చలికాలంలో ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ అయిదు రకాల సూప్ లు ట్రై చేయండి..!
posted on Jan 23, 2025 @ 9:30AM
చలికాలం శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజుల్లో తీసుకునే ఆహారం స్థానంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో వేడిగా ఉన్న ఆహారాలు కానీ పానీయాలు కానీ తీసుకోవాలని అనిపిస్తుంది. అయితే వేడిగా ఉన్న లిక్విడ్ ఆహారాలు తీసుకునే విషయంలో కాఫీ, టీ వంటి డ్రింక్స్ ఏ మొదటి స్థానంలో ఉంటాయి. కానీ చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సూపులు బెస్ట్ ఆప్షన్. ఇవి ఒకవైపు శరీరానికి ఓదార్పును ఇస్తూ.. మరొకవైపు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా చలికాలంలో ఇన్ఫెక్షన్లు, అనారోగ్యం చేయడం, సీజన్ సమస్యల నుండి ఊరట లభిస్తుంది. ఇంతకీ శరీరానికి అంతగా మేలు చేసే సూపులు ఏంటో.. వాటిలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుంటే..
పాలకూర, బఠానీ సూప్..
పాలకూర ఐరన్ కంటెంట్ కు ప్రసిద్ధి చెందింది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు పాలకూర సమృద్దిగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు. ఇకపోతే పాలకూర, బఠానీ సూప్ లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో శరీరానికి తగినంత ఐరన్ లభించడంతో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా లభిస్తుంది.
బ్రోకలీ సూప్..
బ్రోకలీ, క్యాప్సికం రెండింటి లోనూ విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్రోకలీ సూప్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత విటమిన్-సి అందుతుంది.
బీన్ సూప్..
బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. బీన్స్ లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు కూడా ఉంటాయి. బీన్స్ తో తయారు చేసిన సూప్ ను చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి.
మెంతి కూర సూప్..
మెంతి కూర చేదు గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తారేమో.. కానీ మెంతికూరతో సూప్ చేసుకోవచ్చు. లేత మెంతికూర ను సూప్ గా తయారు చేసుకుని తాగితే బోలెడు లాభాలు ఉంటాయి. మెంతికూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా సహాయపడుతుంది.
*రూపశ్రీ.