నిద్రరావడం లేదా.. మీకోసం యాప్..
posted on Jun 15, 2016 @ 3:20PM
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లకి యాప్ప్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ మనం ఎన్నో రకాల యాప్ప్ వినుంటాం. అయితే ఇప్పుడు మరో యాప్ వచ్చింది. అదేంటనుకుంటున్నారా. నిద్రపుచ్చే యాప్. నిద్రపుచ్చడానికి కూడా యాప్ ఉంటుందా..నిజంగానే నిద్రొస్తుందా అని అనుకుంటున్నారా. వస్తుందనే చెబుతున్నారు. సిమన్ ఫ్రేజర్’ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకుడు బ్యూడోయిన్. నిద్రరాని వారు ఆ సమస్యను అధిగమించేందుకు కెనడాకు చెందిన పరిశోధకులు ఓ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను అభివృద్ధి చేశారు. నిద్రపోవాల్సిన సమయంలో మెదడులో మెదిలే అనవసర ఆలోచనలను దూరం చేసేందుకు సీరియల్ డైవర్స్ ఇమేజినింగ్(ఎస్‌డీఐ) విధానాన్ని ఈ అప్లికేషన్‌లో వాడినట్లు.. మానసిక ప్రశాంతతను ఇచ్చే పదాల రికార్డులను ఈ యాప్ ప్లే చేస్తుందని. అందులోని అర్థానికి సంబంధించిన రూపాన్ని మనసులో వూహించేందుకు వీలుగా ఒక పదాన్ని 8 సెకన్లలో చెబుతుంది. ఆ తర్వాత మరో యాధృచ్చిక పదం వస్తుంది. అలా పదాలను వింటూ కొద్ది సేపటికే మానసిక ప్రశాంతత మెరుగుపడి నిద్రలోకి జారుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని యాప్ప్ వస్తాయో..