రాహుల్ గాంధీ మా సర్వెంట్.. స్టాంపేసిన పోలీసులు

  ఉత్తర ప్రదేశ్లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ ఇంట్లో పనిమనిషిగా చేసిన వైనం బయటపడింది. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్పేర్ సొసైటీ పరిశీలనలో ఈ ఉదంతం బయటపడింది. ఓ వ్యక్తి రాహుల్ గాంధీ తన ఇంట్లో హెల్పర్ గా ఉన్నాడంటూ.. ఆయన ఫోటోను అతికించి పోలీసులకు వెరిఫికేషన్ ఫారమ్ ఇచ్చాడు. అంతేనా రాహుల్ చిరునామాను హౌస్ నంబర్ 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీ అని, వృత్తి వద్ద రాజకీయాలని, మెరిటల్ స్టేటస్ వద్ద పెళ్లి కాలేదని కూడా రాశాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు ఇవేమి గమనించకుండా.. దాన్ని ఓకే చేసి.. స్టాంపేసి సంతకం కూడా పెట్టేశారు. మరోవైపు దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఇది ఎవరో ఆకతాయి చేసిన పని అని అంటున్నారు.

టీడీపీ మహానాడు ప్రారంభం..

  తిరుపతిలో టీడీపీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు కార్యక్రమానికి వచ్చారు. పార్టీ పతాకం ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రక్త శిబిరాన్ని ప్రారంభించారు. ఇంకా సభా ప్రాంగణంలో త్రీడీ షో, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివస్తున్నారు. దీంతో తిరుపతి నగరం పసుపుశోభతో నిండిపోయింది. కాగా జాతీయ పార్టీగా ఏర్పడిన తరువాత టీడీపీ తొలి మహానాడు ఇదే. కార్యక్రమానికి దాదాపు 30 వేల మంది హాజరవుతున్న నేపథ్యంలో అందరికి ఘుమఘుమలాడే వంటకాలు అందిస్తున్నారు.

ఏపీకి హోదా రాదు.. సింగపూర్ లా అమరావతి కలే.. వెంకయ్య

  ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు.. ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్, టోక్యో వంటి నగరాల స్థాయిలో నిర్మించడం కలే.. ఇంతకీ ఈ మాటలు ఎవరంటున్నారా అని అనుకుంటున్నారా.. నాడు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కాదు.. తాము అధికారంలోకి వస్తే ఏకంగా పదేళ్లు ప్రత్యేక హోదా కల్సిస్తాం అని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా చేసిన వ్యాఖ్యలు. ఎన్డీయే ప్రభుత్వం పాలన రెండెళ్లు పూర్తయిన సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేసి తెలుగు ప్రజలకు నిరాశని మిగిల్చారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయి.. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చి పరిస్థితి లేదు అని అన్నారు. అంతేకాదు రాజధాని అంటే.. అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసానికి క్వార్టర్లు ఉంటే చాలు.. అభివృద్ధి నిదానంగా సాగుతుంది అని చెప్పుకొచ్చారు.  హైదరాబాద్ తో అమరావతిని పోల్చవద్దని.. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని చెప్పి టీడీపీ ప్రజలను మోసం చేయోద్దని హితవు పలికారు. మొత్తానికి వెంకయ్య నాయుడు కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పేశారు. ఇంక మిగిలింది ప్రధాని మోడీ ఒక్కరే. ఆయన ఒక్కరే ప్రత్యేక హోదా రాదని డైరెక్ట్ గా చెప్పలేదు.

చంద్రబాబు మీటింగ్ లో మందుబాబు హడావుడి...

  విజయవాడలో రెండు రోజుల నుండి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో ఓ మందుబాబు హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. భారీ బందోబస్తు మధ్య నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సదరు మందుబాబు ఫూటుగా మద్యం సేవించి దర్జాగా సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతను అంత దర్జాగా లోపలికి వెళ్లినా కూడా భద్రతా సిబ్బంది ఎవరూ అతనిని గుర్తించలేకపోయారు. దాదాపు అరగంటకు పైగా అతను అక్కడ కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లంచ్ చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి వచ్చే సరికి కూడా అతను అక్కడే కూర్చుని ఉండటంతో.. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ లు అతనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఆ తరువాత పోలీసులు హడావుడి చేసి అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన అతను తాను టీడీపీ నేతను అని చెప్పగానే వదిలిపెట్టారు. మరోవైపు ఇంత నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   విజయవాడలో రెండు రోజుల నుండి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో ఓ మందుబాబు హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. భారీ బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ సదస్సులో సదరు మందుబాబు ఫూటుగా మద్యం సేవించి దర్జాగా సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతను అంత దర్జాగా లోపలికి వెళ్లినా కూడా భద్రతా సిబ్బంది ఎవరూ అతనిని గుర్తించలేకపోయారు. దాదాపు అరగంటకు పైగా అతను అక్కడ కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లంచ్ చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి వచ్చే సరికి కూడా అతను అక్కడే కూర్చుని ఉండటంతో.. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ లు అతనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఆ తరువాత పోలీసులు హడావుడి చేసి అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన అతను తాను టీడీపీ నేతను అని చెప్పగానే వదిలిపెట్టారు. మరోవైపు ఇంత నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్సీయూ.. రాత్రికి రాత్రే శివ‌లింగం, నంది, నాగ దేవ‌త విగ్ర‌హాలు

దళిత విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత హెచ్సీయూ వివాదాలకు అడ్డాగా మారింది. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ నేతలు కూడా తమ స్వలాభానికి వాడుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా హెచ్సీయూలో వాతావరణం కాస్త నెమ్మదించింది కదా అనుకునే లోపే మరో వివాదానికి తెరపడినట్టు ఉంది. యూనివర్శిటీలో ఉన్నట్టుంది ఒక్కసారిగా శివ‌లింగం, నంది, నాగ దేవ‌త విగ్ర‌హం కనపడడం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో యూనివర్శిటీలో విగ్రహాలు పెట్టడంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికే అంగీకరించలేదు.. అలాంటిది ఇలాంటి మత పరమైన విగ్రహాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక మ‌తానికి సంబంధించిన భావజాలాలను వేరొక‌రిపై రుద్దడం భావ్యం కాద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మరి రాత్రికి రాత్రే విగ్రహాలు ఎవరు పెట్టారో.. ఏ ఉద్దేశ్యంతో పెట్టారో.. దీనిపై ముందు ముందు ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి తెలంగాణ సర్వే..

  తెలంగాణ ప్రభుత్వం ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ ఒక్క రోజులోనే రాష్ట్రమంతటా సర్వే చేయించిన సంగతి తెలిసిందే. 19 ఆగ‌స్టు 2014న‌  ఒకే రోజు 4ల‌క్ష‌ల మంది ఉద్యోగుల సాయంతో 1.09కోట్ల కుటుంబాల‌ను స‌ర్వే చేసింది ప్రభుత్వం. దీనికి గాను ఈ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో  ఇప్పటివరకు దేశంలో ఇలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని లిమ్కాబుక్ నిర్వాహ‌కులు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించి.. ఈ స‌ర్వేను రికార్డుల్లోకి ఎక్కిస్తున్న‌ట్లు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ను ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు తెలిపారు.

టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న నేపథ్యంలో.. కొద్ది రోజుల నుండి సైలెంట్ అయినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుండి వైసీపీ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అశోక్ రెడ్డి వైకాపాకు గుడ్ బై చెబుతారని దాదాపు నెలన్నర క్రితమే గుసగుసలు వినిపించాయి. అప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మార్పుపై ఈరోజు రాచర్ల మండలానికి చెందిన కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోదామా? అని ఆయన కార్యకర్తలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మోడీ ఇండియనా లేక ప్రవాస భారతీయుడా..? విరుచుకుపడిన శివసేన..

బీజేపీ పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శివసేన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడింది. మోడీ విదేశీ పర్యటనల గురించి నిప్పులు చెరిగింది. మోడీ ఎప్పుడు చూసిని విదేశీ పర్యటనలు చేస్తుంటారు.. ఆయన భారత పౌరుడా..? లేక ప్రవాస భారతీయుడా..? అంటూ తన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. అంతేకాదు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా.. ఒక్క రాష్ట్రంలో మాత్రమే గెలుపొంది.. మిగిలిన రాష్ట్రాల్లో తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అలాంటిది.. ఆ విషయాన్నే మరిచిపోయి సంబరాలకు ఎలా రెడీ అవుతున్నారు అని ఎద్దేవ చేశారు. మోదీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించినా, అవి క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర కావడం లేదని.. బ్లాక్ మనీని తిరిగి వెనక్కు తెప్పించడంలోనూ మోదీ సర్కారు విఫలమైందని శివసేన దుయ్యబట్టింది. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మైనర్ బాలికపై అత్యాచారం.. కేజ్రీవాల్ పరామర్శ.. సోనియాగాంధీ కూడా..!

  ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం ఓ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను రైల్వే ట్రాక్ పై పడేసి పారిపోయాడు. అయితే ప్రస్తుతం ఆ బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈరోజు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నేరాలు బాగా పెరిగిపోయానని.. అవి అదుపులోకి రావాలంటే ప్రజలు, న్యాయాధికార సంస్థలు కలిసి పనిచేయాలని.. దానికి తగిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఢిల్లీలో పూర్తిస్థాయి శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గంధీ కూడా బాలికను పరామర్శించడానికి ఎయిమ్స్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సంఘటన పట్ల స్థానిక మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేప‌ట్టాయి.

బైక్‌కు ఏసీ ఉంటే..!

ఎండలో బైక్‌పై వెళ్లాలంటే ఎంత మంటగా ఉంటుందో కదా..? ఆ టైంలో ఏసీ కార్లలా..ఏసీ బైకులు కూడా ఉంటే బాగుంటుదనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి వారి ఆశలు నెరవేరే రోజులు ఎంతో దూరం లేదు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థ హోండా ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బైకులకు ఏసీ యూనిట్‌‌ను అమర్చే విధానంపై హోండా పేటెంట్ పొందింది. పేటెంట్‌ కోసం చేసిన దరఖాస్తులో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏసీ యూనిట్, ఓ చిన్న లగేజ్ బ్యాగ్ అంత ఉంటుంది. ఓ చిన్న బ్లోయర్ యూనిట్, రీచార్జబుల్ బ్యాటరీ ఇందులో ఉంటాయి. ఇందులోంచి గాలి వేగంగా బయటకు వచ్చి సరాసరి శరీరాన్ని , మెడను తాకుతూ, హెల్మెట్ లోపలి నుంచి ముఖానికి అందుతుంది. ఇది చాలా సింపుల్‌గా ఉన్న ఎయిర్‌ కండిషనింగ్ విధానమని నిపుణులు వ్యాఖ్యానించారు.  మరింత చల్లదనం కోసం ఇందులో ఐస్ క్యూబులు వేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటప్పుడు మాత్రం ఏసీ యూనిట్ పనితీరుపై కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఈ ప్రయోగంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

మహానాడు ఏర్పాట్లపై లోకేశ్ ఫైర్.. ఇవేం ఏర్పాట్లు?

  టీడీపీ పార్టీ అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ 'మహానాడు' రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తిరుపతి వేడుకైంది. ఈ సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చూసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దసేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమ ఏర్పాట్లు చూసిన నారా లోకేశ్ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఇవేం ఏర్పాట్లు? ఇలాగైతే ఈ వేడుకను సంతోషంగా ముగిస్తామా? వెంటనే మార్పులు చేయండి. సాయంత్రంలోగా పటిష్ట ఏర్పాట్లు పూర్తి కావాలి’’ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారట. దీంతో పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెనువెంటనే రంగంలోకి దిగిపోయి లోకేశ్ చెప్పిన మేరకు ఏర్పాట్లలో మార్పులు చేర్పులు చేసేందుకు చర్యలు చేపట్టారు.

మాజీ ముఖ్యమంత్రి కాన్యాయ్ పై దాడి.. కారుకు నిప్పు

  బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కాన్యాయ్ పై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. ఈ ఘటన బీహార్ లోని దుమారియాలో జరిగింది. అటుగా వెళ్తున్న మాంఝీ కాన్వాయ్ పై దుండగలు రాళ్లతో దాడి చేసి.. ఆపై ఓ కారుకు నిప్పు కూడా పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దాడి ఎవరు చేశారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.   కాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఒకప్పుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అనుచరుడిగా ఉండేవాడు. అతని సహకారంతోనే.. ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయితే సీఎం అయిన తరువాత నితీశ్ కు వ్యతిరేకంగా మారిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాంఝీ సొంత కూటమి పెట్టుకుని బీజేపీ మద్దతుతో పోటీ చేసినా కనీసం తాను ఒక్కరు కూడా గెలవలేకపోయారు.

రైల్లో బెర్త్ దొరకలేదా.. అయితే విమానంలో వెళ్లొచ్చు..

  ఇప్పటికే రైలు టికెట్లు రద్దు.. బుకింగ్ విషయంలో పలు కీలక మార్పులు చేసిన రైల్వేశాఖ ఇప్పుడు మరో శుభవార్తను రైలు ప్రయాణీకుల ముందుకు తీసుకొచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకొని.. ఒక వేళ బెర్త్ దొరకని నేపథ్యంలో.. సదరు ప్రయాణికులు విమానంలో ప్రయాణించే అవకాశం దక్కింది. ఈ రకమైన ఒప్పందం ఎయిర్ ఇండియా, ఐఆర్సీసీటీల మధ్య కుదిరింది. రైలులో బెర్త్ దొరకని వ్యక్తులు విమానంలో ప్రయాణించవచ్చు.. అయితే దానికి ఇంకొంచం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. రైలులో మొదటి తరగతి ప్రయాణీకులు విమాన యానానికి ఏమీ అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎసి-2 టైర్‌ ప్రయాణీకులు మాత్రం 2 వేల రూపాయిలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఈ సౌక‌ర్యం అందుబాటులోకి రానున్న‌ది.