ఎరుపురంగు లిప్స్టిక్  అంటే అస్సలు ఇష్టముండదా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి!

ఎరుపురంగు లిప్స్టిక్  అంటే అస్సలు ఇష్టముండదా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి!

ఎరుపురంగు చాలా బోల్డ్ గా ఉంటుంది. చాలావరకు ఎరుపు రంగును సెలెక్ట్ చేసుకునేవారు తక్కువ. ఎరుపులో వివిధ రకాల షేడ్స్ అయినా ఎంపిక చేసుకుంటారేమో కానీ పూర్తీ స్పష్టమైన ఎరుపును ఎంపికచేసుకునేవారు అరుదే. ఇక లిప్ స్టిక్ విషయంలో అయితే మరీనూ. చాలామంది లైట్ కలర్స్ ఎంచుకుంటారు. మరికొందరు పెదాలు గులాబీ రేకుల్లా ఉండటానికి పింక్ రంగును ఎంచుకుంటారు. వీటిలో వివిధ షేడ్స్ ట్రై చేస్తారు. కానీ ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకున్నా ఎబ్బెట్టుగా కనిపించకుండా అందరి కళ్ళకు వావ్ అనిపించేలా చేయాలంటే అసలు ఎరుపు రంగు లిప్ స్టిక్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి.   ధైర్యంగా, ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో,  ఎలాంటి బెరుకు లేకుండా   ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను అప్లై చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. అవేంటంటే..

లిప్ స్టిక్ ఎంచుకునే ముందు సౌకర్యాన్ని చూసుకోవాలి. మ్యాట్, గ్లోస్, షీర్, క్రీమ్,  లిక్విడ్  ఇలా చాలారకాల లిప్ స్టిక్స్ మార్కెట్లో లభ్యమవుతాయి. సౌకర్యాన్ని  ఎంచుకోవాలి.

లిప్ స్టిక్ అప్లై చేయడానికి ముందు పెదవులు తేమగా ఉండటం అవసరం. అందుకని పెదవులకు మంచి లిప్ బామ్ లేదా ప్రైమర్ అప్లై చెయ్యాలి. ఆ తరువాత టిష్యూ పేపర్ తో సున్నితంగా అద్దుతూ తుడవాలి. అంతే తప్ప టిష్యూతో రుద్దకూడదు. ఆ తరువాత పెదవుల మీద తేలికపాటిగా పౌడర్ అద్దాలి. అలా చేస్తే లిప్స్టిక్ అప్లై చేసిన తరువాత ఒద్దికగా ఉంటుంది.  లిప్స్టిక్ అప్లై చేయవచ్చు.   ఇలా చేస్తే పెదవులకు లిప్ స్టిక్ వేస్తే అది ఆకర్షణ పెరుగుతుంది.

లిప్ స్టిక్ అప్లై చేసేటప్పుడు చాలామంది పెదవుల మూలలు, షేప్ దగ్గర బోల్తా వడుతుంటారు. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే మొదట లిప్ లైనర్ తో షేప్ గీసుకోవాలి. ఇందుకోసం లిప్ లైనర్ పెన్సిల్ ఉపయోగించాలి.

లిప్టిక్ సెలక్షన్ లో అంతగా అనుభవం లేనివారు  అయోమయం  చెందుతుంటే కన్ఫ్యూజ్ కాకుండా  రష్యన్ రిడ్ వంటి షేడ్  బాగుంటుంది. ఇది ఎలాంటి స్కిన్ టోన్ కు అయినా బాగుంటుంది.

పెదవుల మీద పౌడర్ కూడా అప్లై చేశాక లిప్స్టిక్ అప్లై చేయాలి. మొదట ఒక కోటింగ్ ఇచ్చాక టిష్యు పేపర్ ను పెదవుల  మధ్య ఉంచుకని పెదవులు రెండూ కలిపి ఒత్తితే పెదవుల మీద ఏవైనా అదనపు నూనెలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆ తరువాత టిష్యూ తీసేసి  పెదవుల మీద మళ్లీ లైట్ గా ఇంకొక పొర లిప్స్టిక్ వేయాలి. పెదవుల మూలలు ఆకర్షణంగా కనిపించడానికి కొద్దగా కన్సీలర్ ఉన్న బ్రష్ తీసుకుని లిప్స్టిక్ ను మూలలకు అప్లై చెయ్యాలి.

లిప్స్టిక్ అప్లై చేసిన తరువాత పెదవులు దట్టంగా కనిపించడం కోసం పెదవుల మీద తేలికగా సెట్టింగ్ పౌడర్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల పెదవుల మీది లిప్స్టిక్  వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది.  ఎరుపురంగు చాలా తొందరగా అందరికీ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అప్లై చేసేటప్పుడు  పొరపాటున దంతాలకు లిప్స్టిక్ రంగు ఏమైనా అంటుకుని ుందా లేదా చెక్ చేసుకోవడం మాత్రం మరచిపోకూడదు.

                                                                    *నిశ్శబ్ద.