తెలంగాణకు భారీ వర్ష సూచన
posted on Aug 13, 2022 @ 11:25AM
తెలంగాణను భారీ వర్షాలు మరోసారి ముంచెత్తనున్నాయి. ఈ నెల 14,15 తేదీలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న 24 గంటలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇలా ఉండగా, ఆదివారం (ఆగస్టు 14), సోమవారం(ఆగస్టు15) తేదీలలో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.