హైదరాబాదీలపై మళ్లీ "వరుణ" కరుణ..!
హైదరాబాదీలపై వరుణుడు మళ్లీ కరుణ చూపించాడు. ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడుతున్న ప్రతీసారి వరుణుడు భాగ్యనగరంపై కుంభవృష్టి కురిపిస్తూనే ఉన్నాడు. తాజాగా సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే కొద్ది రోజుల క్రితం ఈదురుగాలులతో విరుచుకుపడినట్టు వరుణుడు మరోసారి కన్నెర్ర చేస్తాడేమోనని ప్రజలు కాస్త భయాందోళనలకు గురయ్యారు. మొత్తం మీద రెండు రోజులుగా ఎండవేడిమిని ఎదుర్కొన్న నగరవాసులు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.