ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

పాకిస్థాన్ తెహరీక్ -ఎ-ఇన్సాఫ్ అంటే పాకిస్థాన్ న్యాయపోరాటం అని అర్ధం. ఇలాంటి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ప్రధాని పదవిని అధిష్టించిన ఇమ్రాన్ ఖాన్  ను అక్కడి ప్రభుత్వం  రేంజర్లు అరెస్టు చేశారు.  అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.  ఆ పనిలో ఇస్లామాబాద్ హైకోర్టుకు బయో మెట్రిక్ గుర్తింపును పరిశీలించుకోవడానికి వచ్చిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్థానీ రేంజర్లు అదుపులోనికి తీసుకున్నారు. ప్రధాని పదవి లోనుం స్వంత పార్టీ నేతలే  ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడిని చేశారు.  అపంతనం వందకు పైగా కేసులను ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కోవలసి వచ్చింది.  పాకిస్థాన్ జాతీయ జవాబుదారీ సంస్థ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది ఏప్రియల్ లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవిని ఇమ్రాన్ ఖాన్ వదలాల్సి వచ్చింది.  రష్యా , చైనా, ఆప్ఘనిస్థాన్ లపై ఇమ్రాన్ ఖాన్ అనుసరించిన విదేశాంగ విధానాల కారణంగా అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవలసి వచ్చింది.   ఈ విధానాలు నచ్చని అమెరికా తనపై కక్ష కట్టిందని ఇమ్రాన్ ఖాన్ వర్గం అప్పట్లో ఆరోపణలు చేసింది. రేంజర్లుగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు ధరించి ఇమ్రాన్ ఖాన్ ను అపహరించారని పీటీఐ అధికార ప్రతినిథి ఫహాద్ చౌదరి ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే కోర్టులో హాజరు పారచాల్సిందిగా ఇంటీరియర్ సెక్రటరీని, ఐజీ పోలీసులను ఆదేశించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఫహాద్ కోరారు. 2003లో ప్రజాస్వామిక దేశంగా అవతరించిన పాకిస్థాన్ అంతకు ముందు ఐదున్నర దశాబ్దాల పైనిక పాలన వాసనలను ఇంకా మరచిపోకపోవడం విషాదం. 

మోడీ హయాంలో పార్లమెంటు.. ది హౌస్ ఈజ్ ఎడ్జోర్డ్న్

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది.  గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్‌ విూడియా ప్రచారాలను బీజేపీ ఉధృతం చేస్తోంది. దేశంలో వెూడీని అవతారపురుషుడిగా కీర్తిస్తూ..గత పాలకులందరినీ పాపులుగా చిత్రీకరిస్తూ.. బిజెపి సోషల్‌ విూడియా కోడై కూస్తోంది. సోషల్‌ విూడియాలో నిత్యం ప్రధాని నరేంద్ర వెూడీ గురించి గొప్పలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన తుమ్మినా దగ్గినా అదో విజయంగా ప్రచారం సాగుతోంది. ఆయన అనేక విజయాలు సాధించినట్లు చెబుతున్నారు. వెూడీ వచ్చిన తరవాత దేశం దశదిశ మారిందన్న ప్రచారం విపరీతంగా ఉంటోంది. అలాగే ఆయన మాత్రమే ఈ దేశాన్ని ఉద్దరించాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భారత్‌ కోసం పుట్టిన వరపుత్రుడని ప్రచారం చేస్తున్నారు. ఏ దేశం వెళ్లినా..ఏ దేశాధినేతతో మాట్లాడినా.. ఏదైనా శంకుస్థాపన చేసినా..ఏ ప్రారంభోత్సవం చేసినా ఆహా ఓహో అంటూ పుంఖానుపుఖాలుగా ప్రచారాలు వస్తున్నాయి. కర్నాటకలో ఇది మరింత శృతి మించింది. నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. గడిచిన 9 ఏళ్లలో  ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 68 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకొన్న అప్పుల కన్నా 9 ఏండ్ల వెూడీ  పాలనలో తీసుకొన్న అప్పులే ఎక్కువయ్యాయి. ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర వెూడీదేనన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఎంతసేపు ఆదానీ అంబానీలకు దోచిపెట్టడం, వారిని మరింత సంపన్నులగా తీర్చిదిద్దే పనులు చేపట్టడం మినహా చేస్తున్న ఘనకార్యాలు ఏవీ లేవు. దేశవ్యాప్తంగా బుల్లెట్‌ టైన్‌ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాదిరాళ్లు తమ పేర్లతో వేసుకొన్నారు. వాటికి పెట్టుకొన్న గడువు కూడా తీరిపోయింది. ఒక్క తట్టెడు మట్టి తీసిన పని కూడా జరగ లేదు. రూ.80 లక్షల కోట్ల అప్పుల సంగతి దేవుడెరుగు.. ఏటా రూ.3 లక్షల కోట్లు పెట్రో బాదుడుతోనే వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఏమయ్యాయంటే.. రాష్టాలు వ్యాట్‌ తగ్గించాలని సుద్దులు చెబుతారు. దారుణం గా అప్పులు చేస్తున్న తీరు ఒక వైపు అయితే... జిఎస్టీ పేరుతో  చేస్తున్న బాదుడు   మరోవైపు. అయినా మోడీ హయాంలో  సామాన్యలకు ఉపశమనం కలిగించే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే.. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా ప్రాచరం చేస్తున్నారు. సోషల్‌ విూడియా ప్రచారంలో బిజెపి నేతలు ఆరితేరారు. వెూదీ ప్రభుత్వం చేసిన 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యా లేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అంటే సమాధానం రాదు. ఇంతకీ ఆ వసూళ్లతో, ఆ అప్పులతో ప్రభుత్వం చేసిన మంచి పని ఏమిటంటే.. యిదీ అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కనిపించదు.   బ్రహ్మాండంగా దేశాన్ని నడిపిస్తున్నామని చెప్పుకుంటారు కానీ ప్రభుత్వం సాధించిన ఘనతలేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ముందుకు రాదు.  రైతుల కోసం అంటూ ప్రవేశ పెట్టిన సాగు చట్టాలపై నా పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదు.  పార్లమెంటు సమావేశాలు వాయిదాపడటానికే అని సామాన్యులు ఒక నిర్ణయానికి వచ్చేసిన పరిస్థితి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి రైతలను వంచించినా చర్చించరు. జిఎస్టీ పేరుతో పన్నులు బాదుడుపైనా చర్చించరు. నిజానికి వెూడీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో చర్చ అన్నది పక్కకు పోయింది. ఏ అంశమైనా సోషల్‌ విూడియా ప్రచారం తప్ప చట్ట సభల్లో చర్చకు కేంద్రం అవకాశం యివ్వడం లేదన్నది వాస్తవం. లక్షన్నర కోట్లకు పైగా జిఎస్టీ వసూళ్లు అవెూఘం అంటున్నారు.   చివరకు మనం పైసా పైసా కూడబెట్టుకుని చెమటోడ్చి సంపాదించిన డబ్బులతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌, జీవిత బీమా చేయించుకున్నా..జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. దీనిపై చర్చించడం లేదు. ఇకపోతే సామాన్యుల సొంతింటి కల నెరవేరడం లేదు. నిర్మాణరంగం కుదేలయ్యింది. వ్యవసాయరంగం కుదేలయ్యింది. ఆర్థికరంగం అంతకుమించి కుదేలయ్యింది. అయినా అదీ చర్చించరు. ఉద్యోగ ఉపాధి రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిపైనా సోషల్‌ విూడయాలో ప్రచారం జరగదు. ఎడాపెడా పెట్రో ధరలు పెంచుతూ పోతున్నా.. దాని వల్ల కలుగుతున్న విపరిణామాలను చర్చించరు. గ్యాస్‌ ధరలు సామాన్యులకు భారంగా మారినా చర్చ చేయరు. అభూత కల్పనలను జోడించి చేస్తున్న చర్చల వల్ల బిజెపిని, వెూడీ అతిగా చూపిస్తూ భారత్‌ బ్రహ్మాండం అంటూ చూపుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. తిండిపెట్టి, దేశయువతకు ఉద్యోగ,ఉపాధి కల్పించి, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా వ్యవసాయాన్ని చేసే ఆలోచన ఏదీ వెూడీ బృందానికి లేదు. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అపðలు తీర్చేందుకు వాడుతున్నా మంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నది. ఈ నకిలీ వార్తలను దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ప్రధానిగా నరేంద్రవెూదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అపð రూ.55.87 లక్షల కోట్లు. ఈ లెక్కన ప్రతి నెల వెూదీ ప్రభుత్వం తీసుకొన్న సగటు రుణం రూ.83,341 కోట్లు. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌పై వచ్చిన పన్నుల వాటా 5.4 శాతంగా ఉండగా, 2020-21 నాటికి అది 12.2 శాతానికి పెరింగింది. నేడు ఒక్క వంటగ్యాస్‌ సిలిండర్‌కు పెడుతున్న ఖర్చుతో వెూదీ మొదటిసారి ప్రధాని అయినపðడు రెండు సిలిండర్లు వచ్చేవి. చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా రూ.3 లక్షల కోట్లను ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా..పట్టించుకోద్దన్న సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు. రాష్టాల్లో అభివృద్ది అంతా తమ చలువేనని చాటుకుంటున్నారు. సిగ్గూఎగ్గూ లేకుండా ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. దీనికి చరమగీతం పాడకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజలు దీనిని నిరసించాలి. ఎక్కడిక్కడ నిలదీయాలి. సోషల్‌ విూడియా విష ప్రచారాలను పసిగట్టాలి. ఎక్కడి కక్కడే ఎదురుదాడి ప్రారంభించాలి. తిప్పికొట్టాలి. అప్పుడే ప్రజలు విజయం సాధిస్తారు.

ది కేరళ స్టోరీ ప్రమోటర్ బీజేపీ!?

మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.   అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.   అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఈ సినిమా ఉగ్ర వాదాన్ని బట్ట బయలు చేసిందని సాక్షాత్తు కేంద్ర సమాచార, ప్రసా ర క్రీడలు, యువత వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు.  ఈ చిత్రం ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి అంటున్నారు. ఉగ్రవాదం, మత మార్చిడి చేతులు కలిపి ఒకదానికి ఒకటి ఊతమిచ్చుకుంటున్న ఒక అనైతిక బంధాన్ని చిత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపిందని చెబుతున్నారు. చిత్ర ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఖండిస్తూ.. ఈ నిషేధంతో   మమతా బెనర్జీ రాష్ట్రంలో మహిళా లోకానికి అన్యాయం చేస్తు న్నారని  విమర్శించారు. ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసేవారితో అంటకాగుతున్నారా లేక వారికి వ్యతిరేకంగా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధా నం మమతా బెనర్జీ చెప్పాలని  నిలదీశారు. ఉగ్రవాదం ప్రధా నాంశంగా వచ్చిన ఒక చిత్రాన్ని ఎందుకంత పెద్ద సమస్యగా భావిస్తున్నారంటూ యావత్ దేశం ఆమెను ముక్త కంఠంతో ప్రశ్నిస్తోందన్నారు. ది కేరళ స్టోరీ సిన్మాకు బీజేపీ ప్రమోషన్ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆ విత్ర నిర్మతలకు ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గిందని ఈ సినీమాను వ్యతిరేకించే వారు అంటున్నారు. గతంలో కూడా  బీజేపీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఇలాంటి సహకారాన్నే అందించిందని గుర్తు చేస్తున్నారు. 

మోడీపై విమర్శలతో శరద్ పవార్ యూటర్న్

ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో వ్యవహరించిన తీరు పట్ల రాజకీయవర్గాలలో ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఆయన తన ప్రచారంలో మత పరమైన అంశాలను ప్రస్తావించారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఆయన మత పరమైన అంశాలను ప్రస్తావించడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. అయినా ఒక ప్రధాని ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావించడం ఎంత మాత్రం సరికాదని శరద్ పవార్ అన్నారు.   ఎన్నికల్లో ప్రజాస్వామ్య, లౌకికవాద విలువలు కాపాడతామని ప్రమాణం చేస్తాం. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం నన్ను దిగ్భ్రమానికి గురి చేసిందన్నారు.  లౌకికవాదాన్ని మనమంతా అంగీకరించాం. ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో మతం గురించి, మతపరమైన అంశా గురించి మాట్లాడతామో.. అప్పుడు కొత్తరకం పరిస్థితులు ఏర్పడతాయి. అది ఏ మాత్రం మంచిది కాదని పవార్ అభిప్రాయపడ్డారు. యిక ఎన్సీపీ అధ్యక్ష పదవికి తన రాజీనామాను ఉపసంహరించుకోవడంపై కూడా  ఆయన వివరణ యిచ్చారు. ఆరోగ్యం సహకరించక రాజీనామా చేద్దామనుకున్నప్పటికీ.. తన కుమార్తె సుప్రియా సూలె అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన రాజీనామాను ఉపసంహరించుకున్నానని చెప్పారు.   నిన్నమొన్నటి వరకూ  శరద్ పవార్ బీజేపీకి దగ్గర అవుతున్నారనీ, అందులో భాగంగానే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా అనీ పెద్ద ఎత్తున  ప్రచారం జరిగింది.   శరద్ పవార్ కూడా విపక్షాల ఐక్యతా యత్నాలను పక్కన పెట్టి మరీ.. అదానికి మద్దతుగా, అదే విధంగా మోడీ విద్యార్హతలపై విపక్షాల విమర్శలకు ఖండిస్తూ చేసిన  వ్యాఖ్యలు.. ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న ప్రచారానికి బలం చేకూర్చేదిలాగే ఉంది. అంతలోనే యిప్పుడు కర్నాటక ప్రచారంలో మోడీ  తీరును విమర్శిస్తూ శరద్ పవార్ గళమెత్తారు. ఈ మరాఠా యోధుడి స్వరం మారడానికి కారణాలేమిటన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. 

కొనుగోలు కేంద్రాలేవీ? అన్నదాతకు అండేదీ?

 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం  రైతులకు శాపంగా పరిణమించింది. కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. పంట దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి నప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. 20 రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమైంది ఫలితంగా ఆరుగాలం శ్రమించి, అధిక వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన వరి పంట మూడు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి కకావికలం అయింది. ఇటీవలి  అకాల వర్షాలకు పంటంతా నీట మునగగా, రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా  వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడాయి. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టగా, ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొనడంతో వరి పండించిన రైతుల్లో ఒకింత ఆందోళన మొదలయింది. గతేడాది ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కారు ప్రత్యక్ష ఆందోళనలకు దిగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెపం వెూపుకుంటూ కాలం వెళ్లదీశారు. పంట కోసే సమయం వరకు ప్రభుత్వం నుంచి సూచనలు రాకపోవడంతో అధికారులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. పంట కోతకు వచ్చే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని ఉంటే తమకు అకాల నష్టం జరిగి ఉండేది కాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సంవత్సరం లక్షా 54వేల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్‌లో ముందుగా సాగు చేసిన చోట దాదాపు నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా దిగుబడి అంచనాకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తీరా పంట కోసి ఆరబెట్టిన తరువాత అ కాల వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొంత మొత్తం వరదలకు కొట్టుకొని పోయింది. అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే పంటను అమ్ముకొనే వారమని రైతులు వాపోతున్నారు. ఈ యేడాది పంట ఏపుగా ఎదగడంతో దిగ బడి లాభసాటిగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తమ ఆశలు వమ్మయ్యాయని లబోదిబో మంటున్నారు. 

ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు.. అనుమానాలకు తావిస్తున్న నిర్ణయం

ఔటర్‌ రింగ్‌రోడ్డు అవినీతిపై అధికార బిఆర్‌ఎస్‌ నోరుమెదపడం లేదు. ఏదైనా ఆరోపణలు రాగానే అంతెత్తు ఎగిరిపడే నేతలు అసలు ఈ విషయంపై నోరెత్తడం లేదు.  మున్సిపల్‌ శౄఖ మంత్రికెటిఆర్‌ కూడా మౌనం వహిస్తున్నారు. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ తరువాత బీజేపీ నేతలు దానిని అందుకున్నారు.  అవినీతి జరిగివుంటే.. లేదా నిబంధనలకు విరుద్దంగా లీజ్‌ ఇచ్చివుంటే కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకోవాలి. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ, ఈడీ దర్యాప్తలకు ఆదేశించాలి.  కానీ బీజేపీ మాత్రం వాటి జోలికి వెళ్లకుండా   ఆరోపణలకే పరిమితం అవుతోంది. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రభుత్వం లీజుకు ఇచ్చే విషయంలో విపరీతమైన వివాదాలు నెలకొంటున్న వేళ నిజాలు నిగ్గు తేలాలి.  విపక్షాల ఆరోపణలకు కేవలం మున్సినల్‌ అడ్మినిస్టేషన్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌   ముక్తసరి ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నిజానికి ఓఆర్‌ఆర్‌ ను 30 ఏళ్ల పాటు పైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న దానికి అధికారపక్షం నుంచి సమాధానం రావడం లేదు. ఓఆర్‌ఆర్‌ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. హెచ్‌ఎండీఏ కు ఓఆర్‌ఆర్‌ పై టోల్స్‌ వసూలు చేయడం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. లీజు ఏ కంపెనీకి టెండరు రావాలో ముందే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని ఆరోపించారు. పైవేటీకరణకు తాము వ్యతిరేకమంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను ఎందుకు పైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిందని నిలదీస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం లీజు పక్రియ జరగడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఓఆర్‌ఆర్‌ను 30ఏళ్ళ వరకు లీజ్‌కు ఇవ్వాల్సిన అవసరం ఏంటన్న దానికి మంత్రి కెటిఆర్‌ నుంచి సమాధానం రావడంలేదు. ఏప్రిల్‌ నెల సగటు టోల్‌ గేట్స్‌ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫ్లై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కానీ పిసిసిచీప్‌ 30వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ గేట్స్‌ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ ఇటీవల ప్రశ్నించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టోల్‌ గేట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్‌ గేట్‌ లను నిర్వహిస్తూ బ్యాంకుల నుండి నిధులు తెచ్చి బ్యాంక్ కు వడ్డీ చెల్లించినా మంచి లాభాలు వస్తాయని, అలాండిది ప్రజల సొమ్మును  ఐఆర్‌బి అనే సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న గూడుపుఠాణి బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అందులోనూ డిఫాల్టర్‌ గా ఉన్న ఐఆర్‌బి కంపెనీకి తిరిగి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ గేట్‌ నిర్వహణ ఒప్పందం పక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఈ వ్యహారంపై సిబిఐ, ఈడిల కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ టోల్‌ గేట్‌ కుంభకోణంపై పోరాటం చేయనున్నట్లు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. ఔటర్‌ వ్యవహిరంపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇదేనా కేసీఆర్‌ చెప్పే గుణాత్మకమైన మార్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీజుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్‌ కుటుంబం ఆరి తేరిందని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

సమస్యలపై పోరాటంలో ఐక్యత ఎక్కడ?

కర్నాటక ఎన్నికల్లో  విపక్షాలు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా సాగుతున్నారు. విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్న కెసిఆర్‌, బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లెఫ్ట్‌ నేతలు ఎవరూ కూడా ఇక్కడ బిజెపిని ఓడించేందుకు కలసికట్టుగా పోరాడుదామన్న సంకల్పాన్ని ప్రకటించలేదు. అంతుకు ముందు జరిగిన పలు రాష్టాల ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగింది. వెూడీ, బీజేపీ  కోరుకుంటున్న విధంగానే విపక్షాలు ఐక్యతకు దూరంగా ఉంటూ ప్రజలకు అదే సంకేతాన్ని యిస్తున్నాయి. అంతెందుకు ఢిల్లీ కేంద్రంగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా వారికి అండగా నిలిచి పోరాడాలన్న కనీస జ్ఞానం కూడా విపక్షాల్లో లోపించింది. ఈ ఒక్క విషయం చాలు బిజెపిని నిలదీయడానికి కానీ సమస్యలపై పోరాడేందుకు కానీ విపక్షాలకు చిత్తశుద్ధి కొరవడిందని జనం భావించడానికి. ఏదో వెళ్లామా అంటే వెళ్లామన్న తీరులో కొందరు వెళ్లి  రెజ్లర్లకు మద్దతు ప్రకటించారే తప్ప జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ కీర్తి పతాకను రెపరెపలాడించిన కుస్తీ వీరులకు అండగా ఉద్యమించడంలో మాత్రం పూర్తిగా విస్మరించారు. రెజ్లర్లపై  ఢిల్లీ పోలీసులు అమా నుషంగా ప్రవర్తించారు. జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై లాఠీ ఝుళిపిం చారు. పోలీసులు తప్ప తాగి విర్రవీగారని రెజ్లర్లు ఆరోపిస్తుండగా.. బీజేపీ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిం దంటూ విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.  ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మైనర్‌ సహా.. పలువురు మహిళా రెజ్లర్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్‌ 23 నుంచి వారు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి దిగ్గజ కుస్తీవీరులు, మాజీ రెజ్లర్లు మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయినా ఆ బిజెపి ఎంపిపై చర్య తీసుకోవాలని, మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఉమ్మడిగా పోరాడాలన్న చలనం విపక్షాల్లో కానరావడం లేదు. ఈ విషయాన్ని అంతా కలసి మహిళా రాష్ట్రపతి ముందుకు తీసుకుని వెళ్లవచ్చు. నిజానిజాలను విచారించాలని కోరవచ్చు. బిజెపి ఎంపిపై చర్యలకు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నా.. విపక్ష పార్టీలు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. మహిళా రెజ్లర్లకు అండగా పోరాడాలన్న కనీస నైతికతను కూడా మహిళా ఎంపిలు కనబర్చడం లేదు. ఎందుకంటే వారికి రాజకీయాలను మించిన సమస్య మరోటి లేదు కనుక. అంతెందుకు..కర్నాటకలో బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని చెబుతున్నా విపక్ష నేతలు  కలసి పని చేయడానికి ముందుకు రాలేదు. కర్నాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బిజెపికి కలసివచ్చేదిగా ఉంది. అక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తున్నా...కర్నాటకలో నేతలు అవినీతి లో కూరుకుపోయారు. బిజెపి అవినీతిని ఎలుగెత్తాల్సిన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేయడం లేదు. ఎందుకంటే అవినీతిలో అన్ని పార్టీల నేతలదీ ఒకటే దారి. మరోవైపు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడాన్ని పలు ప్రాంతీయ పార్టీలు అంగీకరించే పరిస్థితిలో లేవు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించడానికి సిద్ధంగానే ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం అంటూ కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజీవ్రాల్‌ వంటివారు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే రాహుల్‌ గాంధీకి సంఘీభావం తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ మూడు పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలంటే జయప్రకాశ్‌ లాంటి అనుసంధానకర్త కావాలి. అంత నిజాయితీగా ఉండి విపక్షాలను నడిపించే  వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే ఐక్యత కోరుకుంటున్న వారంతా ప్రధాని పదవిని కోరుకుంటున్న వారే. కర్నాకటలో కూడా కుమారస్వామి, సిద్దరామయ్య, డికె శివకుమార్‌ తదితరులంతా సిఎం పదవిపై కన్నేసిన వారే. అందుకే విపక్షాల ఐక్యత అన్నది ఎండమావిగా మారుతోంది. నిజానికి కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ఆ విషయం అన్ని పార్టీలకు తెలుసు. అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌ మద్దతుతో ప్రధాని గద్దెపై ఒక్కసారయినా ఎక్కాలని చూస్తున్నవే. ఇలా చేసే చరణ్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, విపిసింగ్‌ లాంటి వారు ప్రధాని పదవిని అధిష్టించినా..దేశాన్ని పాలించే సత్తా లేదని నిరూపిం చుకున్నారు. ఒకవేళ కలిసినట్టు కనిపించినా ప్రస్తుతం వెూడీ నాయక్తంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనే పరిస్థితి కానరావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా నిస్వార్థంగా పోరాడాలన్న సంకల్పాన్ని మరింత గట్టిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. గాంధీ నెహ్రూకుటుంబం బయటి వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ ఒక అడుగు వేసింది.  దానిని అందిపుచ్చుకుని బీజేపీయేతర పార్టీలు అడుగు కలపాల్సిన, కదపాల్సిన అవసరం ఉంది. అది జరగనంత వరకూ విపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉంటుంది. 

జనంలో బీజేపీపై వ్యతిరేకత రాహుల్ కు కలిసొస్తుందా?

బిజెపి నిరంకుశ విధానాలపై ప్రజల్లో అసహనం రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలు వరుస దాడులు, కేసులతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నతీరు పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేరుగా మోడీనే తాకుతున్నదని అంటున్నారు.   వెూడీ, షా ద్వయం తమను గట్టిగా ఢీ కొంటున్న నేతలను కావాలనే వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో  బలంగా ఏర్పడింది. కాగా కేంద్రం అనుసరిస్తున్న తీరు  , ఆ తీరును దీటుగా ఎదుర్కొంటున్నరాహుల్ ను జనం గమనిస్తున్నారు. యిప్పుడిప్పుడే రాహుల్ లోని నాయకత్వ లక్షణాలను  వారు గుర్తిస్తున్నారు.  తనపై అనర్హత వేటు వేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ స్పందన పరిణితి చెందిన నేతగా ఉంది. అంతే కాకుండా అనర్హత వేటు పడిన వెంటనే ఎంపీగా   కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయాలని రాహుల్ కు హుకుం జారీ చేయడం, అందుకు బదులుగా నిబంధనల ప్రకారం గడువులోపు ఖాళీ చేస్తానని ఆయన ప్రకటించడం ద్వారా రాహుల్‌ తన నిజాయితీ చాటుకున్నారు. గుజరాత్‌ కోర్టు తీర్పు, తరవాత పైకోర్టుల్లో లభించని ఊరట తదితర అంశాలన్నీ రాహుల్‌కు కలసి వస్తున్నాయి. ఎంపీగా అనర్హత వేటు పడిన తరువాత రాహుల్‌ పట్ల జనంలో అభిమానం పెరిగింది. అదే సమయంలో ప్రధాని వెూడీ ఇమేజ్‌ మసకబారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పైగా నెహ్రూ కుటుంబానికి చెందిన వారెవరినీ  పార్లమెంట్‌ గడప తొక్కకుండా చేయాలన్న పట్టుదలలో వెూడీ ఉన్నారని భావన కూడా ప్రజలలో విస్తృతంగా వ్యక్తం అవుతోంది.  ఒకప్పుడు తాను బీజేపీ అగ్రనాయకులైన వాజపేయి, ఎల్‌.కె.ఆద్వాణి వంటి వారికి అనుచరుడిగా, సహాయకుడిగా పరిచర్యలు చేసిన విషయం వెూదీ మరచిపోయాడు. అధికారంలోకి రాగానే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి లాంటి ఉద్దండులను పక్కన పెట్టారు. రాహుల్‌ గాంధీ విషయంలో వెూడీ హుందాగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు పునాదులు పడేవికావు. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ప్రధాని వెూదీ విజయానికి తిరుగుండదన్న అభిప్రాయం నిన్న మొన్నటి దాకా ఉంది. అయితే ఇందిరాగాంధీ లాంటి వారే మట్టి కరిచారు. ప్రాంతీయ పార్టీల నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకున్నందున సంతృప్తి చెంది ఉండాల్సింది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికే ఉండకూడదు అనుకోవడం మాత్రం సరికాదు. ఒకప్పుడు బీజేపీ ఉనికిని కాంగ్రెస్‌ సహించేది కాదు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది చూస్తున్నాం. రేపు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సహజ న్యాయం అని ఒకటి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. కానీ ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయవచ్చు. అధికధరలు, జిఎస్టీ వాయింపులు, పెట్రో ధరలు ప్రజలను సూదుల్లా పొడుస్తున్నాయి. వీటిని భరించే శక్తి లేనప్పుడు తిరుగుబాటు గురించి ఆలోచిస్తారు. దేశంలో పరిస్థితి యిప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది.  ప్రజల ఆగ్రహం ఓడలను బండ్లు, బండ్లను ఓడలు చేస్తుంది. కర్నాటక ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే!

ఒకప్పుడు కాంగ్రెస్‌ రాజకీయాల్లో భాగమైన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బిజెపిలో కూడా సర్వసాధారణంగా మారిపోయాయి.  కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బుధవారం మే (10)న జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని  తెలిసినా ఎలాగోలా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి పెద్దలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో ఏదో రకంగా గెలిచేందుకు లేదా కాంగ్రెస్‌ను సాధ్యమైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేసేం దుకు బిజెపి  వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. బీజేపీకి కర్నాటకలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరం. ఎందుకంటే కర్నాటక ఫలితం యితర రాష్ట్రాలపై కచ్చితంగా పడుతుందన్నది పరిశీలకుల అంచనాయే కాకుండా బీజేపీ భావన కూడా. ఒక వేళ కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతే ఇక దక్షిణాదిన  అడుగుపెట్టే  అవకాశాలు ఆ పార్టీకి దాదాపుగా మృగ్యమౌతాయి.  అలాగే ఉత్తరాది పార్టీగానే  బీజేపీ గుర్తింపు కొనసాగుతుంది. ఆ కారణంగానే బీజేపీ అగ్రనేతలు కర్ణాటక ఎన్నికలను అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  దక్షిణాదిన తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బిజెపి నేతలు పార్టీలో చేరికలకు తలుపులు బార్లా తెరిచేశారు.  కేరళలో ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ కె ఆంటోనీ, తమిళనాడులో చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు సిఆర్‌ కేశవన్‌, ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా దక్షిణాదిలో తమకు ఇంకా ఉనికి ఉన్నదని చెప్పేందుకు బిజెపి అగ్రనేతలు తంటాలు పడుతున్నారు. తాను డిమాండ్‌ చేసిన విధంగా సీట్లు కేటాయించేందుకు అధిష్ఠానం అంగీకరించకపోవడంతో  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసంతృప్తి తో ఉన్నారు. కర్ణాటక బిజెపిలో అధికార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన అధికార కేంద్రమైన యడ్యూరప్ప పట్టు నుంచి బిజెపిని తప్పించేందుకు ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతమైయ్యాయనన సంగతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సఫలమయ్యాయన్నది తేలిపోతుంది. వెూడీ, అమిత్‌ షా కర్ణాటక రాజకీయాలను శాసించాలను కున్నా, శాసించగల పరిస్థితిలో లేరని స్థానిక రాజకీయాలు తెలిసిన వారు అంటున్నారు. కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి మరో నేతకు అప్పగించడంలో వెూడీ, షాలు విజయం సాధించగలిగారు కాని పార్టీకి విజయం దిశగా నడిపించగలిగిన  మరో నాయకుడిని అయితే వారు గుర్తించలేకపోయారు. అలాగే యడ్యూరప్ప ఆధిపత్యాన్ని తగ్గించడంలో విఫలమయ్యారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఫిబ్రవరిలో తన 80వ జన్మదినం సందర్భంగా యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రకటించారు. అయినప్పటికీ యడ్యూరప్పను విస్మరించి బిజెపి అధిష్ఠానం కర్ణాటకలో రాజకీయాలు చేయగలిగిన పరిస్థితిలో లేదు. ఉత్తరాదిన చక్రం తిప్పినట్లు దక్షిణాదిన చక్రం తిప్పడం అంత సులభం కాదని వెూదీ, షా లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిజానికి ఉత్తరాదిన కూడా యోగి ఆదిత్యనాథ్‌, వసుంధరా రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ల ఆధిపత్యాన్ని వారు తగ్గించలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను గౌరవించడం లేదు. అవినీతి నేతలను దూరం పెట్టడంలోనూ విఫలమయ్యారు. అయితే యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆలస్యంగా అయినా గుర్తించిన నేతలు.. ఎన్నికల తర్వాత యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానంతో అమిత్‌ షా శాంతిప చేశారని ప్రచారం సాగుతోంది. మిగతా రాష్టాల్లో 75 ఏళ్లు దాటిన నేతల్ని ప్రక్కన పెట్టగలిగిన వెూడీ, షాలు కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో అంత సాహసం చేయలేకపోయారు. ఢిల్లీ ప్రమేయం లేకుండా తన కుమారుడికి, ఇతరులకు యడ్యూరప్ప సీట్లు ప్రకటించే స్థితిని అడ్డుకోవడానికి అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. గత లోకసేభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ లాంటి నేతలు సైతం వెూడీ హవాలో ఓడిపోయారు. ఈ గెలుపులో యడ్యూరప్ప పాత్ర కన్నా వెూడీ పాత్రే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అంతకు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పకు స్వేచ్ఛ నిచ్చినప్పటికీ, సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనపడినప్పటికీ బిజెపి మెజారిటీ సీట్లను సాధించలేకపోయింది. అయినప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ద్వారా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. యడ్యూరప్ప కాలంలో జరిగిన అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి తెలిసినా ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. అరాచక, అవినీతి పాలనను అరికట్టలేక పోయారు. కర్ణాటకలో వారసత్వ రాజకీయాలను, ఘోరంగా విస్తరించిన అవినీతిని అదుపు చేయలేని ప్రధానమంత్రి నరేంద్రవెూడీ తెలంగాణ వంటి ఇతర రాష్టాలకు వెళ్లి వారసత్వ పాలనను, అవినీతిని విమర్శించడాన్ని జనం గుర్తించడం లేదని భావించడం కమలనాథులు చేస్తున్న పొరపాటుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నా బిజెపికి దక్షిణాది నాడి తెలియదని చెప్పేందుకు మాత్రమే ఈ చేరికలు దోహదం చేస్తాయి.  బిజెపిలో చేరుతున్న వారిని, బిజెపి భావజాలాన్ని అభిమానిస్తున్న వారిని చూస్తుంటే రాజకీయాల్లో సైద్దాంతిక దృక్పథం కన్నా అవకాశవాదం, స్వప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.  

ఇందిరమ్మను తలపించిన ప్రియాంక గాంధీ

ప్రియాంక వాద్రా తెలంగాణ పర్యటన విజయవంతమైంది. ఆమె మాట, ఆమె తీరు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని తలపించాయి. ప్రియాంక ప్రసంగం యావత్తూ సూటిగా సుత్తి లేకుండా సాగింది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, తప్పిదాలను నిర్మొహమాటంగా ఎండగట్టారు. సోమవారం (మే 8) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు ప్రియాంక వాద్రా హాజరయ్యారు. ఆమె తన ప్రసంగాన్ని జై బోలో తెలంగాణ అంటూ ఆరంభించారు.   ఎండలు మండి పోతున్నా సభకు ప్రేమాభిమానాలతో సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు అని మొదలు పెట్టారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారిని ప్రస్తావించి కీర్తించారు.  మిత్రులారా అంటూ తెలుగులో సంబోధించారు.  తెలంగాణ సాకారం కోసం అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడివారు ఉద్యమించారని తెలిపారు. ఈ సభలో ప్రియాంక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.యువత బలిదానాల వల్లే తెలంగాణ సాకారమైందన్నారు. దేశం కోసం తన కుటుంబం కూడా త్యాగాలు చేఃసిందని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు.  తమ కుటుంబానికి త్యాగాల విలువ తెలుసు అని ఆమె అన్నారు.  తెలంగాణ కోసం వేలాది మంది బలిదానం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి త్యాగాలను ఏ మాత్రం గుర్తించడం లేదు అని ఆమె అన్నారు. ఇక తన తల్లి సోనియా తెలంగాణ ఇచ్చారనీ, సోనియా గాంధీ అధికారం కోరుకోకుండా తెలంగాణా ఇచ్చారని అన్నారు.    సోనియా గాంధీకి తెలంగాణా పట్ల ఉన్న ప్రేమ అభిమానానికి ఇది నిదర్శనం అని అన్నారు.అందుకే ఆమెను ఇక్కడి వారు తల్లిగా భావిస్తున్నారనీ గుర్తు చేసుకున్నారు. అత్యంత కఠినమైన తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుని సోనియా తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారని ప్రియాంక వాద్రా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుత కేసీఆర్ హయాంలో జాగీర్దార్ల పాలన సాగుతోందని విమర్శించారు.  ఇంటింటికీ ఉద్యోగం అన్న హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదని ప్రియాంకా వాద్రా అన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ఉద్యోగాల కల్పన అటకెక్కించారు... నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదంటూ విరుచుకుపడ్డారు.   రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావడంలేదు కానీ, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారని విమర్శించారు. జనం తనను నానమ్మ ఇందిరలా ఉన్నావంటున్నారనీ, ఆ మాటలు నాలో బాధ్యతను పెంచుతున్నాయనీ అన్నారు.  తెలంగాణ ప్రజలు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని చెప్పారు. ఈ సభలో ఆమె యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ.. అలా నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను పక్కన పెట్టేయండి.. తనతో ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరినీ నిలదీయండి అని ప్రియాంకా గాంధీ అన్నారు.  ఉద్యోగ నియామకాల కోసం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందిస్తాం, యువతీయువకుల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామన్నారు. తెలంగాణా అన్నది నేల కాదని తల్లి అని ఆమె అన్నారు. తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చూసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రియాంకా గాంధీ అన్నారు. తాను ఇందిరమ్మ మనవరాలిననీ తప్పుడు హామీలు ఇవ్వనని  ప్రియాంక గాంధీ అన్నారు.  తన ప్రసంగంలో అనేకసార్లు ఇందిరమ్మను ప్రియాంక తలచుకున్నారు. ప్రియాంక ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది.   మొత్తం మీద ప్రియాంక వాద్రా హైదరాబాద్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 

బాబు దెబ్బకు దిగొచ్చిన జగన్

నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అన్నీ తెలిసినట్లు ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ గత నాలుగేళ్లుగా రాజధాని మార్పు, కోర్టు కేసులు, అప్పుల కోసం ఎదురు చూపులతో గడిపేశారు. తీరా స్పందించాల్సిన సమయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసింది. ిటీవల రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో  జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తూర్పుగోదావరి జిల్లా వాసులు అంటున్నారు.  రైతులకుఅండగా నిలబడేందుకు రాజమండ్రిలో మకాం వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం యిచ్చారు. అప్పటి లోగా రైతుల కష్టార్జితాన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  తొలుత పట్టించుకోనట్లు వ్యవహరించిన అధికారులు రైతుల నుండి వస్తున్న ప్రతి స్పందనతో కదలాల్సి వచ్చింది.  వెంటనే ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు తరలించే పని మొదలైంది. దీంతో ఊపిరి పీల్చుకున్న రైతులు అండగా నిలబడిన చంద్రబాబుకు కృతజ్ణతలు తెలపారు.   కష్టంలో ఉన్న రైతాంగం కోసం జిల్లాలో బస చేసి ప్రభుత్వం మెడలు వంచిన చంద్రబాబు అక్కడి తెలుగుదేశం నేతలలో కొత్త ఆశలు నింపారు. యింత కాలం రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకున్న వైసీపీ నేతలకు రైతుల ముందుకు వెళ్లేందుకు ధైర్యం రావడం లేదు.  ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు తీసుకున్నసాహసోపేత నిర్ణయం రైతు లోకాన్ని ఆకట్టుకుంది.  72 గంటల లోగా ధాన్యంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, ధాన్యం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ ముంగిట కుప్పలుగా పోస్తామని చంద్రబాబు చేసిన హెచ్చరిక రైతులలో ఆయన గౌరవాన్ని పెంచింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయం తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. రైతుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశంప్రతిష్ట మరింత పెరిగింది.  యింత వరకూ హైకెట్ బాబు అంటూ, వ్యవసాయం దండగ అన్నారంటూ లేనిపోని ఆరోపణలు చేసిన వైసీపీ నోళ్లు ఈ దెబ్బతో మూతపడ్డాయి.  తెలుగుదేశం అధికారంలోకి వస్తే గ్రామీణ పరిశ్రమలపై దృష్టి పెడతామని చంద్రబాబు ముందే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 36శాతం వ్యవసాయ రంగం ఆక్రమించింది. కాగా పరశ్రమలశాతం 23శాతంగా ఉంది. సర్వీస్ సెక్టార్ వేల్యూ 41శాతంగాఉంది. అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే తెలుగుదేశం అజెండాలో రైతుల సంక్షేమం, వ్యవసాయక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు పెద్ద పీట వేస్తారని రైతులు ఆశిస్తున్నారు.  వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే బాబు పాలన రావాలని రైతులు అంటున్నారు. 

శ్రీవారి సన్నిధిలో సెల్ హల్‌చల్

 తిరుమల శ్రీవారి ఆలయం ఆనంద నిలయం. ఆ ఆలయంలోకి ప్రవేశించాలంటే... కట్టుదిట్టమైన భద్రత నడుమ, అడుగు అడుగునా నిఘా నేత్రాల మధ్య వీవీఐపీ నుంచి సాధారణ భక్తులు వరకు అందరూ ప్రవేశించాల్సి ఉంటుంది. అంతటి భద్రత నడుమ... అలాంటి ఆలయంలోకి ఓ వ్యక్తి సెల్‌ ఫోన్ తీసుకు వెళ్లడమే కాకుండా.. ఆ సెల్ ఫోన్‌.. కెమెరాతో ఆలయ విమాన గోపురాన్ని సైతం చాలా చక్కగా చీత్రికరించాడు. అందుకు సంబంధించిన వీడియో.. అటు సోషల్ మీడియలో ఇటు మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  అయితే ఆ వీడియో వైరల్ కావడంపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన చెందడంతోపాటు ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల స్వామి వారి ఆలయం వద్ద నిఘా వ్యవస్థ వైఫల్యానికి ఇది ఓ నిదర్శనమని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతోన్నాయి. తిరుమలలోనే కాదు... తిరుమల దేవాలయ పరిసర ప్రాంతాల్లో సైతం భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాగే తిరుమల కొండపైకి ప్రవేశించిప్పటి నుంచి అడుగడుగునా నిఘా కెమెరాలు.. నిత్యం భక్తులు, స్థానికుల కదలికలను ప్రతీక్షణం గమనిస్తూ ఉంటాయి.  అంటువంటిది.. ఆలయంలోకి ఓ వ్యక్తి నిఘా నేత్రాల కళ్లుగప్పి సెల్ ఫోన్ తీసుకు వెళ్లాడంటే.. అతగాడి చాకచక్యమని మురిసిపోవాలా లేకుంటే.. భద్రత దళాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనమనాలా? నేడు సెల్ ఫోన్ తీసుకు వెళ్లిన వ్యక్తి.. రేపు మరణాయుధాలు తీసుకు వెళ్లితే పరిస్థితి ఏమిటీ.. ఆ తర్వాత చోటు చేసుకొనే పరిస్థితులకు బాధ్యులు ఎవరూ? అంతా జరిగిపోయాక.. మృతులకు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభుతి తెలపడం... అలాగే ప్రధాని, ముఖ్యమంత్రి అత్యవసర సహాయక నిధి నుంచి నిధులు విడుదల చేయడం.. బాధ్యతారాహిత్యంగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వేటు వేసి.. .ఆ బాధిత కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం అందజేయడంతో.. తమ క్రతువు ముగిసిందని రాజకీయ నాయకాగణంతోపాటు ఏలికలు సైతం భావిస్తూ ఉంటాయి.    కానీ హిందూ దేవాలయాలు.. భగవంతునికి, భక్తునికి అనుసంధాన సంపదకు ప్రతీకగా వర్ధిల్లుతోన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ దేవాలయ నిర్మాణాలు, సాంస్కృతిక కట్టడాలు, ఆ విగ్రహాలు... ఆ ఆగమ శాస్త్రాలు.. ఆ ఆచారాలు, ఆ ఆలయాల పవిత్రత అన్ని హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా వేనోళ్లు కొనియాడబడుతోన్నాయి..     అదీకాక ఉగ్రవాదం, తీవ్రవాదం అనే సమస్యలు ఓ ప్రాంతానికో.. ఓ దేశానికి సంబంధించిన సమస్యగా కాకుండా ప్రపంచ మానవాళిని ముప్పుగా పరిణమించిన వేళ... తిరుమలలో ఉగ్రవాదుల సంచారిస్తున్నారంటూ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులకు ఇటీవల ఓ ఈమెయిల్ రావడం.. దాంతో భద్రత సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి.. జల్లెడ పట్టడం.. ఆ తర్వాత తిరుమలలో ఉగ్రవాదులు లేరంటూ.. ఈ మెయిల్ శుద్ద అబద్దమంటూ వారి కొట్టిపారేయం జరిగింది. అయితే తొలుత ఈ వార్త విన్న... ప్రపంచంలోని శ్రీవారి భక్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాంటి వేళ.. ప్రపంచంలోనే అత్యధిక భక్తులతో కొలవబడుతోన్న కొంగు బంగారు స్వామి శ్రీ ఏడుకొండల స్వామి వారిని ఏ మూల నుంచి, ఏ వైపు నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లనుందో తెలియని నేపథ్యంలో ఆలయ అధికారులు, భద్రత సిబ్బందే కాదు.. భక్తులు సైతం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం. ఓ వేళ.. ఎటువంటి ముప్పు అయినా వాటిల్లితే.. ఆ దేవదేవుడే కాదు.. భవిష్యత్తు తరాలు.. సైతం మనలను క్షమించవు కాక క్షమించవు.

ఊరట నిచ్చిన కేజ్రీవాల్ ప్రకటన

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్ మెంట్ బీఆర్ఎస్ కు ఊరటనిచ్చింది. ఎందుకంటే  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఈ ఉచ్చులో చిక్కుకుపోవడమే ప్రధాన కారణం. ఆమె ఇప్పటికే సుప్రీం గడపదొక్కిన సంగతి తెలిసిందే. కవిత అరెస్ట్ కానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో న్యాయస్థానం లిక్కర్ స్కాం ఓ బూటకం అని కేజ్రీవాల్ ప్రకటన బీఆర్ఎస్ ను ఓదార్చినట్టయ్యింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఒక బూటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన రాజేశ్‌ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లంచం కింద డబ్బు చెల్లించినట్లు కానీ, తీసుకున్నట్లు కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని జడ్జి వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఈరోజు స్పందించారు. ‘‘లిక్కర్‌ స్కామ్ మొత్తం ఒక బూటకం. మేం ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆప్ లాంటి నిజాయతీ గల పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది’’ అని విమర్శించారు. ‘‘లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించిన సాక్ష్యం లేదని ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవలం ఆప్‌ని కించపరిచేందుకేనని మేము మొదటి నుంచి చెబుతున్నాం’’ అని అంతకుముందు ఓ ట్వీట్ చేశారు.

అవినాష్ అరెస్ట్ కు కర్నాటక అడ్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత   జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో  భాస్కరరెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించింది. అయితే వైయస్ అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అయిపోతారంటూ నిన్న మొన్నటి  వరకూ జోరుగా సాగిన ప్రచారం యిప్పుడు జగరడం లేదు.  అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఆదేశాలు ఇవ్వలేమని   విస్పష్టంగా చెప్పేసి,  కోర్టుకు వేసవి సెలవులు నేపథ్యంలో ఈ కేసు విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు సీబీఐకి ఎలాంటి అవరోధాలూ లేకుండా పోయాయి. అయినా అవినాష్ అరెస్టు విషయంలో సీబీఐ అడుగు ముందుకు వేయడం లేదు. అవినాష్ మాత్రం పులివెందులలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభోత్సవాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ఈ విధంగా అవినాష్ గతంలో ఎన్నడూ ప్రజలలో కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఆఖరికి చిన్న చిన్న దుకాణాల ప్రారంభోత్సవాలకు కూడా అవినాష్ హాజరౌతున్నారు. ఒక విధంగా కోర్టులు ఆయన అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేవని విస్ఫష్టంగా చెప్పేసినా ఆయన అలా యథేచ్ఛగా తిరుగుతున్నా సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవడం లేదంటే.. ఆయనకు కోర్టుల రక్షణ లేకపోయినా సీబీఐ అరెస్టు చేయలేదన్న ధైర్యం మెండుగా ఉందనీ, దీని వెనుక ఏదో మతలబు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన అరెస్టుకూ, కర్నాటక ఎన్నికలకూ లింకు పెడుతూ పలు విశ్లేషణలు చేస్తున్నారు.   అవేమంటే.. కర్నాటకలో అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ  ఆ రాష్ట్రంలో విజయం కోసం ఎదురీదుతోంది. యిప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేలూ కాంగ్రెస్ దే గెలుపని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో అంతో యింతో పట్టున్న జగన్ కు కర్నాటకలో తమ పార్టీని గెలిపించే కీలక బాధ్యత బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు అప్పగించింది. అందుకు జగన్ సై  అన్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కర్నాటకలో బీజేపీ విజయం కోసం జగన్ రమారమి ఐదు వందల కోట్లు వ్యయం చేయడానికి సైతం రెడీ అయ్యారు. అన్నిటికీ మించి  ఆ రాష్ట్రంలో బీజేపీని దూరం జరిగి సొంత కుంపటి పెట్టుకున్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి జగన్ కు సన్నిహితుడన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి కారణంగా బీజేపీ ఓట్లు చీలకుండా, ఆయన కమలం పార్టీలో స్నేహపూర్వక పోటీలో మాత్రమే ఉండేలా ఆయనను ఒప్పించేందుకు బీజేపీ జగన్ తో ఒప్పందం కుదుర్చుకుందని పరిశీలకులు అంటున్నారు. యిందు కోసం జగన్ అవినాష్ రెడ్డికి  అరెస్టు నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరారనీ, అందుకు బీజేపీ హై కమాండ్ అంగీకరించిందనీ ఓ చర్చ అయితే జోరుగా సాగుతోంది. అందుకే కళ్ల ముందే సవాల్ చేస్తున్నట్లుగా అవినాష్ పులివెందులలో తిరుగుతున్నా.. అరెస్టు చేయడానికి సీబీఐ యిసుమంతైనా ప్రయత్నించడం లేదనీ  అంటున్నారు. పరిస్థితులను గమనిస్తున్న ఎవరికైనా అవినాష్ అరెస్టు కాకపోవడానికి పై నుంచి సీబీఐపై తీవ్ర ఒత్తిడి ఉందని అనిపించకమానదు. ఆ ఒత్తిడి ఎక్కడ నుంచి, ఎవరి నుంచి అన్న విషయంలో ఎవరికీ అనుమానాలూ, సందేహాలూ ఉండవు. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చే వరకూ అవినాష్ కు అరెస్టు భయం లేదని పరిశీలకుల విశ్లేషణలు హేతుబద్ధంగానే ఉన్నయని సామాన్యులు సైతం అంటున్నారు.  

ఏపీ పోలీసులు జ్యుడీషియల్ అధికారులనూ వదలరా?

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏ నిబంధనలూ వర్తించవా.. ప్రభుత్వానికీ, తమకూ వ్యతిరేకంగా  ఎవరైనా మాట్లాడితే సహించరు. అలా యిష్టారీతిగా వ్యవహరించడానికి  ప్రభుత్వం వారికి లైసెన్స్ యిచ్చేసిందా? ఏమైనా తేడా జరిగితే కోర్టుల్లో చూసుకుందాం అన్న బరోసా యిచ్చేసిందా? అంటే రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలూ, నెలకొన్న వాతావరణం చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా ఏకంగా  ఒక సీఐ కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ గా నియమించిన లాయర్ ను చితక బాదారు. వివరాలిలా ఉన్నాయి.  ఒక వ్యక్తి అక్రమ నిర్బంధం విషయంలో ఏపీ హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్  అడ్వకేట్ ఉదయ సింహారెడ్డి,  తన కోర్టు సిబ్బందితో వెళ్లారు. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పీఎస్ లో  చిత్రహింసలకు గురయ్యాడని గుర్తించిన జ్యుడీషిల్ అధికారి ఉదయ సింహ అతడిని మరుసటి రోజు కోర్టులో హాజరు పర్చాల్సిందిగా అక్కడి  పోలీసులకు చెప్పారు. అలాగే అందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ దశలో పోలీసు స్టేషన్ లో ఉన్న సీఐ యిస్మాయిల్ పోలీసు సిబ్బంది లాయర్ ఉదయ సింహారెడ్డి, ఆయనతో వెళ్లిన యిద్దరు కోర్టు సిబ్బంది దాడి చేసి కొట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు సుమో పిల్ నమోదు చేసింది. ఆ కేసు సోమవారం (మే 8) విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్  కుమార్ మిశ్రా హిందూపురం సీఐ యిస్తాయిల్ పై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నియమించిన కమిషన్ పై చేయి చేసుకోవడానికి సీఐకి  ఎంత ధైర్యం అని  వ్యాఖ్యానించింది.  కోర్టు పాలనా విధులకు ఆటంకం కలిగించడమేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. తక్షణమే సిఐ యిస్మాయిల్ పై కోర్టు ధిక్కరణ కింద అభియోగాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా ఏపీలో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. యిటీవలే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ యిద్దరు ఆర్టీసీ అధికారులకు కోర్టు జైలు శిక్ష , జరిమానా కూడా విధించింది. యిప్పుడు సీఐ ఏకంగా కోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారిపైనే చేయి చేసుకోవడం సంచలనంగా మారింది.   యిప్పటికే న్యాయమూర్తుల్ని బూతుల్ని తిట్టిన కేసు సీబీఐ దర్యాప్తులో నత్తనడకన సాగుతోంది.   మొత్తం మీద ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జ్యుడీషియల్ అధికారిపై సీఐ చేయిచేసుకున్నసంఘటనలో హై కోర్టు సీరియస్ అయ్యింది.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. జమిలి అనుమానాలు!

తెలంగాణ ఎన్నికల విషయంలో ముందస్తు ముచ్చట వెనక్కు పోయి.. జమిలి అవకాశాలపై చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. పొరుగున ఉన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కర్నాటక ఫలితాల ప్రభావం పడి గెలుపు వాకిట బోల్తా పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతోంది.  దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతో  పాటు వచ్చే ఏడాది లో నిర్వహించాలని భావిస్తోంది. అందు కోసం చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. జమిలి కోసం పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకువచ్చైనా సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ వాయిదా వేయడమే మంచిదన్న భావన బీజేపీ అధిష్ఠానంలో బలంగా వ్యక్తమౌతోందని కేంద్రంలో బీజేపీకి సన్నిహితంగా మెలిగా వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగేదెప్పుడన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే జరిగితే..  అది కచ్చితంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది.  ఒక వేళ అదే జరిగితే న్యాయపోరాటానికి రెడీ అవుతామంటోది.  ఒక్క తెలంగాణలోనే కాదు ఈ ఏడాది డిసెంబర్, నవంబర్ లో ఛత్తీస్ గఢ్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది అందరూ భావిస్తున్నారు.    అందుకే పలు దశల్లో ఎన్నికలు జరిపే కేంద్ర ఎన్నికల కమిషన్..  షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో  నవంబరు చివర్లో  ఎన్నికలు నిర్వహించే అవకాశాలే మెండుగా ఉన్నాయని, కనుక అక్టోబరులోనే షెడ్యూలు విడుదల కావచ్చనీ బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ నెలాఖరునాటికి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను సిద్ధం చేస్తోంది. అయితే ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తరువాత ఆరు నెలల లోగానే .. సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి జమిలిగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  ఈ విషయంలో రాజ్యాంగ పరమైన చిక్కులు ఎదురు కాకుండా  ఆర్డినెన్సు రూపంలో  వీటి అసెంబ్లీ కాలపరిమితిని మే నెల వరకూ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే బీఆర్ఎస్ మాత్రం యిందుకు ససేమిరా అంగీకరించే అవకాశాలు లేవు.  ఒక వేళ  కేంద్రం జమిలి కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎదుర్కొనడం ఎలా అననదానిపై యిప్పటికే బీఆర్ఎస్ కసరత్తులు మొదలు పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో యిప్పటికే రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను తీసుకునే పనిలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉందని చెబుతున్నారు.   

మణిపూర్ మండిపోతోంది

సెవెన్ సిస్టర్స్ అని భారతీయులు ప్రేమగా పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. నేపాల్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాల సరిహద్దులుగా భారతదేశ పటానికి మరింత అందాన్ని అద్దే ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ ఒక అద్భుతమైన రాష్ట్రం.  ప్రకృతి అందాలతో ఈ ఏడు రాష్ట్రాలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. దశాబ్ద కాలంగా మణిపూర్ రాష్ట్రంలో జాతల మధ్య పోరు సాగుతున్నా.. ప్రస్తుతం అది తీవ్రంగా మారింది.   యిక్కడ మొయితీ, కుకూ, నాగా జాతుల ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు.  వీరిలో కుకూ, నాగా జాతులు షెడ్యూల్ తెగలుగా గుర్తింపు పొందాయి.  అయితే తమను కూడా ఎస్పీ జాబితాలో చేర్చాలంటూ మోయితీ తెగ ప్రజలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోయాయి.దీంతో అక్కడ పరిస్థితులుఅదుపు తప్పి దారుణ పరిస్థితులకు దారి తీశాయి.  గత వారం రోజులుగా  జరగుతున్న ఆందోనల్లో దాదాపు 60 మంది ప్రజలుచనిపోయారనీ, వంద మందికి పైగా గాయపడ్డారని, పాతిక వేల మందికి పునరావాసం కల్పించామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ అనధకారిక  లెక్కల ప్రకారం ఈ అంకెలు యింకా ఎక్కువగానే అంటాయని విశ్లేషకులు అంటున్నారు.  మణిఫూర్ రాష్ట్రంలో మొయితీ తెగ ప్రజలు 54 శాతం మంది ఉండగా.. వారు అధికంగా  మైదాన ప్రాంతాలలో నివశిస్తుంటారు.  మే 29వ లోగా మోయితీ తెగ ప్రజలను ఎస్టీలుగా గుర్తించాల్సిందిగా మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.  దీంతో కుకూ, నాగా తెగ యువత ఆందోళనకు దిగింది. ఆందోళనలో  భాగంగా భారీ ర్యాలీలు జరిగాయి.  పరిస్థితులను అదుపు చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం కుకూ, నాగా జాతి ప్రజలను పర్వత ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు బలవంతంగా తీసుకుకవస్తున్నారు.  అడవి బిడ్డలమైన తమను అడవి నుంచి దూరం చేయడంతో కుకూ, నాగాలు తిరగబడుతున్నారు. వీరు క్రైస్తవాన్ని అనుసరిస్తుండగా, మొయితీలు హిందూ జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ కారణాలతో సహజంగానే పోరు మతం వైపు సాగింది.  యింత వరకూ పాతిక చర్చీలు, 500కు పైగా ిళ్లుఅగ్నికి ఆహుతయ్యాయి. మణిపూర్ రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులుచ దువుతున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాలు వారి వారి రాష్ట్రాల విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడ్డాయి. యిదిలా ఉండగా..  మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు కేంద్రంలో , రాష్ట్రంలో ఉన్న బీజేపీ కారణమని  మణిపూర్ ట్రైబల్ ఫోరం సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మణిపూర్ ఛాయలకు కూడా వెళ్లకపోగా.. ప్రధాని, హోం శాఖ మంత్రి యిద్దరూ కర్నాటక ఎన్నికలలో బిజీగా ఉండడం కొసమెరుపు. 

ఆధార్ ఎక్కడ అవసరం? 

ఆధార్ అనివార్యత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు   మార్గదర్శక సూత్రాలను  జారీ చేసింది. ఆధార్ విలువ ఏ మాత్రం తగ్గలేదని సుప్రీం స్పష్టం చేసింది. ఆధార్ కార్డుఎక్కడ అవసరం? ఎక్కడ అవసరం లేదు? అనే విషయాలను సుప్రీం వెల్లడించింది. సుప్రీం తీర్పు ప్రకారం స్కూళ్లలో ఆధార్ కార్డు అవసరం  లేదని చెప్పేసింది. అడ్మిషన్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనను సుప్రీం కోర్టు కొట్టేసింది. స్కూళ్లలో సర్వశిక్షా అభియాన్ కోసం ఆధార్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు.  ఆధార్ ఉంటేనే సర్వశిక్ష అలవుతుందన్న నిబంధనను సుప్రీం కొట్టివేసింది. ఇప్పటివరకు 6 నుంచి14 ఏళ్లలోపు ఆధార్ ఉంటేనే సర్వశిక్షా అభియాన్ కు అర్హత పొందేవారు. ప్రస్తుతం అటువంటి నిబంధనను సడలించారు.  ఆధార్ తో మొబైల్ లికింగ్ అవసరం లేదని  సు ప్రీం తేల్చేసింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇప్పటి వరకు ఆధార్ అవసరమయ్యేది. ప్రస్తుతానికి సుప్రీం ఈ నిబంధనను మినహాయించింది.  ప్రస్తుతం ఉన్న  బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అవసరం లేదని సుప్రీం స్పష్టీకరించింది. యుజీసీ,  ఎన్ఇఇటీ, సీబీఈసీ తదితర సంస్ధలలో ఆధార్ అవసరం లేదు. ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ, సిబ్బంది నుంచి యాజమాన్యాలు ఇక నుంచి ఆధార్ కార్డులు అడగకూడదు. వ్యక్తి గత గోప్యతలో భాగంగా ఆధార్ అవసరం లేదని సుప్రీం స్పష్టీకరించింది.