భోజనం తర్వాత యాలకులు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!
posted on Oct 9, 2025 @ 9:30AM
యాలకులు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. వీటి ధర ఇప్పుడు బాగానే ఉంది. చాలామంది యాలకులను స్వీట్లు, ట్రెడిషన్ వంటకాలలోనూ, మసాలా పొడుల తయారీలోనూ, బిర్యానీ వంటి మసాలా వంటకాల తయారీలోనూ వాడుతుంటారు. ఈ సుగంధ ద్రవ్యాలు కేవలం రుచిని, సువాసనను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిలో చాలా ఔషద గుణాలు ఉంటాయి. భోజనం తర్వాత కొందరికి ఏదో ఒకటి నోట్లో వేసుకుని నమిలే అలవాటు లేదా తినే అలవాటు ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని ప్రోత్సహిస్తాయని చెబుతారు. కొందరు సొంపు తింటారు. మరికొందరు తాంబూలం తింటారు. అయితే భోజనం తరువాత ఒక యాలకు నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే..
జీవక్రియను మెరుగుపరుస్తుంది..
యాలకులలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల గ్యాస్, ఆమ్లతత్వం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మౌత్ ప్రెషనర్..
యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి లాంటి వాసన కలిగిన ఆహారాలు లేదా మసాలా ఆహారాలు తిన్న తర్వాత నోరు వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆహారం తిన్న తర్వాత యాలకు తింటే మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. శ్వాసను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
నిద్రను మెరుగుపరుస్తుంది..
రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు పచ్చి ఏలకులు తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచి మంచి నిద్రకు సహాయపడుతుంది.
రక్తపోటు..
యాలకులు తినడం వల్ల రక్తపోటును కూడా నియంత్రించవచ్చు. యాలకులలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొవ్వును తగ్గిస్తుంది..
యాలకులు ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఇది శరీరం నుండి టాక్సిన్లను తొలగించి ఊబకాయాన్ని తొలగిస్తుంది.
ల్యుకోరియా..
ల్యుకోరియాతో బాధపడుతున్న మహిళలకు యాలకులు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు. రెండు యాలకులను బాగా నమిలి తిని, నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుందట.
నోటి పూతలు..
నోటి పూతలు ఇబ్బంది పెడుతుంటే యాలకులను నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తినాలి. ఇది నోటి పూత నొప్పి, పుండు నుండి ఉపశమనం లభిస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...