పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. ఆహారంలో ఈ విటమిన్లు మిస్ అవుతున్నట్టే..!
posted on Feb 1, 2025 @ 9:30AM
ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే.. తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. చదువు దగ్గర్నుంచి తిండి వరకూ ప్రతి చిన్నా పెద్దా విషయాలు దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఇంత జరిగినా కూడా పిల్లల ఎత్తు పెరగకపోతే ఆందోళన చెందే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నిజానికి పిల్లలు శారీరకంగా ఎదుగుదల బాగుండాల్సిన వయసులో అలా లేకపోతే వారు తీసుకునే ఆహారంలో ఏదో లోపిస్తున్నట్టే లెక్క. పిల్లలు తగినంత ఎత్తు ఉండటం అనేది శరీర ఆకృతి అందంగా కనిపించడం కోసమే కాదు.. అది ఆరోగ్యానికి, ఫిట్ననెస్ కు కూడా సంబంధించిన విషయం. అయితే ఎత్తు తక్కువ అనే సమస్యతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సాధారణంగా కొన్ని హార్మోన్ల లోపం ఈ సమస్యకు ప్రధాన కారణం. ఏ విటమిన్ లోపం వల్ల పిల్లల ఎత్తు పెరగడం లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గ్రోత్ హార్మోన్..
గ్రోత్ హార్మోన్ లోపం (GHD) తక్కువ ఎత్తుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, విటమిన్ డి లోపానికి పిల్లల ఎత్తు తక్కువగా ఉండటానికి కూడా సంబంధం ఉంటుంది. విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. ఎముకల అభివృద్ధికి కూడా అవసరం. ఇలాంటి పరిస్థితిలోో శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అది నేరుగా ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎత్తు, ఎముకల అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది.
10 ml కంటే తక్కువ విటమిన్ లోపం సంవత్సరానికి 0.6 cm ఎత్తులో తక్కువ పెరుగుదలకు దారితీస్తుంది. విటమిన్-డి లోపం ఉంటే పిల్లలలో కింది లక్షణాలు ఉింటాయి.
ఎముకల నొప్పి,
త్వరగా అలసిపోవడం,
జుట్టు రాలడం,
నిద్రపోవడం,
ఎప్పుడూ కోపంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి.
పిల్లలో విటమిన్-డి లోపం అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేపాలి. ఉదయం సమయంలో సూర్యుడి లేత కిరణాలలో పిల్లలను కొంత సమయం గడిపేలా ఎంకరేజ్ చేయాలి. ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా సహజంగా లభించే విటమిన్-డి శరీరాన్ని చాలా తొందరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. అలాగే పాలు, గుడ్డులోని పసుపు భాగం తినాలి. నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలి. ఇవన్నీ చేస్తే పిల్లలో ఎత్తు పెరుగుదల గమనించవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...