వాళ్లంతా కట్నాలను తిరిగి ఇచ్చేశారు... ఎందుకంటే!

కట్నం తీసుకోవడం శిక్షార్హం అని ప్రభుత్వం తెగ ప్రకటనలు చేస్తుంటుంది. కట్నం అడిగేవాడు గాడిదతో సమానం అంటూ టీవీలు చెడ తిడుతుంటాయి. కానీ కట్నం తీసుకునే ఆచారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మునుపటిలా కట్నం తేలేదని కిరసనాయిలు పోసి తగటబెట్టేసిన వార్తలు వినిపించకపోవచ్చు. కానీ వేధింపులు మాత్రం యథాతథంగానే సాగుతున్నాయి. ఇలాంటి ఆచారానికి ముగింపు పలుకుతున్నాడు ఓ యోధుడు.... జార్ఖండ్లోని పొఖారీ గ్రామానికి చెందిన హాజీ ముంతాజ్ అలీకి కట్నం అంటే మా చెడ్డ చిరాకు. ఆ కట్నం కారణంగానే తన తోటి ముస్లిం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయన్నది అతని అభిప్రాయం. కానీ మిగతావారిలాగా ముంతాజ్ అలీ ఈ దురాచారం గురించి బాధపడుతూ కూర్చోలేదు. కట్నం తీసుకోవడం ఎంత అనాగరికమో, దాని వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, యువత ఎలా అత్యాశలో కూరుకుపోతోందో ఊరిలో ఇంటింటికీ వెళ్లి చెప్పసాగాడు. 2016 ఏప్రిల్లో ముంతాజ్ అలీ మొదలుపెట్టిన ప్రచారం నెలలు గడిచేసరికి సత్ఫలితాలను ఇవ్వసాగింది. తాము కట్నం తీసుకోమంటూ తోటి ముస్లిం కుటుంబాలన్నీ ముంతాజ్ అలీకి మాట ఇచ్చాయి. అంతేకాదు! ఇప్పటికే కట్నం తీసుకున్నవారైతే తాము తీసుకున్న కట్నాన్ని ఆడపిల్లల కుటుంబానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 800 కుటుబాల వారు ఆరుకోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇచ్చేశారు. కట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముంతాజ్ అలీ పోరాటం రానురానూ ఓ ఉద్యమం స్థాయికి చేరుకుతంది. జార్ఖండ్లోని లాతేహర్, పాలము జిల్లాలలోని ముస్లిం కుటుంబాలు ఇప్పుడు కట్నం అంటేనే మండిపడుతున్నారు. ఆఖరికి పెళ్లిళ్లు చేయించే మతగురువులు (మౌల్వీలు) కూడా కట్నం తీసుకునేవారి పెళ్లిళ్లు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేశారు. తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు దల్తోన్గంజ్ అనే ఊరిలో ఈ నెల 7వ తేదీన ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు ముంతాజ్ అలీ. మతం ఏదైనా కానీ... కట్నం ఇచ్చే ఆచారం వెనుక ఒకప్పటి ఉద్దేశం వేరు. ప్రస్తుతం మాత్రం అది ఆడపిల్లల జీవితాలని తలకిందులుగా మార్చేస్తోంది. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టుకున్నారు ముంతాజ్ అలీ. అతను ఆశయం అసాధ్యం కాదని 800 కుటుంబాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్క ముంతాజ్ అలీ ఒంటరిగా ఇంత సాధిస్తే... గంటల కొద్దీ కబుర్లు చెప్పే మన సమాజ సేవకులు ఇంకెంత సాధించాలి! - నిర్జర.        

భుజం తట్టే చేయి లేకపోతే!

ఇంగ్లండులో ఒకప్పుడు రోసెట్టి అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. ఆయన దగ్గరకి ఓసారి ఓ నడివయసు మనిషి వచ్చాడు. ఆయన చేతిలో చాలా కాగితాలు ఉన్నాయి. వాటిలో ఒక బొత్తిని రోసెట్టి చేతిలో పెట్టి- ‘ఇవన్నీ నేను వేసిన బొమ్మలు. వాటిని మీరొక్కసారి పరిశీలించి నేను బొమ్మలు గీసేందుకు పనికొస్తానో లేదో తెలియచేయగలరా!’ అని ప్రాథేయపడ్డాడు. నిజానికి రోసెట్టి ఆ రోజు చాలా పనిఒత్తిడిలో ఉన్నాడు. అయినా కూడా పెద్దాయన మాటని కాదనలేకపోయాడు. నిదానంగా ఆ బొత్తిని చేతిలోకి తీసుకుని వాటిలో ఒకో చిత్రాన్నే పరిశీలించసాగాడు. ప్చ్‌! ఆ బొమ్మలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క చిత్రంలోనూ చిత్రకారుడి ప్రతిభ కనిపించనేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవన్నీ నాసిరకంగానూ, ప్రాథమిక స్థాయిలోనూ ఉన్నాయి. ఆ విషయం చెబితే వచ్చిన మనిషి బాధపడతాడని తెలుసు. కానీ ఓ విమర్శకుడిగా ఉన్నమాటని సున్నితంగా అయినా చెప్పక తప్పలేదు. ‘మీ బొమ్మలు ఏమంత గొప్పగా లేవండీ! మరిన్ని మంచి చిత్రాలు గీయాలంటే మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది,’ అంటూ సుతిమెత్తగా చెప్పాడు రోసెట్టి. రోసెట్టి నోటి వెంట అలాంటి మాటలే వస్తాయని ఆ పెద్దాయనకు తెలుసు. అయినా ఆయన మనసు బాధగా మూలిగింది. ‘మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి. మరేమనుకోకపోతే నా దగ్గర మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఓసారి చూడగలరా,’ అంటూ ఇంకో బొత్తిని చేతిలో పెట్టాడు. నిరాసక్తిగా రెండో బొత్తిని చేతిలోకి తీసుకున్న రోసెట్టి  కళ్లు చెదిరిపోయాయి. ఆ చిత్రాలలోని నైపుణ్యం చాలా అసాధారణంగా ఉంది. చిత్రాలలో చిన్న చిన్న వివరాలను కూడా చాలా అద్భుతంగా మలిచాడు చిత్రాకారుడు. ఒక్కమాటలో చెప్పాలంటే తను ఈ మధ్య కాలంలో ఇంత ప్రతిభ చూపిన చిత్రాలను చూడనే లేదు. ‘ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని గీసిన చిత్రకారుడి భవిష్యత్తుకి తిరుగులేదు. కాస్త ప్రోత్సాహం కనుక ఉంటే... అతను దేశంలోనే గొప్ప చిత్రకారుడిగా నిలుస్తాడు. ఇంతకీ ఇవన్నీ మీ కొడుకు గీశాడా లేకపోతే మీ ఊరిలో ఎవరన్నా కుర్రవాడు గీశాడా. ఎవరతను ఓసారి అతణ్ని నా దగ్గరకి తీసుకురండి. అతణ్ని చూడాలని ఉంది,’ అంటూ ఉద్రేకపడిపోయాడు. ఆ మాటలు వింటూనే పెద్దాయన కంటి వెంట నీరు ఆగలేదు. ‘అయ్యా! ఇవన్నీ నేను వయసులో ఉన్నప్పుడు గీసిన చిత్రాలు. అప్పట్లో నాకు చిత్రాలు గీసేందుకు తగిన ప్రతిభ ఉందనుకునేవాడిని. ఎవరి దగ్గరా శిక్షణ లేకుండానే ఈ చిత్రాలన్నీ గీయగలిగాను. కానీ నాలో ప్రతిభ ఉందన్న విషయం ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోలేదు. నా భుజం తట్టి ప్రోత్సహించలేదు. నేను గీసిన చిత్రాలను చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. ఎన్నాళ్లని నాలో ప్రతిభ ఉందన్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలను? నిదానంగా నా మీద నాకే అపనమ్మకం మొదలైంది. ఆ న్యూనత నా చిత్రాలలోనూ కనిపించసాగింది. అయినా చేతులాగక అడపాదడపా అనురక్తితో బొమ్మలు గీస్తూనే ఉన్నాను. కానీ అవి ఎలా ఉంటున్నాయో మీరు ఇందాక చూశారుగా!’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

వ్యాయామం అల‌వాటుగా మారితే...

రోజంతా సుదీర్ఘంగా ప‌నిచేశాక మ‌న శ‌రీరాన్ని వ్యాయామం చెయ్య‌డానికి ఒప్పించ‌డం అంత తేలికైన ప‌నికాదు. మ‌న‌సులో వ్యాయామం చెయ్యాల‌ని ఎంత‌గా ఉన్నా శ‌రీరం అందుకు స‌హ‌క‌రించ‌దు. కానీ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేసే కొంత‌మంది మాత్రం అదేదో ట్రిక్ ప్లే చేసిన‌ట్లు ఠంచ‌నుగా చేసేస్తుంటారు. బహుశా, వాళ్లు కూడా ఆ విష‌యాన్ని గుర్తించ‌క‌పోవ‌చ్చు. వ్యాయామాన్ని ఒక నిర్దిష్ట‌మైన అల‌వాటుగా చేసుకున్న‌వాళ్లు మాత్ర‌మే క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తార‌ని హెల్త్ సైకాల‌జీ అనే ప‌త్రిక‌లో ప్ర‌చురించిన ఒక అధ్య‌య‌నం తెలిపింది. పొద్దున అలారం మోగితే ఎలా లేస్తామో, అలా పొద్దున్నే సంకేతం అందిన‌ట్లుగా లేచి, మ‌రో ఆలోచ‌న లేకుండా వ్యాయామంలోకి వాళ్లు దిగిపోతారు. అలాగే ఆఫీసు ప‌ని త‌ర్వాత వెళ్తే క‌లిగే లాభ‌న‌ష్టాల గురించిన ఆలోచ‌న లేకుండా వాళ్లు జిమ్‌కు వెళ్లిపోతుంటారు. ఎందుకంటే అది వాళ్ల‌లోని అంత‌ర్గ‌త సంకేతాల ద్వారా ప్రేరేపిత‌మైన స్వ‌తంత్ర నిర్ణ‌యం. మ‌రికొంత‌మంది వ్యాయామాన్ని రొటీన్ వ్య‌వ‌హార‌మ‌న్న‌ట్లు చేసుకుంటూ పోతారు. ప్రేర‌ణ‌తో కూడిన అల‌వాటు మంచిదా, లేక వేరే ర‌క‌మైన ఎగ్జిక్యూష‌న్ హ్యాబిట్ మంచిదా అనే విష‌యం తెలుసుకోవ‌డానికి వ్యాయామం చేసేవాళ్ల‌పై నెల రోజుల పాటు అధ్య‌య‌నం చేశారు ప‌రిశోధ‌కులు. ఈ అధ్య‌య‌నం కోసం యూనివ‌ర్సిటీ విద్యార్థుల్ని, బోధ‌నా సిబ్బందిని వారు ఎంచుకున్నారు. ఎన్నో ప్ర‌శ్న‌లు వేసి వారి ద‌గ్గ‌ర్నుంచి స‌మాచారం రాబ‌ట్టారు. ఎంత త‌ర‌చుగా వ్యాయామం చేస్తుంటారు?  మీ వ్యాయామ అల‌వాటు ఎంత బ‌ల‌మైంది?  వేరు ఆలోచ‌న‌లు లేకుండా వ్యాయామం చేస్తున్నారా?.. లాంటి ప్ర‌శ్న‌ల‌తో వారి అల‌వాటును అంచ‌నా వేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. జిమ్‌లో ఎలాంటి వ్యాయామాలు చేస్తారు? ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు కూడా రెగ్యుల‌ర్‌గా చేసే వ్యాయామాల‌న్నీ త‌ప్ప‌కుండా చేస్తుంటారా?.. అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌ట్టారు. వీటి ఆధారంగా వాళ్ల‌లోని అల‌వాటు ప్రేర‌ణ‌తో కూడిన‌దా, లేక 'చేయాలి కాబ‌ట్టి చేస్తున్నాం' అనే భావన‌తో కూడిన‌దా అనే విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీర్ఘ కాలంలో ఒక వ్య‌క్తి ఎంత త‌ర‌చుగా వ్యాయామం చేస్తార‌నే విష‌యాన్ని ఊహించేందుకు ఉప‌యోగ‌ప‌డ్డ ఒకే ఒక అంశం, ప్రేర‌ణ‌తో కూడిన అల‌వాటు బ‌ల‌మే. కాలంతో పాటు వాళ్ల‌ల్లో వ్యాయామ అల‌వాటు కూడా బ‌ల‌ప‌డింది. "ప్రేర‌ణ‌తో కూడిన అల‌వాటు క‌లిగిన‌వాళ్లు ఒక నెల‌రోజుల పాటు త‌ర‌చుగా వ్యాయామం చేస్తూ చురుగ్గా త‌యార‌య్యాక, వాళ్ల అల‌వాటు మ‌రింత బ‌లాన్ని పుంజుకోవ‌డం నేను గ‌మ‌నించాను. అదే నిర్వాహ‌క హాబీ క‌లిగిన‌వాళ్ల‌లో అయితే ఎలాంటి మార్పూ క‌నిపించ‌లేదు." అని ప‌రిశోధ‌కుల్లో ఒక‌రైన ఎన్‌. అలీస‌న్ ఫిలిప్స్ తెలిపారు. ఒకే ర‌క‌మైన వ్యాయామాల‌పై దృష్టి పెట్ట‌డం అనేది మాన‌సికంగా ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌లేదు కానీ, ఒక వ్య‌క్తి ఒక నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి ఉండ‌టానికి కూడా ఇది దోహ‌దం చేయ‌లేదు. రోజూ పొద్దున‌, సాయంత్రం ఒకే ర‌క‌మైన ప‌నులు చేస్తూ విసుగు చెందుతూ కొత్త‌గా క‌స‌రత్తులు మొద‌లుపెట్టిన‌వాళ్ల‌కు ఇది శుభ‌వార్తే. "ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన వ్యాయామాలు చేస్తుండ‌టం దీర్ఘ‌కాలంలో ఉప‌యోగ‌క‌ర‌మైందే త‌ప్ప హానిక‌రం కాదు. చాలామంది వ్యాయామం మొద‌లుపెట్ట‌డాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తుంటారు. ఎందుకంటే, వాళ్ల‌కు వ్యాయామం ఒక పెద్ద భూతంలా క‌నిపిస్తుంటుంది. ఒక‌సారి ప‌ట్టుకుంటే ఇక అది మ‌న‌ల్ని వ‌ద‌ల‌దేమోన‌ని భ‌య‌ప‌డుతుంటారు. వాళ్ల‌కు ట్రెడ్‌మిల్ మీద ప‌రిగెత్త‌డం అనేది చాలా బోరింగ్ రొటీన్‌. అదో హింస‌లాగా క‌నిపించి, వ్యాయామాన్ని ప్రారంభించ‌కుండానే దాన్ని ముగించేస్తుంటారు." అని చెప్పారు ఫిలిప్స్‌. కొన్ని అంశాలు ప‌దే ప‌దే పున‌రావృతం అవుతూ వ్యాయామం చెయ్యాల‌నే సంక‌ల్పాన్ని బ‌లోపేతం చేస్తాయి. "మీరు ఒక నిర్దిష్ట వ్యాయామాన్ని వృద్ధి చేసుకుంటున్న‌ప్పుడు, మీతో స‌రిపోయే భావ‌జాలం క‌లిగిన‌వాళ్ల‌తో ఉండ‌టం మీకు తోడ్పాటునిస్తుంది. అయితే ఏదో ఒకే ర‌క‌మైన వ్యాయామానికి అల‌వాటుప‌డ్డం విసుగు పుట్టిస్తుంది. అందువ‌ల్ల అంత‌ర్గ‌త సంకేతాల‌కు త‌గ్గ‌ట్లు చేయ‌డ‌మే మంచిది. అదే మిమ్మ‌ల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ మీ ఎక్స‌ర్‌సైజ్ రొటీన్ వైపు మ‌ళ్లిస్తుంటుంది." అంటారు ఫిలిప్స్‌.

సుఖానికి నిర్వచనం!! 

  ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలనే అనుకుంటాడు. బాధలు దగ్గరకి వచ్చినా అవి ఎప్పుడు వెళ్లిపోతాయా అని ఆలోచిస్తాడు. ఆవైపుగా పరిష్కారాలు మొదలుపెట్టేస్తాడు. అయితే సుఖం గురించి భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభః అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాస్తం చ నిగచ్ఛతి|| ఈ లోకంలో ఎల్లప్పుడూ దుఃఖము విషాదము కష్టములే కాదు సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు ఎక్కువయి, ఒక వేళ ఆ సుఖాలు తొలగిపోతే కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా మూడు విధాలుగా విభజింపబడ్డాయి.  సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటి కే ఉన్న దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఇది మానవుని కర్తవ్యము. కాని మానవులు తమ అజ్ఞానం వలనా, తాము చేసే రాజన, తామన కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నారు. రాజన గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి, నిద్రలో, నిద్రలాంటి మత్తులో సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖము ఎలా వస్తుంది అంటే వాళ్లు చేసే పనుల వలన వస్తుంది. అందుకే.. మానవులు అందరూ "నేను సుఖంగా ఉన్నాను" అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ తింగింగ్ అని అంటారు. దానికి అవసరమయ్యేది అధ్యాత్మ విద్య, దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందడం దుఃఖాలను పోగొట్టుకోవడం మన చేతిలో ఉంది.  అది కేవలం అభ్యాసం వలననే వస్తుంది కానీ మాటల వలన రాదు, తినడం కొంత మందికి సుఖం ఇస్తుంది. కాని ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం. ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరి సుఖం ఇస్తుంది. కాని తాగకూడనివి తాగితే దాహం ఎక్కువ అవుతుంది. మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కక్కేస్తాడు. తరువాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివి అయితే పరవాలేదు. కాని చెడ్డవి అయితే దుఃఖం తెచ్చిపెడతాయి. ఇక్కడ ఒక పదం వాడాడు. దుఃఖాస్తం చ నిగచ్ఛతి. ఎవడు ఏ పని చేసినా, సుఖపడటానికే చేస్తాడు కానీ దుఃఖ పడటానికి చెయ్యడు. పైగా ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడానికి ప్రయాస పడతాడు. అంటే దుఃఖం అంతం అయితే సుఖం దానంతట అదే వస్తుంది. అది మానవ సహజం. కాని తన అవివేకం వలన ఉన్న సుఖాలు రాకపోగా, కొత్త దుఃఖాలు వచ్చిపడుతున్నాయి. ఒక్కోసారి ఈ దుఃఖాలకు అంతం లేదా అనిపిస్తుంది.  మనంకొన్ని ప్రశ్నలు వేసుకుంటే…..  దుఃఖమునకు అంతం ఎప్పుడు?? దుఃఖము లేని చోటు ఎక్కడ ఉంది?? దుఃఖములు ఎక్కడ అంతం అవుతాయి?? శాశ్వత సుఖం ఎక్కడ దొరుకుతుంది?? శాశ్వత సుఖం ఏం చేస్తే లభిస్తుంది?? ఎవరి వలన లభిస్తుంది?? ఈ ప్రపంచంలో దొరికే వస్తువులతో, అనుభవించే విషయ వాంఛలతో సుఖం దొరుకుతుందా??  ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఒకటే జవాబు, సుఖము, దుఃఖము, ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మన భావనలో ఉన్నాయి. మనం చేసే కర్మలలో ఉన్నాయి. మనలను మనం సంస్కరించుకుంటే, అంటే మనల్ని మనం సరిచేందుకుంటే శాశ్వత సుఖం దానంతట అదే వస్తుంది. సుఖం కోసం ఎక్కడా వెదకవలసిన పని లేదు. అందుకే సుఖం కావాలంటే అభ్యాసం చేయాలి. మంచి అలవాట్లు చేసుకోవాలి అని అన్నాడు గీతలో కృష్ణుడు. ◆ వెంకటేష్ పువ్వాడ

వినదగునెవ్వరు చెప్పిన...

"ఒరేయ్ బాబూ… అది కాదురా దారి ఇది. ఇలా వెళ్ళాలి" అంటాడు ఓ పెద్దాయన. "ఎహె!! నేను నీ మాట ఎందుకు వినాలి పెద్దరికం ఉంటే ఇంతే, ప్రతిదానికి అడ్డుపడతారు" అంటాడు ఓ కుర్రకుంక. "ఒరేయ్ నానీ నీకు కథ చెబుతానురా…." అంటాడు ఒక ముసలాయన. "ఉరుకో నాన్నా చదస్తపు కథలతో ఎందుకు పిల్లొళ్లను మూర్ఖులుగా మార్చుతావు అంటాడు కొడుకు. "అన్నా!! నువ్వు వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు. నేను చెబుతానురా" అంటాడు ఒక పిల్లాడు. "ఒరేయ్ నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఊరికే నా టైమ్ వేస్ట్ చేయక పోరా ఇక్కణ్ణుంచి" అంటాడు ఆ పెద్దోడు. ఇలాంటివి ప్రతి మనిషి జీవితంలో, ఆ మనిషి చుట్టూరా చాలా వినబడుతూ, కనబడుతూ ఉంటాయి. ఈకాలం మనుషులు చాలా తక్కువ విస్తృతంలో ఇరుక్కుపోయారు. మనిషి ఎంత ఆలోచిస్తే అంత, ఎంత తెలుసుకుంటే అంత అనే విషయాన్ని మెల్లిగా మెదళ్లలో నుండి తీసేసారు. ఫలితంగా తెలుసుకోవడాన్ని, వినడాన్ని ఓర్పుతో సహా కోల్పోయారు. అంతేనా ఏదైనా విషయం తెలిసిందీ అంటే అందులో తమ గురించి ఇతరులు ఎదో అన్నారు అని తెలిసిందంటే ఒకేసారి యుద్దానికి వెళ్లినట్టు వెళ్లి, గొడవ చేసి, రచ్చ చేసి కానీ వదిలిపెట్టరు. కానీ చివరకు ఒకోసారి తెలుస్తుంది అవగాహన లేకపోవడం వల్ల ఏదో అనేసుకున్నారు అని, అది కూడా అవగింజ అంత విషయాన్ని కొండంత చేసి చెప్పారని. సుమతీ శతకకర్త పద్యంలో చెబుతాడు  వినదగునెవ్వరు చెప్పిన  వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన  మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ!! అని ఎవరు ఏమి చెప్పినా వినాలి అలా విన్న తరువాత ఆ చెప్పిన విషయంలో నిజమెంత అనేది తెలుసుకోవాలి, అలా తెలుసుకున్న తరువాత చెప్పిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. అలా నిదానంగా అన్నీ తెలుసుకున్నవాడే నీతివంతమైనవాడు ఈ ప్రపంచంలో అని అర్థం.  కానీ అందరూ ప్రస్తుత కాలంలో ఏమి చేస్తున్నారు??  చాలామంది ఎవరైనా ఏదైనా చెబితే అనే మొదటి మాట అంతా తెలిసినట్టు బిల్డప్పు అని అంటారు. ఇది బయటకు అనకపోయినా మనసులో అయినా అనుకునేస్తారు. అంతేనా!! ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్పెయ్యగానే అందులో పొరపాటున తమ పేరు ఉంటే ఇక అయిపాయే!! ఉగ్రతాండవం చేస్తారు ఆ వ్యక్తి మీద. ఇంకా కొందరుంటారు వైరస్ లెక్కన. ఒక విషయం తెలియగానే అందులో నిజానిజాలు, కారణాలు ఏమి తెలుసుకోకుండా వైరస్ ఎలాగైతే వ్యాపిస్తోందో అలా విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేస్తారు. అది కూడా మాములుగా కాదు, ఉన్న విషయానికి ఇంకాస్త తమలో ఉన్న నైపుణ్యం జోడించి చిలువలు పలువలు చేసి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదొక పైశాచిక ఆనందం వాళ్లకు. ప్రస్తుత కాలం ఇట్లా ఏడ్చింది కాబట్టే మనుషుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇంకా అన్నిటికీ మించి స్నేహాభావం కూడా కరువయ్యింది. కనీసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య కూడా సరైన అవగాహన ఉండటం లేదు. వస్తువులకు, ఆర్థిక కలాపాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషుల విషయంలో  ఇవ్వడం లేదు.  ఒకసారి ఓపిక తెచ్చుకోవాలి ఒకసారి ఎదుటివారి మాట వినాలి ఒకసారి నిజానిజాలు గ్రహించాలి ఆ తరువాత అన్నీ అర్థమవుతాయి మనుషులే కాదు ప్రపంచం కూడా….. ◆ వెంకటేష్ పువ్వాడ

చివరికి మిగిలేది?

బాలాస్తావతీ క్రీడాసక్తః  తరుణస్తావత్తరుణీసక్తః | వృద్ధస్తావాచ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో పి సక్తః  భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!! వయసి గతే కః కామవికారః  శుష్కే నీరే కః కాసారః | క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః  భావం: వయస్సు మళ్ళిపోతే కా మవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.  భజ గోవిందం లోని ఈ రెండు శ్లోకాలు నాకు కాలగమనము యొక్క ప్రాముఖ్యత నేర్పిస్తూ ఉంటాయి. నిజమే కదా ఈ వయస్సు అన్నది శాశ్వతం కాదు. బాల్య వయసులో మనం ఆటల్లో గడిపేస్తాం. కొద్దిగా యవ్వనం లోకి రాగానే మన మనసుకు నచ్చిన వారితో సంసార సాగరంలో పడిపోతాము. మళ్లీ ముసలి వయసు రాగానే ఈ జబ్బులు ఆ జబ్బులతో ఒళ్లంతా రోగాలు మయం చేసుకుని, మనకు పాడి కట్టే రోజు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంటాము. ఇదేనా జీవితం అంటే? నాకైతే ఇంతకుమించి ఏదో ఉంది అనిపిస్తుంది. మనం జీవితంలో ఎన్ని సాధించినా ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న చివరికి చేరాల్సింది ఈ మట్టిలోనే. ఈ మట్టిలో కలిసిపోయే దేహం కోసం ఎన్నో మారణహోమాలు, ఎన్నో దుర్మార్గాలు, మరెన్నో అవినీతి కార్యాలలో, చేతకాని వారిగా భాగస్వాములమవుతాం లేదా అటువంటి వారిని చూస్తూ చేతలుడిగి కూర్చుంటాము. నిజానికి చివరికి మిగిలేది అనేది మనం ఎవరము ఆలోచించము కదా. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు మనిషి చావు అనేదే లేనట్టు బతుకుతాడు కానీ ఎన్నడూ బతక లేనట్టు చస్తాడు. ఇది నిజం కాదంటారా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మనకు సమయం ఉండగానే మనం మనతోపాటు చివరి క్షణాల్లో మనకు అండగా వచ్చే వాటిని తీసుకుపోవాలి మరి మనకు అండగా వచ్చేదేంటి? ధర్మరాజుకున్నంత ధర్మాన్ని మనం పాటించలేము. ఈ కాలంలో అది అసలు కుదరని పని. కానీ కొంతలో కొంతైనా మనం ధర్మం పక్షాన నిలబడలేమా? చివరికి మనతోపాటు కొన్ని ఆత్మీయ అనుభూతులను మోసుకెళ్లలేమా?  మన ఊపిరి వదిలే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా ఆస్వాదిస్తూ, మనతోపాటు పయనం చేస్తున్న సమస్త జీవరాశిని ప్రేమిస్తూ సాధ్యమైనంతలో సేవ చేస్తూ, బతికితే అదే చాలు ఈ జీవితానికి. ఏముందిలే ఇంకా నాకు బోలెడంత వయసు ఉంది. తీర్ధయాత్రలవీ చేసుకుని బోలెడంత పుణ్యం సంపాదించేసుకుంటాను అనే భ్రమను వదిలి ఈ క్షణమే ఆఖరి క్షణం అన్నట్టు బతుకు నావను ఈశ్వరునికి అంకితం చేసేద్దాం. మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చే కళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ వీడు పోయి భూమికి భారం తగ్గింది అనుకుని నవ్వే పెదవులు ఉండకూడదు. వెంకటేష్ పువ్వాడ  

ఈ హక్కుకు న్యాయం చేస్తున్నామా??

  మనిషికి సమాజం, ఈ రాజ్యాంగం బోలెడు హక్కులు ఇచ్చింది. పిల్లల నుండి పెద్దల వరకు వయసును, వికాసాన్ని, స్వేచ్ఛను ప్రతిబింబించేలా బోలెడు హక్కులు ఉన్నాయి. వాటిని మనిషి తనకు అవసరమైనప్పుడు చక్కగా వినియోగించుకుంటూ ఉంటాడు. అలాంటి హక్కుల జాబితాలో చాలా అరుధైనది, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించగలిగేది ప్రజాస్వామ్య పాలనకు బ్రహ్మాస్త్రం వంటిది ఓటు హక్కు. చట్టమిచ్చిన ఆయుధం!! నిజానికి అన్ని హక్కులు మనిషికి స్వేచ్ఛను ఇస్తే, ఓటు హక్కు రూపంలో న్యాయాధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టింది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కేటాయించింది. ఈ ఓటు హక్కు ద్వారా అవినీతి లేని, సమర్థవంతమైన నాయకులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తూ సుపరిపాలన అందించాలనేది ఓటు హక్కు ముఖ్య ఉద్దేశం. పౌరుల అపహాస్యం!! ఒక గొప్ప ఆయుధాన్ని చేతికి ఇచ్చినప్పుడు ఒక మూర్ఖుడు ఆ ఆయుధాన్ని దారిన వెళ్లే పీచుమిఠాయి బండి వాడికి అంటే పాత సామాను కొనేవాడికి వేసాడంటా, ఆ ఆయుధం తీసుకున్నవాడు ఓ గుప్పెడు పీచుమిఠాయిని వీడి చేతిలో పెట్టి ఎంచక్కా వెళ్ళిపోయాడు. ఆ పీచుమిఠాయిని నిమిషంలో తినేసి అసంతృప్తిగా వెళ్లినా ఉచితంగా వచ్చింది కదా అని తృప్తి పడ్డాడు వాడు. అయితే ఆయుధం తీసుకుని పోయిన వాడు దాంతో అన్యాయంగా అందరి ప్రాణాలు తీస్తూ, ఉండిపోయాడు.  ఇలా ప్రస్తుతం భారతదేశ పౌరులు కూడా ఓటు హక్కును సరిగా వినియోగించుకోకుండా తాత్కాలిక తృప్తి ఇస్తోందని అయిదు వందల నుండి, రెండు వేల వరకు ఓటును రాజకీయ నాయకులకు అమ్మేస్తూ ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు. రాజకీయ నాయకుల దందా!! రాజకీయ నాయకులు ప్రజలకు సరైన న్యాయం చేయరు. లబ్ధిదారులకు పథకాలను మంజూరు చేయడంలో అలసత్వం, ప్రాజెక్టుల పేరుతో స్కాములు చేసి చల్లగా ఆ నిధులు మింగేయడం,  భూములను స్వాధీనం చేసుకోవడం. అవినీతి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం వాళ్ళ నుండి  కమీషన్లు తీసుకోవడం చేస్తారు. ఇలా వాళ్ళు రాజకీయ ప్రవేశం చేసిన ముందు, తరువాత అని గమనిస్తే వాళ్ళ జీవితాల్లో ఎంత తేడా ఉందొ అందరికీ అర్థమవుతుంది. అర్థం చేసుకోరేందుకు?? ప్రజలు ఏమీ అమాయకులు కాదు. చాలా  తెలివితేటలు ఉంటాయి ప్రజలకు. కానీ ఒక రాజకీయ నాయకుడు మోసాలతో ఎంత ఎదిగిపోతూ ప్రజల ధనాన్ని ఎంత వెనకేసుకుంటున్నాడో అందరికీ తెలుసు కానీ పిచ్చి జనాలు ఈ ఓటు హక్కును అంత నిర్లక్ష్యంగా చూస్తారెందుకు??  సమాజాన్ని, ప్రజలను అధికారం పేరుతో ముప్పుతిప్పలు పెట్టె ఈ రాజకీయ నాయకులకు కరెన్సీ కాగితాలు తీసుకుని ఓటు వేస్తే, వాళ్ళు తిరిగి ఎన్నికలు వచ్చేవరకు ప్రజల గూర్చి మర్చిపోతారు. అలాంటి మహానుభావుల కోసం ఎంతో గొప్ప ఆయుధాన్ని వ్యర్థం చేస్తారెందుకు?? మార్పు కావలిప్పుడే!! న్యాయాన్ని, ధర్మాన్ని, ప్రజలను ముఖ్యంగా ప్రజలకు ఎంతో గొప్ప ఆయుధాన్ని ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేస్తున్న రాజకీయ ప్రస్థానాలకు ముగింపు పలకాలి. వాస్తవాన్ని  మాత్రమే కాదు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. సమాజాన్ని సంస్కరిస్తూ రేపటి తరాలకు గొప్ప సమాజాన్ని ఇవ్వగలిగే నాయకులను అధికారంలో నిలబెట్టాలి. ఇలా జరగాలి అంటే మీ ఓటు హక్కును న్యాయం చేస్తున్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలిప్పుడు. ◆ వెంకటేష్ పువ్వాడ  

పద్యాల పడవ కట్టిన వేమన!!

  ప్రతి మనిషి చిన్నతనం నుండి పెద్దయ్యేలోపు పది వేమన పద్యాలైనా పలికి ఉంటాడు. ఒక్క వేమన పద్యాన్ని అయినా కంఠతా చెప్పేయగలిగేలా నేర్చుకుని ఉంటాడు. ఆ పద్యాలు అన్నీ ప్రపంచంలో ప్రతి మనిషికి, మనిషి జీవితంలో వ్యక్తిత్వాలకు దగ్గరగా…. ఎన్నో విలువలు, నీతి, ఛలోక్తులు నింపుకున్నవి వేమన పద్యాలు.  17 వ శతాబ్దానికి చెందిన పద్య కవి వేమన. ఈయన శతక కవులలో ప్రసిద్ధి చెందినవాడు. అంతేకాదు ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా పద్యాలను మలచి ప్రజాకవిగా పేరు పొందాడు. ఎలాంటి ఆడంబరాలు ఈయన పద్యాల్లో కనిపించవు. నీతిని, సామాజిక చైతన్యాన్ని ఎంతో సహజమైన పదాలతో నింపి పద్యాల రూపంలో ప్రజలకు అందించాడు. ఈయన పద్యాలు సాహిత్యపరమైన సంపదగా కాక ప్రజల జీవితంలో భాగంగా మారిపోయినవే ఎక్కువ. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో సాగే ఈయన పద్యాల పడవ సమాజపు సముద్రాన్ని ఎంతో చక్కగా చుట్టేస్తుంది. ఎవరీ వేమన!! "బెదమ కోమటి పెదవేమారెడ్డి, బెదమ కోమటి చినవేమారెడ్డి" అనే ఇద్దరు అన్నదమ్ములలో చినవేమారెడ్డినే వేమనగా  రూపాంతరం చెందాడు. ఈయన గొప్ప ధీరుడు. ఈయన అన్న పెదవేమారెడ్డి రాయలసీమను పాలించిన నాటి రాజుగా ఉన్నా రాజ్య కార్యకలాపాలు అన్నీ చినవేమారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగేవి. ఇలా ఈయన ఒక మంచి సంపన్న కుటుంబంలోని వాడే అని స్పష్టమవుతుంది. రూపాంతర రహస్యం!! పాఠ్యపుస్తకాలలో వేమన పద్యాలు చదువుకున్న పిల్లలకు  దిగంబరంగా ఒక కాలు మడిచి మరొక కాలు చాపుకుని కూర్చున్న వేమన భంగిమ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వేమన చిత్రాలు ఇలాగే ఉంటాయి కూడా. అయితే సంపన్న కుటుంబంలో ఉన్న వేమన ఇలా బైరాగిగా మారి సర్వమూ త్యజించిన వాడిగా ఎందుకు మారిపోయాడు అనేది తెలియదు. చరిత్రలో తొంగి చూస్తే భోగవిలాసాలలో మునిగి ఒకానొక నిర్లక్ష్య జీవితాలకు అలవడినవాళ్ళు ఎందరో క్రమానుగతంలో గొప్ప యోగులుగానూ, తాత్వికులుగానూ రూపాంతరం చెందారని సాక్ష్యాలున్నాయి. అలాంటి కోవలోకి చెందినవారే వేమన కూడా.  వేశ్యలోలుడి నుండి యోగిగా!! ఈయనను, ఈయన అన్నను చంపితే రాజ్యానికి తనే రాజు అవ్వచ్చనే నమ్మకద్రోహానికి కంకణం కట్టుకున్న మంత్రి చినవేమారెడ్డికి ఉన్న వేశ్యల సంపర్కమనే బలహీనతతో ఆవిపు దారి మళ్లించి విషప్రయోగం చేసి చివరకు అడవుల్లో పడేసివస్తే, శరీరంలోం ఏ మూలో, ఏ నాడీ కణంలోనో కొనఊపిరి ఉందని గమనించి అభిరామ అనే ఒక వైద్యుడు ఔషధాల సహాయంతో పడనాన్ని నిలబడితే తిరిగి పునర్జన్మ పొంది జరిగింది గుర్తుచేసుకుంటూ ఎంతటి తప్పు చేసానో అనే పశ్చాత్తాపంతో మౌనంగా మారిపోయిన చినవేమారెడ్డి కాలక్రమంలో అభిరామ గురువు అయిన విశ్వకర్మ భోదించే జ్ఞానానికి పాత్రుడయ్యి ఆ జ్ఞానాన్ని నింపుకుని వేమన యోగిగా రూపాంతరం చెందాడు. పద్యాల పడవకు బ్రౌన్ వెలుగు!! నిజానికి మొదట వేమన పద్యాలు అన్నీ ప్రజల నోటి మాటల్లో నానాయి. వాటిని  వేమన ఏవిధంగానో గ్రంథస్థం చేయడం కానీ, ఇతరులు ఎవరూ గ్రంథస్థం చేయించడం కానీ జరగలేదు. అయితే తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన తెల్లదొర బ్రౌన్ వేమన పద్యాలను గ్రంథస్థం చేయించడమే కాకుండా వాటిని ఆంగ్లంలోకి అనువదించారు కూడా. అనగనననగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు…… అని చెప్పిన మన వేమన, తనువులోన నున్న తత్త్వంబు దెలియక వేరే యాత్ర బోవు వెర్రివాడు గంత మోసి మోసి గాడిద తిరుగదా….. అని కూడా అంటాడు. ఇందులో ఎంతో తత్వం ఉంది. అలాగే  ఆత్మ శుద్దిలేని ఆచార మది యేల?? అంటూ  ప్రశ్నిస్తాడు. అన్నిధానముల కంటే అన్నదానము మేలు అని చెబుతాడు…. ఉర్విజనులకెల్ల ఒక్క కంచము బెట్టి అని సర్వసమానతను సమర్ధిస్తాడు….. జీవిజీవిని జంప శివుని జంపుటే అగు అని ఆయనలో ఉన్న జీవకారుణ్యాన్ని బహిర్గతం చేస్తాడు. ఇలా వేమన యోగిగా మారి ఎన్నో ఊళ్ళు తిరుగుతూ వెళ్లిన ప్రతిచోటా తన పద్యాల గుభాళింపును వెదజల్లాడు. ఆ పరిమళమే ఇప్పటికీ అందరికీ నీతి పద్యాల ప్రసాదమై నాల్కలకు తియ్యదనాన్ని పంచుతూ ఉంది అనుకోవచ్చు. వేమనను ఇలా గుర్తుచేసుకోవడమే కాదు, ఆయన పద్యాలను ఆయన చెప్పిన నీతిని పిల్లలకు కూడా నేర్పించాలి. ◆ వెంకటేష్ పువ్వాడ

పెద కంచి పెనుగంచిప్రోలు!!

  కొన్ని ప్రదేశాలకు కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఆ విశిష్టత అంతా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రత్యేకతను బట్టి వస్తూ ఉంటుంది. అలా ప్రత్యేకత సంతరించుకుని ఎవ్వరికీ పెద్దగా  తెలియని ప్రాంతం పెనుగంచిప్రోలు. కృష్ణా జిల్లాలో ఉన్న జగ్గయ్యపేట నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పెనుగంచిప్రోలు ఉంది.  పేరువెనుక పరమార్థం!! ప్రతి పేరు వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కొన్ని ప్రాంతాలను ఆ ప్రాంతాలలో గొప్ప వ్యక్తుల పేర్ల, కుటుంబాల ఆధారంగానూ, మరికొన్ని ప్రాంతాలలో పరిస్థితుల కారణంగానో, ఇంకా కొన్ని ప్రాంతాలలో భౌగోళిక పరంగానూ మరికొన్నిటికి ప్రదేశాల్లో ఉన్న ప్రత్యేకత కారణంగానో పేర్లు స్థిరపడి ఉంటాయి. అలాంటిదే ఈ పెనుగంచిప్రోలు కూడా.  దీని అసలు పేరు పెదకంచి అని కాలం మారుతూ ఇది పెనుగంచిగా ఆ తరువాత పెనుగంచిప్రోలుగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. దేవాలయాల అద్భుతం!! ఈ పెనుగంచిప్రోలు లేదా పెదకంచి లేదా పెదగంచిలో దేవాలయాలు ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతోంది. తమిళనాడులో కంచి ఉంది. దాని చిన్న కంచి అని పిలుస్తారు. అది చిన్న కంచి అయితే కృష్ణా జిల్లాలో ఉన్నది పెద్ద కంచి అని పేర్కొన్నారు. అంటే ఎంతో గొప్పదైన కంచి కంటే కూడా అద్భుతమైన దేవాలయాల సమాహారం ఈ పెదగంచి అని అర్థం చేసుకోవచ్చు. మున్నేటి ప్రతాపం!! కృష్ణాజిల్లా పెదగంచి పక్కనే మున్నేరు ప్రవహిస్తూ ఉండేది. ఆ మున్నేటికి వరదలు వచ్చి పెదగంచిని ముంచేసిందని ఆ మున్నేటి ప్రతాపానికి ఎన్నో దేవాలయాలు మునిగిపోయాయని చెబుతారు. ఆ మునిగిపోయినవి క్రమేణా భూమిలోకి చొచ్చుకుపోయాయని ఇప్పటికీ మున్నేరుకు వరద వస్తే  ఆ వరద నీటిలో తొంగిచూసినప్పుడు ఇసుక మధ్యలో నుండి ఎన్నో దేవాలయాల స్తంభాలు, ఇతర శిథిలాలు కనిపిస్తూ ఉంటాయి.  చరిత్రలో ఏముంది? చరిత్రలో చూస్తే మున్నేటి ఒడ్డున గోల్కొండ నవాబు అయిన కూలీకుతుబ్ షా కు, హిందూ రాజులకు యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో కూలీకుతుబ్ షా గెలిచాడని. ఆ గెలుపు వల్ల ఆలయాలు ధ్వంసం చేసి ఎంతో సంపదను ఎత్తుకుపోయాడని, ఆ ఆలయాల శిథిలాలు క్రమంగా భూగర్భంలో కలిసిపోయి అవే అప్పుడప్పుడూ బయటపడుతుంటాయని చెబుతారు.  నిర్లక్ష్యం, అలసత్వం!! గంధపు చెట్లు ఎక్కువగా పెరిగే అడవుల్లో ఆ గంధపు చెక్కలను పొయ్యిలో మంట పెట్టడానికి కూడా వాడతారు,  అదే అరుదుగా లభించే వాళ్లకు ఆ గంధపు చెట్లు ఎంతో అపురూపం. అలాగే ఈ పెనుగంచిప్రోలు విషయం కూడా ఇంతే అనిపిస్తుంది. స్థానికులకు ఈ ఆలయాల విశిష్టత, వాటి ప్రాధాన్యత తెలియదు అనడానికి ఉదాహరణ అక్కడ ఎంతో గొప్ప ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయని తెలిసినా వాటిని పెద్దగా పట్టించుకోరు. ప్రభుత్వాల  నిర్లక్ష్యం కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. తిరుపతమ్మ కల్యాణం కమణీయం!! పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది రాష్ట్రంలో 11 వ స్థానంలో ఉండి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. ఇక్కడి అమ్మవారి కల్యాణం, గ్రామ దేవత తిరునాళ్ళు ఎంతో గొప్పగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పెనుగంచిప్రోలులో 101 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో గొప్ప ఆలయాలు, అరుదైన దేవాలయాలు ఉన్నాయి.  అవి ఇవీ కూడా!! ఆసక్తి ఉన్నవారు పెనుగంచిప్రోలుకు వెళ్తే ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నట్టు ఈ పెనుగంచిప్రోలుకు దగ్గరలోనే విజయవాడ దుర్గమ్మ, వేదాద్రి నరసింహస్వామి, శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు క్షేత్రం, కొల్లేటికోటలో పెద్దింట్లమ్మ, నెమలి వేణుగోపాలస్వామి, పెదకళ్లెపల్లి నాగేశ్వరాలయం, ఆకిరిపల్లి వ్యాఘ్రనరసింహస్వామి దేవాలయం. ఇలా అన్నీ ఎంతో అద్భుతమైన దేవాలయాలను కూడా చూడచ్చు.  హాయిగా దేవాలయాలను చూస్తూ చుట్టిరావచ్చు.  ◆ వెంకటేష్ పువ్వాడ

పర్యాటక ప్రియుల కోసం మూడు ప్రదేశాలు!!

  భగవాన్ రమణ మహర్షి. ఈయన జ్యోతి స్వరూపుడు. ఆధ్యాత్మిక లోకానికి ఉన్న గొప్ప ఉనికిని కొనసాగించిన రమణ మహర్షుల వారు తన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను కొన్ని ప్రదేశాల్లో గొప్ప అనుభవాలుగా అనుభూతి చెందారు. అవన్నీ కూడా శివకళలు నిండిన ప్రదేశాలు మరియు గొప్ప శైవ క్షేత్రాలు. విహారాయత్రల మీద ఆసక్తి ఉన్నవారు ఇటువెళ్తే ఎంతో గొప్ప అనుభవం మూటగట్టుకుంటారు. ఒక్కసారి ఆ శైవక్షేత్రాల గూర్చి చూస్తే…  1.తిరుచ్చుళి: ఇది భగవాన్ శ్రీరమణ మహర్షి జన్మస్థలం. దీనికి సంస్కృతంలో "త్రిశూలపురం" అని పేరు. దీని మాహాత్మ్యమును స్కంద పురాణంలో వర్ణించారు. మధుర-తిరువనంతపురం రైలు మార్గంలో విరుదనగర్ అనే జంక్షన్ ఉంది.  దానికి తూర్పుదిశలో 18 మైళ్ళ దూరంలో తిరుచ్చుళి వుంది. మధురనుంచి అరుప్పుకోటకు వచ్చి, అక్కడ నుండి తిరుచ్చుళికి  వెళ్ళవచ్చు. మధుర నుండి తిరుచ్చుళికి బస్సు మార్గం ఉంది. ఇక్కడే భగవాన్ రమణ మహర్షి జన్మించారు. ఆయన అలా జన్మించినప్పుడు ఆయన ప్రసవించిన గదిలో ఒక జ్యోతి కనబడిందట. అది ఆ గదిలో ఉన్న ఒక అవ్వకు కనబడిందట. ఆ అవ్వకు చూపు సరిగా కనిపించకపోయినా ఆమె ఆ జ్యోతిని చూసింది అంటే ఆ వెలుగు ఎంత ప్రకాశంగా ఉందొ, రమణుల వారి జననం ఎంత గొప్పదో అర్థమవుతుంది.  తిరుచ్చుళిలో వెలసిన శివునికి “తిరుమేననాథర్” అని, దేవికి “తుణైమాలె” (సహాయాంబ) అని పేర్లు. వీరిపై సుందరమూర్తి, మాణిక్య వాచకులు ఎన్నో కీర్తనలను కీర్తించారు. ఈ త్రిశూలపురం ఉన్న శివుడిని భూమినాథేశ్వరుడు అని కూడా అంటారు.  కౌండిన్య ఋషి ఇక్కడ తపస్సు చేయడం వలన ఈ క్షేత్రమునకు “కౌండిన్య క్షేత్రం” అని పేరు వచ్చింది. ఈ ఊరిలో ప్రవహిస్తున్న నదికి కూడా "కౌండిన్య నది" అని పేరు. ఇట్లా రమణులు పుట్టిన ప్రదేశంలో ఎంతో శక్తివంతమైన ఛాయలు ఉన్నాయి.  2. మధుర: ఇది మీనాక్షీ- సుందరేశ్వరులు వెలసిన క్షేత్రం మరియు పాండ్యుల రాజధాని. రమణ మహర్షి మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన ప్రతిసారి ఆయనలో ఉన్న ఆత్మ చైతన్యం అయ్యేదని చెబుతారు. ఆధ్యాత్మికంగా అంతవరకు ఎక్కువ ఆసక్తిగా లేని రమణ మహర్షి మీనాక్షి అమ్మవారి ఆలయం వెళ్లిన కొన్ని నెలల తరువాత ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించడం జరిగింది.  ఇక్కడ ఈశ్వర విభూతి కార్యమును, సహస్రారంలో కుండలినీ విలాసంగా పోల్చి చెపుతారు. కావున దీనిని “ద్వాదశాంత స్థలి” అని పిలుస్తారు.  3. అరుణాచలం: అరుణాచలమునే “తిరువణ్ణామలై" అంటారు. ఇక్కడ భగవాన్ 54 సంవత్సరాలు లోకానికి ఆచార్యులుగా వుండి బోధలను అందించారు. తిరుపతి నుంచి వెల్లూరు, వెల్లూరు నుంచి తిరువణ్ణామలైకు బస్సులో వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి మధురై వెళ్ళే రైలులో ప్రయాణించి తిరువణ్ణామలైలో దిగవచ్చును. 'కాట్పాడి', తిరువణ్ణామలైకు దగ్గరలోని రైల్వే జంక్షన్. తిరిచ్చుళిలో పుట్టిన వెంకటరామన్ అరుణాచలంకు చేరిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత భగవాన్ రమణ మహర్షిగా రూపుదిద్దుకున్నారు. చివరికి ఆయన మరణించేవరకు అక్కడే ఉన్నారు. జన్మించినప్పుడు ఎలాగైతే జ్యోతి వెలిగిందో,  ఆయన మరణించినప్పుడు  కూడా తోకచుక్క ఆకాశానికేసి వెళ్లిపోయిందని అది ఆయన భక్తులకు కనిపించిందని చెబుతారు.  నిజానికి ఆదిశంకరుల తరువాత అద్వైతాన్ని గురించి గట్టిగా ప్రపంచానికి వినిపించిన వారు రమణ మహర్షే!! ఈయన ఎవరికీ ఏవిధమైన బోధనలు చేయలేదు. తన జీవితం ద్వారానే ఆదర్శుడిగా నిలిచారు. ఇట్లా రమణ మహర్షి జీవితంతో అనుబంధమైన ఈ శైవ క్షేత్రాలను చూసొస్తే విహారాయత్ర ముచ్చట, ఇటు ఆధ్యాత్మిక అనుభవం రెండూ కలుగుతాయి. ◆ వెంకటేష్ పువ్వాడ

 స్వరాజ్యం వెలుగుకు మొదటి నినాదం!!

  ఈ ప్రపంచంలో భారతదేశానికి ఎంతో ప్రత్యేకస్థానం ఉంది. అది సంస్కృతి, సంప్రదాయాల పుట్టిళ్ళు. విభిన్న మతాల నిలయం. ఇంకా చెప్పాలంటే భరత ఖండంబు చక్కని పాడియావు అనే గొప్ప మాట ఉంది. అలాంటి భారతదేశంలో బ్రిటీషు వారి రాక, వారి దౌర్జన్యం చాలా నష్టాలను, కష్టాలను భారత పౌరుల దోసిల్లలో పోసిందని చెప్పవచ్చు.ఇలాంటి భారతదేశంలో మొదటిసారిగా సతీసహగమనం, బాల్యవివాహాలు, విద్య, అంటరానితనం వంటి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి, స్వయం పరిపాలన కావాలని గొంతెత్తి చాటిచెప్పిన వాడు స్వామి దయానంద సరస్వతి. ఈయన అందరికీ ఆర్యసమాజ స్థాపకుడిగా తెలుసు. భారతదేశంలో పౌరుల మనసులలో నుండి మూఢ నమ్మకాలు, అందవిశ్వాసాలను తొలగించడానికి  ఈయన చేసిన కృషి ఎంతో గొప్పది. సాదారణంగా 1857 సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఆ నాటి పోరాటాలను మొదటి స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. నాటి ఆ పోరాటంలో తనదైన కీలక పాత్ర పోషించి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచినవాడు స్వామి దయానంద సరస్వతి. భారతీయ ప్రత్యేకత అయిన వేదాలు ఉపనిషత్తులను ఎంతో బాగా తెలుసుకుని, వాటిని జీవితంలో భాగం చేసుకుని పాటిస్తూ మరొకవైపు సామాజిక శ్రేయస్సు కోసం కూడా పాటుపడిన అతి తక్కువ మందిలో ఈయన ఒకరు. సాదారణంగా వేదాలు ఉపనిషత్తులు అవపోషన పట్టిన వారు దేవుడు, దైవం, పుణ్యషేత్రాలు, ప్రచనాలు, భోధలు అంటూ గురువులుగా మారిపోతూ ఉంటారు. కానీ ఈయన మాత్రం బ్రిటీషు వారి బానిసత్వంలో నలుగుతున్న భారతాన్ని, విచ్చిన్న దశలో మూలుగుతున్న ఈ గొప్ప సంప్రదాయ దేశాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు. ఈ భారతం ఇలా బానిసత్వాన్ని దాటుకుని, పాశ్చాత్యుల కుట్రల నిజాలు తెలుసుకుని అందులో నుండి బయటపడాలి అని ఆవైపుగా ఎంతో పోరాటం చేశారు. ఆర్యసమాజ స్థాపన!! భారతదేశానికి ఉన్న విలువలు ఎంతో గొప్పవి. అనుసరించే సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. అయితే బ్రిటీషుల రాకతో భారతీయుల మెదళ్లలో హిందూ ధర్మం పట్లా, హిందూ దేవతల పట్లా ఒకానొక అపహస్యపు అస్త్రాలను మెల్లిగా విస్తరింపజేశారు. దానిపలితంగా కులాలు, మతాల చీలికలు. దేవతల వారిగా ప్రజలు కూడా వర్గాలుగా విడిపోయి తమలో తాము కొట్టుకుంటూ భారతీయ హిందూ ధర్మాన్ని విచ్చిన్నం వైపుగా తీసుకెళ్ళసాగారు. ఈ పరిణామాలు అన్నిటినీ కళ్లెదురుగా చూస్తున్న స్వామి దయానంద సరస్వతి గారు ధర్మ సంస్థాపనను శాశ్వతంగానూ, దేశంలో ఉన్న ఎన్నో అవకతవకలను సంస్కరించడానికి. ముఖ్యంగా బాల్య వివాహాలు, విద్య, మూఢ నమ్మకాలు, అంటరానితనం, సతీసహగమనం వంటివాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఆర్యసమజాన్ని స్థాపించాడు. ఈ ఆర్యసమాజం నాటి నుండి ఇప్పటి వరకు కూడా భారతీయుల జీవితాల్లో భాగమై నాటి స్వామి దయానంద సరస్వతి కృషికి గుర్తుగా నిలిచి ఉంది. మరణం వెనుక భయంకరమైన నిజం!! కొందరు చేస్తున్న పనులు మరికొందరి స్వార్థానికి అడ్డుకట్టలు వేస్తుంటాయి.  స్వామి దయానంద సరస్వతి ఆర్యసామాజం నెలకొల్పి దాని సహాయంతో దేశాన్ని సంస్కరించడం మొదలుపెట్టాక చాలామంది తమ స్వార్థపూరిత కార్యకలాపాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించుకుంటే తమ సమస్యలు తీరుతాయని  భావించి ఆయనకు విషప్రయోగం చేశారు. అయితే యోగాలో ఎంతో శక్తివంతమైన, మరెంతో రహస్యమైన బస్తి, న్యోలి అనే పద్ధతుల ద్వారా తన ప్రేగులను శుభ్రం చేసుకుని ఆ విషాల నుండి రెండు సార్లు బయటపడ్డారు స్వామి దయానంద. కానీ మూడవసారి మాత్రం ఆయన శరీరం విషానికి లొంగిపోయి క్షీణించి విశ్వం నుండి వీడ్కోలు తీసుకుంది. ఇట్లా భారతీయ ప్రజానీకానికి పెద్దగా లోతుగా తెలియని స్వామి దయానంద కేవలం యోగి, ఋషి మాత్రమే కాదు భారతప్రజల కోసం స్వరాజ్యానికి పిలుపిచ్చిన మొదటి భారతీయుడు కూడా. ◆ వెంకటేష్ పువ్వాడ  

విందులతో పసందు!!

  దేశాలు ఎన్నైనా ఈ ప్రపంచానికి ఆహారమే శక్తి వనరు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు బిజీ అయ్యేకొద్ది ఇంటిపట్టున వంట చేసుకోవడం కూడా తగ్గిపోయింది. ఫలితంగా వీధి వీధికి కనిష్టంగా కనీసం నాలుగైదు హోటల్స్ వెలుస్తున్నాయి. అవి మాత్రమే కాకుండా తోపుడు బండ్ల మీద, వెహికల్స్ లోనూ వచ్చి అమ్ముతున్నవాళ్ళు ఎక్కువయ్యారు. ఇది ఎంతోమందికి ఉపాధిగా కూడా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. ఫుడ్ లవర్స్!! క్రమంగా ఫుడ్ లవర్స్ హంగామా పెరుగుతూ పోతోంది అనడానికి ఉదాహరణ యూట్యూబ్ లో కోకొల్లలుగా ఫుడ్ బ్లాగర్లు అప్లోడ్ చేసే వీడియోలే. వివిధ ప్రాంతాలు, వివిధ ప్రఖ్యాతి గాంచిన ఆహారపదార్థాలను వెతుక్కుంటూ వారు చేసే ప్రయాణం ఆశక్తికరంగానూ, నోరూరిస్తూను ఉంటాయి. ఈ ఫుడ్ బ్లాగర్లు చేసే హంగామా వల్లనే బోలెడు పదార్థాల ఉనికి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాచీన వంటకాలు, వాటిని కొన్ని దశాబ్దాల నుండి అమ్ముతున్న దుకాణాలు, వాటి చరిత్ర మొదలైనవి అన్ని ఈ ఫుడ్ బ్లాగర్ల వల్లనే తెలుస్తున్నాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. విభిన్న ప్రయోగాలు!! కొందరు సాధారణంగా ఇంట్లోనూ, బయట కూడా తిన్నదే తినడం అంటే బాగా చిరాకు తెచ్చేసుకుంటారు. తినే పదార్థాల విషయంలో కూడా విభిన్నత కోరుకునే వారు చక్కగా తమవైన ప్రయోగలలోకి కూడా దిగేస్తారు. ఫలితంగా కొత్త కొత్త వంటకాలు అవిష్కృతం అవుతుంటాయి. ఆ నమ్మకం కాస్తా పెరిరి పెద్దవుతూ వాళ్ళను వ్యాపార సామ్రాజ్యంలోకి దింపుతోంది. వంటకాల మీద కూడా హక్కులు తీసుకుని వాటిని తమవిగా చెప్పుకుని, వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కొన్ని వంటకాలు కేవలం కొన్ని రెస్టారెంట్లలోనే లభ్యమవడం అందరూ చూస్తుంటారు. దాని వెనుక కారణం కూడా ఇదే.  రుచి సూత్రం!! ఆహారపదార్థాల విషయంలో అందరూ ఫిదా అయ్యేది రుచికె. కొన్ని చోట్ల తిన్న పదార్థాలను వేరే ఎక్కడ ప్రయత్నించినా ఆ రుచి కనిపించకపోవచ్చు. దానిక్కరణం కూడా వాళ్ళు పాటించే రహస్య సూత్రాలు. దానివల్లనే వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అందుకే చాలా వరకు ఆహారపదార్థాల తయారీ బయటకీ చెప్పరు. ముఖ్యంగా రెస్టారెంట్ లలో కఠిన నియమాలు ఉంటాయి కూడా. కాబట్టే ఫుడ్ లవర్స్ అధిక ధర వెచ్చించి మరీ రెస్టారెంట్స్ లో తినడానికి వెళ్తుంటారు. ఆకలి రాజ్యం కాసుల వర్షం!! నిజమే ఆకలి రాజ్యంలో ఆహారాన్ని అమ్మడం అనేది ఎప్పటికీ నష్టం తెచ్చే ప్రయోగం మాత్రం కాదు. పాటించాల్సిధల్లా  రుచి, శుచి, ఉపయోగించే పదార్థాలు  మన్నికగా ఉన్నవి వాడటం. ఇంకా సర్వింగ్ లో గౌరవం. ముఖ్యంగా వచ్చి పోయేవాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం. నిజానికి రుచి నచ్చితే గంటల తరబడి ఎదురుచూసి తినే వాళ్ళు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. కాబట్టే వీధి వీధిలో రోజురోజుకూ హోటల్స్ కొత్తగా వెలుస్తూనే ఉన్నాయి. వృత్తి, ప్రవృత్తి జీవితానికి శక్తి!! అవును ఇది నిజం. కొందరు ఉదయం సాయంత్రం మాత్రమే ఇలాంటి హోటల్స్ నడుపుకుంటూ, వీటిని ప్రవృత్తిగా చేసుకుంటూ మధ్యలో తమదైన పనులు కూడా సాగిస్తారు, మరికొందరు పట్టు వచ్చిన తరువాత దాన్నే వృత్తిగా మార్చుకుని స్థిరంగా నిలబడతారు. మహిళలు అయితే తమకున్న వంటల నైపుణ్యతను వధులుకోకుండా రోజూ ఓ ఇద్దరో, ముగ్గరో మనుషులకు క్యారియర్లు పంపుతూ సంపాదిస్తారు. ఇది మాత్రమే కాకుండా హోమ్ మేడ్ ఫుడ్స్, పచ్చళ్ళు, పొడులు, చిరుతిండ్లు ఇంకా అదనంగా పండుగలకు ప్రత్యేక పిండి వంటకాలు. సంప్రదాయతను జోడించి ఎంతో రుచిగా చేసి అమ్ముతూ వారిదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియర్ సౌకర్యాలు, ఆన్లైన్ ఆర్డర్లు, డబ్బు చెల్లింపులు సులభం అవ్వడం. ఇవ్వన్నీ కూడా జీవితాలు సాఫీగా సాగడానికి ఎంతో సహాయపడుతున్నాయి. ఇట్లా హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న చిన్న తోపుడు బండ్లు, ఇంకా పెళ్లిళ్లు, ఫంక్షన్ లకు క్యాటరింగ్ చేయడం. తమకు వచ్చిన రుచిని నలుగురికి చేరవేస్తూ వ్యాపారసూత్రం పాటిస్తూ నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు నేటితరం వంటల సామ్రాజ్యాధిపతులు. ◆ వెంకటేష్ పువ్వాడ

ఎక్కువగా టీవీ చూసే అలవాటు ఉందా?

మీకు ఎక్కువగా ఘంటల తరబడి టి వి ముందు కూర్చునే అలవాటు ఉందా ? మీ శరీరంలో రక్త్గం గడ్డ కట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు నిర్వహించిన పరిశోదన అంశాలను వివరించారు. టి వి ఎక్కువ సమయం చూసే వారికి శరీరంలో రక్త నాళాలు కుంచించుకు పోయి రక్త నాళాలు గడకట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టి వి తక్కువగా చూసే వారికంటే దీర్ఘ కాలం పాటు టి వి చూస్తూ ఉన్నవారికి వీనల్ త్రాంబో ఎంబాలిజం వి టి ఇ వచ్చే అవకాశం ఉందని తేల్చారు. వారి పరిశోదనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పలేదు.దీనిపై ఎలా వ్యవహరించాలో కూడా పరిశోదనలు చేయలేదని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా గుండెలోని రక్తనాళాలు కుంచించుకు పోయి ఆస్టిరో స్సిరో టిక్ కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ వల్ల రక్త నాళాలలో రక్త్గం గడ్డ కట్టడం దీనిని వీటి ఎఫ్ సహజంగా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ గా తేల్చారు. దీనికి తోడు ఊబ కాయం,ధూమ పానం, అలవాటు ఉన్నవారిలో మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. పరిశోదన... దీర్ఘకాలం పాటు ఎవరైతే ఎక్కువగా సెడన్ ట రీ లైఫ్ కు అలవాటు పడతారో. వారి ప్రవర్తన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల వ్యాస్క్యులర్ సమస్యలు వస్తాయి. దీనికారణంగా సి వి డి, వి టి ఇ సమస్యలకు కారణం అవుతోంది. టి వి చూడడం అనేది ఖాళీ సమయం లో చూడడం ఒక హాబీ ఏ పని పాటా లేనివాళ్ళు టి వి చూడడం పనిగా పెట్టుకుంటున్నారు. ఒక పరిశోదనలో టి వి సమయంలో సివిడి, వి టి ఇ ను పూర్తిగా పరీక్షించారు. వారి పరిశోదనలో టి వి చూసిన వారిలో వి టి ఇ పరిశీలనలో ప్రజలకు వీటి ఇ స్థితిని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు. దీర్ఘ కాలం పాటు టి వి చూసే అలవాటు ఉన్నట్లయితే వి టి ఇ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. సాధారణంగా కనుగొన్న వాటిలో అందరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలని డాక్టర్ సితార్ కునుస్టార్ పరిశోదన బృందానికి నేతృత్వం వహించారు. టి వి చూస్తూ ఉండాలంటే మధ్య మధ్య లో విరామం ఇచ్చి చూడవచ్చని ఆ సమయంలో ప్రతి 3౦ నిమిషాలకు చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలని సూచించారు. కొందరిలో ఉద్యోగ రీత్యా ఎక్కువసమయం కూర్చొని ఉండడం గమనించవచ్చు. మధ్య మధ్య లో శారీరకంగా కొంత విరామం అవసరమని పేర్కొన్నారు కాగా అతిగా శ్రమ పడడం నుంచి కొంత తగ్గించాలి. సేడేన్ టరీ బిహేవియర్ నుండి బయట పడాలి.  మెటా ఎనాలసిస్... 28 సంస్థలు జరిపిన పరిశోదనలో టి వి చూసే వారు మొదట వి టి ఇ పై పరిశోదన జరిగిందని ఈ అంశాలను 2౦ 16 - నుండి 2౦21 మధ్య ఈ అంశాన్ని ప్రచురించారని. ఈ పరిశోదనలో 131 ,-421 మంది పాల్గొన్నారు. యు ఎస్, జపాన్ తొలి నాళ్లలో పరిశోదనలో పాల్గొన్నారని పాల్గొన్న వారు అందరూ 54 స్మ్వత్సరాల నుండి 65 సంవత్సరాల వారే అని తెలిపారు. పరిశోదనలో 5.1 నుండి 19.8 సం పరిశోదనలు జరిగాయి. అందులో 96 4 వి టి ఇ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అన్నిరకాల పరిశోదనలు టి వి చూసే సమయం లో నే వారే స్వయంగా ప్రశ్నావళి ని వి టి ఇ రిస్క్ ఫాక్టర్ ను అందులో వివరించారు. ఆ ప్రశ్నావళి లో వారి పేరు వారు స్త్రీల, పురుషుల, వారి బి ఎం ఐ వివరాలు శరీర వ్యాయామం వివరాలు తెలియ చేసారు. వారు ఇచ్చిన డాటా సమాచారం ప్రకారం పరిశీలించగా పరిశోదనలు 4 గం లకు పైగా టి వి చూసినటు వంటి వారు 35% వి టి ఇ ప్రమాదం ఉందని. 2.5 గం లు టి వి ని చూసే వారిలో రిస్క్ తక్కువే అని తేల్చారు.   ఇమ్ముబలై జేషన్ --అంటే అస్సలు కదలక పోవడం... పరిశోధకులు చేసిన పరిశోధనలలో కొన్ని అంశాలు టి వి చూడడం వల్ల అలాగే కదలికలు లేకుండా అలవాటుగా మారిపోతుంది. దీనివల్ల వీటి ఇ వల్ల రిస్క్ ఎక్కువే అని తేల్చారు. అందుకు గల కారణాలలో శరీరం బరువు పెరగడం. హై బిపి లిపిడ్స్, ఇంఫ్లామేషణ్ పెరగడం ఫ్లాస్మా, విస్కో సిటి,ప్లేటి లేట్ ఎగ్రివేషణ్ వంటిసమస్యలు గుర్తించినట్లు తెలిపారు. వీనస్ స్టేటస్ ఎక్కువశాతం కూర్చోవడం వల్లే వస్తోందని, రక్త ప్రవాహం కింది భాగం నుండి గుండెకు తిరిగి చేరుతుంది. అలాగే చాలామంది టి వి చూస్తూ చిరుతిండి తినడం వాటిలో పోషక విలువలు లేని ఆహారం తినడం వీటి ఇ రిస్క్ ఎక్కువేఅని నిర్ధారించారు. వారు ఎంత ఆహారం తీసుకుంటున్నారు. అన్న అంశం చేర్చలేదు. దాదాపు గుండెకు సంబందించిన కార్డియో మెటాలిక్ ఇంఫ్లామేషణ్ ఉన్నట్లు ప్రొఫెసర్ వెండి బ్రౌన్ హ్యూమన్ మూవ్మెంట్ న్యుట్రిషియన్ సైన్స్ అంశంలో పి హెచ్ డి చేసారు. క్వీన్లాండ్ విశ్వ విద్యాలయం లో ఆస్ట్రేలియాకు చెందిన పరిశోదనలో పాల్గొన లేదు. నా అంచనా ప్రకారం వెనల్ పూలింగ్ అత్యవసరం వెనస్ లో సమస్యల కు కారణం నేలపై కూర్చోక పోవడం అయుతే దేర్ఘ కాలం పాటు నిల్చునే ఉంటునారు. అదీకాక చాలా సేపు సుదీర్ఘ కాలం కూర్చునే ఉండడం గుర్తించారు. అదీ కాక విదేశాల కు వెళ్ళే వాళ్ళు ఫ్లైట్ లో అరరోజుకు పైగా ప్రయాణం లో కూర్చునే వారికి వి టి ఇ వస్తుందని అంటున్నారు నిపుణులు. కునుస్టార్ బృందం చేసిన సూచనల మేరకు టి వి చూడడం వల్లే రక్తం గడ్డ కట్టడానికి కారణం. దా నికి కారణం అక్కడ కదలికలు లేక పోవడమే. దీర్ఘకాలం పాటు కూర్చోవడమే అని కుడ్ బిస్వాస్ సహాయక ప్రోఫెసర్ సామాజిక ప్రవర్తన బిహేవిరియల్ హెల్త్ సైన్సెస్ తోరంతోకి చెందిన వీరి బృందం వెల్లడించింది. టి వి చూసే అలవాటు వల్ల చాలా మంది వ్యక్తులలో ప్రతిరోజు కూర్చునే సమయం ఎక్కువగా ఉండడం వల్ల రక్త నాళాలలో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. తద్వారా వ్యాస్క్యులర్ పనిచేయకుండా ఉండి పోతుంది. దీనికరనంగానే గుండెపోటు వస్తుంది. దీనికన్నా తక్కువగా వ్యాయామం చేసేవారిలో కొంచం తక్కువగా ఉంటుంది. ఇంఫ్లామేషణ్ తగ్గడం ఇతర గుండెపోటుకు సంబంధించి పలు సమాస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి అతిగా కూర్చున్న జబ్బే. టివి ముందు కూర్చున్న జబ్బే కొంచం జాగ్రత్త. 

యూత్ మంత్రం!! సక్సెస్ మంత్రం!! 

  ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే ఏదో ఒక ఉపాధి ఉండాలి. ఉపాదులు బోలెడు ఉన్నా దాన్ని చేరుకునే దారి కనబడాలి. నేటి సమాజంలో నిరుద్యోగం బోలెడు ఉంది. అదంతా మనుషులకు సరైన దారి కనిపించక పోవడం వల్ల ఎదురవుతున్న సమస్యనే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆదాయ మార్గం కనబడితే, అందులో తృప్తి కూడా దొరికితే అప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో కూడా నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.  చాలామంది అనుకుంటారు చేస్తున్న పనిలో తృప్తి దొరకడం లేదు అని కానీ బయట సమాజంలోకి  తొంగిచూస్తే పనులు దొరకక సతమయ్యేవాళ్ళు ఎందరో కనబడతారు. అందుకే ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ మరొకరికి కూడా బోలెడు దారులు చూపించవచ్చు. నేటి యువతలో చాలామంది ఇలాంటి ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారు.  అభిరుచి ఆదాయం!! అభిరుచి ఆదాయం రెండూ సమర్థవంతంగా ఉన్న పనులు చేస్తున్నవాళ్ళు బహుశా తక్కువే ఉండవచ్చు. అయితే అభిరుచి కొద్దీ కొన్ని అవకాశాలు వదిలి కొత్తగా ప్రయోగాలు చేసి బోలెడు మందికి ఉపాధి కల్పిస్తున్న  నేటి యువత గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా ఛాలెంజ్ లు తీసుకుంటూ సాగే మార్గాలను నేటి యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిలో విజయాలు సాధించి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఐకాన్ లుగా మారుతున్నారు. కష్టం, ప్రోత్సాహం!! ఒక రూపాయిని కష్టపడి సంపాదిస్తేనే ఆ రూపాయిని వృధా చేయకుండా ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయం అర్థమవుతుంది. ఆ కష్టం తాలూకూ విలువ ఆ రూపాయిలో ప్రస్ఫుటం అవుతుంది. ఈ విషయం బాగా తెలిసినవాళ్లకు చాలా చోట్ల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాడు ఏ పని పట్ల అయినా బాధ్యతగా ఉండగలుగుతాడు. ఇచ్చిన పనిని సమర్థవంతంగా చేయగలుగుతాడు. కాబట్టి కష్టం తెలిసిన వాడికి ఏదో ఒక సాండ్స్ర్భంలో ప్రోత్సాహం కూడా లభిస్తుంది కచ్చితంగా. విభిన్నత, ఆత్మవిశ్వాసం!! విభిన్నంగా ఏవైనా ఆలోచిస్తే హేళన చేసేవాళ్ళు బోలెడు కనబడతారు చుట్టూ. అయితే ఆ విభిన్నతను  అంతే విభిన్నంగా ప్రెజెంట్ చేస్తే మాత్రం ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఈకాలంలో యువత అయితే విభిన్నంగా ఆలోచిస్తున్నా ప్రోత్సాహం లేకపోవడంతో తమలాంటి ఆలోచన ఉన్నవాళ్ల కోసం వెతికి వాళ్ళతో ఒక సమూహం ఏర్పడి తాము అనుకున్న పనిని అందరూ కలసి ఒక్కటిగా తమ అభిప్రాయాలు, ఆలోచనా  విధానాలు పంచుకుంటూ తాము అనుకున్నది చేది చూపిస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు తమ పట్ల తమ ఆలోచనల పట్ల నమ్మకం ఉండటమే ప్రధానం విజయ సూత్రం. అందుకే ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి పనిని అయినా తప్పకుండా చేసి చూపించగలదు నేటి యువత. విద్య, ఉపాధి!! నిజం చెప్పాలంటే విద్యార్హతకు తగ్గ ఉపాధి వెతుక్కోవడం నేటి కాలంలో పరిపాటి. కానీ విద్యకు ఉపాధికి సంబంధమే లేదని ఎందరో విజయాలు సాధించి చెబుతూనే ఉన్నారు. తమలో ఉన్న ప్రత్యేకతని మెరుగుదిద్దుకుని దాన్నే ఉపాధిగా మార్చుకుంటున్న వాళ్ళు ఎప్పటికీ విఫలం కావడం అనేది ఉండనే ఉండదు. కానీ మూర్ఖులు మాత్రం ఎంత చదివారు అనేది చూస్తారు కానీ ఎంత నైపుణ్యత ఉంది అనేది గమనించుకోరు. ఈ విషయంలో యువత తమని తాము నమ్మడం మాత్రమే మొదటి విజయం అనుకోవచ్చు.  పై విషయాలు అన్నీ చూస్తే ప్రభుత్వాలు, వాళ్ళు విడుదల చేసే నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీలు. రిజర్వేషన్లు ఇతలాంటి తలనొప్పులు ఏమీ లేకుండా హాయిగా తమ జీవితాన్ని తమ చేతుల్లోనే డీల్ చేసుకోగలిగే ఆలోచన నేటి యువతలో మరింత పెంపొందాలి. అప్పుడే సక్సెస్ మంత్రం వాళ్ళ చేతుల్లో పట్టుబడుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

విహారయాత్రికుల విరహం!!

ఒక్క చోట కుదురుగా ఉండాలి అంటే కొందరికి మహా బద్దకం. దానికి తగ్గట్టు ఇల్లు, ఉద్యోగం, ఒత్తిడులు వీటి నుండి బయటపడటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాటిలో చదవడం, సంగీతం, వివిధ రకాల విభిన్న ప్రయత్నాలు, ట్రెక్కింగ్ ఇంకా కొందరు డాన్స్, యోగ, ధ్యానం ఇలాంటివి అన్ని స్ట్రెస్ బస్టర్ గా భావిస్తూ వుంటారు. అలాంటి వాటిలో ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ అంశం ట్రావెలింగ్. వివిధ ప్రాంతాలను దర్శించడం వల్ల విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకోవడమే కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు కూడా ఎంతో అవకాశం ఉంటుంది. కొత్తదనాన్ని కోరుకునే వాళ్లకు ఇది ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రాచీన కట్టడాలు, ప్రత్యేకత సంతరించుకున్న ప్రాంతాలు, సహజత్వాన్ని నిలుపుకున్న ప్రదేశాలు, నీటి వనరులు, పచ్చని చెట్లు, జంతు సంపద సమృద్ధిగా ఉన్న చోట్లకు వెళ్ళడానికి అందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక ఎంతోమంది ప్రసిద్ధ దైవ క్షేత్రాల దర్శనం పేరిట కూడా ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఉంటారు. ఇలాంటి చోట్లకు వెళ్ళొస్తే కొత్త ఊపిరి దొరికినట్టు అవుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతాలు ఉనికిని కోల్పోయే దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా సహజత్వం నింపుకున్న ప్రకృతీ నిలయమైన ప్రదేశాలు వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి.  ఇదంతా ఒకటైతే ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇలా విహరించే పక్షులకు బంధనాలు వేసాయని చెప్పవచ్చు.  కరోనా మొదలయినప్పటి నుండి ఇంటి పట్టున ఉండటం వల్ల ఎంతోమంది ఒత్తిడిలో సతమతం అవుతున్నారు. రెక్కలు కట్తుకుని స్వేచ్ఛగా వీధుల్లోనూ, విహారాల్లోనూ మునిగిపోయే అలవాటున్న అలాంటి వాళ్లకు సంకెళ్లతో బంధించినట్టు వర్క్ ఫ్రొం హోమ్ లు ఇవ్వడం ఇంకా దూర ప్రయాణాలు విరమించుకోమని నిబంధనలు పెట్టడం ఇలాంటి వల్ల పక్షులను పంజరాల్లో బంధించినట్టే ఉంది. ఇలాంటి వాళ్లకు కాస్తో కూస్తో ఒత్తిడిని తగ్గించే మార్గాలు చుట్టూనే ఉంటాయి వాటిని కాస్త అనుసరిస్తే కొంచమైనా మనసుకు హాయిగా ఉంది. ఆహ్లాదం అనడం ఉదయం!! ఉదయకాలం లేలేత ఎండలు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. వీలున్నంత స్థలమో, దగ్గరలో ఉన్న పార్కులో, లేక ఇంటి మేడ ఇలా ప్రాంతం ఏదైనా ఉదయం లేత ఎండను ఆస్వాదిస్తూ అభిరుచికి  తగ్గట్టు వ్యాయామం, ధ్యానం, ఏరోబిక్స్ లేదా నడక ఇలాంటివి  ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.  కాబట్టి రోజును ఇలా మొదలుపెడితే రోజు మొత్తం తగినంత ఉత్సాహంగా ఉండచ్చు. ఒత్తిడిని దరిదాపులకు రానీయకుండా ఉంటుంది. మొక్కల పెంపకం!! ఎంతో గొప్ప అలవాటు. రోజులో వీలున్నపుడు కొద్దిసేపు మొక్కల దగ్గర గడిపితే అది ఎంతో గొప్ప ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆ వైబ్రేషన్ మనిషిని రోజు మొత్తం పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది. పెంపుడు జంతువులతో గడపడం!! పెంపుడు జంతువులకు మించి గొప్ప స్నేహితులు ఉండరని అనిపిస్తుంది. అవి చూపించే ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం మనుషుల దగ్గర కూడా దొరకవు. కాబట్టి వాటితో గడపడం వల్ల ఒత్తిడి సులువుగా దూరమవుతుంది. పుస్తకపఠనం!! నిజానికి ఎక్కడికీ వెళ్లకుండా వివిధ ప్రదేశాలను చూసిన ఫీల్ కలగాలి అంటే దానికి మార్గం అద్భుతమైన చారిత్రక ప్రదేశాల గురించి వెలువడిన పుస్తకాలు చదవడం. ఇది పుస్తకపఠనం అనే మంచి అలవాటును కూడా పెంపొందిస్తుంది. అలాగే ఆ ప్రాంతాల వెనుక ఉన్న సంఘటనలు, సందర్భాలు వంటివి కూడా క్షుణ్ణంగా అర్థమవుతాయి. ఇదే కోవలోకి వచ్చేది డాక్యుమెంటరీస్.  ఇందులో కూడా విషయన్ని ఎంతో వివరంగా విశ్లేషించి చెబుతూ ఉంటారు. కాబట్టి వాటిని హాయిగా చూసేయచ్చు.  చిన్ని చిన్ని ఆనందాలు!! కొందరికి దూరప్రాంతాలు వెళ్తేనే కిక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గరలోనే కాస్త ప్రకృతీ రమణీయత సంతరించుకున్న ప్రదేశాలను కనుగొనగలిగితే అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి హాయిగా గడపచ్చు. ఇలా విహారాయత్రలను మిస్సయిపోతున్న భావాన్ని భర్తీ చేసుకుని హాయిగా ఉండచ్చు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  

బాలికల బంగారు అడుగులు!! 

  ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. బుల్లి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు భావించేవారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయడం. ప్రసవం అవ్వగానే ఆడపిల్ల అని తెలియగానే వెంటనే అమ్మేయడం లేదా చెత్త కుప్పలో పడేయడం. ఆడపిల్లను  విలాసవస్తువుగా  మార్చడం. ఇవన్నీ భారతదేశం అంతటా పాతుకుపోయి ఉన్నాయి. సుమారు దశాబ్ద కాలం కిందట ఇలా అమ్మాయిలను భూమిధ పడకముందు మరియు భూమి మీద పడ్డాక తుంచేయడం ఎక్కువగా ఉండేది. పలుతంగానే ప్రస్తుతం అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తితో పోలిస్తే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. నిన్నటి పసిబిడ్డలే ఈరోజు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అన్నట్టు. ఈరోజు పెళ్లి కావలసిన అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం. ఇప్పట్లో అబ్బాయిలు పెళ్లి కాకుండా మిగిలిపోతుండటానికి కూడా కారణం అవుతోందని చెప్పవచ్చు.  ఇంత విషయం ఆడపిల్లలను తుంచేయడం వల్ల జరుగుతోంది. దీని కోసం ఏర్పాటైనదే జాతీయ బాలికల దినోత్సవం. ప్రతి రోజు వెనుకా ఒక మంచి ఆశయం ఉన్నట్టే, ఈ జాతీయ బాలికల దినోత్సవం వెనుక కూడా గొప్ప ఆలోచనలు ఉన్నాయి. సంరక్షణ!! సమాజంలో ఆడపిల్లలను సంరక్షించుకోవడం రోజురోజుకు కష్టంగా మారిపోతోంది కారణం గద్దలు కోడిపిల్లల్ని తన్నుకుపోయినట్టు కొందరు ఆడపిల్లల్ని అపహరించడం, శారీరకంగా వేధించడం, స్మగ్లింగ్ చేయడం, రెడ్ లైట్ ఏరియాలలో అమ్మేయడం. ఇట్లా అన్ని విషయాల నుండి ఆడపిల్లలకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంది. ఆ సమస్యలన్నింటి నుండి ఆడపిల్లను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు స్కూల్స్ కు వెళ్లడం, తిరిగి రావడంలోనే బోలెడు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. హక్కుల కానుకలివ్వాలి!! ఆడపిల్లలకూ కొన్ని హక్కులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది చదువుకోవడం. ఆడపిల్లకు చదువు ఎందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు. అంతరిక్షానికి వెళ్లొచ్చిన ఆడపిల్ల అంటారు అందరూ కానీ గమనించాల్సిన విషయం ప్రతి ఆడపిల్ల అంతరిక్షానికి వెళ్ళలేదు కాబట్టి ప్రతి ఆడపిల్ల అంతరిక్షం కాదు కనీసం ధైర్యంగా బయటకు వెళ్లి రాగలిగే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లింగ వివక్షత లేకుండా చక్కగా చదువుకోవాలి. ఎంతోమంది మహిళలు పోరాటం చేసి మరీ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కాబట్టి చదువుకోవడం, తగినంత స్వేచ్ఛ, లింగవివక్షత లేకుండా చూడటం.  ప్రతి ఆడపిల్లకూ తప్పనిసరిగా అందివ్వాల్సిన హక్కులు. ఎదుగుదలకు చేయూతనివ్వాలి!! చిన్న ఆసరా దొరికితే అంచెలంచెలుగా ఎదిగిపోయే వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ కోవలో ఆడ, మగ ఇద్దరూ ఉంటారు కూడా. కానీ సమాజంలో చూస్తే మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు ఇలాంటి చేయూత కాస్త తక్కువగా ఉండేది. అలాంటి వాళ్ల అభివృద్ధి కోసం ఎన్నో స్వచ్చంధ సంస్థలు ముందుకొచ్చి నడుం బిగించాయి. పాలితంగా స్త్రీలకు ఎన్నో ఉపాధి మార్గాలు ఇప్పట్లో చాలా చోట్ల ఉన్నాయి. ఇక ముఖ్యంగా బాలికలకు ఉత్తమమైన విద్యను అందించడం ద్వారా వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవడానికి చేయుతనిచ్చినట్టు అవుతుంది. ఏ ఆడపిల్ల ఆర్థిక సమస్యల వల్ల చదువు ఆపే పరిస్థితి రాకుండా చూడటం సమాజం, ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు కలసికట్టుగా చేయవలసిన పని. ఆహారం!! ఆహారం ఎంతో ముఖ్యమైనది.  ప్రతి ఆడపిల్లకు తన జీవితంలో పీరియడ్స్ లోకి అడుగుపెట్టడం అనేది తప్పనిసరి. అయితే శరీరంలో కలిగే మార్పులను అనుసరించి పోషకారం కూడా తప్పనిసరి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో పోషకార లోపంతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, మహిళల శాతం ఎక్కువ. కాబట్టి మంచి ఆహారం పొందడం ఆడపిల్లల హక్కు, అందించడం ప్రభుత్వ, కుటుంబ బాధ్యతలు. ఇట్లా విద్య, వైద్యం, హక్కులు, ఎదుగుదల ముఖ్యంగా లింగవివక్ష అరికట్టడం ప్రతి ఆడపిల్ల జీవితానికి అందరూ కలసి అందించాల్సిన ముఖ్య అవసరాలు!! ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆహార మార్గాలే ఆరోగ్య సూత్రాలు!! 

  ఆహారం మనిషికి శక్తివనరు. అది లేకపోతే ఈ శరీరం కాలంతో పాటు కదలదు. అయితే చాలామందికి శరీరం మీద వ్యామోహం ఉంటుంది, ఆహారం మీద వ్యామోహం ఉంటుంది కానీ ఆరోగ్యం మీద స్పృహ కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ ఆరోగ్య స్పృహ తక్కువ వుండటం వల్లనే ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉన్నాడు. వాటికి పరిష్కారం వాడే మందుల్లో ఉండదు, తీసుకునే ఆహారం తీసుకునే విధానంలో ఇంకా చెప్పాలంటే తీసుకునే తీరులో ఉంటుంది. ఏమి తింటున్నాం?? ఎలా తింటున్నాం?? ఆహారమే అమృతం అంటారు పెద్దలు. ఒకప్పటి కాలంలో మనిషికి రోగం వస్తే ఆహారాన్నే ఔషధంగా పెట్టేవారు. పత్యం, కషాయం లాంటివి ఇస్తూ రోగాన్ని తరిమికొట్టేవారు. కాన్సర్ లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మహిళల గర్భాశయ సమస్యలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కానే కాదు. పాశ్చాత్య జీవన విధానం ఎప్పుడైతే ఇక్కడ మొదలయ్యిందో అప్పుడే ఇక్కడ రోగాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అంటే ఆహారంలో అలవాట్లు, ఆహారం తీసుకునే విధానంలో మార్పులు ఎంతో స్పష్టమైపోయాయి జీవితంలో. పచ్చిగా తినాల్సినవి ఉడికిస్తూ, ఉడికించి తినాల్సినవి వేయిస్తూ, వేయించాల్సినవి కాలుస్తూ, ఇట్లా ఆహారాన్ని గందరగోళం చేయడం మొదలుపెట్టాకే మన జీర్ణవ్యవస్థ గందరగోళం అయ్యి, ఆరోగ్యం అయోమయం అయిందని చెప్పచ్చు. ప్రోటీన్లు, పోషకాలు ఎక్కడున్నాయి?? అందరికీ ప్రోటీన్లు, పోషకాలు అంటే మాంసాహరమే గుర్తొస్తుంది. నిజానికి మన భారతీయ అసలైన పోషకాలు ధాన్యాలు, గింజలు, పాలు వంటి వాటిలో ఉంది. ఒకప్పుడు అందరూ నువ్వులు, బెల్లం, పాలు, పంట ధాన్యాలు, పల్లీలు, పప్పులు ఇవి మాత్రమే కాకుండా ఉలవలు, అవిసెలు వంటివి విరివిగా వాడేవారు. దానివల్ల శరీరం ఎంతో పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మినపసున్నుండలు మన ఆహార సంపదలో గొప్పగా చెప్పుకోదగ్గవని, అవి మాంసహారాన్ని మించి పోషకాలు అందిస్తాయని అందరికీ తెలిసిందే. అందుబాటులో ఇన్ని ఉన్నా మనుషులు మాంసాహారం కోసమే తహతహలాడటం ఏమిటో మరి!!  ఉత్పత్తులు ఉత్తుత్తి బడాయిలు!! మీ పేస్ట్ లో ఉప్పు ఉందా?? ఇదిగో కొత్త ప్రొడక్ట్ ఇందులో ఉప్పు ఉంది. పళ్ళను బలంగా చేస్తుంది. నారింజ పోషకాలు నిండిన డ్రింక్, విటమిన్ సి ను సమర్థవంతంగా శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరిగేపిల్లల కోసం కొత్త హెల్తీ  డ్రింక్. ఒక స్పూన్ పొడి పాలలో కలిపిస్తే రోజుకు మొత్తం కావాల్సిన పోషకాలు అందుతాయి. అబ్బాబ్బా ఏమైనా ప్రచారాలా ఇవి. కాస్త దుచి కోసం ఎక్కలేని రసాయనాలు కలిపి దాన్ని పోషకాల డ్రింక్ గానూ, పోషక పదార్థాలుగానూ కలర్ ఇస్తూ వందల, వేలకు అమ్ముతూ కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పుకుంటున్నాయి.  ఫ్యాక్టరీలలో బాదం, నువ్వులు, పల్లీలు వంటి నూనె గింజల నుండి నూనె ఉత్పత్తి చేయగా మిగిలిన పిప్పితో ఈ హెల్త్ డ్రింక్ లు తయారు చేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఈ మాయజాలన్ని గుర్తించక అందులో పడిపోతున్నారు పిచ్చి జనం. ఏది అసలైన ఆహారం!! నానబెట్టిన పల్లీలు ఎంతో గొప్ప పోషకం, అలాగే  నువ్వులు, బెల్మ్, అవిశేలు, ముఖ్యంగా ఉలవలు. అవి వేడి చేసినపుడు వేడి తగ్గడానికి ప్రత్యామ్నాయంగా పెసలు. ఇంకా జొన్నలు, రాగులు, సద్దలు, వీటితో పాటు సిరిధాన్యాలు. ఇవన్నీ గొప్ప ఆహారం. బాటల్స్ లో ఉన్న పండ్ల రసాలకు బదులు తాజాగా ఉన్న ఒక్క పండు తిన్నా ఎంతో ఆరోగ్యకరం. అలాగే వండిన ఏ పదార్థమైనా గంట లోపు గింటే అది గొప్ప అమృత గుణం కలిగి ఉంటుంది. ఇట్లా భారతీయ ఆహార సంపద, అది చేకూర్చే ఆరోగ్యం, అనారోగ్యానికి అవే విరుగుడు. ఇవన్నీ తెలుసుకుంటే మన ఆహార మార్గాలే ఆరోగ్య సూత్రాలు అవుతాయి. ◆ వెంకటేష్ పువ్వాడ

హిమ శిఖరం బోస్ !!

హిమాలయాలకు ఉన్న ఖ్యాతి ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఎంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన శిఖరాలు ఇవి. భారతదేశానికి పెట్టు గోడల్లా రక్షిస్తున్నాయి హిమాలయాలు. భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్ళు తమ ఉక్కు గుప్పిళ్లలో బంధించి, బానిసత్వాన్ని శాసించినపుడు, ఏళ్లకేళ్లుగా పోరాటాలు జరుగుతున్నా గొంతెత్తి గర్జించిన నాయకులు కొందరే ఉన్నారు. అలాంటి సాహసవంతమైన నాయకులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరు. నేతాజీ అని బోస్ అనీ ముద్దుగా అందరూ పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ భారతీయ యువతకు బహుప్రియమైన నాయకుడు. ఉన్నత విద్యావంతుడూ, గొప్ప ఆలోచన, నేర్పయిన  వ్యూహాలు అందించగల సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం ఎన్నో గొప్ప ప్రణాళికలతో, వ్యూహాలతో ముందుకెళ్లారు.  బాల్యం!! బోస్ సంపన్నమైన కుటుంబంలో జన్మించారు. అందువల్ల బాల్యంలో ఇబ్బందులేవీ ఆయన్ను వెంటాడలేదు. తండ్రి లాయర్ కావడంతో మంచి జీవితం, ఉన్నత విద్య బోస్ కు లభించాయి. ఈయన తండ్రి కూడా జాతీయవాది కావడంతో ఆ ప్రభావం బోస్ పై ఆ నాటి నుండి పడిందని చెప్పవచ్చు. పాఠశాల, కాలేజీ విద్యలో ఎంతో మంచి విద్యార్థిగా నిలిచాడు బోస్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఎంతో ఉన్నతమైన భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి నాలుగవ స్థానంలో నిలిచారు. అంత సాధించినా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ఆలోచనతో ఆ సివిల్ సర్వీస్ నుండి బయటకొచ్చేసాడు. భారతజాతీయ యువజన విభాగంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు బోస్. అణిచివేత!! బోస్ లో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఎంతో గొప్పది. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలనే ఆలోచనతో ఎంతో తెలివిగా ప్రణాళికలు రచించేవారు. అందులో భాగంగానే సాయుధ పోరాటంతో బ్రిటీష్ వాళ్ళను ఎదిరిస్తే స్వాతంత్య్రం తప్పక వస్తుందని భావించి అటువైపు ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే ప్రతిచోటా ప్రతిభ కలిగిన వారిని అణిచివేసి పలితాన్ని తమ పేరుతో చూసుకోవాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారా అణిచివేత మొదలయ్యింది. అతివాదంలో అంతరార్థం!! నిజానికి స్వాతంత్ర్య ఉద్యమంలో అతివాదులు, మితవాదులు అంటూ రెండు వర్గాలుగా చేసి ఎందరో నిజమైన నాయకులను అణిచివేసిన ఘనత, స్వాతంత్ర్య ప్రాముఖ్యతను తమ ఖాతాలో వేసుకున్న భారత నాయకులు ఉన్నారు. వాళ్ళందరి ఆలోచనల వెనుక స్వార్థమో, స్వలాభాపేక్షో బోలెడు ఉందని ఈ భారతంలో ఇంకా తెలుసుకోలేని మూర్ఖులు అంటూ ఎవరూ లేరనే అనుకోవచ్చు. నిజానికి వారసత్వ రాజకీయం భారతదేశంలో మొదలయ్యిందే ఆ స్వాతంత్ర్య ఫలితంలో అని కూడా అందరికీ తెలుసు. నిందలు, విమర్శలు!! భారగదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ కు శతృదేశాలను కలుపుకుని సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని ఎన్నో ప్రణాళికలు వేసాడు బోస్. అయితే ఇది ఆయన మీద నిందలకు, విమర్శలకు దారి తీసింది. కొందరు మూర్ఖులు అవలంభిస్తున్న మార్గానికి ఇది వ్యతిరేకమని, గట్టిగా మాట్లాడేవారిని అతివాదులని అణిచివేస్తూ బోస్ ను కూడా వెనక్కు నెట్టిన చేతులు ఎన్నో ఉన్నాయి.  జైహింద్ నినాదమొక సింహగర్జన!! భారత్ యావత్తును ఉపేసిన నినాదం "జైహింద్". భారత యువతను చైతన్యపరిచి స్వాతంత్ర్య సంగ్రామనికి పిలుపునిచ్చిన శక్తి తేజం ఈ మాట. అది బోస్ గొంతు నుండి వింటే ఒకానొక సింహగర్జన దేశమంతా ధ్వనించినట్టే ఉండేదట. దేశాన్ని దేదీప్యమానంగా వెలిగింపజేయాలని ఆరాటపడిన బోస్ కు మాత్రం  దేశ బహిష్కరణ, దేశం నుండి వ్యతిరేకతలే లభించిన బహుమానాలు అనిపిస్తాయి. అడుగడుగునా అన్యాయం!! భారతజాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైనా ఆయన ఆ పదవిని వదిలేసుకున్నారు. దీనికి కారణం గాంధీ అనే విషయం అందరికీ తెలిసిందే. నేతాజీ చేసే ప్రతి పనీ మీద వ్యతిరేకత చూపించి ఆయన్ను పూర్తిగా భారతదేశ ఉనికి నుండి తప్పించాలని చూసింది కూడా వీళ్లే. చివరకు బోస్ చనిపోతే "సుభాష్ చంద్రబోస్ చాలా బాగా చనిపోయారు" అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చింది కూడా ఆ అహింసా వాది, దేశ స్వతంత్ర్యాన్ని బ్రిటీష్ వారి నుండి తన గుప్పెట్లో పెట్టుకున్న వారే.  కానీ చరిత్రలో ఎక్కడో నాలుగు పేజీలలో నిలిచిపోయిన ఈ సత్యాలు నేటి భారత పౌరులకు అక్కర్లేదంటూ ప్రభుత్వమే తమ వంశాలకు అనుగుణంగా పాఠాలను కూడా తయారు చేయించి దశాబ్దాల పాటు పౌరుల బాల్యం నుండే స్వతంత్ర్యానికి చిరునామాగా నిలుస్తూ ప్రతి బడిలోనూ పూజించబడుతూ ఉన్నాయి. నిజమైన నాయకుల జీవితాలు తెలుసుకోవలసిన బాధ్యత అందరిమీదా ఉంది. చివరకు మరణం కూడా ఒకానొక మిస్టరీగా మిగిలిపోయిన బోస్ లాంటి వీరులను భారతం స్మరించుకోవాలి. ఆ హిమశిఖరాలకు, ఈ భూమికి, నదీనదాలకు తెలిసిన నిజం మనకూ తెలియాలి. ◆ వెంకటేష్ పువ్వాడ

సంగీతం ఒక టానిక్!!

సంగీతం ఓ ఔషధం అంటారు చాలామంది.మనిషిలో కదలికలు తెప్పిస్తుంది, శిలను కరిస్తుంది. భావాలకు ప్రాణం పోస్తుంది. అలాంటి సంగీత సామ్రాజ్యం ఎంతో పెద్దది. సాంప్రదాయక సంగీతం, ఆధునిక సంగీతం అని రెండు భాగాలుగా విభజించబడినా సంగీతం ఒలలాడిస్తుందే తప్ప నిరాశపరచదు. అలాంటి సంగీతంలో సాంప్రదాయక సంగీతం మరింత విశిష్టమైనది. కర్ణాటక, హిందూస్థానీ, ఫోక్ వంటి వర్గాలుగా ఈ సాంప్రదాయక సంగీతం విభజించబడ్డా వీటిలో కర్ణాటక సంగీతం బహురమ్యమైనది. ఈ కర్ణాటక సంగీతాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన మహానుభావుడు త్యాగయ్య. తన ప్రతి వ్యక్తీకరణను కృతులుగా, గీతాలుగా మార్చి సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన రారాజు త్యాగయ్య.  తన సంగీతాన్ని ఆ శ్రీరాముడిని స్తుతించడానికి ఉపయోగించాడే తప్ప ఏనాడు తన ప్రతిభను ప్రచారం చేసుకోవడానికే ఉపయోగించని గొప్ప కళాహృదయం కలిగిన వాడు త్యాగయ్య. ఆ శ్రీరామ చంద్రుడిని తొంభై ఆరు కోట్ల సార్లు నామాజపం చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నాడని, శ్రీరామచంద్ర ప్రభువు ఈయనకు దర్శనం ఇచ్చాడని చెబుతారు అందరూ. స్వరరాగ ప్రయాణం!! పదమూడు సంవత్సరాల వయసులోనే "నమో నమో రాఘవా" అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరిచి గురువు మెప్పు పొందాడు.  "ఎందరోమహానుబావులు" అంటూ సాగే ఈయన కీర్తన ఎంతో బాగుంటుంది.  తంజావూరు రాజు ఎంతో డబ్బు, బంగారం ఇవ్వబోతే వాటిని సున్నితంగా తిరస్కరించి "నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాలు నిజమా" అంటూ ఆలపించి తనకు అన్నిటికన్నా ఆ రామచంద్రుడిని కృతులలో అర్చించడమే తనకు నిజమైన సంపద అని అదే తనకు తృప్తి అని చెబుతాడు. సంగీతంలో ఉన్న రాగాన్ని, తాళాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఆయన ఎన్నో కృతులను అందించారు సంగీత సామ్రాజ్యానికి.  రామ వియోగమూ….దుఃఖసాగరమూ….. రాముడంటే త్యాగరాజుకు ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ అంతా తనకు తండ్రి ఆస్తిలో లభించిన శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలే. ఆ విగ్రహాలను పూజిస్తూ, ద్యానిస్తూ, సేవిస్తూ, అర్చిస్తూ, ప్రేమిస్తూ రాముడిని అన్ని విధాలుగా  అంటిపెట్టుకుని ఉండేవాడు. కానీ రాజు ఇచ్చిన కానుకలను వద్దన్నాడనే కోపంతో త్యాగయ్య గారి అన్నయ్య ఆ శ్రీరాముడి పట్టాభిషేక విగ్రహాలను తీసుకెళ్లి కావేరీ నదిలో పడేసాడు. అప్పుడే ఆయన బాధలో కూడా "ఎందు దాగినావో" అంటూ ఆలపించిన కృతి మనసును కదిలిస్తుంది.   విగ్రహాలు పోయేసరికి రాముడి తనను వదిలిపోయినంత దుఃఖించాడు త్యాగయ్య. వెంటనే ఊరు విడిచి తీర్థయాత్రలకు వెళ్లి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. అలా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళినపుడు అడ్డుగా తెర ఉండటంతో అప్పటికపుడే "తెరతీయగరాదా" అని ఆలపించగానే ఆ తెర దానంతకదే  తొలగిపోయి వెంకటేశ్వరస్వామి దర్శనం కలిగిందని, దాని వెనుక మహత్యం వెంకటేశ్వరస్వామిదే అని అంటారు.  చివరికి ఆ రామచంద్రుడి కరుణకు పాత్రుడయ్యాడు. ఆయన ఆలపించిన "గిరిపై పరితాపం" అవే చివరి పాటలు అయ్యాయి. తరువాత ఆయన ఆ శ్రీరాముడిలో ఐక్యం అయిపోయారు. ఆరాధనోత్సవాలు!! ప్రతి సంవత్సరం పుష్యమాసంలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతారు. అక్కడ ఆయన కృతులతో కన్నులపండుగగా ఉంటుంది.  పంచరత్నాల  మెరుపులు!! ఈయన రచించిన అయిదు పాటలు పంచకృతులుగా పేర్కొనబడ్డాయి. ఇవి ఐదూ ఆదితాళంలో ఉంటయి.  పంచరత్న కృతులు పాడే నట గౌళ అరభి వరళీ శ్రీ రాగాలను గాన పంచక రాగాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన తానం వీణ పై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నట వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.  ఇంతటి గొప్ప కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అని మనం పాడుకోవడం కూడా మన అదృష్టమే!! ◆ వెంకటేష్ పువ్వాడ