ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే సరి!
ఫ్యాటీ లివర్ ఒక తీవ్రమైన సమస్య. ఇందులో కాలేయం సరిగా పనిచేయదు. దీనికి ప్రధాన కారణాలు పేలవమైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి.తప్పుడు ఆహారపు అలవాట్లు కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని సందర్భాల్లో ఊబకాయం, మధుమేహం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సాధారణంగా మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ దీని గురించి తెలిసే సమయానికి కాలేయానికి చాలా నష్టం జరుగుతుంది. కాలక్రమేణా, ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రమవుతుంది. ఇది అధిక రక్తపోటు, కాలేయ క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని ఏమాత్రం అనిపించినా, ఫ్యాటీ లివర్ సమస్య రాకూడదన్నా ఈ కింది టిప్స్ పాటించాలి.
ఆహారం..
ఆహారంలో మంచి మొత్తంలో పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఇది కాకుండా, గోధుమ, మిల్లెట్, జొన్న, మొక్కజొన్న, రాగి మొదలైన తృణధాన్యాలు తినాలి.
లీన్ ప్రోటీన్..
మనకు ప్రోటీన్ ఎంత ముఖ్యమో బాగా తెలుసు. అయితే ఫ్యాటీ లివర్ రాకూడదంటే లీన్ ప్రోటీన్‌ను ఎంచుకునేలా జాగ్రత్త వహించాలి. చేపలు, టోఫు, చికెన్ బ్రెస్ట్, పచ్చి బఠానీలు, చిక్‌పీ, సోయాబీన్, వేరుశెనగ మొదలైనవి.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
ఆరోగ్యకరమైన కొవ్వు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. దీని కోసం అవోకాడో, నట్స్ లో వాల్నట్, బాదం. విత్తనాలలో గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. నూనెలో ఆలివ్ నూనెను వాడాలి.
ట్రాన్స్ కొవ్వులు అవాయిడ్ చెయ్యాలి..
శరీరంలోని అదనపు సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులు వాపుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని నివారించాలి. ఇవి సాధారణంగా మాంసాలు, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీనిని తీసుకోవడం మానేయడం మంచిది.
ఇవి మాత్రమే కాకుండా కృత్రిమ చక్కెరలు, కాపీ, టీ, శీతలపానీయాలు, కెఫిన ఎక్కువ ఉన్న పదార్థాలు మానేయాలి. శరీరాన్ని శుద్ది చేసేందుకు నీరు బాగా తాగాలి. పసుపు, అల్లం, తేనె, మిరియాలు, జీలకర్ర, సొంపు వంటి డిటాక్స్ పదార్థాలు వాడాలి. ఇలా చేస్తే ఫ్యాటీ లివర్ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
*నిశ్శబ్ద.