వ్యాయామం ఒకే సమయానికి చెయ్యాలంటారు ఇందుకే!

వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రోజు వ్యాయామం చేసేవారికంటే.. వ్యాయామం జోలికి వెళ్ళని వారి శరీరం  విభిన్నంగా ఉంటుంది. వ్యాయామం మనిషిని చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉంచేందుకు దోహపడే గొప్ప మార్గం. ఇందులో అనే రకాలు కూడా ఉన్నాయి. రన్నింగ్, జాగింగ్, యోగా, ఆసనాలు, జిమ్ ఇలా బోలెడు ఉన్నాయి. అయితే వ్యాయామం గురించి నిపుణులు ఒకమాట చెబుతున్నారు. అదేంటంటే.. వ్యాయామం అనేది ఒక సమయానికి ఒక ప్రణాళికతో చేసేది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? తెలుసుకుంటే.. వ్యాయామం  నిర్ణీత సమయానికి ఎందుకు చేయాలో కూడా అర్థమవుతుంది. 


మానవ శరీరంలో జీవ ప్రక్రియలు కణాల సిర్కాడియన్ కలయికలపై ఆధారపడి ఉన్నందున రోజులో వేర్వేరు సమయాల్లో శారీరక శ్రమ శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.  వ్యాయామం చేసే రోజు సమయం కొవ్వును కరిగించడానికి కొన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కొన్ని అధ్యయనాలు కూడా ప్రయోగపూర్వకంగా తెలిపాయి. 


వ్యాయామం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమంటే..


ఆహారం తీసుకునే విషయంలో ఫ్రీడమ్ వస్తుంది. 


 వ్యాయామం మొదలు పెట్టినప్పుడు శారీరక శ్రమ వల్ల  కొవ్వు కణజాలంలో  థర్మోజెనిసిస్ (వేడి ఉత్పత్తి) మరియు మైటోకాండ్రియా విచ్ఛిన్నానికి సంబంధించిన జన్యువుల వ్యక్తీకరణను పెంచుతుంది. ఇది అధిక జీవక్రియ రేటును సూచిస్తుంది.  ఈ ప్రభావాల వల్ల ఒకే సమయానికి వ్యాయామం చేయడం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.  జీవక్రియను పెంచడం మరియు కొవ్వును కరిగించడం వంటి అంశాలలో సాయంత్రం వ్యాయామం కంటే మార్నింగ్ వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.  దీని వల్ల తీసుకునే ఆహారం విషయంలో ఛాయిస్ మనదే అవుతుంది.


వ్యాయామంతో  ఆరోగ్యాన్ని  మెరుగుపరుచుకోవచ్చు.


 శరీరం బ్యాలెన్స్డ్ గా అంటే శరీర ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఆహారం, ఔషధాలు, లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా వ్యాయామం వల్ల మెరుగయ్యే స్థాయి చాలా బాగుంటుంది. అలాగే వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే మెల్లగా అవే తగ్గుముఖం పడతాయి. దీనికి కారణం, నిర్ణీత సమయంలో నిర్ణీత వ్యాయామం, ఈ వ్యాయామం కారణంగా నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది వ్యాయామం, ఆహారం రెండింటి సమతుల్యత వల్ల మనకు అందే గొప్ప బహుమానం.                                     

◆నిశ్శబ్ద.