ఆడవాళ్లకు అలెర్ట్.. మార్కెట్లో దొరికే కాటుకను ఎడాపెడా వాడేస్తే ఇంతే!


ఆడవాళ్లకు అలెర్ట్.. మార్కెట్లో దొరికే కాటుకను ఎడాపెడా వాడేస్తే ఇంతే!



ఆడవాళ్ల అందాన్ని కవులు మామూలుగా వర్ణించలేదు. ముఖంలో ప్రతి భాగాన్ని చాలా ప్రత్యేకంగా అభివర్ణిస్తారు. నిజానికి కవుల వర్ణణ వల్ల అమ్మాయిల ముఖారవిందానికి ఎక్కువ మార్కులు వస్తాయో.. అమ్మాయిల అందం వల్ల కవులకు అంత మంచి వర్ణనలు దొరుకుతాయో చెప్పడం కాస్త కష్టమే.. అమ్మాయిల ముఖంలో కళ్ళను కలువరేఖలు అని వర్ణిస్తుంటారు. ఇక కళ్ళకు పెట్టుకునే కాటుకను చీకటితోనూ, నల్లని  తీర రేఖతోనూ పోలుస్తారు. కళ్లకు ఎక్కడలేని అందాన్ని తెచ్చిపెట్టే కాటుక ఈనాటిది ఏమీ కాదు.. కాటుక దిద్దిన కళ్లు చూస్తే ఫిదా అవ్వనివారు ఉండరు. ఇప్పట్లో సాధారణంగా రెఢీ అయినా సరే..  అమ్మాయిలు కేవలం కళ్లకే కాదు.. కళ్లకు కాస్త అటు ఇటు కూడా కాటుకను పొడవునా పెట్టి కనురెప్పలతో కలిపి అట్రాక్ట్ చేస్తారు. కానీ ఇప్పట్లో మార్కెట్లో దొరుకుతున్న కాటుక ఎడాపెడా వాడేయడం ఎంత వరకు మంచిదనే విషయం ఇప్పట్లో చర్చకు దారితీస్తోంది. మార్కెట్లో దొరికే కాటుక ఎక్కువ వాడితే కలిగే నష్టాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే..

కళ్ళు పొడిబారతాయి..

కాటుక తయారీలో  కొన్ని పదార్థాలు వినియోగిస్తారు. వీటి వల్ల  కళ్ళు పొడిగా మారుతాయి . దీని కారణంగా, కళ్లలో దురద లేదా నొప్పి ఎదురవుతుంది. కళ్లు పొడిబారే సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే కళ్లు దెబ్బతింటాయి.

కళ్లలో అలెర్డీ..

మార్కెట్లో దొరికే కాటుకను రెగ్యులర్ గా వేసుకునే అలవాటు ఉన్నవారికి కళ్ళ అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కళ్ల చుట్టూ దురద, వాపు, దద్దుర్లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కంటి చికాకు..

కాటుకను రెగ్యులర్ గా పెడుతూ ఉంటే కళ్లలో చికాకు వస్తుంది. కళ్లలో నొప్పి వంటి ఇబ్బందులు కలుగుతాయి.


డార్క్ సర్కిల్స్..

కాటుకను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ మచ్చలు వస్తాయి. కొందరికి లైట్ గా ఉన్న డార్క్ సర్కిల్స్ కాటుక కారణంగా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కాజల్ స్మడ్జ్ ఫ్రూఫ్ కాదు కాబట్టి ఇలా జరుగుతుంది.

కళ్లలో నీరు కారడం..

రెగ్యులర్ గా కాటుక పెడుతూ ఉంది అది కంటి మీద ప్రభావం చూపించి కళ్లలో నీరు రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైనా పండుగలు, శుభకార్యాలు, ఫంక్షన్స్, పార్టీలు మొదలైన సందర్బాలలో మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేసే కాటుకను వాడాలి. మార్కెట్లో కొనే కాటుక వాడేముందు దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. లేకపోతే గడువు దాటిన కాటుక వల్ల కొన్నిసార్లు కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.


                                         *రూపశ్రీ.