పప్పు ధాన్యాలు ఉడికించిన నీటి పవర్ తెలుసా?
posted on Oct 11, 2025 @ 9:30AM
పప్పు ధాన్యాలు భారతీయుల ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పప్పు, సాంబార్, రసం, కిచిడి.. ఇవి మాత్రమే కాకుండా చాలా రకాల పిండి వంటల తయారీలో కూడా పప్పు ధాన్యాలు బాగా వాడతారు. వీటిలో ముఖ్యంగా శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు.. ఇవన్నీ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది పప్పు ఉడికించిన తర్వాత నీరు ఎక్కువ ఉంటే ఆ నీటిని పడేస్తుంటారు. కానీ ఈ నీటి పవర్ తెలిస్తే షాకవుతారు. ఇంతకీ ఈ నీటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే..
జీర్ణక్రియ..
పప్పు ధాన్యాలు ఉడికించిన నీరు తేలికగా ఉంటుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సంబంధ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
పోషకాలు..
పప్పు ఉడికించిన నీటిలో ఏముంటుంది ఇదంతా జస్ట్ వాటర్ కదా అని అనుకుంటారు చాలా మంది. కానీ ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీరు శరీరానికి పోషణను అందించే ప్రోటీన్, విటమిన్లు, ఐరన్, పోలేట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కలిగి ఉంటుంది.
బలం..
పప్పు ఉడికించిన నీరు తేలికగా ఉండటం, జీర్ణానికి సులువుగా ఉండటం వంటి కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేనప్పు ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. అలసట, నీరసం నుండి ఉపశమనం ఇస్తుంది.
బరువు..
పప్పు ఉడికించిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఈ కారణం వల్ల ఇది ఒకవైపు కడుపు నిండుగా ఉంచుతూ మరొకవైపు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి..
పప్పు ఉడికించిన నీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, బలంగా మార్చడంలో సహాయపడతాయి.
హైడ్రేట్..
పప్పు ఉడికించిన నీరు నీటికి సంబంధిన సోర్స్ కావడం వల్ల ఈ నీరు తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు నీరు అందించినట్టు అవుతుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా హైడ్రేట్ గా ఉంటుంది.
పిల్లలకు బెస్త్..
చిన్న పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడ ఎక్కువ ఘనంగా ఉన్న ఆహారం ఇవ్వలేము. అలాంటప్పుడు పప్పు ఉడికించిన నీరు చాలా బాగా సహాయపడుతుంది. పిల్లలకు పోషణ, ఎముకలు బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...