జుట్టు ఎందుకు తెల్లబడుతుంది... దీన్ని నివారించడానికి ఏమి చేయాలంటే..

దాదాపు అన్ని వయసుల వారిలోనూ జుట్టు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. జుట్టు రాలడం నుండి జుట్టు బూడిద రంగులోకి మారడం వరకు, సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి.  అయితే దాని వెనుక కారణం మీకు తెలుసా? కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి పరిస్థితులు జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 50 ఏళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది, కానీ కొందరిలో ఈ సమస్య 20-30 ఏళ్ల వయస్సులో లేదా అంతకంటే ముందే కూడా రావచ్చు. జుట్టు తెల్లబడటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో సాధారణంగా వెంట్రుకల కుదుళ్లలో రంగు ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.  ఈ కారణంగానే జుట్టు రంగు మారడమనే సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది?? దానిని ఎలా నిరోధించవచ్చు?? పూర్తిగా తెలుసుకుంటే.. జుట్టు కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి, ఇవి జుట్టుకు నలుపు రంగును ఇచ్చే మెలనిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ కణాలు చనిపోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా జుట్టు సమస్యలు మొదలవుతాయి, ముఖ్యంగా జుట్టు బూడిదరంగు లేదా తెల్లగా మారుతుంది.  ఒకసారి ఒక ఫోలికల్ మెలనిన్ ఉత్పత్తిని ఆపివేస్తే, అది మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. చిన్న వయసులో వచ్చే సమస్యలు.. వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం సహజమే, అయితే ఈ సమస్య చిన్న వయసులోనే ఎందుకు మొదలవుతుంది? అనే విషయాలు పరిశీలిస్తే.. అధిక ఒత్తిడిని తీసుకోవడం లేదా ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య వంటివి జుట్టు సమస్యలకు కారణమవుతాయి.  జుట్టు సమస్యలు ఎక్కువగా జన్యువులపై ఆధారపడి ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు.  ఇది జుట్టు ఎప్పుడు నెరిసిపోతుందో నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా 30 సంవత్సరాల వయస్సులో జుట్టు నెరిసి ఉంటే, పిల్లలకు కూడా ముందుగా నెరిసిపోయే అవకాశం ఉంది.  తప్పక  తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.. విటమిన్ B12 లోపం. న్యూరోఫైబ్రోమాటోసిస్ - నరాలు, ఎముకలు, చర్మాన్ని ప్రభావితం చేసే ఒక వారసత్వ వ్యాధి. బొల్లి సమస్య - ఈ పరిస్థితి మెలనోసైట్లు (వెంట్రుకల కుదుళ్ల బేస్ వద్ద వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు) వాటి వర్ణద్రవ్యాన్ని కోల్పోతాయి. అలోపేసియా అరేటా సమస్య జుట్టు రాలడానికి సంబంధించినది, అయితే దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా? వంశపారంపర్య ప్రమాదాన్ని తగ్గించలేనప్పటికీ, జుట్టు రంగు మారడాన్ని నివారించడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. కూరగాయలు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ధూమపానం అలవాటుంటే మానేయాలి... ఆహారం నుండి తగినంత విటమిన్లు పొందాలి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ B-12 అవసరం. తగినంత ఖనిజాలను పొందాలి.  జుట్టు పెరుగుదలలో ,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఖనిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.                                    ◆నిశ్శబ్ద.

ప్లాస్టిక్ వాడితే జ్ఞాపక శక్తి కోల్పోతారా?

ప్లాస్టిక్ వాడకం వల్ల పిల్లలలో జ్ఞాపకశక్తి కోల్పోతారా బలహీన పడతారని యోగా గురువు బాబా రామ్ దేవ్ స్పష్టం చేసారు. * ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.  * ఇంట్లో మనం వాడే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించాలని కోరుతున్నారు. కాగా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వివిదతకాల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ పుట్టుక... 115 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ కనుగొన్నారని చారిత్రిక ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఈ అంశాల పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పట్లో దీనిని అపరిచిత వస్తువుగా నే గుర్తించారు.అలాగే సింథటిక్,పాలిమర్ నాణ్యత కారణంగా ఎన్నో ఏళ్ళు నడిపించారు.చీటి ధర చాలా తక్కువగాను అందంగా ఉండడం తో దీనికి తోడు గట్టిగా ఉండడం తో ప్లాస్టిక్ ఇంట్లోకి, ఆఫీస్లోకి, అక్కడనుంచి బజారు లోకి చేరింది.నేడు కరెన్సీ నుండి  దీని వినియోగం ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదిక ప్రకారం గత 5౦ ఏళ్లలో ప్లాస్టిక్ వాడకం 2౦% పెరిగింది.పిల్లల జ్ఞాపక శక్తి కోల్పోయెంతగా బలహీన పడేవిధంగా ప్రభావితం చేసే రసయానాలు బిస్టినోల్ ఏ శరీరం లో ని హార్మోన్ తయారు చేసే చేసే విధానం వాటి లెవెల్స్ ను ప్రభావితం చేసే  అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఉండే విష పదార్ధాలు రసాయనాలు మహిళల ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం గాలిలో  తేలి యాడె మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ముక్కు ముఖం ద్వారా శరీరం లోకి చేరతాయని ఈ కారణంగా హార్ట్ ఎట్టాక్ కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు ఊపిరి తిత్తుల లో తీవ్ర ఇబ్బందులు పెరుగుతాయని విశ్లేషించారు.ఒక పరిశోదన వివరాల ప్రకారం గాలిలో తేలే ప్లాస్టిక్ పార్టికల్స్ వల్ల గర్భస్థ మహిళల  ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నిరకాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రాణాంతక వస్తువుల వినియోగం ఆగడం లేదు.ప్రస్తుతం అందుతున్న గణాంకాల ప్రకారం అమెరికా తరువాత భారత దేశంలోనే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని దీనిఆదారంగా మన అంచనా ప్రకారం ౩4 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త కేవలం మనదేశం లోనే వస్తోందని నివేదిక వెల్లడించింది. కొంత ఉపసమనం కలిగించే అంశం ఏమిటి అంటే ప్రాణాంతక ప్లాస్టిక్ పోల్యుషణ్ కాలుష్యం ప్లాస్టిక్ లో 19 రకాల వస్తువులపై నిషేధం విదించారు.సింథటిక్ పాలిమర్ వల్ల రోగాలు క్యాన్సర్ నుండి రక్షించుకునే ఉపాయం  ప్లాస్టిక్ ప్రాణాంతకం... * వేడిగా ఉండడం వల్ల బెస్ఫినోల్ ఏ లీక్ అవుతుంది. * తినే తాగే వస్తువులలో నికిల్ ఉంటుంది. * ప్లాస్టిక్ పార్టికల్స్ శరీరం లో చేరాయో క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ పోల్యుషణ్ వల్ల ప్రమాదం... * పిల్ల జ్ఞాపక శక్తి బలహీన పడుతుంది. * హార్మోనల్ ఇం బ్యాలెన్స్ లెవెల్ స్థిరంగా ఉండదు. * గర్భస్థ మహిళల ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్ నుండి రక్షిమ్పబడాలంటే  వంటశాలలో ఈ మార్పులు చేయండి.. * స్టీల్ పాత్రల వాడండి. * అల్యూమినియం పాత్రలు వాడండి. * ప్లాస్టిక్ కన్ టైనర్లు నిషేదించండి * అల్యూమినియం ఫాయిల్స్ వినియోగించండి. ప్లాస్టిక్ వినియోగం వల్ల సమస్యల నుండి రక్షించుకోండి... * యోగా ప్రాణాయామం ప్రతిరోజూ చేయండి. * రోజులో ఒక్కసారైనా గెలోయ్ ను త్రాగండి * పసుపు పాలు తాగండి. * విటమిన్ సి కోసం పుల్లటి పండ్లు తినండి. * బయటికి వాచ్చినప్పుడు మాస్క్ ధరించండి. ప్రణాలతో చెలగాట మాదే ప్లాస్టిక్ ను సర్వత్ర నిషేధం తప్పనిసరి అని శాస్త్రజ్ఞులు,సామాజిక సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని. ఈమేరకు ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కు ఉద్యమ స్పూర్తితో ప్రజలు ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

తలనొప్పికి, కంటికి ఉన్న లింకు ఇదే!

కంటి ఆస్పత్రికి వచ్చే రోగులను పరిశీలిస్తే ఎక్కువ మంది తలనొప్పితో వస్తారని తెలుస్తుంది.  అసలు తలనొప్పికి కారణమేమిటి ? తలనొప్పి ఉన్నప్పుడు కంటి ఆసుపత్రికి రావడం ఏంటి?? తలనొప్పికి కంటికి గల సంబంధం ఏమిటి?? చాలామందికి ఈ విషయాల గురించి తెలియదు.  వీటికి సంబంధించి విషయాలు తెలుసుకుంటే.. మనిషి శరీరంలో ఒక్కొక్క స్పర్శను తెలియ జేయడానికి ఒక్కొక్క నాడి వుంటుంది. నొప్పి, వేడి, చల్లదనం, రుచి, వాసన, దృష్టి మొదలైన వాటిని తెలిపే నాడులు మెదడులో ప్రత్యేకంగా వుంటాయి. శరీరంలో ఏ భాగంలో నొప్పి ఎక్కడ పుట్టినప్పటికీ, ఇది నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన నొప్పేకాని ఇది వ్యాధి కాదు. ఇది వ్యాధిని సూచించే ఒక లక్షణం. మెదడులో నొప్పిని తెలిపే ఒక ప్రత్యేక నాడి వుంటుంది. దాన్ని ఉత్తేజిత పరిస్తే బాధ కలుగుతుంది. అయితే దాన్ని లేకుండా చేస్తే అసలు నొప్పి అనే ప్రశ్నే రాదు. నొప్పితో మొదలైన వ్యాధులన్నీ తీవ్రమైనవి కావు. అదేవిధంగా నొప్పి లేని వ్యాధులన్నీ స్వల్పమైనవీ కావు. నొప్పి అనేది మనలను మేల్కొలుపుతుంది. శారీరకంగా మనం ఇబ్బంది పడేలా చేస్తుంది. వ్యాధి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది. ఇది అంత తొందరగా బయటపడదు. కాని వ్యాధి కంటె నొప్పే ఎక్కువ బాధిస్తుంది. కాన్సరు రోగిని పరిశీలిస్తే, కాన్సరు గడ్డ కాని, పుండుకాని నొప్పి లేకుండానే బయలు దేరుతాయి. ఇది మొదలైనప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు కనబడవు. ఇది కాస్త ముదిరిన తరువాతే శరీరాన్ని హింస పెట్టడం మొదలుపెడుతుంది.  కావున ఈవ్యాధిలో నొప్పి అనేది చాలా చివరి దశ. అదేవిధంగా కుష్టు రోగిని పరిశీలిస్తే. అతని శరీరంలోని పలుచోట్ల గాయాలు, పుండ్లు ఏర్పడటానికి కారణం నొప్పి లేకపోవడమే. స్త్రీలైతే పొయ్యి మీద నుండి పాత్రలు దించేటప్పుడు కాల్చుకుంటారు. సిగరెట్లు పీల్చే వ్యక్తితే వేళ్ళపై పుండ్లు ఏర్పడతాయి. కాలుకి రాయి తగిలి గాయం ఏర్పడుతుంది. ఇవన్నీ సహజంగా అందరికీ  ఏర్పడే ప్రమాదాలే.  ఈ సంధర్భాలలో నొప్పి వుండి వుంటే ముందుగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందడానికి అవకాశం వుంది. నొప్పి అనేది ఒక అవసరమైన స్పర్శ. తలనొప్పిని తెలియ జేయడానికి ప్రత్యేక మైన నాడులు వున్నాయి. వాటిని ఉత్తేజింప జేయడం వలన తలనొప్పి ఏర్పడుతుంది. ఆ నాడుల పేర్లు - (ప్రైజెమినల్ నాడీ, సర్వైకల్ నాడులు). తలలో గాని, కంటి లో గాని మెదడులోగాని వ్యాధి ఏర్పడ్డప్పుడు ఈ నాడులు ఉత్తేజింప బడతాయి. తద్వారా మనకు తలనొప్పి ఏర్పడుతుంది.  దూరదృష్టి, హ్రస్వ దృష్టి, అక్షలోపము, నేత్ర ద్వయ శక్తి లోపము, నేత్రద్వయ సమన్వయ లోపము, ఛత్వారము, నీటి కాసులు, రక్తపు పొర వాపు, గాజుపొర పుండు (మెల్ల), కంటిగూడు వాపు, కంటి నాడి వాపు, మొదలైనవి. తలనొప్పి కలిగించే కంటి వ్యాధులు. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదిస్తారు. కంటి వైద్యులు కంటికి సంబంధించిన నాడుల కదలిక ఆధారంగా వ్యాధిని నిర్ణయించి తగిన పరిష్కారం సూచిస్తారు.                                         ◆నిశ్శబ్ద.

ఈ పండు తింటున్నారా!

  రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే సాదారణంగా మనం మనకి అందుబాటులో వున్నా పండ్లనే  ఎంచుకుంటాం, కాని కొన్ని పండ్లలో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్ని పోషకాలు వుంటాయి, వాటిని తప్పక తిని తీరాలి అంటున్నారు వైద్యులు. అలాంటి పండ్లలో 'కివి' ఒకటి....   'కివి' తో మనం పొందే ఐదు లాభాలు :- * మొట్టమొదటి లాభం కొలెస్ట్రాల్ ని నియంత్రణలో వుంచడం. దాని వల్ల గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా ఉంటాం. * అలాగే 'కివి' పండులో బత్తాయి,కమలా వంటి పండ్ల లో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు. * ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుంది. * ఇక విటమిన్ 'ఎ', ' ఇ' లు కూడా కలిగి ఉండే ఈ పండుతో మరో ముఖ్యమైన లాభం ఆహారంలోని ఐరన్ ని శరీరం త్వరగా మెరుగ్గా గ్రహించే శక్తిని ఇచ్చే గుణం కలిగి వుండటం. * ఇక చెప్పుకో దగ్గ మరో లాభం 'కివి' పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్  ప్రభావాన్ని అదుపు చేస్తాయి. అలాగే ఎముకల బలహీనత, కీళ్ళ బలహీనత, క్యాన్సర్, ఆస్మా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇన్ని లాభాలు వున్నాయని తెలిసాకా 'కివి' పండుని తినకుండా వుంటామా. రోజూ ఓ 'కివి' ఆరోగ్యానికి మంచిది అంటా హాయిగా తినేద్దాం.

మన భావోద్వేగాలే మన అనారోగ్యానికి కారణం?

మనిషి అన్నవాడు ఉద్వేగానికి గురి అవ్వకుండా ఉండడు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించని మనిషి అంటూ ఉండడు. అయాసందార్భాను సారంగా స్పందించడం మానవనైజం. అది సహజ లక్షణం. భావోద్వేగం అంటే ఎమోషన్స్ మనము కొన్ని కొన్ని టికీ చాలా తీవ్రంగా స్పందిస్తే కొన్నిసార్లు మామూలుగా స్పందిస్తాము. మనలో వచ్చే భావోద్వేగాలే మనశరీరానికి హానిచేస్తాయని అదే అనారోగ్యానికి కారణమని మనపూర్వీకులు వెల్లడించారని  ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు విశ్లేషించారు. ఈమేరకు డాక్టర్ కృష్ణం రాజు చేసిన పరిశోదనలో ఒక్కో భావోద్వేగం ఒక్కో అవయవం పై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఉద్వేగాల లో మనకు తెలిసిన కొన్ని టి గురించి చూద్దాం. ఒత్తిడి, భయం, క్రోదం,ఆవేదన ,ఆందోళన వంటి ఉద్వేగాలు మీ శరీరంలోని అవయవాల కు హానికలిగిస్తాయి. ఏ ఏ ఎమోషన్స్ మీ మీ అవయవాల పై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. భయం, లేదా మీకు షార్ట్ టెంర్  ఉంటె మీ కిడ్నీ పై ప్రభావం చూపిస్తుంది. మీకు ఉద్వేగాలాలో గమనించిన ముఖ్య అంశం --కోపం ఉంటె లివర్ పై ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడు విచారం ఆందోళనలో ఉంటె--లేదా తీవ్ర ఒత్తిడి కి గురి అయితే ---పొట్టలో గ్యాస్ ట్రిక్ సమస్యలు అరుగుదల లేకపోవడం గమనించవచ్చు. మీరు నిత్యం ఒత్తిడిలో ఉంటె --గుండె సంబంధిత సమస్యల కు దారి తీస్తుంది. మీరు ఏమిచెయ్యాలో తెలియక టెన్ క్షణ్ లో ఉంటె --మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ గ్రీఫ్ గా ఉంటె---అది మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. జాయ్ ఆనందం గా ఉంటె బలాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ విచార వదనంతో ఉదాసీనంగా ఉంటె అది మీ ప్లీహము పై ప్రభావము చూపుతుంది. సహజంగా వచ్చే ఉద్వేగాల ను నియంత్రించడం ద్వారా కొంతమేర అవయవాల పై పడే తీవ్రతను గుర్తించవచ్చు. తద్వారా అవిపూర్తిగా నాశనం కాకుండా మర్మ కళ ద్వారా నివారణ చేయవచ్చని ముఖ్యంగా నాడీ పతిలోని 1౦7 రకాల మర్మకళ తో అక్యు పంక్చర్ ను వినియోగించి చికిత్చ చేయవచ్చని నాడిపతి వైద్యులు  డాక్టర్ కృష్ణమ రాజు స్పష్టం చేసారు. మీ అనారోగ్గ్యానికి మీభావోద్వేగాలే అని తెలుసుకోవాలి.

అధికవేడి చేస్తోందా?? భయం వద్దు.. ఇలా తగ్గించేయండి.

ఒళ్ళు ముట్టుకుంటే సాధారణంగానే ఉంటుంది కానీ.. ఆ వ్యక్తికి మాత్రం లోపల నిప్పులు కురిసినట్టే ఉంటుంది. గొంతంతా తడి ఆరిపోతూ ఉంటుంది.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నోరు పిడచకట్టుకుపోతుంది. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు కొడుతుంది. చర్మం అంతా కళ కోల్పోతుంది. మొత్తానికి మనిషి వాడిపోయిన పువ్వులా తయారవుతాడు. ఇదంతా అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది. ఎదుటివారు మాత్రం నీకేమి కాలేదు ఊరుకో… అని అంటుంటారు. తమను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనే ఒకానొక బాధ మనుషుల్ని పట్టి పీడిస్తుంది. ఇలా శరీర సమస్య కాస్తా మానసిక సమస్యగానూ తయారవుతుంది. వైద్యులను కలసి మందులు వాడితే… వారు ఇచ్చే ఇంగ్లీష్ మందులు కూడా శరీరానికి వేడిని పెంచేవే… మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?? అని బాధపడేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి..  వేడి తగ్గడానికి సహజమైన చిట్కాలు.. అందరికీ సులువుగా దొరికేది వేప. దీని రుచి గురించి పక్కన పెట్టి కాస్త ఓపికగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.  వేపాకుల రసం 20-50 మి.లీ.  తీసుకోవాలి. అందులోకి 5 నుండి20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. చేదు ఎక్కువ భరించలేము అన్నవారు పటికబెల్లం ఎక్కువగా అంటే 20 గ్రాముల వరకు. చేదు తీసుకోగలం అనేవారు 5గ్రాములు మోతాదు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక వారము రోజులు తాగడం వల్ల వేడి తగ్గుతుంది. మామిడి చెట్టు లోపలి బెరడు తీసుకోవాలి, తరువాత అత్తి (మేడి) చెట్టు వేరు బెరడును, ఇంకా మర్రి చిగుళ్ళను తీసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 10 నుండి 40 మి.లీ. తీసి,  అందులో 1 నుండి 2 గ్రా॥ల జీలకర్ర, 5 నుండి 20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల ఎలాంటి వేడి అయినా తగ్గిపోతుంది. సోంపు మనందరికీ తెలిసిందే. ఇప్పట్లో హోటళ్లలో తిన్న తరువాత స్వీట్ సొంపు ఇస్తారు మౌత్ ఫ్రెషనర్ గా. ఈ సొంపు, జీలకర్ర, పటిక బెల్లమును మూడింటిని రాత్రి పూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే దీన్ని వడపోసి పరగడపున త్రాగాలి. ఇలా చేస్తుంటే  శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అందరికీ అతి సులువుగా ఏ కాలంలో అయినా లభించేది నిమ్మకాయ. ఈ  నిమ్మరసంలో పఠిక బెల్లం వేసి జ్యుస్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని తాగుతుంటే కూడా అధికవేడి దెబ్బకు తగ్గిపోతుంది.  అధికవేడి సమస్య అన్ని కాలాలలో ఉన్నా వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఈ వేసవి కాలంలో అందరికీ దొరికే అద్భుతమైన ఫలం పండ్లకు రారాజు మామిడి. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని తోలు తీసి నీటిలో మరిగించాలి. తర్వాత దాని గుజ్జును చల్లని నీటిలో పిసికి రసము తీసి నచ్చినట్టుగా అందులో  ఉప్పు, జీలకర్ర, చెక్కెర మొదలయినవి కలిపి తాగాలి. దీనిని ప్రస్తుతం చాలామంది ఆమ్ పన్నా అని పిలుస్తుంటారు. పచ్చిమామిడితో చేసే ఈ జ్యుస్ అధికవేడి సమస్యకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వడదెబ్బ సమస్య రాకుండా వేసవిలో ఈ జ్యుస్ ను తీసుకుంటూ ఉంటారు.   చెరకు రసం అద్భుతమైన ఔషధం. ఒకప్పుడు చెరకును నేరుగా తినేవారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అరుదైపోయింది. అయితే అక్కడక్కడా చెరకు రసం అమ్ముతూ ఉంటారు. ఈ చెరకు రసాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే అధికవేడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.  దానిమ్మపండ్లు అన్నిచోట్లా లభ్యమవుతాయి. ఈ దానిమ్మ పండు రసం తీసినా.. లేదా నేరుగా అలాగే విత్తనాలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తలనొప్పి వచ్చినా, వడదెబ్బ తగిలినా, కళ్ళు ఎరుపెక్కినా, దానిమ్మ పండు రసం తాగితే ఫలితం ఉంటుంది.  ఇలా సహజమైన చిట్కాలు ఉపయోగించి శరీరాన్ని మండించే అధికవేడిని తరిమేయచ్చు..    ◆నిశ్శబ్ద.  

మీకూ ఈ లక్షణాలుంటే పొగాకు వ్యసనంగా మారినట్టే!

ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు పొగాకు ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది.. 'మనకు ఆహారం పొగాకు కాదు. పొగాకు ఉత్పత్తి చేసే రైతులను ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించడమే దీని లక్ష్యం' అనే థీమ్ ను ప్రజలముందుకు తెచ్చింది.  పొగాకు ఉత్పత్తులను గుట్కా, ఖైనీ, సిగరెట్ల రూపంలో తీసుకుంటే వెంటనే మానేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవన్నీ మన శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనే విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు.  పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు సమస్యలు  వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అయితే ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త నాళాల విస్తరణ ప్రమాదాన్ని పెంచుతుంది . పొగాకు అనేది ఒక వ్యసనం, దీని నుండి బయటపడటానికి ప్రయత్నాలు అవసరం, లేకుంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది  పొగాకు వ్యసనంగా మారిందని తెలుసుకోవడం ఎలా?? పొగాకు-సిగరెట్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతే.. దాని వ్యసనానికి బలి అయ్యారనే సంకేతం. అయితే ఈ వ్యసనం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకులో నికోటిన్ ఉంటుంది, ఈ రసాయనం వ్యసనానికి ప్రధాన కారణం. నమలడం లేదా ధూమపానం చేయడం ద్వారా పొగాకు రక్తప్రవాహంలోకి శోషించబడినప్పుడు, అది అడ్రినలిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. నికోటిన్, మరోవైపు, డోపమైన్ హార్మోన్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది మెదడును సంతోషపెట్టే హార్మోన్.  దీని కారణంగా చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. పదే పదే ఈ సంతోషం కోసమే పోగాకుకు అలవాటు పడతారు. పొగాకు వ్యసనం లక్షణాలు..  పొగాకు వ్యసనం లక్షణాలు  పైకి స్పష్టంగా కనబడతాయి.  పొగాకు మానేయడానికి ప్రయత్నించినప్పటికీ ధూమపానం లేదా పొగాకు నమలడం ఆపలేకపోవడం. ఒకరోజైనా  వదిలేయాలని ప్రయత్నించినప్పుడు, చేతి వణుకు, చెమటలు పట్టడం, అశాంతి, గుండె వేగం పెరగడం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. భోజనం తర్వాత ధూమపానం చేయాలని, పొగాకు నమలాలని అనిపించడం.  పొగాకు వ్యసనం, దాని  లక్షణాలు, పొగాకు వల్ల ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ తెలుసుకుని స్ఫూర్తి వంతంగా పోగాకుకు దూరమైతే ఆరోగ్యం బాగుంటుంది.                                        ◆నిశ్శబ్ద.

ఈ మూడు సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి చాలా ప్రమాదం కలిగిస్తుంది!

ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడటం సహజం. ఆ ఆందోళన కాలక్రమేణా నయమవుతుంది. కానీ , కారణాలు పెద్దగా లేకున్నా తరచుగా ఆందోళన చెందేవారు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆందోళన చెందేవారు ఈ ఆందోళన కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా,  శారీరక ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఒత్తిడి నియంత్రణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.   ఆందోళన చాలా కాలంగా ఉంటూ అది అదుపులోకి రాకపోతే ఈ సమస్యకు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఆందోళన-ఒత్తిడి సమస్యలు నాడీ వ్యవస్థ, మధుమేహం నుండి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్కవగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఈ కింది సమస్యలున్నవారితో ప్రమాదం పెంచుతాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది..  దేనిగురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి మధుమేహానికి కారణం కాదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కళ్ళ నుండి గుండె జబ్బులు, నరాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. నరాల మీద దుష్ప్రభావాలు..  నరాలు మెసేజింగ్ నెట్‌వర్క్‌ల లాగా పనిచేస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల  హృదయ స్పందన రేటు, శ్వాసను ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపించవచ్చు. చాలా కాలం పాటు అనియంత్రిత ఒత్తిడి స్థాయిలు రక్తంలో చక్కెర, నరాల సమస్యలకు దారితీస్తాయి.  ఒత్తిడి-డిప్రెషన్‌తో బాధపడేవారిలో స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. గుండె ఆరోగ్యంపై ప్రభావం.. ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది  రక్తపోటు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ, ఆలోచిస్తూ ఉంటే , శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్  గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా పదే పదే జరిగితే,  రక్తనాళాలు ఎర్రబడి, తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలే కాదు.  మొత్తం శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.                                         ◆నిశ్శబ్ద.

మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య లింక్ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఇది విజృంభించింది. ఇప్పుడు యువత కూడా దీని బారిన పడే పరిస్థితి నెలకొంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక-శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొకదాని పై ఉంటుంది.  డిప్రెషన్‌ను కేవలం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యగా మాత్రమే పరిగణించరాదని డిప్రెషన్‌పై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తెలిపారు. అనేక రకాల శారీరక దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది. డిప్రెషన్‌కు గురైనట్లయితే, మైగ్రేన్, గుండె జబ్బులు, రక్తపోటు,  రోగనిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య సంబంధం.. మైగ్రేన్ సాధారణ తలనొప్పి సమస్య అని అనుకుంటే పొరపాటే.. మైగ్రేన్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు. ఇవి కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు మైగ్రేన్‌  వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మైగ్రేన్‌ ఉన్నవారు ఐదు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తేలింది.  మైగ్రేన్ వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం..  మైగ్రేన్, డిప్రెషన్, స్ట్రెస్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి, మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. మైగ్రేన్ ప్రారంభమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత చాలా మందిలో డిప్రెషన్ మొదలవుతుంది. మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ జన్యుపరమైనవి కూడా కావచ్చు. డిప్రెషన్ ఉన్న రోగులలో మైగ్రేన్ రిస్క్ మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ తక్కువ స్థాయి 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ (5-HT) లేదా సెరోటోనిన్ రిసెప్టర్లకు సంబంధించినవి. సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్లు కూడా జన్యు మార్పులకు కారణం అవుతాయి. మైగ్రేన్ అనేది జీవిత నాణ్యతను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది ఇతర  మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  అదేవిధంగా, మైగ్రేన్, డిప్రెషన్ ఉన్నవారిలో కాలక్రమేణా సైకోసోమాటిక్ డిజార్డర్‌గా మార్పు చెందుతాయి.  ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వచ్చినా మరొకటి మెల్లిగా డవలప్ అవుతుంది. కాబట్టి వీటికి దూరం ఉండటం అన్ని విధాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.

కల్తీ...కల్తీ...కల్తీ...ఎటు చూసినా కల్తి

కల్తీ ...కల్తీ ...కల్తీ... ఎటు చూసినా కల్తి గాలి కల్తీ,నీరు కల్తీ,పాలు కల్తీ,తినే తిండి కల్త్ఘీ,నెయ్యి కల్తీ,పళ్ళ లో కల్తీ కూరాగాయలలో కల్తీ,అసలు కల్తీ కి కాదేది అనర్హం అన్న చందాన సర్వం కల్తీ చేసేస్తూ ప్రజాల ప్రణాలను  హరిన్చేస్తున్నారు కల్తీ బాబులు.అసలు ఇందులో ఏది అస్లీ ఏది నకిలీ అన్నదే పెద్ద ప్రశ్న?  అసలు ప్రకృతి ని ఎలాగో కల్తీ చేసేసారు మానవుడు. అయితే సృష్టిలో కల్తీ లేనిది ఒక్క తల్లి పాలలోనే అంటే అతిశయోక్తి కాదు.ఇది నిజం. అని నమ్మక తప్పదు. తల్లిప్రేమలో నాన్న ప్రేమలో కల్తీ ఉండదు.ప్రియుడి ప్రేమలో.ప్రియురాలి ప్రేమలో కల్తీ ఉండచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెలలో ప్రపంచ ఆహార సంరక్షణ దినోత్సవం రూపం లో జరుపుకుంటారు.దీనిలక్ష్యం ప్రజలు సురక్షిత మైన ఆహారపు అలవాట్ల పట్ల కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి ఈ సందర్భంగా ప్రజలు నకిలీ ఆహార పదార్ధాల బారిన పడకుండా కల్తీ ఆహారాపదార్ధాలను ఎలా గుర్తించాలో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. మార్కెట్ లో మనకు లభ్య మయ్యే చాలా రకాల వస్తువులలో కల్తీ కలుస్తోందన్న విషయం తెలుస్తోంది.అందులో ను అది పండ్లు కవాచ్చు పప్పు దినుసులు కావచ్చు.గోధుమలు,మసాలాలు, పాలు,కూరాగాయలలో రక రకాల రసాయనాలు వాడుతూ వాటిని రూపొందిస్తున్నారు.కల్తీ చేసిన ఆహార పదార్ధాలు తినడం వల్ల  చాలా ప్రామాదం అని దానివల్ల తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు స్పష్టం చేసారు.కల్తీ చేసిన  వాంతులు.లివర్ కిడ్నీ,ఉదర సంబంధిత రోగాలు,వస్తే తీవ్ర ప్రభావం ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి సమస్యనుండి రక్షణ పొందాలంటే అసలు నకిలీ వస్తువులను గుర్తించాలి.వాటిని గురించి తెలుసుకోవడం అత్యవసరం. కల్తీ పాలను ఎలాగుర్తించాలి? పాలలో కేవలం నీళ్ళు మాత్రమే కలవడం లేదు.పాలను చిక్కగా చేసేందుకు దీనిలో డిటర్జెంట్,లేదా సింథటిక్,పాలు గుర్తించాలంటే 1/2 కప్పులో తక్కువ నీళ్ళు కలపండి.ఇందులో నురుగు వచ్చిందంటే ఇందులో డిటర్జెంట్ కలిపి నట్లే.సింథటిక్ పాలు గుర్తించాలంటే పాలను  వెళ్ళ మధ్యలో రాయడం ద్వారా అది సబ్బు లాగా కనిపిస్తుంది.అలా పాల కల్తీని గుర్తించవచ్చు. మరీ క్రుత్రిమ పాల వ్యాపారం లో కొత్త కొత్త పద్దతులు అవలం బిస్తున్నారు. వ్యవసాయం లో వాడే ఉరియా ఎరువులు,ఫెవికాల్ కలిపి పాల కల్తీకి పాల్పడుతున్నారు.  నకిలీ పసుపు ను ఎలాగుర్తించాలి? ఒక గ్లాసు నీరు తీసుకోండి.అందులో కొంచం పసుపు పొడి కలపండి ఒక వేళనీటి రంగు పసుపు రంగులోకి మారుతుంది.పసుపు గ్లాసు కింది భాగానికి చేరుకుతుంది.కల్తీ ఉన్న పసుపు రంగు నీటిలోకి మారుతుంది.ఆనీళ్ళు పసుపు పచ్చరంగులో ఉంటుందని గుర్తించండి. కల్తీ పండ్లను గుర్తించడం ఎలా? పండ్లు,కూరగాయలలో అన్నిటికన్నా ఎక్కువ కల్తీ జరుగుతుంది.ముఖ్యంగా మనం తినే యాపిల్ పండు బాగా మెరుస్తూ ఉంటుంది.అలా మెరిసేందుకు మైనం లేదా ఇతర  వేజిలేన్ రసయనాలు రాయడం వల్ల ఇదినిజమో కాదో  తెలుసు కోడానికి మీ వద్ద ఉన్న చాకును మెల్లగా దించండి.గట్టిగా ఉంటె చాకు త్వరగా దిగదు అంతకు ముందే  అప్పటికే కొన్ని రకాల వేజిలేన్ మైనం రాయడం వల్ల మెత్తగా ఉండడం వల్ల చాకు త్వరగా దిగుతుంది. నకిలీ నల్ల మిరియాలు... మనం తీసుకునే ఆహారం లో ముఖ్యమైన దినుసులలో ముఖ్య మైనవి మిరియాలు లేదా నల్ల మిరియాలు అంటారు.దీనిని కల్తీ కోవలోకి చేర్చిన ఘనత మనవాళ్ళదే. నకిలీ నల్ల మిరియాల ను ఎలా గుర్తించాలి ముఖ్యంగా పోప్పాయి పండులోని గింజలు నల్ల మిరియాలలో కలపడం వల్ల అసలు మిరియాలు నకిలీ మిరియాలకు తేడా తేలియదు.అసలు నకిలీ మిరియాల లో ఉన్న తేడా గుర్తించాలంటే. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో నల్ల మిరియాలు వేయండి.౩,లేదా 4 నిమిషాల తరువాత పోప్పాయి గింజలు తేలిపోతాయి. నకిలీ నెయ్యిని గుర్తించడం ఎలా? కల్తీ లేని నెయ్యి సహజంగా పూస పూస గా ఉంటుంది.మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనిని కల్తి చేసేందుకు బంగాళా దుంప పేస్ట్,లేదా అరారోట్ లేదా రీ ఫైండ్ నూనె డాల్డా ను కలిపి నెయ్యిగా అమ్ముతూ ఉంటారు.ఇటీవలి కాలం లో జంతువుల కలేబరాల నుండి సైతం తీసిన నేతిని కల్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.కాగా స్వచ్చమైన అవ్వునేయ్యి లేదా కల్తీ నెయ్యి ని గుర్తించాలంటే నెయ్యిలో అయుదిన్ సొల్యుషన్ కలపండి.దీనిరంగు నీలి రంగులోకి మారుతుంది అందులో గంజి పొడి కలిపి నట్లుగా తెలుస్తుంది. ఎర్రటి ఖారం నకిలీఖారం గుర్తించడం ఎలా? అసలైన ఎర్రటి ఖారం గుర్తించాలంటే ఒక గ్లాసు నీళ్ళలో మిర్చి పొడిని కలపండి.ఎర్రటి మిర్చి పౌడర్ నీటిలో తేలితే అది నకిలీది కాదని.ఒకవేళ నీలాలో మునిగి పోతే ఆ మిర్చి పొడి కల్తీది నకిలీదిగా భావించాలి. నకిలీ ఇంగువను గుర్తించడం ఎలా? నకిలీ ఇంగువకూడా నకిలీ నెయ్యి నూనె వేడిలో వేసినప్పుడు కొంత ఎర్రగా మారుతుంది.అది నకిలీ ఇంగువగా చెప్పవచ్చు.మరో పద్దతిలో ఇంగువను కాల్చి నప్పుడు అంటుకుంటుంది.నిప్పు త్వరగా అంటుకుంటుంది.అది నకికీది కాదనిఆర్ధం. నకిలీ ఇంగువ అంటుకోదు. ఈ విధంగా నకిలీ అసిలీ ఇంగువను ఆర్ధం చేసుకోవచ్చు. అసలైన  కోవా ను గుర్తించడం ఎలా? హిందీలో దీనిని మావా అని అంటారు అంటే మనం స్వీట్స్ లో వాడే కోవా,కలాకండ్, రసగుల్లా,గులాబ్ జాం,కోవా కజ్జి కాయి  వంటి  వి తయారు చేసేందుకు వాడతారు. కోవాలో అసిలి నకిలీ కివా ఎదో గుర్తించడం కష్టం. అసలు కోవా తెల్లగా ఉంటుందని.మరోరకం కోవా కొంచం పసుపు పచ్చటి రంగులో ఉంటుందని అది కల్తీ కోవాగా పేర్కొన్నారు.దీనితో పాటు చేతిలో నలపడం ద్వారా అసలైన కోవా చేతిని విదిచిపెడుతుంది.నకిలీ కోవా అయితే చేతిని అంటి పెట్టుకుని ఉంటుంది. నకిలీ తేనె... ఈ రోజుల్లో తేనె పేరుతో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. ముఖ్యంగా పుట్టతేనే అంటూ గిరిజన ఏ జేన్సీ  ప్రాంతాలలో తేనెలో బెల్లం కలిపి ఆమీస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తేనె నకిలీధా అసలైన తేనెను గుర్తించడం అవసరం.ఒక గ్లాసు నీళ్ళలో ఒక చంచా తేనె కలపండి మీరు వేసిన తేనె నీటిలో అలాగే ఉండి పోతే అది స్వాచమైన తేనె అని అటు ఇటు కదులుతూ నీటిలో కరిగి పోయే తేనెను నకిలీ తేనెగా గుర్తించారు.ఆ రకంగా మీరు తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండకుంటే మీరు అనారోగ్యం పాలు కావడం ఖాయం. ప్రపంచా ఆహార బద్రత దినోత్సవం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు. ఆరోగ్యా ప్రాప్తి రాస్తూ.   

బరువు మీద థైరాయిడ్ ప్రభావం ఎంత?

ప్రస్తుత కాలంలో సాధారణ సమస్యలలో బరువు పెరగడం ఒకటి. దీనికి జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు లేదా అనేక అంతర్లీన ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. చాలా సార్లు పెరిగిన బరువు థైరాయిడ్ సమస్యగా పరిగణించబడుతుంది. కానీ థైరాయిడ్ వల్ల నిజంగా ప్రతిసారీ బరువు పెరుగుతారా అంటే కచ్చితమైన సమాధానం ఎక్కడా లేదు. బరువు పెరగడం అనేది ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలో ఒక సాధారణ లక్షణం, అంతే కానీ బరువు పెరిగారంటే థైరాయిడ్ ఉన్నట్టు, థైరాయిడ్ వచ్చిందంటే బరువు కచ్చితంగా పెరగాలి అన్నట్టు నిబంధన ఏమీ లేదు.  ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. దీని గురించి అవగాహన, నివారణ పద్ధతుల గురించి చెప్పాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండటం, నివారణ చర్యలను పాటించడం అవసరం.  థైరాయిడ్, బరువు పెరిగే సమస్యలు.. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియలో సమస్యలు బరువుపై ప్రభావం చూపుతాయి. బలహీనమైన థైరాయిడ్ (హైపోథైరాయిడిజం) ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం. థైరాయిడ్ గ్రంధి ద్వారా విడుదలయ్యే హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంల సహాయపడతాయి, తద్వారా శరీరం శక్తి కోసం ఆహారాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. థైరాయిడ్ తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసినప్పుడు, జీవక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కేలరీలు బర్న్ చేయకపోతే బరువు పెరుగుతారు. బరువు కూడా తగ్గిస్తుంది.. థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి మాత్రమే కాదు, బరువు తగ్గడానికి కూడా కారణమవుతుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంధి చాలా హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభించే ఒక రకమైన థైరాయిడ్ రుగ్మత. వేగంగా బరువు తగ్గడం, చేతులు వణుకు, వేగవంతమైన లేదా సక్రమంగా లేని హృదయ స్పందన ఇందులో క్షణాలు . బరువు పెరగడం మరియు తగ్గడం రెండూ థైరాయిడ్ రుగ్మతలకు సంబంధించినవి అని అర్థం. బరువు పెరగడానికి థైరాయిడ్ రుగ్మత మాత్రమే కారణం కాదు.. అయితే థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి లేదా తగ్గడానికి మాత్రమే కారణం అని భావించడం కూడా తప్పు. బరువు పెరగడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి, సరైన కారణాలను తెలుసుకోవడం. వాటికి చికిత్స చేయడం అవసరం. కేలరీలను బట్టి ఆహారం తీసుకోకపోతే సహజంగానే బరువు పెరుగుతారు. కానీ థైరాయిడ్ ఉన్నవారు శారీరక శ్రమ ద్వారా కేలరీలను బర్న్ చేయలేరు. బరువు పెరగడానికి లేదా తగ్గడానికి జన్యుశాస్త్రం కూడా ఒక కారణం కావచ్చు. ఇది మాత్రమే కాకుండా.. అనారోగ్యం, మందులు తీసుకోవడం వంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

ఫైబర్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం గురించి ప్రతి వైద్యుడు, ప్రతి పోషకాహార నిపుణుడు, ఆఖకి ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి చెబుతాడు. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చాలా విషయాలు వినే ఉంటారు.  ఫైబర్  జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అందరికీ తెలిసిందే..   అయితే  ఫైబర్ ఇలా కడుపుకు మాత్రమే కాకుండా శరీరానికి అనేక ఇతర ప్రయోజనలు కూడా చేకూరుస్తుందని  మీకు తెలుసా??   బరువు తగ్గడం నుండి డయాబెటిస్ సమస్యలను తగ్గించడం, మెదడును ఆరోగ్యంగా ఉంచడం వరకు దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  అందుకే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  ఫైబర్ శరీరంలో చక్కెర వాడకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇది ఆకలిని, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి అవసరం. పిల్లలు మరియు పెద్దలకు మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 25 నుండి 35 గ్రాముల ఫైబర్ అవసరం, కానీ చాలా మందికి రోజుకు 15 గ్రాములు మాత్రమే ఆహారం ద్వారా ఫైబర్ అందుతూ ఉంటుంది. ఫైబర్ బాగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చునంటే.. చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, తగినంత ఫైబర్ తీసుకుంటే, అది చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధకులు కనుగొన్నారు.  రోజువారీ శరీరానికి కావలసినంత  ఫైబర్ తీసుకునే వారిలో చిత్తవైకల్యం తక్కువగా ఉంటుందని తేలింది.ఆహారంలో  తక్కువ తీసుకునేవారిలో డిమెన్షియా రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజుకు సగటున 20 గ్రాముల కంటే తక్కువ ఫైబర్  తీసుకునేవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్, అరటిపండ్లు.. బెస్టు.. అవకాడో లో ఫైబర్ పుష్కలంగా ఉన్నా అవి సగటు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. అలాంటి వారు అనేక ఇతర పండ్ల నుండి ఫైబర్ పొందవచ్చు, అరటిపండ్లు, యాపిల్స్ ఇందులో ముఖ్యమైనవి. యాపిల్స్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి.. అదేవిధంగా, అరటిపండులో 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లు విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియంతో సహా అనేక ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. అరటిపండు తినడం ఫైబర్, ప్రోటీన్ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల శనగలు.. ఫైబర్, ప్రోటీన్‌లకు అద్భుతమైన మూలం నల్ల శనగలు. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది శాకాహారులకు ప్రోటీన్  లోపంతో బాధపడేవారికి బెస్ట్ ఎంపిక. ఆహారంలో నల్లశనగలను చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియను సరిగ్గా ఉంచడంతో పాటు కండరాలకు ప్రోటీన్‌ను సులభంగా అందేలా చూసుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.

అల్లం టీని రోజూ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

మనం వంటలలో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అల్లం కూడా ఒకటి. అల్లం బరువు తగ్గించడం నుండి జీవక్రియను ప్రోత్సహించడం వరకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. తాజా లేదా ఎండిన అల్లంను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ అల్లం ను టీ చేసుకుని తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు. అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే.. బరువు తగ్గిస్తుంది.. అల్లం శరీర బరువు తగ్గడంలో,  నడుము చుట్టూ ఉన్న కొవ్వు, పిరుదులు మొదలైన ప్రాంతాలలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్‌లు అల్లం టీ తీసుకున్నప్పుడు చాలా కంట్రోల్ అవుతాయి.   వాపును తగ్గిస్తుంది.. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వాపు కారణం. అల్లంలో జింజెరోల్‌లు, షోగోల్‌లు ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాపును కలిగించే అణువులైన సైటోకిన్‌ల ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వాపును తగ్గిస్తుంది. 3వికారం వాంతులు తగ్గిస్తుంది.. అల్లం మోషన్ సిక్‌నెస్, మార్నింగ్ సిక్‌నెస్, కీమోథెరపీ, సర్జరీతో సంబంధం ఉన్న వికారం, వాంతుల నుండి ఉపశమనానికి ఒక గొప్ప నివారణ. అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడానికి, మొత్తం జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.. అల్లం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది! అల్లం అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు న్యూరోప్రొటెక్టివ్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఇది వయస్సు సంబంధిత అభిజ్ఞా క్షీణతతో ముడిపడి ఉంటుంది. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది.. అల్లం టీ నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా బాధాకరమైన ఋతు తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం కండరాల సడలింపు లక్షణాలు గర్భాశయ కండరాలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయడుతుంది, తద్వారా నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. అల్లం టీ రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇవి రెండూ గుండె జబ్బులకు దోహదపడే రెండు ప్రమాద కారకాలు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి, ఈ పరిస్థితి ధమనుల పనితీరు తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.  తద్వారా శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అల్లంలోని సమ్మేళనాలు తెల్ల రక్త కణాల సంఖ్యను ప్రేరేపిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అందువల్ల అనారోగ్యం వ్యాధుల సంభావ్యతను తగ్గిస్తుంది. మొత్తంమీద, అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు, అల్లం టీ దినచర్యలో భాగం చేసుకుంటే అద్బుతమే..                                   ◆నిశ్శబ్ద.

మగవారిలో నీరసం.. అలసట ఎక్కువగా ఉంటోందా... కారణం ఇదే కావచ్చు!

శరీరం సరిగ్గా పనిచేయాలంటే, హార్మోన్ల స్థాయిని సరిగ్గా ఉండడం అవసరం. మగవారి మంచి ఆరోగ్యం, మెరుగైన శారీరక పనితీరులో టెస్టోస్టెరాన్ హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టెస్టోస్టెరాన్ సాధారణంగా సెక్స్ హార్మోన్‌గా పరిగణించబడుతుంది, ఇది శరీరంలో ఎన్నో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. పురుషులలో, ఈ హార్మోన్ సెక్స్ డ్రైవ్ (లిబిడో) నుండి ఎముక ద్రవ్యరాశి, కొవ్వు పదార్ధం, కండరాల ఆరోగ్యం, కండరాల బలాన్ని కాపాడుకోవడం, ఎర్ర రక్త కణాలు, స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రించడం ఇలా ప్రతిదానికీ అవసరం. అయితే అనేక కారణాల వల్ల యువతలో టెస్టోస్టెరాన్ లోపం నిర్ధారణ అవుతోంది, ఇది లిబిడో, సెక్స్ పవర్ సమస్యలను పెంచడమే కాకుండా శరీరంలో ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ లోపం ఎముకల వ్యాధుల నుండి తీవ్రమైన అలసట వరకు అన్నింటికీ కారణమవుతుంది. అసలు టెస్టోస్టెరాన్ లోపం ఎందుకు వస్తుంది? శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం అనేక కారణాల వల్ల జరుగుతుంది.  కీమోథెరపీ వంటి ఔషదాల  దుష్ప్రభావం, వృషణానికి గాయం లేదా క్యాన్సర్. మెదడులోని గ్రంధుల సమస్యలు (హైపోథాలమస్ మరియు పిట్యూటరీ), ఇది హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ పనితీరు సమస్యలు, అధిక శరీర బరువు (ఊబకాయం). దీర్ఘకాలిక వ్యాధులు లేదా అంటువ్యాధులు. మొదలైన కారణాల వల్ల ఈ హార్మోన్ లోపం వస్తుంది.  టెస్టోస్టెరాన్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే.. శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల శక్తి లేనట్టుగా ఉంటారు. తరచుగా అలసట-బలహీనతను కలుగుతుంది. వృద్ధాప్యం మీదకొచ్చినట్టు, నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉంటాయి.  చాలా కాలంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటే, ఖచ్చితంగా వైద్యులను కలవాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం ఉంటే ఈ రెండు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  మూడ్ మార్పులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. విచారం, పనిలో ఆసక్తి కోల్పోవడం, డిప్రెషన్ వరకు ఈ సమస్యలు ఉంటాయి. కొంతమంది పురుషులలో దీని కారణంగా వ్యక్తిత్వంలో మార్పులు కూడా వస్తాయి. దీని కారణంగా వారిని కాంప్రమైజ్ చేయడం కష్టమైన సమస్యగా మారుతుంది. . టెస్టోస్టెరాన్ స్థాయి సాధారణమైనప్పుడు, అటువంటి సమస్యలు కూడా నయమవుతాయి. కండరాలు, ఎముకల సమస్యలు టెస్టోస్టెరాన్ హార్మోన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి, దాని పరిమాణం తగ్గినప్పుడు, కండరాలు, దాని బలం కూడా తగ్గుతుంది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్నవారిలో ఎముక సాంద్రత తగ్గడం నుండి బోలు ఎముకల వ్యాధి వరకు సమస్యలు వస్తాయి.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసేటప్పుడు పెద్ద కండరాలు బాగా పనిచేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది.                                 ◆నిశ్శబ్ద.

గుండె జబ్బుల గురించి ఈ నిజాలు తెలుసుకోకపోతే.. చాలా నష్టపోతారు!

ప్రపంచవ్యాప్తంగా సంభవించే  మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. ఈ మధ్య కాలంలో ఇవి మరీ పెరిగిపోయాయి. గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) సుమారు 382,820 మంది మరణానికి కారణమవుతుంది. ప్రజల జీవన విధానం అధ్వాన్నంగా మారడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరిగింది. యువత కూడా దీనికి బాధితులుగా మారుతున్నారు. శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేయడం, శరీరంలో  అవయవాలకు  కణజాలాలకు ఆక్సిజన్ ను, పోషకాలను సరఫరా చేయడం గుండె విధి.  గుండె జబ్బుల కారణంగా, ఈ సాధారణ పనితీరు దెబ్బతింటుంది, ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం  4 లో 1 మరణాలు గుండె జబ్బుల కారణంగా సంభవిస్తున్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన రెండు సమస్యలు ఉన్నాయి - గుండెపోటు,  గుండె వైఫల్యం చెందడం. అందరూ ఈ రెండింటిని ఒకటిగా భావిస్తారు. కానీ ఇవి రెండూ వేరువేరు.   గుండెకు సాధారణ రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. అంటే రక్తం సరఫరా లేకపోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ సరఫరా కావడం లేదు. ఈ కారణంగా గుండెపోటు వస్తుంది. గుండెపోటుకు వెంటనే చికిత్స చేయకపోతే అది గుండె కణజాలాన్ని దెబ్బతీస్తుంది.  గుండె వైఫల్యం.. శరీరం యొక్క అవయవాలు,  కణజాలాల అవసరాలను సరిపడినంతగా  రక్తాన్ని గుండె  పంప్ చేయలేనప్పుడు గుండె వైఫల్యం  సంభవిస్తుంది. ధమనులు సన్నబడటం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది.  లక్షణాలు ఎలా ఉంటాయి?   గుండెపోటు యొక్క లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు  ప్రధానంగా గుండెపోటులో ఛాతీ నొప్పి ఉంటుంది. నొప్పి తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. ఇది ఛాతీపై ఒత్తిడి లేదా పిండేసినట్టు  అనుభూతిని కలిగిస్తుంది. ఇది కాకుండా, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలో నొప్పిని కూడా కలిగిస్తుంది. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమట, మైకము కూడా ఉండవచ్చు.  గుండె వైఫల్యం విషయంలో శ్వాస ఆడకపోవడం ప్రధాన లక్షణం. గుండె శరీరమంతటా తగినంత ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేయలేనప్పుడు, అదనపు ఆక్సిజన్‌ను తీసుకోవడానికి ఊపిరితిత్తులు చాలా కష్టపడాలి. గుండె ఆగిపోయిన సందర్భంలో, బలహీనత లేదా అలసటతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది సంభవిస్తుంది.  గోర్లు లేదా పెదవులు నీలం రంగు మారవచ్చు.   సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? చాలా కాలంగా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఈ ప్రమాదాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెపోటులో దవడలు, చేతుల్లో నొప్పి చాలా సాధారణం అయితే గుండె ఆగిపోవడానికి శ్వాస ఆడకపోవడం ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతాల ఆధారంగా, శరీరం యొక్క సమస్యలను అంచనా వేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారం  గుండె-ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అలవాటే..  గుండె జబ్బులు, దాని సమస్యల నుండి  రక్షించగలవు.  ఏవైనా గుండె సమస్యలు ఉంటే మాత్రం మద్యం మరియు ధూమపానం పూర్తిగా మానేయండి, ఈ రెండూ గుండెపోటు మరియు గుండె వైఫల్యం వంటి సమస్యలను మరింత పెంచుతాయి.                                  ◆నిశ్శబ్ద

ప్రాణాలను మింగేసే అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది.. దాన్ని అదుపు చేయడం ఎలాగంటే!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. హైపర్ టెన్షన్ గా పేర్కొనే ఈ సమస్య హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. రక్తపోటు పెరగడం అనేది  వృద్ధాప్య సమస్య అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం హైపర్ టెన్షన్ కు యువత కూడా బాధితులుగా మారుతున్నారు.   ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి రక్తపోటు సమస్యలు ఉన్నాయి, ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు బాధితులు. అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు, అయితే వారిలో 12% మంది మాత్రమే తమ రక్తపోటును నియంత్రించగలుగుతున్నారు. రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ, అదుపులో ఉంచుకోవడమే అందరూ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు వైద్యులు. అసలు యువతలో అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి?? దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలి?? తెలుసుకుంటే.. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, యువకులు రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం, జంక్-ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రకమైన జీవనశైలిని గడుపుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండాలి, అది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.  మీరు మీ దినచర్యలో కొన్ని సాధారణ మార్పులు చేయడం ద్వారా కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవాలి.. ఆరోగ్యకరమైన బరువును మైంటైన్ చేయడం వలన అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఊబకాయం సమస్య మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు.  బరువు పెరుగుతున్నట్లయితే, దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి.  సమతుల్య ఆహారం, సోడియం తీసుకోవడం తగ్గించడం..  సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఆహారంలో సోడియం, చక్కెర మరియు అనారోగ్యకరమైన కొవ్వుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మీరు రక్తపోటును నియంత్రించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజల పరిమాణాన్ని పెంచాలి. మిమ్మల్ని  మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో  అవసరం. ఆహారంలో  ఎక్కువ ఉప్పు తీసుకుంటే అది ప్రమాదాలను పెంచుతుంది. వ్యాయామం చాలా ముఖ్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గొప్ప అలవాటు.  ఈ అలవాటు రక్తపోటు ప్రమాదం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు-మధుమేహం, దాని సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిస్సారమైన జీవనశైలిని కలిగున్న వ్యక్తులకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.. డైలీ లైఫ్ స్టైల్ ను  సరిగ్గా పాటిస్తే.. హైపర్ టెన్షన్ ను అదుపులోకి తీసుకురావచ్చు. తద్వారా దీర్ఘయుష్షు సొంతమవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

ఇది తెలుసుకోకుంటే గుండెకు గండి పడుతుంది!!

లావుగా ఉన్నవారిని సాధారణంగా స్థూల దేహం కలవారని, స్థూలకాయులు అని అంటారు. ఇలా లావుగా ఉండటం వల్ల ఎన్నో అసౌకర్యాలు ఉన్నా వాటికంటే ప్రమాదకరమైనది ఆరోగ్య సమస్యల ముప్పు. లావుగా ఉన్నవారిలో ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే… స్థూలదేహాలలో తరచుగా క్రొవ్వు పదార్థము ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల క్రొవ్వు కణాల సంఖ్య రక్తంలో ఎక్కువ అవుతాయి. అందువల్ల స్థూల శరీరం ఉన్నవారిలో రక్తం  చిక్కగా మారుతుంది. ఈ చిక్కదనం వల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఈ రక్తంలో ఉన్న కొవ్వు కణాలు అన్నీ రక్తనాళాలలో పేరుకుని పోయి అవి ప్లేట్లెట్స్ గా తయారవుతాయి. ఇవన్నీ ముందే నెమ్మదించిన రక్త ప్రవాహానికి మరింత ఆటంకం కలిగిస్తాయి. అంతే కాకుండా ఇవి రక్తనాళాలు కుచించుకుని పోవడానికి కారణం అవుతాయి. ఈ అన్నిటి కారణాల వల్ల గుండెకు జరగాల్సినంత మోతాదులో రక్తప్రవహం జరగదు.   గుండెకు తగినంత రక్తప్రవహం లేకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా గుండె ద్వారములలో వాల్వ్  లు ఉంటాయి. ఈ వాల్వ్ లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కూడా  గుండెజబ్బులు వస్తాయి. ఈ పరిస్థితిని రొమేటిక్ హార్ట్ అని అంటారు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 8నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలలో ఏర్పడుతుంది.  ఇకపోతే  స్థూలదేహం ఉన్నవారిలో చాలా మందికి కొరోనరీ హార్డు డిసీజ్ (C.A.D.) అనే వ్యాధి తరచుగా వస్తుంది. ప్రస్తుత జనరేషన్ లో ఈ సమస్య కారణంగా వైద్యులను ఆశ్రయిస్తున్నవారే మొదటి స్థానంలో ఉంటున్నారు. దీని కారణంగా సంభవిస్తున్న మరణాల స్థాయి కూడా అధికంగానే ఉంది. గుండె సంబంధ సమస్యల కారణంగా మరణిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఈ సమస్య వల్ల మరణించే వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే కార్డియాలజిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.   కొరోనరీ ఆర్టరీస్ అనేవి ప్రాణవాయువుతో గూడిన స్వచ్ఛమైన రక్తాన్ని గుండెలకందించే ప్రధాన నాళాలు.  మన గుండెకు ప్రతిక్షణం స్వచ్ఛమైన రక్తం అందాలంటే కొరోనరీ ఆర్టరీస్ ఆరోగ్యంగా ఉండాలి. స్థూలదేహం గలవారిలో రక్తంలో క్రొవ్వుకణాలు అదనంగా పేరుకొని ఉండటం  వల్ల వీటి మార్గము సన్నగా మారిపోయి ప్రవాహములకు అవరోదం ఏర్పడుతోంది.  ఈ కొరోనరీ ఆర్టరీస్ రెండు రకాలు. అవి గుండెకు కుడి, ఎడమ ప్రాంతాలలో వ్యాపించి ఉంటాయి. ఎడమ భాగంలో ఎడమ డి నెంటరీ ఆర్జరీ అని, నర్ కాంప్లెక్స్  రెండు రకములు గలవు. కుడి భాగములో కుడి డిసెంటరీ ఆర్జరీ మాత్రము ఉంటుంది. వీటి ద్వారా కుడి యడమలందు గల గుండె భాగములకు స్వచ్ఛమైన రక్తం అందించబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ లైనింగ్ పొర దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చుట్ట, బీడీ, సిగరెట్లు త్రాగడం వల్ల వచ్చే నికోటిన్  వల్ల, విషపు మందులు, మత్తు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల రక్తంలోని ప్రాణశక్తి తగ్గిపోయి క్రొవ్వుకణాలు అడ్డుకోవడం వల్లా, ఈ ప్రాంతాలు మైల్డ్ గా  బ్లాక్ అవుతాయి. ఇలాంటి పరిస్థితిలోనే గుండెనొప్పి వస్తుంది.  ఈ గుండె నొప్పి మెల్లగా మొదలై అది భుజము నుండి  ఎడమచేతి మోచేతి వరకు  వ్యాపించడం జరుగుతుంది.   క్రమంగా ఈ ఆర్డరీలు మూసుకొనిపోయే ప్రమాదం గూడా ఉంటుంది. గుండెజబ్బుకు రావడానికి ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి. డాక్టర్ల ప్రకారం ఇలాంటివి సుమారు 200 రకాలు ఉన్నాయట. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక బరువు అయినా ఇవి మాత్రమే కాకుండా  దుర్వ్యసనాలు, మానసిక ఒత్తిడి కొలెస్ట్రాల్ పెరగడం, వేళాపాళా లేని భోజనాలు, బయటి చిరుతిండ్లు, కాఫీ, టీలు, అధికమోతాదు మాంసాహారం ఇలాంటివన్నీ అంటున్నారు వైద్యులు. కాబట్టి గుండె పదిలంగా ఉండాలంటే వీటన్నిటి గురించి జాగ్రత్తలు అవసరం.                                   ◆నిశ్శబ్ద.

50లోనూ 15లా ఉండాలని ఉందా...

5౦ లోనూ 15 లా చెంగు చెంగున ఎగురుతూ మీ టీన్ ఏజ్ ను గుర్తుచేసుకోవాలంటే. కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోక తప్పదు. అంటున్నారు నిపుణులు. అసలు సూపెర్ ఫుడ్ అంటే ఏమిటి? 5౦ లోనూ 15 సంవత్సరాల యువకుడిగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండడం కీలకం.అది మీ గుండెకు సంబందించిన అంశం లేదా శరీరంలోని అవయవాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అందుకే శరీరం పై ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే సూపర్ ఫుడ్స్ మన శరీరానికి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మన వయస్సు పెరుగుతున్న కొద్ది మన శరీరం తీరు నెమ్మదిస్తుంది. గతంలోలాగా  వేగవంతంగా పనిచేయలేరు.శరీరంలోని అంగాలు సంవత్సరాల తరబడి కష్టపడి అలిసిపోతున్న వయస్సును ఆపలేము.శరీరం పై వార్ధక్యం వేగంగా పెరగడాన్ని కొంతవరకు నియంత్రించ వచ్చు. వయసు పెరిగే  ప్రక్రియను తగ్గించడం లేదా  నియంత్రించడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. ఇందులో భాగం గా మన ఆహార విహారాలు ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారం మన వయసును ఎదుగుదలలోను నియంత్రించడం లోనూ కీలక భూమిక పోషిస్తాయి. ప్రతి సారీ సూపర్ ఫుడ్ పోషణ శరీరం కోసం లాభాదాయకమని నిరూపించ బడింది.మనశరీరం లోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉంచడం తోపాటు.5౦ సం వత్సరాలు పై బడిన వారికి చాలా లాభాలు ఉన్నాయని వాటిని సూపెర్ ఫుడ్ బూస్టర్స్ ఇమ్యునిటి  పెంచేవని చేస్తుంది. ప్రాణాలు హరించే రోగాలనుండి బయట పడే విధంగా వీటిని అభివర్ణించారు. మీరు దీర్ఘకాలం జీవించాలంటే 1౦ సూపర్ ఫుడ్స్ ఇవే... నట్స్... డ్రై ఫ్రూట్స్ అన్నివయస్సుల వారు తీసుకోవాల్సిన ఆహారం. మీరు 5౦ సంవత్సరాలు పై బడిన వారు,లేదా తక్కువ వయస్సు ఉన్నవారు సైతం  తీసుకోవాల్సిన ఆహారం మీరు 5౦ సంపై బడిన వారైనా తక్జువ వయస్సువారే అయినా   నట్స్ మీ శరీరాన్ని శక్తి వంతంగా చేస్తుంది.మీశరీర పనితీరు సరిగా ఉండాలంటే ఆక్ రూట్ లాంటి డ్రైఫ్రూట్స్ గుండె సంభందిత అనారోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పని చేసి మీ గుండె బలహీన పడకుండా జాగ్రత్త పడుతుంది. పచ్చటి ఆకు కూరలు---- పచ్చటి ఆకు కూరలు ఎవరికైతే మల బద్ధకం ఉంటుందో.వారికి క్యాబేజీ,లెట్స్,పాలకూర,అరటి అందులో పీచు పదార్ధం నిండి ఉంటుంది.శరీరంలో కండరాలు గట్టిగా ఉండాలంటే మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది. చిరీజ్... రుచికరమైన జూసి గా ఉండే యాంటి ఆక్సిడెంట్ ఫైబర్ తో నిండి ఉంటుంది.మీగుండే ఆరోగ్యానికి సంబంధించి నంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని భోజనానికి మధ్య అల్పాహారం గా తీసుకోవచ్చు. ఒక వేళ మీకు స్వీట్ తినాలన్నకోరిక ఉంటె వీటిని డే జర్ట్ రూపం లో తీసుకోవచ్చు.  డార్క్ చాక్లెట్... డార్క్ చాక్లెట్ యాంటి ఆక్సిడెంట్ తో సంపూర్ణంగా నిండి ఉంటుంది. డార్క్ చాక్లెట్ ఇమ్యునిటీని పెంచుతుంది.గుండెకు సంబంధించిన భయంకరమైన స్థితినుండి రక్షిస్తుంది.ఇంతే కాదు డార్క్ చాక్లెట్ టాక్సిన్స్ ను బయటికి తీసి శరీరానికి పోషక తత్వం తో నిండి ఉంటుంది. టమాటా... యాంటి ఆక్సిడెంట్ శరీరంలో సేల్స్ ను రక్షిస్తుంది.వాటిని సరిచేసేందుకు పనిచేసేందుకు లై ఫోడిన్ ,ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.శరీరంలోని విషపదార్దాలాను బయటుకు పంపుతుంది. టమాటో వల్ల గాయాలు మానతాయని నిపుణులు పేర్కొన్నారు. గోధుమలు... శరీరానికి కావాల్సిన శక్తి కోసం మీ ఆహారం లో గోధుమను తప్పనిసరి చేయండి.దీంతో పాటు మీగుండే ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే టమాటా మంచిదే. చేపలు... సార్టీన్-సామాన్ -లాంటి ఫ్యాటీ చేపలు యాంటి ఆక్సిడెంట్ ఒమేగా ౩ నుండి లభిస్తుంది.మీవయస్సు 5౦ కి పైగా ఉంటె ఈ చేపలను ఆహారం లో భాగం చేసుకోవచ్చు. చేపల నో ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల చేపల ద్వారా విటమిన్ సంపూర్ణంగా లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. పన్నీర్... పనీర్ ఇది కేవలం డెయిరీ ప్రోడక్ట్ తినడానికి మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది.ప్రోటీన్లతో సంపూర్ణంగా నిండి ఉంటుంది.శరీరంలో మాంసం కండరాల పెరుగుదలకు పన్నీర్ దోహదం చేస్తుంది. ఆలివ్ ఆయిల్... ఆయిల్ యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా నిండి ఉంటుంది.ఆలివ్ ఆయిల్ గుండె సంబంధిత తీవ్ర సమస్యలకు పొటాషియం,ఐరన్,మాంగనీస్ తో ఉంటుంది. నీరు.... నీరు తినే ఆహారం లోకి రాదు.అయినా ఇది ఎలాంటి సూపెర్ ఫుడ్ అంటే మనం జీవించేందుకు అత్యవసరంగా హైడ్రేషన్ లేదా శరీరాన్ని ఫ్యాటీ గా ఉంచేందుకు నీరు సహాయ పడుతుంది .పంచెంద్రియాలను సరిగా పనిచేసే విధంగా సహకరిస్తుంది.

ఈ లక్షణాలు మీలోనూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని లెక్క!

మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడం, శరీరం నుండి వ్యర్థాలు, అదనపు నీటిని తొలగించడం, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రించడంలో బాధ్యత వహిస్తాయి.  రక్తపోటు నియంత్రణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు ఎముకల ఆరోగ్యానికి దోహదపడే ముఖ్యమైన హార్మోన్లను కూడా విడుదల చేస్తాయి. రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు దాని నుండి వ్యర్థ పదార్థాలను వేరు చేయడం మూత్రపిండాల యొక్క ప్రాథమిక విధి. మూత్రపిండ ధమని నుండి రక్తం నెఫ్రాన్లలోకి ప్రవేశిస్తుంది, ఇవి మూత్రపిండాలలో ఉండే చిన్న వడపోత యూనిట్లు. నెఫ్రాన్లలో, రక్తం గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ అనే సంక్లిష్ట ప్రక్రియ ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ రక్తం నుండి తొలగించబడతాయి ఇవన్నీ  శరీరం నుండి మూత్రం రూపంలో విసర్జించబడతాయి. కానీ కొన్ని ఖనిజాలు,  పదార్ధాల వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. వీటిని కిడ్నీ స్ఠోన్స్ అని కూడా అంటారు. కిడ్నీ స్టోన్స్  సాధారణ లక్షణాల గురించి చాలా మందికి తెలిసినప్పటికీ, మూత్రపిండాల్లో రాళ్ల ఉనికిని సూచించే కొన్ని అసాధారణ లక్షణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధించిన కొన్ని అసాధారణ లక్షణాలేవంటే.. మూత్రంలో రక్తం ఈ లక్షణాన్ని హెమటూరియా అని పిలుస్తారు మరియు రాళ్ళు కదులుతున్నప్పుడు, మూత్ర నాళం యొక్క లైనింగ్‌ను గీసుకుపోతుంది. ఈ కారణంగా  ఇది సంభవిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాకపోయినా దీన్ని ఫేస్ చేసేవారికి ఓ రకంగా నరకం కనిపిస్తూంటుంది.  మూత్రవిసర్జనలో ఇబ్బంది.. కిడ్నీలో రాళ్లు మూత్రాశయం, మూత్రనాళానికి చికాకు కలిగిస్తాయి. ఇది మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యం,  నొప్పికి దారితీస్తుంది.  మూత్ర విసర్జన చేసేటప్పుడు ఏదైనా నొప్పి ఎదుర్కొన్నట్టైతే దాన్ని తేలిగ్గా తీసుకోకండి.  చలి, జ్వరం.. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా జ్వరం మరియు చలి అసాధారణం అయినప్పటికీ అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాళ్లు మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్‌కు కారణమైనప్పుడు  చలి, జ్వరం  వస్తుంది. ముదురు రంగులో..దుర్వాసనతో కూడిన మూత్రం కిడ్నీ స్టోన్స్ వల్ల మూత్రం కూడా దుర్వాసన వస్తుంది. ఇది మూత్ర నాళంలో బ్యాక్టీరియాతో  కలిసిపోయి ఉంటుంది, ఇది రాళ్ల వల్ల సంభవించవచ్చు. అలసట శరీరం రాళ్లను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇది చాలా ఒత్తిడి మరియు మంటను కలిగిస్తుంది, ఇది  అలసటకు దారితీస్తుంది.  తిమ్మిరి రాళ్లు మూత్ర నాళంలో నరాలపై ప్రభావం చూపినప్పుడు, అది కాళ్లు, గజ్జలు లేదా వీపులో తిమ్మిరి లేదా జలదరింపు అనుభూతిని కలిగిస్తుంది. నిలబడటం లేదా కూర్చోవడంలో ఇబ్బంది  మూత్ర నాళంలో నరాల మీద రాళ్లు ఒత్తిడి కలిగిస్తాయి. ఎక్కువసేపు నడవడం లేదా కూర్చోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు అన్నీ కాకపోయినా ఏవైనా కొన్ని ఎదురైనా తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచింది.                                       ◆నిశ్శబ్ద.