లొట్టలు వేసుకుంటూ తినే మయోనైస్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
posted on Oct 1, 2025 @ 1:00PM
ఒకప్పుడు స్నాక్స్ అంటే చెగోడిలు, పప్పు చెక్కలు, జంతికలు, బూంది, మిక్చర్.. ఇలా చాలా ఆహార పదార్థాలు ఉండేవి. ఆ తరువాత వీటి స్థానంలో చాలా రకాల విదేశీ ఆహారాలు వచ్చి చేరాయి. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, శాండ్విచ్, పిజ్జా, మోమోస్, రోల్స్.. ఇలా చాలా రకాల తినుబండారాలు వచ్చి చేరాయి. ఈ స్నాక్స్ ను సాధారణంగా టమోటా కెచప్, మయోనైస్ వంటి వాటితో తింటుంటారు. మయోనైస్ అనేది చాలా మందికి పేవరేట్ గా మారిపోయింది. దీని రుచి దీన్ని పదే పదే తినాలని అనిపించేలా చేస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి తెలుసుకుంటే..
మయోనైస్ గుణం..
మయోనైస్ ప్రధానంగా నూనె, గుడ్డు పచ్చసొన, వెనిగర్ లేదా నిమ్మరసం వంటివాటితో తయారు చేస్తారు. ఇందులో దాదాపు 80 శాతం నూనె ఉంటుంది. ఇది ఒక రకమైన వంట నూనెగా మారుతుంది. నూనె సాధారణంగా మండుతుంది. కాబట్టి మయోనైస్ కూడా మండే పదార్థం. దాని మండే సామర్థ్యం నూనె కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ప్రమాదకరం కావచ్చని అంటున్నారు. ముఖ్యంగా మయోనైస్ తయారీలో పచ్చి గుడ్డు సొనను ఉపయోగించడం వల్ల ఇది ఫుడ్ పాయిజన్ కు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మయోనైస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు చాలా ముఖ్యం..
మయోనైస్ ను మంటలకు దూరంగా ఉంచాలి. వేడిగా ఉన్న ప్రదేశానికి కూడా దూరంగా ఉంచాలి. మయోనైస్ ను చల్లని ప్రదేశాలో, గాలి చొరబడని కంటైనర్ లలో ఉంచాలి.
మయోనైస్ ను ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తే.. ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు, సడన్ గా మంట పెంచి ఉపయోగించడాన్ని నివారించాలి.
చల్లగా ఉన్న స్నాక్స్ లేదా గోరువెచ్చగా ఉన్న స్నాక్స్ మీద మయోనైస్ ఉపయోగించడం మంచిది.
ఇందులో నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే.. అసలు మయోనైస్ ను తినకపోవడమే బెస్ట్.
*రూపశ్రీ.