పొట్టలో నీరు వల్ల ఇన్ని రోగాల రిస్క్ ఉందా?

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పొట్ట పెరగడం. దీన్నే అందరూ పొట్ట పడింది అంటూ ఉంటారు. కొందరికి పొట్టలో నీరు చేరుతుంది. పొట్టలో 12 లీటర్ల నీరు చేరితే తప్ప నీరు చేరినట్లు స్పష్టంగా కనబడదు. పొట్టలో నీరు చేరడాన్ని 'ఎసైటిస్' అంటారు. జీర్ణకోశం నుంచి లివర్ కి వెళ్ళే రక్తనాళాలకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే పొట్టకి నీరు చేరడం అతి సహజం. ముఖ్యంగా లివర్ కుదించుకు పోయినప్పుడు (సిర్రోసిస్ లివర్) పొట్టకి నీరు చేరుతుంది. గుండె పెరిగినప్పుడు, మూత్ర పిండాలు దెబ్బతిన్నప్పుడు పొట్టకి నీరు వస్తుంది. కడుపులో క్షయవ్యాధి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు కడుపుకి నీరు చేరడం సహజం. లివర్, పాన్ క్రియాస్, జీర్ణకోశం, గర్భకోశం, అండాశయాలకి టి. బి కేన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా పొట్టకి నీరు చేరు తుంది. కొందరికి పొట్టకి నీరు చేరడంతోపాటు కాళ్ళకి, ముఖానికి, శరీరం అంతటికీ కొద్దో గొప్పో వీరు వస్తుంది ఈ పరిస్థితిని'నెఫ్రొటెక్' సిండ్రోమ్' అనుకోవచ్చు.  ముందుగా కాళ్ళకి వీరు కనిపించి, ఆ తరువాత పొట్టకి నీరు చేరడం అంటే గుండె పెరగడంవల్ల అని అనుమానించవచ్చు. పొట్ట బానలాగా తయారై పొట్టకి విజరీతంగా నీరు మరి కొద్దిపాటి నీరు కాళ్ళకి వుంటే 'సిర్రోసిస్ లివర్' అనుకోవచ్చు. పొట్టకి నీరు చేరడమే కాకుండా పచ్చకామెర్లు (జాండిస్) కూడా వుంటే పోర్టల్ వెయిన్ ఆల్ స్ట్రక్షన్ అను కోవచ్చు. పోర్టర్ వెయిన్ అల్సక్షన్లో రక్తంలో ప్రోటీను శాతం బాగా తక్కువగా వుంటుంది. ఏ సమస్య ఎలా ఉంటుంది?? సిర్రోసిస్ :- సిర్రోసిస్ లివర్ (లివర్డి స్యూ పూర్తిగా పాడై కుదించుకుపోవడం) ఉన్న వ్యక్తి అంతకు ముందు మధ్యం అతిగా సేవించడం జరిగి ఉండవచ్చు లేదా అంతకు ముందు ఏదైనా ఇన్ ఫెక్షను వచ్చి కాలేయం బాగా  దెబ్బతిని ఉంటుంది. కొందరిలో అంతకు ముందు రక్తం వాంతి అవడం, విరోచనంలో నల్లగా రక్తం పోవడం, కామెర్లు రావడం ఉంటాయి. కోసిస్ పరిస్థితి ఉన్న వారి బుగ్గలు ఎరుపుగా వుంటాయి. బొడ్డు దగ్గర రక్తనాళాలు ఉబ్బి స్పష్టంగా కనబడతాయి. వికారం, ఆకలి లేకపోవడం వుంటాయి. కొందరిలో మొదట్లో లివర్ స్క్రీన్ పెరిగి కనబడటుంది. సిర్రోసిస్ లివర్ లో కొందరికి పచ్చ కామెర్లు ఉంటాయి. మూత్రపిండాల వ్యాధి : మూత్రపిండాల వ్యాధి వల్ల పొట్టకి నీరు చేరటమేకాకుండా, ముఖానికి, కాళ్ళకి . నీరు చేరుతుంది. మూత్రంలో ఆల్బుమిన్ కనబడుతుంది. మైక్రోస్కోప్ పరీక్ష చేస్తే ఎపిథీలియల్ కాస్ట్స్ ఉంటాయి. గుండెజబ్బు:  గుండె పెరిగినప్పుడు సిరలన్నీ ఉబ్బుతాయి. మెడదగ్గర రక్తనాళాలు ఉబ్బి కనబడతాయి. కాలేయం ఉబ్బుతుంది. గుండె పెరిగినప్పుడు ముందు కాళ్ళకి, ఒంటికి నీరు కనబడి ఆ తరువాత పొట్టకి నీరు కనబడుతుంది. గుండె పెరగగా పొట్టకి నీరు చేరిన పరిస్థితిలో వ్యక్తి ఆయాసపడటం వుంటుంది. 'థాలస్ ఎసైటిస్' లో పొట్టలో చేరిన నీరు పాల లాగా కనబడుతుంది. నీరు పాలలాగా కనబడటానికి కడుపులో వున్న ప్రధాన ఎంఫాటిక్ నాళానికి అడ్డంకి ఏర్పడటం లేదా క్యాన్సర్ కణాలు చేరడం కారణం. బోదకాలు వున్న వారిలో కూడా బోద వ్యాధివల్ల పొట్టలో ఖైల్ చేరి నీరు పాలలా కనబడుతుంది. ఇన్ని రకాల సమస్యలను మీరే డిసైడ్ చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                  ◆నిశ్శబ్ద

ప‌న‌స పండు త‌ర‌చూ తింటే..!

కోరోనా తరువాత శరీరం లో రోగనిరోదక శక్తి తగ్గింది కాబట్టి.మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. గరీబోడికి బాదం, పిస్తా, కర్జూరం కొనాలంటే కాస్త ఇబ్బందే అందుకే అతి తక్కువ ఖర్చుతో కూడిన గరీబోడి బాదాం ఏది అని కదా మీ ప్రశ్న అదే పనస పండు. పనస పండు పై భాగం లో ముళ్ళు ముళ్ళు గా ఉన్నప్పటికీ లోపల ఉండే పనస తొనల సువాసన తొనలను తిన్నకొద్దీ తినాలని అనిపిస్తుంది.పనసపండు చూసేందుకు అందం గానూ ఉండే తోన అందులో ఉండే గింజలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. పనస పండులో విటమిన్ బి,లేదా రక్తహీనత ఉన్నవాళ్ళకి పనసపండు శ్రేష్టం.మీ చర్మం అందంగాను జుట్టు ద్రుడంగాను ఉండాలంటే పనసపండు కు మించినది లేదని న్యుట్రీషియనిస్ట్ లు అంటున్నారు. న్యుట్రీషియనిస్ట్ లు చేసిన పరిశోధనలలో పనస గింజలలో అద్భుతమైన గుణాలు ఉన్నా యని పేర్కొన్నారు. పనస గింజల ను తినే పద్ధతి ని  పనస గింజలలో  ఉండే లాభాల ను గురించి వివరించారు. వేసవి కాలం లో మాత్రమే లభించే పనసపండు పనసతోన కేవలం సువాసన నే కాదు ఆరోగ్య పరంగా మరిన్ని పోషకాలు లభ్యమౌతాయి.ప్రత్యేకంగా పనసగింజలు ఆరోగ్య ఖజానాను అందిస్తుందని పేర్కొన్నారు. పనస తొనలు,గింజలు తీసుకోవడం వల్ల మంచిఫలితాలు ఇస్తాయని గింజలను సరైన పద్దతిలో తినడం వల్ల  ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. పనస గింజలు అద్భుత ఫలితాలు... పనస గింజలలో కొన్ని రకాల పోషక తత్వాలు సంపూర్ణంగా లభిస్తాయి. పనస గింజలలో విటమిన్ బి గుణాలు సంపూర్ణం గా లభిస్తాయి. విటమిన్ సి,విటమిన్ఏ  తయామిన్, రేబాఫ్లోబిన్, జింక్,నియాసిన్, లాంటి చాలా రకాల తత్వాలు ఇందులో ఉంటాయి. పనస గింజలు తినడం వల్ల శరీరం లో హిమాగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మీరు ప్రోటీన్ కోసం వెతుకు తున్నారా ప్రత్యామ్నాయం గా పనస గింజలు ఎంచుకోవచ్చు. పనస గింజలు శరీరం లోపల నుండి బలోపేతం చేస్తుంది.అనారోగ్య తీవ్రతను నియంత్రిస్తుంది. పనస గింజలను ఎలా ఉడికించాలి... పనస గింజలు తినే ముందు శుభ్రంగా కడిగి శుభ్రంగా ఒలిచి గింజలు ఒకదగ్గర చేర్చి శుభ్రంగా నిపౌలమీద కాల్చినా, లేదా పెనం పై రోస్ట్ చేసి తిన్న ఆరుచి వేరు అంటారు పనస ప్రియులు. బాగా మరిగించిన నీటిలో వేసిన గింజలు వేసి కొంచం ఉప్పు జోడించండి చాలా రుచిగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు పనస పొట్టు తో కూర అద్భుతంగా చేస్తారు పనస కూర తో చేసే బిరియాని చాలా రుచిగా ఉంటుంది. సో ఏని  వే గరీబోడి బాదం పనస గింజల తో అద్భుత ఫలితాలు  ఉన్నాయన్నది వాస్తవం.                                         

క్యాన్సర్ అంటే ఏమిటి ? 

కొన్ని అపోహలు,సందేహాలు.అవగాహన. క్యాన్సర్ గురించి అందరూ వినే ఉంటారు. కాని క్యాన్సర్ అంటే ఏమిటి ? అని అడిగితే మాత్రం చాలా మంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు తెలిసి ఉంటాయి. క్యాన్సర్ లో 1౦౦ కు పైగా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు ఆఖరికి కళ్ళు గుండె కు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్యాన్సర్ ప్రారంభం మొదట ఎదో ఒక శరీర భాగపు కణాల లో మొదలు అవుతుంది. సాధారణ శరీర కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకుంటే క్యాన్సరు రూపు రేఖలు ఏమిటో తెలుస్తాయి. సాధారణ శరీర కణాలు...జీవిత చరిత్ర తెలియాలి.  మన శరీరం అనేక రకాల సజీవ కణాల తో కూడుకుని ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవము కణాల సముదాయమైన తిష్యుల తో నిర్మితమై ఉంటుంది. భావన నిర్మాణం లో ఇటుకలు ఎలాంటివో శరీరంలోని వివిధ విభాగాల నిర్మాణం లో టిష్యూ లు ఇటుకల లాంటివి. సాధారణ ఆరోగ్యకర శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి మరిన్ని కణాలుగా విభాజ్యం చెందుతూ ఎప్పటి కప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక నిర్ణీత కాలం వచ్చే సరికి శరీరంలోని ప్రతి కణానికి వయస్సు చెల్లె సమయం ఆసన్న మౌతుంది.అప్పుడు అవి ఇక పని చేయని స్థితికి వస్తాయి. పని చేయని స్థితికి వచ్చిన కణాలు ఎప్పటి కప్పుడు నశించి పోతాయి. నశించిన కణాల స్థానం లో అంతకు ముందు విభాజ్యం చెందుతూ ఏర్పడిన కొత్తకణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషికి జీవన ప్రారంభదశలో అంటే బాల్యంలో శరీర కణాలు వేగంగా విభాజ్యమౌతూ వృద్ది చెందుతాయి. ఆకాలం లో నశించి పోయే కణాలకంటే కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరాలు అభివృద్ధి చెందుతూ పిల్లలు ఎదగడానికి వీలు కలుగుతుంది. ఇది మనశారీర కణాల జీవిత చరిత్ర.  క్యాన్సర్ కణాలు ---కణితలు.  క్యాన్సరు ఎప్పుడూ ఎదో ఒక శరీర భాగపు కణం తో ప్రారంభ మౌతుంది. కణాలు విభాజ్యం చెందడం కొత్త కణాలు గా ఏర్పడుతూ వృధీ చెందడం . పాత గా అయిపోయిన కణాలుమరణించడం అనే సహజ సిద్దమైన క్రమబద్ద క్రియ లో ఒక్కోసారి ఎక్కడో తేడా వస్తుంది. ఆ తేడా కారణంగా శరీరంలోని ఒకానొక భాగం లో పనిచేయని వయస్సు చెల్లిన కణాలు నసిన్చిపోవడం అంతే కాక అవసరం లేక పోయినా ఆ భాగాన కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవసరం తీరి నశింపు చెందకుండా ఉన్న పాత కణాలు, అవసరం లేకపోయినా ఏర్పడిన కొత్త కణాలు ఆ మొత్తంలో అక్కడి భాగం ఒక ముద్దగా గడ్డలా తయారు అవుతుంది. అలా ఏర్పడిన గద్దలనే వైద్య పరి భాషలో ట్యూమర్స్ అంటారు. గడ్డలు శరీరంలో ఏ భాగంలో ఐనా ఏర్పడవచ్చు. వీటిలో ప్రామాడం లేని గడ్డలు ఉంటాయి. ప్రమాదాన్ని కలిగించే హానికారక గడ్డలు ఉంటాయి. ప్రమాదంలేని గడ్డలను మ్యాలిగ్నేంట్ ట్యూమర్స్ అంటారు.   ప్రమాదాన్ని కలిగించే గడ్డలను మ్యాలిగ్నేట్ ట్యూమర్ అంటారు క్యాన్సరు గద్దలంటే ఇవే.. ప్రమాదం లేని గడ్డలు- బినైన్ ట్యూమర్స్... * ఇవి క్యాన్సర్ ను కలిగించవు,ప్రాణాపాయం లేనివి. * వీటిని చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చు. సాధారణంగా ఇంకా మళ్ళీ పెరగవు. * ఈ గడ్డ లోని కణాలు చుట్టుపక్కల కణ జాలం లోకి ప్రవేసించ లేవు.  * అదే విధంగా మరో ప్రాంతపు శరీర భాగం లోకి వ్యాపించలేవు. హానికార గడ్డలు -మ్యాలి గ్నేట్ ట్యూమర్స్...  * ఇవి క్యాన్సర్ కు సంబందించిన ప్రాణాపాయ గడ్డలు.  * ఈ రకంగా ప్రాణాంతక హానికారక క్యాన్సర్ గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చుకాని మళ్ళీ పెరిగే అవకాసం ఉంది.  * క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలం లోకి ఇతర శరీర భాగాలలోకి ప్రవేసించ గలుగుతాయి. * ఈ గడ్డ లోని క్యాన్సరు కణాలు రక్త ప్రావాహం ద్వారా,లింఫ్ వ్యవస్థ ద్వారా దూరంగా ఉన్న అవయవాల లోకి ప్రవేశించి. ఆయా భాగాలాలో కొత్త గడ్డలను ఏర్పరచ గలుగు తాయి. ఇలా దూరంగా ఉన్న ఆవయవాలలోకి క్యాన్సర్ వ్యపించడాన్ని మెటా స్టే సిస్ అంటారు. క్యాన్సర్ లక్షణాలు ... క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి.ఒక్కోరకమైన క్యాన్సరు లో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సార్ లలో అవి భాగా ముదిరిపోయే దాకా ఏ లక్షణాలు కనిపించవు. కూడా అందుకనే  డాక్టర్స్ క్యాన్సర్ కవాచ్చు ఏమో అన్న అనుమానం కలగ గానే ఆ వ్యక్తికి వివిధ టెస్టులు ,స్క్రీనింగ్ లు జరిపిస్తారు. క్యాన్సర్ లో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు, చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి ... * చాతిలో లేక శరీరంలో మరెక్కడైనా కొత్తగా ఏదైనా గడ్డలు కనిపించడం.  * కొత్తగా నల్లటి మచ్చ ఏర్పడడం. లేదా అంతకు ముందే ఉన్న పులిపిరి లేక నల్ల మచ్చలో మార్పులు కనిపించడం గమనించవచ్చు.  * పుండు ఎంతకీ తగ్గక పోవడం.  * విడవకుండా దగ్గు, గొంతు బొంగురు పోవడం. * మల మూత్ర అలవాట్లలో మార్పులు కనిపించడం.  * నిరంతరం అజీర్ణం. * మింగటానికి ఇబ్బంది కలగడం. * ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం. * జననేంద్రియం నుంచి అసాధారణంగా రక్త స్రావం కావడం లేక విపరీతంగా తెల్లటి ద్రవం ఉత్పత్తి కావటం.  మొదలైన లక్షణాలు గమనించిన వెంటనే క్యాన్సరా కదా అని నిర్ధారించుకోవాలి.అయితే చెప్పినవన్నీ క్యాన్సర్ మూలంగానే వస్తాయని కాదు. ఏ ఇన్ఫెక్షన్ మూలంగానో కూడా రావచ్చు. అయినా సరే ఇలాంటి లక్షణాలు కనిపించి నప్పుడు డాక్టర్ ను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. పైన చెప్పిన లక్షణాలే కాకుండా కింద పేర్కొన్న కొన్ని సాధారణ లక్షణాలు కూడా వివిధ క్యాన్సర్లకు చిహ్నాలు కావచ్చు.  పొత్తికడుపు నొప్పి పెల్విక్ పెయిన్... బొడ్డుకు దిగువ భాగంలో పొత్తికడుపులో విడవకుండా నొప్పి వస్తే అది నెలసరి కి సంబందించిన మూలంగానే కాకుండా ఎండో మెట్రియాల్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్, లేదా సర్వికల్ క్యాన్సర్ లాంటి వాటి మూలంగా కూడా కవాచ్చు.  కడుపు ఉబ్బరం..తేన్పులు... వీటిని మనం అంతగా పట్టించుకోము కాని రెండూ విడవకుండా ఉండడం సాధారణంగా జీర్నకోస క్యాన్సర్ లక్షణం గా అని నిపుణులు అనుమానించే అవకాశం ఉంది. నడుము నొప్పి... కొందరు స్త్రీలు నడుము కింది భాగంలో తీవ్రనోప్పి వస్తోందంటూ వాపోతూ ఉంటారు. కొందరు స్త్రీలు అయితే ఆ నొప్పి ప్రసవ నొప్పులంత తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. బహుశా అది అండాశయ క్యాన్సర్ వల్ల కావచ్చు.  ఎంతకీ తగ్గని జ్వరం ...  నెలరోజులుగా గడిచినా జ్వరం తగ్గక పోతే డాక్టర్ ను కలవడం మంచిది. ఒక్కోసారి అది క్యాన్సర్ లక్షణం కావచ్చు.  తీవ్రమైన అలసట నీరసం... క్యాన్సర్ లో కనిపించే సాధారణ లక్షణం. ఇది ప్రారంభ దసకంటే సాధారణంగా క్యాన్సరు ముదిరి పోయిన దశలో ఎక్కువగా కనిపిస్తుంది. మామూలు దిన చర్యలు కూడా చేసుకోలేనంతగా నీరసం. అలసట ఉంటె డాక్టర్ ను తప్పకుండా కలవాలి.  క్యాన్సర్ ఎవరికీ వస్తుంది ?...రిస్క్ ఫాక్టర్... క్యాన్సర్ ఎవరికీ వస్తుంది? ఎవరికీ రాదు? అన్న విషయాన్ని ఇది మిద్దం గా చెప్పడం కష్టం. కాకపోతే కొన్ని కారణాలు కొన్ని రిస్క్ ఫాక్టర్స్ క్యాన్సర్ రావడానికి మూలంగా ఉదావచ్చని పరిశోధకులు చెపుతున్నారు. స్థూలంగా చూసినప్పుడు అలాంటి అలాంటి కారణాలలో కొన్నిటిని చూద్దాం. వృద్దాప్యం. పొగ తాగే వాళ్ళు, సూర్యరస్మి, రేడియేషన్ కి గురికావడం,, విచల విడిగా,రాసాయన ఎరువులు వాడడం. వాతావరణ కాలుష్యం, ఆహార పదార్ధాలలో రంగుల వాడకం, కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా,కొన్ని హార్మోన్లు, కుటుంబ పరంగా, క్యాన్సర్ చరిత్ర ఉన్న వారికి, మద్యాన్ని సేవించేవారికి, పోషకాహార లోపం,స్థూలకాయం, పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లో కొన్ని నివారించు కోగాలిగినవి. కొన్ని మన చేతిలో ఉంటాయి.   

అలసటకు కారణాలు!

ఈ శరీరం అలిసిపోయింది వంట్లో శక్తి లేదు ఏదో బతుకు బండిని భారంగా ఈడుస్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు.ఇది కేవలం వృద్ధాప్యం లో ఉన్నవారి మాటలలో మాత్రమే ఒకప్పుడు వినిపించేది అయితే ఈ పరిస్థితి పోస్ట్ కోవిడ్ తరువాత అన్ని వర్గాలలో వినిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చి మళ్ళీ శక్తి ఉత్సాహాలాను పుంజుకోవాలని అనుకుంటున్నారు కోవిడ్ భారిన పడ్డ బాధితులు. అలసట తో అలిసిపోతున్నామని అంటున్నారు. అలసట ఇది మనందరికీ తెలిసిన పదమే అప్పుడప్పుడూ చిన్న చిన్న జ్వరాలు వచ్చి పోయినప్పుడు మనల్ని హలో అని పలకరిస్తుంది.ఒక్కోసారి వయసు మీద పడి తీవ్ర అనారోగ్యానికి గురి అయిన వారిలో,శస్త్ర చికిత్స జరిగి కోలుకుంటున్న కొందరిలో త్వరగా అలిసిపోవడం  మాములుగా పైకి కనిపిస్తున్నా తీవ్రమైన అలసట ఎక్కువగా ఉండడం సహజంగా కనిపిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇంకొందరిలో  నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం ఆయాసం వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయాని రోగులు తమ తోటి వారితో వాపోయిన ఘటనలు ఈ మధ్యకాలం లో తరచుగా వింటూనే ఉన్నాము. దీనినే వైద్య పరిభాష లో క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ సి ఎఫ్ ఎస్ ను కనుగొనేందుకు గల కారాణాలు ఏమిటి అని కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రం లో పరిశోదనలు జరుతున్నాయని  నిపుణులు వెల్లడించారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సి.ఎస్. ఎఫ్.  వల్ల బాధపడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోవడం గమనించవచ్చు. సి ఎస్. ఎఫ్ వల్ల సంపాదన పనుల వల్ల కుటుంబాలు దేశాలు అసాధారణ స్థాయిలో ఆదాయాన్ని ఉత్పాదకతను కోల్పోతున్నాయి దశాబ్దాల పాటు ఆరోగ్య భీమా రంగాలలో దీనిని పట్టించుకొని పశ్చిమ దేశాలు ఇటీవల సి.ఎస్. ఎఫ్. ను వ్యాధిగా గుర్తించి చికిత్సను భీమా పరధిలోకి తీసుకు వచ్చినట్లు గ్రంధ రచయిత పరిశోధన సారాన్ని మనకు అందించిన రచయిత రామ్మోహన్ అప్పరసు స్పష్టం చేసారు.అసలు సి.ఎస్. ఎఫ్. వ్యాధికి కారణాలను కనుగొనే పరిశోదన ద్వారా చికిత్చా విధానం వరకూ సి .ఎస్. ఎఫ్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మీరు అలిసిపోతున్నారంటే అది సాధారణమైనదే అయిన సి.ఎఫ్.ఎస్ ప్రస్తుతం చేయగలిగింది దానిని అర్ధం చేసుకోవడం ఎదుర్కోవడమే. మీరు ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా చేసే ప్రయత్నం వల్ల ఆశక్తులను చేసే నీరసం అలసట చక్రబంధం నుంచి బయట పడగలుగుతారు. వాస్తవానికి అలసట పై చేసే పోరాటం అంత కష్టతరమైంది ఏమి కాదు అని అంటున్నారు నిపుణులు. మనం నిత్యజీవితంలో ఎలాంటి సందర్భాలలో అలిసిపోతారు అన్న విషయం తెలుసుకుందాం... రోజంతా వృత్తి,ఉద్యోగాలలో ఉన్నవారు,తీవ్రంగా క్రీడలలో పాల్గొన్నవారు అలిసిపోవడం సహజమే అని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఎవరైనా కుటుంబాలతో దూర ప్రాంతాలు,విహార యాత్రలు వందలకిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయడం.వల్ల అసలు శరీరంలో శక్తి లేనంతగా అలసట ఉంటుంది. ఇలాంటి సమయంలో  కొద్ది గంటలో,లేదా  కొన్ని రోజుల్లో విశ్రాంతి తీసుకుంటాం. మళ్ళీ రెట్టించిన ఉత్సాహం తో తిరిగి రోజువారి కార్యక్రమాలతో మళ్ళీ బిజీ అయిపోతాం. అయితే కొన్ని సందర్భాలలో అలసట ఒక పట్టాన తీరదు. ఒకరెండు సంవత్సారాల క్రితం జరిగిన అధ్యయనంలో రోజూ ఏదు గంటల పాటు నిద్రపోయిన వారు సైతం వారిలో 45%  మంది అలసటతో గడుపుతున్నట్లు నిపుణులు గమనించారు. నేటి కాలమాన పరిస్థితులలో వివిధ రంగాలలో అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు,వృత్తి నిపుణులు, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభ మాత్రమే దీని బారిన పడుతున్నారని,ఇందులో పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ పరిస్థితి అంటే ఫాటిగ్ యు సింగ్ ద్రోహం నుండి బయట పది శక్తి ఉత్సాహాలను తిరిగి పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు మానసిక నిపుణులు చేస్తున్న ప్రయత్నం అలసట మన కండరాలను మజిల్ ఫ్యాటీ యు నాడీ వ్యవస్థను సెంట్రల్ ఫ్యామిలీ యును తీవ్రంగా ప్రాభావితం చేస్తోంది అని నిపుణులు నిర్ధారించారు.అసలు అలసటకు కారణాలు ఏమిటో అత్యధికంగా నిస్సాత్తువ నిస్తేజం మనలను ఎందుకు ఆవరిస్తోందో మీకు తెలిపే ప్రయాత్నం చేస్తున్నారు రామ్మోహన్ అర అప్పరసు గారు మీరు ఒంటరి కాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని పరిష్కారం అందించే దిశగా ప్రయాత్నాలు చేస్తున్నారని ఫలితం వస్తుందని ఆశిద్దాం.

ఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీ డేంజర్ లో ఉనట్టే!

మీ కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు సరైన తోక్సిన్స్ పెరుగు తాయి. అది మీ రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అది మీకు ఆస్చార్యాన్ని కలిగించ వచ్చు. కిడ్నీలో సమస్యల లో వచ్చాయిఅనడానికి ఈ పదిలక్షణాలు గమనించండి. 1)మీరు తరచుగా అలిసిపోవడం... మీ శరీరంలో కిడ్నీ ద్వారా రక్తం శుద్ధి చేసున తరువాత వచ్చే వేస్టేజ్ ను బయటికి పంపుతుంది. మీకిడ్నీ సరిగా పనిచేయనట్లయితే టాక్సిన్స్ పెరుగుతాయి.దీనికి సంకేతంగా త్వరగా అలిసిపోవడం అలసట వారం రోజులకు పైగా ఉండవచ్చు. కిడ్నీలు మీ శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే శరీరంలో  ఎర్ర,తెల్ల రక్తకణాలు ఉత్పత్తి చేస్తాయి. మీ కిడ్నీలో సమస్య ఉంటె రక్తం ద్వారా  మెదడుకు కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక పోవచ్చు. 2 )నిద్రలేమి! మీ నిద్రలేమికి కిడ్నీ వ్యాధికి సంబంధం ఉండచ్చు. అది మీశారీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీయవచ్చు. మీ శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నట్లే. కిడ్నీ లో సమస్యకారణం గానే ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది.ఒక్కోసారి కిడ్నీ సమస్య వల్ల గొంతులో నాళాలు కుంచించుకు పోతాయి. టాక్సిన్స్ పెరిగి అనేకసమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ౩ ) చర్మం పై దురద! మీ శరీరం లోని టాక్సిన్స్ కిడ్నీ ద్వారా బయటకు రాకుంటే రక్తంలో టాక్సిన్స్ పెరిగినట్లే. ఈ కారణం గా దద్దుర్లు రావడం దురదకు దారితీస్తుంది.మీకిద్నీ కొంత కాలానికి మినరల్స్ ను న్యుట్రీషియన్స్ సమతుల్యం గా ఉంచలేదు. మినరల్స్ సరిగా అందకుంటే ఎముకలకు సంబందించిన సమస్యలు వచ్చి మీ చర్మం ఎండిపొయినట్లు గా దురదగా ఏర్పడుతుంది. 4 )ముఖం -కాళ్ళు వాయడం! మీకిడ్నీకి అవసరమైన సోడియం అందకుంటే శరీరంలో ఫ్లూయిడ్స్ ఏర్పడి చేతులు కాళ్ళు,పాదాలు లేదా ముఖం వాచినట్లుగా ఉంటుంది. ప్రత్యేకంగా కాళ్ళ లో,కాలిమడమల లో వచ్చేవాపులు గమనిస్తే లేదా మూత్రంలో ప్రోటీన్ కోల్పోతారు కాళ్ళు వాచినట్లు కనిపిస్తుంది. 5 )కండరాలు పట్టేయడం! కాలినరాలు పట్టేయడం అంటే మీ కిడ్నీ పనితీరు సరిగాలేదని అర్ధం. సోడియం,కాల్షియం,పొటాషియం, సమానంగా లేకపోవడం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు కొంతమేరకు ఇబ్బంది కలిగిస్తాయి. దీని ఆధారంగానే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ పనిచేస్తాయి. సమస్య తలెత్తితే కిడ్నీ ఎలాఉంది అన్నది మొదటి ప్రశ్న. 6 )ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది! మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎరిత్రో ప్రోటీన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. హార్మోన్ సిగ్నల్ వల్లే ఎర్రరక్త కణాలు తయారు అవుతాయి. అలా జరగ నట్లయితే పూర్తిగా రక్త హీనత ఏర్పడుతుంది. అప్పుడే మీకు ఊపిరి అందడం కష్టంగా ఉంటుంది. అది ఒక్కో సారి తీవ్రసమస్యాగా మారితే కళ్ళు తిరగడం లేదా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. 7)మెదడు మొద్దుబారినట్లుగాఉండడం! తల పై ఎదో కమ్మినట్లు మబ్బుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శరీరంలో మీ కిడ్నీ సరిగా ఫిల్టర్ చేయనట్లయితే టాక్సిన్స్ మీ మెదడుపై ప్రభావం చూపుతాయి.ఒక్కొసారి మెదడు చీకట్లు కమ్ముకుంటాయి. దీనుకి కారణం శరీరానికి ఆక్సిజన్ అందాకపోవడం. అప్పుడే కళ్ళు తిరిగినట్లు ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి చిన్న చిన్న సమస్యలు సైతం కష్టంగా కనిపిస్తాయి. 8)ఏపటై టిస్ తగ్గడం! కిడ్ని సమస్య ఉంటె మీఅహారం అరగక పోవడం. శరీరం అసహనంగా ఉండడం. దీర్ఘంగా అలసట గాఉండడం. ఈ కారణంగానే వాంతి వచ్చినట్లుగా ఉండడం. లేదా పొట్టలో సమస్యలు అరగక పోవడం లేదా విరేచనాలు. ఆకలి మండగిబ్చడం లేదా ఆహారం తీసుకోవాలని అనిపించక పోవడం వంటిలక్షణాలు ఉంటె త్వరగా మీరు బరువు కోల్పోతారు. 9)నోటి దుర్వాసన! మీకిడ్నీ లో సమస్య వచ్చి ఫిల్టర్ జరగకుంటే శరీరంలోని వేస్టేజ్ బయటికి పోవడం వల్ల యురీమియా సమస్య వస్తుంది. ఈ కారణంగా నే మీ శ్వాస ఊపిరిలో దుర్వాసన వస్తుంది.శరీర రక్త కణాలలో టాక్సిన్ చేరి మెటాలిక్ గా మారి రుచిని కోల్పోతారు. 1౦)మూత్రం లో నురగా లేదా రక్తం పడడం లేదా రక్త స్రావం.లేదా మీ మూత్రం బ్రౌన్ రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీశరీరంలో అధికంగా ప్రోటీన్ చేరినా దీనిని ఆల్బుమిన్ ఉంటె అది కిడ్నీ సమస్యకు దారితీయవచ్చు. మూత్రం తెల్లగా లేదా బ్రౌన్ రంగులో కి మారడం ంటే కిడ్నీ లో లోపం ఉన్నట్లే అంటే కిడ్నీ సమస్య ఉన్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. మూత్ర నాళం ద్వారా రక్త శ్రావం కిడ్నీలో రాళ్ళు, ఇతర ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు గమనించిన వెంటనే మీరు దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించడం అవసరం తద్వారా కిడ్నీ మార్పిడికి పోకుండా కిడ్నీ లో వచ్చే తీవ్ర సమస్యను ముందుగానే గమనించి విలువైన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. లేదా కిడ్నీని రక్షించుకోవచ్చు.                      

గుండెపోటు ఉన్నవారు సెక్స్ లైఫ్ కు దూరం ఉండాలా?

ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసు వారికే గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాల కాలం గురించి ఆలోచిస్తే కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైనవారిలో గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు పలునివేదికలు తెలుపుతున్నాయి. సమస్యకు బయటకు కనిపించని వారి గురించి వదిలేస్తే, గుండె నొప్పి, గుండె బలహీనపడటం వంటి సమస్యలు బయటపడినవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా గుండె నొప్పి వచ్చినవారు చిన్నవయసు వారైతే వారిలో చాలా పెద్ద సంఘర్షణ నెలకొని ఉంది. అదే సెక్స్ లైఫ్. మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి సంకోచించే ఈ అంశం గురించి తమలో తాము మధనపడే భార్యాభర్తలు ఎందరో ఉంటారు. గుండెపోటు వచ్చినవారు సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండాలనేది చాలమంది చెప్పే విషయం, ముఖ్యంగా అందరూ అనుకునే విషయం. కానీ అది చాలా తప్పని అంటున్నారు వైద్యులు. గుండె పోటు వచ్చిన తరువాత డాక్టర్ ల దగ్గర తమ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోకుండా సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండాలని తమకు తాము డిసైడ్ అవ్వడం అందరూ చేసే తప్పు.  ఒక వేళ డాక్టరు ఏదైనా చెప్పబోయినా “బ్రతికి బయటపడ్డాను అదే పదివేలు. ఇక అది లేకపోయినా ఫరవా లేదు. ఇక దాని గురించి ఆలోచించను కూడా” అంటూ వినడానికి నిరాకరించేవారు ఎందరో ఉంటారు. కాని తరువాత కొంతకాలానికి దాని అవసరం తెలిసి వస్తుంది. కొందరు భార్యలకు సహజంగానే చిన్నవాటికె భయపడుతూ భర్తలు అలాంటి ప్రస్తావన తెచ్చిన దూరం జరిగిపోతారు.  గుండెపోటు వచ్చిన వారిలో సెక్స్ స్పందనలు ఎలా?? గుండెపోటు వచ్చిన వారిలో కొందరికి సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతే, మరికొందరిలో సెక్స్ కోరిక సామర్ధ్యం ఎక్కువైనట్లు కనబడతాయి. దీనికి ప్రధానంగా వారు వాడే మందులే కారణం. కొందరికి రక్తపోటువల్ల గుండెపోటు వస్తుంది. రక్తపోటు తగ్గడానికి వాడే కొన్ని మందులవల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. మరి కొందరిలో అంతకుముందు లేని ఉషారు, కోరిక ఎక్కువ అవుతాయి. దీనికి కారణం గుండెపోటు వచ్చిందని కృంగి పోకుండా ఉండేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతో మనస్సు ప్రశాంతంగా ఉండటం, సహజమైన వాంఛలతో మనస్సు ఉరకలు వేయడమే.  దూరమా?? దగ్గరా?? గుండెపోటు వచ్చిన వ్యక్తి రెండు మూడు నెలల తరువాత సెక్స్ లైఫ్ ను మునుపటిలా ఆస్వాదించవచ్చు. అయితే భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహకరించుకోవడంలో ఒత్తిడి అనే అంశాన్ని సులువుగా అధిగమించవచ్చు.  భయం అపోహనేనా?? సెక్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సంభవించిన మరణాలని పరిశీలిస్తే అది తక్కువ శాతమే. ఎలాంటి టెన్షన్ లు లేకుండా, అక్రమ సంబంధాలలో ఉండకుండా భార్యాభర్తలు ఇద్దరూ హాయిగా గడిపితే ఏ గుండె నొప్పి రాదని, వైఫల సూచించిన సలహాలే శ్రీరామ రక్ష అని అంటున్నారు. సమయానికి తగు నిద్ర, సమయానికి తగు ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే సెక్స్ లైఫ్ అనేది ఏవిధంగానూ గుండెపోటుకు కారణం కాదని అది ఇంకా ఒత్తిడి తగ్గించే ఔషదంలా మారుతుందని అంటున్నారు.  Note:- పై విషయాలు అన్నీ పలు సందర్భాలలో వైద్యులు వెల్లడించిన అంశాలు. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకుని సెక్స్ లైఫ్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

నిమ్మకాయ గురించి షాకింగ్ నిజాలు!

డ్రింక్స్ దగ్గర నుండి ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించడం వరకు నిమ్మకాయ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా నిమ్మకాయంతో పులిహోర, పచ్చడి, నిమ్మకాయ జ్యుస్ వంటివి రోజులో రొటీన్ గా మారిపోతాయి చాలామందికి. ఎండపొద్దున కాసింత నిమ్మకాయ జ్యుస్ తగిస్తే మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల వారికి చెప్పలేనంత కిక్. వారి ఆర్థిక పరిస్థితికి అదే గొప్ప కూల్ డ్రింక్. కానీ ఎన్ని డబ్బులు పెట్టి కొన్న కూల్ డ్రింక్ అయినా ఈ నిమ్మ జ్యుస్ ముందు దిగదుడుపే.  నిమ్మకాయ మనకు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతోబాటు, రోగ నిరోధకశక్తి అధికంగా కలిగి ఉంది. దీనిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. షర్బత్లలోను, ఊరగాయగాను వాడటం కామన్. అయితే నిమ్మకాయను  నిత్యం ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. పండిన నిమ్మ కాయ తోలునుంచి తీసె నిమ్మనూనె, నిమ్మరసం బాగా ఉపయోగపడతాయి. శరీరానికి పుష్టి కలిగించే విటమిను 'ఎ' విటమిను 'బి', విటమిను 'సి'లు నిమ్మకాయలో పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఐరన్. కాల్షియం భాస్వరము పొటాషియం మొదలగు పోషక పదార్థాలు లభిస్తాయి.  దీనిలో వేడిని కలిగించే గుణం వుంది. పౌష్టికాహారమే కాకుండా దీనిని ఇతర ఆహార పదార్థాలలో పిండినప్పుడు కొత్త రుచిని కలిగిస్తుంది. ఇందులో విటమిను 'సి' ఎక్కువగా ఉన్నందువల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. డిప్తీరియా, టెటానస్ వంటి వ్యాధులను కలిగించే విషక్రిములను నశింపచేస్తుంది. అన్నిరకాల వైరస్ల నుంచి కాపాడుతుంది. ప్రతిరోజు భోజనానికి అరగంటముందు నిమ్మరసం త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మసూచి, పొంగు, ఆటలమ్మ వంటి వ్యాధులతో మిక్కిలి దప్పికతో బాధపడేవారికి 15 నుండి 25 గ్రాముల నిమ్మరసం ఇస్తూ ఉంటే.. దప్పిక తగ్గుతుంది. వాంతులయ్యే వారికి, అజీర్తితో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చూకూరుస్తుంది. నిమ్మరసం రెండు పూటలా సేవిస్తే చిగుళ్ళ వ్యాధి సోకదు. రక్తవిరేచనముల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని రోజూ వాడితే ముఖవర్చస్సు, శరీరకాంతి పెరుగుతుంది. ఒకప్పుడు చాలా ఇళ్లలో నిమ్మ చెట్లు కనిపించేవి. ఇప్పుడు అదంతా కనుమరుగయ్యింది.  ప్రతివారు తమ ఇంట్లో నిమ్మచెట్టు ఉంచుకోవటం మంచిది. అందువల్ల ఆరోగ్యం సులభంగా మనకు అందుబాటులో వున్నట్లే, నిమ్మరసం, వెల్లుల్లి రసం కలిపి సేవిస్తే కీళ్ళవాతం నయమవుతుంది. నిమ్మరసం న్యూయోనియా వ్యాధిని నివారిస్తుంది. జలుబును దూరం చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. నిమ్మరసంతో మర్థనచేస్తే చర్మవ్యాధులు దగ్గరకే రావు. 450 గ్రాముల పాలలో తగినంత నిమ్మరసం కలిపి త్రాగితే మూలశంఖ రోగుల ఆసనం నుంచి రక్తం కారడం ఆగుతుంది. వికారాన్ని పోగొడుతుంది. దంత వ్యాధులను నిరోధిస్తుంది. ఇది మానవులపాలిటి ఆరోగ్యాన్ని ప్రసాదించే “కల్పవృక్షం” వంటిది. కాబట్టి నిమ్మకాయను మరీ అంత తీసి పడేయకండి. సాధారణ వ్యక్తులకు కూడా సులువుగా లభించే నిమ్మను వాడటం మరచిపోకండి.                                          ◆నిశ్శబ్ద.

ఉత్తమమైన ఆహారం ఇదే!

ఆహారాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు.    1. శాకాహారము 2. మాంసాహారము.  ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఆహరం అంటే శాఖాహారమే.. మాంసాహారము మాత్రమే నిత్యమూ తీసుకునే వారు చాలా తక్కువ. మిశ్రమ ఆహారం తీసుకునే వారినే మాంసాహారులుగా అనటం జరుగుతుంది. అయితే మాంసాహారం తినడం వల్ల ఎటువంటి నష్టము జరుగదు. కానీ మాంసాహారంవల్ల కలిగే ఉపయోగములను, శాకాహారము తీసుకోవడం ద్వారా కూడా పొందవచ్చును. కాని శాకాహార ద్వారా పొందే లాభాలను, మాంసాహారం ద్వారా పొందలేము. ఇదే అందరూ తెలుసుకోవలసిన విషయం. ఆహారమనేది ఆరోగ్యంగా జీవించటానికి తీసుకుంటాము. కాబట్టి మనకు ఆరోగ్యప్రదమైన దానినే ఉత్తమ ఆహారంగా నిర్ణయించుకోవాలి. మాంసాహారము కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగి ఉంటుంది. జంతు సంబంధమైన ఆహారంవల్ల వాటి యొక్క వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మాంసాహారం శాకాహారంలాగా సులువుగా జీర్ణంకాదు. జీర్ణక్రియకు తోడ్పడే పీచు, నారవంటి పదార్థములు ఇందులో లభించవు. శాకాహారంవల్ల మాంసాహారములో వుండే పోషక విలువలు పొందవచ్చు. వేరుశనగ, బఠాణి, చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు మొదలగు వాటిలో మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. మాంసకృత్తులు కణనిర్మాణానికి తోడ్పడతాయి. జీవక్రియలో కలిగే ప్రతిచర్యలను క్రమపరచడానికి పనికివస్తాయి. కొంతవరకు శక్తిజనకాలుగా పనిచేస్తాయి. ఇకపోతే దేహానికి కావలసిన సంపూర్ణశక్తిని పిండిపదార్థాల ద్వారా పొందవచ్చు. బియ్యం, బంగాళదుంపలు, జొన్నలు, కాయధాన్యములు ద్వారా పిండిపదార్థములు కొంతవరకు మాంసకృత్తులు లభిస్తాయి. మాంసం, చేపలు, కోడిగ్రుడ్లు, పాలు ద్వారా లభించేవి సంపూర్ణ మాంసకృత్తులు, బియ్యం, జొన్నలు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు మొదలగు వాటిద్వారా లభించేవి అసంపూర్ణ మాంసకృత్తులు, అయితే శాకాహారములో లోపించిన పోషకములను మరొక పదార్థముద్వారా పూరించుకోవచ్చు. అన్నంతోపాటు చిక్కుళ్ళు కలిపి తీసుకుంటే మాంసం, చేప, కోడిగ్రుడ్లులలో లభించినంత మాంసకృత్తులు లభిస్తాయి. మాంసకృత్తులతోపాటు, ఇతర పోషకములు కూడా లభిస్తాయి. కాబట్టి సమతులాహారంగా పనిచేస్తుంది. కాబట్టి మాంసాహారంలో లభించే మాంసకృత్తులకన్నా శాకాహారంలో లభించే మాంసకృత్తులే ఆరోగ్య కరమైనవి. నిత్యజీవితంలో మనిషికి అవసరమయ్యే మాంసకృత్తులు ఎంతంటే మనిషి కిలో బరువుకు 8గ్రాముల మాంసకృత్తులు అవసరం.  అంతకు కొంత తగ్గినా నష్టం ఏమిలేదు. ఎదిగే పిల్లలకు, గర్భిణీస్త్రీలకు మాత్రమే కొంచెం అధికంగా కావలసి వుంటుంది. మాంసకృత్తులు అధికంగా తీసుకోవటం శరీరానికి మంచిదికాదు. మాంసాహారం తీసుకునేవారి మూత్రపిండాలు శాకాహారం తీసుకునేవారికన్నా 1.5 రెట్లు పెద్దవిగా ఉంటాయట. మాంసాహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాలేయం మరింత కష్టపడి పనిచేయవలసి రావటంవల్ల పెద్దవిగా తయారవుతున్నట్లు భావిస్తున్నారు. శాకాహారం లో లభించే మాంసకృత్తుల వలన ఏ రకమైన ఇబ్బంది లేదు. మాంసకృత్తులు అధికంగా తీసుకున్నందువల్ల శరీరం ఉపయోగించుకోగా మిగిలిన మాంస కృత్తులు, క్రొవ్వుగా పేరుకుపోయి నిలవచేయబడతాయి. మాంసకృత్తులు అధికంగా వుండటంవలన జీర్ణక్రియలో అధిక శ్రమ ఏర్పడుతుంది. అందువల్ల ఎముకలలో గల కాల్షియంను ఈ జీర్ణక్రియ గ్రహించి, మూత్రంద్వారా విసర్జిస్తుంది. దానివలన మాంసకృత్తులు ఎక్కువగా తీసుకునే వారి ఎముకల్లో కాల్షియం లోపించి, ఎముకలు బలహీనమవుతాయి. మాంసాహారము తీసుకునే వారిలోకన్నా శాకాహారం తీసుకునే  వారిలోనే శక్తి అధికంగా ఉంటుంది. మాంసాహారులు కొంచెం శ్రమచేయగానే అలసటకు లోనవుతారు. శాకాహారులలో ఈ లక్షణం కనబడదు. కాబట్టి మాంసాహారంకన్న శాకాహారం ఉత్తమమైన ఆహారంగా చెప్పవచ్చు. మనకు నిజమైన ఆహారం, అనారోగ్యాన్ని కలిగించని పండ్లు, కూరగాయలు, ధాన్యములు మాత్రమే. నూనె పదార్థములు, తీపి, క్రొవ్వు పదార్థములను, మాంసాహారమును తగ్గించడం ఆరోగ్యానికి మంచిది.                                       ◆నిశ్శబ్ద.

జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇంతకు దారితీస్తుందా??

సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో జలుబు మొదటి స్థానంలో ఉంటుంది. కాస్త చల్లని వాతావరణం ఏర్పడితే చాలు మెల్లగా జలుబు అటాక్ చేస్తుంది. మొదటి దశలోనే దీనికి సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే గొంతు నొప్పి, బ్రాంకైటిస్ మొదలైన శ్వాసనాళ వ్యాధులకి దారి తీయవచ్చు. జలుబు వల్ల ముక్కులోను, శ్వాసనాళంలోను ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. వైరస్ కారణాన, అలర్జీ వల్ల జలుబు రావచ్చు. వైరస్ వల్ల కలిగే జలుబు ముక్కు, గొంతు, నోరు నుంచి బయటికి వెలువడే వాయువుల తుంపర్లు మొదలైన వాటి వల్ల ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి వ్యాపిస్తుంది. అందుకని ఎక్కడపడితే అక్కడ చీదడం, ఉమ్మేయడం మంచిది కాదు. దగ్గు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవడం మంచిది. ఇది కనీస సభ్యత, అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఒక్కోసారి దుమ్ము, పొగ, కొన్ని వాసనలు మొదలయినవి పడక అలర్జీ వల్ల జలుబు రావచ్చు. ఈ పరిస్థితులకు, పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ముక్కు వెంట కేవలం నీరు మాత్రమే వస్తే పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. ఆ జలుబు ఏ వైరస్ కారణానో వచ్చినట్లు! ఆలర్జీ కలిగినప్పుడు తుమ్ములు, నీళ్ళు కారడం కూడా ఆ పరిస్థితులకు దూరమైనప్పుడు తగ్గిపోతాయి. అలా కాకుండా ముక్కు నుంచి చీము వస్తూ గొంతు బొంగురుపోతే వెంటనే డాక్టర్ కు చూపించాలి. ఇలాంటి సమయంలో కొద్దిపాటి జ్వరము కూడా రావచ్చు. గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు జలుబు ప్రమాదకరంగా పరిణమించవచ్చు.  జలుబు జాగ్రత్తలు:- జలుబు రాగానే బాగా గాలివచ్చే ప్రదేశంలో ఉంటూ పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉండాలి. వైరస్ వల్ల కలిగే జలుబుకి మందులు వాడడం దండగ, దానంతటదే తగ్గుతుంది గాని, మందులవల్ల తగ్గదు. అవి మాత్రమే కాకుండా  మరికొన్ని శ్వాసనాళ, శ్వాసకోశ అనారోగ్యాలు కూడా ఎదురవుతాయి.  బ్రాంకైటిస్ తీవ్రమైన బ్రాంకైటిస్ తలనొప్పి, గుండెనొప్పి, కళ్ళె, దగ్గు, లేక పొడిదగ్గు వుంటాయి. దీర్ఘమైన బ్రాంకెటిస్ బాధాకరమైన దగ్గు, కళ్ళె కూడా పడుతుండవచ్చు. ఈ జబ్బు బ్రాంకో న్యుమోనియా వంటి వ్యాధులకూ దారి తీయవచ్చు. అందుకని ఈ పరిస్థితుల్లో డాక్టర్ కు చూపించడం ఎంతో అవసరం. దీనికి మందులు, యాంటీ బయోటిక్స్ డాక్టర్ సలహా మీదే వాడాలి. బ్రాంక ఎక్టసిస్ శ్వాసనాళాల విస్తరణని బ్రాంక ఎక్టసిస్ అంటారు. క్రిమిదోషాల వల్ల, శ్వాస నాళాంతర పీడన శక్త్యాధిక్యత వల్ల ఈ జబ్బు రావచ్చు. దగ్గు, దుర్గంధముతో కూడిన కళ్ళె పడడం, ఆయాసము, రక్తం వాంతి ఈ వ్యాధి లక్షణాలు, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కళ్ళె బయటకు పంపడం అవసరం. ఫెరింజైటిస్ గొంతు ఇన్ఫ్రేమ్ కావడం ఫెరింజైటిస్. జలుబుకి కారణాలే ఇందుకూ కారణం అవుతాయి. మింగడం కష్టమై గొంతు పాడి ఆరిపోవడం, గొంతులో దురద లక్షణాలు బాగా ఎక్కువైతే మ్రింగడం కూడా కష్టమైపోతుంది. నీరసం, జ్వరము వస్తాయి. తడిలో నాసడము. చలిగాలి, శ్వాసకోశమును ఇరిటేట్ చేసే పొగలు పీల్చడం, అతిగా మాట్లాడడం తగ్గించాలి. వెంటనే చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా శ్వాసకోశానికి వ్యాపించవచ్చు. బ్రేకియా అంటే శ్వాసనాళానికి ఇన్ఫ్లమేషన్ వస్తే 'ట్రాకియైటిస్' అంటారు. వీటన్నింటిలో ధూమపానము ఆపేయాలి. గొంతు నొప్పికి డిప్తీరియా కూడా కారణం కావచ్చు. అందుకని పిల్లలో గొంతు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ కు చూపడం మంచిది.  ట్యూబర్క్యులోసిస్ (టి.బి) ఇది నెమ్మదిగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. మైకో బాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవులు గాలిలో నుంచి ఊపిరి తిత్తులలోకి ప్రవేశించడం వల్ల ఈ అనారోగ్యము కల్గుతుంది. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులు ఆల్వియోలైలని నాశనం చేస్తాయి. కణాలని చంపేస్తాయి. ముందు ఊపిరితిత్తుల పై భాగంలో ఈ వినాశనం చేస్తాయి. చనిపోయిన కణాల భాగాన్ని ట్యూబర్కిల్ అంటారు. ఈ ట్యూబర్కిల్స్ క్రమంగా పెరగడం వల్ల ఊపిరితిత్తుల లోపల ఖాళీలు ఏర్పడతాయి. శ్వాస కష్టమవుతుంది. మొదట్లో పొడిదగ్గు వస్తుంది. తర్వాత కళ్ళె, చివరికి రక్తం పడుతుంది. కొద్దిపాటి జ్వరం ఉంటుంది, ఆకలి వుండదు. బరువు తగ్గుతుంటుంది. ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని ఎక్స్ రే, కళ్లె పరీక్షలు, బరువు తగ్గడంతో కనుక్కోవచ్చు. దీన్నే టి.బి అని కూడా అనడం వినే ఉంటాం. ఏడాదిన్నర లేక రెండేళ్లు వాడితే గాని ఈ వ్యాధి నయం కాదు. అనుమానం రాగానే ప్రారంభదశలోనే డాక్టర్ కి చూపించి, సరయిన చికిత్సని పొందడం ముఖ్యం. మెడలో బయటికి వాపు కనిపిస్తూ టి.బి లింఫాడెంటిస్ రావచ్చు. మెదడుకి క్షయ మెనింజైటిస్ రావచ్చు. ఎముకలకి ఆహార నాళానికి కూడా (ట్యూబర్క్యులోసిస్) క్షయ రావచ్చు.  కాబట్టి జలుబే కదా అని నిర్లక్ష్యం చేయకండి.                                   ◆నిశ్శబ్ద.

మైగ్రేయిన్ అవగాహన వారోత్సవాలు...

మై గ్రెయిన్ వచ్చిందంటే భరించలేని తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తీవ్ర మైన నొప్పి తలతిరగడం తల పట్టేయడం ఒక్కసారి వదల గానే వాంతులు. రావడం తో నరకం చూస్తున్నామని వారు వాపోవడం గమనించవచ్చు.మై గ్రెయిన్ కు అలోపతిలో అందరికీ పనిచేయక పోవచ్చు. మై గ్రెయిన్ తో బాధ పడేవారు ఒక్కోసారి ఆత్మహాత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మైగ్రేయిన్ ఒక న్యూరో లాజికల్ సమస్యగా డాక్టర్స్ పేర్కొన్నారు. మైగ్రేయిన్ పై అవగాహనా వరాన్ని సెప్టెంబర్ నెలలో ప్రతియేటా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5 వ తేదినుండి 1 4 తేది వరకూ మైగ్రేయిన్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి మామూలు సాధారణ మైన తలనొప్పి కాదు చాలా తీవ్రమైన తలనొప్పి తో పాటు తల నొప్పి తీవ్రమై నప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం వినికిడి సమస్య రావడం గమనించవచ్చు. మైగ్రెయిన్ వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు వైద్యం చేయవచ్చు వీటివల్ల కొంతమేర మై గ్రెయిన్ తీవ్రత తగ్గి ఉపసమనం కల్పిస్తుంది. మైగ్రెయిన్ అట్టాక్ నుండి కొంత మేర ఉపసమనం కలిగించే 8 ఉపాయాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లేవెండర్ ఆయిల్ తో లాభం... లేవెండర్ ఆయిల్ ను రాయడం ద్వారా మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి కొంతమేర ఉపశమనం ఉపశమనం కలుగుతుంది.  లేవెండర్ ఆయిల్ ను వేరే నూనెలో కలిపి రాయవచ్చు. లేవేండర్ నూనెను మీ మెదడుపై మృదువుగా వ్రాయవచ్చు. పెప్పర్ మెంట్ ఆయిల్... పెప్పర్ మెంట్ ఆయిల్ లో కనుగొన్న మెంతాల్  రసాయనం మైగ్రైయిన్ ను నిలువరించే నిరోదించేందుకు సహకరిస్తుంది ఈ విషయం పై పలు పరిశోదనలు నిర్వహించారు. అల్లం... కళ్ళు తిరగడం మైగ్రేయిన్ స్థితికి కారణం కావచ్చు. దీనినుండి బయట పాడేందుకు అల్లం కొంతమేర ఉపసమనం కలిగిస్తుంది. అల్లం వాడకం వల్ల మైగ్రేయిన్ కు కొంతమేర ఉపసననం తోపాటు లాభం చేకూర వచ్చు  యోగాతో మైగ్రేయిన్  కు అడ్డుకట్ట... మైగ్రేయిన్ నుండి ఉపసమనం పొందడానికి యోగ దోహదం చేస్తుంది. యోగాలో శ్వాస తీసుకునే పద్దతులు ధ్యానం సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. 2౦ 15 లో జరిగిన పరిశోదనలో యోగాతో మై గ్రెయిన్  అటాక్ తీవ్రతను తగ్గించవచ్చని తేలింది. ఆహారం లో మెగ్నీషియం పెంచండి... శరీరంలో మెగ్నీషియం తగ్గడం వల్ల మైగ్రేయిన్ నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు. అసలు మెగ్నీషియం తలనొప్పికి సంబంధం ఉందని అంటున్నారు. అందుకే మీ ఆహారం లో బాదాం, అవిసగింజలు, ఆకు కూరలు,నట్స్,పీనట్ బట్టర్, ఓట్ మీల్, గుడ్లు,పాలు, ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడి నియంత్రించే ప్రయత్నం చేయండి... అమెరికన్ మైగ్రెయిన్ ఫెడరేషన్ సమాచారం మేరకు మైగ్రేయిన్ తోబాద పడుతున్నవారు దాదాపు 8౦%మందిలో ఒత్తిడి కారణం గానే మైగ్రేయిన్ కు కారణంగా నిపుణులు పేర్కొన్నారు. మీరు ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటేనే  మైగ్రేయిన్ అటాక్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచండి... అమెరికన్ మైగ్రేయిన్ ఫౌండేషన్ సూచన ప్రకారం మైఇగ్రేయిన్ బారిన పడిన వారిసంఖ్య 1/౩ డీహైడ్రేషన్ వల్లే మైగ్రేయిన్ వస్తుందని డీ హైద్రెషన్ నుండి రక్షింప బడాలంటే నీరు తీసుకోవాలి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి ఎండాకాలం లో నీరు మరింత ఎక్కువ తాగాలి. రాత్రి నిద్రపోఎందుకు ప్రయత్నం చేయాలి... నిద్ర మరియు డీ హైడ్రేషన్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న విష్యం తెలియరాలేదు అయితే 2౦16 లో వచ్చిన రిపోర్ట్  ఆధారం గా మైగ్రేయిన్ అట్టాక్ మళ్ళీ మళ్ళీ వస్థూ ఉంటె నిద్రలేకుంటే దీనికి సంబంధం ఉందని తేల్చారు. అందుకే రాత్రి సంపూర్ణంగా నిద్రపోయే ప్రాయాత్నం చ్ఘేయాలంటే నిద్రాపోఎముండు కాఫీ, లేదా టీ తీసుకుంటే నిద్రారాడు దీనివల్ల మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.మైగ్రేయిన్ పై ఉన్న భిన్నమైన అఫాలు అనుమబాలకు సందేహాలకు సెప్టెంబర్ లో మైగ్రేయిన్ అవగాహన వరాన్ని నిర్వహించడం కొనసాగుతోంది. 

షుగర్ వల్ల ఇన్ని సమస్యలొస్తాయని మీకు తెలుసా?

ఈమధ్య కాలంలో మధ్యవయసు కాదు కదా 30 ఏళ్ళు దాటకుండానే షుగర్ జబ్బు వచ్చేస్తోంది చాలామందికి. అయితే ఈ షుగర్ వల్ల కేవలం తీపి పదార్థాలు తినకుండా ఉండటమే కాకుండా వేరే ఇతర అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే… గ్లూకోజు పదార్థం సరిగా అందనపుడు, గుండె బలహీనమవుతుంది. అందువల్ల షుగర్ వ్యాధి క్రానిక్ అయిన వారికి గుండె జబ్బులకు దారితీసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో పోల్చిచూస్తే, మధుమేహ రోగులకు  2 నుండి 4 రెట్లు అధికంగా గుండె జబ్బులు వస్తున్నట్లు పరిశోధనల్లో వెళ్ళడయింది. నిర్ధారించుచున్నారు. షుగర్ వ్యాధి కారకమైన వారిలో చీముకణాల సంఖ్య (పసె సెల్సు) పెరుగుట వల్ల రక్తం కలుషితమవుతుంది. చిక్కబడిపోతుంది అందువల్ల గుండె స్పందన పెరిగి, గుండెఒత్తిడి పెరిగి గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. .  మనశరీరంలోని, అదనపు షుగరును, చీము కణాలను ఎప్పటి కప్పుడు మూత్రపిండములు వడకట్టి బయటకు పంపేస్తూ ఉంటాయి. అయితే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మూత్రపిండాలకు పని ఎక్కువ అవుతుంది. దానికి తోడు శుభ్రమైన  రక్తము లేక మూత్రపిండముల కండరములు బలహీనపడతాయి. అందువల్ల మూత్రపిండ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇప్పుడు లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధులతో బాధపడే వారిలో, ప్రతిముగ్గురిలో ఒకరు సుగర్ వ్యాధి పీడితులేనని తెలుస్తోంది.  దాదాపు 15-20 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధితో బాధపడేవారికి డయాబిటీస్, రేటినో అనే పార వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వారిలో కంటిలోని రెటీనాకు సంబంధించిన, చిన్నచిన్న రక్తనాళములలో చీము కణాలు (పస్పెల్సు) చేరి పోయి ఆయానాళములు పాడైపోయి రెటీనాకు శుభ్రమైన రక్తము ప్రాణశక్తి అందక, అంధత్యము వస్తుంది. క్రానిక్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలామందికి కాళ్ళకు పాదములకు  కాలివ్రేళ్ళు తిమ్మిరులెక్కి స్పర్శ తెలియకుండా పోతుంది. అలాంటి స్థితిలో కాలికి ఏమి తగిలినా తెలియదు. కాలిచెప్పులు ఊడిపోయింది గూడా కొందరికీ తెలియదు. కాళ్ళు మనదేహమునకు దిగువన ఉంటాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్తులకు నిర్జీవరోగ పదార్దములు చీము కణాలు హెచ్చుగా ఉంటాయి. అవన్ని  కాళ్ళలో చేరి నిలిచిపోతాయి. అందువల్ల కొందరికి కాళ్ళువాపులు-నీరు కనిపిస్తాయి. గుండె బలహీనత వల్ల చివర్లకంటా రక్తప్రవాహములు సరిగా అందవు. అక్కడ చేరిన నిర్జీవ పదార్ధములు కుళ్ళిపోయి రణాలుగా తయారై కాలిని తినేస్తాయి. అలాంటి స్థితిలో డాక్టర్లు ఆపరేషన్ చేసి కొందరికి, కాలివ్రేళ్లను  మరికొందరికి పాదములను  కొందరికి మోకాలు క్రింద వరకు మరికొందరికి తొడలవరకు కూడా తీసేస్తారు.  షుగర్ వ్యాధిగ్రస్తులలో కొందరికి నోటిపూతగాను, గొంతు సంబంధ సమస్యలు, చిన్నప్రేగులలో తరచుగా పూతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది, అందువల్ల నోటిలోనూ,  ప్రేగులలోనూ కడుపులో మంటలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు ఏమాత్రం పులుపు, ఉప్పు, కారములు మొదలైనవి తిన్నా విపరీతమైన మంటలు ఏర్పడతాయి. మరికొందరికైతే, పళ్ల చిగుళ్లు వాపులు వస్తాయి, అంతేకాకుండా చిగుళ్లు నొప్పులు, పళ్ళ వెంట చీము రక్తము కారడం. నోరు వాసన రావడం (పయోరియా లక్షణాలు) కొందరికైతే పళ్లు కదిలి ఊడిపోవడం వంటి సమస్యలు సంభవిస్తాయి.  కాబట్టి షుగర్ వచ్చిందంటే దాంతోపాటు మరికొన్ని సమస్యలు వెనక వస్తున్నట్టు అని గుర్తుంచుకోండి.                                    ◆నిశ్శబ్ద.

లివర్ కు ముప్పొస్తే ఇంత దారుణం జరుగుతుందని తెలుసా??

మన శరీరంలో ముఖ్యమైన అంతర్గత అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైనది. నిమిషానికి 1.2 లీటర్ల రక్తం లివర్ ద్వారా ప్రవహిస్తుంటుంది. హిపాటిక్ వీన్స్ ద్వారా లివర్ నుంచి రక్తం బయటకు వెళ్తుంది. ఈ వీన్స్లో అడ్డం పడితే హిపాటిక్ వీన్ థ్రాంబోసిస్ వస్తుంది. ఇది చాలా అపాయకరమైన అనారోగ్యము కానీ హెపాటిక్ వీన్స్ సాధారణంగా బ్లాక్ కావు. లివర్ రెండు లోబ్స్ లోను బైల్ రసం తయారవుతుంది. ఈ రసం బైల్ డక్ట్ అనే మార్గం ద్వారా ఆహార నాళాన్ని డుయోడినమ్ దగ్గర చేరుకుంటుంది. బైల్ డక్ట్, డుయోడినమ్ లోకి ప్రవేశించే ప్రదేశంలో ఒక కవాటము ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణమవుతూ డుయోడినమ్ లోకి ప్రవేశించినప్పుడు మాత్రం బైల్ రసం లోపలికి వెళ్ళేట్లు చేస్తుంది. మిగతా సమయంలో ఈ రసాన్ని డుయోడినమ్ లోకి రానీయదు. అప్పుడు లివర్లో తయారైన బైల్ రసమంతా మరో మార్గం గుండా గాల్ బ్లాడర్ కి వెళ్ళి నిల్వ ఉంటుంది, అవసరమైనప్పుడు డుయోడినమ్ లోకి వస్తుంది. లివర్, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే మార్గాలే కాకుండా పాంక్రియాజ్ నుంచి వచ్చే మార్గం కూడా వీటితో కలసి కామన్డక్ట్ ఏర్పడి, అది డుయోడినమ్కి కలుపబడి ఉంటుంది. అంటే పాంక్రియాటిక్ జ్యూస్ కూడా బైల్ రసంతో పాటే డుయోడినమ్లో కలుస్తుందన్నమాట!  కాబట్టి ఈ మార్గంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడ్డా ఈ రసాలు డుయోడినమ్ లోకి ప్రవేశించలేవన్నమాట! పాంక్రియాటైటిస్ అనే జబ్బు మనదేశంలో ఎక్కువగా వస్తోంది. సరయిన పోషకాహారం లేక పాంక్రియాజ్ దెబ్బ తింటే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. దాంతో రక్తంలో షుగర్ పెరుగుతుంది. మన శరీరంలో మెదడు తర్వాత అతి క్లిష్టమైన, ముఖ్యమైన అవయవము లివర్. ఇది రక్తాన్ని శుభ్రం చేయడం, బైల్ రసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు మరెన్నో ముఖ్యమైన పనుల్ని కూడా నిర్వర్తిస్తోంది. మనం తిన్న ఆహారాన్ని కేలరీస్ లో శక్తిగా మార్చేది లివరే! క్రొవ్వుల్ని వాటిలో కరిగి వుండే విటమిన్లని స్వీకరించేది లివరే.. లివర్ కె అనారోగ్యం వస్తే క్రొవ్వులు శరీరంలో స్వీకరించబడకుండా మలము ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. విటమిన్ ఎ.డి.కె లు క్రొవ్వుల్లో కరిగి ఉంటాయి. కాబట్టి లివర్ కి జబ్బు వస్తే ఈ విటమిన్లను శరీరం స్వీకరించలేదు. ఇవన్నీ మలము ద్వారా బయటకి వెళ్ళిపోతుంటాయి.  విటమిన్ 'ఎ' తగ్గితే రక్తం గాయం ద్వారా బయటికొచ్చేప్పుడు  స్రావం ఆగదు. లివర్ అనారోగ్యం వస్తే ఈ విటమిన్లని ఇంజక్షన్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా లివర్ క్రమపరుస్తుంటుంది. లివర్ అనారోగ్యం వల్ల ఆడవాళ్ళలో రుతుక్రమం దెబ్బతింటుంది. మగవాళ్ళలో శరీరం మీద వెంట్రుకలు రాలిపోవడం, ఇంపాటెన్సీ కలగవచ్చు. ఏవైనా కణాలు దెబ్బతింటే, ఆ ప్రాంతంలో క్రొత్త కణాలని ఉత్పత్తి చేసే ఎంజైమ్స్, ప్రొటీన్స్ ను కూడా లివరే తయారు చేస్తుంటుంది. కాబట్టి లివర్ కి అనారోగ్యం వస్తే దెబ్బతిన్న కణాల స్థానంలో క్రొత్త కణాలు తయారవడం కూడా ఆలశ్యమవుతుంది. లివర్ జబ్బు వున్న వాళ్ళకు యాక్సిడెంట్లయినా, ఆపరేషన్ అయినా తిరిగి మామూలు స్థితికి రావడానికి ఆలశ్యమవుతుంది. గుండె, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలకి అనారోగ్యము వస్తే నొప్పి ద్వారా మను వెంటనే తెలుసుకోగలం, కానీ లివర్ అనారోగ్యం ప్రారంభదశలో ఇలాంటి నొప్పులేమీ ఉండవు కాబట్టి వస్తున్న ఆపాయాన్ని ముందు పసిగట్టలేము. కాబట్టి లివర్ విషయంలో అందరూ తగినంత జాగ్రత్తగా ఉండటమే శ్రీరామరక్ష!!

శరీరం బరువు గురించి యోగా ఏమి చెబుతోంది?

శరీరం బరువు నిరంతరం అడుక్కి త్రొక్కేస్తూ వుంటుంది. అంత శరీర భారాన్ని  చిన్న పాదాలు రెండు మొయ్యవలసివస్తోంది. కనుక నిట్టనిటారుగా  నిలబడితే సరిగా నిలబడలేక తూలిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఎలా నిలబడాలి??  కాలి పిక్కల్లోని కండరాలు,  తొడల మీద కండరాలు మనిషి పై భాగపు బరువును మోయాలి. అలా కాకుండా కేవలం పాదాల మీద బరువు మోస్తే..  పిరుదులో, మోకాళ్ళో, కాలికండలో సడలిపోయి తుళ్లి పడిపోతాము. మనిషి శరీరంలో బరువు మొయ్యలేక పాదాలు   వీగిపోతున్నప్పుడు శరీరంలో ఉన్న పిక్కలు, నడుము భాగంలో  కండరాలు  బిగిసిపోయి, ఎలాగో మిమ్మల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తాయి  అప్పుడే మనిషి శరీరం ఊగిపోతుంది. అలా కాకుండా శరీరాన్ని ముందుగానే నడుము, పిక్కలు కండరాల సహాయంతో బ్యాలెన్స్ చేయడం అలవాటైతే ఇలాంటి సమస్యే ఉండదు. మనం సాధారణంగా వెల్లకిలా నేలమీద పడుకున్నాము అనుకోండి!  అప్పుడు  బరువంతా  వీపు మీదనే మోపుకుంటారు కానీ పిక్కల మీద కాదు కదా.. కాబట్టి ఆ స్థితిలో  కండరాలు సాగవలసిన అవసరం లేదు. అందుకే  పిక్కలకు బయటవున్న కండరాలైనా,  తొడలకు ముందున్న కండరాలైనా, పొట్టకండరాలైనా, వీపు కండరాలైనా వాటిని గురుత్వ వ్యతిరేక కండరాలని అంటున్నారు.  మనిషి శరీరం మొత్తంలో ఉన్న కండరాలన్నిటిలోనూ బిగువును ఎక్కువగా కలిగి ఉన్న కండరాలివే. ఈ కండరాలు సహజంగా ఎక్కువగా శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ కండరాలు గంట గంటకి గురుత్వాన్ని ఎదుర్కోవటం అందరికీ కష్టంగానే ఉంటుంది. నిలబడ్డప్పుడు అయితే ఇక చెప్పనవసరం లేదు..  మనిషిలో ఛాతీలోని కండరాలు, మెడకి ఇటూ అటూ ఉన్న కండరాలూ ఎక్కువ వాడుతూ ఉంటాం. అందుకని అవి  బాగా మెత్తబడి పోతూంటాయి. గురుత్వ వ్యతిరేక కండరాలు పుష్టిగా ఉంటేటట్లు అందరూ జాగ్రత్త పడాలి. అప్పుడే అవి గుండెకు బాగా తోడ్పడగలుగుతాయి. నిలబడ్డప్పుడు గురుత్వం కాళ్ళల్లోకి, పాదాలలోకి ప్రసరిస్తుంది. అప్పుడే  గుండె నుంచి రక్తం ఎక్కువగా తోడుతుంది. ఆ రక్తం పాదాలు, కాళ్ళ నుంచి వెనుదిరిగి గుండె, ఊపిరితిత్తులు చేరేటప్పుడు గురుత్వమే నిరోధిస్తుంది.  అప్పుడు  గురుత్వ వ్యతిరేక కండరాలు బిగుసుకొని గురుత్వం వల్ల  గుండెల్లోంచి రక్తాన్ని పూర్తిగా  కాళ్ళల్లోకి దిగిపోకుండా నిరోధించి, అక్కడున్న రక్తం  ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి ప్రవహించేలా చూస్తాయి.  కదలకుండా చాలాసేపు నిలబడి నట్లయితే  కాళ్ళల్లో కండరాలు సూక్ష్మరక్తనాళాలను పిండివేసి, కొయ్యబారిపోతాయి. రక్తాన్ని తిరిగి ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి చేరకుండా నిరోధించాయన్నమాట! అప్పుడు  గుండె ఓవర్ గా పని చేయవలసి  వస్తుంది. అదే సమయంలో కాళ్ళు పీక్కు పోతాయి. నానా బాధా పడిపోతారు. అందుకే అడుగు మీద అడుగు వేసుకొంటూ ఎంతదూరం నడిచినా కలగని బాధ కొద్దిసేపు నిశ్చలంగా నిలబడటం వల్ల కలుగుతుందన్న మాట! అలాంటప్పుడు ప్రతిరోజూ ఎన్నిగంటలు నిశ్చలంగా మనం నిలబడుతున్నామో ఆలోచించుకోవాలి. వృధాగా అలా నిలబడటం వల్ల దేనిని కోల్పోతున్నామో గ్రహించాలి. పర్యవసానంగా  శరీర సౌష్టవం, దానితో బాటు  శరీరం దాని కంఫర్ట్  తొలగిపోతున్నాయి! మనిషిలో  చెలరేగే నీరసం, నిస్త్రాణాలు  ఈసురోమని అనిపించేటట్లు చేస్తాయి. ఇలాంటి అనుభూతి కలిగినంత సేపు మనిషి తనను తాను ఎప్పుడూ ఉత్తేజవంతుడిగా ఉంచుకోలేడు. ఈ విషయం తెలుసుకున్నవాడు ఉత్తముడు అనుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.

యాంటి బయోటిక్స్ అతిగా వాడితే!

  మోతాదుకి మించి యాంటి బయోటిక్స్ వినియోగించిన భారత్...లాన్సేట్ నివేదికలో వెల్లడి. కోవిడ్ మొదటి రెండవ విడతలో మోతాదుకు మించిన యాంటి బయోటిక్స్ , ఐ సి యు లో మోతాదుకు మించి మత్తు మందులు వినియోగించి నందువల్లె స్ట్రోక్స్ వచ్చి చనిపోయరాని, అసలు కోవిడ్ సమయంలో ఏమందులు ఎంత మోతాదులో వాడాలో నియంత్రణ లేకుండా విచ్చల విడిగా స్టెరాయిడ్స్, ఇతర ఇంజక్షన్లు రేమిడి సివిర్ లాంటి ఇంజక్షన్లు ఇష్టారీతిన వాడినందువల్లె బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ వంటి సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడిన కధనాలు మనం చూసాము,చదివాము.  ఇందులో ఎంతవాస్తవమో మనందరికీ తెలుసు.అయితే లాన్సేట్ రిపోర్ట్ లో 2౦19 సంవత్సరంలో భారత్ లోని ప్రైవేట్ వైద్యులు 47%యాంటి బయోటిక్స్ వినియోగించారంటు నివేదికలో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య ఎస్ ఎన్ సి ఎం స్టాండింగ్ నేషనల్ కమిటీ మేదిసిన్స్ ఉపాధ్యక్షుడు సీనియర్ ఫర్మాకాలజిస్ట్ వై కే గుప్తా లాన్సేట్ నివేదికను తీవ్రంగా తప్పుపట్టారు. ఈమేరకు లాన్సేట్ నివేదిక అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ డవీయ  విజ్ఞప్తి మేరకు వై కే గుప్తా వివరణ ఇస్తూ అత్యవసర మందుల లిస్టు ను తయారు చేసి ఇస్తామని ఫార్ములాను ఆయా రాష్ట్రాల నియంత్రణ మండలి డ్రగ్ ఆధారిటీ అనుమతితోనే వెలువడతాయని పేర్కొన్నారు.  లాన్సేట్ నివేదికలో ఆమోదం పొందని ఫార్ములా అన్న పదం వాడారని అంటే దాని ఆర్ధం సి డి ఎస్ సి ఓ కాదాని ఈ ఫార్ములాలు ఆయా రాష్ట్రాల డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ ఆమోదించినవే అని అందుక ఈ విషయం లో ఆమోదం పొందని అన్న పదం ప్రయోగించడం పై వై కే గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఫార్మా రంగం లో ఉందని తెలిపారు. లాన్ స్టడీ రిపోర్ట్  చదివిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ కోరారని గుప్తా తెలిపారు. లాన్సేట్ రేపోర్ట్ ను ఉటంకిస్తూ యాంటి బాయిటిక్స్ అతిగా వాడారని అనడం సరికాదాని అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ్రెజిల్,రష్యా,యురప్ దేశాలతో పోలిస్తే యాంటి బాయిటిక్స్ వాడకం తక్కువే గానే వినియోగించినట్లు గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్లో యాంటి బయోటిక్స్ వినియోగం లో అగ్రభాగాన నిలిచిందని నివేదికలో పేర్కొనడం సరికాదని గుప్తా వెల్లడించారు. భారత్ లో రోజుకు 1౦౦౦ డోస్ లు వాడితే ప్రపంచవ్యాప్తంగా 1౦.4 ఎక్కువగా వినియోగించారని గుప్తా స్పష్టం చేసారు. కాగా 2౦15 లో 1౩ .6% వినియోగించారని లాన్సేట్ నివేదిక ప్రకారం దేశంలో యాంటి బయోటిక్స్ వినియోగం,నియంత్రణ, అమ్మకాలు నిలువరించాల్సిన అవసరం ఉందని గుప్తా అభిప్రాయపడ్డారు. యాంటి బాయిటిక్స్ పై మరిన్ని పరిశోదనలు అవసరమని పేర్కొన్నారు.2౦19 లో అజితో మైసిన్ విరివిగా వాడారని యాంటి బయోటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ లో నేడు 1౦% ఫార్ములాలు ఉన్నాయని అదనంగా మరో 5౦ % పైగా ఫార్ములాలు ఉండడం వల్ల యాంటి బయోటిక్స్ వాడినట్లు కనిపిస్తోందని అజిత్రో మైసిన్ 5౦౦ ఎంజి ,అమోక్సిలిన్ 5౦౦ ఎం జి,125 ఎం జి సిసిక్షిన్ 2౦౦ ఎం జి విరివిగా వాడారని వాటి పై అవగాహన కల్పించాలని గుప్తా అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ లో ప్రైవేట్ రంగం అమ్మకాల సమాచారం మాత్రమే అని ఇంకా పూర్తి వివరణాత్మక సమాచారం కావాలని గుప్తా విజ్ఞప్తి చేసారు. రోగుల సంరక్షణ వారికి వైద్యులు ఎలాంటి ప్రిస్కిప్షన్ లో ఎలాంటి యాంటి బాయిటిక్స్ వాడారు అన్న సమాచారం. మైక్రో బయాలాజికల్ టెస్ట్ లు యాంటి బయోటిక్స్ వినియోగం వంటి నిశితంగా పరిశీలించాల్సి ఉందని ప్రిస్కిప్షన్ సూక్ష్మం గా పరిశీలించడం అసాధ్యమని అత్యవసర సమయాలలో ఎలా వినియోగించారన్నది అంచనా అసాధ్యమని గుప్తా వివరించారు. ఫర్మా ట్రాక్ సాంపిల్ కవర్స్, స్టాకిస్టులు 6౦% మంది మాత్రమే ఉన్నారని.ప్రైవేట్ రంగంలో ఫర్మా అమ్మకాలపై లక్ష్యంగా చేసుకుని నివేదిక చేసినట్లు ఉందని గుప్తా విమర్శించారు.ప్రభుత్వ శాఖాలలో మందుల ప్రోక్యుర్మేంట్ జాతీయ,లేదా అయా రాష్ట్ర స్థాయలో నిర్ణయించిన లిస్ట్ మేరకు మందులు మాత్రమే అని వివరించారు. యాంటి బయోటిక్స్ వినియోగం పై అవగాహన అవసరమని ప్రస్తుతం యాంటి బాయిటిక్స్ ప్రభావం ఉందని కొత్త యాంటి బయోటిక్స్ వాడే అధికారం ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటె కోవిడ్ సమయంలో లేదా యురిన్ ఇన్ఫెక్షన్ సమయంలో గనక యాంటి బయోటిక్స్ వినియోగించడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి యాంటి బయోటిక్స్ వాడడం వల్ల శరీరంలో అత్యవర సమయంలో యాంటి బయోటిక్స్ పనిచేయవని శరీరంలో మెటాబాలిజం దెబ్బతిని ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలు వస్తాయని మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోతుందని చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని యాంటి బాడీలు ఇమ్యునిటి వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని  నిపుణులు పేర్కొన్నారు. కాగా శరీరతత్వాన్ని బట్టి మాత్రమే యాంటి బయోటిక్స్ మోతాదును డాక్టర్ సలహా మేరకు వాడాలె తప్ప మరే ఇతర సమాచారం ఆధారంగా యాంటి బయోటిక్స్ వాడరాదని సూచించారు.

శరీరంలో ఎముకల పాత్ర ఏమిటి?? వాటి వ్యాధులు ఎందుకొస్తాయి??

కండరాల లోపల ఉన్న ఎముకల గురించి చెప్పుకుంటే అవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వడమే కాక, ఒకదానికొకటి కలిసి కదలికలకి ఎంతో ఉపకరిస్తాయి. అన్ని అవయవాలకి ఎముకలు ఆధారాలు. మెదడు, వెన్ను, నరము, గుండె, ఊపిరితిత్తులు మొదలయిన అన్ని అవయవాలకి, ఎముకలు చుట్టూ ఉండి గట్టి రక్షణనిస్తున్నాయి. కార్టిలేజెస్ ఎముకలకి ఆధారాన్నివ్వడమే కాకుండా కలువబడే రూపాలుగా కూడా తోడ్పడుతున్నాయి. బయట చెవి, కార్టిలేజ్ సహకారంతోనే అలా వాలిపోకుండా నిలబడగలుగుతోంది. ఎముకల్ని కలపడానికి లిగమెంట్స్ ఉపయోగపడుతుంటాయి.  ఎముకలు వేటి కలయికతో ఏర్పడుతాయో తెలుసా?? కాల్షియమ్, ఫాస్ఫరస్ లాంటి ఆర్గానిక్ పదార్థాలతోపాటు ఇనార్గానిక్ పదార్థాలు కలవడంతో ఎముకలు ఏర్పడతాయి. వయసు పెరిగేకొద్దీ ఎముకలలోని ఆర్గానిక్ పదార్ధాలు తగ్గిపోతూ ఎముకలు పెళుసుగా తయారవుతాయి. విరిగితే అతకడం కూడా కష్టమవుతుంది. ఎముక విరిగినప్పుడు ఆ విరిగిన భాగాలు ఒకదానికొకటి అతుక్కోవడానికి కొత్త పదార్థాన్ని సృష్టిస్తాయి. ఆ కొత్త పదార్థాలు, కాల్షియం, లవణాలు చేరి క్రొత్త ఎముక ఏర్పడుతుంది. ఎముకల చుట్టూ ఉండే పొరని 'పెరి ఆస్టియమ్' అంటారు. దానిలో ఉండే రక్తనాళాల ద్వారా ఆహారం ఎముకలోకి వెళ్తుంది. ఒక్కో చెవిలోని మూడేసి చిన్న ఎముకలతో కలిపి, మన శరీరంలో మొత్తం 213 ఎముకలుంటాయి. పుర్రెలో 22,  వెన్నుపూసలో 33, పక్కటెముకలు 24, చేతులలో 14, కాళ్ళలో 62, మెడలో 11 చాతి ఎముకలు ఉంటాయి. వీటిలో ఏది విరిగినా కష్టమే. ఎముకలు కలిసే ప్రదేశాల్ని కీళ్ళు అంటారు. ఈ కీళ్ళు శరీరం వంగడానికి ఉపయోగపడుతుంటాయి. ఎక్కువగా వాడితే అంటే ఆ ప్రదేశాలలో కదలిక ఎక్కువగా ఉంటే కీళ్ళు తొందరగా అరిగిపోతాయి. కీళ్ళు అరగడం అందరికీ ఒకేలా ఉండదు. వయసుని బట్టికాక వాళ్ళు వాడే పద్ధతుల్ని బట్టి కీళ్ళు అరిగిపోవడం జరుగుతుంది ! కీళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తతో పాటు ఎముకలు విరిగితే ఏం చేయాలి ఎముకలకి ఎటువంటి రోగాలొస్తుంటాయి? అసలీ ఎముకల జబ్బులు ఎందుకొస్తుంటాయి? మొదలయిన విషయాలన్నీ తెలుసుకుంటే మనం ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.  ఎముకల వల్ల వచ్చే అనారోగ్యాలేమిటో తెలుసుకుంటే.. పోలియో, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులతో పాటు ఎముకలలో కాన్సర్ రావచ్చు. ఎముకలు విరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. కాల్షియం ఎక్కువైతే ఎముకల జబ్బులొస్తాయి. అలాగే విటమిన్-డి తక్కువైతే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. సూర్యకాంతి తగలకపోవడం శరీరానికి చాలా నష్టాన్ని కల్గిస్తుంది. రెండు సంవత్సరాలలోపు పిల్లలకి సరయిన పోషకాహారం లేకపోతే, ఎముకలు సరిగ్గా పెరగవు.. మూడు సంవత్సరాలకి పైబడ్డ వాళ్ళలో మూత్రపిండాల సమస్యతో ఎముకల జబ్బులొస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మూత్రంలో కాల్షియం పోయి రీనల్ రికెట్స్ రావచ్చు. అప్పుడు ఎముకలు వంకరతిరిగిపోతాయి, మత్తుగా ఉంటారు. పొట్ట పెరుగుతుంది. కాళ్ళు వెడల్పవుతాయి.  మనం తాగే నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నా ఎముకలు బలహీనమవుతాయి. అందరినీ ఇబ్బంది పెట్టే..  వాత రోగమూ ఎముకల జబ్బే! స్టిరాయిడ్స్ మొదలయిన వాటిని కొంత మంది వాడుతుంటారు. అప్పుడు ఎముకల్లో కాల్షియం తగ్గి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతాయి. ఒక పద్ధతి ప్రకారం ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి. గర్భ కాలంలో శిశువు సరైన స్థితిలో ఉండకపోవడంవల్ల పుట్టే పిల్లల్లో పాదము, మడము కూడా శరీర మధ్య రేఖ వైపు తిరిగి ఉంటాయి. వెంటనే పాదాలు సరైన స్థితిలో ఉండేట్లు స్ప్రింట్ అనే పరికరాన్ని గాని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టుగాని వాడాలి. వయసు పెరిగేకొద్ది కీళ్ళు అరుగుతుంటాయి. అప్పుడు ఆస్టియో ఆర్థ్రయిటిస్ అనే జబ్బు వస్తుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వస్తుంది.  ఇలా ఎముకలకు సంబంధించి నిత్యజీవితంలో ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.                                      ◆ నిశ్శబ్ద.

కలర్ థెరపీ అంటే ?

అన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే మనిషిజీవితం వృధా . ఆరోగ్యంగా ఉంటేనే బతుకు.ఆరోగ్యంగా ఉంటేనే అడవిలోనైన బ్రతికేయవచ్చు. వందేళ్ళు నిండు నూరేళ్ళు బతకచ్చు అని నిపుణులు నిరూపించారు. నేను అంటున్న మాట మనిషికే కాదు ప్రతిజీవికి ఇదే సూత్రం వర్తిస్తుంది అని అదే మనుగడ లో ముఖ్యమన సూత్రమని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎరోగాలు రాకుండా ముందుజాగ్రత్త తీసుకుంటే జబ్బులు వచ్చిన వెంటనే చికిత్చ తీసుకోవాలి.బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధాన మని.జీవితం అంటే అందమైన హరివిల్లు జీవితం కలర్ ఫుల్ గా ఉండాలని అంటారు అలాగే జీవితానికి కలర్స్ కి సంబంధం ఏమిటి అన్నదే పెద్ద సందేహం అసలు కొన్ని రకాల సమస్యలకి కలర్ తెరఫీ చికిత్చ చేయవచ్చని అంటున్నారు నిపుణులు ఏమిటి కలర్ తెరఫీ దానిగురించి తెలుసుకుందాము.సూర్యరస్మి మనకు తెల్లగా కనిపిస్తుంది. కాని సూర్యరస్మిలో 7 రంగులు ఉంటాయి. అన్నవిషయం అందరికీ తెలుసు. మానవ శరీరంలో 7 చక్రాలకు 7 రంగులకు సంబంధం ఉందని అలాగే 14 మేరీడియన్స్ 2,72,౦౦౦ వేల నాడులపై ప్రభావం చూపిస్తుందని మానవ శరీరం పై సూర్య కిరణాలు ప్రసరింప బడలేదో దానికి సంబందించిన చక్రం నాడులు దెబ్బతింటాయని ప్రాచీన వైద్యం చెపుతోంది.సూర్యకిరణాలు రంగులు శరీరంలోని వాత,పిత్త,కఫ, దోషాలను సవరించేది సమతౌల్యం చేస్తుంది.సూర్యరశ్మిలోని వివిధరంగులు వాటి ఉపయోగాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం.  గమనిక.. కలర్ థెరఫీ లేదా ఇతరాచికిత్చలు ప్రధమ చికిత్చ మాత్రమే అని మంచి చికిత్చకోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.కలర్ తెరఫీ నికేవలం ప్రాత్యామ్నాయ వైద్య విధానం గా భావించాలని ప్రాముఖ్య మైనదిగా భావిస్తున్నారు.నిపుణులు. ముఖ్యంగా మనకు ఇంద్ర ధనుస్సు లో కనిపించే సహజ రంగులన్నిటికీ స్వస్థత చేకూర్చే గుణాలు ఉన్నవిషయం మనకు తెలుసు.ముఖ్యంగా సూర్య రశ్మి లేనిదే జీవరాసి కి మొక్కలకు మనుగడ లేదన్నది వాస్తవం. ముఖ్యంగా సూర్యారస్మికి ఆరోగ్యానికి సంబంధం ఉందని ఒక్కో సారి బాగా మబ్బు పట్టిన సమయంలో రెండు రోజులపాటు సూర్యుడు కనపడకుంటే ఆరోగ్యంగా ఉండలేమని పేర్కొన్నారు. సూర్యరస్మి లేకుంటే ఆందోళనకు గురిఅవుతారని కొందరు సూర్య దర్శనం కానిదే ముద్దకూడా ముట్టరని అంటారు. చీకట్లో ఉండలేరని మనసికరోగులు వెలుతురు చూడలేరని వెలుతురు లేకుంటే వ్యక్తులు ఒత్తిడికి అంటే డిప్రెషన్ కు గురి కవడాన్నిఅనేక పరిశోదన లలో  గమనించవచ్చు.అందుకు కలర్ తెరఫీ సాధన చేసేవారు అటు రంగులను ఇటు వెలుతురును తమ పరికరాలలో ఉపయోగిస్తూ ఉంటారు.  కలర్ తెరఫీ మానసిక బౌతిక ఉదేవగాలకు,ఆధ్య్యాత్మిక సమస్యలకు వేటి కైనా ఉపయోగించ వచ్చునని నిపుణులు విశ్లేషించారు. కలర్ తెరఫీ చరిత్ర... కలర్ తెరఫీ ప్రాచీన ఈజిప్ట్ లో పుట్టిందని తెలుస్తోంది. వివిధ ప్రాచీన నాగరికతలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు శాస్త్రజ్ఞులు వెల్లడించారు. రంగులు వెలుగులపై విస్తృతంగా చేసిన పరిశోదన లలో వ్యాక్తులలో భావోద్వేగా పరమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఒకరంగు పట్ల అందరూ ఒకేలా స్పందించక పోవడం విచిత్రంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. మనం ఆకర్షిత మయ్యే రంగులు మనలో మనలో అసమతౌల్యత ఉందొ పట్టి చెప్తాయని కొన్నిరంగులు మనలో సానుకూల భావాలు మరికొన్ని ప్రతికూల భావాలు,రేకేత్తిస్తాయని వీటిని అధ్యయనం చేసిన వారే కలర్ తెరఫీ చేస్తారు. కలర్ తెరఫీ కి వాడే పరికరాలు... రత్నాలు,కొవ్వొత్తులు,దీపాలు,క్రిస్టల్ క్రిస్టల్ లేక గాజు పట్టకం,రంగు బట్టలు,రంగునీటితో స్నానపు చికిత్చ,రంగుకళ్ళ జోళ్ళు, లేజర్లు ప్రధానంగా ఈ పరికరాలను దేరపిస్ట్ చికిత్చ చేస్తారు.ముందుగా మనం వేసుకునే ఎంచుకునే దుస్తులు రంగులు వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాము.కొన్ని దుస్తులు గమనిస్తే లేతరంగుల్లోనే ఉంటాయి. వారికి ఆహ్లాదాన్ని విశ్రాంతిని ఇవ్వడానికే ఆరంగులను ఎంచుకుంటారు.మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత వ్యక్తీకరిస్తాయి.ఫ్యాషన్ పేరుతో వెర్రిగా మనకి సరిపడని రంగులు ధరించడం వల్ల దుష్పరిణామాలు కూడా సంభావుస్తాయి కొన్ని రకాల రంగుల దుస్తులు మన మూడ్స్ నుకూడా ప్రభావితం చేస్తాయి.ఏరంగు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో చూద్దాం. 1) ఎరుపు.. ఈ రంగు ఉత్తేజాన్ని నింపుతుంది. అది మనశరీరం లో కొన్నిలక్షణాలను దంకేతంగా ఉంటుంది.ధైర్యం,బలం, ఉత్తేజం,ఉల్లాసం,లక్ష్యం,అప్రమత్తత,లైంగిక ,సృజనాత్మకత,సంకల్ప బలం ,తీవ్రత వంటి లక్షణాలకు ఎరుపుసంకేతం. అయితే ఎరుపురంగు వల్ల కలిగే లాభాలు అనేకం.ఈ రంగును ఉపయోగించడం వల్ల మనలో ఉండే నకారాత్మక ఆలోచనలు అధిగమించ వచ్చు. ఆత్మవిశ్వాసం,స్థిరత్వం,భధ్రత, ఆధిపత్యం,భావన వంటివి పొందవచ్చు. అంతేకాదు ఎరుపు ఆకలిని పెంచుతుంది.అయితే ఎరుపును ఎక్కువగా వినియోగిస్తే అసహనం శత్రుత్వం,భావన,చికాకు ఆగ్రహం వంటివి పెరుగుతాయి.కోపం అధికంగా ఉంటుంది. 2)ఆరంజ్.. ఆరంజ్ రంగు సంతోషానికి ఉల్లాసానికి సంకేతం.వ్యక్తిలోని మానసిక ఉద్వేగాలకు ప్రభావితం చేస్తుంది.ఈ రంగు వ్యక్తిపై కలుపుగోలు తనం,నలుగురికి విశ్వాసంగా ఉండడం విజయం సంతోషం ఉంటాయి. ఈ రంగు వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సానుకూల దృక్పదం,ఏర్పడడం ఉల్లాసంగా ఉండగలగడం వంటివి జరుగుతాయి.ఈరంగుస్పూర్తినిస్తుందని ఆసక్తులను పెంచి మన కార్యకలా పాలను విస్త్రుత మయ్యేలా చేస్తుంది. వ్యక్తిగత సంబంధాలతో సంతోషానికి మనలోని సందేహాలను సంకోచాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఈ రంగును అతిగా వాడారో అసహనం చిరాకు ఆకలిపెరగడం జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ౩)పసుపు.. పసుపు అన్నిటా శుభప్రదం ఉత్తేజాన్ని ఎక్కువ స్థాయిలో కలిగిస్తుంది. మానసిక స్పష్టత సంతోషం సానుకూల వైఖరి ఆత్మ గౌరవం,వివేకం స్పూర్తిగా నిలుస్తుంది.ఈ రంగు వాడకం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆశక్తి పెరగడం డిప్రెషన్ తగ్గడం సాదికరాత ఆత్మవిశ్వాసం ,ధైర్యం, ఆందోళన నుండి బయట పడడం శక్తి పెరగడం వంటివి జరుగుతాయి. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేందుకు కూడా తోడ్పడుతుంది పసుపు రంగును అతిగా వాడితే సారహీన ప్రవార్తన,ఆతి క్రియాశీలత వంటి దుష్పరిణామాలు కలుగుతాయి. 4)ఆకు పచ్చ.. ఆకు పచ్చ నూతన ఉత్చాహానినికి శాతికి గుర్తు ఈరంగు. ఇది ప్రేమకు సంకేతం,శాంతి,నవీకరణ, ప్రేమ,ఆశ, సమతుల్యత,సామరస్యం, స్వీయ నియంత్రణ, జీవితం లో వృద్ధి వంటి వాటికి సంజేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆకుపచ్చ రంగును వాడడం వల్ల ఒత్తిడి తగ్గడం, విశ్రాంతి, స్థిరత్వం, శాంతి సౌఖ్యం, సమైక్య భావన,సంభావన వంటి అంశాలు వ్యక్తిపై ప్రభావం చూపుతాయి.అతిగా ఆకుపచ్చని వాడితే బద్ధకం వస్తుందని  దీనిని ఉపయోగించడం లో జాగ్రత్త అవసరం. 5)నీలం రంగు.. నీలం ఇది సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయిఉండే రంగు సమాచార మార్పిడి, సృజనాత్మకత వ్యక్తీకరణ, ఉత్తేజం నిర్ణయాత్మకం, విజ్ఞానం, ఆరోగ్యానికి సంకేతాలు ఈరంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల మానసిక విశ్రాంతి నిశ్చలత, నిద్రపట్టేందుకు సహాయపడడం, మాటల్లో ఆత్మవిశ్వాసం, స్పష్టమైన సమాచారం. పిల్లలలో హైపర్ యాక్టివిటీ తగ్గేందుకు సహాయపడుతుంది. అందుకే చాలా పాట శాలలో నీలిరంగు యునిఫాం ఉపయోగించడం గమనించవచ్చు. నీలిరంగును ఎక్కువగా వినియోగిస్తే అభద్రత, నిరాశ, అలసట,ఒత్తిడి, ఉదాసీనత, ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6) లేత నీలం.. లేత నీలం ప్రశాంతతకు చిహ్నం, భావ వ్యాక్తీకరణకు సంకేతంగా ఉంటుంది. స్వచ్చత, ఓదార్పు, శాంతం, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా మాట్లాడ గలగడం మనసులో నిష్కల్మష మైన ఆలోచనలు లేతనీలం వల్ల విశ్రాంతి,ప్రేమ పూర్వక అభివ్యక్తి, స్వేచ్చాపూరిత భావ వ్యాక్తీకరణ, సుఖనిద్ర,సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు. లేత నీలం ఎక్కువగా వడం వల్ల పెద్దగా దుష్పరిణామాలు ఏమిలేక పోవడం విశేషం. 7)నెమలి కంఠం రంగు.. ఈరంగు మననరాల వ్యవస్థ విశ్రాంతి పొందేందుకు సాయాపడుతుంది. పైగా మన శరీరం అచేతన వ్యక్తిత్వం తో అనుసంధాన మయ్యే రంగుగా నిపుణులు విశ్లేషించారు.ప్రశాంతత సృజన అవగాహనకు సంకేతమని సహజంగా వారిలో జ్ఞానం చైతన్యం, స్పష్టమైన దృక్పదం గాఢ నిద్ర వంటి ఫలితాలు కలుగుతాయని రంగును వినియోగిస్తే ఒత్తిడి ఇతరులనుండి వేరు పడే భావన కలుగుతాయట. 8) వైలెట్ .. వైలెట్ మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అనుసంధాన మై ఉంటుంది. ఈ రంగు వాడడం వల్ల ఉదారత,నిస్వార్ధ తత్వం, గాఢ నిద్ర నరాలను నేమ్మదింప చేయడం భావోద్వేగాల నియంత్రణ చిరాకు అతిగా ఆకలి వేయడం వంటి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఈరంగును అతిగా వాడారో డిప్రెషన్ అభద్రతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలు అణచివేయడం వంటివి సాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 9)మేజెంటా రంగు.. వ్యక్తిలో ఉండే భక్తి ప్రేమకు అనుసంధానంఅవుతుందని అంటున్నారు. మేజెంటా విశ్రాంత స్థితి, ఓదార్పు, సున్నితత్వం, వంటి భావాలకు సంధాన మై ఉంటుంది. ఈ రంగును వాడడం వల్ల అంతర్గత  బహిర్గత ఉద్వేగాలు సమతౌల్యం అవుతాయి. శాంతి లభిస్తుంది. అయితే ఈ రంగును అతిగా వాడడం వల్ల నలుగురితో కలవ లేని వారికి మంచిది కాదు.             

ఉషాపానం ఆరోగ్యానికి మేలు!

  ఉషాపానం ఇదేమిటి ఇదేదో సురాపానమా  అని మాత్రం అనుకోకండి.అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీటిని తాగితే ఏమౌతుంది? లాభమా నష్టమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈవ్యాసం.ఉదయం వేళలో నిద్ర లేవగానే ముఖం కూడా కడుక్కోకుండా నీళ్ళు తాగడం మన పూర్వీకులకు అలవాటు. ఇది చాలా సహజమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి అంటే నిద్రలేవగానే ముఖం కడుక్కోకుండా మొట్టమొదట నీటిని తాగడం వల్ల మందులతో తగ్గని రోగాలు కూడా తగ్గుతాయని ప్రముఖనాడీ పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు తెలిపారు. తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల నోటిలో లాలా జలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది అని ఎన్నోరోగాలు తగ్గుతయాని  అంటారు కృష్ణం రాజు. మనము ప్రతిరోజూ లాలాజలము బయటకు ఉమ్మివేస్తాము లాలాజలము బయటికి ఉమ్మివేస్తాము మీకు తెలుసా మీ లాలా జలము చాలా విలువైనది అద్భుతమైనది అని తెలియక దీనిని వృధా చేస్తున్నాము. ఇకపై దీనిని వృధా చేయకండి.మీరు ఉపయోగించుకోవాలని డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా నీళ్ళు తాగి తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.పూర్వకాలం లో ఉదయం పూట నిద్రలేవగానే పళ్ళు తోముకోకుండా రాగి చెంబులో నీళ్ళు తాగడం ఆనవాయితీగా వచ్చేది.ఆతరువాతే వేపపుల్ల,లేదా గానుగ పుల్లలతో పళ్ళు తోముకునే వారని పెద్దలు చెప్పుకునే వారు.ఇదేమిటి నీరు తగిన తరువాత పళ్ళుతోముకోవడమా బ్యాడ్ ప్రాక్టిస్ మాత్రం కాదని పెద్దలకు తెలుసు.ఉదయం పరగడుపున అంటే నిద్రలేవగానే మొహం కూడా కడుక్కోకుండా మొట్టమొదటగా నీరు త్రాగాలి.పుక్కిలించకుండానీరు తాగాలనిఅంటారు అసలు దేని వెనక ఉన్నకారణం ఏమిటో తెలుసుకుందాం. మనము రాత్రి  తిని పడుకున్నప్పుడు మనశరీరం లోని క్రిములన్నీ శిధిల మై పోతాయి. కానీ లాలా జలం క్రియ కొనసాగుతూ ఉంటుంది. అది నోటిలో రక రకాలుగా వుంటుంది. కడుపులోకి వెళ్ళదు. అది చాలా విలువైనది అదీ బ్రహ్మ ముహూర్తం లో లాలా జలము ఆసమయంలో ఎన్నో రెట్లు విలువైనదిగా పేర్కొన్నారు.లేచిన వెంటనే నీరు త్రాగడం వల్ల అందులో లాలాజలము అంతా కడుపులో చేరి శరీరానికి ఎంతో మేలుచేస్తుంది.దీనికారణంగా షుగర్ కంట్రోల్ కు వస్తుంది.ముఖ్య్సంగా కడుపులో పుండ్లు,కురుపులు చాలా కాలానికి కానీ మందులతో తగ్గవు.వీరు ఇలా చేస్తే అద్భుత మైన ఫలితాలు చూడవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇంతే కాకుండా ఉదయం లేవగానే మన నాలుక మీద ఉన్న ఉమ్మిని తీసుకుని కంటిలో పెట్టుకుంటే. కంటి సమస్యలు పోతాయాని అలాగే చర్మం.ముఖం అలాచేయడం వల్ల అద్భుతమైన మార్పులు గమనించవచ్చని అన్నారు ఇందుకు ఉదాహరణగా జంతువుల నుండి మనం గ్రహించాల్సిన విషయం అదే. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశం లో అక్కడ నాలుకతో నాకడం మొదలుపెడతాయి. లాలా జాలం లో 18 రకాల పోషకాలు ఉన్నాయని అంటారు.కృష్ణం రాజు. అందుకే మన లాలాజలము విలువైనదే అని అంటారు.ఈ పద్దతిని ఉపయోగించడం ద్వారా ఇదే ఉదయం వేళలో ఉషాపానం లో ఉండే ఆరోగ్య రహాస్యం అని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు.మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉందన్న విషయం గ్రహించండి. ఆరోగ్యంగా ఉండండి.   

దీర్ఘకాలంగా మిమ్మల్ని వాపు వేధిస్తోందా!?

మిమ్మల్ని నెమ్మదిగా ప్రాణాలు హరిస్తుంది.మీరు దీర్ఘకాలంగా ఇంఫ్లామేషణ్ అంటే వాపు తో బాధ పడుతూ ఉన్నారా మిమ్మల్ని మీ ప్రాణాలే నెమ్మదిగా తీసుకుపోతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే నిపుణులు నిర్వహించిన అధ్యయనం లో వాపు వైద్య పరిభాషలో చెప్పే ఇంఫ్లామేషణ్ వ్యాధి కాదని నిర్ధారించారు. వాపు ఇంఫ్లామేషణ్ లక్షణాలు ఉండి వేదిస్తూ ఉంటుందని అది ఒక అనారోగ్య స్థితిగా పేర్కొన్నారు. బహుశా మీకు చెడు కొలస్ట్రాల్ గురించి విని ఉండవచ్చు.మీ గుండెలో రక్త ప్రవాహం సరిగా లేనందువల్ల వాపు ఇంఫ్లామేషణ్ ఉండవచ్చు.మీకు ప్రతిరోజూ పొగతాగే అలవాటు ఉన్న వారు జీవన శైలి వల్ల క్యాన్సర్ వల్ల వచ్చే ఇంఫ్లామేషణ్ శరీరంలో లివర్ లో కొవ్వు పేరుకు పోయి లివర్ లో వాపు ఉండడం గమనించవచ్చు మీరు తరచుగా మీరు ఇంఫ్లామేషణ్ అన్న పదం వినిఉండ వచ్చు లేదా అసలు విని ఉండక పోవచ్చు.దీనికి కారణం ఎన్నో అనారోగ్య సమస్యలు కారణం అయ్యిఉండవచ్చు.అని నిపుణులు అంటున్నారు.హార్వర్ల్ద్ మెడికల్ జర్నల్ లో దీర్గ్గ కాలిక తాకువ స్థాయి వాపు లేదా ఇంఫ్లామేషణ్ ఉంటె అది మిమ్మల్ని నిశ్సబ్దంగా మిమ్మని మీ ప్రాణాలే హరిస్తుంది.అని నిపుణులు గుర్తించారు. ఇంఫ్లామేషణ్ లేదా గుండె సంబంధిత సమస్యలు క్యాన్సర్, టైపు2  డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయని అజర్నల్ లో ప్రచురించారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 5 మందిలో ౩ ముగ్గురికి ఇంఫ్లామేషణ్ వాపు వాపు బారిన పడుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు . ఇంఫ్లామేషణ్ లో రకాలు... ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వాస్తవం చెప్పాలంటే ఇంఫ్లామేషణ్ ను రెండు భాగాలుగా విభజించారు. దీర్ఘ కాలిక లేదా తీవ్రమైన ఫ్లామేషణ్ కారణంగా కణాలు నాశనం అవుతాయి.దీనికి కరానం అనుకోకుండా గాయాలు కావడం. కొద్ది కాలం లోనే అది తీవ్రమైన ఇంఫ్లామేషణ్ గా మారవచ్చు.ఇంఫ్లామేషణ్ కొన్ని సార్లు వస్తూ ఉంటుంది.  దీర్ఘ కాలంగా వచ్చే వాపులు ఇంఫ్లామేషణ్ చాలా ఖతినంగా ఉంటుంది.మనం ఇంఫ్లామేషణ్ ను గుర్తిన్చేలోపే తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దీర్ఘ కాల ఇంఫ్లామేషణ్ వల్ల ఏమౌతుంది... ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ దీజార్దర్ తో బాధ పడే ప్రతి వ్యక్తిలో ఉన్న వ్యాధినిరోధక శక్తి ఆరోగ్యంగా ఉన్న కణాలను వ్యతిరేకంగా పనిచేసినప్పుడు. లేదా ఇతర రాసాయ నాలు టాక్సిన్స్ కు లోనై నప్పుడు ఉదాహరణకు వాతావరణ కాలుష్యం, పారిశ్రామిక వ్యార్ధాలు కాలుష్యం కారణం కవ్వచ్చని నిపుణులు అంచానా వేస్తున్నారు. కాగా ఒక్కోసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లేదా వాపుకు దారితీస్తుంది.కొన్ని పరిశోధనలలో తీవ్రాత్తిది పొగత్రాగడం లేదా మాద్యం తాగడం వల్ల ఇంఫ్లామేషణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి . దీర్ఘ కాలిక ఇంఫ్లామేషణ్ లక్షణాలు... కొన్నిరకాల లక్షణాలు ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ వస్తుంది. మీరు ఏదయినా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఈ స్థితికి చేరితే ఇంఫ్లామేషణ్ ఉన్నట్లయితే కొన్ని లక్షణాలు ఉండచ్చు ఉండక పోవచ్చు. *దీర్ఘకాలంగా అసహజమైన భరించలేని నొప్పి  *దీర్ఘకాలంగాఊపిరి తిత్తులలో నొప్పి చెస్ట్ పెయిన్ . *దీర్ఘకాలంగా త్వరగా అలిసి పోవడం . *పలుమార్లు జ్వరం రావాడం. *దీర్ఘకాలంగా చర్మం పై దద్దుర్లు ఇతర లక్షణాలు గుర్తించిన వెంటనే మీరు ఇంఫ్లామేషణ్ బారిన పడ్డాట్లు సంకేతం . దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ప్రాణాంతకం కవచ్చు... జోన్ వాప్కిన్స్ మెడిసిన్ జర్నల్ లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిశోధకులు గుర్తించిన పలు అంశాలు ఏమిటి అంటే తీవ్రస్తాయి లో ఉన్న ఇంఫ్లామేషణ్ ను మీరు గుర్తించి నట్లయితే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని దీనికి క్లినికల్ స్టడీస్ నిర్వహించిన డాక్టర్ కంబాస్ ఇంఫ్లామేషణ్ వల్ల కొలస్ట్రాల్ శాతం స్థాయి లో మార్పు లేకుండా వాపు  ప్రభావం ఎక్కువగా ఉంటుంది.అయితే ఇంఫ్లా మెటరీ సమస్యకు యాంటి ఇంఫ్లా మేటరీ చికిత్చ కు మందులు వాడవచ్చని వాస్తవానికి ఇంఫ్లామేట రీ వచ్చిందంటే గుండెకు చికిత్చ చేయడం అవసరం నిపుణులు విశ్లేషించారు.ఒక్క విష్యం మాత్రం వాస్తవం ఇంఫ్లామేషన్ కు మార్గం ఉందని నిపుణులు పేర్కొన్నారు.ఒకసారి దీర్ఘ కాలిక ఇంఫ్లామేసన్ ను గుర్తిస్తే వాపును గుర్తిస్తే ఇంఫ్లామేట రీ హెర్బ్స్ కొన్నిరకాల మూలికలు స్తేరాయిడ్ లేని యాంటీ ఇంఫ్లామేటర్ మందులు కొన్ని కేసులలో స్తేరాయిడ్ ఇంజక్షన్ ఒక్కక్ విషయం మాత్రం నిజం ఇంఫ్లామేషన్ వాపులకు తప్పనిసరిగా చికిత్చ చేయాలి .

వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ పాడైపోతుందా?

వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీలు  డ్యామేజ్ అయిపోతాయని కిడ్నీ వ్యాధి సోకి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకునే పద్దతులు ఏవో తెలుసుకుందాం. వైరస్ ఇన్ఫెక్షన్ ను ఎలానివారించాలి... వైరస్ సోకకుండా నిలువరించేందుకు కొన్ని చిట్కాలు సూచించారు.కొన్ని సందర్భాలలో వైరస్ వల్లే కిడ్నీ వ్యాధులకు కారణం కావచ్చు. ముఖ్య అంశాలు... వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ సమస్యలు వ్యాధుల వల్ల ప్రమాదం పొంచిఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయంటే  అవికిడ్నీని పూర్తిగా నాశనం చేస్తాయి. వైరస్ సోకకుండా నిలువరించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం ----- వైరల్ ఇన్ఫెక్షన్లు కిడ్నీ వ్యాధులు... భారత దేశం లో ఏర్పడే వైరస్ వ్యాప్తి ఇన్ఫెక్షన్లు టైఫాయిడ్,గ్యాస్ట్రో ఎంట్ట్రైటేస్ ,హెపటైటిస్ ఏ,ఇ లాంటివి ఆహారం నీరు కలుషితం కావడం వల్లే మలేరియా, లె ప్టో స్టేయిరో సిస్,డెంగు,వంటివి ఉన్నాయి. ఇవన్ని మాన్సూన్ కాలం అంటే వర్షాకాలం లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.వయస్సు మళ్ళిన వాళ్ళు ,లేదా ముందునుండే అనేకరకాల అనారోగ్య సమస్యలు కిడ్నీ సమస్య ఒకటి కావచ్చు. కిడ్నీ సమస్య మరింత తీవ్ర సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు. చలారకాల ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయంటే కిడ్నీ ని నాశనం చేస్తాయి.కిడ్నీ లో వచ్చిన వ్యాది కారణంగానే కిడ్నీ డ్యామేజ్ కు కారణంగా నిపుణులు తేల్చారు. ఇక్కడ వైరస్ సోకకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు కిడ్నీ సమస్య తీవ్రతరం అయ్యే అవకాసం నుండి కాపాడుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ ను నివారించడం ఎలా?-- 1)కలుషిత ఆహారం నీళ్ళు... వర్షాకాలం లో వాతావరణం చల్లగా ఉండడం ఒక కారణం గా రోడ్లపై నీరు నిలిచిఉండడం.డ్రైనేజి వ్యవస్థ పనిచేయక పోవడం. నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.భోజనం నీటి కాలుష్యం వల్ల వచ్చే రోగాల వల్ల ప్రామాదం పెరుగుతుంది.అందుకే చేతిని పరిశుభ్రం చేసుకోవడం అవసరం అనినిపుణులు సూచిస్తున్నారు. 2)పండ్లు --- పండ్లలో వాపును తగ్గించే గుణం ఉండడం కొంత లాభం ఉంది. వర్షాకాలం లో వాతావరణం లో వచ్చే మార్పులు సందర్భంగా ముందుగా కోసిన పండ్లను తినడం మానివేయండి. అలాంటి పండ్లు కోసిన పండ్లకు దూరంగా ఉండండి. ముఖ్యంగా పండ్లను నీటిలో శుభ్రంగా కడిగి పండ్లపై ఉన్నతోక్కను తీసి వేసి పండును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ౩)డయాబెటిస్ రోగులు అప్రమత్తంగా ఉండాలి.ఎలాంటి వైరస్ ఐనా సోకేందుకు అవకాసం ఉంది. డయాబెటిస్ కిడ్నీ రోగాలు పెరగకుండా ఉండేందుకు షుగర్ బ్లడ్ షుగర్ ను నివారించడం అవసరం. 4)శరీర వ్యాయామం... వర్షాకాలం వాతావరణం లో బయటి కార్యకలాపాలు అసంభవం లేదా సురక్షితం కాదని నడవడం, పరుగెత్తడం, ఈదటం, సైకిల్ నడపడం వంటి వి చేయడం చాలా మందికి అవకాశాలు ఉండవు. ఇంటి వద్దే వ్యాయామం లేదా యోగా,శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా బలంగా ఉండేందుకు శరీర వ్యాయామం దోహదం చేస్తుంది.వైరస్ నుండి వచ్చే పలురకాల సమస్యలకు పైన పేర్కొన్న అంశాలు అమలు చేయడం ద్వారా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు వాటివల్ల వచ్చే కిడ్నీ సమస్యల నుండి కొంతమేర రక్షించుకోవచ్చని దీర్ఘకాలం పాటు అనారోగ్యం పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.