రోజూ ఉదయమే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!

  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  

దీపావళికి ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ తినండి.

దీపావళికి షుగర్ మిఠాయిలు తినకుండా ఇంట్లోనే ఈ షుగర్ ఫ్రీ స్వీట్‌లను తయారు చేసి ఆరోగ్యంగా ఉండండి. ఖర్జూర లడ్డూలు: ఖర్జూరం సహజ స్వీటెనర్. డ్రై ఫ్రూట్స్,  నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలు షుగర్ పేషంట్లు మంచి ఎంపిక. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. ఫ్రూట్ చాట్: వివిధ తాజా పండ్లు, చాట్ మసాలాతో చేసిన ఫ్రూట్ చాట్ ఒక సంతోషకరమైన ఎంపిక. చక్కెర అవసరాన్ని తొలగిస్తుంది. ఈ డెజర్ట్ డయాబెటిస్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, బరువు చూసేవారికి కూడా గొప్ప ఎంపిక. బాదం పాలతో తక్కువ కార్బ్ పాయాసం: దీపావళి సమయంలో పాయసం ఒక ప్రసిద్ధ తీపి వంటకం. అధిక కేలరీల ఆహారాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. కేలరీలను తగ్గించడానికి సాధారణ పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్‌లను జోడించడం వల్ల డెజర్ట్ యొక్క పోషక విలువను పెంచుతుంది. షుగర్ ఫ్రీ గులాబ్ జామూన్: చక్కెర స్థానంలో ఖర్జూరం వంటి సహజమైన స్వీటెనర్‌లతో గులాబ్ జామూన్‌ను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవచ్చు. ఫైబర్,  అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గించే ఆహారంలో ఉన్నవారు తినవచ్చు. గోధుమ బెల్లం కేక్: గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన కేక్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది.  ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికతో సహజ స్వీటెనర్. రక్తంలో చక్కెర స్థాయిలు, కేలరీల తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది.  

రాగి పాత్రలో నీళ్లు తాగండి.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!

  వంటింట్లో చాలా వరకు స్టీల్ సామాన్లు ఉంటాయి.  స్టీల్ బిందెలు, స్టీల్ జోడాలలో తాగడానికి నీరు పోసి పెట్టుకుంటారు.  మరికొందరు మట్టి కుండలలో నీరు  తాగుతుంటారు. అయితే ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగుతుంటారు.  అసలు రాగి పాత్రలో నీరు ఎందుకంత శ్రేష్టం. రాగి పాత్రలలో నీరు తాగితే ఆరోగ్య కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. రాగి పాత్రల వాడకం.. రాగిపాత్రలలో నీరు నిల్వ చేసి నీటిని తాగడం ఇప్పుడు కొత్తగా పుట్టిన అలవాటు ఏమీ కాదు..  దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాగి పాత్రలలో నీరు తాగడం ప్రజల జీవనశైలిలో భాగం. ముఖ్యంగా రాగి పాత్రల వినియోగం, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం  ఆయుర్వేదంలో ప్రాచుర్యం చెందింది.  రాగి పాత్రలను ఆహారం వండుకోవడానికి,  ఆహారం నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం, రాగి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజాలలో రాగి ప్రధానమైనది.  ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రాగి పాత్రలలో నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు రాగి పాత్రలలో నీరు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాగిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు  మెరుగ్గా ఉంటాయి.  ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. రాగి పాత్రలలో నీరు తాగితే శరీరం శుద్ది అవుతుంది. చాలామంది ఉదయాన్నే రాగి పాత్రలలో నీటిని తాగుతుంటారు.  దీని వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అయితే రాగి పాత్రలలో నీటిని ఎక్కువ సేపు నిల్వ చేయకూడదు.  ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నీటిని నిల్వచేస్తే ఆ నీరు వేడి గుణం అధికంగా అవుతాయి.  అంతేకాదు.. రాగి పాత్రలలో నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా తాగకూడదు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ రాగి పాత్రలలో నీటిని తాగకూడదు. శరీరంలో  రాగి ఎక్కువైనా హాని కలుగుతుంది. ముఖ్యంగా గర్భవతులు,  ఎసిడిటీ,  కిడ్నీ సమస్యలు ఉన్నవారు,  గుండె జబ్బులు ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగాలంటే మొదట వైద్యుల సలహా తీసుకోవాలి. లేదంటే తీవ్ర నష్టాలు సంభవిస్తాయి.                                                    *రూపశ్రీ.

చిలకడదుంపలను క్రమం తప్పకుండా తింటే ఏమవుతుందో తెలుసా..?

  చిలకడదుంపలు చాలామందికి ఇష్టమైన ఆహారం. చాలామంది వీటిని ఉడికించి తినడానికి ఇష్టపడతారు. మరికొందరు నిప్పుల మీద కాల్చి తింటారు.  ఫుడ్ లవర్స్ అయితే చిలకడ దుంపలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు.  వీటితో టిప్స్,  టిక్కీ, పూర్ణం బూరెలు,  భక్ష్యాలు కూడా చేసుకుని తింటారు.  అయితే చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయట.  అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. చిలగడదుంపలు ఒక పోషకాల గని అని చెప్పవచ్చు.  అవి మన శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో,  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  కొల్లాజెన్ ఉత్పత్తి,  చర్మ ఆరోగ్యంలో దాని పాత్రకు ప్రసిద్ధి చెందిన విటమిన్ సి కూడా ఉంటుంది.  ఒక మధ్యస్థ-పరిమాణ చిలగడదుంప  అంటే సుమారు 130 గ్రాముల చిలకడదుంపలో పోషకాలు ఇలా ఉంటాయి. విటమిన్ ఎ..  రోజువారీ అవసరమైన దానికంటే  400% కంటే ఎక్కువ విటమిన్-ఎ ఉంటుంది.  విటమిన్ సి.. రోజువారీ అవసరమైన దానిలో  25% లభిస్తుంది ఫైబర్.. 4 గ్రాములు ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది పొటాషియం.. గుండె ఆరోగ్యానికి,  రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం మెగ్నీషియం..  ఒత్తిడిని తగ్గించడానికి,  కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇంకా ఇందులో ఐరన్,  బి విటమిన్లు ఉంటాయి. ఇది  మొత్తం శరీర శక్తి స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీటా-కెరోటిన్ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం లో విటమిన్ ఎ గా రూపాంతరం చెందుతుంది. ఇది చిలగడదుంపలలో సమృద్ధిగా ఉంటుంది.   ఈ విటమిన్ కంటి చూపు మెరుగ్గా ఉండటానికి  రేచీకటి వంటి  వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇప్పట్లో చాలామంది  కంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  ఇలాంటి వారు స్వీట్ పొటాటోను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.  శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు ఏదైనా సెల్యులార్ దెబ్బతినకుండా శరీరం  రక్షణను బలోపేతం చేస్తాయి. స్వీట్ పొటాటోను తరచుగా తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుుతంది. స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ ఉంటుంది.  జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేస్తుంది.  మలబద్దకం సమస్య రానీయదు. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.                                 *రూపశ్రీ.

ఈ డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తింటే చాలు.. శరీరానికి ప్రాణం పోస్తాయి..!

  డ్రై  ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. మాంసాహారం తినని వారికి  ప్రోటీన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కొద్దో గొప్పో ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.   కొన్ని డ్రై ప్రూట్స్ ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే పోషకాహారంతో బలహీనంగా ఉన్న శరీరానికి తిరిగి ప్రాణం పోస్తాయి.  శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.  రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. బాదం.. ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది  రాత్రి నానబెట్టిన బాదం పప్పును ప్రతి రోజూ ఉదయం తీసుకుంటూ ఉంటారు. బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  ఇంకా ఇందులో ప్రోటీన్, పైబర్ కూడా ఉంటాయి.  బరువును అదుపులో ఉంచుతుంది. ఎండుద్రాక్ష.. ప్రతిరోడూ ఎండుద్రాక్ష తింటే శరీరానికి అమితమైన బలం లభిస్తుంది.  ఎండుద్రాక్షను కూడా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.  మలబద్దకాన్ని నివారిస్తుంది.  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. వాల్ నట్స్.. వాల్ నట్స్ కండరాలను బలపరుస్తుంది.  వాల్ నట్స్ మీద సన్నని పొర ఉంటుంది.  దీన్ని తీసేసి తినాలి. అందుకే వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే సన్నని పొర తీసేసి తినాలి. కనీసం రోజుకు ఒక వాల్ నట్ తీసుకుంటే మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తి వంతమైన డ్రై ప్రూట్స్.  అంజీర్ పండ్లు తాజాగా కూడా లభ్యమవుతాయి.  కానీ తాజా పండ్ల కంటే డ్రై అంజీర్ చాలా మంచివి.  అంజీర్ పండేకొద్ది తీపిదనం పెరుగుతుంది.  డ్రై అంజీర్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.  ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఎముకలు,  కండరాలు బలపడతాయి.  ఎముకలు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఖర్జూరం.. ఖర్జూరం కూడా శక్తి వంతమైన డ్రై ప్రూట్.  ఖర్జూరాలు తక్షణ శక్తిని ఇస్తాయి.  వీటిని నేరుగా తీసుకోవచ్చు.  ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  శరీరానికి ఐరన్ ను అందించడం ద్వారా  హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. పై డ్రై ప్రూట్స్ ను రాత్రి నానబెట్టి  ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం లేదా.. స్నాక్స్ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిండికి బదులు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారుతుంది.                                             *రూపశ్రీ.

మీరు లివర్ లేదా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా... అయితే మీరు  ప్రమాదం లో ఉనట్టే 

  లివర్ వ్యాధి మిమ్మల్ని మెల్లగా చంపేస్తుంది.అని ఒక పరిశోదనలో గుర్తించారు.లివర్ వ్యాధి సహజంగా  హెపటైటిస్ లేదా ఆల్కాహాల్ కు సంబంధం ఉంది.ఊబకాయం.డయాబెటిస్ వల్ల మీ లివర్ పాడై పోతుంది. వాస్తవానికి ఫ్యాటి లివర్ వ్యాధి పెరిగితే వ్యక్తులు చనిపోతారు.అని ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఫ్యాటి లివర్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ మెల్లగా మిమ్మల్ని సైలెంట్ గా చంపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటి లివర్ వల్ల నష్టం కావడమే కాదు మీరు దీర్ఘకాలం పాటు సమస్యలు తప్పవని ఈ అంశం పై అమెరికాకు చెందిన డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెన్ని క్లార్క్ హక్కిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ బాల్టి మోర్ ఎం డి   బృందం జరిపిన  పరిశోదనలు లివర్ వ్యాధి వృద్ధి చెందుతూఉంటుంది.లివర్ వ్యాధి ఒక్క సారి వస్తే కొన్ని  ఏళ్ల పాటు  వృద్ధి చెందు తూనే ఉంటుంది.  లివర్ పై వచ్చే చారలు,మచ్చల వల్ల చాలామంది చనిపోతున్నారని డాక్టర్ క్లార్క్  అన్నారు. శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పెరిగి పోయి లివర్ లో నిల్వ ఉంటుందో దీనికారణం గానే ఇంఫ్లామేషణ్ తో పాటు స్కార్స్ వస్తాయని క్లార్క్ అన్నారు. కొవ్వు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకోవడమే గీస కూడా కావచ్చని క్లార్క్ పేర్కొన్నారు.అధికంగా కార్బో హైడ్రేడ్స్ తీసుకోవడం వాళ్ళ మేతాబాలిక్ సిస్టం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని.అది ఫ్యాట్ ను పెంచుతాయాని అన్నారు. ప్రపంచం లో ప్రతి నలుగురిలో ఒకరు  ఫ్యాటి లివర్ సమాస్యతో బాధ పడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  లో ఒక నూతన పరిశోదన ద్వారా అధునాతన ఫ్యాటిలివర్ వ్యాధి వల్ల హెపటైటిస్ సి ప్రాధాన కారణ మనిపేర్కొన్నారు.  కివేర్ పై స్కార్ మచ్చ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందేన.... మానవులలో ఫ్యాటి లివర్ డిసీజ్ కు మేతాబాలిక్ సిండ్రోం అని డాక్టర్ స్క్రత్ ఫ్రైడ్ మెన్ డేఒన్ హేపటిస్ట్ అన్నారు. లివర్ పై ఒక్కసారి సచార్ వాస్తే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిందే. మెటా బాలిక్ సిండ్రోం కు అనారోగ్య సమాస్యలకు  మూలమని తేల్చారు.దీనివల్ల హార్ట్ డిసీజ్,స్ట్రొక్,టైప్ 2 డయాబెటిస్ దీనివల్ల బిపి,హై బ్లడ్ షుగర్,వీటి వల్ల కొవ్వు  అదనంగా చేరి,కొలస్ట్రాల్ లో హెచ్చుతగ్గులు,పొట్ట పెరగడం.వంటివి ఉంటాయి. లివర్ పెరుగుతున్నాయి అంటే ఊబ కాయం టైపు 2 డయాబెటిస్ మేతాబాలిక్ సిండ్రోం లివర్ డిసీజ్ కు కారణంగా  చెప్పవచ్చు. ఈ అంశం పై పరిశోదనలు జరిపిన డాక్టర్ల బృందం 18౦౦ ఫ్యాటి లివర్ తో సంబంధం ఉన్న వారిని పరిశీలించారు.  నాలుగు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. లివేర్ లో  స్కార్రింగ్  అభివృద్ధి చెందడానికి కారణం లివర్ వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నట్లు అధ్యయనం లో తెలుసుకున్నారు.  అంతర్గతంగా రక్త  శ్రావం  అదనపు రాసాయనాలు మానసికంగా గందరగోళం గాఉంటుంది .శరీరంలో రక రకాల రాసయనాలు మెదడు  పై ప్రభావం చూపుతాయి.ఫ్యాటి లివర్ ఉంటె టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.కిడ్నీ పనితీరులో మార్పు వస్తుంది. అని పరిశోదనలో తెలిపారు.లివర్ సమస్యల వాళ్ళ ఫ్యాటిలివర్ వల్ల 7% మరణాలాను ఈ బృందం గుర్తించింది. ఊబకాయం,డయాబెటిస్,ఉన్నవారిలో ఫ్యాటిలివేర్ 2౦%  నుండి 3౦ % స్కారింగ్ వృద్ధి చెందుతోంది.కొందరికి ఫ్యాట్ మాత్రమే  ఉంటె కొందరిలో ఇంజురీస్ ఉంటాయి.ఫ్యాటి లివర్ కు వెయిట్ లాస్ చికిత్స తో నియంత్రిన్చాగాలిగారు.  అయితే ఫ్యాటి లివర్ నియంత్రణకు లోని ఫిబ్రోనోర్ మందును ఎక్కువ మోతాదులో వాడినట్లు తెలుస్తోంది. బెల్జియంకు చెందినా బ్రొకుఒ పియర్  ఈ అంశాన్ని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాధమిక స్థాయిలో ఫ్యాటి లివర్ లక్షణాలు వస్తే తక్షణం నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఊబాకాయం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పాడడం కార్బో హైడ్రేడ్స్ తగ్గించడం వాళ్ళ కొవ్వు పెరగకుండా జాగ్రత్తలు  తీసుకుంటూ నిర్లక్ష్యం చేయవదని మరణానికి గురికవద్దని వైద్యులు సూచించారు.                                               

చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులు వాడితే అంతే సంగతులు!

ఇప్పట్లో అనారోగ్యాలు ఎక్కవ అవ్వడమే కాదు ఆరోగ్య స్పృహ కూడా ఎక్కవగానే ఉంది అందరిలో. చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తగ్గట్టు ఆహారం దగ్గర నుండి అన్ని విషయాలలో మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అవుతున్నామని అనుకుంటూ చాలామంది  పొరపాట్లు చేస్తున్నారు. వాటిలో చక్కెరను నియంత్రించడం, దాని స్థానంలో కృత్రిమ చక్కెరలు ఉపయోగించడం ప్రధానమైనది. తీపిని ఇష్టపడని వారు ఉండరు. కానీ తీపి తింటే లావు అవుతామని, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని చాలామంది అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీన్ని వల్ల చక్కెరను నియంత్రించామని, ఆరోగ్యం  బాగుంటుందని అనుకుంటారు. పైపెచ్చు తీపి తిన్నామనే  తృప్తి కూడా కలుగుతుంది. అయితే ఇలా కృత్రిమ చక్కెరలు తీసుకోవడం  చాలా ప్రమాదమని తెలుస్తోంది. అసలు కృత్రిమ చక్కెరలు శరీరానికి ఎంత చేటు చేస్తాయి? దీని వల్ల కలిగే ప్రమాదాలేంటి తెలుసుకుంటే దీని నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినవి కృత్రిమ చక్కెరలు. సాధారణంగా వీటిని డయాబెటిక్ రోగులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.  చక్కెర తింటే లావు అవుతాం అనే అపోహ ఉన్నవారు కూడా దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల బరువు పెరగమని, ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటారు. అయితే ఇది చాలా అవాస్తవం.  సాధారణంగా కృత్రిమ చక్కెరలుగా అస్పర్టమే, సాచరిన్. సుక్రలోజ్, మాంక్ ప్రూట్, స్టెవియా, సార్చిటాల్, జిలిటాల్, ఎంథ్రిటాల్ వంటి పదార్థాలు ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా కృత్రిమ చక్కెరలను  సాచరిన్ అనే పదార్థంతోనే ఎక్కువ తయారుచేస్తారు. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. తీపి తిన్న అనుభూతిని ఇస్తుంది. కానీ.. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. ఈ కారణంగా ఉబకాయం కూడా ఎదురవుతుంది. ఇకపోతే ఈ కృత్రిమ చక్కెరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఆహారం తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది బరువును పెరగడానికి దారితీస్తుంది. అంతే కాదు ఎప్పుడైనా స్వీట్లలో అధికంగా కృత్రిమ చక్కెరలను వినియోగించడం వల్ల విరేచనం, వికారం, అపానవాయువు వంటి సమస్యలు ఏర్పడతాయి. కృత్రిమ చక్కెరగా ఉపయోగించే అస్పర్థమే అధిక ఉష్ణోగ్రత వద్ద పార్మిక్ ఆమ్లంగా  విచ్చిన్నమవుతుంది. స్వీట్ల తయారీలోనూ, కాఫీ, టీ లలోనూ వేడి మీద వీటిని జోడించడం ప్రమాదం. ఈ కారణంగా ఇది అలర్జీలకు కారణమవుతుంది. అలాగే అధికమొత్తంలో అస్పర్థమేను తీసుకోవడం వల్ల పెద్దలలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఒకటిన్నరెట్లు  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రొమ్ము క్యాన్సర్, ఉబకాయం చాలా సులువుగా వస్తాయి. ఫినైల్కెటోనూరియా అనే సమస్య ఉన్న వ్యక్తులు అస్పర్టమేకు దూరంగా ఉండాలి, వీరు అస్పర్టమేలో ఉండే  ఫెనిలాలనైన్  అనే అమైనో ఆమ్లంను జీవక్రియ చేయలేరు. ఫెనిలాలనైన్ అధికంగా ఉండటం వల్ల మెదడులో మూర్ఛలు వస్తాయి. ఇలా కృత్రిమ చక్కెరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా.. చెడు చేసే అవకాశమే ఎక్కువ.                                                               *నిశ్శబ్ద.  

పూల టీలతో భలే ఆరోగ్యం..

పువ్వులు మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చాలామంది పువ్వులను ఇంటి అలంకరణ కోసం,  దేవుడి పూజ కోసం వాడతారు. ఇక ఆడవాళ్లకు పూలు తెచ్చిపెట్టే అందం అంతా ఇంతా కాదు.. అయితే పువ్వులు మగువల అందాన్ని, ఇంటి అందాన్ని, దేవతామూర్తుల చెంత చేరి దేవతామూర్తుల రూపాన్ని మెరిపించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.  జపనీస్, చైనా ప్రజలు పువ్వులను ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఎప్పటి నుండో వాడుకలో ఉంది. భారతీయ ఆయుర్వేదంలో కూడా చాలా రకాల పువ్వుల ను ఔషదంగా  వాడతారు. అయితే  కొన్ని రకాల  పువ్వలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యం భేష్ గా ఉంటుంది. ఇంతకీ ఆరోగ్యం చేకూర్చే ఆ టీలు ఏవో తెలుసుకుంటే.. మందార టీ.. మందారలో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్,  విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. చాలా అధ్యయనాలలో  మందార సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తేలింది.  ఇప్పటికే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్‌లో ఉన్నవారు  మందార టీని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. చమోమిలే టీ.. ఎండిన చమోమిలే లేదా చేమంతి పువ్వులను వేడి నీటిలో వేసి చమోమిలే టీని తయారుచేస్తారు. ఫలితంగా సున్నితమైన రుచితో సువాసన కలిగిన టీ చాలా ప్రశాంతతను ఇస్తుంది. చమోమిలే టీ మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. "కెఫిన్ టీలకు బదులు చమోమిలే  రాత్రిపూట  తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది. బ్లూ టీ.. బ్లూ టీని శంఖు పుష్పాలతో తయారుచేస్తారు. దీని కోసం తాజా శంఖు పుష్పాలు అయినా వాడవచ్చు లేదా.. ఎండిన శంఖు పుష్పాలు అయినా ఉపయోగించవచ్చు. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి యవ్వనంగా మారుస్తాయి. బ్లూ టీలో ఉండే ప్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బ్లూ టీలో ఉండే క్యాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజ్ టీ.. సాధారణంగా వాడే టీలో ఎండిన గులాబీ రేకులను జోడించుకోవచ్చు. లేదంటే తాజా గులాబీ రేకులను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ రేకులను నేరుగా సాధారణ నీటిలో ఉడకబెట్టడం ద్వారా గులాబీ టీని తయారు చేసుకోవచ్చు.  గులాబీ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీ గుణాలు ఉంటాయి.  రోజ్ టీ కూడా జీర్ణప్రక్రియను ప్రోత్సహిస్తుంది.   లావెండర్ టీ.. లావెండర్ టీ సాధారణంగా సోపులు, పెర్ప్యూమ, ఎయిర్ ఫ్రెషనర్ మొదలైన వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.  కానీ లావెండర్ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లావెండర్ మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. నరాలకు స్వాంతన చేకూరుస్తుంది. మంచి నిద్రకు, చర్మ ఆరోగ్యానికి  చాలా మంచిది.                                                   *రూపశ్రీ.

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?

  శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని అవయవాలకు మెరుగైన రక్త ప్రసరణ అవసరం.  చాలామందికి శరీరంలో రక్తం తక్కువ ఉందని అంటుంటారు. నిజానికి రక్తం తక్కువ ఉండటం అంటూ ఏమీ ఉండదు. కానీ రక్తంలో హిమెగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉంటాయి.    రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడాన్ని రక్తహీనత అంటారు.   రక్తహీనత అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా మగవారిలో కంటే ఆడవారిలోనే ఈ సమస్య ఎక్కువ.  భారతదేశంలో అధిక శాతం మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని వైద్య పరిశోధనలు, సర్వేలు  వెల్లడిస్తున్నాయి. అందుకే రక్తహీనత ప్రమాదం భారతీయ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది మన ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. దాని లోపం కారణంగా అవయవాలకు ఆక్సిజన్ ప్రసరణ లోపిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్  దీర్ఘకాలంగా లోపిస్తే  రక్తహీనతకు కారణమవుతుంది, ఇది వివిధ రకాల ఆరోగ్య దుష్ప్రభావాలను కలిగిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆహారంలో పోషకాలు లేకపోవడం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, మహిళల్లో రుతుక్రమం వంటి కారణాల వల్ల కూడా  హిమెగ్లోబిన్ తగ్గడానికి కారణం అవుతుంది. అయితే హీమోగ్లోబిన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే.. హిమోగ్లోబిన్ లెవల్.. పురుషులు,  స్త్రీలలో హిమోగ్లోబిన్  సాధారణ స్థాయి భిన్నంగా ఉంటుంది. పురుషులకు 14.0 నుండి 17.5 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి.  మహిళలకు  12.3 నుండి 15.3 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి. పురుషులలో 13 గ్రా/డిఎల్ కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా,  మహిళల్లో 12 గ్రా/డిఎల్ కంటే తక్కువగా ఉన్నా  హానికరంగా పరిగణిస్తారు. శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల అలసట, బలహీనత,  తలనొప్పి సమస్య తరచుగా ఉంటుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా  అలసిపోయినట్లు,  బలహీనంగా ఉన్నట్లు  అనిపించవచ్చు. తేలికపాటి శారీరక శ్రమ చేసినా  బలహీనంగా అనిపిస్తుంది. రక్తహీనత ఉన్నవారిలో    తలనొప్పి చాలా  సాధారణ సమస్యగా ఉంటుంది. ఇవి దీర్ఘకాలం ఉండటం ప్రమాదం. శరీరంలోని కణజాలాలకు,  అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడంలో,  కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపడంలో హిమోగ్లోబిన్  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . శరీరంలో హిమోగ్లోబిన్ సాధారణం కంటే తక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యం  ప్రభావితమవుతుంది. హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు హృదయ స్పందన రేటు సక్రమంగా లేకపోవడం, హృదయ స్పందనలు సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వంటి సమస్యను ఎదుర్కొంటారు. హృదయ స్పందన రేటు సక్రమంగా లేకుంటే అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ శరీరంలోని కణజాలాలకు అవయవాలకు సరిగా చేరదు. వాస్తవానికి, తక్కువ స్థాయి హిమోగ్లోబిన్ కారణంగా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే  సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా ఏ కొద్దిగా పనిచేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి రక్తహీనత కారణంగా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కేవలం శరీరంలో రక్తహీనత కారణంగానే సంభవిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఐరన్ ట్యాబెట్లు,  సిరప్ లు కూడా తీసుకోవచ్చు.                                                          *రూపశ్రీ.

నిద్రలోనే గుండెపోటు ప్రమాదాలు.. దీని లక్షణాలు ఏంటంటే..

ప్రపంచంలో ఎక్కువమంది ప్రాణాలు తీసే జబ్బు గుండెపోటు. కరోనా తరువాత ఈ గుండె సంబంధ సమస్యలు మరింత పెరిగాయి. గుండె బలహీనం కావడం, తొందరగా అలసిపోవడం, ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలు చాలామందిలో ఎక్కువయ్యాయి.  ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, చక్కని ఆహారపు అలవాట్లు కలిగినివారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అది కూడా సైలెంట్ అటాక్ లో చిక్కుకుంటున్నారు. గుండె ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఇది  గుండె శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు వచ్చే పరిస్థితి.  హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా రావచ్చు.  ఎందుకంటే అప్పటికి  గుండె బలహీనమై ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్  లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. నేటికాలంలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని అన్ని సమయాలలో గమనించుకోవడం ఎంతో ముఖ్యం.  రాత్రి నిద్రపోతున్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి సమస్యలు కొన్ని వస్తుంటాయి. వీటి లక్షణాల గురించి తెలుసుకుంటే.. శ్వాస వేగంగా ఉండటం..  శ్వాస వేగంగా ఉండటం అనేది హార్డ్ ఫెయిల్యూర్ కు దారితీసే లక్షణం. దీన్ని రాత్రి నిద్రించే సమయాల్లో గమనించవచ్చు.  దీనిని పార్క్సిస్మల్ నాక్టర్నల్ డిస్‌ప్నియా (PND) అంటారు. ఇది సాధారణంగా గాఢ నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల తర్వాత జరుగుతుంది.ఈ సమస్య ఉన్న వ్యక్తి ఉబ్బరంతో మేల్కొంటాడు.  ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు  ఊపిరి పీల్చుకోవడానికి కూర్చోవడం లేదా నిలబడటం చాలా ముఖ్యం.  నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు.  అది కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం . గుండెదడ.. భయంగా ఉన్నప్పుడు గుండె దడగా ఉంటుంది. ఆ పీలింగ్ చాలామంది జీవితంలో ఒక్కసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. అయితే  గుండె ఆగిపోయేముందు వ్యక్తుల హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని టాచీకార్డియా అంటారు. ఇది ఒక నిమిషంలో గుండె 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకునే పరిస్థితి . ముఖ్యంగా నిద్రలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకూడదు. దగ్గు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. హార్ట్ ఫెయిల్యూర్  ప్రాధమిక దశ శ్వాసలో గురక ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, బ్రోన్కియోల్స్ వాటిని దూరంగా ఉంచే ప్రయత్నంలో కుంచించుకుపోతాయి.  దగ్గుతో పాటు గురక కూడా వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ సమస్య అనుభవంలోకి వస్తుంటుంది.  ఈ పరిస్థితిని కార్డియాక్ ఆస్తమా అని పిలుస్తారు, దీనిలో ఒక వ్యక్తి నోటి నుండి నురుగు, గులాబీ రంగులో ఉండే కఫం కూడా బయటకు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే , అది గుండె వైఫల్యం యొక్క లక్షణం. హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి, దిండు సహాయం తీసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ పరిస్థితిని ఆర్థోపెనియా అంటారు. ఇప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అకస్మాత్తుగా మెలకువ రావడం.. రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొలపడం కూడా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్  ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఎదురవుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో చికిత్స ఆలస్యం మరణానికి కూడా దారితీస్తుంది. ఎవరైనా సరే నిద్రిస్తున్నప్పుడు పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు ఎదుర్కొంటుంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.హార్ట్ ఫెయిల్యూర్ అనేది అత్యవసర సహాయం అవసరమయ్యే పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెడుతుంది.                                                  *నిశ్శబ్ద.  

టిఫిన్ కి నాగా పెడుతున్నారా?

  ఉరుకులు పరుగుల జీవితం. పొద్దున లేచిన దగ్గర్నుంచి పొద్దుపోయేవరకూ ఉరుకులూ పరుగులు. టైమ్ కి ఆఫీస్ కెళ్లాలి. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. త్వరత్వరగా తెమలాలి. ఎంత తొందరగా లేచినా రోజూ లేటైపోతోంది. జీవితమంతా గాభరా.. ఇంత హడావుడిలో పడితే ఎవరికి మాత్రం టిఫిన్ తినాలనిపిస్తుంది చెప్పండి. టైమ్ కి ఆఫీస్ కెళ్లాలన్న ధ్యాసలో పడపోయి చాలామంది పొద్దున్నే టిఫిన్ తినడం మానేస్తున్నారు. ఆలస్యంగా లేచే అలవాటున్న పిల్లలుకూడా టిఫిన్ తినకుండానే రోజూ స్కూల్ కెళ్లిపోతున్నారు. దీంతో పొద్దున్నే కడుపులో ఎసిడిటీ. మంటని తగ్గించుకోవడానికి తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పొట్టలో ఏదో ఒకటి పడేయడం. దానివల్ల ఎసిడిటీ మరింతగా పెరగడం.. చక్రం తిరిగీ తిరిగీ ఇలాగే రోజులు గడిచిపోవడం. సవ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థని మనంతటమనమే దెబ్బకొట్టుకోవడం.. మామూలైపోయాయ్. కనీసం డెబ్భైశాతం కుటుంబాల్లో స్థిమితంగా కూర్చుని టిఫిన్ చేసే అలవాటు పూర్తిగా కనుమరుగైపోతోందని సర్వేలు చెబుతున్నాయ్. రెండు వేల మందిని ప్రశ్నిస్తే ఈ విషయాలు బైటికొచ్చాయ్. లండన్ మాత్రం చాలామంది ఇలాంటి దురలవాటు తమ పాలబడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఎంత ఆలస్యమైనా తప్పని సరిగా టిఫిన్ చేసే బైటికి బయలుదేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. అవునుమరి.. హెల్త్ ఈజ్ వెల్త్ అన్న సంగతి మనకంటే వాళ్లకే ఎక్కువగా తెలుసినట్టుంది.  

నాలుగు కప్పుల కాఫీతో ఏం కాదెహే!

  ప్రపంచంలో కాఫీ తాగే అలవాటు మొదలైన దగ్గర్నుంచీ... అది మంచిదా! కాదా! అనే వివాదం కూడా మొదలైంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్‌లోని ToxStrategies అనే సంస్థ నడుం బిగించింది. ఇంతకీ అదేం తేల్చిందంటే... ఇదీ లిమిట్‌ - 2001 నుంచి 2015 వరకూ కాఫీ మీద జరిగిన దాదాపు 700 పరిశోధనల ఫలితాలను ToxStrategies సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని... ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని తేల్చింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్‌ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టేమమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. గర్భిణీలూ పుచ్చుకోవచ్చు - ఇప్పటివరకూ గర్భిణీలు కాఫీకి వీలైనంద దూరంగా ఉండాలని హెచ్చరించేవారు. వారు కాఫీ తాగడం వల్ల అబార్షన్లు జరగే ప్రమాదం ఉందనీ, ఒకవేళ బిడ్డ పుట్టిన కూడా తక్కువ బరువుతోనో అవయవలోపంతోనో పుడతారనీ భయపెట్టేవారు. కానీ కాఫీ అలవాటు ఉండే గర్భిణీలు ఇక మీదట నోరు కట్టేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదంటున్నారు. వారు 300 మిల్లీగ్రాములు కెఫిన్‌ లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఫర్వాలేదంటున్నారు. పిల్లలు అతి తక్కువగా - పిల్లలు మాత్రం కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండక తప్పదని తేల్చారు. పిల్లలు బరువుండే ప్రతి కిలోకీ 2.5 మిల్లీగ్రాములకి మించి కెఫన్ పుచ్చుకోవద్దని అంటున్నారు. అంటే 20 కిలోలు ఉండే పిల్లవాడు రోజుకి 50 మి.గ్రాల మించి కెఫిన్‌ తీసుకోకూడదన్నమాట. మోతాదుతో ఉపయోగాలు – కాఫీని మోతాదులో పుచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు దరిచేరవు. కానీ మోతాదు దాటిని కెఫిన్ మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమి దగ్గర నుంచీ గుండెపోటు వరకు కెఫిన్‌తో నానారకాల సమస్యలూ మొదలవుతాయన్నది నిపుణుల హెచ్చరిక. చివరగా చిన్న మాట... కాఫీని మోతాదులో పుచ్చుకుంటే సురక్షితమే అని తేలడం మంచి విషయమే! కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మనం తీసుకునే కాఫీలో మాత్రమే కెఫిన్‌ ఉండదు. టీ, కూల్‌డ్రింక్స్, తలనొప్పి మాత్రలు, చాక్లెట్లు.. ఇలా బోలెడు పదార్థాలలో కెఫిన్ కనిపిస్తుంది. కాబట్టి ఒకోసారి మనకి తెలియకుండానే కెఫిన్‌ మోతాదుని దాటేసే ప్రమాదం ఉంది! అంచేత పరిశోధకులు నాలుగు కప్పుల కాఫీకి అనుమతిస్తే మనం రెండు కప్పులతోనే సరిపుచ్చుకోవడం మంచిది. పైగా కొందరి శరీర తత్వానికి కాఫీ అస్సలు సరిపడకపోవచ్చు. అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే! - నిర్జర.

వర్షాకాలంలో తులసి ఆకులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

  తులసి ఒక ఆయుర్వేద మూలిక.  తులసి మొక్కను ఔషధంగానూ,  ఆధ్యాత్మికతలోనూ భాగం చేస్తారు.  ముఖ్యంగా హిందువులు తమ ఇళ్లలో తులసిని దైవంగా పూజించడం చూస్తునే ఉంటాం.  అయితే ఈ తులసి ఆరోగ్యం కోసం ఎక్కువగా వినియోగించ బడుతుంది. తులసితో చేసే వైద్యం చాలా శక్తివంతమైనది.  ఈ వర్ష కాలంలో తులసి ప్రతి ఇంటి దగ్గర ఉండాల్సిందే.. దీంతో కలిగే ప్రయోజనాలేంటంటే.. తులసిని రోజూ ఉదయాన్నే తీసుకునే వారు ఉంటారు.  తులసి ఆకులను నేరుగా నమిలి తినేవారు మాత్రమే కాకుండా వివిధ రూపాలలో కూడా తీసుకుంటారు. తులసి టీ.. తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం,  తులసి టాబ్లెట్లు వాడటం చేస్తారు.  అయితే తులసిని రోజూ తీసుకుంటే మెదడు బాగా పని చేస్తుందట. ఇది మెదడుకు పదును పెడుతుందట. నేటి కాలంలో దంతాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. తులసి ఆకులను మిరియాలతో జోడించి పంటి కింద ఉంచుకుంటే పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. తరచుగా తల నొప్పితో బాధపడేవారు తులసి నూనెను ఒక రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి.  ఇది తలనొప్పి నుండి అద్బుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది.  అలాగే నాసికా రంధ్రాలను,  శ్వాస నాళాలను కూడా రిలాక్స్ చేస్తుంది. జలుబు, దగ్గు కారణంగా గొంతు నొప్పిగా ఉంటుంది.  దీని వల్ల గొంతు బొంగురుపోవడం చాలా మందికి అనుభవంలోనే ఉంటుంది.  ఇలాంటి పరిస్థితిలో తులసి ఆకులను రసం తీసి తాగితే గొంతునొప్పి గొంతు బొంగురు పోవడం వంటివి తగ్గుతాయి. తలలో పేను సమస్యలు,  తలలో చుండ్రు వంటివి ఉంటే తులసి నూనెను తలకు రాసుకోవచ్చు.  ఇది జుట్టు సంబంధ సమస్యలను చక్కగా తగ్గిస్తుంది. తలలో పేనులు చచ్చిపోతాయి. చెవులలో నొప్పి లేదా వాపు ఉంటే ఒక చుక్క గోరువెచ్చని తులసి రసాన్ని చెవుల్లో వేయాలి.  దీని వల్ల చెవి నొప్పి సమస్యలు తగ్గుతాయి. దగ్గు సమస్య అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో జ్యూస్ తయారు చేసి తాగాలి.  ఇది అన్ని రకాల దగ్గుల నుండి ఉపశమనం అందిస్తుంది. సైనసైటిస్ సమస్య కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటోంది.  ఈ సమస్య ఉన్న వారు తులసి ఆకులను వాసన చూస్తుంటే సైనసైటిస్ సమస్య నుండి ఉపశమనం ఉంటుంది. విరేచనాల సమస్యతో ఇబ్బంది పడేవారు పది తులసి ఆకులను,   ఒక గ్రాము జీలకర్రను తీసుకోవాలి.  ఈ  రెండింటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినాలి.  ఇలా తింటే విరేచనాల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా సమస్య వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ.   ఆస్తమా తో ఇబ్బంది పడేవారు తులసి పొడి, మంజరి,  తేనె కలిపి తాగితే ఆస్తమా సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.                                              *రూపశ్రీ.  

మన కంటిని బట్టి మన ఆరోగ్యం తెలుసుకోవచ్చు...

  సర్వేంద్రియానాం నయనం ప్రాధానం అంటే మనకు కళ్ళే కీలకం సమస్త సృష్టిని చూసేది మన కళ్ళే. మనకంటికి కనపడిన వెంటనే మనసు స్పందిస్తుంది. అయితే కళ్ళు ఉండీ నిజాన్ని చూడలేని వాళ్ళ కన్నా. కళ్ళు లేనువాళ్ళే స్పందించే తీరు జీవితం లో వేరుగా ఉంటుంది. వారి జీవితం సవాళ్లతో కూడుకుని ఉంటుంది.సవాళ్ళను అధిగమిస్తూ మేము ఎవరికీ తీసిపోము అన్నట్లుగా తమ జీవితాన్ని పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉంటారు అంధులు అయితే అయితే కళ్ళను చూసి మనకు ఉన్న వ్యాధులను గుర్తించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.కంటిద్వారా మనకు ఉన్న వ్య్సధులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చని. అవికూడా ప్రస్తుతం ఉన్న వ్యాధులను. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా గుర్తించవచ్చని. ఇది భారతీయులు ముఖ్యంగా మన పూర్వీకులు మనకు ఇచ్చిన నాడీ వైద్యం లో ప్రస్తావించారని పెర్కిన్నారు.మన కళ్ళను బట్టి మన అనారోగ్య సమస్యను గుర్తించవచ్చు. చలామంది హెల్త్ చెకప్ పేరుతో ఆరోగ్యం పై హెల్త్ చెకప్ అందరూ చేయించు కోలేరు.అయితే వారి వారి కళ్ళను చూసి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం సాధ్యమని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. మీకళ్ళు నిప్పుకనాళ మాదిరిగా ఎర్రగా ఉన్నాయా... కొందరి కళ్ళు నిప్పుకనాళ లాగా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్న చిన్న రక్తకణాలు కనబడతాయి.దీనికి కారణం అధిక రక్త పోటు అధిక రక్త పోటు కారణంగా కంటిలోని నరాలు ఎర్రగా మారుతాయి. కొన్ని సార్లు అవి పగిలిపోవడం కూడా జరగ వచ్చు. దాంతో కళ్ళు ఎర్రగా కనబడతాయి. అయితే ఈ విషయం నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి సమస్య ఉన్నవారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువేఅని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కళ్ళు ఎర్రబడితే ఆ ఏం జరుగుతుంది లె అని వదిలి వేయకండి ఇది హై బిపి కార్డియోక్ ఇండికేషన్ అని జాగ్రత పడాలి అని అంటున్నారు నిపుణులు. కళ్ళు తెల్లగా పాలిపోయి నట్లు ఉంటె.. దీనిని ఎనిమియా సమస్యగా పేర్కొన్నారు.అంటే రక్త హీనత అని చెప్పవచ్చు. ఇది మీ అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు.శరీరంలో సరైన పోషకాలు లేనండువల్లె శరీరంలో రక్త హీనత వస్తుందని ఒక్కోసారి రక్త హీనత మరిన్ని సమస్యలకు దారితీయ వచ్చు. కళ్ళు ఎర్రగా రక్తం కారినట్లు ఉంటె.. ఒక్కొకరిలో కళ్ళలో రక్తం కారినట్లు ఉంటాయి. రక్తంలో ప్లేటి లెట్స్ తగ్గడం వల్ల ఇలా కనిపిస్తుంది. కను గుడ్డు పోటు రావడం.. శరీరంలో డీ హైడ్రేషన్ వల్ల లేదా మెడ నరాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కనుగుడ్డు ముందుకు వస్తుంది. కంటి రెప్పల పై ఉండే హెయిర్ ఊడిపోవడం.. కనురెప్పల పైన ఉండే జుట్టు ఊడి పోవడం అంటే ఇది క్యాన్సర్ కు ఇండికేషన్ గా చెప్పవచ్చు.కనురెప్పలు ఒక్కోసారి డ్రై కావడం--కంటి నుండి ఎక్కువనీరుకారడం. సైనస్ లేదా నోజేల్ సూబ్ బ్లాక్స్ ఉండడం. ఈ కారణంగా సైనస్ సమస్యలు ఉంటె ఇలాంటి సమస్యలు వస్తాయి. కళ్ళు పెద్దవి గా కనిపించడం.. శరీరంలో హార్మోన్స్ సమస్యల వల్ల లేదా సమతౌల్యం లేదా థైరాయిడ్ వల్ల కళ్ళు ముందుకు వచ్చినట్లు. పెద్దవిగా కనిపిస్తాయని నిపుణులు విశ్లేషించారు.కంటి వెనుక భాగం లో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది లేదంటే రెటీనా చిన్న చిన్న నీటిబొట్లు కనబడుతుంది.ఇలాంటి వారిలో టైపు 2 డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది. కళ్ళు పసుపు పచ్చగా ఉంటె.. కొందరి కళ్ళు పసుపు పచ్చగా కనిపిస్తే దాని ఆర్ధం కాలేయ సమస్య ఉందని అంటున్నారు. కళ్ళు ఇలా మారిపోడానికి కాలేయం పనితీరులో తేడా ఉండడమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సలహా తీసుకుని సంప్రదించడం ఉత్తమం సమస్యనుండి బయట పడగలం.దీనిని వైద్య పరిభాషలో లివర్ బైల్ సేక్రేషణ్ ఎక్కువకవాడమని వైద్యులు నిర్ధారించారు. కళ్ళు పొడి బారడం -లేదా అయిడ్రై నెస్.. సహజంగా శరీరానికి అందాల్సిన విటమిన్ ఏ సరిగా అందక పోవడం జిరాప్ గాల్దిమియా అని అంటారు. కళ్ళలో నీరు కారడం.. కండ్లకలకఅంటే కండ్ల లో వచ్చ్ఘే ఇన్ఫెక్షన్ సహజంగా వర్స్ఘాకాలం లో వచ్చే సమస్య.ఇది ఒక్కోసారి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాసం ఉంది కాబట్టి కండ్లకలకకు దూరంగా ఉండడం అవసరం సకాకంలో వైద్యుని సూచన మేరకు కంటి లో డ్రాప్స్ వాడాలేతప్ప సొంత వైద్యం చేయరాదని అలా చేస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కండ్లు గడ్డ కట్టి నట్టుగా ఉండడం.. ఐ స్టేయ్స్ అంటే కండ్లలో గడ్డలు.. కంటిలో ఏవిధమైన డస్ట్ వచ్చి చేరినా కండ్లలో గద్దలగా తయారు అవుతుంది.  కళ్ళు నీలి రంగులోకి మారడం.. మనశరీరం లో బ్రెయిన్ కిఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల కళ్ళు నీలిరంగులోకి మారవచ్చని తెలుస్తోంది. ఐ బ్యాగ్స్.. కంటికింద బ్యాగ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా అతిగా మధ్యం తాగేవారిలో లివర్ సమస్యలు కంటికింద ఐ బ్యాగ్స్ లాగా వస్తాయి. కళ్ళు మండడం.. కళ్ళు మండడం సహజంగా వచ్చే సమస్య. అయితే కళ్ళు మండ దానికి కారణాలలో ఎక్కువ కాంతి చూడడం.లేదా ఎక్కువ కాంతిలో పనుచేయడం. ఒత్తిడికి గురికావడం. నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నందున కళ్ళు మండడం లేదా మీరు పనిచేసే ప్రాంతాలలో రసాయనాల మధ్య లేదా దుమ్ము ధూళి ఉన్నచోట కళ్ళు మండడం సహజంగా ఉంటుంది. కళ్ళు మూతలు పడడం.. కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఇది ఒక న్యురోలోజికల్ దిజార్దర్ గా పెర్కిన్నారు. ఈ సమస్యకు కారణం బాగా నిల్వ ఉన్న తీసుకున్న వారికి వస్తుందని నిపుణులు నిర్దారించారు. కంటి కింద నల్లటి వలయాలు .. కొందరిలో కంటికింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం స్టమక్ దిజార్దర్ గా పేర్కొన్నారు. కాగా సహజంగా ఒత్తిడికి గురికావడం. లేదా యాన్కజైయిటీ వల్ల కంటికింద న్హల్లటి వలయాలు వస్తాయని నిపుణులు తేల్చి చెప్పారు. కళ్ళు డీవియేట్ కావడం.. శరీరంలో కళ్ళు ఒక్కోసారిషిఫ్ట్ అవుతూ ఉంటాయి.దీనికి కారణం  పోషక ఆహార లోపంగా పేర్కొన్నారు. అంటే సరైన పోషకాలు  లేనండువల్లె కళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటాయికళ్ళను పరిశీలించడం ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పవచ్చ్గు. నాడీ పతి ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పుకోవచ్చు. ఈ పద్దతిని నాడీ పతి లో ఇరిదోలజీ అని అంటారు.మనం చెప్పుకున్న కొన్ని అంశాలు పైకి కనిపించే కళ్ళ యొక్క సిమ్టమ్స్  ను ఆధారంగా ఏదైనా లక్షణం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. దీనిఆదారంగానే చికిత్చ తీసుకోవచ్చు అని నిపుణులు పేర్కొన్నారు.  

ఆహారంలో ఫైబర్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం లేకుండా ఒక పూట,   ఒక రోజు ఉండగలరు.  బలవంతంగా ఉండేవారు మహా అయితే రెండు రోజులు ఉండగలరు. కానీ ఆహారం లేకుండా రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించడం చాలా కష్టం.  శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు కూడా అంతే అవసరం.  ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అంటూ లెక్క గట్టేవారు ఫైబర్ గురించి పెద్దగా ఆలోచించరు.  ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. అసలు ఆహారంలో పీచు పదార్థాలు ఎందుకు తీసుకోవాలి? ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫైబర్.. శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  కార్బోహైడ్రేట్లతో పాటు పీచు కూడా అవసరం.  తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడంలోనూ, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండటంలోనూ పైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.  ఇక ఫైబర్ చాలా మెల్లిగా జీర్ణం అవుతుంది కాబట్టి ఫైబర్ కలిగిన ఆహారం  తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.  ఇది బరువు తగ్గడానికి, ఆకలి నియంత్రణకు, అతిగా తినే అలవాటుకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది. ఫైబర్ కోసం పండ్లను నేరుగా తినాలి.  వాటిని జ్యూస్ తీసి అందులో ఉన్న పైబర్ ను చెత్తబుట్ట లో తోయకూడదు. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  పొట్టను శుభ్రం చేస్తుంది.  అదే ఆహారంలో పైబర్ లేకపోతే పొట్ట ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం దెబ్బ తిని మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రేగులలో మంచి గట్ మైక్రోబ్స్ ఉంటాయి.  ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి.  కానీ ఫైబర్ తీసుకోకపోతే ఈ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు, వాపులు వంటి కడుపు సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రోజువారీ శరీరానికి అవసరమైనంత ఫైబర్ అందకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి కూడా పైబర్ లేకపోవడం కారణం అవుతుంది. ఫైబర్ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం జరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.                                                *రూపశ్రీ.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు..!

థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి.   ఇది హార్మోన్లను విడుదల చేయడం ద్వారా  పలు శారీరక విధులు సక్రమంగా ఉండేలా చేస్తుంది.  ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకుంటే శరీరంలో చాలా కార్యకలాపాలు గాడి తప్పుతాయి.  థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత దెబ్బతింటుంది. ఇంతకీ ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలంటే.. సోయా ఉత్పత్తులు.. సోయా ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.  ఇది థైరాయిడ్ కోసం వాడే మందుల శోషణను అడ్డుకుంటుంది.  సోయా ఉత్పత్తులైన సోయా బీన్స్,  సోయా పాలతో చేసే పనీర్,  సోయా పాలు,  పచ్చిగా బీన్స్ లాగా ఉన్న సోయాను ఎడమామ్ అంటారు.. ఇవన్నీ కూడా సోయాకు సంబంధించినవే.. వీటిని థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకూడదు. క్రూసిఫరస్ కూరగాయలు.. బ్రోకలి, కాలిఫ్లవర్,  క్యాబేజీ వంటి కూరగాయలను క్రూసిఫరస్ జాతికి చెందిన కూరగాయలు అంటారు.  వీటిలో గోయిట్రోజెన్ లు ఉంటాయి.  ఇవి పెద్ద మొత్తంలో తీసుకుంటే ప్రమాదం.  ముఖ్యంగా వీటిని చాలామంది డైట్ లో భాగంగా పచ్చిగానే తింటూ ఉంటారు. కానీ ఇవి థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. గ్లూటెన్.. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉన్నవారు గ్లూటెన్ ఆహారాలు తీసుకోకూడదు. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ వాపు మరింత పెరుగుతుంది. గోధుమలు, బార్లీ,  బియ్యం మొదలైనవాటికి దూరంగా ఉండాలి. చక్కెర.. చక్కెర చాలామందికి సాధారణం అయిపోయింది. కానీ చక్కెరతో కూడిన స్నాక్స్,  డ్రింక్స్ బరువు పెరగడానికి దారి తీస్తాయి. అంతే కాదు ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రాసెస్ ఫుడ్స్.. ప్రాసెస్ ఫుడ్స్ కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు.  వీటిలో  ప్రిజర్వేటివ్ లు అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.  ఇవి థైరాయిడ్ వాపుకు,  బరువు పెరగడానికి దారితీస్తాయి. అయోడిన్.. అయోడిన్  ఆరోగ్యానికి మంచిదే కానీ.. అయోడిన్ అధికంగా ఉన్న ఉప్పును తీసుకుంటే థైరాయిడ్ పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. థైరాయిడ్ ఉన్నవారు  అయోడిన్ ను చాలా పరిమితంగా తీసుకోవాలి. ఫ్రైస్.. వేయించిన ఆహారాలు కూడా థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. వేయించిన ఆహారాలు బరువు పెరగడానికి థైరాయిడ్ గ్రంథి వాపుకు దారితీస్తాయి.  థైరాయిడ్ ఆరోగ్యా్న్ని ప్రతికూలంగా మారుస్తాయి. కెపిన్.. కెఫిన్ ఉన్న కాఫీ, టీ,  శీతలపానీయాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరు దెబ్బ తింటుంది. ఆందోళనను పెంచుతుంది.  ఇది థైరాయిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.                                                   *రూపశ్రీ.

స్టార్ ఫ్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి. పైపెచ్చు మార్కెటింగ్ వ్యాప్తి కారణంగా విదేశీ పండ్లు కూడా పెద్ద నగరాలలో, కొన్ని నిర్ణీత ప్రాంతాలలో లభిస్తాయి. ఇలాంటి వాటిలో స్టార్ ప్రూట్ కూడా ఒకటి. స్టార్ ప్రూట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యానికి..  ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో  స్టార్ ఫ్రూట్ ప్రబావవంతంగా ఉంటుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను మెయింటైన్ చేయడంలో  ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా  ఇందులో  ఉండే సహజ ఎంజైమ్‌లు,  ప్రోటీన్లు  కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి.  పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలోనూ,  జీర్ణ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి,  ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ అనేవి అస్థిర అణువులు, శరీరంలో కణాల  నష్టాన్ని కలిగిస్తాయి.  క్యాన్సర్స  గుండె జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.  ఆహారంలో స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా శరీర రక్షణ వ్యవస్థను బలపరచుకోవచ్చు. రోగనిరోధక శక్తి.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి, విటమిన్ ఎ,  జింక్‌తో సహా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల నిధి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అంటువ్యాధులు,  అనారోగ్యాలను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో సహాయపడతాయి. స్టార్ ఫ్రూట్  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  శరీరంలో  సహజంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  సీజనల్ సమస్యలుగా వచ్చే  జలుబు, ఫ్లూ,  ఇతర అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం..  స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.  పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడం,  రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో స్టార్ ఫ్రూట్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ద్వారా హైపర్‌టెన్షన్, స్ట్రోక్,  ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,  ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడం కూడా వీలవుతుంది. బరువు నిర్వహణ..  బరువును నియంత్రణలో ఉంచడానికి  ప్రయత్నిస్తున్న వారికి స్టార్ ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్‌తో ఉండటం వల్ల స్టార్ ఫ్రూట్ కడుపు నిండిన ఫీల్ ఇవ్వడంలో సహాయపడుతుంది.   అతిగా తినడాన్ని నియంత్రించి బరువు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో  సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పండులో ఉండే సహజ తీపి చక్కెర కలిగిన స్నాక్స్ తినాలనే  కోరిక కూడా తీరుస్తుంది. ఆహారంలో కేలరీలు తగ్గించాలని అనుకునేవారికి మంచిది.                                             *నిశ్శబ్ద.

గోళ్ళ మీద కనిపించే ఇలాంటి లక్షణాలు ఎంత డేంజరో తెలుసా?

చాలామంది వేలి గోళ్ళు, కళ్ళు, పెదవులు, దంతాలు మొదలైనవి చూసి ఆయా వ్యక్తుల శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయనేది చెప్పేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు  డాక్టర్లు కూడా మొదట నాలుక, కళ్లు, చేతివేలి గోళ్లు చూస్తుంటారు.ఆ తరువాతే స్టెతస్కోప్ తో గుండె  వేగాన్ని చెక్ చేస్తుంటారు. అయితే చేతివేలి గోళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుంది. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్.  ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది.  క్యాన్సర్ లలో పలురకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా  ప్రమాదకరమైనది అయినప్పటికీ అత్యంత  సాధారణ కేసులు రొమ్ము, పెద్దప్రేగు, పురీషనాళం, ప్రోస్టేట్,  ఊపిరితిత్తుల మొదలైన క్యాన్సర్ లుగా నమోదు అవుతున్నాయి. వీటన్ని వెనుక   ఉన్న అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, దీనికారణంగా ఎంతో మంది వివిధ రకాల జబ్బులతో పోరాడుతున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గణాంకాలు ఎలా ఉన్నాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. వీరిలో అధికశాతం మంది పేలవమైన జీవనశైలి కలిగి ఉన్నవారే కావడం గమనార్హం. ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో వివిధ లక్షణాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ దగ్గుతూ ఉంటారు. దీనికి తోడు ఊపిరి తీసుకోవడంలో సమస్య, ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతులో మార్పు, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎప్పుడూ అలసటగా ఉంటడం,  భుజంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. గోర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పైన చెప్పుకున్న అన్ని లక్షణాల ఆధారంగానే కాదు, గోళ్ల కండీషన్ ను బట్టి కూడా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి  చేసిన  కొన్ని పరిశోధనల ప్రకారం   నెయిల్ క్లబ్ లు ఉన్నవారిలో 80శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. అసలు నెయిల్ క్లబ్బింగ్ అంటే.. నెయిల్ కర్లింగ్ ను నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. కర్లింగ్ అంటే వంపులు తిరిగి ఉండటం. గోర్లు వంకరగా, వెడల్పుగా వాపు కలిది ఉండటం, పై నుండి కిందకు వంగి ఉండటాన్ని నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. ఈ నెయిల్ క్లబ్బింగ్ లో మొదట  గోర్లు పట్టుత్వం కోల్పోతాయి. ఆ తరువాత గోరు వేలు లోపలినుండి కూడా కదలడం, అది కేవలం వేలి మాంస కండ మీద అలా అతుక్కున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. జస్ట్ అలా లాగితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కేవలం ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు.. ఇలా గోర్లు వేలి మూలాల నుండి కదిలినట్టు, పట్టు లేనట్టు ఉంటే అది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశం 80శాతం ఉంది. మిగిలిన  ఛాన్సెస్ లో కుటుంబ చరిత్ర ఆధారంగా ఉదరకుహుర వ్యాధి, లివర్ సిర్రోసిస్, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి గోర్లు ఎప్పుడైనా దారుణమైన కండీషన్ కు లోనైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవడం ప్రమాదాన్ని  ముందే గుర్తించి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.                                                       *నిశ్శబ్ద.

అసలు నరాల సమస్యలు ఎందుకు వస్తాయ్..  రాకూడదంటే ఏం చేయాలి?

ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యూరోపతి ఎందుకు వస్తుంది? శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్,  నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్  తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి  ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా,  అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది.  సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే  ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి.  సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద.