ది కేరళ స్టోరీ ప్రమోటర్ బీజేపీ!?
posted on May 9, 2023 @ 3:35PM
మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సినిమా ఉగ్ర వాదాన్ని బట్ట బయలు చేసిందని సాక్షాత్తు కేంద్ర సమాచార, ప్రసా ర క్రీడలు, యువత వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. ఈ చిత్రం ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి అంటున్నారు. ఉగ్రవాదం, మత మార్చిడి చేతులు కలిపి ఒకదానికి ఒకటి ఊతమిచ్చుకుంటున్న ఒక అనైతిక బంధాన్ని చిత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపిందని చెబుతున్నారు. చిత్ర ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఖండిస్తూ.. ఈ నిషేధంతో మమతా బెనర్జీ రాష్ట్రంలో మహిళా లోకానికి అన్యాయం చేస్తు న్నారని విమర్శించారు.
ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసేవారితో అంటకాగుతున్నారా లేక వారికి వ్యతిరేకంగా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధా నం మమతా బెనర్జీ చెప్పాలని నిలదీశారు. ఉగ్రవాదం ప్రధా నాంశంగా వచ్చిన ఒక చిత్రాన్ని ఎందుకంత పెద్ద సమస్యగా భావిస్తున్నారంటూ యావత్ దేశం ఆమెను ముక్త కంఠంతో ప్రశ్నిస్తోందన్నారు.
ది కేరళ స్టోరీ సిన్మాకు బీజేపీ ప్రమోషన్ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆ విత్ర నిర్మతలకు ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గిందని ఈ సినీమాను వ్యతిరేకించే వారు అంటున్నారు. గతంలో కూడా బీజేపీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఇలాంటి సహకారాన్నే అందించిందని గుర్తు చేస్తున్నారు.