అమెరికాలో 1990 తరువాత ఊబకాయుల సంఖ్య పెరిగిపోవడానికి ఈ జెనిటిక్ క్రాప్సే కారణం. చిన్న తనంలోనూ డయాబెటిక్ వంటి వ్యాధుల సంక్రమణకూ ఇవే కారణమని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే  సంతానలేమి, ,కాన్సర్,కాలేయవ్యాధులు, గుండెజబ్బులు విపరీతంగా పెరగడానికీ ఇవే కారణం.దీనివల్ల మందుల వినియోగం పెరిగిపోవడం సహజం. ఈ సకల దుష్ఫరిణామాలకూ  జన్యూపరమైన పంటలు, వాటితో తయారైన ఆహారం పదార్ధాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.  అందుకే ఇండి యా జెని టిక్స్ సీడ్స్ ఒప్పందానికి నిర్ద్వంద్వంగా నో చెప్పింది.  జబ్బులు, రుగ్మతలతో పాటు ఈ ఒప్పం దానికి ఔదాల్చితే  దేశీయ విత్తనాలు,  పంటలు,  ఆత్మగౌరవం,  భవిష్యత్తు ఇవేమీ ఉండవు. ఈస్టిండియా కంపె నీ వాణిజ్యం పేరుతో ఇండియాను ఆక్రమించిన వలసకాలంనాటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమౌతాయంటున్నారు పరిశీలకులు.