ఆడవాళ్లు 30 ఏళ్లు దాటాక ఈ టెస్టులు ఖచ్చితంగా చేయుంచుకోవాలి..!

ఆడవాళ్లు 30 ఏళ్లు దాటాక ఈ టెస్టులు ఖచ్చితంగా చేయుంచుకోవాలి!

మహిళ ఆరోగ్యం ఎప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒక్కోక్కో దశ దాటేకొద్దీ వారి ఆరోగ్య పరంగా సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటిని అధిగమించి సక్సెస్ గా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం కాస్త క్లిష్టమైన విషయమే.. కానీ  మహిళల ఆరోగ్య దృష్ట్యా ఇలా చేయడం తప్పనిసరి. అయితే మహిళలు 30ఏళ్లు దాటిన తరువాత కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల వారి భవిష్యత్తులో కొన్ని సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంతకీ ఆ టెస్టులేంటంటే..

లివర్ టెస్ట్..

30ఏళ్ల తరువాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా హైపటైటిస్ సి, హైపటైటిస్ బి వంటి లివర్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి.

కంటి పరీక్ష..

చాలామంది దృష్టిలోపం, కళ్లజోడు వాడటం లేదా కంటికి సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కంటి పరీక్ష చేయించుకుంటారు. కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆప్టిక్ నరాలకు ప్రమాదం ఉన్నట్టు తెలిస్తే మాత్రం రెగ్యులర్ గా పరీక్ష చేయించుకోవాలి.

థైరాయిడ్..

30ఏళ్ళు దాటాకా మహిళలకు థైరాయిడ్ ప్రమాదం ఎక్కువ. దీని కారణంగానే చాలామంది బరువు పెరగడం, బరువు తగ్గడం, చర్మం పొడిబారిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి మాత్రమే కాకుండా నిద్రలేమి, గుండె దడ, బరువులో ఊహించని మార్పులు కూడా ఉంటాయి.

బోన్ టెస్ట్..

మగవారితో పోలిస్తే మహిళలలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. మహిళలలో ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి.   పైపెచ్చు బోలు ఎముకల వ్యాధి కూడా మహిళలలోనే ఎక్కువ. ఇక మహిళలలో గర్భం దాల్చడం ప్రసవం వంటి సమస్యల కారణంగా ఎముకలు బలహీనం ఉంటాయి.  అందుకే బోన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది.

ఈసీజీ..

ఈసీజీ ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ టెస్ట్ అని అంటారు. కుటుంబంలో ఎవరికి గుండెజబ్బు లేనప్పుడు 35 ఏళ్ల తరువాత ఈ టెస్ట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తారు.  దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చు.  దీన్ని సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది.

ఇవి మాత్రమే కాకుండా..

కంప్లీట్ బ్లడ్ కౌంట్...
ఎలివేటెడ్ సీరమ్ క్రియాటినిన్ పరీక్ష
పెల్విక్ టెస్ట్
బ్రెస్ట్ టెస్ట్
STI వంటి టెస్టులు కూడా చేయించుకోవడం ద్వారా మహిళలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.

                                   *నిశ్శబ్ద.