కంటి శుక్లం గురించి ఈ అపోహలు తొలగించుకోండి..!

కంటిశుక్లం అనేది కంటికి ఉండే సహజ లెన్స్ మీద ఏర్పడే తెల్లని పొర. ఇది కనుపాప వెనుక ఉంటుంది. ఇది సాధారణంగా వయస్సుతో పెరిగి వృద్దులలో వస్తుంది. కాంతిని సరిగ్గా చూడలేకపోవడం,  రంగుల విషయంలో గందరగోళం,  రాత్రి సమయంలో చూడటంలో ఇబ్బంది వంటివి కంటిశుక్లం వల్ల ఎదురయ్యే సమస్యలు.  కంటిశుక్లం దృష్టి లోపానికి గల ప్రధాన కారణాలలో ఒకటి.  ముఖ్యంగా వృద్దాప్యం వచ్చాక కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ కంటిశుక్లం గురించి చాలామంది చాలా అపోహల్లో ఉన్నారు.  ఈ అపోహల కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కంటిశుక్లం గురించి అందరూ నమ్మే అపోహల గురించి తెలుసుకుంటే.. శస్త్రచికిత్సకు ముందు కంటిశుక్లం ముదిరిపోయి ఉండాలా? నేటికాలంలో కంటిశుక్లం శస్త్రచికిత్సకు కంటిశుక్లం ముదిరిపోయే దశకు చేరుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆలస్యం చేసేకొద్ది ఆపరేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. రోజువారీ జీవితం  ప్రభావితం అవుతుంది. పైగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే కంటిశుక్లం ఇంకా ముదరకముందే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య అంతగా ఉండదని వైద్యుల మాట.  శస్త్రచికిత్స తర్వాత కంటిశుక్లం తిరిగి పెరుగుతుందా? తెల్లని పొరగా మారిన లెన్స్ తొలగించి  దాని స్థానంలో కృత్రిమ లెన్స్ (ఐఓఎల్) అమర్చిన తర్వాత, కంటిశుక్లం తిరిగి రాదు. అయినప్పటికీ, పృష్ఠ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్ (పిసిఒ) అని పిలువబడే పరిస్థితి నెలలు లేదా సంవత్సరాల తరువాత రావచ్చు. దీనిని  లేజర్ విధానంతో సులభంగా చికిత్స చేయవచ్చు. వృద్ధులకు మాత్రమే కంటిశుక్లం వస్తుందా? వృద్ధాప్యంతో కంటిశుక్లం సర్వసాధారణం అయినప్పటికీ, డయాబెటిస్, గాయం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం, ధూమపానం,  జన్యు కారణాలు  వంటి కారకాల వల్ల  యువతలో కూడా  వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతో  కంటిశుక్లంతో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయట.  కంటి చుక్కలు లేదా ఆహారంతో కంటిశుక్లం నయం చేయవచ్చా? కంటి చుక్కలు, హెర్బల్ నివారణలు లేదా ఆహార మార్పులతో కంటిశుక్లం తిప్పికొట్టవచ్చు లేదా నయం చేయవచ్చనే వాదనకు క్లినికల్ ఆధారాలు లేవట.  కంటిశుక్లం రోగులలో దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స మాత్రమే సరైనది అని వైద్యుల మాట.  కంటిశుక్లం శస్త్రచికిత్స ప్రమాదకరం లేదా బాధాకరంగా ఉంటుందా? కంటిశుక్లం శస్త్రచికిత్స అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా నిర్వహించే సురక్షితమైన విధానాలలో ఒకటి. ఇది సాధారణంగా త్వరగా అయిపోతుంది.  అనస్థీషియా కింద జరుగుతుంది.  అసౌకర్యం కూడా తక్కువ.   కొద్ది రోజుల్లోనే  దృష్టి మెరుగుపడుతుంది. రెండు కళ్ళకు ఒకేసారి శస్త్రచికిత్స చేయాలా? కంటిశుక్లం శస్త్రచికిత్సలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల విరామంతో ఒకేసారి ఒక కంటికి చేస్తారు. మొదటి శస్త్రచికిత్స ఫలితాల ఆధారంగా మరొక కంటికి చికిత్సను చేయడానికి వైద్యులకు క్లారిటీ వస్తుంది. కంటిశుక్లం ముదిరి దృష్టి పూర్తిగా కోల్పోయే వరకు ఆపరేషన్ చేయించుకోకూడదా? కంటిశుక్లం ముదిరే వరకు ఉంటే అది లైఫ్ స్టైల్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే సర్జరీ చేయించుకుంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.  కోలుకోవడానికి నెలలు పడుతుందా? నేటి కాలంలో జరిగే కంటిశుక్లం చికిత్స నుండి కోలుకోవడానికి నెలల సమయం అవసరం లేదు.  తరచుగా ఒకటి లేదా రెండు వారాలలో సాధారణ జీవనశైలికి వచ్చేస్తారు.  ఇది వ్యక్తిని బట్టి మారే అవకాశం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మీ ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత? ఇంట్లోనే ఇలా టెస్ట్ చేసుకోండి..!

మానవ శరీరంలో ఊపిరితిత్తులు  చాలా ముఖ్యమైనవి.  మనం పీల్చే గాలిని శుభ్రపరచడంలో ఊపిరితిత్తులదే కీలకమైన పాత్ర. ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోతే శ్వాస క్రియకు ఇబ్బంది కలుగుతుంది. అయితే.. నేటికాలపు రద్దీ జీవితంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. కలుషిత వాతావరణం కూడా దీనికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా  ఊపిరితిత్తులు ఎక్కువగా సఫర్ అవుతుంటాయి. గతంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వృద్ధులలో కనిపించేవి. కానీ  ఇప్పుడు చిన్నవారు,  పిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంతో సహా అనేక దేశాలలో ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD),  ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల కారణంగా 7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల పనితీరును  ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యలను పెద్దవి కాకుండా చూసుకోవచ్చు.  BOLT అనే విధానం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంట్లోనే చెక్ చేసుకునేందుకు సహాయపడుతుంది. దీన్నెలా చేసుకోవాలో తెలుసుకుంటే.. BOLT అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవల్ టెస్ట్ స్కోర్.  దీని సహాయంతో ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో,  వాటికి ఏదైనా ప్రమాదం ఉందా అని తెలుసుకోవచ్చు. BOLT (బాడీ ఆక్సిజన్ లెవల్ టెస్ట్) అనేది  కార్బన్ డయాక్సైడ్ టాలరెన్స్‌ను కొలిచే ఒక సులభమైన, సెల్ఫ్ టెస్ట్.  శ్వాసను ఎంతసేపు హాయిగా పట్టుకోగలరో ఇది తెలియజేస్తుంది. శ్వాసను పట్టుకోగల సమయం  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుపుతుంది. 10 కంటే తక్కువ BOLT స్కోరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అని వైద్యులు అంటున్నారు. బోల్ట్ పరీక్ష ఎలా చేయాలి? ఈ పరీక్ష చేయడానికి ముందుగా ఎటువంటి ఆటంకాలు లేని నిశ్శబ్దమైన,  సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తరువాత శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉండే భంగిమలో కూర్చోవాలి. సాధారణంగా  దీర్ఘంగా  శ్వాస తీసుకొని హాయిగా గాలిని వదిలివేయాలి. తరువాత ఇప్పుడు గాలి  ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా మీ వేళ్ళతో మీ ముక్కును మూసివేసి  టైమర్‌ను ప్రారంభించాలి.  ఊపిరి పీల్చుకోవాలనే తపన ప్రారంభమైనప్పుడు,  ఛాతీ బిగుసుకుపోవడం ప్రారంభించినప్పుడు, టైమర్‌ను ఆపివేయాలి.  శ్వాసను పట్టుకున్న సెకన్ల సంఖ్య  బోల్ట్ స్కోరు అవుతుంది. ఈ పరీక్షను తక్కువ వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు రిపీట్  చేసి, మూడు స్కోర్‌ల సగటును తీసుకోవాలి. బోల్ట్ స్కోర్ ఎంత ఉండాలి? ఎంత ఉండకూడదు?  ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి ఈ స్కోరు ఏమి చెబుతుందంటే..  బోల్ట్ స్కోరు 20 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని సూచిస్తుంది. 10-20 సెకన్ల స్కోరు అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం సాధారణంగానే ఉంది కానీ మెరుగుదల అవసరం. 10 సెకన్ల కన్నా తక్కువ స్కోరు ఉంటే శ్వాస సామర్థ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించి  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసా?

  ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎంత కామనో.. పళ్లు తోమగానే కాఫీ లేదా టీ చేసుకుని తాగడం అంతే కామన్.  ఇంట్లో చాలా వరకు కాఫీ, టీ లవర్స్ ఉంటారు. వీరికి బ్రష్ చేయకపోయినా సరే.. కాఫీ లేదా టీ మాత్రం టైంకి ఖచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీ ప్రియులు ఎక్కువైపోయారు. కాఫీ నుంచి టీకి జంప్ అవుతున్నవారు కూడా ఉంటారు. మొత్తానికి నగరాల నుండి గ్రామాల వరకు టీ హడావిడి ఎక్కువ.  వివిధ ప్రాంతాల నుండి దిగుమతి అయ్యే టీ ఆకులతో టీ చేసుకుని ఆస్వాదించాలంటే చాలా ఇష్టం చూపిస్తుంటారు.  ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం చాలామంది అలవాటు.  కానీ ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే ఆలోచన మాత్రం చాలామంది చేయరు. అసలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? దీని గురించి తెలుసుకుంటే..   ఖాళీ కడుపుతో టీ.. ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తిన్నా, తాగినా అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకే  చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం, ఉసిరి  రసం వంటి వాటిని గోరువెచ్చని నీటిలో కలిపి  తీసుకుంటారు. అయితే చాలా మంది ఖాళీ కడుపుతో టీ తాగుతుంటారు. టీలో ఉండే కెఫిన్,  టానిన్ వంటివి  కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. దీని కారణంగా  రోజంతా కడుపులో బరువుగా లేదా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు టీ తాగితే అది నేరుగా కడుపు లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. ఇది చికాకు, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను కలిగిస్తుంది.   కడుపు పూతలు.. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు టీలో ఉండే టానిన్, కెఫిన్ కడుపులోని ఆమ్లాన్ని పెంచుతాయి. సాధారణంగా కడుపులో కొద్ది మొత్తంలో ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ ఖాళీ కడుపుతో టీ తాగితే ఈ ఆమ్లం ఎక్కువ పరిమాణంలో ఏర్పడుతుంది.  ఇది కడుపు లోపలి పొరలో చికాకు కలిగిస్తుంది. ఇది చాలా కాలం పాటు జరిగితే కడుపు గోడ బలహీనపడి అల్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారికి అసిడిటీ, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. కడుపులో ఏర్పడే ఆమ్ల ప్రభావం తగ్గడానికి టీ తాగే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవడం మంచిది.   జీర్ణ సమస్య.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు టీలో ఉండే కెఫిన్ నేరుగా కడుపు గోడ ద్వారా శోషించబడుతుంది.  దీని కారణంగా ఇది తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది కడుపు తిమ్మిరి, మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే గ్రంథుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణ రసాల సమతుల్యత దెబ్బతింటుంది.  ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది.  పోషకాలు సరిగ్గా గ్రహించబడవు.   ఎముకల ఆరోగ్యం.. టీలో ఉండే కెఫిన్ ఎక్కువ తీసుకుంటే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. ఎందుకంటే టీ శరీరంలో నేరుగా శోషించబడుతుంది. ఎముకలలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాలు లోపిస్తాయి. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు సాధారణంగానే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం లోపం వల్ల ఎముకల నొప్పి, కీళ్ల దృఢత్వం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో  టీ తాగేవారు జాగ్రత్త.   - రూపశ్రీ  

రక్తపోటుకు చెక్ పెట్టాలంటే ఏం తినాలి?

రక్తపోటు నేటికాలంలో చాలా సాధారణం అయిపోయింది.  ఒకప్పుడు వయసుతో పాటు పెద్దవారికి మాత్రమే రక్తపోటు వచ్చేది.  తరువాత మధ్యవయసు వారిలో రక్తపోటు రావడం మొదలైంది. కానీ ఇప్పట్లో మాత్రం యువతలో ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలలో కూడా రక్తపోటు బయటపడుతూ ఉంటుంది.  సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రక్తపోటు ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు తినాలని వైద్యులు చెబుతుంటారు.  అయితే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు ఏంటి?  ఏ ఆహారాలు తినాలి?  తెలుసుకుంటే.. తినాల్సిన ఆహారాలు.. అరటిపండ్లు.. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది.  సులభంగా లభిస్తాయి, చవకైనవి కూడా. అన్ని రకాల వయసుల వారికి  అనువైనవి. అరటిపండ్లను స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లలో కలపడం  లేదా వాటిని నేరుగా  తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరులో సహజ  ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి.   ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.  అటు హైడ్రేట్ గా ఉంచుతూ.. రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  పాలకూర.. పాలకూరలో  పొటాషియం, ఐరన్ తో పాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే రక్తపోటును చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. దోసకాయ.. దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది.  కేలరీలు తక్కువగా  ఉంటాయి.  పైగా ఇది  హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో  ఉంచడానికి సహాయపడుతుంది.  టమోటాలు.. టమోటాలు  భారతీయ వంటకాల్లో  విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే టమోటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  టమోటాలను కూరల్లోనే కాకుండా జ్యూస్ కూడా చేసుకుని తాగవచ్చు. ఎక్కువ రక్తపోటు ఉన్నవారికి ఇలా జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఉపశమనం  ఇస్తుంది. పెరుగు.. పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ మాత్రమే కాదు..  ఇందులో  పొటాషియం కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.  శరీరానికి పోషణ కూడా ఇస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మెగ్నీషియం శరీరానికి ఎందుకంత ముఖ్యం? మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలేంటి?

మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శక్తి ఉత్పత్తి, కండరాలు,  నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణ,  ఎముక ఆరోగ్యంతో సహా శరీరంలో 300 కి పైగా జీవరసాయన ప్రతిచర్యలలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం అలసట, కండరాల తిమ్మిరి, చిరాకు, హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం, మానసిక రుగ్మతలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. శరీరం సహజంగా మెగ్నీషియంను ఉత్పత్తి చేయదు.  దీన్ని ఆహారం నుండి పొందాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుంటే.. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు.. బచ్చలికూర.. బచ్చలికూర మెగ్నీషియం పవర్హౌస్. బచ్చలికూరలో  ఐరన్, ఫోలేట్,  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది గుండె, ఎముక,  మెదడు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది.  బాదం.. కేవలం గుప్పెడు బాదం లో సుమారు 80 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో  ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్,  విటమిన్ ఇ  కూడా సమృద్ధిగా ఉంటాయి. బాదం మెదడు పనితీరు,  శక్తి స్థాయిలకు  మద్దతు  ఇస్తుంది. గుమ్మడికాయ విత్తనాలు..  28 గ్రాముల గుమ్మడి విత్తనాలలో   150 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో  యాంటీఆక్సిడెంట్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె,  ప్రోస్టేట్ ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పెరుగు లేదా  స్వీట్స్ లలో వీటిని జోడించుకోవచ్చు. అవోకాడోస్.. ఒక మీడియం అవోకాడోలో పొటాషియం, ఫైబర్,  గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో పాటు 58 మి.గ్రా మెగ్నీషియం కూడా ఉంటుంది. అవోకాడోస్ జీవక్రియకు చాలా హెల్ప్  చేస్తాయి, మంటను తగ్గిస్తాయి.  ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్.. మంచి-నాణ్యత గల డార్క్ చాక్లెట్ రుచికరమైనది మాత్రమే కాదు  మెగ్నీషియం సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది ఔన్సుకు 64 మి.గ్రా  మెగ్నీషియం అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.  ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి,  హృదయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.  అరటిపండ్లు.. పొటాషియం కోసం అరటిపండ్లు చాలా మంచి ఎంపిక.  ఒక మీడియం సైజు అరటిపండులో  32 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. అవి కండరాల పనితీరుకు మద్దతును, శక్తిని ఇస్తాయి.  వ్యాయామం తర్వాత అరటిపండు తినేది ఇందుకే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం రాకుండా ఉంటుంది.  మెగ్నీషియం  లోపం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడినట్టు ఉంటుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

స్లిప్ డిస్క్.. ఈ సమస్య మీకు ఉందో లేదో తెలుసుకోండి..!

ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా వెన్నునొప్పి, నడుము నొప్పి అనే ఫిర్యాదులు చేయడం చూస్తూనే ఉన్నాం.  వెన్నునొప్పి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది క్రమంగా పెరుగుతుంది. ఈ నొప్పి శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రోజువారీ వనులు చేసుకోవడంలో  కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఇలాంటి వెన్ను నొప్పి వెనుక స్లిప్ డిస్క్ లాంటి తీవ్రమైన సమస్య కూడా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం  ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.  అసలు స్లిప్ డిస్క్ అంటే ఏమిటి? ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది? దీన్నెలా గుర్తించాలి? పూర్తీగా తెలుసుకుంటే.. స్లిప్ డిస్క్.. స్లిప్డ్ డిస్క్‌ను వైద్య భాషలో 'హెర్నియేటెడ్ డిస్క్' అని కూడా అంటారు. వెన్నెముక ఎముకల మధ్య ఉన్న కుషన్ లాంటి డిస్క్ దాని స్థానం నుండి జారిపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ డిస్క్ మృదువైన, జెల్లీ లాంటి నిర్మాణం, ఇది ఎముకలు ఒకదానికొకటి రాపిడి కాపాడుతుంది. ఎముకలు సజావుగా కదలడానికి కారణం అవుతుంది. ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు లేదా దాని స్థానం నుండి జారిపోయినప్పుడు అది సమీపంలోని నరాలపై ఒత్తిడి తెస్తుంది, దీని కారణంగా నడుము నుండి పాదాల వరకు తీవ్రమైన నొప్పి, తిమ్మిరి,  బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కారణాలు.. డిస్క్ జారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని  రోజువారీ అలవాట్లకు సంబంధించినవి, అతి పెద్ద కారణం కూర్చోవడం లేదా తప్పు మార్గంలో వంగడం. దీనితో పాటు బరువైన వస్తువులను, ముఖ్యంగా తప్పు మార్గంలో ఎత్తడం వల్ల, డిస్క్ పై అదనపు ఒత్తిడి పడుతుంది. వయస్సు పెరగడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వయస్సుతో డిస్క్ బలం తగ్గడం ప్రారంభమవుతుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం,  కొన్నిసార్లు ఆకస్మిక గాయాలు కూడా డిస్క్ జారిపోవడానికి కారణం అవుతాయి. స్లిప్ డిస్క్ సంకేతాలు.. నడుము,  వెన్నునొప్పి స్లిప్ డిస్క్ కు సంబంధించినదా కాదా అని తెలుసుకోవడానికి సరైన లక్షణాలను గుర్తించాలి. అత్యంత సాధారణ లక్షణం ఎప్పుడూ  తీవ్రమైన నొప్పి కలిగి ఉండటం. ఇది నడుము నుండి ప్రారంభమై కాళ్ళ వరకు వెళుతుంది. దీనిని సయాటికా అని కూడా అంటారు. దీనితో పాటు, చాలా మందికి కండరాలలో తిమ్మిరి, జలదరింపు లేదా బలహీనత కూడా అనిపించవచ్చు. అలాగే, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడంలో ఇబ్బంది ఉన్నా,  లక్షణాలు ఎక్కువసేపు కొనసాగినా వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది. స్లిప్ డిస్క్ ఎవరికి వచ్చే ప్రమాదం ఉంటుంది? శారీరక శ్రమలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చే లేదా గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చునే ఐటీ నిపుణులు, డ్రైవర్లు,  కార్యాలయ ఉద్యోగులు వంటి వారిలో స్లిప్ డిస్క్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య భారీ బరువులు ఎత్తే కార్మికులు లేదా అథ్లెట్లలో కూడా కనిపిస్తుంది. ముందు జాగ్రత్తలు.. స్లిప్ డిస్క్‌ రాకుండా ఉండాలంటే  దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. మొదటగా సరైన పద్ధతిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కుర్చీపై కూర్చున్నప్పుడు  వీపును నిటారుగా ఉంచాలి.  ప్రతి 30-40 నిమిషాలకు కాస్త అటు ఇటు నడవాలి. బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు  నడుముపై కాకుండా  మోకాళ్లపై ఒత్తిడి ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్  చేయడం వల్ల  వెన్నెముక బలోపేతం అవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఏం చేసినా దగ్గు తగ్గడం లేదా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

దగ్గు చాలా సాధారణంగా వచ్చే సమస్య. దగ్గు వస్తే సుమారు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ దగ్గు తగ్గకుండా ఎక్కువ కాలం ఉంటే మాత్రం అది చాలా ఇబ్బంది పెడుతుంది. దీర్ఘకాలిక దగ్గు అనేది జలుబు, ఫ్లూ, కోవిడ్ -19 లేదా శ్వాసకోశ ఇన్పెక్షన్ వంటి  సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆ సమస్యలు తగ్గిన తరువాత కూడా కొన్నిరోజులు ఉంటుంది. ఈ రకమైన దగ్గు పొడిగా లేదా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సాధారణంగా శ్వాసనాళం  మంట, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గొంతులో  సున్నితంగా మారడం వల్ల వస్తుంది. ఇది అంత ప్రమాదకరమైన సమస్య కాకపోయినా ఉన్నన్నాళ్లు చాలా ఇబ్బంది పెడుతుంది.  ఈ సమస్యను సులువుగా చెక్ పెట్టడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. దీర్ఘకాలిక దగ్గుకు ప్రభావవంతమైన చిట్కాలు.. హైడ్రేట్ గా ఉండాలి.. పుష్కలంగా ద్రవాలు త్రాగటం వల్ల  శ్లేష్మం పల్చబడుతుంది.  ఇది  గొంతు పొడిబారడాన్ని తగ్గించడానికి,  వాయుమార్గాలలో చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. హెర్బల్  టీలు, సూపులు లేదా నిమ్మకాయ, తేనెతో వెచ్చని నీరు వంటి వెచ్చని ద్రవాలు గొంతుకు చాలా మంచి ఉపశమనం కలిగిస్తాయి. హైడ్రేటెడ్ గా ఉంటే  రోగనిరోధక పనితీరు బలంగా ఉంటుంది. శరీరానికి వచ్చే జబ్బులు వేగంగా నయం కావడానికి అనువుగా ఉంటుంది.  నిద్రవేళకు ముందు తేనె.. తేనె యాంటీమైక్రోబయల్,  ఓదార్పు లక్షణాలతో  దగ్గును సహజంగానే అణిచివేస్తుంది. నిద్రవేళకు ముందు ఒక చెంచా తేనే తీసుకోవాలి. ఇది గొంతు లోపల పూత లాగా ఏర్పడి రాత్రిపూట దగ్గును తగ్గిస్తుంది.  నిద్రను మెరుగుపరుస్తుంది. అదనపు ప్రయోజనం కోసం గోరువెచ్చని నీరు, పసుపు లేదా అల్లం రసంతో  కలిపి తీసుకోవచ్చు.  కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. నిద్ర చిట్కా.. తలను ఎత్తుగా ఉంచి నిద్రపోవడం వల్ల  గొంతులో శ్లేష్మం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే  దగ్గును ప్రేరేపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పీల్చడం పొడి, చికాకు కలిగించే వాయుమార్గాలను తేమ చేయడానికి,  శ్లేష్మాన్ని బయటకు రప్పించడానికి  సహాయపడుతుంది. అలాగే  గదిలో హ్యూమిడిఫైయర్ను ఉపయోగించడం గాలికి తేమను కూడా జోడిస్తుంది. ఇది పొడి దగ్గును తగ్గిస్తుంది, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ లేదా శీతాకాల వాతావరణంలో మంచిది.  ఉప్పు నీటి పుక్కిలింత.. రోజూ కొన్నిసార్లు గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించాలి.  ఇలా  చేయడం వల్ల గొంతు మంట తగ్గుతుంది. శ్లేష్మం సడలుతుంది,  చికాకులను బయటకు పంపుతుంది. ట్రిగ్గర్లు.. దుమ్ము, పొగ, సుగంధ ద్రవ్యాలు,  కాలుష్యం వంటి సాధారణ విషయాలు దీర్ఘకాలిక దగ్గును మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ ట్రిగ్గర్లను నివారించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలి.  కలుషితమైన వాతావరణంలో బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ఉపయోగించాలి. అల్లం లేదా పసుపు టీ .. అల్లం,  పసుపు రెండూ శక్తివంతమైన శోథ నిరోధక,  యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో తయారుచేసిన టీలను సిప్ చేయడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. మంటను తగ్గించడానికి,  దగ్గుకు కారణమయ్యే ఏదైనా ఇన్పెక్షన్ తో  పోరాడటానికి సహాయపడుతుంది.  శ్వాస వ్యాయామాలు.. సున్నితమైన శ్వాస వ్యాయామాలు.. ముఖ్యంగా నెమ్మదిగా,  లోతైన శ్వాసలపై దృష్టి సారించే వ్యాయామాలు శ్వాసకోశ వ్యవస్థను రిపేర్ చేయడానికి, దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మీకు గుడ్లు తినడం అలవాటు లేదా? గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!

గుడ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.  పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరు గుడ్లు తినడానికి అనువుగా ఉంటాయి.  ముఖ్యంగా పోషకాహార లోపం రాకూడదంటే పిల్లలకు చిన్నతనం నుండే రోజుకు ఒక గుడ్డు తప్పనిసరిగా ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతుంటారు.  పైగా గుడ్లతో బోలెడు రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. కానీ అందరూ గుడ్లను తినలేరు. భారతదేశంలో శాకాహార ఆహారాన్ని అనుసరించేవారు కూడా ఉన్నారు.  కనీసం గుడ్డును కూడా తినని వారు ఉన్నారు. ఇలాంటి వారు ప్రోటీన్ ఫుడ్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు.  అయితే  గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఉన్నాయి. ఒక  గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది.  అయితే ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న శాకాహార ఆహారాలు ఉన్నాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన 4 సూపర్ ఫుడ్స్ ఎంటో తెలుసుకుంటే.. శనగలు..   భారతీయుల  ఆహారంలో అద్బుతం అని చెప్పదగినవి శనగలు.  వీటిలో  ప్రోటీన్ కంటెంట్ అమోఘం. అర కప్పు శనగలలో  దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. భారతీయులు అయితే శనగలను చాలా బాగా వండేస్తారు.  చోలే కూర,  ఉడికించిన శనగలను స్నాక్స్ గానూ, వేయించిన శనగలను టైం పాస్ గా తినడం కోసం.. ప్రోటీన్ పౌడర్ గానూ.. ఇలా చాలా రకాలుగా శనగలను తినవచ్చు. పనీర్.. పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.అటువంటి పాల నుండి తయారయ్యే పనీర్ లో కూడా ప్రోటీన్ మెరుగ్గా ఉంటుంది. అరకప్పు   కాటేజ్ జున్నులో  దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  భారతీయులు పనీర్ ను కూరల్లోనూ,  శాండ్విచ్ ల తయారీ లోనూ, స్నాక్స్ గానూ, రకరకాల తినుబండారాలుగా, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.  తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ను ఎంచుకుంటే మరింత ఆరోగ్యం. బాదం..  ప్రోటీన్ కంటెంట్ను పెంచడానికి బాదం గ్రేట్గా సహాయపడుతుంది. బాదం బటర్ కూడా తయారు చేసుకుని వాడవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బాదం బటర్ లో  7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.   గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు బాదంలో ఉంటాయి. బాదంను చాలామంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు.  అలా కాకుండా.. బాదం ను స్నాక్స్ గానూ,  బాదం బటర్ తయారు చేసుకుని,  స్వీట్స్ లోనూ, ప్రోటీన్ పౌడర్ లోనూ వినియేగించవచ్చు. గుమ్మడి గింజలు.. గుమ్మడికాయ విత్తనాలు చాలా స్పెషల్.. వీటిని  ఏదైనా సలాడ్, డెజర్ట్ లేదా స్మూతీలలో ఈజీగా జోడించవచ్చు. పొట్టు తీసిన  ఔన్స్ గుమ్మడి గింజలలో 8.5 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. అవి జింక్, ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం,  సెలీనియం కూడా అందిస్తాయి, ఇవి వోట్మీల్, పాయసం, స్వీట్స్ స్నాక్స్ లలో జోడించుకోవచ్చు.  లేదంటే నానబెట్టిన బాదంతో పాటు రోజూ గుమ్మడి గింజలను కూడా తినవచ్చు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వంటల్లో వాడే ఇంగువ గురించి ఈ నిజాలు తెలుసా?

ఇంగువ భారతీయ వంటగదిలో ఒక ముఖ్యమైన పదార్థం.  ఇది ఆహార రుచిని పెంచడంతో పాటు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా సమస్యలకు వైద్యంగా ఇంగువను వాడతారు.  మరీ ముఖ్యంగా సంప్రదాయ వంటకాలలో, దేవుడి కోసం చేసే వంటకాలలో ఇంగువ తప్పక వాడుతుంటారు.  అయితే కేవలం దైవ సంబంధంగానూ,  ఆహారానికి రుచి ఇవ్వడం అనే విషయం గానూ కాకుండా ఆరోగ్యపరంగా చూస్తే ఇంగువ అద్బుతమైన ఔషధం అని చెప్పవచ్చు.   ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఇంగువ వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.. ఇంగువ వల్ల కలిగే  అతిపెద్ద ప్రయోజనం జీర్ణవ్యవస్థను రిపేర్ చేయడం. గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆహారంలో చిటికెడు ఇంగువ  చేర్చడం లేదా వేడినీటిలో కరిగించి తాగడం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి. కడుపులో గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం.. ఇంగువ సహజంగా యాంటీ-ఫ్లాట్యులెంట్. ఇది కడుపులో వాయువు ఏర్పడకుండా నిరోధిస్తుంది. గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల అపానవాయువు, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. వాపు,  నొప్పిని తగ్గిస్తుంది.. ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, తలనొప్పి,  శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇంగువ పేస్ట్ తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంగువలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. జలుబు, ఇతర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తుంది.. ఇది శ్లేష్మాన్ని పలుచన చేయడానికి,  శ్లేష్మం రాకుండా చేయడానికి  సహాయపడుతుంది. తద్వారా ఉబ్బసం, బ్రోన్కైటిస్,  దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇంగువ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది,  రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది.. ఇంగువ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. పీరియడ్స్ సమస్యలకు ఉపశమనం.. ఇంగువ మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది, అలాగే పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు దోహదపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువ, తేనె కలిపి తాగడం వల్ల తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం,  జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.. ఇంగువలో  యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలు,  మరకలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది నెత్తిని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కీటకాల కాట్లు,  గాయాలకు సహాయపడుతుంది.. ఇంగువను  పేస్ట్ గా చేసి  అప్లై చేయడం వల్ల కీటకాల కాటు వల్ల కలిగే చికాకు,  దురద నుండి ఉపశమనం లభిస్తుంది.                                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ప్రతి సంవత్సరం దోమల ద్వారా వ్యాపించే అతి పెద్ద మూడు వ్యాధులు ఇవే..!

  వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్-అక్టోబర్ వరకు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కారణంగా ఆసుపత్రులలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుల అభిప్రాయం ప్రకారం, దోమ కాటు వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యాధులలో చాలా వాటికి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు.  వైద్యులు లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఆ సమస్యకు ఉపశమనం కలిగేలా చేస్తారు. డెంగ్యూ, చికున్‌గున్యా, జికా అనేవి మూడు ప్రమాదకరమైన వ్యాధులు. వీటికి ఇంకా శాశ్వత చికిత్స లేదా టీకా లేదు. అందుకే వైద్యులు ప్రజలందరూ నివారణ చర్యలు పాటించాలని సలహా ఇస్తూ ఉంటారు. ఈ వ్యాధులతో అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం లాగా ఉంటాయి. కానీ క్రమంగా అవి ప్రాణాంతక రూపాన్ని తీసుకువే అవకాశం ఉంటుంది.  డెంగ్యూలో ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితులలో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. చికున్‌గున్యా నెలల తరబడి కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. అయితే జికా వైరస్ గర్భిణీ స్త్రీలు,  పిల్లలకు జీవితాంతం ముప్పు కలిగిస్తుంది. అంటే, ఇవి కేవలం వ్యాధులు మాత్రమే కాదు, తీవ్రమైన ఆందోళన కలిగించే సమస్యలు. ఈ మూడింటికి ఖచ్చితమైన చికిత్స లేనందున, వైద్యులు లక్షణాలను మాత్రమే నియంత్రిస్తారు. డెంగ్యూ ప్రమాదం.. డెంగ్యూ అనేది ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. భారతదేశంలో వర్షాకాలంలో,  వర్షం తర్వాత ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. డెంగ్యూ వచ్చిన రోగులకు అధిక జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక,  కండరాలు,  కీళ్లలో నొప్పితో పాటు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఇది రక్తస్రావం జ్వరం లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌కు కూడా కారణమవుతుంది. ఇందులో, ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంది. ఇది శరీరంలో అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. డెంగ్యూకు నిర్దిష్ట చికిత్స లేదు. దీని చికిత్సలో జ్వరాన్ని తగ్గించడం, ప్లేట్‌లెట్లు తగ్గకుండా నిరోధించడం,  శరీరంలో నీటి కొరతను తీర్చడంపై మాత్రమే దృష్టి పెడతారు. చికున్‌గున్యా ప్రభావం.. డెంగ్యూ లాగే చికున్‌గున్యా కూడా ప్రమాదకరమైనది.  దీనికి ఖచ్చితమైన చికిత్స కూడా లేదు. చికున్‌గున్యా లక్షణాలు అకస్మాత్తుగా అధిక జ్వరం, తలనొప్పి, అలసట, చర్మంపై దద్దుర్లు,  కీళ్ల నొప్పులు,  వాపు. ఈ వ్యాధి తక్కువ ప్రాణాంతకం అయినప్పటికీ దీని వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం దీర్ఘకాలిక నొప్పి,  బలహీనత. చాలా మంది రోగులు నెలల తరబడి నడవలేరు. చికున్‌గున్యాకు ప్రత్యక్ష చికిత్స లేదా టీకా కూడా లేదు. రోగులకు నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ ఇస్తుంటారు. విశ్రాంతి, తగినంత నీరు త్రాగడం  పోషకమైన ఆహారం తినాలి. జికా వైరస్.. జికా వైరస్ వ్యాప్తి గురించి చాలా వార్తు వస్తుంటాయి. ఇది ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా, ఈ వ్యాధి తేలికపాటి జ్వరం, కళ్ళు ఎర్రబడటం (కండ్లకలక), తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు,  కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. అయితే ఇది గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు చాలా ప్రమాదకరం. గర్భిణీ స్త్రీకి జికా వైరస్ వస్తే.. బిడ్డకు మైక్రోసెఫాలీ వంటి తీవ్రమైన పరిస్థితి రావచ్చని, దీనిలో పిల్లల తల,  మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదని WHO నివేదికలు చూపిస్తున్నాయి. జికాకు నిర్దిష్ట చికిత్స లేదా టీకా లేదు. రోగి లక్షణాలను తగ్గించే మందులు తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం,  తగినంత ద్రవాలు తీసుకోవడం మాత్రమే మార్గం. ఈ మూడు వ్యాధుల నుండి నివారణ మాత్రమే ప్రభావవంతమైన మార్గం అని వైద్యులు అంటున్నారు. దీని కోసం దోమతెరలను ఉపయోగించడం,ఫుల్ హ్యాండ్స్ దుస్తులు ధరించడం,  ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా ఉండటం చాలా ముఖ్యం.  *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వర్షాకాలంలో ఈ  ఆహారాలు తీసుకోండి.. ఇమ్యూనిటీ సూపర్ గా పెరుగుతుంది..!

    వర్షాకాలం వేడి నుండి చాలా  ఉపశమనాన్ని తెస్తుంది.  కానీ దాన్ని ఆస్వాదించే లూపే  ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వాతావరణంలో పెరిగిన తేమ ఇన్ఫెక్షన్ కలిగించే జీవులు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందువల్ల  రోగనిరోధక శక్తిని ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం.  ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల శరీరం జలుబు, ఫ్లూ,  ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వర్షాకాలంలో ఇమ్యూనిటీ బంలగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారాల గురించి తెలుసుకుంటే.. వర్షాకాల తీసుకోవాల్సిన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు  పసుపు..  దాని శోథ నిరోధక,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వర్షాకాలంలో పసుపు పాలు తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ చాలా మెరుగ్గా ఉంటుంది. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మకాయలు, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి చాలా అవసరం. ఉసిరి.. ఇండియన్ గూస్బెర్రీ అని ఉసిరి కాయను పిలుస్తారు.  విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి,  జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉసిరికాయను  పచ్చిగా, రసంగా లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. మునగ ఆకులు.. ఆహారం ద్వారా వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి మునగ సహాయపడుతుంది. మునగ ఆకులు కాలేయ ఆరోగ్యాన్ని పెంచడానికి, కడుపు నొప్పిని తగ్గించడానికి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి,  రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ప్రోబయోటిక్ ఆహారాలు.. పెరుగు,  మజ్జిగ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. తులసి.. తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక.  తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవచ్చు.  లేదా తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. వెల్లుల్లి.. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు వెల్లుల్లి చాలా ప్రసిద్ధి.  వెల్లుల్లిని వంటలలో జోడించడం కంటే కూడా పచ్చిగా తినడం చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 మైగ్రేన్ వేధిస్తోందా? ఈ అలవాట్లతో మాయమవుతుంది..!

  నేటి వేగవంతమైన జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి. ఇల్లు, ఆఫీస్, పిల్లలు,  రిలేషన్స్  మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, తప్పించుకోలేనివి. ఇవన్నీ ఎప్పుడైనా కాస్త ఒత్తిడిగా అనిపిస్తే చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు.  అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాకపోయినా  మైగ్రేన్‌ అనేది ఒక విధమైన తలనొప్పి. ఈ మైగ్రేన్ వల్ల ప్రతి రోజు చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పికి మాత్రమే కాకుండా వికారం, అలసట,  కాంతి లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటివి కూడా జరుగుతాయి.  దీనిని మందులు మరియు సరైన జీవనశైలితో నియంత్రించవచ్చు. మంచి ఆరంభం.. మంచి ఆరంభం మొత్తం రోజు శక్తిని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ  నిర్దిష్ట సమయంలో మేల్కొలపడం అలవాటు చేసుకోవాలి. అది రోజు మొత్తం శక్తిని నిర్ణయిస్తుంది. మేల్కొన్న వెంటనే ఫోన్ లేదా స్క్రీన్ వైపు చూడకూడదు. కొన్ని నిమిషాలు గడిచిన తరువాత  యోగా లేదా ధ్యానం కోసం కనీసం  10-15 నిమిషాలు సమయం కేటాయించాలి. అనులోమ-విలోమ,  భ్రమరి వంటి ప్రాణాయామాలు ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ తీవ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. అల్పాహారం చాలా ముఖ్యం.. ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉంటే మైగ్రేన్ త్వరగా వస్తుంది. కాబట్టి అల్పాహారం మిస్ అవ్వకూడదు. ఓట్స్, జావ, పండ్లు లేదా మొలకలు లేదా ఇతర టిఫిన్స్  వంటి పోషకమైన అల్పాహారం మాత్రమే తినాలి. టీ-కాఫీ,  ఎనర్జీ డ్రింక్స్ మానుకోవాలి. ఎందుకంటే అధిక కెఫిన్ కూడా ఈ తలనొప్పిని పెంచుతుంది. స్క్రీన్ కు దూరం.. నిరంతరం స్క్రీన్ వైపు చూడటం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. కానీ ఆఫీసులో నిరంతరం స్క్రీన్ వైపు చూడటం  తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో ప్రతి 30 నిమిషాలకు 1-2 నిమిషాలు మీ కళ్ళను స్క్రీన్ నుండి మరల్చాలి.  వీపు నిటారుగా ఉండాలి, స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి.  పాదాలు నేలపై ఉండాలి. నీరు..   మైగ్రేన్‌లో రోజంతా తగినంత నీరు త్రాగడం ముఖ్యం.  ఎందుకంటే డీహైడ్రేషన్ మైగ్రేన్‌ను పెంచుతుంది. ఒత్తిడి మధ్య ప్రశాంతంగా ఉండటానికి, లోతైన శ్వాస తీసుకోవాలి.  వాకింగ్ లేదా ఇష్టమైన సంగీతాన్ని వినడం వంటివి మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే మైగ్రేన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ట్రిగ్గర్‌లు. మైగ్రేన్ ట్రిగ్గర్‌లు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి.  ఎక్కువ వెలుగు, పెద్ద శభ్దాలు,  ఆకలి, కాలానుగుణ మార్పులు,  ఎక్కువ స్క్రీన్ చూడటం వంటివి. మైగ్రేన్ వచ్చినరోజు ఆహారం, నిద్ర సమయం, ఒత్తిడి, వాతావరణం,  స్క్రీన్ సమయం గమనించాలి. ఇది మైగ్రేన్ ట్రిగ్గర్‌ను తెలుసుకోవడానికి  సహాయపడుతుంది. సాయంత్రం.. రోజంతా  హడావిడిగా గడిచిన  తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి తేలికపాటి నడక, తోటపని, పెయింటింగ్ లేదా  విశ్రాంతినిచ్చే ఏదైనా ఇతర పని చేయాలి. నిద్ర.. తగినంత నిద్ర మైగ్రేన్ రోగులకు ఔషధం కంటే తక్కువ కాదు. కాబట్టి 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. గది వెలుతురు మసకగా,  వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అయితే మైగ్రేన్ మాయమవుతుంది.                          *రూపశ్రీ.

ఎక్కువ సేపు కూర్చునే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు..!

ఎక్కువ సేపు కూర్చోవడం.. చాలా మంది దీని గురించి పెద్దగా ఆలోచించరు కానీ.. ఆఫీసుల్లో, ఇంట్లో ఇట్లా చాలా చోట్ల గంటల కొద్దీ ఎక్కువ సేపు ఒకేచోట కూర్చొంటారు.  ఆఫీసుల్లో సిస్టమ్ ల ముందు, ఇంట్లో టీవీ ల ముందు గంటల కొద్ది కూర్చోవడం చాలా మందికి చాలా కామన్ గా ఉంటుంది.  స్త్రీలతో పోలిస్తే మగవాళ్లు ఇలా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం  అనేది ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇలా ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం అనేది ఆరోగ్యానికి చాలా చెడ్డది అంటున్నారు వైద్యులు.  ఇది  శరీరానికి, మనసుకి కూడా హానికరమట. దీని వెనుక  వైద్య కారణాలు,  ఆరోగ్య సమస్యలు చాలా  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. శరీరంపై ప్రభావం.. రక్త ప్రసరణ తగ్గిపోవడం.. ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలో, వెన్నులో రక్తం సరైన రీతిలో ప్రసరించదు. దీని వల్ల deep vein thrombosis (DVT) అనే రక్త గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యం దెబ్బతినడం.. కదలికలు లేని జీవన శైలి వల్ల శరీరంలో కొవ్వు నిల్వ ఎక్కువ అవుతుంది. దీని వల్ల రక్తపోటు, హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. బరువు పెరగడం (Obesity) శరీరం కాలరీలు ఖర్చు చేయకపోవడం వలన అదనపు కొవ్వు పేరుకుపోతుంది. ఇది అధిక బరువుకు,  తద్వారా ఊబకాయానికి దారి తీస్తుంది.  దీని వల్ల మధుమేహం (Type-2 Diabetes) వచ్చే అవకాశాలు ఎక్కువ. మసిల్స్, ఎముకల బలహీనత.. ఎక్కువ సేపు కూర్చోవడం వలన వెన్ను, మెడ, భుజాలు నొప్పులు వస్తాయి. ఎముకలు బలహీనపడి osteoporosis వచ్చే ప్రమాదం ఉంటుంది. మెదడుపై ప్రభావం.. రక్త ప్రవాహం తగ్గడం వలన మెదడుకు తగిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దీని వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి  తగ్గిపోతాయి. మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. ఒత్తిడి, ఆందోళన  పెరగడం.. శరీర కదలికలు తగ్గిపోతే హ్యాపీ హార్మోన్స్ గా పరిగణించే సెరటోనిన్, డొపమైన్, ఎండోర్ఫిన్స్   (serotonin, dopamine, endorphins) తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ తగ్గడం వల్ల డిప్రెషన్ సమస్యకు దారితీసే అవకాశం  ఉంటుంది. ఎక్కువసేపు శరీరం యాక్టివ్ గా లేకుండా కూర్చుని ఉండటం వల్ల  మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దీర్ఘకాలిక సమస్యలు.. గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, రక్తపోటు, కాన్సర్ వంటి పెద్ద వ్యాధుల అవకాశాలు పెరుగుతాయి. జీవన కాలం (life span) తగ్గిపోతుంది అని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.  నివారణ కోసం ఏం చేయాలి.. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవాలి. కూర్చునే సమయంలో పొజిషన్  సరిగా ఉంచాలి. సాధ్యమైనంతవరకు standing desk వాడుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు brisk walking, యోగా లేదా వ్యాయామం చేయాలి. స్క్రీన్ టైమ్ (computer/phone) తగ్గించాలి. ఎక్కువ సేపు కూర్చోవడం అనేది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి ముప్పు కూడా.                          *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

ఇవి తెలుసుకోకుండా యోగా అస్సలు మొదలుపెట్టకండి..!

యోగా అనేది శరీర కదలిక, శ్వాసల సమతుల్య కలయిక.   మంచి నిద్ర, మెరుగైన గుండె ఆరోగ్యం,   ఆందోళన తగ్గించుకోవడం వంటి ఫలితాల కోసం యోగ ను రికమెండ్ చేస్తుంటారు. యోగా సాధన జీవితాలను మెరుగుపరుస్తుంది.  యోగా గురించి తెలుసుకున్నవారు దాన్ని మొదలు పెట్టాలని అనుకుంటారు.  యోగా సాధన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన ప్రక్రియను తెలుసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. యోగా ప్రారంభానికి  ముందు గుర్తుంచుకోవలసిన 10 విషయాలు.. వ్యాయామం, యోగా.. ఏది బెస్ట్..  యోగా ఒక జీవన విధానం. ఇందులో శరీర కదలికలు, ఏకాగ్రతతో శ్వాస  మీద ధ్యాస పెట్టడం, ప్రాణాయామం మొదలైనవి ఉన్నాయి. యోగా లో సమయం, శరీర కదలిక, శ్వాస ఈ మూడు చాలా ముఖ్యం. ఇవి అద్బుతం చేస్తాయి.  వ్యాయామానికి ఇంత ప్రబావం లేదు. ప్రారంభం, నిలకడ..  చాలామంది చేసే సాధారణమైన తప్పులలో ఒకటి, మొదటి రోజు అతిగా యోగా చేయడం. కానీ యోగాను పది లేదా పదిహేను నిమిషాలతో ప్రారంభించాలి. తరువాత  క్రమంగా పెంచి  మార్గంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని అర్థం చేసుకోవాలి.. యోగా చేసేటప్పుడు తొడ కండరాలు,  మణికట్టు ఒత్తిడిగా అనిపించడం,  శరీరంలో ఇతర భాగాలలో కూడా ఇబ్బంది అనిపించడం వంటివి అనిపించినా సరే.. పంతంతో యోగా చేయడం తప్పు. యోగా చేయడానికి శరీరానికి  తగిన భంగిమ ఏది? ఎలా చేస్తే ప్రబావం ఉండదు.. ఇవన్నీ తెలుసుకోవాలి. వీలైతే మొదట్లో యోగా మాస్టర్స్ దగ్గర మెళకువలు నేర్చుకుని తర్వాత సొంతంగా చేసుకోవచ్చు. వార్మప్ లను మిస్ చేయొద్దు..  వ్యాయామం లాగే యోగాకు వార్మప్ ముఖ్యం.  మార్జాలాసనం,  భుజంగాసనం వంటివి శరీరాన్ని మెల్లిగా సాగదీస్తూ శరీరాన్ని సన్నద్ధం చేస్తాయియ.  ఇవి శరీర కండరాలను రిపేర్ కూడా చేస్తాయి. కోచ్.. మంచి యోగా మాస్టర్ యోగాలో తప్పులను స్పష్టంగా చెప్పగలడు.  వీపు స్ట్రైయిట్ గా  ఉందా లేదా  మోకాళ్ళు తప్పుగా  బెండ్ చేసి ఉన్నాయా.. వారు గమనిస్తారు. వీపు నొప్పి ఉన్నవారు ఎలా చేయాలి? ఆర్థరైటిస్ ఉన్నవారు ఎలా చేయాలి? ఇలాంటివన్నీ కోచ్ లు బాగా చెప్పగలరు. శ్వాస కీలకం..  యోగాలో శ్వాసే కీలకం. స్థిరమైన శ్వాస,  శ్వాస భంగిమ కంటే వేగంగా  మనస్సును శాంతపరుస్తుంది. ప్రాణాయామం అంటే బయటి శబ్దాల స్విచ్ ను ఆఫ్ చేసి మెదడును ప్రశాంత వలయంలోకి తీసుకెళ్ళడం. ఆహారం.. చాలామందిని గమనిస్తే పూర్తీగా మోకాళ్ల మీద వంగి కింది నేలను చేతి వేళ్లతో తాకాలంటే చాలా ఇబ్బంది పడతారు.  ఇది పొట్ట వల్ల వచ్చే ఇబ్బంది. ఆహారం దగ్గర జాగ్రత్త తీసుకుంటే ఈ పొట్టను యోగా ద్వారా కరిగించవచ్చు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వృద్దులలో కామన్‌గా వచ్చే మూత్రపిండ వ్యాధులు ఇవే..!

  మన మూత్రపిండాలు, చిక్కుడు గింజల ఆకారంలో ఉన్న రెండు శరీర అవయవాలు. ఇవి మన శరీరంలో సహజ ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి, విషాన్ని,  వ్యర్థ ఉత్పత్తులను విసర్జిస్తాయి.  ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, ముఖ్యమైన ఖనిజాలు, సోడియం,  పొటాషియంలను సమతుల్యం చేస్తాయి. మనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, ముఖ్యంగా వృద్ధాప్యంలో దాని పనితీరు నెమ్మదిగా తగ్గిపోతుంది. మూత్రపిండాల వ్యాధులలో సమస్య ఉన్నట్టు దానికి లక్షణాలు వెంటనే బయటపడవు.  సమస్య గుర్తించే సమయానికి సాధారణంగా చాలా ఆలస్యం అవుతుంది. మధుమేహం , అధిక రక్తపోటు లేదా దీర్ఘకాలిక మందుల వాడకం వంటి సాధారణ  విషయాలు  కూడా  మూత్రపిండాలు వృద్ధాప్యంలో  వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతాయి. వృద్దాప్యంలో వచ్చే మూత్రపిండాల వ్యాధులు ఏవి? తెలుసుకుంటే.. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి(CKD)..   మధుమేహం, అధిక రక్తపోటు,  గుండె జబ్బుల రేటు పెరుగుదల కారణంగా CKD గణనీయంగా పెరుగుతోంది. ఇది ఏ వయసులోనైనా ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు, కానీ 60 ఏళ్లు పైబడిన వారు మూత్రపిండాల పనితీరులో వయస్సు సంబంధిత క్షీణత కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతారు. మధుమేహం,  అధిక రక్తపోటు మూత్రపిండాల రక్త నాళాలపై ఒత్తిడి తెస్తాయి. కాలక్రమేణా పనితీరును దెబ్బతీస్తాయి. తీవ్రమైన కిడ్నీ గాయం..   మూత్రపిండాలు అకస్మాత్తుగా రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు అది తీవ్రమైన కిడ్నీ గాయం (AKI) కు దారితీస్తుంది. ఇది గంటల్లో లేదా రోజుల్లోనే సంభవించవచ్చు. ఇది సాధారణంగా ఇతర తీవ్రమైన వ్యాధి  దుష్ప్రభావంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రకమైన కిడ్నీ వ్యాధి సాధారణంగా  మూత్రపిండాలను కూడా ప్రభావితం చేసే ఇతర అనారోగ్యాలు ఉన్న వృద్ధ రోగులలో వచ్చే అవకాశం ఉంటుంది. నిరంతర UTIలు, విరేచనాలు, శరీరంలో నీరు లేకపోవడం, అనారోగ్యంగా అనిపించడం లేదా ఉండటం, సాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జన చేయడం అన్నీ ఈ సమస్య  సంకేతాలు,  లక్షణాలు. మందుల ప్రేరణ ద్వారా మూత్రపిండ వ్యాధి.. ఇబుప్రోఫెన్,  ఇతర నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) ఎక్కువ కాలం తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. మూత్రపిండాల ప్రధాన పాత్రలలో ఒకటి మందుల తొలగింపు,  జీవక్రియ. చాలా మందులు మూత్రంలో విసర్జించబడుతున్నందున అవి మూత్రపిండాల గుండా వెళ్ళాలి. అదనంగా మూత్రపిండాలు మందులను జీవక్రియ చేస్తాయి, తొలగింపుకు ముందు వాటిని క్రియాశీల నుండి క్రియారహిత రూపాలకు మారుస్తాయి. ఇవి  వ్యక్తి తీసుకునే మందులకు మూత్రపిండాలను ప్రభావితం  చేస్తాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల బలహీనత ఉన్నవారు ప్రత్యేకంగా వైద్యుడు సూచించకపోతే సొంతంగా మందులు వాడటాన్ని నివారించాలి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

మీరు కూడా చిన్న విషయాలకే కోప్పడుతుంటారా? ఇది మీ కోసమే..!

   నేటి కాలంలో నడుస్తున్న  బిజీ,  ఒత్తిడితో కూడిన జీవితంలో చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం లేదా స్నేహితుల మాటలకు వెంటనే కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అయితే కోపం అనేది కేవలం ఒక ఎమోషన్  మాత్రమే కాదు, అది  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పదే పదే  కోపం రావడం అనేది అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ  సంబంధాలను,  వృత్తి జీవితాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది.  అందువల్ల కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యం అనే చెప్పవచ్చు. కోపాన్ని అదుపు చేసుకోవడం అంటే కోపాన్ని పూర్తిగా అణచివేయడం కాదు, దానిని వ్యక్తీకరించే విధానం కావచ్చు, దానిని ప్రదర్శించే ప్రాంతం కావచ్చు.. వీటిని మార్చుకోవడం.  ముఖ్యంగా  కోపానికి గల కారణాలను  అర్థం చేసుకుని, దానిని నియంత్రించుకోవడానికి పద్ధతులను అవలంబించినప్పుడు  భావోద్వేగాలపై  మంచి నియంత్రణను కలిగి ఉండగలుగుతాము. కోపాన్ని నియంత్రించుకునే పద్దతులు ఏంటో తెలుసుకుంటే.. ట్రిగ్గర్ లు..  కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే,మొదట చేయాల్సింది ఎందుకు కోపం వస్తుంది? ఎవరి వల్ల కోపం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు  పని ఒత్తిడి కావచ్చు లేదా ఒక  వ్యక్తి కావచ్చు,  కొన్నిసార్లు  రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతం కావచ్చు. దేని వల్ల కోపం వస్తుందనేది గుర్తించగలిగితే ఆ కోపాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.  శ్వాస సాధన..  కోపం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించే బదులు కొద్ది సేపు ఆగి లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయాలి. ఈ టెక్నిక్  శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.  హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది.  ఆలోచించడానికి సమయం ఇస్తుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాసము,  నిశ్వాసము  కోపాన్ని తక్షణమే నియంత్రించగలవు. పరిస్థితి నుండి దూరం.. ఏదైనా  పరిస్థితి  చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రదేశం నుండి కొంత సమయం దూరంగా వెళ్లడం మంచిది. తర్వాత  ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటం  లేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. దూరాన్ని సృష్టించడం వల్ల పరిస్థితిని కొత్త కోణం నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కోపాన్ని శాంతపరుస్తుంది. వ్యాయామం,  ధ్యానం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించడానికి సులువు అవుతుంది. శారీరక శ్రమ.. ఒత్తిడిని,  కోపాన్ని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు ధ్యానం,  యోగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా  చిన్న విషయాలకు స్పందించడం మానేస్తారు.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

శరీరం మీద బొబ్బలు, మొటిమలు ఎందుకు వస్తాయి? దీని వెనుక అసలు కారణాలు ఇవి..!

 బొబ్బలు,  మొటిమలు చాలా సాధారణ సమస్య. ఇది తరచుగా కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది. శరీరంపై బొబ్బలు, మొటిమలు ఉండటం ఒక సాధారణ విషయం. కానీ సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే వీటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బొబ్బలు ఎరుపు, వాపు,  చీముతో ఉంటాయి. అలాగే మొటిమలు కూడా పదే పదే రావడం, చీము, రక్తం రావడం వంటివి జరుగుతుంటాయి.  ఇవి ఆరోగ్యం గురించి అనేక ముఖ్యమైన సూచనలను  ఇస్తాయి. బ్యాక్టీరియా మన రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసినప్పుడు బొబ్బలు,  మొటిమలు ఏర్పడతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ ఈ ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల వాపు,  చీము ఏర్పడుతుంది. అయితే బాక్టీరియా మాత్రమే దీనికి కారణమని చెప్పలేం. అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు,  పర్యావరణ కారకాలు కూడా బొబ్బలు,  మొటిమల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం ద్వారా  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న మూడు అతిపెద్ద కారణాలను తెలుసుకుంటే.. వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం.. మొటిమలు,  బొబ్బలకు అతి పెద్ద కారణం వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం. శరీరాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోనప్పుడు, చర్మంపై నూనె, చెమట,  బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఈ బాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీని వలన బొబ్బలు,  మొటిమలు వస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా స్నానం చేయడం,  చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ..  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే శరీరం బయట  బ్యాక్టీరియా,  సూక్ష్మక్రిములతో సరిగ్గా పోరాడదు. డయాబెటిక్ రోగులు లేదా చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కురుపులకు ఎక్కువగా గురవుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం,  తగినంత నిద్ర ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. జీర్ణ ప్రక్రియ వల్ల బొబ్బలు వస్తాయి..  జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం ఆహారం నుండి టాక్సిన్లను పూర్తిగా తొలగించలేకపోతుంది. ఈ విషపదార్థాలు రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి.  శరీరం చర్మం ద్వారా వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో ఈవిషపదార్థాలు చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్, బొబ్బలు లేదా మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి.. పైన  మూడు ప్రధాన కారణాలతో పాటు బొబ్బలు,  మొటిమలు రావడానికి మరొక కారణం ఉంది. అది హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా కౌమారదశలో  మొటిమలకు ప్రధాన కారణం. దీనితో పాటు ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోయి బొబ్బలు ఏర్పడతాయి. ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.  నివారణకు అవసరమైన జాగ్రత్తలు.. కురుపులను నివారించడానికి చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.  పుష్కలంగా నీరు త్రాగాలి.  ఈ సమస్యను పదే పదే ఎదుర్కుంటుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఏదైనా అంతర్గత వ్యాధికి సంకేతం కావచ్చు.        రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                            

అశ్వగంధ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్లకు మాత్రం డేంజర్..!

అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో,  శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దాని వేర్లు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందట. భారతదేశం, మధ్యప్రాచ్యం,  ఆఫ్రికాలో కనిపించే ఈ  మొక్క శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఉంది. పురాతన ఔషధమైన అశ్వగంధ శరీరానికి, మనస్సుకు కూడా గొప్ప వరంగా చెప్పవచ్చు.  అయితే అశ్వగంధ కొందరు వ్యక్తులకు చాలా డేంజర్ అని, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. అశ్వగంధ  ప్రయోజనాలు.. అశ్వగంధను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అశ్వగంధ అనేది ఒక అడాప్టోజెన్. ఇది ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) ను నియంత్రిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది,  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది జలుబు,  సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కండరాల బలం, ఓర్పు,  శక్తిని పెంచుతుంది.  ఇది వ్యాయామం చేసేవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధ మధుమేహ రోగులకు,  ఆరోగ్యవంతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది,  ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అశ్వగంధ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అశ్వగంధ పొడిని అల్లం,  తులసితో టీలో కలిపి తాగడం వల్ల జలుబు,  దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి,  జ్వరం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎలా తీసుకోవాలి? అశ్వగంధను తీసుకునే పద్ధతి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అశ్వగంధ  పొడిని వేడి పాలలో కలిపి తేనె లేదా బెల్లం తో తీసుకోవచ్చు.  అలాగే  అశ్వగంధ, అల్లం,  తులసి వేసి 5 నిమిషాలు మరిగించి టీగా కూడా తీసుకోవచ్చు. ఒత్తిడి, బలహీనత,  బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడేవారికి అశ్వగంధ ఒక వరం.  అయితే ఆరోగ్య నిపుణులు  దీనిని జాగ్రత్తగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు,  పాలిచ్చే మహిళలు వైద్యుడిని సంప్రదించకుండా అశ్వగంధ వాడటం మంచిది కాదు.  ఇది థైరాయిడ్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. హైపర్ థైరాయిడ్ రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్వగంధ నిద్రను పెంచుతుంది. ఇది మందుల ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి నిద్ర మాత్రలు తీసుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా విరేచనాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

  ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది.  ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్క ఫోన్ ఉంటుంది.  చాలా వరకు ఫోన్ ఎక్కడికి వెళ్లినా వెంట ఉంటుంది. ఇక చాలామందికి  ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఇదేమంత చెడ్డ అలవాటు కాదు కదా అనుకుంటారు కొందరు. ఉదయం లేవగానే వాట్సాప్ మెసేజ్లు, ఇమెయిల్స్.. వంటివి కొందరు చూస్తే.. ఉదయాన్నే యూట్యూబ్ ఓపెన్ చేయడం మరికొందరి అలవాటు.   ఇంకొందరు ఉదయాన్నే అలా బ్రౌజింగ్ చేస్తుంటారు.  ఇది చాలా చెడ్డ అలవాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఉదయాన్నే ఫోన్ చూడటం  వల్ల కలిగే నష్టమేంటి? తెలుసుకుంటే.. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే  అలవాటు  మెదడుకు సరైనది కాదని అంటున్నారు వైద్యులు.  నిద్రలేవగానే వెంటనే ఫోన్ చెక్ చేయడం వల్ల మనసుకు విశ్రాంతి లభించదు. ఉదయం నిద్రలేచిన తర్వాత  నిదానంగా రోజును ప్రారంభించాలి. అకస్మాత్తుగా ఫోన్ వాడటం,  సందేశాల ప్రవాహం మనస్సును అలసిపోయేలా చేస్తుంది.  ఆలోచించే,  అర్థం చేసుకునే మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుందట. ఒత్తిడి.. పొద్దున్నే లేవగానే చాలా రకాల నోటిఫికేషన్లు వస్తుంటాయి. వీటిలో కొన్ని ఉపయోగకరమైన సందేశాలు, సోషల్ మీడియా లో కొత్త విషయాలు లేదా వార్తలు ఇలా ఏవైనా ఉండవచ్చు. ఇవన్నీ కలిసి  మనస్సులో ఒత్తిడిని కలిగిస్తాయి. ఉదయాన్నే ఈ ఒత్తిడి కారణంగా మనసు కలత చెందుతుందట. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ఫోన్ వాడకుండా ఉండటం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యం.. ఉదయాన్నే కళ్ళు  రిలాక్స్డ్ స్థితిలో ఉంటాయి.రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల కళ్లు ప్రశాంతంగా ఉంటాయి. అయితే కళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు బయటి వాతావరణానికి, బయటి వెలుగుకు కూడా కళ్లు అలవాటు పడకముందే    ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల మీ కళ్ళలో నొప్పి లేదా పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఇది తలనొప్పికి కూడా కారణమవుతుంది.  కళ్ళ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వ్యసనం.. నిద్ర లేచిన  వెంటనే పదేపదే ఫోన్ చూసే అలవాటు ఒక రకమైన వ్యసనంగా మారుతుంది. నోటిఫికేషన్లు చూసే వరకు మనసు, మెదడు ఆరాటపడుతూనే ఉంటాయి.  వీటిని శాంతపరచడం కోసం ఫోన్ ను పదే పదే చూడటం జరుగుతుంది.  ఇది కాస్తా  పదేపదే  ఫోన్ చూసేలా మెదడును, మనసును ప్రేరేపిస్తుంది.   ఇది వ్యసనానికి దారి తీయడం ద్వారా దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నోటిఫికేషన్ల మాయ.. ఫోన్ లో నిరంతరం వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఏ పని మీద ఏకాగ్రత నిలవదు. దీని వల్ల పదే పదే దృష్టి ఫోన్ వైపే వెళుతుంది. ఈ కారణంగా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టలేరు. రోజు ప్రారంభం నుండి రోజు ముగిసేవరకు ప్రతి పని సంతృప్తిగా చేయలేరు. నిద్ర చక్రంపై చెడు ప్రభావం స్లీపింగ్ సైకిల్.. నిద్రపోయే ముందు, తర్వాత ఫోన్ చూస్తే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిద్రపోయే ముందు,  తర్వాత  మేల్కొన్న వెంటనే ఫోన్ చూస్తే నిద్ర చక్రం పాడవతుంది.  స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇది  నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లేకపోవడం,  అలసట వంటి సమస్యలు వస్తాయి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...