మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు !!

సినిమా పాట హమ్ చేయడం లేదండోయ్!! మరైతే ఏంటీ?? అంటారా అది చెప్పడానికేగా ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు.మనం మన చుట్టూ ఉన్న చాలామంది తమ ప్రణాళికలలో రేపు ఏంటి?? రేపు ఏమి చేద్దాం, ఆ తరువాత ప్లాన్స్ ఏమిటి?? ఇలాంటి ఆలోచనలతో మునిగిపోయి ఉంటారు. లేదూ కొంతమంది అదే రోజు గురించి పని చేస్తున్నా, ఇతర ఆలోచనలతో ఉన్నా పూర్తిస్థాయి సాటిసిఫాక్షన్ తో ఉండరు. ఎందుకిట్లా అని ఆలోచన చేసారా ఎప్పుడైనా?? దానికి సమాధానం సులువుగా చెప్పాలంటే మనిషికి ప్రస్తుతం తనదగ్గర ఉన్నదానికంటే తనదగ్గరలేని దాని గురించి, ఎక్కడో ఉన్నదని గురించి ఆసక్తి ఎక్కువ, దానిమీద అంచనాలు ఎక్కువ. ఇంకా గట్టిగా చెప్పాలంటే రేపటి గురించి ఆశ ఎక్కువ. నిజానికి మనిషిని బతికించేది ఆశ అయినపుడు ఆశపడటంలో తప్పు లేదు. కానీ ప్రస్థుతాన్ని నిర్లక్ష్యం చేస్తూ రేపటి విషయాల గురించి ఆశపడటం అంటే ఇంకా విత్తని విత్తనాల క్రమం గురించి ఆలోచిస్తూ భూమిని సరిగా దున్నకపోవడమే. భూమి సరిగా దున్నలేదు అనుకోండి, విత్తనాలు సరిగా వేయలేరు, ఆ తరువాత వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తవు, పంట పండదు. ఇక్కడ జరిగింది ఏమిటి?? జరగని పనిని ఆలోచిస్తూ జరిగే పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల తగిన పలితం రాకపోగా, సమయం మొత్తం వృథా చేసినట్టు. ఒక అవకాశాన్ని చేజార్చుకున్నట్టు. సరిగ్గా చాలామంది జీవితంలో ఇదే చేస్తున్నారు. ప్రస్థుతంలో రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని ఫలితం ఏమిటి?? ఎంతో ఆలోచన చేసిన రేపు కూడా ఆశించిన విధంగా లేకపోవడం. ఎన్నాళ్ళు గడిచినా ఇలా సరైన ప్రణాళిక సాగకుండా నిరాశలో మిగిలిపోవడం. ఇప్పుడు అర్థం అయ్యింది కదా మనిషి నిరాశకు కారణం ఏమిటి అనేది కూడా. అయితే ఇప్పుడేం చేయాలి?? ప్రస్థుతాన్ని అంటే ఈరోజును ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే రేపు అంతకంటే బాగా మీ ముందు ముస్తాబవుతుంది. రోజులో ఉన్న 24 గంటల్లో సూర్యోదయం నుండి, నిద్రపోయేవరకు మీకున్న సమయం ఎంత?? సాధారణంగా అందరూ నిద్రపోవడానికి ఉపయోగించే 6 లేదా 8 గంటలు మినహాయిస్తే రోజులో ఉండే18 లేదా 16 గంటలను ఏమి చేస్తున్నారు?? ప్రతి రోజు ఏ పని ఎంతసేపు చేస్తున్నారు?? మీ 18 లేదా 16 గంటల పలితం ఏమిటి?? దానికి మీరు సరైన న్యాయం చేసారా?? ఇక్కడ ఒక విషయం గమనిస్తే ర్యాంకులు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్ కు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కు, అట్లాగే మంచి ఎంప్లాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉద్యోగస్తుడికి, సాధారణ ఉద్యోగస్తులకు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ కాలమానం ఒకటే అందరికి 24 గంటలు ఉన్నాయి. దీనికి కులము, మతము, లింగ వివక్ష అంటూ ఏమీ తేడా లేదు. అలాంటప్పుడు అందరూ ఒకేలా ఎందుకు లేరు??  కొందరు ఏవో కారణాలు చెబుతారు. బహుశా వారు చెప్పినట్టే అందరికి అన్ని వనరులు, వసతులు, సౌకర్యాలు ముఖ్యంగా డబ్బును బట్టి చేకూరే ప్రయోజనాలు అందుబాటులో లేకపోవచ్చు. కానీ అన్ని ఉండి కూడా పనికిరానట్టు ఉన్నవాళ్ల సంగతి ఏమిటి??  ఇట్లా ఆలోచిస్తే అందరికి వస్తాం ఏమిటి అనేది అర్థం అవుతుంది. లోపం ఎక్కడుందో క్షుణ్ణంగా తెలిసిపోతుంది. ఫలితంగా  తమని తాము సరిదిద్దుకునే మార్గం కనిపిస్తుంది, లేకపోతే వెతుక్కునే ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ జరిగితే ప్రస్తుతం అంటే ఈరోజు ఎంత గొప్పదో… దాని విలువ ఏమిటో… దాని ప్రాధాన్యత ఎలాంటిదో చాలా బాగా తెలుస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని చెప్పింది. ఈరోజును ఎంత బాగా మలచుకుంటారో అంత గొప్ప ఫలితం మీ సొంతం.  ◆వెంకటేష్ పువ్వాడ

అక్షరం మీద అవని!!

ప్రపంచ దేశాల మధ్య అన్ని రంగాలలో పోటా పోటీ కొనసాగుతూనే వుంటుంది. విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామికం ఇలా ఎన్నో….  ఒక్కొక్క రంగంలో నిపుణత సాధించడానికి ఎన్నో అవగాహనాలు, విశ్లేషణలు, పరిశీలనలు, ప్రయోగాలు చాలానే ఉంటాయి. అయితే రంగం ఏదైనా అందులో అన్ని తెలుసుకోవాలన్న దేశ కాలమాన పరిస్థితులను అంచనా వేయాలన్న ఆలోచనతో పాటు చదువు కూడా ఉండాలి. ఏదో దేశాలు ఉద్ధరించడానికి కాకపోయినా కనీసం ప్రతిమనిషి తన జీవితానికి ఆహారం, నీరు, అవసరాలు ఎలా ఉన్నాయో అలా చదువుకోవడం కూడా ముఖ్యమేనని, అది ప్రతి మనిషి హక్కు అని ప్రపంచ విద్యా దినోత్సవం నాడు గుర్తుచేసుకోవలసిన విషయం. నవంబర్ 11 ప్రపంచ విద్యా దినోత్సవంగా యావత్ ప్రపంచ దేశాలు విద్య ఆవశ్యకతను గుర్తిస్తూ తమతమ దేశాలలో అక్షరాస్యతను పెంచుకునేందుకు కలిగించే అవగాహనా దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ఇక మన దేశం గురించి చెప్పుకుంటే విద్యను సామాజిక హక్కుగా, అది అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఒకానొక వనరు స్థానం నుండి దాన్ని మళ్ళీ కేవలం డబ్బుతో కొనుక్కునే వస్తువుగా ఎన్నటి నుండో పరిగణిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం విద్య అందరి హక్కు అని, అందరికి అందుబాటులో ఉండాలని అది తమ లక్ష్యమని చెబుతున్నా ఆచరణలో మాత్రం విఫలం అవుతూ వస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థలు అధికం కావడం, విద్య ఖరీదు రెక్కలు తొడగడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అయితే సాధారణ పౌరుల్లో సామాజిక విద్య పట్ల అవగాహన పెంపొందించడం సాటి పౌరులుగా అందరి బాధ్యత అనే విషయం మరచిపోకూడదు.  ఇప్పట్లో ప్రభుత్వ బడులలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి ప్రాణాళికలు బాగానే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల స్వార్థం వల్ల వాటిని అమలుపరచడంలో సమస్యలు తలెత్తుతున్నాయేమో కానీ మండల, జిల్లా స్థాయి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. బడి పిల్లలకు పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్ లు, రిజర్వేషన్ లు, ఇవి మాత్రమే కాకుండా ప్రయివేట్ పాఠశాలలు మరియు కాలేజి పిల్లలకు కూడా రీయింబర్స్మెంట్ రూపంలో పూర్థిస్తాయి నాణ్యమైన విద్య అందే మార్గాలు ఎన్నో ఉన్నాయి.  అయితే దేనికైనా అవగాహన ముఖ్యం అన్నట్టు విద్య దాని ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలి మరియు తెలియజెప్పాలి వేగవంతమైన ఈ ప్రపంచంలో విద్య ద్వారా మనిషి స్థాయి ఎలా ఇనుమడిస్తుందో, ఎలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందో కొండశ్రీ జీవితాలను చూస్తూ తెలుసుకోవాలి పేదరికం విద్యకు ఎప్పుడు అడ్డంకి కాదని, దిగువ కులాలకు ఇచ్చిన ఎన్నో ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ చదువులో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని ఎందరో జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి. వారి గురించి వివరించాలి.  ప్రతి పిల్లవాడికి లింగ బేధం లేకుండా కనీస విద్యార్హత వరకు చదువు చెప్పించడం ద్వారా వారి జీవితం ఎంతో ఆశావాహంగా సాగుతుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. విద్య ద్వారా ప్రపంచాన్ని, ప్రపంచ పరిస్థితులను, కాలాన్ని అంచనా వేస్తూ దానికి తగ్గట్టు తమ సామర్త్యాన్ని వినియోగించడం ద్వారా గొప్ప జీవితం సొంతమవుతుంది. ఇలా అన్ని విధాలుగా అన్ని కోణాలలో ఆలోచించి విద్య పట్ల అవగాహన పెంపొందిస్తే మన భారతదేశంలో అక్షరాస్యత రేటు పెరిగి అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచ అభివృద్ధి  మొత్తం విజ్ఞానం పైననే ఆధారపడి ఉంది ఇప్పుడు. ◆ వెంకటేష్ పువ్వాడ

 మళ్లీ పెళ్లికి భయపడుతున్నారా?? 

ప్రతి మనిషి జీవితంలో చదువు, ఉద్యోగం ఎంతటి ప్రధాన పాత్రలు పోషిస్తాయో పెళ్లి కూడా అంతే ప్రధాన  పాత్ర పోషిస్తుంది. చదువుకు, ఉద్యోగానికి ముందు, తరువాత అని మార్పు గూర్చి చెప్పుకున్నట్టే, పెళ్లికి ముందు తరువాత అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పెళ్లి కొందరి జీవితాల్లో చేదు జ్ఞాపకం అవుతుంది. ప్రమాదాలు కావచ్చు,  సమస్యలు కావచ్చు, కోల్పోవడం కావచ్చు, బందం మధ్య సరైన అవగాహన లేక  వదులుకోవడం కావచ్చు. కారణాలు ఎన్ని అయినా జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా మారడం  కాసింత తెలియని వెలితే. ముఖ్యంగా బయటకు చెబితే సమాజం ఏదో ఎదో అంటుంది కానీ శరీరంలో హార్మోన్ల గోలను భరించి ఆ ఒత్తిడిని మోయడం కూడా కష్టమే. చాలామంది అటు సమాజం ఏమనుకుంటుందో  అనే భయంతో వెనకడుగు వేస్తూ తాత్కాలిక ఉపశమనం అన్నట్టు ఎవరితోనో ఒకరితో సంబంధం పెట్టుకుని వాటిని  అక్రమసంబందాలుగా ముద్ర వేసుకుని వాటిని కూడా గోప్యంగా ఒత్తిడిలో నెట్టుకొస్తూ అటు సమాజపరంగానూ, ఇటు  అంతరాత్మ పరిధిలోనూ నేరస్తులుగా తమని తాము పరిగణించుకుంటూ గడుపుతుంటారు. అయితే ఇలా మరొకరి  సాంగత్యం కోరుకునే వారు ఎవరైనా సరే తమకు తగిన వ్యక్తిని వెతుక్కుని పెళ్లి చేసుకోవడం ఎంతో ఉత్తమం. కానీ బయట నుండి ఎదురయ్యే మాటలే మిమ్మల్ని అలా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేసేలా చేస్తుంటే  మాత్రం ఒక్కసారి కింది ప్రశ్నలు వేసుకోండి. మీరు సమాజంలో భాగమా?? లేక సమాజపు భారం మీ మీద ఉందా?? చాలామంది కొన్ని పనులు చేస్తే సమాజం దృష్టిలో విలువ లేని వాళ్ళు, ఉన్నత వ్యక్తిత్వం లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి మరియు వివాహ, శారీరక సంబంధ విషయాలలో ఒకానొక అసంబద్ధమైన ముద్రను వేస్తారు. అయితే ఎవరి జీవితం వారిది అయినపుడు, ఒకరి జీవితంలో నష్టం వాటిల్లినపుడు సమాజం ఏమి సహాయం చేయనపుడు, ఎవరూ ఇతరుల జీవితాలను మోయనపుడు ఇతరుల మాటలను అంతగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఏముంది?? విలువలు కానీ విషయాలు కానీ సమంజసం మరియు సమంజసం కానిదీ అనే విషయాలు కూడా వ్యక్తి ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నపుడు ఇతరుల మాటలకు భయపడి జీవితాన్ని అట్లా నిర్జీవంగా మరియు ఒత్తిడి వలయంలో కుదించేసుకోవడం అవసరమేనా?? అసంబద్ధమైన సంబంధాల కంటే ఆరోగ్యకరమైన బంధం ఉత్తమమెగా?? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుంది. గుట్టుగా జరిగే వ్యవహారాలు కూడా అలాంటివే. ఇంకా చెప్పాలి అంటే ఈ సమాజానికి ఎప్పుడూ వంద కాదు వెయ్యి కళ్ళు ఉంటాయి. వాటికి అవకాశం ఇచ్చి ఎవరి గౌరవాన్ని వారు తగ్గించుకోకూడదు కదా. దానిబధులు ధైర్యంగా బయటకు చెప్పుకోగల బంధం ఉంటే నిజంగా అది ఎంతో సంతోషించాల్సిన విషయం. తోడు ఎందుకోసం?? సాధారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు కేవలం జీవిత భాగస్వామితో చెప్పుకునే సందర్బాలు కోకొల్లలు. ఆర్థిక, మానసిక, శారీరక ఇట్లా అన్నిరకాల విషయాలు భాగస్వామితో మాత్రమే చెప్పుకోగలరు. అట్లాంటప్పుడు అర్థం చేసుకునే వ్యక్గులను ఎంపిక చేసుకుని వారితో ఆనందంగా ఉండటం మంచిదే కదా!! అందుకే కదా తోడు  కావాలి మరి.  సమాజం గురించి భయమా?? ఈ సమాజానికి ఇతరుల జీవితాల్లో తొంగిచూసి విమర్శ చేయడం వచ్చినంతగా మననుషులను అర్థం చేసుకోవడం రాదు.  నిజానికి ప్రస్తుత కాలంలో మనుషుల జీవితాలు, వారి బాధలు ఇవే పెద్ద ఎంటర్టైన్ అయిపోతున్నాయి. అట్లాంటప్పుడు సమాజం  ను చూసి భయపడటం ఎందుకు?? మళ్ళీ పెళ్లి అనేది ఎంతమాత్రం తప్పు కాదు. కాబట్టి కొందరు చిన్న వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయి పిల్లలు ఉన్నారనే కారణంతోనో లేక సమాజానికి భయపడో  మరింకేవో కారణాల వల్ల సహచర సాంగత్యాన్ని కోల్పోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.  కన్న తల్లిదండ్రులు, కడుపున  పుట్టిన పిల్లలు చుట్టాలు  అందరూ దూరం అయినా జీవితాంతం వెంట ఉండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే.  కాబట్టి ఆ తోడు ఉంటే, ఆ బంధం పటిష్టంగా ఉంటే జీవితంలో ఎన్నో గెలవగలుగుతారు.  ◆ వెంకటేష్ పువ్వాడ  

రేడియేషన్‌ను రెడి చేస్తున్నారా??

మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా వాక్యాలు శ్రీశ్రీ గారు రాసిన కారణం వేరు కావచ్చు. దాని ఆంతర్యం వేరు కావచ్చు కానీ ప్రపంచం మొత్తం అభివృద్ధితో గత వందేళ్లకు ఇప్పటికి చెప్పలేనంత మార్పుకు లోనయ్యింది. నిజానికి అప్పటికి ఇప్పటికి తరచి చూస్తే నిజంగా ఇది మరో ప్రపంచంలాగే ఉంది. అయితే ఏంటంటా?? అని మీకు అనిపించవచ్చేమో. ఈ మార్పులో సాంకేతికత ఎంతటి ప్రాధాన్యత సంతరించుకున్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గత దశాబ్దం ఉహించన్నత మార్పులకు లోనయ్యింది. ఈ మార్పులో ముఖ్యమైన పాత్ర స్మార్ట్ ఫోన్, లాప్టాప్ మొదలైన టెక్నాలజీ పరంపరదే మొదటి అడుగు అని ఒప్పేసుకోవచ్చు కూడా. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్, సిస్టం వంటివి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చేసాయి. అవి ఎలా అయితే అందెశ్రీ చేతుల్లోకి వచ్చేసాయో పర్యావరణం కూడా అంతే సులువుగా సర్వనాశనం అయిపోతోందన్నది ఒప్పుకోవలసిన వాస్తవం.  రజినీకాంత్ గారు రోబో 2.0 అంటూ రేడియేషన్ గురించి, దాని ఫలితంగా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికే సినిమా పరంగా ప్రజలకు చెప్పేసారు. కానీ ఈరోజు అంటే నవంబర్ 8 ని ప్రపంచ రేడియోలజీ దినోత్సవంగా గుర్తించి రేడియాలజీ గురించి కాసింత అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం.  మొబైల్ ఫోన్ వాడినంత సులువుగా ఈ పర్యావరణాన్ని తిరిగి నిర్మించుకోలేము. పుట్టగొడుగుల్లా లేస్తున్న సెల్ ఫోన్ టవర్లు, ఇరవై నాలుగు గంటలు ఇష్టానుసారం వాడేస్తున్న మొబైల్ ఫోన్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతరించి పోతున్నాయేది వాస్తవం. ఒక మనిషికి స్కానింగ్ తీయడం వల్ల ఆ x-ray కిరణాలు శరీరం మీద  ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎక్కువ సార్లు స్కానింగ్ తీయించుకోకూడదు అని చెబుతుంటారు. ముఖ్యంగా గర్భిణీలకు స్కానింగ్ ఎక్కువ తీయకూడదు ఎందుకంటే కడుపులో శిశువు ఎంతో సున్నితం కాబట్టి ఆ కిరణాల ప్రభావం వల్ల  కూడా పుట్టుకలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. పక్షులు కూడా అలాంటి సున్నితమైన జీవాలే అనే విషయం పెద్దగా పట్టించుకొము. ఇన్ని కోట్ల మంది నిరంతరం సాంకేతికత పేరుతో ఉపయోగిస్తున్న మొబైల్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ ద్వారా పక్షులు ఎంత బాధ అనుభవిస్తాయో ఒక నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే ఈ ప్రపంచ రేడియాలజీ దినోత్సవ సందర్భంగా కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే మనం కొన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము. 1● ఇప్పుడు అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నది మొబైల్ ఏ. కాబట్టి అవసరాన్ని ఆలోచించుకుని మొబైల్ ఫోన్ వినియోగించడం ఉత్తమం. వీలైనంత వరకు నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడం మంచిది. దీనివల్ల ఈ రేడియేషన్ గోల తప్పడమే కాదు మనుషుల మధ్య బంధాలు ఎంతో గట్టిగా తయారవుతాయి. 2● వీడియో గేమ్ లు, నెట్ కాల్స్, టైం పాస్ చాటింగ్ వంటివి తగ్గించుకుంటే మీ సమయం ఆదా అవ్వడమే కాదు ఖర్చు కూడా తక్కువే అవుతుంది. 3● రాత్రిపూట పడుకునే ముందు నెట్ ఆఫ్ చేయడం, లేదా వీలున్నవాళ్ళు మొబైల్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ అయిపోదు, నెట్ వేస్ట్ కాదు, ఇంట్లో ఎలక్ట్రిక్ ఆదా చేసినట్టు. అన్నిటికి మించి ఎలాంటి డిస్టర్బ్ లేకుంటే హాయిగా నిద్రపోవచ్చు. 4● జీవితాన్ని మీరు చేసే పనులను కాసింత సీరియస్ గా తీసుకుంటే అర్థమవుతుంది సోషల్ మీడియా ద్వారా ఓనగూరే ప్రయోజనాలు ఏమిటో. నిజానికి సోషల్  మీడియా లో పనికొచ్చే వాటికంటే వ్యర్థమైన విషయాలే ఎక్కువ. మరొకరి జీవితాల్లోకి తొంగిచూసి వాటిని బేరీజు వేయడం, చర్చ చేయడం వంటివే ఎక్కువ. వీటివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అనేది ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది అనవసర వృథా ఎక్కడ చేస్తున్నారు అని. అది తెలిస్తే తప్పకుండా మొబైల్ వాడకం, సిస్టం వాడకం వంటివి అదుపులో ఉంచుకుంటారు. కాబట్టి పైన చెప్పుకున్న విషయాల గురించి కాసింత ఆలోచన చేసి దేనికోసం ఎందుకోసం మనం ఈ టెక్నాలజీని ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుంటే మనమే కాదు ఈ పర్యావరణం కూడా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ పర్యావరణం బాగుంటేనే మనం ఇంకా బాగుంటాం. అందుకె రేడియేషన్ కు రెస్ట్ ఇద్దాం. ◆ వెంకటేష్ పువ్వాడ  

నవంబర్ వ్రతం గురించి తెలుసా?

అనుకుంటాం కానీ సమాజములో సమస్యల మీద స్పందించే వాళ్ళు బానే ఉన్నారు. అయితే దాన్ని వ్యక్తం చేసే విధానంలో మాత్రం భిన్న కోణాలు తారసపడుతుంటాయి. అలాంటిదే ఈ నవంబర్ నెలలో కూడా ఉందని చెప్పవచ్చు. ఇంతకు విషయం ఏమిటంటే నవంబర్ మొత్తం చాలా వరకు బార్బర్ షాపులకు రాబడి తక్కువ. అలా కాదు ఇంకోలా చెప్పాలంటే నో షేవ్ నవంబర్(no shave november) ప్రస్తుత కాలంలో ఒక ఉద్యమంలాగే తయారయ్యింది. ప్రతి సంవత్సరం దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు పెరుగుతున్నారు. కొంతమంది దీన్ని సామాజిక స్పృహ అనుకుని ఫాలో అయితే మరికొంతమంది ఫ్యాషన్, ఆనందం, అన్నిటికి మించి కొత్తదనం, ఇంకా చెప్పాలంటే అదొక కిక్కు లాంటి ఫీల్ కోసం ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.  ఇంతకు ఏమిటీ నో షేవ్ నవంబర్( no shave november) నో షేవ్ నవంబర్ అనేది నవెంబర్ నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా పెరిగే జుట్టును అట్లాగే పెంచేయడం. ఇదే నో షేవ్ నవంబర్ అనే చిన్నపాటి ఉద్యమం లాంటి సామాజిక కార్యక్రమం.   దీని వెనుక కారణం ఏమిటి?? ప్రతి దానికీ కారణం ఉన్నట్టే ఈ నో షేవ్ నవంబర్  వెనుక పెద్ద కారణమే ఉంది. అదే మహమ్మారి కాన్సర్. కాన్సర్ తో బాధపడేవారు ఎదుర్కొనే సమస్యలలో జుట్టురాలిపోవడం ఎంతో మానసిక క్షోభకు గురి చేసే అంశం. కాన్సర్ సోకిన వారి నుండి దాని ట్రిట్మెంట్ మొత్తం పూర్తయ్యేలోపు జుట్టు రాలిపోతుంది. అలాంటి వారు నలుగురి మధ్య తిరగడానికి ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. అలాంటి వారి కోసం ఒక నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా పొడవుగా పెంచి తరువాత దాన్ని కత్తిరించి కాన్సర్ పేషెంట్ ల కోసం వినియోగించడం, అలా కాన్సర్ మీద అవగాహన కూడా కలిగించడం దీని ఉద్దేశ్యం. ఎక్కడ మొదలయ్యిందిది?? ఈ నో షేవ్ నవంబర్ పుట్టుక ఆస్ట్రేలియా, మరియు న్యూజిలాండ్ దేశాలలో 2004 వ సంవత్సరంలో మొదలయ్యిందని నమోదయ్యి ఉంది. ఏది ఏమైనా కాన్సర్ మీద అవగాహన కోసం, కాన్సర్ తో బాధపడే వారికి తమవంతు సహకారం అందించేందుకు  పట్టణ ప్రజలు, ముఖ్యంగా యువత ఈ నో షేవ్ నవంబర్ ను ఫాలో అవుతుంటారు.  ఇదేనా నో షేవ్ నవంబర్ అనిపించవచ్చు. ఇది కేవలం ఇలాగే ఉండలేదు అండోయ్!! ముందు చెప్పుకున్నట్టే ఇదొక ఉద్యమంలా వ్యాప్తమవుతూ సంస్థలు పుట్టుకొచ్చి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, అటు సామాజిక పరంగా ఇటు మానవీయ విలువల నిర్వహణలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. నవంబర్ ఏ ఎందుకు?? అనే అనుమానం అందరికి రావచ్చు. బహుశా కాన్సర్ గురించి అవగాహన లేని వాళ్లకు నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే ఎప్పుడో తెలిసి ఉండదు. నవంబర్ 7 ను ప్రతి ఏటా నేషనల్ కేన్సర్ అవెర్నెస్ డే గా జరువుకుంటారు. ఈ అవగాహనా రోజును పురస్కరించుకుని నవంబర్ నెల మొత్తం నో షేవ్ నవంబర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం కూడా కావచ్చు.  బంగారం లాంటి జుట్టు: నిజమే కదా జుట్టు బంగారమే. ఎవరికి అంటే అది లేనివాళ్లకు. సాదారణంగా మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటివాళ్ళు  జుట్టు కెత్తిరించినా మళ్ళీ చాలా తొందరగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి లేనివాళ్లకు ఇవ్వాలంటే గొప్ప మనసు ఉండాలి. అది జుట్టైనా, మరింకేదైనా ఏమంటారు??  కాదంటారా?? అవునంటారా?? అవేమి వద్దు నో షేవ్ నవంబర్ కు ఓటెయ్యండి. అంటే మీరు  ఫాలో అయిపోండి. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది బాధపడకండి.  ◆  వెంకటేష్ పువ్వాడ

ముసలి ఆవుని తరిమేస్తే!

ఆడవారు అంతెత్తుకు ఎదిగి తమని తాము విజేతలుగా నిలబెట్టుకునే ఆత్మస్థైర్యాన్ని స్వంతం చేసుకున్నారు.  ఈ పరిణామ క్రమంలో ఎన్నో  ఆటంకాలని ఒకటొకటిగా దాటుకుంటూ వచ్చారు. కుటుంబం, సమాజంతోపాటు ప్రకృతి విసిరే సవాళ్ళకి కూడా దీటుగా బదులిచ్చి తమ శక్తి సామర్థ్యాలని ప్రపంచం గుర్తించేలా చేశారు. ఇందుకు శభాష్ అని తీరాలి. అయితే ‘‘ప్రయాణం ఇంకా ఎంతో వుంది’’. అందుకే చిన్నచిన్న అంశాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే మరిన్ని విజయాలు సులువుగా అందుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సహజంగా ఆడవారు దృష్టిపెట్టని అంశాలు ఏవో, అలాగే వాటిపై దృష్టి సారిస్తే వారు పొందే లాభాలు ఏంటో పరిశోధనా పూర్వకంగా నిరూపించారు. మరి ఎన్నో సాధించాలని తపనపడే మీరు ఆ విషయాలో ఏంటో తెలుసుకుని కొంచెం శ్రద్ధ పెట్టాలి. 1. పోషకాహార లోపం ఎక్కువ పోషకాహార లోపం ఆడవారిలో  చాలా ఎక్కువగా కనిపిస్తోందట. అదేంటి... బానే తింటున్నాంగా అంటారా - ఒక డైటీషియన్‌ని కలిసి మీ ఆరోగ్య పరిస్థితి, దానికి మీరు తీసుకోవలసిన ఆహారం, నియమాలు వంటివి తెలుసుకున్నారా ఎప్పుడైనా? అని అడిగితే ‘లేదు’ అన్నది చాలామంది చెప్పిన సమాధానం ఒక అధ్యయనంలో. అలవాటుగా తీసుకునే ఆహారమే తప్ప ప్రత్యేక ఆరోగ్య అవసరాలకు తగ్గట్టు మార్పులు, చేర్పులు ఏవీ చేయకుండా, ఎప్పుడూ ఒకే తరహా ఆహారం తీసుకోవడం ఆడవారు చేసే పెద్ద పొరపాటు. అది వారి ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇన్ని ఉద్యోగాలు, ఇంత సంపాదన పెరిగినా ఆడవారు ఈ విషయంపై శ్రద్ధ పెట్టకపోవడం విచారకరం అంటున్నారు నిపుణులు. గర్భందాల్చి మరో ప్రాణికి ఊపిరి పోసే సమయంలో శరీరానికి తప్పక అందాల్సిన పోషకాలు కొన్ని అయితే, బిడ్డకి జన్మనిచ్చాక చనుబాలు ఇచ్చే సమయంలో తప్పక అందాల్సిన పోషకాలు కొన్ని. అంతెందుకు... నెలనెలా నెలసరికి ముందు, తర్వాత శరీరంలోని హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి తీసుకునే ఆహారంలో కూడా అనగనగా ఒక గురువుగారు తన శిష్యునితో కలిసి హిమాలయాలలో సంచరిస్తున్నారు. ఒకరోజు వాళ్లు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. ఎటు చూసినా చిమ్మచీకటి. ఈ చీకటివేళలో తలదాచుకునేందుకు చోటు దొరికితే బాగుండు దేవుడా అని వాళ్లు ప్రార్థిస్తుండగా, కాస్త దూరంలో ఒక చిన్న దీపపు వెలుగు మిణుకుమిణుకుమంటూ కనిపించింది. ఆ వెలుగుని అనుసరిస్తూ వెళ్లిన గురుశిష్యులకి ఒక చిన్న గుడిసె కనిపించింది. ఏ సమయంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గుడిసెలోకి అడుగుపెట్టిన వాళ్లిద్దరికీ అందులో ఏ మూల చూసినా పేదరికం సాక్షాత్కరించింది. ఈ పేదరికం మధ్య బతుకుతున్న ఓ కుటుంబమూ కనిపించింది. ఒక భార్యాభర్తా, వారి ఇద్దరు పిల్లలూ చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించారు. ‘మేం దారి తప్పిపోయి ఇటువైపుకి వచ్చాం. మీరు కనుక ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే, ఉదయాన్నే వెళ్లిపోతాము.’ అని అభ్యర్థించాడు శిష్యుడు. ‘ఓ దానిదేం భాగ్యం’ అన్నాడు గృహస్థు. ఆ రాత్రి మాటల మధ్యలో ‘మీకు జీవనోపాధి ఎలా?’ అని అడిగారు గురువుగారు. దానికి ఇంటి పెరట్లో కట్టేసి ఉన్న ఓ ముసలి ఆవుని చూపిస్తూ ‘అదిగో ఆ ముసలి ఆవే మాకు జీవనాధారం. అది రోజూ కాసిని పాలు ఇస్తుంది. ఆ పాలు తాగి, దాంతో చేసుకున్న జున్ను తిని బతికేస్తాం. ఇంకా కాసిని పాలు, జున్ను మిగిలితే పట్నానికి పోయి ఏదన్నా కొనుక్కుంటాం’ అని బదులిచ్చాడు గృహస్థు. మర్నాడు ఉదయం గురుశిష్యులిద్దరూ తిరుగు ప్రయాణం కట్టారు. కాస్త దూరం వెళ్లగానే గురువుగారు ‘శిష్యా! నువ్వు నాకోసం ఒక పని చేయాలి. వెళ్లి ఆ ఆవుని దూరంగా అడవుల్లోకి తరిమేసి రా’ అన్నారు. గురువుగారి మాటలకు శిష్యుడు ఆశ్చర్యపోయాడు ‘అయ్యా ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క జీవనాధారం ఆ ముసలి ఆవే కదా! దాన్ని తరిమేస్తే వాళ్లంతా ఆకలితో చచ్చిపోతారు,’ అని నసిగాడు. ‘అదంతా నాకు తెలుసు! నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన పని చేయి,’ అని హుంకరించారు గురువుగారు. ఇక గురువుగారి మాట కాదనలేని శిష్యుడు దొంగచాటుగా వెళ్లి ఆ ఆవుని ఎవరికీ కనపడనంత దూరంగా అడవుల్లోకి తరిమేసి వచ్చాడు. గురువుగారి ఆజ్ఞని నెరవేర్చాడే కానీ శిష్యుడిని తను చేసిన పనికి చాలా గిలిగా ఉండేది. కొన్నాళ్లకి పశ్చాత్తాపంతో అసలు అన్నం సయించడం కూడా మానేసింది. ‘ఇక లాభం లేదు’ అనుకున్నాడు శిష్యుడు. ‘వెళ్లి నేను చేసిన పనికి వాళ్లని క్షమాపణ కోరతాను. అవసరం అయితే వాళ్లకి ఏదో ఒక విధంగా సాయపడతాను’ అనుకుంటూ ఆ పూరి గుడిసె వైపుకి బయల్దేరాడు శిష్యుడు. అల్లంత దూరంలో ఆ గుడిసె ఉండే ప్రదేశాన్ని చూడగానే శిష్యుని కళ్లు బైర్లు కమ్మాయి. ఆ గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో చక్కటి ఇల్లు ఉంది. ముసలి ఆవు ఉండాల్సిన చోట చక్కటి గుర్రాలు ఉన్నాయి. ‘పాపం ఈ చోటుకి ఎవరికో అమ్మేసి ఆ కుటుంబం వలస వెళ్లిపోయి ఉంటుంది’ అనుకుంటూ ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాడు శిష్యుడు. ఎదురుగా చూస్తే ఇంకెవరు ఆనాటి గృహస్థు. మనిషైతే అతనే, కానీ అతని వేషధారణే మారిపోయింది. ఖరీదైన బట్టలు, చలిని ఆపేందుకు శాలువా, మెడలో బంగారు గొలుసు. ఇంటి లోపల తిరుగుతున్న మిగతా కుటుంబసభ్యులదీ ఇదే పరిస్థితి. ‘అయ్యా రెండేళ్ల క్రితం నేను మా గురువుగారితో ఇక్కడికి వచ్చాను. గుర్తుపట్టారా!’ అని వినయంగా అడిగాడు శిష్యుడు. ‘అయ్యయ్యో గుర్తుపట్టకేం. దయచేయండి’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు గృహస్థు. ఇంట్లో ఎన్ని అతిథి మర్యాదలు జరుగుతున్నా శిష్యుని మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు, సందేహాలు! వాటిని గ్రహించిన గృహస్థు ‘రెండేళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మేం కటిక పేదరికంలో ఉండేవాళ్లం. అప్పట్లో మాకున్న ఒకే ఒక జీవనాధారం ఆ ముసలి ఆవు మాత్రమే. ఒక రోజు అదీ తప్పిపోయింది. మొదట్లో మాకు ఏం చేయాలో పాలు పోలేదు. ఆవు ఉన్నంతవరకూ ఏ పనీ చేయకుండా దానిమీదే ఆధారపడేవాళ్లం. మరో విషయం గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. కానీ అది పోయాక మా జీవనోపాధి కోసం రకరకాల ఉపాయాలని ఆలోచించడం మొదలుపెట్టాము. బట్టలు నేయడం, చెక్కపని చేయడం, అడవిలో ఉండే అరుదైన ఔషధాలను సేకరించడం… ఇలా నానారకాల పనులన్నీ చేసేవారం. అలా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడిగా దాచుకునేవాళ్లం. త్వరలోనే మా నైపుణ్యాలకి తగిన గుర్తింపు లభించింది. అదృష్టం మమ్మల్ని వరించింది. దానికి ఫలితంగానే ఈ సంపద’ అంటూ ముగించాడు గృహస్థు. గృహస్థు మాటలు విన్న తరువాత శిష్యుడికి తన గురువుగారు చేసిన పనిలో ఆంతర్యం బోధపడింది ‘ఆ ముసలి ఆవులాగానే కొన్ని ఆధారాలు మనల్ని బలహీనురుగా మార్చేస్తాయి. వాటిని విడిపించుకున్నప్పుడే మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయగలం,’ అనుకుంటూ తన గురువుగారిని చేరుకునేందుకు తిరుగుముఖం పట్టాడు. --నిర్జర

మనలోనే ప్రపంచం

ధర్మరాజు ఓసారి ప్రపంచయాత్రకు బయల్దేరాడట. తిరిగివచ్చిన తర్వాత ప్రపంచలోని మనుషుల స్వభావం ఎలా ఉంది అని ఎవరో అడిగారట. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత మంచి కనిపిస్తోంది,’ అన్నాడట ధర్మరాజు. అదే సమయంలో దుర్యోధనుడు కూడా ప్రపంచయాత్ర నుంచి తిరిగివచ్చాడట. ప్రపంచంలోని మనుషులు స్వభావం ఎలా ఉంది? అని దుర్యోధనుని అడిగితే... ‘ ఈ ప్రపంచంలో అంతా క్రూరులూ, దుర్మార్గులే కనపిస్తున్నారు,’ అన్నాడట దుర్యోధనుడు. మన దృక్పథం ఎలా ఉంటే ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది అని ఈ కథతో తేలిపోతోంది కదా! ఇలాంటి కథే ఒకటి జపాన్ జనపదంలో ప్రచారంలో ఉంది. కాకపోతే అది కాస్త సరదాగా ఉంటుంది. ఇంతకీ ఆ కథేమిటంటే... అనగనగా జపాన్లో ఓ మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఓ భవనం. ఆ భవనంలోని పెద్ద హాలులో ఎటుచూసినా అద్దాలే కనిపిస్తాయట. అలా పది కాదు వంద కాదు, హాలు అంతా వేయి అద్దాలతో నింపేశాడట ఆ భవన యజమాని. ఆ అద్దాలగదిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారు. ఆ వేయి అద్దాలలో కనిపించే తమ వేయి ప్రతిబింబాలను చూసుకుని మురుసుకునేవారు. క్రమంగా జపాన్ అంతా, అద్దాల హాలు గురించిన వార్త పాకిపోయింది. ఆ వార్త విన్న ఓ కుక్కపిల్ల ఎలాగైనా ఆ గదిని చూడాలని అనుకుంది. ఉరుకులుపరుగులు తీస్తూ ఎలాగొలా ఆ గ్రామానికి చేరుకుంది. సందు చూసుకుని నిదానంగా ఆ అద్దాలగదిలోకి చొరబడింది. గదిలోకి చూడగానే తనలాగే వందలాది కుక్కలు కనిపించాయి. తను తోక ఊపితే అవికూడా సంతోషంగా తోక ఊపాయి. తను నవ్వితే అవి కూడా నవ్వాయి. తను చేయి చాపితే అవి కూడా తనవైపు చేయి చాపాయి. మొత్తానికి కుక్కపిల్లకు ఆ గది భలే నచ్చేసింది. ‘ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో! మళ్లీమళ్లీ ఇక్కడకు వస్తూ ఉండాలి,’ అనుకున్నది. కుక్కపిల్ల వెళ్లి తన నేస్తాలన్నింటితోనూ అద్దాలగది గురించి చాలా గొప్పగా చెప్పింది. జీవితంలో ఒక్కసారైనా అందులోకి ప్రవేశించాల్సిందే అంది. ఆ మాటలు విన్న మరో కుక్కపిల్ల అద్దాలగదిని చూసేందుకు బయల్దేరింది. కానీ అందులో ఏముంటుందో అన్న భయంతో, అక్కడ తనకు కనిపించే కుక్కపిల్లలు తనతో ఎలా ప్రవర్తిస్తాయో అన్న అనుమానంతో అడుగులో అడుగు వేసుకుంటూ అద్దాలగదిలోకి చేరుకుంది. అక్కడ దానికి కనిపించిన ప్రతిరూపాలు కూడా భయంభయంగా అనుమానంగా చూస్తూ కనిపించాయి. భయంతో తను మూలిగితే అవి కూడా మూలిగాయి. అనుమానంతో అరిస్తే, అవి కూడా అరిచాయి. ‘అయ్యాబాబోయ్! ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా ఉంది. మళ్లీ ఇంకెప్పుడూ ఇక్కడకు రాకూడదు,’ అనుకుంటూ తోకముడుచుకుని పారిపోయింది. ఈ కుక్కపిల్లల కథలో కనిపించే నీతి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

జీవిత గమనానికి - క్రమశిక్షణ ఒక చుక్కాని

జీవితంలో ఆరోగ్యకరం అయిన ప్రయాణానికి దోహదం చేసేది క్రమశిక్షణ. కేవలం సమయపాలననే క్రమశిక్షణ అని అనుకోకూడదు. సమాజం పట్ల అవగాహన కలిగి వుండి ఆశావాహ దృక్పధమైన పనులను వరుస ప్రకారం నెమ్మదిగా చేసుకుపోవడం క్రమశిక్షణ కి అద్దం పడుతుంది. సమయ సాధనతోనే సాధ్యం. క్రమశిక్షణ అంటే సరైన దారిలో నడిపించడం లేదా నేర్పించడం అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు అది పిల్లల అమర్యాద ప్రవర్తనని సరిచేయడం కూడా అవుతుంది. కానీ ముఖ్యంగా క్రమశిక్షణ అంటే మంచి, చెడు తెలుసుకునేలా శిక్షణ ఇవ్వడం. ఆ శిక్షణ పిల్లలు తప్పు చేయకముందే మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్లకు సహాయం చేస్తుంది. ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. ఎందుకంటే పిల్లల్ని సరిదిద్దితే వాళ్ల ఆత్మ గౌరవం తగ్గిపోతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ తెలివైన తల్లిదండ్రులు పిల్లలు పాటించగలిగిన రూల్స్‌ పెట్టి పిల్లలు వాటికి లోబడేలా శిక్షణ ఇస్తారు. చదువులో ఏకాగ్రత, పెద్దల పట్ల గౌరవం,మంచి అలవాట్లు క్రమశిక్షణతో సిద్ధిస్తాయి.  అనుకున్నదానికి కట్టుబడి ఉండండి. మీ పిల్లలు మీరు పెట్టిన రూల్స్‌కి కట్టుబడి లేకపోతే వాళ్లను పర్యవసానాలు ఎదుర్కోనివ్వండి. అలానే మీ బాబు లేదా పాప మీరు చెప్పినట్లు వింటే వాళ్లను వెంటనే మెచ్చుకోండి. సమంజసంగా ఉండండి. క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు పిల్లల వయసు ఎంత, వాళ్ల సామర్థ్యం ఎంత, వాళ్లు చేసిన తప్పు ఎంత పెద్దది అనే విషయాలను చూసుకోవాలి. ఫలానా తప్పు చేసినందుకే ఈ శిక్ష వేయబడింది అనే విషయం పిల్లలకు అర్థం కావాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ విషయంలో పెట్టిన రూల్స్‌ని పాటించలేదు కాబట్టే కొన్ని రోజుల వరకు వాళ్లకు సెల్‌ఫోన్‌ ఇవ్వడం లేదని లేదా తక్కువ వాడుకోనిస్తున్నామని వాళ్లకు తెలియాలి. అదే సమయంలో కేవలం మీకు విసుగు తెప్పించారనే కారణంతో చిన్న విషయాల్లో కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ప్రేమతో ఉండండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా ప్రేమతోనే చెప్తారు అనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే వాళ్లకు క్రమశిక్షణను అంగీకరించడం సులువు అవుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

అంతర్యుద్ధం చేస్తున్నారా?? 

ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు సాధారణం. ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ వుంటారు. వాటిని అధిగమించేందుకు యుద్ధం చేస్తూ ఉంటారు కూడా. ఇదంతా సాధారణమే. అయితే ఇది కాకుండా అందరూ చేసే ఒకానొక నిశ్శబ్ద యుద్ధముంది. తమలో తాము, మానసికంగా చేసే యుద్ధమది. బయటకు కనిపించని, మనిషిని అంతర్లీనంగా క్రుంగదీసి, ఒత్తిడిలోకి నెట్టి జీవితాన్ని కూడా ప్రశ్నార్థకం చేయగల పెనుభూతమే సంఘర్షణ. దీన్నే మానసిక ఒత్తిడి, ఇంకా ఇప్పటి అందరికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే డిప్రెషన్ అని కూడా అంటారు.  తమలో తాము సమస్యల పట్ల సమస్యల తాలూకూ ప్రభావానికి తలోంచి, వైఫల్యాలను, తలచుకుంటూ, జీవిత చట్రంలో బోల్తా పడి ఇక ఏమి మిగల్లేదనుకుని ఆఖరి క్షణాలను తమకు తామే ఆహ్వానిస్తుంటారు.   ఎందుకు ఈ అంతర్యుద్ధం?? ఇలా తమలో తాము ఏదో విషయానికి సంఘర్షణ పడే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటే. ఎందుకు సంఘర్షణ పడుతున్నాం అని. జీవితం అన్నాక వైఫల్యాలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్లకు మాత్రం కేవలం ఆ వైఫల్యాలు మాత్రమే కనబడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే నడిచొచ్చిన ఎన్నో అద్భుతమైన అడుగులన్ని కూడా వారి మెదడు మీద చెరిగిపోయి కేవలం ఎక్కడో పడిన చిన్నపాటి గాయాలే ఇంతింత పెద్ద ఆకారంలో కనిపిస్తూ జీవితమంతా అదే ఉన్నట్టు బుర్రను తొలిచేస్తాయి. అందుకే ఈ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. బయటపడటం ఎలా?? ఇంట్లో నుండి తలుపులు తీసుకుని బయటకు వెళ్లిపోయినంత సులువు కాదు ఈ అంతర్యుద్ధం నుండి బయట పడటం. కేవలం సాధ్యాసాధ్యాలు, జరిగిన విషయాలను వదిలి జరగబోయే విషయాల మీద దృష్టి సారించడం, తప్పొప్పుల విచక్షణ, ముఖ్యంగా స్పోర్టివ్నెస్, అన్నిటికి మించి భయాలు, నిరాశ, పిరికితనం వదిలిపెట్టడం ఎంతో అవసరం. ఇవన్నీ వదిలేసి చూస్తే సమస్యలు ఏమి పెద్ద భూతాల్లా కనిపించవు. సంఘర్షణలు అన్ని కూడా మేఘాల్లా అలా తేలిపోతూ ఉఫ్.. అని ఊదగానే దూదిలాగా చెల్లాచెదురైపోతాయి అందరికీ కావాలోక ఆశావహదృక్పథం!! నిజమే కదా మనిషిని బతికించేది ఆశ. నిన్న ఏదో జరిగింది. అది అలా అయిపోయింది దానికి ఏమి చేయగలం?? గతం గతః. ఇక ఈరోజు చేతిలో ఉంది, రన్నింగ్ రేస్ లో ఉంది. దాన్ని సమర్థవంతంగా మన శక్తి కొలది ఉత్తమంగా మలచుకోవడం, దాన్ని అంతే హుందాగా తీర్చిద్దుకోవడం అందరి చేతుల్లోనూ ఉంది. అలాంటప్పుడు ఈ అంతర్యుద్ధాలు ఎందుకంటా?? మీతో మీరు… మీకోసం మీరు. చాలామంది తాము చేసే తప్పుల కంటే, తమ వైఫల్యాల కంటే ఇతరుల వల్ల  బాధపడటమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇతరులు తమను అవాయిడ్ చేస్తున్నారనో లేక ఏదో అన్నారనో అదీ కాకుండా తమ జీవిత విషయాలను ఇతరులు నిర్ణయించేస్తున్నారనో, తమ నిర్ణయాలు తమకు ఇవ్వకుండా తమ జీవితాన్ని తమది కాకుండా చేస్తున్నారనో ఇలా బోలెడు కారణాలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటని ఆలోచిస్తే సింపుల్ గా మీతో మీరు ఉండాలి, మీకోసం మీరు ఉండాలి. ఇతరుల చేతుల్లో పెట్టడానికి ఇదేమి ఆట కాదు, అంతకు మించి ఏదో భాగం ఇచ్చే ఆస్తి కూడా కాదు కదా!! అందుకే మీ నిర్ణయం మీరు తీసుకోవడానికి ఎప్పుడూ ముందుండాలి. దానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏమి తెలియని తనం చుట్టుముడుతుందో అప్పుడు అందరూ మీ జీవితంలో విషయాలను చేతుల్లోకి తీసేసుకుంటారు. అలా మీలో చేతకాని తనం కూడా అంతర్యుద్ధానికి దారి తీస్తుంది.  కాబట్టి మీలో అంతర్యుద్ధాన్ని ఆపాలంటే మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మీ తప్పొప్పులను స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

మీ చూపుకు ఒక పరీక్ష!!

చూపుకు ఏముంది అక్షరాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి, పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాం, అయినా చూపుకు పరీక్ష ఏమిటి డాక్టర్ దగ్గరకు పోతే సరిపోతుంది కదా దానికోసం. టైం వేస్ట్ పనులు కాకపోతే!! బహుశా చాలామందికి ఇలా అనిపించి  ఉంటుంది.  కానీ కాసింత ఇందులోని అంతరార్థం ఏమిటో అనే ఆలోచన చాలా తక్కువ మందికే వచ్చి ఉంటుంది.  ఇక విషయానికి వస్తే చూపు అంటే కంటి చూపు కాదండి, ఏదైనా ఒక విషయాన్ని చూసే విధానం అని, అంటే పాజిటివ్, నెగిటివ్ కోణాలు అని సింపుల్ గా చెప్పవచ్చు. ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అని అర్థం. కొందరు ఏదైనా చెబితే వెంటనే దాన్ని చాలా తేలికగా తీసుకుంటాం. కొన్నిరోజుల తరువాత  అదే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ఇలాటి ఆలోచనలతోనే  అపార్థాలు, మనస్పర్థలు ఏర్పడుతుంటాయి. మనుషుల మధ్య బంధాలు చాలా సులువుగా తెగిపోతుంటాయి. ఇక ఈ పాజిటివ్, నెగిటివ్ కోణాలకు సంబంధించి ఒక చిన్న కథ: ఒకసారి భీష్ముడు దుర్యోధనుడిని పిలిచి మంచివాళ్లను వెతికి తీసుకునిరా అని చెప్పి పంపించాడు. అలాగే అంటూ ధుర్యోధనుడు మంచి వాళ్లను వెతకడానికి వెళ్ళాడు. ఆ తరువాత భీష్ముడు ధర్మరాజును పిలిచి, కొంతమంది చెడ్డవాళ్లను తీసుకునిరా అని చెప్పాడు. సరేనంటూ ధర్మరాజు కూడా చెడ్డ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాడు. సమయం గడిచింది, సాయంత్రం అయిపోయింది. మొదట వెళ్లిన ధుర్యోధనుడు ఒంటరిగా, బాగా అలసిపోయి భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. "ఎక్కడున్నారు నువ్వు తీసుకొచ్చిన మంచివాళ్ళు??" అని అడిగాడు భీష్ముడు, దుర్యోధనుడితో. "రాజ్యం అంతా వెతికాను కానీ ఒక్కడు కూడా మంచి వాడు కనబడలేదు, అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు" అని బదులిచ్చాడు ధుర్యోధనుడు.  ఆ తరువాత కొద్దిసేపటికే ధర్మరాజు కూడా ఒంటరిగానే వచ్చాడు. "నువ్వు తీసుకొచ్చిన చెడ్డవాళ్ళు ఎక్కడ?? కనిపించడం లేదు ఏమిటి??" అని అడిగాడు. ధర్మరాజు కూడా ధుర్యోధనుడు చెప్పినట్టు "రాజ్యం అంతా వెతికాను కానీ ఎక్కడా చెడ్డవాళ్ళు కనిపించలేదు. అందరూ మంచివాళ్లే ఉన్నారు" అని చెప్పాడు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే చెడు ఆలోచనలు కలిగి ఉన్న దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్లే కనిపించారు. అందరిలోనూ చెడు గుణాలే కనిపించాయి. ఆయన అందరినీ చూసే విధానం, ఆయన దృష్టి కోణం అలాగే ఉంది. ఇక ధర్మరాజు ఎప్పుడూ నలుగురి మంచి కోరేవాడు, నలుగురి సహాయం చేసేవాడు కాబట్టి ఆయనకు ఇతరుల్లో చెడు కంటే మంచే కనిపించింది. అందుకే ఆయనకు అందరూ మంచివాళ్లుగానే కనిపించారు.   కాబట్టి ఏదైనా సరే మనం చేసే చూపును బట్టే అందులో మనకు మంచి, చెడులు కనబడతాయి. అలాగని చెడును కూడా మంచిగా అనుకోమని కాదు ఈ మాటల ఉద్దేశ్యం. ఈ జీవితం మనది, మన జీవిత నిర్ణయాలు మనవి, అన్ని మన చేతుల్లోనే ఉన్నపుడు ఇతరులతో మనం కేవలం మంచిని చూసి చెడును వారికే వదిలేస్తే మనకు ప్రశాంతత, అనవసర విషయాల కోసం సమయం వృథా కాదు ఇంకా బోలెడు మంచి కూడా మనకే. కాబట్టి మీ చూపు ఇప్పుడు ఎట్లా ఉందొ ఒకసారి మీరే ఆలోచించుకోండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

దైవం మానుష్య రూపేణా!!

  దేవుడు ఎక్కడో కాదు, మనిషి రూపంలో మన చుట్టూనే ఉంటాడు అనేది దీని భావం. నిజంగానే ఎంతో గొప్ప మనసు, సహాయం చేసే గుణం, స్వార్థం లేకుండా ఉండటం, జాలి, దయ, కరుణ, మానవత్వం నిండిన వాళ్ళు అక్కడక్కడా కనబడుతూనే ఉంటారు. వీళ్ళనే మనుషుల్లో దేవుళ్ళు అని, దేవుడే మనిషి రూపంలో ఇలా వచ్చాడు అని అంటూ ఉంటారు కూడా. కానీ ఇంత సేపు ఇలా ఒకరిని అనడం, ఒకరి గురించి చెప్పుకోవడమేనా?? కలికాలం. మనుషులను కూటికి, గుడ్డకు, నిలువ నీడకు ముప్పుతిప్పలు పెట్టి, వేధిస్తున్న కాలం. ఈ ప్రపంచంలో సరైన ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ ఎలాగోలా అమరినా ఉండటానికి కాసింత జాగా మాత్రం కలలాగే మిగిలిపోతుంది. ఫలితంగానే ఊరి పొలిమేరల్లో మురుగు ప్రాంతాలలో వెలిసే గుడిసెలు. ఇలాంటివన్నీ చూసి మనం ఏమి చేయగలం అనుకుంటాం. అంతే కానీ మనం ఏమి చేయలేమా?? అని మాత్రం చాలామంది ప్రశ్నించుకోరు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మరెన్నో సేవా ప్రణాళికలతో నిత్యం ఏదో ఒక విధముగా ఇలాంటి వాళ్ళ కోసం పాటు పడుతూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. అవాసాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్లకు భవిష్యత్తును మాత్రం ఇవ్వగలమనే భరోసా ఆ సేవా సంస్థలలో, అందులో ఉన్న వ్యక్తులలో మెండుగా కనబడుతుంది. ఈ ప్రపంచంలో మనిషి నిలబడాలంటే కాలవసింది చదువు. కానీ ఫీజులు, పుస్తకాల కోసం, దుస్తుల కోసం ఇట్లా ఎన్నో కారణాల వల్ల ఆ చదువుకు దూరంగా ఉంటున్న బాల్యాలు బోలెడు. ముఖ్యంగా చదువుకోవడానికి బడికి వెళితే వాళ్లకు కడుపుకు తిండి ఎలా?? ప్రభుత్వం అన్ని విధాలా వాళ్లకు అన్ని అవసరాలు అందించినా ఆ పిల్లలే పనులు చేయకుండా ఉంటే గడవడం ఎలా?? ఇలాంటి ఎన్నో సందిగ్ధమైన ప్రశ్నల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ బాల్యం. మరేం చేయాలి?? చాలా కుటుంబాలకు తిండి, బట్ట, విద్య అనేవి పెద్ద సమస్య కాదు. అలాంటి కుటుంబాలలో ఉన్న పిల్లలకు వాటి ఆవశ్యకత గురించి తెలియజేయాలి. అలాగే చదువుకోవాలనే ఆసక్తి ఉండి, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటికి దూరమైన పిల్లలు ఎందరో ఉంటారు. తమ వంతుగా కనీసం సంవత్సరానికి ఒక పిల్లవాడి చదువుకు సహాయపడితే ఆ పిల్లవాడి భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. అంతే కాదు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు కదిలే వాళ్ళ తపన చూసి మీ మీ కుటుంబాలలో ఉన్న పిల్లలకు కూడా చదువు మీద ఒకానొక భక్తి ఏర్పడుతుంది. చాలామందికి పుట్టినరోజులు అంటే ఎంతో సంబరమైన రోజులు, అయితే ఆర్థిక లేమితో బాధపడేవారు ఎవరూ లేని అనాథ పిల్లలు ఇలాంటి వేడుకలు ఏమి లేకుండా అన్ని రోజులను ఓకేవిధంగా గడిపేస్తూ ఉంటారు. మీ మీ కుటుంబాల్లో జరిగే వేడుకలు, సంబరాల హడావిడి కొద్దిగా తగ్గించుకుని ఆ మిగిలి డబ్బుతో ఇలాంటి పిల్లల పుట్టినరోజులు జరిపితే ఎంతో సంబరపడతారు.  ఇది ఒకటి అయితే మరొకటి వృద్ధుల సమస్యలు. వయసు ఉన్నన్నాళ్లు ఎంతో కష్టపడి, పని చేసి, డబ్బు సంపాదించి, పిల్లలకు పెట్టి, వయసయ్యాక ఎలాంటి ఆధరువు లేకుండా బిక్కు బిక్కుమనే పండుటాకులు ఎన్నో. వాళ్లకు కావాల్సింది పూటకు ఇంత తిండి, ఏదో ఒకరోజు కొద్దీ సమయం ఆప్యాయంగా పలకరించడం. ఇప్పుడు వెలసిన ఎన్నో వృద్ధాశ్రమాలలో, వీధులలోనూ, ఫూట్ పాత్ ల వెంటా ఎందరో వృద్ధులు ఆరిపోయే దీపాల్లా మెల్లగా సాగుతుంటారు.  సాధారణ మనిషి తన జీవితంలోని పుట్టినరోజుల్లోనూ, పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇట్లా ఎన్నో సందర్భాలలో అయ్యే ఖర్చులో కాసింత తగ్గించికుని ఇలాంటి దిక్కులేని పిల్లల కోసం, పండుబారిన వృద్ధుల కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే వారికోసం ఖర్చు చేస్తే దైవం మానుష్య రూపేణా అనే మాటకు సార్థకం చేసినవారు మీరే అవుతారు. ◆ వెంకటేష్ పువ్వాడ    

మీలో స్పోర్టివ్ నెస్(లెస్) ఎంత??

ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి  విషయానికి పోటీ పడాలి. ముఖ్యంగా నగరజీవనంలో  నడక అస్సలు పనికిరాదు. పరిగెడుతూనే ఉండాలి. అవకాశాల కోసమూ, అవసరాల కోసమూ. కొందరికి అదొక ఛాలెంజ్ అయితే మరికొందరికి జీవన్మరణ సమస్య కూడా అవుతుంటుంది. కాకపోతే ఈ బిజీ జీవితాల్లో, గందరగోళంలో ఎవరూ ఎక్కువగా గమనించరు అంతే. అందుకే జీవితాన్ని బతకడమనే పరుగుపందెంలో దించి పరిగేడుతూనే ఉంటారు అందరూ.  చిన్ననాడు ఆడుతూ పాడుతూ మొదలు పెట్టిన పరుగు క్రమంగా విద్య, ఉద్యోగం, సంసారం, ఆశలు, ఆశయాలు, పిల్లలు, వాళ్ళ చదువులు, కుటుంబంలో అందరిని కాంప్రమైజ్ చేయాలనే ఆలోచన ఇట్లా అన్నిటి కోసం పరుగు పెడుతూనే ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ పరుగులో ఏదొక అడ్డంకి వల్ల తూలి పడటమో, లేక శక్తి చాలక పడిపోవడమో లేక ఇంకా వేరే కారణాలు కూడా ఉండచ్చు.   కానీ పడిపోగానే ఇక ముగిసిపోయినట్టు కాదు కదా. సాదారణంగా చాలామంది జీవితంలో సఫర్ అయ్యేది విద్య ఉద్యోగమనే అంశాల్లోనే. సరైన విధంగా టార్గెట్ చేరుకోకపోవడం చధవలేకపోవడం, చదివినా సరైన ఏకాగ్రత లేక చదివిన దాన్ని గుర్తుపెట్టుకోలేక పరీక్షల్లో పేలవమైన మార్కులు, ఫెయిల్ అవ్వడాలు ఇట్లాంటివి ఎదురవుతూనే ఉంటయి విద్యార్థుల జీవితంలో. ఇక విద్య ముగిశాక, ఉద్యోగం సంపాదించాక హమ్మయ్య అనుకోలేరు ఎవరూ. ఎందుకంటే ఉద్యోగం కూడా హాయిగా ఏమి సాగదు. టార్గెట్లు, ప్రాజెక్టులు, పై ఆఫీసర్లను మెప్పించడంలోనూ, వర్క్ పరంగా సాటిసిఫాక్షన్ అయ్యేలా చేయడంలో విఫలం అవుతూ ఆత్మన్యూనతకు గురయ్యే ఉద్యోగస్తులు కూడా ఎందరో.  అయితే ఓటమి నుండి పాఠం నేర్చుకుంటూ గెలుపు కోసం మరింత కష్టపడుతూ, తమని తాము మెరుగుపరుచుకునే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. వాళ్ళందరిలో లోపించింది ఏమిటి అంటే ..... క్రీడాతత్వం. దాన్నే స్పోర్టివ్ నెస్ అని అచ్చంగా ఆంగ్లంలో అనేస్తున్నారు. క్రీడలనేవి చిన్నప్పటి నుండి మనకు తెలిసినవే. అయితే రాను రాను చదువుల పేరుతో వాటికి దూరం గా పిల్లలను కేవలం పుస్తకాలతోనే ఉంచడం వల్ల వాళ్లలో పెద్దయ్యే కొద్దీ గెలుపు ఓటమి అనేవాటిని ఎలా సమానంగా తీసుకోవాలి అనే విషయం అవగాహనలో లేక ఒత్తిడిలో పడిపోతున్నారు. అందుకనే మానసికంగా కూడా దృఢంగా లేక చిన్న విషయలకే ఎంతో డిస్టర్బ్ అయిపోతుంటారు ఇప్పటి తరం.   క్రీడాతత్వం వల్ల ఏమి ప్రయోజనం??  ప్రతి పనిలో విఫలం, సఫలం సహజం. పోటీ ప్రపంచంలో గెలుపు, ఓటమి మరింత సహజం. వందమంది పోటీ పడే ఉద్యోగానికి ఒక్కరే ఎంపిక అవుతారు. అందులో మిగిలిన 99 మంది పనికిరాని వాళ్ళని కాదు లెక్క. వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందని, లేక అమలుపరిచే చోట ఏదో తప్పిదం చేసారని కూడా అనుకోవచ్చు. అదీ కాదు అంటే ఆ గెలిచిన వాళ్ళు, ఎంపికైన వాళ్ళు, ఇతరుల కంటే ఇంకా మంచి ప్రణాళికతో సన్నద్ధం అయ్యి ఉండవచ్చు.  ఇట్లా విషయన్ని  అన్ని విధాలా విశ్లేషించుకుని, విమర్శించుకుని తమలో ఉన్న లోటుపాట్లను తెలుసుకునేల చేసేది క్రీడాతత్వమే.  అంతే కానీ ఒడిపోవడాన్ని సమర్థించుకోవడం కాదు. ఓటమికి గల  కారణాలను తెలుసుకోవడం. పరిశీలన, ఏకాగ్రత, విభిన్న ప్రణాళికలు, వవాటిని అమలుపరిచే విధానం, ప్రతి విషయాన్ని చూసే కోణం, స్పందించే తీరు వీటన్నిటి వల్ల మనుషులతో మెలిగే విధానం. వ్యక్తిత్వ పరంగా పరిపక్వత వంటివెన్నో ఈ క్రీడాతత్వం వల్లనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీలో కూడా ఈ స్పోర్టివ్ నెస్ ఉందా?? లేదా లెస్ గా ఉందా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.                                                                                       ◆ వెంకటేష్ పువ్వాడ

 వీళ్ళు ప్రత్యేక వంటలోళ్లండి!!

ఇంకెవరూ వంటలు చేసేవాళ్లే. అబ్బాబ్బా ఏమి చెప్తిరి ఆ విషయం మాకు తెలియదా అనుకుంటారా??అసలు అనుకోవద్దు. ప్రతి ఇంట్లో వంటలు చేసేవాళ్ళు ఉంటారు ఆ మాత్రానా వంటలోళ్లం అయిపోతామా?? కాదు కదా!! మరి ఈ వంటలోళ్ళ గురించి కథ ఏమిటి అంటే….. ప్రతి ఇంట్లో సాపాటు తొందరగా కాకపోతేనో, ఏదైనా సమస్య వల్ల కుదరకపోతేనో అందరూ పడే పాట్లు ఏమి లేవు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఊర్లో ఎన్నో హోటల్స్ మరెన్నో రెస్టారెంట్స్, మరెన్నో చిన్న చిన్న బడ్డి కొట్టు లాంటివి, వాటికి మించి తోపుడు బండ్ల పైన అమ్మే స్ట్రీట్ ఫుడ్ కింగ్స్ ఎక్కువ. ఎక్కువ మంది బతుకు తెరువు కోసం తోపుడు బండ్ల మీద టీ లు అమ్ముతూ క్రమంగా టిఫిన్ సెంటర్లు, తరువాత హోటల్స్ ఇట్లా మెల్లిగా ఎదిగినవారే. వీళ్ళలో చాలామటుకు జీవితం కోసం అలా మారినవారే, పైగా చిన్న పెట్టుబడితో కాసింత రుచిగా వండి మర్యాదగా వడ్డిస్తూ లాభాలు ఆర్జిస్తూ జీవితాలను కాసింత ఒడిదుడుకుల వల్యం నుండి బయటకు లాగి భరోసాను ఇచ్చుకున్న వాళ్లే. అందులోనూ తిండి లేకపోతే మనిషి పని ముందుకు సాగదు. కారణాలు ఏవైనా హోటల్స్ లో తినేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఏరి కోరి ఇందులోకి వచ్చేవాళ్ళు ఉన్నారు.   ఎందులోకి అనే అనుమానం వచ్చిందా?? అదే అదే వంట చేయడమనే విద్యలోకి. ఏ ఇంట్లో అయినా మగవాళ్ళు వంటింట్లో దూరి ఏదో ఒకటి వండుతుంటే,  హవ్వా!! మగాడు వంటింట్లో వంట చేస్తుంటే ఆ ఇంటి ఆడవాళ్లు బాగా తింటున్నారా అని కొందరు అంటారు. కానీ వంట చేయడం అనేది కూడా ఒక వృత్తిలో బాగమైపోయింది ఇప్పుడు అని చెబితే దానికి మాత్రం ఓహో అని గమ్మునైపోతారు.  స్టైలిష్ గా చెఫ్స్… ఎప్పుడైనా పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే అక్కడ వంట చేసేవాళ్ళు ఉంటారు.  వాళ్ళను వంటోళ్లు అని కొట్టి పడేయకూడదు. వాళ్లలో ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఎక్కువగా మగవాళ్ళు ఉండటం విశేషం.  ఏమిటా ప్రత్యేకత??  కళాత్మకత. కాసింత కళాపోషన ఉండాలోయ్ అన్నట్టు వీళ్ళలో ఆ కళాపోషణ పాళ్లు అధికమనే చెప్పాలి. చేసే వంట నుండి, దాన్ని చేసే విధానం, కురముక్కలు కోసే పద్దతి, వంటకు తగ్గట్టు దాన్ని ఎలా ఎంత మంట మీద వేయించాలి, లేదా ఉడికించాలి వంటివి మాత్రమే కాకుండా ఆఖరికి వంట మొత్తం అయ్యాక దాన్ని ప్లేట్ లో పెట్టి దానికి గార్నిష్(అలంకరణ) చేయడం వరకు ప్రతి చోట వాళ్ళ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ వాళ్ళు ఎదో మొక్కుబడిగా చేసేయడం లేదా వచ్చినట్టు చేయడం కాకుండా లక్షలు పోసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లు చేసి కష్టపడి, ఇష్టపడి నేర్చుకొని వండటం మీద వాళ్లకున్న ఇష్టాన్నే వాళ్ళ వృత్తిగా మార్చుకునావాళ్ళు వాళ్ళు. అదే సాదారణంగా వంట చేసేవాళ్లకు, చెఫ్స్ కు ఉన్న తేడా!! ప్రయోగాలు, విభిన్న రుచులు, విదేశీ వంటకాలతో  కనువిందు చేస్తూ అందరికి విందు అందించే ఈ చెఫ్స్ పాకాశాలలో ఇప్పుడు కింగ్స్ గా గరిటలతోనూ ఘుబాళింపులతోనూ లీనపోయి ఉన్నారు. మీకూ వండటం అంటే ఇష్టమైతే దాన్నే వృత్తిగా ఎంచుకోవాలని ఉంటే చెఫ్స్ అయిపోండి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        ◆ వెంకటేష్ పువ్వాడ

సంగీతంతో ఒత్తిడిని జయించండి

మారుతున్న పరిస్థితుల కారణంగా, జీవన నడవడికలో రకరకాల ఒత్తిళ్లు మన మనోధైర్యాన్ని పరీక్షిస్తాయి. అయితే సమయానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లకుంటే మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మార్కుల వేటలో మధనపడుతుంటారు. వ్యాపారస్తులు లాభార్జనకు తపిస్తుంటారు. ఇంటిని ఆర్ధికంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి గృహిణి పరితపిస్తుంటుంది. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు రకరకాల కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై కొన్ని సందర్భాల్లో జీవితాలను కూడా త్యజిస్తారు. *ఒత్తిడికి ప్రధాన కారణం  మనం ఏదైనా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టేముందు దాని ద్వారా కలిగే ఫలితాన్నీ ఎక్కువ ఊహించుకోవడం ఆ సమయంలో ఏవైనా ఇబ్బందులు కలిగి మనం అనుకున్నట్లు జరగకున్నా కృంగిపోతాము. ఇదే ఒత్తిడికి ప్రధాన కారణం. టార్గెట్లు పెట్టుకొని పని చేయడం కూడా మంచిది కాదు. ఉదాహరణకు నూతన పెళ్లి చేసుకున్న దంపతులు పాశ్చాత్య పోకడుల కారణంగా ఒకరిపై ఒకరు ఎక్కువ ఊహించుకొని ( expectations) అది నిజ జీవితంలో సాకారం కాకపోవడం వలన ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ మధనపడి పోతుంటారు. ఇదో రకం ఒత్తిడి. ఇలా రకరకాల ఒత్తిళ్ల కారణంగా క్షణికావేశంలో విపత్కర నిర్ణయాలు తీసుకుంటున్నవాళ్ల గురించి మనం రోజూ టీవీల్లో చూస్తున్నాము. పత్రికల్లో చదువుతున్నాము. అయితే పరిస్కారం లేని సమస్య అంటూ ప్రపంచంలో లేదు అని అందరూ గుర్తించుకోవాలి. మౌనంగా మనతో మనం మాట్లాడుకుని సమస్యను విశ్లేషించుకుంటే పరిస్కారం కచ్చితంగా దొరుకుతుంది. *సంగీతంతో ఒత్తిడిని జయించండి పని వలన కావచ్చు లేదా ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఏదొక వ్యాపకం మనల్ని ఆ కఠిన క్షణాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందులో ప్రధానమైనది సంగీతం. ఇష్టమైన సంగీతాన్ని వింటూ కాలాన్ని గడిపితే ఆ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ వినిపించే పాటలో అందులోని మాటల్లో నే ఏదొక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మనసుకు ఆరోగ్యకరమైన ఎంతో ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. *పుస్తక పఠనంతో కూడా..! పుస్తక పఠనం తో కూడా ఒత్తిడిని జయించవచ్చు. ఏదైనా సమస్యతో ఒత్తిడితో ఉన్నప్పుడు ఇష్టమైన పుస్తకం చదవండి. ఖచ్చితంగా ఆ సందర్భానికి ఏదొక పేజీ లో మీ సమస్యకు పరిస్కారం చూపే మాట కనిపిస్తుంది. ఇలా కొన్ని వ్యాపకాలతో మనం ఒత్తిడిని జయించవచ్చు. ◆ వెంకటేష్ పువ్వాడ

ఏమి చెబుతోంది సంస్కృతి

విభిన్న మతాల నిలయం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం దీని వైశిష్ట్యం. ఎన్నో మతాలు, ఎన్నో రకాల సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా సంప్రదాయమనే చట్రంలో భాగాలు. ప్రతి మతానికొక గ్రంథం, ఆ గ్రంథాన్ని అనుసరించి మతం పుట్టుక, అందులో సంప్రదాయాలు. ఇలా అన్ని రకాల మతాలకూ అన్ని రకాల సంప్రదాయాలు. కానీ ప్రతి మతం చెప్పేది ఒకటే మనిషి మనిషిగా జీవించాలని, మనిషి సాటి మనిషిని ప్రేమించాలని, తనకున్నదాంట్లో కాస్తో కూస్తో లేనివారికి ఇవ్వాలని. ఇలా అన్ని మతాలు కలిసి మన భారత సంస్కృతిని గొప్పగా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా మతాల గొడవలు, ఇంకొక మతాన్ని విమర్శించడం, ఆ మతంలో దేవుళ్లను తిట్టిపోయడం, పురాణం గ్రంథాలలో చెప్పబడిన వాక్యాలకు పూర్తి అర్థం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం. కారణం ఏమిటి??  ఆధిపత్యం….. భారతదేశానికి ఎంత చరిత్ర ఉందొ అంతకంటే పెద్దది హిందూ మతం చరిత్ర, అలాగే మిగిలిన మతాలు కూడా వివిధ దేశాలలో వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పుట్టినవే. కానీ ప్రస్తుతం మాత్రం మతాధికారమే దేశ పాలనకు మూలమని, దోచుకోవడానికి అదే సరైన మార్గమని భావిస్తున్న వారు కోకొల్లలు. అవగాహన లోపం--- సంస్కృతిలో భాగంగా, సంప్రదాయంలో భాగంగా ఏ మతంలోనూ పూర్తిగా తమ మాత గ్రంథాలను పూనాదితో సహా చదివి ఉండరు. వాళ్లకు తెలిసినది కేవలం అమ్మల మాటల్లోనూ, అమ్మమ్మల కథలోనూ, తాతలు చెప్పిన కథల్లోనే సగం సగం విషయాలు తెలుసుకుని వాటినే పట్టుకుని వేలాడుతూ, ఎక్కడో చరిత్రలో జరిగిన సంఘటనలను వాటి వెనుక మూలలను తెలుసుకోకుండా ద్వేషం, పగ పెంచుకుని మతాల మధ్య శత్రువుల్లా తయారవడం.మూఢనమ్మకంనమ్మకాలు మంచివి. మతాలలో సంప్రదాయాలలో భాగం కాబడిన విషయాలు చాలావరకు శాస్త్రీయతో కూడుకున్నవి. కానీ అక్షరాస్యత ధరించిన అజ్ఞానులకు వాటిని అర్థం చేసుకోడం రావట్లా. ఫలితంగా మూఢనమ్మకాలు, ఎత్తిపోతలు, విమర్శలు, ఘాటుగా స్పందించడాలు.కొందరు కొన్ని స్వప్రయోజనాలకోసం సృష్టించిన సంప్రదాయాలు ఉన్నాయి కానీ హేతువాదనికి దూరంగా ఏ సంప్రదాయం ఎక్కువ కాలం నిలబడదు కదా!!   ఏమి చెప్పాలి పిల్లలకు?? ముందు తరాలకు అందించే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది సంస్కృతే,  పిల్లలకు చిన్నతనం నుండే ప్రతి విషయాన్ని కారణంతో, మూలలతో సహా వివరించి చెప్పాలి. తద్వారా వారిలో అవగాహన పెరుగుతుంది, ఆలోచన విస్తృతం అవుతుంది అంతే కాదు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆలొచనాత్మకంగా చూస్తారు, ప్రతి అడుగును విశ్లేషించుకుంటూ వేస్తారు. ఇదే సంస్కృతి ఇచ్చే విజ్ఞానం. ఈ సంస్కృతిలో ఏ లోపం లేదు, లోపమున్నదల్లా మనిషి బుర్రలో. ఇక్కడ విషయం ఏమిటంటే తాను బాగుపడకపోయినా ఇంకొకరు బాగుపడుతున్నారు అంటే బాధపడిపోయే మనుషులున్న సమాజమిది.   సొంత లాభం కొంత మానుకో--- పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలు అక్షరాల సత్యమని నమ్మి వాటిని జీవితంలో ఆచరణలో పెట్టేవాళ్లు చాలా తక్కువ. ఎప్పుడైతే ఈ దేశమంటే మట్టి కాదు మనుషులని, మనుషుల మధ్య సామరస్యత, కలుపుగోలుతనం, సహాయపడే గుణం పెంపొందుతుందో అప్పుడే  ఈ దేశ సంస్కృతి గొప్పదనం మరింత ఇనుమడిస్తుందని, అది తెలుసుకుని తాము పాటిస్తూ తమ పిల్లలకు చెబుతూ ముందు తరాలకు బహుమతిగా గొప్ప వ్యక్తిత్వాన్ని ఇస్తే మన సంస్కృతి నుండి మనం ఎంతో కొంత నేర్చుకుంటున్నట్టే!! ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆకలి మీద బ్రహ్మాస్త్రం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది పెద్దల మాట. అంటే అన్నాన్ని దైవంతో సమానంగా చూస్తారు. శరీరానికి శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని చేకూర్చి జీవితకాలాన్ని హాయిగా సాగేలా చేసేది ఆహారం. అన్నమే కాదు మనిషి కడుపు నింపే ప్రతి ఆహారం కూడా దైవ స్వరూపమే. ఒక పండ్ల మొక్క నాటుతాం, లేదా విత్తనాన్ని విత్తుతాం. దానికి నీళ్లు పోసి, అపుడపుడు కలుపు తీస్తూ, దానికి పోషకంగా ఎరువులు వేస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు నిరీక్షిస్తే అప్పుడు చెట్టుగా ఎదిగి కాయలు కాస్తుంది. ఆ కాయలున్న చెట్టును పెంచిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా కాడుకుని కాయలు పండ్లుగా మారే దశలో వాటిని కోసి, మార్కెట్లలోనూ లేక రోడ్ల మీద లేక ఇంకా ఇతర మార్గాల ద్వారా అమ్ముతారు. ఒక పండు ధర పది రూపాయలు అయితే దాని వెనుక ఒకరు లేదా ఇంకా ఎక్కువ మంది కష్టం చేసి చిందించిన చెమట తాలూకూ అనుభవాలు కూడా ఉంటాయి. కానీ కొన్న వాటి మీద ఏదో హక్కు ఉన్నట్టు సరిగా తినీ తినక, చెత్త బట్టలలోకి వేస్తూ పండు తాలూకూ కష్టాన్ని అవమానిస్తూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి విషయాలు తెలియదు. చాలా ఇళ్లలో పిల్లలు సగం తిని వదిలేసిన పండ్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళది తెలియని వయసు కావచ్చు కానీ పెద్దలది తెలియని వయసా?? లేక డబ్బె పెట్టి కొనడం ద్వారా వచ్చిన నిర్లక్ష్యపు ధోరణినా?? అన్నమో రామచంద్ర!! ఒకవైపు  ఇంట్లో ఇలాంటి వృథా జరుగుతూ ఉంటే మరొకవైపు బయట మాత్రం అన్నమో రామచంద్ర అని ఆకలికి నకనకలాడుతున్న అభాగ్యులు ఎందరో!!  మనకేంటి తల్లిదండ్రులు కొద్దో గొప్పో మంచి జీవితాన్నే ఇచ్చారు, ప్రతి తల్లిదండ్రి అలాగే ఇవ్వాలని అనుకుంటారు కూడా, కానీ కొన్ని జీవితాలు తెగిన గాలిపటాల్లా ఉంటాయి. గాలి ఎటు వేస్తే అటు గాలిపటం వెళ్లినట్టు, ఎక్కడ పని దొరికితే అక్కడ చేసుకుంటూ బతికేవాళ్ళు ఉంటారు. కష్టానికి తగ్గ డబ్బులు చేతికి అందని అమాయకులు ఉంటారు, దోపిడీ చేయబడేవారు, బానిస బతుకుకు లోబడిన వారు ఇలా ఎందరో!! వీళ్ళందరూ మురికివాడల్లోనూ, ఊరి పొలిమేరల్లోనూ చిన్న గుడిసెలు వేసుకుంటూ రేపటి గూర్చి కాకుండా ప్రస్తుతం గడిచిపోవడం గురించి ఆలోచిస్తూ బతికే వాళ్ళు. అలాంటివాళ్ళకు ఒకోసారి తిండి కష్టం అవుతుంది. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లడం కష్టమవుతుంది. మరోవైపు అన్నదాతా సుఖీభవ అనే స్లోగన్ లతో తెగ చైతన్యపు గొంతులు వినబడతాయి కానీ, ఆహారం దగ్గర అదొక అజమాయిషీ చేసేవాళ్ళు కోకొల్లలు. ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుని, నచ్చినంత తిని, చెత్తబుట్టలో పడేసేవాళ్ళు ఎక్కువ.  జనాభా పెరుగుదల, పేదరికపు  సమస్య, జనాభా లెక్కల్లో నమోదు కాని ప్రజల దైన్యం, పారిశ్రామిక అభివృద్ధిలో యంత్రాల పాత్ర పెరుగుతూ మనిషికి సగటు ఉపాధి మార్గాలు దొరకక, ప్రభుత్వ పథకాల లబ్దికి నోచుకోక, నిరంతరం జీవితంతోనూ, ఆకలితోనూ యుద్ధం చేసేవాళ్ళు ఎందరో కనబడుతుంటారు.  ఇప్పుడేం చేయాలి?? అవగాహన ముఖ్యం, తదుపరి ఆచరణ అవసరం. అవగాహన చాలామందిలో ఉంటుంది, నిజానికి మనుషులుగా పుట్టిన అందరికి ఆకలి విలువ తెలుసు, అయితే వారి మనసు అంతరాలలో అది ఎక్కడో పెద్ద ప్రాధాన్యత లేని అంశంగా మరుగున పడి ఉంది. దాని ప్రాముఖ్యాన్ని మొదట గుర్తించాలి. ప్రతి మెతుకు వెనుక కష్టాన్ని, ప్రతీ పంట సాగుకు చిందే చెమట ధారను తెలుసుకుంటూ, పిల్లలకు చెబుతూ ఉండాలి.  పెళ్లిళ్లు, శుభకార్యాలలో అనవసరపు డాబు పోకుండా ఆహారాన్ని దైవంగా భావించి వీలైనంత వరకు వృథా కాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి ఇంట్లో పిల్లలతో ఒక చిన్న విత్తనాన్ని నాటించి వాళ్ళతోనే ఆ మొక్క సంరక్షణ చేయిస్తూ ఉంటే దాని తాలూకూ ఫలితం తప్పకుండా పిల్లల క్రమశిక్షణతో, నడవడికలో, ముఖ్యంగా ఆహారం పట్ల అవగాహన, వృథా చేయకుండా ఉండటం వంటివి అర్థమవుతాయి.అలాగే పిల్లలకు అపుడపుడు ఆహారానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళను చూపిస్తూ వారి కష్టాన్ని తెలియచేస్తూ ఉండాలి. దానివల్ల తాము వృథా చేయడం మాని ఇతరులకు ఇవ్వడమనే మంచి అలవాటు కూడా పెంపొందుతుంది. తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలిగిన వాడే మనిషోయ్ అనే మాట నిజమవ్వాలంటే ఆహారం తీసుకోవడం చాలా అవసరమని ఆహారం తీసుకోవడం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, వృథా చేయకుండా అంతే జాగ్రత్త వహించాలని పిల్లలకు చెబుతూ పెద్దలు ఆచరిస్తే ఈ భారతంలో ఆకలి బాధ ఎక్కడో ఒకచోట పరోక్షంగా అణువంత అయినా తగ్గించిన వాళ్ళం అవుతాము.                                                                                                                             ◆ వెంకటేష్ పువ్వాడ

బా(బ్ల)డీ షేమింగ్ చేస్తున్నా(రేమో)రా?.. జాగ్రత్త!

సమాజంలో మనుషులు తమని తాము చూసుకోవడం కంటే, పక్కన ఉన్న మనుషులను గమనించడానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. పక్కన మనిషిని విమర్శించడం అనేది ఎన్నో చోట్ల ఎక్కువగా కనబడే అంశం. తోటి విద్యార్థులు, సహా ఉద్యోగస్తులు, స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు ఇలా అందరి దగ్గర నుండి ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధమైన విమర్శను ఎదుర్కొంటూ ఉంటారు చాలా  మంది. అయితే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, జీవిత నిర్ణయాలు, చేసే పనులు ఇలాంటి వాటి విషయంలో విమర్శ ఎదురైనా వాటిని ఆలోచించి ఒకవేళ దాని వల్ల ఏదైనా మార్పు చేర్పులు చేసుకోగలిగే అవకాశం ఉంటే తప్పక చేసుకుంటారు ఆలోచన గల వాళ్ళు అయితే. కానీ ఇప్పట్లో చాలామంది ఎదుర్కునే సమస్య బాడీ షేమింగ్.  అసలేమిటి బాడీ షేమింగ్… ఎదుటి మనిషి శరీరాన్ని, శరీర రూపాన్ని, అందులో లోపాలను వేలెత్తి చూపడం మరియు విమర్శించడమే బాడీ షేమింగ్. ఇది కేవలం లావుగా ఉన్న వాళ్ళ విషయంలో జరుగుతుందన్నది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం సమాజంలో అధిక శాతం మంది బాడీ షేమింగ్ కు గురవుతున్నారంటే ఇది ఎంతగా వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు.  బాడీ షేమింగ్ ఎందుకు?? ఎదుటి వ్యక్తులు లావుగా ఉన్నా, లావుగా లేకపోయినా ఎగతాళి చేస్తూ విమర్శించడం. అమ్మాయిలలో కొందరు సరైన ఆహారం లేక కండర సామర్థ్యము పెంపొందక అవయవ సౌష్టవం లేకుండా ఉంటారు వాళ్ళను ఎగతాళి చేయడం. కొందరు జన్యు పరంగా లావుగా లేదా సన్నగా ఉంటారు వాళ్ళను ఎగతాళి చేయడం. జుట్టు పొడవుగా లేదనో, రంగు తక్కువ ఉన్నారనో, అందంగా లేరనో ఇలాంటివి మాత్రమే కాకుండా సరైన బట్టలు వేసుకోలేదనో, ఫాషన్ గా లేరనో, ఇతరుల అలవాట్లను ఇలా బోలెడు ఈ బాడీ షేమింగ్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు అయినప్పుడు వాటిని ఇతరులు విమర్శించడం ఎంతవరకు సమంజసం. నమ్మలేని నిజం!! ప్రతి వ్యక్తి జీవితంలో బాడీ షేమింగ్ మొదలయ్యేది కుటుంబం నుండే!! ఈ విషయం వినగానే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇదే నిజం. ముఖ్యంగా పెళ్లి తరువాత అందులోనూ గర్భవతులు అయ్యి ప్రసవం తరువాత అమ్మాయిల శరీరాల్లో వచ్చే మార్పులను వారి భర్తలు అర్థం చేసుకోకపోగా శరీరాన్ని, సౌష్టవాన్ని విమర్శించడం, గేలి చేయడం వంటివి చేస్తారు. శరీర మార్పులకు కారణమైన స్థితులను అర్థం చేసుకోవాలి. అలాగే కంపెర్ చేయడం కూడా బాడీ షేమింగ్ లో ఫస్ట్ పాయింట్. ఇతరులను చూపించి వాళ్ళలా నువ్వు లేవు అని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అలాగే సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీ లు ఇలాంటి వాళ్ళ ఫిట్నెస్ చూసి భార్యలను మాటలతో హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. ఫలితంగా తిండి విషయంలో ఎంతో మాధనపడిపోతుంటారు మహిళలు. కేవలం ఆడవాళ్లేనా?? ఈ బాడీ షేమింగ్ లో మగవాళ్ళు కూడా ఉన్నారండోయ్!! మగవాళ్ళు అంటే శరీరం కండలు తిరిగి హీరోల లెక్క ఉండాలని అపోహ పడేవాళ్ళు బోలెడు. అలాగే పొట్ట ఉందని, బట్టతల ఉందని విమర్శించేవాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టైల్ గా ఉన్నా దాన్ని కూడా విమర్శించేవాళ్ళు, వస్త్రధారణ  విషయంలో, ఇంకా కొందరు అబ్బాయిలలో జన్యు పరంగా మీసాలు సరిగా రాకపోవడం, అమ్మాయిలలా వక్షోజాల్లా ఎత్తుగా ఉండటం, ఇవి మాత్రమే కాకుండా కొందరు చెవిపోగులు వంటివి పెట్టుకున్నా, చేతులకు పచ్చబొట్టులు వంటివి వేయించుకున్న ఇలా ప్రతీ విషయంలో బాడీ షేమింగ్ చేసేవాళ్ళు బోలెడు.  ఎలా మారుతుంది ఈ ధోరణి!! ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కేవలం ఆ వ్యక్తి చేతిలో ఉన్నంతవరకు ఏ బాడీ షేమింగ్ ఎక్కడా కనబడదు. కానీ ఎప్పుడైతే ఇతరుల వ్యక్తిగత  విషయాల్లో తల దూర్చి ప్రతీది విమర్శించడం మొదలెడతామో అప్పుడే ఈ బాడీ షేమింగ్ పెరుగుతూ పోతుంది. కాబట్టి మొదట చేయాల్సింది ప్రతి ఒక్కరు ఇతరుల వ్యక్తిగత విషయాలను వేలెత్తి చూపకపోవడం. ఇక్కడ గమనించాల్సిన విషయమొక్కటే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం. కాబట్టి ఎవరిని ఇంకొకరితో పోల్చడం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ చేయకూడదు.  ఒకవేళ మీరు గనుక ఇలాంటి బాడీ షేమింగ్ చేస్తుంటే బ్లడీ షేమింగ్ చేస్తున్నారనే అర్థం!! ఆలోచించండి మరి.

ఇవి చెక్ చేసుకుంటే జీవితం మారిపోతుంది

జీవితంలో మనిషికి టార్గెట్ లు ఎన్నో!! ప్రతి విషయంలోనూ ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ చివరలో నిర్ణయం తీసుకునేటపుడు మాత్రం వెనకడుగు వేస్తారు. కారణం భయం. ఎందుకు అంటే ఫలితం ఎలా ఉంటుందో!! దానివల్ల సమస్యలు వస్తాయేమో!! ఆ నిర్ణయం వల్ల ఇప్పటికంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో!! ఇలాంటివే కారణాలు.  ఇవన్నీ జీవితం పట్ల జాగ్రత్తల్లా అనిపిస్తాయి  కానీ జాగ్రత్తలు కాదు జీవితాన్ని ఎదగనీయకుండా పెట్టె ఇబ్బందులు. అతి భయాలు అనుకోవచ్చు.  కేవలం ఇవి మాత్రమే కారణాలా లేక ఇంకా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనే విషయం ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకుంటే….. తరువాత…… ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా మంది, తరువాత ఏమవుతుందో…. అనే భయంతో ఆగిపోతారు. తరువాత ఏమయ్యేది లేనిది తెలిసేది ముందు నిర్ణయం తీసుకుని అడుగేస్తేనే కదా!! ఏమో అనుకున్నదానికంటే  ఇంకా పెద్ద ఫలితం సొంతమవచ్చేమో కదా!! భయంతో అరుదైన అవకాశాలు, జీవితంలో గొప్ప ప్రయత్నాలు వదిలేసుకోకూడదు కదా. ఆత్మవిశ్వాసపు రేపరెపలు…. జీవితంలో ఎంతో గొప్ప మలుపు అవుతుంది. కానీ దానివైపు వెళ్లాలంటే భయం అంటూ ఉంటారు. నిజానికి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు మంచి జరుగుతుందనే అవగాహన ఉంటేనే కదా ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తాం. అలాంటప్పుడు అపనమ్మకాన్ని మనసులో పెట్టుకోవడం ఎందుకు?? అవగాహన…. ప్రతి విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా సరే తీసుకునే నిర్ణయం వెనుక ఎంతో అవగాహన కలిగి ఉంటారన్నది నిజం. అసలు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాం. దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏమిటి?? అది ఎంత అవసరం?? వంటి ప్రశ్నలు ఎవరికి వారు తప్పకుండా వేసుకోవడం ద్వారా ఓ అవగాహనకు రావచ్చు. అవకాశంతో అందలం ఎక్కాలి కొన్నిసార్లు కొన్ని అవకాశాలు ఒక్క సారి వస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ రావడం బహుశా జరగకపోవచ్చు. కాబట్టి అవకాశం ముందున్నప్పుడు ధైర్యం చెయ్యాలి.  ఇతరుల జోక్యం…. సాదారణంగా ప్రతి పని విషయంలో, ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం సలహాలు తీసుకోవడం చేస్తుంటారు. అప్పుడు అవతలి వాళ్ళ అనుభవాలు చెబుతారు. అంతేనా ఆ పనిని గూర్చి ఇంకా ఇంకా ఏవో చెప్పి దాని మీద భయం ఏర్పడేలా చేస్తారు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలు కేవలం ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమో అవతలి వ్యక్తి ఆ పని పట్ల వంద శాతం పర్ఫెక్ట్ గా ఉన్నారో లేదో ఎవరికి తెలుసు. ఎప్పుడైనా చేసేపని పట్ల నమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సగం విజయాన్ని చేకూరుస్తుంది అనే విషయం మరువకూడదు.  మీరు ఒంటరి కాదు.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యావసానాల గురించి ఆలోచించేటపుడు నాకు ఒక కుటుంబం ఉంది, దాని సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అని విషయాన్ని మరువకూడదు. అలాగే  తీసుకోబోయే నిర్ణయం గురించి కుటుంబ సభ్యులతో వివరంగా చెప్పాలి. దాని గురించి చర్చించాలి. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో వాళ్లకు అర్థమయ్యేలా చెబితే  తప్పకుండా మీకు సపోర్ట్ లభిస్తుంది. ప్రణాళిక… నిర్ణయం వెనుక ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాలికను అనుసరించి మెల్లిగా అడుగులు వేస్తూ చేయబోయే పనికి సంసిద్ధం కావాలి. దానివల్ల గందరగోళం ఉండదు. గమ్యం ఏమిటో స్పష్టం గా తెలుసు కాబట్టి భయం అక్కర్లేదు. వాస్తవిక కోణం.. ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి పనీ విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో దీన్ని తప్పక అర్థం చేసుకోవాలి. మనం చేయగలిగింది పని పట్ల వంద శాతం కష్టపడటం, నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల నుండి ఆలోచించడం. ఇలా అన్ని చేసిన తరువాత వేసే అడుగుకు, తీసుకునే నిర్ణయానికి వచ్చే ఫలితం ఏదైనా దాన్ని స్పోర్టివ్ గా రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడే మనిషిలో జీవితం పట్ల కూడా ఓ అవగాహన ఏర్పడుతుంది. పైన చెప్పుకున్న అన్నిటినీ ఫాలో అయితే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడటం, ఆ తరువాత ఏదో అయిపోయిందని బాధపడటం అసలు జరగదు సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ