డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు! 

టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందాలో  ఉన్నారని బెంగళూరు పోలీసులే తెలిపారన్నారు. తెలంగాణ పరువు తీసిన  నలుగురు ఎమ్మెల్యే లను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఇప్పటి వరకు ల్యాండ్, శాండ్ , వైన్ డీల్ చేసే  టీఆర్ఎస్ నేతలు..  డ్రగ్స్ దందా లో కూడా వేలు పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక లో బీజేపీ తో మాట్లాడుకొని కేసును మాఫీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ .. కర్ణాటక లో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.  అధికార మదంతో అక్రమాలతో టీఆర్ఎస్ దుష్ట పాలన సాగిస్తోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజనుల పోడు భూముల సమస్యలను చెప్పడానికి సీఎం కేసీఆర్ సభకు వస్తే గిరిజన మహిళలను కుక్కలతో పోల్చారని మండిపడ్డారు.  టీఆర్ఎస్ నేతలు కళ్లు నెత్తికెక్కాయని,  మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూల్ చేస్తున్నారు ఉత్తమ్ అన్నారు. ఆడియో లీక్ అయినా మంత్రి మల్లారెడ్డి ని ఎందుకు భర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, సాగర్ ఎన్నికల ను నిష్పక్షపాత జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఉత్తమ్ అన్నారు. డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టీఆర్ఎస్ , బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తి ని పెట్టిందని ఆరోపించారు. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై సంగమేశ్వర లిఫ్టు కు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు.. రాయలసీమ కు నీళ్లు తరలిస్తే.. సాగర్ కు నీళ్లు రాకుండా పోతాయన్నారు. సాగర్ కు నీళ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్ ఓటర్లు ఉప ఎన్నికలో తగిన బుద్ది చెప్పాలన్నారు.     

కోర్టుకెళ్లే వాడికే వకీల్‌సాబ్ అంటే భయం..

పవన్ కల్యాణ్ అంటేనే కాదు, ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నాడా? అంటూ ఏపీ బీజేపీ వ్యవహారాల సహా ఇంఛార్జి సునీల్ దేవధర్ ప్రశ్నించారు. ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి తిరుపతిలోని జయశ్యాం థియేటర్ దగ్గర నిరనస తెలిపారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని సునీల్ దేవధర్ ప్రశ్నించారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ కవాతు చేసినప్పుడే అసలు సినిమా రిలీజైందని అన్నారు.  అటు, ట్విట్టర్‌లోనూ ఆయన ఘాటుగా స్పందించారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్ ను చూసి భయపడేది? అంటూ సెటైర్లు వేశారు సునీల్ దేవధర్.  ఓ సినిమా కోసం జాతీయ పార్టీ నాయకులు ఇలా నిరసన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రజా సమస్యలేమీ లేనట్టు ఒక్క బెనిఫిట్ షో కోసం బీజేపీ శ్రేణులు ఇలా థియేటర్ల ముందు ధర్నా తెలపడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది బీజేపీ ఓవరాక్షన్ అంటూ వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. 

ప్రైవేట్‌ టీచర్లకు సాయం ఇలా..

ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్‌ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని అంచనా వేయగా.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్‌ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లును మంత్రులు ఆదేశించారు.  ప్రైవేటు టీచర్లకు సాయంపై ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ సాయం అందేలా పకడ్భందీగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు వారి ఐడీ కార్డు, లేదా పాఠశాల వారు అందించే ఏదైనా ధ్రువపత్రంతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు, దరఖాస్తును జత చేసి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మొదట నిర్ణయించారు. ఆ పత్రాలను తనిఖీ చేసిన అనంతం అర్హులైన వారి ఖాతాలో డబ్బుల జమ చేయాలని భావించారు. వారికే రేషన్ షాపుల నుంచి బియ్యం అందించాలని చూశారు.  అయితే  ఈ రోజు మంత్రుల సమావేశంలో నిర్ణయించిన విధంగా రేషన్ షాపుల వారీగా అర్హులను గుర్తించనున్నారు. ఇలా అయితే సులువుగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బందికి తిరిగి పాఠశాలలు ప్రారంభించే వరకు నెలకు రూ. 2 వేలు, 25 కేజీల బియ్యం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించారు.ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం నేపథ్యంలో మంత్రులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 

గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆ ముగ్గురు..

ఒక అమ్మాయి. ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురూ ఒకరికి తెలీకుండా మరొకరు ఆ యువతిని ప్రేమించారు. ఆ విషయం తెలియడంతో అంతా గొడవ పడ్డారు. నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాల్ చేసుకున్నారు. గ్రౌండ్‌లో చూసుకుందామంటూ ఫైటింగ్‌కు టైమ్ ఫిక్స్ చేశారు. కట్ చేస్తే.. ఆ ముగ్గురూ డిష్యూం డిష్యూం. ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైటింగ్ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. కేసు నమోదైంది. ఆ ముగ్గురు ఇంటర్‌ విద్యార్థులు. అందులో ఇద్దరు మైనర్లు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో ఉండే 18 ఏళ్ల యువకుడు, మరో ఇద్దరు మైనర్లు ఇంటర్‌ చదువుతున్నారు. వాళ్లంతా ఫ్రెండ్స్. అందులో ఒకరి మేనకోడలు ఇంటర్‌ చదువుతోంది. అతను ఆమెను చిన్నప్పటి నుంచీ ప్రేమిస్తున్నాడు. వన్ ఫైన్ డే.. తన లవ్ మేటర్ ఆమెకు చెప్పేశాడు. అటునుంచి 'నో' వచ్చింది. ఇక అంతే, ఆ యువకుడు లవ్ ఫెయిల్యూర్‌తో ప్రస్టేషన్‌కు లోనయ్యాడు. ఎలాగైనా తన మేనకోడలిని ప్రేమకు ఒప్పించాలని అనుకున్నాడు. అందుకు తన స్నేహితుల సాయం కోరాడు. వారు సరేనన్నారు.  అయితే, ఆ ఫ్రెండ్స్ కన్నింగ్ గాళ్లుగా మారారు. వారు కూడా ఆమెను ప్రేమించడం స్టార్ట్ చేశారు. అందులో ఒకడు ఆమె మొబైల్‌కు 'ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ విషయం లీక్ అయింది. విషయం తెలిసి ఆ యువకుడు తన ఫ్రెండ్‌ని నువ్వెందుకు మెసేజ్ పెట్టావ్ అంటూ నిలదీశాడు. ఆ సందర్భంలోనే మరో స్నేహితుడు సైతం తాను కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ చెప్పేశాడు. దీంతో ముగ్గురి మధ్య లవ్ మేటర్ ముదిరింది. గొడవ మొదలైంది. అంతలోనే పెద్దదైంది. బస్తీమే సవాల్ అంటూ ఆ ముగ్గురూ సవాళ్లు విసురుకున్నారు. నిమ్స్‌మే గ్రౌండ్‌లో చూసుకుందామంటూ ఫైటింగ్‌కు స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. గ్రౌండ్‌లో ఆ ముగ్గురు పరస్పరం కొట్టుకున్నారు. అందులో ఒకడు బ్లేడ్‌తో అటాక్ చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తాలు కారాయి. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఆ ముగ్గురికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు. 

జగన్ కు జైలు భయం!

సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం.. ఈ మాట ఇటీవల కాలంలో ఎక్కువగా  వినిపిస్తోంది. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతలు అక్రమాస్తుల కేసులో జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు. కొన్ని రోజులుగా కమలనాధులు కూడా జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. జగన్ కేసులపై విచారణ జరుపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా జగన్ కు పదవి గండం ఉందని చెబుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.  తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు సీఎం జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే వైసీపీ ఎంపీలు పార్ల‌మెంటులో మాట్లాడలేక పోతున్నారన్నారని ఆయ‌న‌ ఆరోపించారు. త‌న‌ కేసుల నుంచి ఎలా బయటపడాలనే విష‌యంపైనే జగన్ ఆలోచిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి ఆలోచించ‌ట్లేద‌ని చెప్పారు. తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు..  రాష్ట్రంలో వైసీపీ నేత‌లు ఇసుక అమ్ముకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని  ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర విద్యా సంస్థ‌లు, రాష్ట్రంలో అభివృద్ధి ప‌నుల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌ని జ‌గ‌న్..  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఓట్ల కోసం మాత్రం ఇంటింటికీ లేఖ‌లు రాస్తున్నార‌ని విమర్శించారు. టీడీపీ పాల‌న‌లోనే తిరుపతిలో అభివృద్ధి ప‌నులు జరిగాయ‌ని అన్నారు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్ర‌శ్నించారు. తిరుప‌తి ఉప ఎన్నికలో త‌మ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని రామ్మోహ‌న్ నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

కత్తిపోట్లతో జంట హత్య! పాపం పసిపాప..

నాలుగేళ్ల పాప. బాల్కనీలో నిల్చుని బోరున ఏడుస్తోంది. ఆ చిన్నారి ఏడుపునకు చుట్టుపక్కల వాళ్లంతా పరుగున వచ్చారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. కాప్స్ వచ్చి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే తెరుచుకోలేదు. లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా.. అంతా షాక్. రక్తపుమడుగులో ఆ చిన్నారి పేరెంట్స్ చనిపోయి ఉన్నారు. ఒళ్లంతా కత్తి పోట్లు. అందుకే ఆ పాప ఏడుపు. అమెరికా న్యూజెర్సీలో భారతీయ దంపతుల అనుమానాస్పద మృతి కలకలంగా మారింది.  మహారాష్ట్ర, బీద్‌ జిల్లాకు చెందిన 32ఏళ్ల బాలాజీ రుద్రావర్‌ ఐటీ ఉద్యోగి. 2015 ఆగస్టులో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె. బాలాజీ భార్య ఆర్తి(30) ప్రస్తుతం 7నెలల గర్భిణి. పోలీసులు వచ్చే సరికి బాలాజీ, ఆయన భార్య లివింగ్‌ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలాజీనే తన భార్యను పొడిచి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆపై అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంటున్నారు.  దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న బాలాజీ కుటుంబానికి సమాచారమిచ్చారు. ‘‘నా కొడుకు, కోడలు చాలా ఆనందంగా ఉండేవారు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎలా చనిపోయారో అర్థం కావట్లేదు’’ అని బాలాజీ తండ్రి భరత్‌ రుద్రావర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి.. మృతుడి స్నేహితుడి సంరక్షణలో ఉంది. 

జగన్ కు బిగ్ షాక్... టీడీపీలోకి కడప వైసీపీ నేత! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ముందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి  ముఖ్య నేత ఝలక్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన నేత వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగు దేశం పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది.  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో  ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కడప జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ నేత రాంప్రసాద్ రెడ్డి కలిసారు. ఆయన ఈనెల 14వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రాయచోటిలో బలమైన నేతగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి వైసీపీని వీడటం కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో విభేదాల వల్లే ఆయన టీడీపీలో చేరుతున్నారని చెబుతున్నారు.  శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ఆయన రోడ్‌షో, ప్రచార సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా ఆయనకు నీరాజనం పట్టారు. పట్టణంలోని  ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. చంద్రబాబును చూసేందుకు మహిళలు, వృద్ధులు  పెద్ద ఎత్తున ఎగబడ్డారు. చంద్రబాబు అభివాదం చేసిన ప్రతి సందర్భంలోనూ కేరింతలు కొట్టారు. ప్రధాన రహదారుల వెంబడీ అటూ ఇటూ వున్న భవనాలపై నుంచీ ఆయనపై పూలవర్షం కురిపించారు. సూపర్‌ బజారు ప్రాంతంలో అయితే ఆయన రావడానికి ముందే రోడ్డంతా పూలతో నిండిపోయింది. ఇక చంద్రబాబు ప్రసంగానికి సైతం సభకు హాజరైన జనం నుంచీ పెద్దఎత్తున స్పందన కనిపించింది.దీంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అటు వైసీపీలో మాత్రం కలవరం మొదలైందని అంటున్నారు.   

కోర్టులు ఎవరి పక్షం? కులమేలా? కుతంత్రమేలా? 

సుప్రీంకోర్టు జస్టిస్ రమణపైనా పక్షపాత ముద్ర వేసిన ఘనుడు జగన్మోహనుడు. చంద్రబాబుకు అనుకూలమంటూ.. ఓకే కులమంటూ.. కోర్టులను మేనేజ్ చేస్తున్నారంటూ.. ఇలా నోటికొచ్చిన అబాంఢాలు వేశారు. హైకోర్టు తీర్పులు చంద్రబాబుకు ఫేవర్‌గా వస్తున్నాయంటూ వక్రీకరించారు. న్యాయం ఎటువైపు ఉంటే.. న్యాయ దేవత తరాజు అటువైపు మొగ్గుతుంది. అంతేకానీ, కులాన్ని చూసో, చంద్రబాబును చూసో.. తీర్పులు తయారవవు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్, ధర్మాసనం ఇలా అందరినీ, అన్నిటినీ మేనేజ్ చేయగల సత్తా భారతదేశంలో ఎవరికీ లేదు. అదే మన న్యాయ వ్యవస్థ గొప్పతనం. ఇంత తెలిసీ, చంద్రబాబుకు కోర్టులు, జడ్జీలు అనుకూలమంటూ అపవాదు మోపడం జగన్‌రెడ్డికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి.  బట్ట కాల్చి మీద వేయడమే వైసీపీ పని. చంద్రబాబు తనకు అనుకూలమైన వారిని, కమ్మ కులస్తులను న్యాయవ్యవస్థలో చొప్పించి, కోర్టుల్ని ప్రభావితం చేసాడు, చేస్తుంటాడు అనేది వైసీపీ ఆరోపణ. ఒకటికి పదిసార్లు ఇదే మాట అంటే.. అది నిజమై పోతుందనే కుతంత్రం. అందుకే, వైసీపీ నేతల నోటి నుంచి, ఆ పార్టీ మీడియా నుంచి నిత్యం ఇలాంటి కామెంట్లో వస్తుంటాయి. చంద్రబాబుకు, కోర్టులకు, జడ్జిలకు అక్రమ సంబంధం అంటగట్టే దుర్నీతి ఏళ్లుగా సాగుతోంది. చంద్రబాబును, కమ్మ కులాన్ని దోషులుగా చూపించే కుట్ర జరుగుతోంది. ఏకంగా న్యాయవ్యవస్థకే కులగజ్జిని అంటగట్టే కుత్రంతం నడుస్తోంది.  పేర్లు, లెక్కలు ఒకలా ఉంటే.. విషప్రచారం మరోలా ఉంది. ఉమ్మడి ఏపీ హైకోర్టు ఏర్పడిన నాటి నుంచి 1985 వరకూ తెలుగువారే ఎక్కువగా ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. 1985 తర్వాత ఇంతవరకూ ఏపీ హైకోర్టుకు తెలుగువ్యక్తి చీఫ్ జస్టిస్ అవనేలేదు. 1985కు ముందు మొత్తం 17మంది చీఫ్ జస్టిస్‌లుగా ఉంటే అందులో ఐదుగురు రెడ్డి కులస్తులు. అంటే ప్రతి ముగ్గురు చీఫ్ జస్టిసుల్లో ఒకరు రెడ్డి. ఈ ఐదుగురూ గొప్ప న్యాయకోవిదులు. రాజ్యాంగ నిపుణులు, చరిత్రాత్మక తీర్పులు వెలువరించినవారే. ఆ ఐదుగురు చీఫ్ జస్టిసులుగా నియమితులైన కాలంలోనే రాష్ట్రానికి ఐదుగురు రెడ్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. మరి, వారిపై ఆనాడు ఎవరూ రెడ్డి పక్షపాత ముద్ర వేయలేదే. వారందరినీ న్యాయమూర్తులుగా మాత్రమే చూశారు కానీ రెడ్డి జడ్జిలుగా చూడలేదు. అయితే, చంద్రబాబు హయాం వచ్చే సరికి న్యాయవ్యవస్థకు కుల ముద్ర ఆపాదించే హీన సంస్కృతి తెరమీదకు వచ్చింది.   హైకోర్టుకు ఇప్పటివరకూ 177మంది జడ్జీలు నియమితులయ్యారు. ఇందులో 32 మంది రెడ్లే. ఇందులో పది మంది రెడ్డి న్యాయమూర్తులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నియమించబడిన వారే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కమ్మవారిని చొప్పించాడు అనేది నిజమైతే, అంతకు ముందున్న రెడ్డి సీఎంలు ఇంత మంది రెడ్డి జడ్జిలను చొప్పించారని ఎవరైనా అనగలరా? అది తప్పు కానప్పుడు.. ఇది తప్పెలా అవుతుంది? అయినా, న్యాయమూర్తులకు కులం ఆపాదించడమేంటి? సీనియారిటీ, కొలిజియం లాంటి పద్దతుల్లో హైకోర్టు జడ్జిల నియామకం ఒక పద్దతి ప్రకారం జరుగుతుంటుంది. ఎవరో చెబితే, ఎవరో ఇరికిస్తే.. జడ్జిల నియామకం జరిగే అవకాశమే లేదు. న్యాయమూర్తి పక్షపాత పూర్వకంగా తీర్పులు ఇవ్వడానికి లేదు. చట్టాలు, న్యాయ సూత్రాలు, సెక్షన్లు, సాక్షుల ప్రకారమే జడ్జిమెంట్ ఉంటుంది. అంతేకాని తమ వారే కదాని తోచిన విధంగా తీర్పు ఇవ్వడం కుదరదు. ఒకవేళ ఆ జడ్జి ఇచ్చిన తీర్పు సరిగా లేదనుకుంటే, అప్పీల్‌కు వెళ్లొచ్చు. డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు ఇలా ఇంకా అనేక స్థాయిలు ఉన్నాయి. అన్నిటినీ మేనేజ్ చేయడం ఇంపాజిబుల్. ఇంత చిన్న లాజిక్ మరిచి.. చంద్రబాబు, కమ్మ కులం అంటూ వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు కూతలు కూస్తుంటారు. ఆఖరికి, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణపైనా ఫిర్యాదు చేయడం జగన్‌రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనం అంటున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది వైసీపీ తీరు ఉందంటున్నారు. 

వ్యాక్సిన్ పై పొలిటికల్ వార్! మోడీని టార్గెట్ చేసిన రాహుల్ 

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో వ్యాక్సిన్ పై రాజకీయ దుమారం కూడా ముదురుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవిడ్ టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే అదేమీ లేదని, కొందరు కావాలనే టీకాలపై రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.   ‘‘కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల కొరత అనేది చాలా తీవ్రమైన సమస్య. అంతేగానీ ఉత్సవం కాదు. దేశ ప్రజలను ప్రమాదంలో ఉంచి టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సరైందేనా? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించకుండా అన్ని రాష్ట్రాలకు సత్వర సాయం అందించాలి. ఈ మహమ్మారిపై మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను ఓడించాలి’’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.   ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కొవిడ్‌ వ్యాక్సిన్‌, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ సూచనల మేరకు అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. టీకా వేయించుకున్న వారు నిర్లక్ష్యం వహించవద్దన్న కిషన్‌రెడ్డి, టీకా ఉత్సవ్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. ఎక్కడా వ్యాక్సిన్‌ లోటు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వ్యాక్సిన్‌ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి.  

హిడ్మా కథ ముగిస్తాం..! సీఆర్పీఎఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 22 మంది జవాన్లను బలి తీసుకున్న మావోయిస్టులపై ప్రతీకారానికి సీఆర్పీఎఫ్ సిద్దమవుతోంది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు చెప్పారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా హిడ్మాతో పాటు ఆయన దళం  కథ ముగిస్తామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్.  బీజాపూర్ ఎన్ కౌంటర్. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల తర్వాత మాట్లాడిన కుల్దీప్‌సింగ్‌ .. కీలక విషయాలు వెల్లడించారు. హిడ్మా లక్ష్యంగా  చేపట్టబోయే యాక్షన్‌ ప్లాన్‌ గురించి కూడా వివరించారు. మావోయిస్టులపై పోరు మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు కుల్దీప్‌సింగ్‌  తెలిపారు. మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని.. అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఓ ఏడాదిలోపు పూర్తవుతుందన్నారు సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌.  బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా  పన్నిన వ్యూహంలో  భద్రతా బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్‌ సింగ్ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉండేవని చెప్పారు. ఈ ఘటనలో నక్సల్స్‌ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్‌ 4 ట్రాక్టర్లను వినియోగించినట్లు తెలిపారు. బుల్లెట్లు వర్షంగా కురుస్తున్నా.. వాటిని తప్పించుకుంటూ, గాయపడిన వారిని కాపాడుకుంటూ బలగాలు సమర్థంగా పనిచేశాయని, వారి పట్ల గర్వంగా ఉన్నానని కుల్దీప్‌ తెలిపారు. పూర్తిస్థాయిలో బలగాలు సన్నద్ధంగా లేవంటూ వస్తున్న వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు.  ఈ ఆపరేషన్‌ కోసం బీజాపూర్  ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు  కుల్దీప్‌ సింగ్  తెలిపారు.  నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.  ఏడాదిలోగా హిడ్మా అంతు చూస్తామని హెచ్చరించారు.  భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు.      

విమానంలో బట్టలు విప్పేసి.. సిబ్బందితో...

అసలే ఎండాకాలం. అందులోను ఉక్కపోత. కానీ విమానం గాల్లో ఎగురుతుంది. అందులో ఒక ప్రయాణికుడు గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే.. తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అని జల్సా పాట వేసుకున్నాడు. పీకలదాక తాగి హల్‌చల్ చేశాడు.  ఏప్రిల్ 6న బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఐ5-722 విమానంలో ప్రయాణికుడు మద్యం మత్తులో బట్టలు విప్పేసి.. సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మొదట లైఫ్ జాకేట్ కోసం విమానం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఉన్నట్టుండీ పూనకం వచ్చినట్లు ఒంటిపై దుస్తులన్నీ తీసేసి, విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తోటి ప్రయాణికులు, సిబ్బంది బతిమాలడంతో కొద్దిసేపటి తర్వాత కూర్చున్నాడు. కట్ చేస్తే.. ఈ ఘటనపై విమాన పైలట్లు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)కి సమాచారం అందించారు. త్వరగా విమానం ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారు. విమానం ల్యాండ్ కాగానే ఆ జల్సా రాయుడిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. అనంతరం ఎయిర్‌లైన్స్ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పాటు ప్రయాణికుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ ఏషియా విమాన సంస్థ ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చింది.   

ఒక్కరోజే 780మంది బలి.. కరోనా కల్లోలం

10 రోజుల క్రితం రోజుకు 30వేల కేసులు. వారం గడిచే సరికి లక్షా 30వేల కేసులు. వామ్మో.. దేశంలో కరోనా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలూ భారీగా నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటోంది. లేటెస్ట్‌గా, వైరస్ ధాటికి 780మంది మృత్యువాత పడ్డారు. కరోనా రెండోదశలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.    పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పైపైకి పాకుతున్నాయి. తాజాగా.. 1,31,968 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య కోటి 30 లక్షలు దాటేసింది. మృతుల సంఖ్య 1,67,642 మంది. ప్రస్తుతం దేశంలో 9,79,608 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 7.04 శాతానికి చేరింది. మరోవైపు కోలుకునే వారి సంఖ్యా క్రమంగా పడిపోతోంది. ఇప్పటివరకు 1,19,13,292 మంది కోలుకున్నారు. రికవరీ రేటు గతంలో 97శాతంగా ఉండగా.. ప్రస్తుతం రికవరీ రేటు 91.22 శాతానికి పడిపోవడం కలవరానికి గురి చేస్తోంది.  దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 56 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. 376 మంది చనిపోయారు. గత నెల రోజులుగా దేశంలోని 63 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.  మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఏప్రిల్ 8 వరకు 9,43,34,262 మందికి టీకా డోసులు వేశారు. గురువారం 36,91,511 మందికి టీకాలు ఇచ్చారు. ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య టీకా ఉత్సవం నిర్వహించి, అర్హులందరికీ టీకాలు అందించాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. 

దివాలా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఖజానా నిధులు లేకపోవడంతో కనీస అవసరాల కోసం ఎడాపెడా అప్పులు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా రుణమే దిక్కైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై జనాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన సీఎంగా జగన్‌ రికార్డులకెక్కారని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ ఏపీ అప్పులపై కేంద్ర సర్కార్  లేఖ జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోందని యనుమల విమర్శించారు. ఇకపై కనిష్ట అప్పులు, గరిష్ట చెల్లింపులతో ఏపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టినట్లైందని చెప్పారు. కేంద్రం పేర్కొన్న రూ.49,280కోట్ల మూలధన వ్యయం, రాష్ట్రం చేసిన రూ.19వేల కోట్ల మూలధన వ్యయం ఎక్కడ అని ప్రభుత్వాన్ని యనమల నిలదీశారు. హద్దూపద్దు లేని రెవెన్యూ వ్యయం (132 శాతం), రెవెన్యూ లోటు 3-4శాతం, ద్రవ్య లోటు 13శాతం, ప్రాథమిక లోటు 2-3శాతం, జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి 35శాతం వంటివన్నీ జగన్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ఠగా పేర్కొన్నారు యనుమల రామకృష్ణుడు.  వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు గుండుసున్నా.. పేదల సంక్షేమానికి పంగనామాలు పెడుతోందని ఆయన ఆక్షేపించారు.   

వైసీపీ బరితెగింపు.. 

దేశం లో నైనా రాష్ట్రము లోనైనా. పాలక పక్షం ఉండాలి. ప్రతిపక్షం కూడా ఉండాలి. అది రాయకీయంలో అయినా.. రౌడీ ఇజమైన,  ఆటైనా, వేటకైనా ప్రతిపక్షం తప్పక ఉండాలి. ఎందుకంటే పాలక పక్షం తప్పును ఎత్తిచూపేది ప్రతిపక్షమే కాబట్టి. అసలు ప్రతిపక్షమే ఉండొద్దు అనుకుంటే. అది రాజకీయం కాదు రాచరికం అవుతుంది. ఎప్పుడో సమాధి కట్టిన రాచరికాన్ని మళ్ళీ ప్రాణం పోస్తుందనే చెప్పాలి వైసీపీ ప్రభుత్వం. ప్రాంతం ఏదైనా సరే  భయ పెట్టడం వారి నైజం. దాడులు చేయడం వారి ఇజం గా మారింది వైసీపీ తీరు. ఏపీలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారు . ఓపెన్ చేస్తే.. అది కిర్లంపూడి మండలం. కృష్ణవరం గ్రామం. సమయం  అర్ధరాత్రి. ఆ ఊరిలోని జనం అంత నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ఒక ఇంట్లో అరుపులు వినపడుతున్నాయి. ఓ పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కర్రలతో, ఇనుపరాడ్లతో మరో పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు.  కట్ చేస్తే.. అది కృష్ణవరం గ్రామం టీడీపీ నాయకుడి ఇల్లు. కొంత మంది వైకాపా నాయకులు దాడి చేశారు. తమపైకి దాడికి వస్తున్నారన్న విషయం  తెలిసింది. తెదేపా కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ప్రాణాలను రక్షించుకున్నారు. అక్కడితో ఆగని వైకాపా కార్యకర్తలు. రాళ్లతో, కర్రలతో తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటి కిటికీలను, తలుపులు, ఫర్నీచర్‌ను పగలగొట్టారు. అక్కడ ఉన్న నాలుగు మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న తెదేపా నాయకుడు జ్యోతుల నెహ్రూ అర్ధరాత్రి 1.30 సమయంలో కృష్ణవరం చేరకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచే జిల్లా ఎస్పీ, పెద్దాపురం డీఎస్పీలకు ఫోన్‌ ద్వారా జరిగిన విషయాన్ని వివరించారు. ప్రశాంతమైన జిల్లాలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు కృష్ణవరంలో జరిగిన ఘటనే నిదర్శనమని నెహ్రూ పోలీసు అధికారులకు వివరించారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న గ్రామానికి చెందిన గోరకపూడి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో దాడి జరగడం హేయమైన చర్యగా నెహ్రూ అభివర్ణించారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.          ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. మొత్తం  26 మందిపై కేసులు నమోదు చేశారు. కేసు ను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. గ్రామంలోని ముఖ్య కూడలి ఉంది. ఆ కూడలిలో వైకాపా కార్యకర్త చాగంటి రాజారావు ద్విచక్ర వాహనానికి తెదేపా కార్యకర్త రాయవరపు దుర్గాప్రసాద్‌ ద్విచక్ర వాహనం అడ్డువచ్చిందంటూ బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఘర్షణ పడ్డారు. 11 గంటల సమయంలో వైకాపా కార్యకర్త చాగంటి రాజారావు, బూర్రేడి వీరబాబు మోటారు సైకిల్‌పై గ్రామ తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటి ముందు నుంచి పాతకృష్ణవరం వెళ్తుండగా తెదేపా కార్యకర్తలు వారిని అడ్డగించి దాడిచేశారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది వరకు తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటిపై దాడికి దిగారు. గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.              

ఒకే ఆస్పత్రిలో 37 మంది డాక్టర్లకు కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. సర్ గంగారామ్ ఆసుపత్రిలో 37 మంది డాక్టర్లకు కరోనా సోకింది. అందులో ఐదుగురికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. ఒకేసారి 37 మంది డాక్టర్లకు కరోనా  నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా, వైద్యులకు కూడా మహమ్మారి సోకడం, అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. గడచిన కొన్ని వారాలుగా ఢిల్లీ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 7 వేల మార్క్ ను తొలిసారి దాటేశాయి.గురువారం నాడు ఢిల్లీలో 7,437 కొత్త కేసులు వచ్చాయి.  కొన్ని రోజులుగా ఆసుపత్రులకు వస్తున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ హాస్పిటల్స్ లో బెడ్లు నిండుకున్నాయి. వీరిలో పలువురు హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు.  సర్ గంగారామ్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యుల్లో చాలా మంది యువకులేనని, వారిలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్నారని ఉన్నతాధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా వారు ఎవరెవరిని కలిశారన్న విషయమై విచారణ ప్రారంభించామని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ, వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ వైద్యుల్లోని చాలా మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ 37 మందిలో 32 మంది ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారని, మిగతావారికి మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. దాదాపు ఏడాదిగా వీరంతా కరోనా సోకిన వారితోనే గడుపుతూ వచ్చారని వెల్లడించారు. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో  1,31,968 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది. గురువారం ఒక్కరోజే  ఏకంగా 780 మంది కరోనా కారణంగా మృతి చెందారు.  దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,67,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,19,13,292 మంది కోలుకున్నారు.  9,79,608  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  దేశ వ్యాప్తంగా  9,43,34,262 మందికి వ్యాక్సిన్లు వేశారు.   

పురుగుల మందు తాగిన సర్పంచ్ .. 

ఓపెన్ చేస్తే.. అది సిద్దిపేట జిల్లా. కోహెడ మండలం. శ్రీరాములపల్లి గ్రామం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. గురువారం పంచాయతీ సమావేశం జరిగింది. నిధుల విషయంలో ఇద్దరు మహిళలకు వాగ్వాదం జరిగింది. చివరికి ఆ గొడవ పెరిగింది. ఆ గొడవతో మనస్తాపానికి గురైన ఓ మహిళ సర్పంచ్ పురుగుల మందు తాగడానికి కారణం అయింది.  గ్రామ సర్పంచ్ మంజుల అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన నిధుల విషయంలో సర్పంచ్ మంజులకు, గ్రామ కార్యదర్శి సుమలతకు మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. ఈ గొడవతో మనస్థాపానికి గురైన సర్పంచ్ మంజుల గ్రామ పంచాయతీకి సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రెండు జోన్లలోనే 409 కేసులు.. హైదరాబాద్ లో కరోనా కల్లోలం

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మహమ్మారి పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే కేసులు మూడింతలు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం నిర్వహించిన పరీక్షల్లో గ్రేటర్ పరిధిలో భారీగా కేసులు వచ్చాయని తెలుస్తోంది. ఉప్పల్‌, మల్కాజిగిరి ఆస్పత్రుల పరిధిలోనే  గురువారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 409 మందికి కరోనా సోకినట్లు ఆయా ఆస్పత్రుల వైద్యులు తెలిపారు. ఉప్పల్‌ పీహెచ్‌సీలో 127 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా 50 మందికి పాజిటివ్‌  వచ్చింది. సఫిల్‌గూడ ఆస్పత్రిలో 74 మందికి పరీక్షలుచేయగా 5 మందికి  పాజిటివ్‌ వచ్చింది . మౌలాలిలో 85 మందికి గాను 8 మందికి.. ఏకలవ్యనగర్‌ ఆసుపత్రిలో 86 మందికి గాను 21మందికి పాజిటివ్‌ వచ్చింది. వినాయక్‌నగర్‌ 75 మంది  15 మందికి.. మల్కాజిగిరి ఆసుపత్రిలో 293 మందికి గాను 95 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. కుషాయిగూడ ఆసుపత్రిలో 170 మందికి గాను 48 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. జవహర్‌నగర్‌ ఆసుపత్రిలో 54 మందికి గాను 15 మందికి పాజిటివ్‌ అల్వాల్‌ ఆసుపత్రిలో 189 మందికి గాను 160 మందికి పాజిటివ్‌ వచ్చింది. రెండు జోన్ల పరిధిలోనే నాలుగు వందలకు పైగా కేసులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ విస్తరిస్తోందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కరోనా పరీక్షల కోసం  బారులు కనిపిస్తున్నాయి. పరీక్షలు చేసే కేంద్రాలను పెంచాలని, ఎక్కవ మందికి పరీక్షలు చేసేలా ఆసుపత్రుల్లో సిబ్బందిని పెంచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

రౌడీ ఎమ్మెల్యేలను తరిమికొడతా.. చంద్రబాబు విశ్వరూపం 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఉగ్రరూపం ప్రదర్శించారు  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి రోడ్ షోలో  వైసీపీ సర్కారు, సీఎం జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందన్నారు చంద్రబాబు. ఈ ఎమ్మెల్యేలు పెద్ద రౌడీలా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను కూడా పరిగెత్తిస్తాం తప్ప రౌడీలకు భయపడే సమస్యేలేదని స్పష్టం చేశారు.  ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టుకుంటూ పోయాడు.. ఇప్పుడా ముద్దులన్నీ ఏమైపోయాయి? ప్రజలకు గుద్దులే మిగిలాయి అని చంద్రబాబు అన్నారు.  ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాడట.. అడుగుతూనే ఉండడానికా నీకు ఓటేసింది? నీ నంగి మాటలు మాకు చెబుతావా? నీ వైఖరితో ప్రత్యేక హోదా పోయింది, పెట్టుబడులు పోయాయి అని చంద్రబాబు మండిపడ్డారు. కేసులకు భయపడి ఇంట్లో ఉంటే సమాజం ఎలా బాగుపడుతుంది? రాష్ట్రం దివాళా తీసిన తర్వాత చేయడానికి ఏం ఉండదు.. ప్రజలు ముందుకొచ్చి పోరాడితేనే ఫలితం ఉంటుంది  అంటూ సీఎం జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజలు కూడా టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు తేడా గమనించాలన్నారు చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నికతోనే మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు.  కొంప కాలిపోయిన తర్వాత తీరిగ్గా బయటికొచ్చి బావి తవ్వితే ఏం ఉపయోగం ఉండదని చెప్పారు. తాను తిరుపతి వచ్చింది పదవి కోసం కాదు... టీడీపీ తరఫున ఓ ఎంపీ గెలిస్తే మరింత బలం పెరుగుతుందని రాలేదు. అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే అది మీ చేతుల్లోనే ఓటు రూపంలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చానని తెలిపారు. ఇప్పుడందరూ తానే ముఖ్యమంత్రిగా రావాలంటున్నారన్నారు చంద్రబాబు. నాకేమైనా సీఎం పదవి కొత్తా! 14 ఏళ్లు చేశాను. నా రికార్డు ఎవరూ బద్దలు కొట్టే పరిస్థితి లేదు.. 9 ఏళ్లు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. అదొక రికార్డు. పదేళ్లు విపక్షనేతగా ఉన్నాను. మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు కాబట్టి నా రికార్డు పదిలంగా ఉంటుంది అని చంద్రబాబు చెప్పారు.  తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కాబట్టే ఎలాంటి సమస్య లేదన్నారు. తాను ఎలాంటి సమస్య లేకుండా నడచి వచ్చానని చెప్పారు. "అదే అధికారి, ఇదే పోలీసులు, ఇదే తహసీల్దారు, అదే కలెక్టరు... పంచాయతీ ఎన్నికల సమయంలో మీరు ఏవిధంగా ప్రవర్తించారు? ఇప్పుడు ఏవిధంగా ఉన్నారు? ప్రజలే గమనించాలన్నారు చంద్రబాబు. మీకు ప్రజాస్వామ్యం కావాలా వద్దా? ఇదే అంశాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. మా తప్పేదైనా ఉంటే ప్రజలకు వివరించాలి కాని  తప్పుడు కేసులు పెడతారా? అని టీడీపీ అధినేత నిలదీశారు.

చంద్రబాబు పీఏ అరెస్ట్ 

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు పీఏ అరెస్ట్ ఏపీలో సంచలనంగా మారింది.  ఇటీవల కుప్పం మండలం గోనుగూరులో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర ఉందని  ఆరోపించారు.  చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మాత్రం జ్యోతి అనే మతిస్థిమితం లేని మహిళే మద్యం మత్తులో విగ్రహాలు ధ్వంసం చేసిందని వెల్లడించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయవద్దంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనుగూరు ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనివాళ్లను విచారణ పేరుతో ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు పీఏ మనోహర్, టీడీపీ నేతలు కుప్పంలో సీఐ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.