మహిళలు ప్రెగ్నెన్సీ టైం లో వీటికి దూరంగా ఉండాలి..!

మహిళలు ప్రెగ్నెన్సీ టైం లో వీటికి దూరంగా ఉండాలి..! మహిళల ఆరోగ్యం చాలా క్లిష్టమైనది. చిన్నతనం నుండి ఒక్కో దశలో ఒక్కో మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ మార్పులు అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మహిళ జీవితాన్ని, శరీర తత్వాన్ని పూర్తీగా మార్చేసే దశ గర్భం దాల్చడం.  గర్బం దాల్చడం, ప్రసవించడం చాలా పెద్ద మార్పులకు కారణం అవుతాయి.  గర్భధారణ సమయంలో తల్లి తన ఆరోగ్యం గురించే కాకుండా తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది.  ఈ క్రమంలో ఏ ఆహారాలు, పానీయాలు  తీసుకోవడం వల్ల మహిళల ఫిట్‌నెస్,  ఆరోగ్యం దెబ్బతింటుందో తెలుసుకుంటే.. తల్లిబిడ్డలు క్షేమంగా ఉండొచ్చు. అవేంటో తెలుసుకుంటే.. కెఫీన్.. గర్భాధారణ సమయంలో టీ, కాఫీ వంటి కెఫీస్ కలిగిన ఆహారాలను నివారించాలని వైద్యులు చెబుతున్నారు.  ఇవి శిశువు ఎదుగుదలకు, అభివృద్దికి ఆటంకం కలిగిస్తుంది అంటున్నారు. పండ్లు.. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఏ పండ్లు తినాలి, ఏవి  తినకూడదు అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయి,  ద్రాక్ష, మామిడి, పైనాపిల్ తినడం వల్ల గర్భిణి స్త్రీలకు వెన్ను నొప్పి, అకాల ప్రసవం లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయట. ఆహారం.. తీసుకునే ఆహారం మీదే చాలామంది ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండాలి.   ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోవడం మానేయాలి.  వీటిలో ఎక్కువ రసాయనాలు ఉంటాయి.  వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. శుభ్రత.. మార్కెట్ నుండి తెచ్చిన ఏదైనా పండ్లు లేదా కూరగాయలను కడగకుండా తినడం లేదా తయారు చేయడం ప్రమాదకరం.  వీటిలో క్రిములు, రసాయనాలు ఉంటాయి.  ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. శుభ్రం చేయకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ధూమపానం, మద్యపానం.. బారతీయ మహిళలు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగానే ఉంటారు. కానీ కొందరు విదేశీ కల్చర్ పట్ల ఆకర్షితులై గర్భధారణ సమయంలో పొగతాగడం,  మద్యం సేవించడం వంటివి చేస్తారు. ఇవి కడుపులో బిడ్డ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. వీటిలోని నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ శిశువు ఎదుగుదలను దెబ్బ తీస్తాయి. జంక్ ఫుడ్.. నేటికాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వ్యసనంగా మారిన ఆహారపు అలవాటు జంక్ ఫుడ్ తినడం.  వీటి వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభించవు.  కేవలం కేలరీలు, ఫ్యాట్స్ తప్పితే వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు ఏమీ ఉండవు. జంక్ ఫుడ్ తినడం వల్ల స్త్రీలు, పిల్లలు ఇద్దరికీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పచ్చి ఆహారాలు.. చాలామందికి పచ్చి మాంసం, పచ్చి గుడ్లు, అలాగే పచ్చిగా ఉన్న ఆహారాలు తినే అలవాటు ఉంటుంది. సాల్మోనెల్లా, పాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా కారణంగా తల్లి, బిడ్డ  ఇద్దరికీ అనారోగ్యం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                                 *రూపశ్రీ.

మహిళల్లో PCOS ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవి..!

మహిళల్లో PCOS ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవి..! PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. చాలా మంది మహిళలు  తరచుగా  ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.  కానీ దీన్ని గుర్తించడం మాత్రం చాలా కష్టం. ఇందులో  కష్టమైన విషయం ఏమిటంటే ఈ అకస్మాత్తుగా అకస్మాత్తుగా కనిపించేది కాదు. కానీ క్రమంగా చిన్న లక్షణాలతో  మొదలవుతుంది. పిసిఓఎస్ సమస్య ఉన్న చాలామంది మహిళలు తమకు అసలు ఆ సమస్య ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. మరికొంతమంది మహిళలు లక్షణాలు కనిపిస్తున్నా తాత్కాలిక పరిష్కారాలతో సమస్యను పట్టించుకోరు.  పిసిఓఎస్ సమస్య ప్రారంభంలో కనిపించే లక్షణాలేంటో తెలుసుకుంటే..  పిసిఓఎస్ ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం.. PCOS ను ముందుగానే గుర్తిస్తే దాని ప్రభావాలను చాలా వరకు నియంత్రించవచ్చు. ఇది భవిష్యత్తులో సంతానోత్పత్తిని కాపాడటమే కాకుండా డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి శరీరంలో కనిపించే  ముందస్తు  సంకేతాలను గమనించాలి. నెలసరి.. ప్రతి మహిళకు పీరియడ్ సైకిల్  28 రోజులు ఉండదు.  కొన్నిసార్లు ఒత్తిడి, ప్రయాణం లేదా నిద్ర సమస్యల కారణంగా ఈ పీరియడ్ సైకిల్ మారుతుంది.  అయితే, PCOS ఉన్నవారిలో ఈ వ్యత్యాసం బాగా పెరుగుతుంది. కొంతమంది మహిళలకు నెలసరి 35 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది లేదా కొన్నిసార్లు నెలల తరబడి కూడా రాదు. కొంతమంది మహిళలకు నెలసరి వచ్చినప్పుడు అధిక రక్తస్రావం,  అలసట ఉంటాయి.  ఎందుకంటే PCOSలో అండోత్సర్గము సక్రమంగా ఉండదు.  దీని వలన హార్మోన్ల అసమతుల్యత,  శరీరంలో బ్యాలెన్స్ తగ్గుతుంది. అందుకే మహిళలలో నెలసరి విషయంలో ఏ చిన్న మార్పు గమనించినా, ఏ అసౌకర్యం అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. బరువు.. ఎంత  పనిచేసినా  బరువు నియంత్రణలో ఉండకపోగా బరువు పెరగడం జరుగుతుంది. PCOS ఉన్న మహిళలకు ఇది తరచుగా జరుగుతుంది.  ఎందుకంటే పిసిఓఎస్ ఉన్న మహిళల శరీరాలు ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తాయి. అంటే వారి శరీరం  చక్కెరను సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది బరువు పెరగడాన్ని సులభం చేస్తుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ లావుగా మారుతుంది. దీన్ని తగ్గించడం కష్టం. చాలామంది దీన్ని లేజీనెస్ వల్ల వచ్చిన సమస్య అని,  బరువు తగ్గడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య అని అనుకుంటారు. కానీ ఇది శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చిన సమస్య. అవాంఛిత రోమాలు.. గడ్డం మీద వెంట్రుకలు, పై పెదవిపై సన్నని గీతలు, కడుపు లేదా ఛాతీపై వెంట్రుకలు పెరగడం ఇవన్నీ PCOS  సాధారణ లక్షణాలు. వైద్యులు దీనిని హిర్సుటిజం అని పిలుస్తారు. కానీ చాలా మంది మహిళలు దీనిని అర్థం చేసుకోరు. PCOSలో శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల సాధారణంగా జుట్టు పెరగని ప్రదేశాలలో జుట్టు పెరుగుతుంది. తరచుగా వ్యాక్సింగ్ లేదా థ్రెడ్డింగ్ చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వెంట్రుకలు పదే పదే మందంగా,  ముతకగా తిరిగి వస్తే అది హార్మోన్ల మార్పులకు స్పష్టమైన సంకేతం. తలజుట్టు.. PCOS లో  చాలా గందరగోళపరిచే విషయమిది.  శరీరంలో అవాంఛిత రోమాలు పెరుగుతున్నప్పటికీ, తలపై కూడా వెంట్రుకలు రాలడం జరుగుతుంది. చాలా మంది మహిళలు హెయిర్ ఫాల్ అవ్వడాన్ని, జుట్టు బాగా పలుచగా మారడాన్ని ఎదుర్కొంటారు. ఈ మార్పులు అకస్మాత్తుగా కాకుండా నెమ్మదిగా  జరుగుతాయి.  అధికంగా వెంట్రుకలు రాలడం, తల చర్మం పైకి కనిపించడం వంటివి కూడా జరుగుతాయి. చర్మంపై మచ్చలు, గుర్తులు.. PCOS అంటే నెలసరి రాకపోవడమే కాదు..  కొన్నిసార్లు దీని లక్షణాలు  చర్మంపై కనిపిస్తాయి. మెడ వెనుక, చంకలు లేదా తొడలపై ముదురు, మృదువైన లేదా మందమైన మచ్చలు వస్తుంటాయి. దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిలుస్తారు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం. ఈ మచ్చలు హానిచేయవు. కానీ శరీరం రక్తంలో చక్కెరను నిర్వహించడంలో ఇబ్బంది పడుతోందని ఇవి సూచిస్తాయి.  ఇది PCOS లో కీలకమైన విషయం. గర్బం సమస్యలు.. చాలా మంది మహిళలు గర్భం రాలేదని వైద్యులను సంప్రదించినప్పుడు  తమకు PCOS ఉందని తెలుసుకుంటారు. అండోత్సర్గము క్రమం తప్పకుండా జరగనందున, గర్భం దాల్చడం కష్టమవుతుంది. దీని అర్థం గర్భం అసాధ్యమని కాదు,  దీనికి కొంత సమయం పడుతుంది,  వైద్యుల సహాయం అవసరమవుతుంది.                           *రూపశ్రీ.  

ప్రాణాయామం చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రాణాయామం చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు. ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి. నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు. నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి. ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది. ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం..

గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం.. గర్భవతులు చాలా సున్నితంగా ఉంటారు. అయితే గర్భవతులు దృఢంగా ఉండాట్సన్ ఎంతో అవసరమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. గర్భవతులు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుందనేది గైనకాలజిస్ట్ లు చెప్పే మాట. అయితే గర్భవతులు, వ్యాయామం అనే మాట వినగానే గయ్యిమని అరిచే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. కానీ వ్యాయామం అనేది గర్భవతులకు చాలా ముఖ్యం.  ప్రసవానికి ముందు కాలములో  వ్యాయామము చేయడం వల్ల గర్భవతులలో భయాందోళనలు ఏమైనా ఉంటే అవన్నీ  తొలగిపోతాయి. తెలియని విషయానికి భయపడటం సాధారణంగా అందరి విషయంలో జరిగేదే.. దీనికి చిన్న పిల్లల నుండి గర్భవతులు, మహిళలు, వృద్ధులు, పురుషులు ఇలా ఎవరూ మినహాయింపు కాదు. అయితే గర్భవతులలో భయం కలిగినప్పుడు సాధారణంగానే ఆందోళన కలుగుతుంది. ఈ ఆందోళన కాస్తా.. తలనొప్పికి దారితీస్తుంది. అలాంటి సమయంలో ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా ఉండలేరు. మనసులో ఏ మూలో ఎంతో కొంత భయం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. అలాంటి సమయాల్లోనే లేని అనుమానాలు పుడుతూ ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్న భయానికి అవి తోడయ్యి గోరంత సమస్యను కొండంత చేస్తాయి.  వ్యాయామము చేస్తే గర్భవతులలో ఉన్న ఈ ఆందోళన తగ్గిపోతుంది. వ్యాయామం వల్ల శరీరం విశ్రాంతిని బాగా కోరుకుంటుంది. దీని ఫలితంగా ఎలాంటి గందరగోళం లేకుండా హాయిగా నిద్రపోతారు. ఇక ప్రసవానికి ముందు మహిళలు వ్యాయామం చేస్తుందం ద్వారా మరొక అద్భుత ప్రయోజనం ఉంటుంది. అదే గర్భవతిలో కండరాలను దృఢంగా చేయడం. ప్రసవం సమయంలో గర్భవతులలో కండరాల సంకోచం వ్యాకోచాలు అధికంగా జరుగుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల కారణంగా కండరాలు మరింత బలహీనం అవుతాయి. అదే వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా మారితే ప్రసవ సమయంలో నొప్పులను భరించడం సాధ్యమవుతుంది.  అకాలపు ప్రసవాలు, ప్రసవ సమయంలో ప్రమాదాలు, సాధారణ ప్రసవాన్ని భరించలేక సిజేరియన్ వైపు మొగ్గు చూపడం వంటి వాటిని గర్భవతులు వ్యాయామం ద్వారా దూరం ఉంచవచ్చు.  గర్భాశయము అంటే బోలుగా ఉండే ఒక కండరము.  ఈ కండరము ప్రపన సమయములో శిశువును బయటికి నెట్టడానికి సహకరిస్తుంది. ఈ కండరము గర్భాశయ ద్వారము దగ్గర ఉండి ఇతర కండరాల ఒత్తిడిని ప్రతిఘటించి కడుపులో బిడ్డను బయటకు నెట్టేందుకు సహకరిస్తుంది. వ్యాయామం వల్ల ఈ కండరం దృఢంగా మారుతుంది.   ఒక వైపు నొప్పులు మరో వైపు భయము చేరి ప్రసవ సమయములో కండరములు సరిగా పని చేయకుండా అవరోధము కలిగిస్తుంటాయి. అందుకే గర్భవతులు  వ్యాయామము చేస్తూ,  ప్రసవానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉంటే గర్భవతులకు ప్రవేశం సమయంలో ఆందోళన ఏర్పడకుండా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి గర్భవతులకు వ్యాయామం ఎంతో ముఖ్యం. అయితే నిపుణులను అడిగి వారి నెలలను బట్టి వ్యాయామాలను తెలుసుకుని చేయాలి.                                    ◆నిశ్శబ్ద.  

పెదవులు పగులుతున్నాయా..ఈ విటమిన్ లోపమే కారణం!

పెదవులు పగులుతున్నాయా..ఈ విటమిన్ లోపమే కారణం!   పెదవులు పగలడం చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య.  చలికాలంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  పెదవులు పగిలినప్పుడు తినడంలోనూ, తాగడం లోనూ, కొన్ని సార్లు మాట్లాడటంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.  అయితే ఇలా పెదవులు, పెదవుల మూలాలు పగలడం అనేది  వాతావరణ మార్పుల వల్ల జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా జరగడం  విటమిన్  లోపం వల్లనే అని అంటున్నారు ఆహార నిపుణులు, చర్మ సంరక్షణ నిపుణులు.  ఇలా విటమిన్ లోపం వల్ల పెదవులు పగిలితే ఎన్ని క్రీములు రాసినా,  ఎన్ని చిట్కాలు ఫాలో అయినా అది తగిన ఫలితాలు ఇవ్వదట. విటమిన్ లోపం.. కొన్ని సార్లు పెదవులు పగలడం,  పెదవులు చివర్లు చీలడం జరుగుతుంది.  దీని వల్ల కొన్ని సందర్భాలలో   రక్తం కారడం కూడా జరుగుతుంది. ఇది విటమిన్-బి, విటమిన్-సి లోపం వల్ల జరుగుతుందని అంటున్నారు. విటమిన్-బి, విటమిన్-సి లోపిస్తే శరీరం చాలా తొందరగా పొడిబారుతుంది.  దీని వల్ల చర్మం మీద దురద,  పొలుసులు ఏర్పడటం, మొటిమలు రావడం జరుగుతాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ విటమిన్ -బి లోపం వల్లనే జుట్టు రాలే సమస్య, జుట్టు బలహీనంగా మారడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.  ఇవన్నీ జుట్టును బాగా దెబ్బతీస్తాయి. విటమిన్-బి లోపాన్ని భర్తీ చేయాలంటే గుడ్లు, చేపలు, గింజలు, తృణధాన్యాలు, పాలకూర, బచ్చలి కూర,  మాంసం.. ముఖ్యంగా చికెన్.. మొదలైనవి తినాలి. ఇవి తింటే విటమిన్-బి భర్తీ అవుతుంది. ఇక విటమిన్-సి లభించాలి అంటే నిమ్మరసం,  నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్  పండ్లు తీసుకోవాలి.  ఇవన్నీ విటమిన్-సి ని భర్తీ చేస్తాయి.  ఇవి పుష్కలంగా తీసుకుంటే పెదవుల పగుళ్లు, పెదవుల మూలలు చీలడం వంటివి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా మెల్లగా తగ్గిపోతాయి.                                      *రూపశ్రీ

30ఏళ్ల తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..!

30ఏళ్ల తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..! 30 సంవత్సరాల వయస్సు తర్వాత శరీరంలో అనేక మార్పులు ప్రారంభమవుతాయి. వాటిలో ఒకటి ఎముకలు బలహీనపడటం. నిజానికి 30 సంవత్సరాల వయస్సు తర్వాత ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది  ఇది నొప్పి,  పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. సరైన జీవనశైలి,  ఆహారంతో ఎముకలను బలోపేతం చేయవచ్చు.  ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  ఏం చేయాలో తెలుసుకుంటే.. కాల్షియం అధికంగా ఉండే ఆహారం తినాలి.. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఒక ముఖ్యమైన పోషకం. శరీరం స్వయంగా కాల్షియంను ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి దానిని ఆహారం ద్వారా పొందాలి. ఒక వయోజన వయసు వ్యక్తికి రోజుకు దాదాపు 1000-1200 మి.గ్రా. కాల్షియం అవసరం. అందుకే  ఆహారంలో పాలు,  పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. అలాగే ఆకుకూరలు, నట్స్, గింజలు,  పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు,  బలవర్థకమైన ఆహారాలను చేర్చుకోవాలి. విటమిన్ డిని నిర్లక్ష్యం చేయకూడదు.. విటమిన్ డి  ప్రేగులలో ఉండే కాల్షియంను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. విటమిన్-డి లేకుండా  ఎంత కాల్షియం తీసుకున్నా, అది  ఎముకలకు సరిగ్గా చేరదు. విటమిన్ డి కి ఉత్తమ,  అత్యంత సహజ మూలం సూర్యకాంతి. ఉదయం సూర్యకాంతి..  ప్రతిరోజూ 15-20 నిమిషాలు తేలికపాటి ఉదయ సమయపు సూర్యకాంతిలో కూర్చోవాలి. కాంతి నేరుగా  చర్మాన్ని తాకేలా  చేతులు,  కాళ్ళను తెరిచి ఉంచాలి. ఆహారం.. సాల్మన్, మాకేరెల్ వంటి ఫ్యాటీ ఫిష్ లు, గుడ్డు పచ్చసొన, బలవర్థకమైన పాలు,  పెరుగు.. ఇవన్నీ విటమిన్-డి వనరులు.  వీటిని తీసుకోవాలి. సప్లిమెంట్స్.. సూర్యరశ్మి,  ఆహారం ద్వారా విటమిన్-డి తగినంత లభించకపోతే  వైద్యుడి సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు . క్రమం తప్పకుండా వ్యాయామం.. ఎముకలను బలోపేతం చేయడానికి  వ్యాయామం, ముఖ్యంగా బరువు మోయడం,  బలాన్ని పెంచే వ్యాయామాలు చాలా అవసరం. ఇది ఎముక సాంద్రతను నిర్వహించడానికి,  వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదనంగా, యోగా  సాధన చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్,  ఇతర పోషకాలు.. ఎముకలకు కాల్షియం మాత్రమే సరిపోదు. దాదాపు 50% ఎముకలు ప్రోటీన్‌తో తయారవుతాయి. ఎముకల బలానికి,  కాల్షియం శోషణకు తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. అదనంగా  మెగ్నీషియం, జింక్, విటమిన్ కె,  భాస్వరం కూడా ఎముకల ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్ల నుండి బయటపడాలి... మంచి అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు, కొన్ని చెడు అలవాట్లను మానుకోవడం కూడా అంతే ముఖ్యం.  ధూమపానం,  మద్యం సేవించడం మానేయాలి. అధిక ఉప్పు, సోడా లేదా కెఫిన్ ఉత్పత్తులను నివారించడం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తే ఎముకలు బలంగా ఉంటాయి.                                       *రూపశ్రీ.

40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం సరైనదేనా...

40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం సరైనదేనా.. ప్రతి మహిళకు గర్భం దాల్చడం,  మాతృత్వం పొందడం చాలా గొప్ప అనుభూతి.  అయితే చాలామంది మహిళలు ఎంత వయసు అయినా గర్బం దాల్చలేకపోతారు. మరికొందరు మొదటి బిడ్డ అయిన తర్వాత కాస్త ఆలస్యంగా మళ్లీ బిడ్డ కావాలని అనుకుంటారు. ఇలాంటి వారు ఆలస్యంగా గర్భం దాల్చడం,  తల్లికావడం జరుగుతుంది. అయితే ఇలా ఆలస్యంగా.. 40 ఏళ్ల వయసులో కూడా తల్లి కావడం సరైనదైనా?  దీని వల్ల ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు ఉన్నాయా? అసలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం సురక్షితమేనా కాదా? తెలుసుకుంటే.. గైనకాలజిస్టులు,  వైద్యుల అభిప్రాయం ప్రకారం 35ఏళ్ల తర్వాత మహిళలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుంది.  దీని కారణంగా 35 సంవత్సరాల తర్వాత మహిళలు దాదాపు మూడింటి రెండు వంతుల జంటలు బిడ్డను కనడంలో ఇబ్బందిని ఎదుర్కుంటారు.  మూడింటి రెండు వంతుల జంటలు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంటారు. ఒక నిర్థిష్ట వయసు తర్వాత  మహిళల శరీరంలో అండాల సంఖ్య తగ్గడం క్రమంగా పెరుగుతూ ఉంటుంది.  ఇది సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగానే చాలామంది మహిళలలో గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక నిర్థిష్ట వయసు తర్వాత మహిళల శరీరంలో అండాలు విడుదల అయినా అవి ఆరోగ్యకరంగా ఉండవు.  మరీ ముఖ్యంగా ఫలదీకరణ ప్రక్రియ జరగడానికి తగినంత ఆరోగ్యంగా ఉండవు. 35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య తగ్గుతూ ఉండటంతో అవి సరిగ్గా విడుదల కావు.  గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా చాలా రెట్లు ఉంటుంది.  మరీ ముఖ్యంగా 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ .. గర్భం వచ్చిన తర్వాత అది అధిక ప్రమాదంతో కూడుకుని ఉంటుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు. అసలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం అనేది ఎందుకు అంత ప్రమాదం అనే విషయాన్ని చెప్టూ గైనకాలజిస్టులు చెప్పిన విషయం.. ప్రీఎక్లంప్సియా అంటే అధిక రక్తపోటు.  గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు,  మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుందట. 40 ఏళ్ల వయసులో తల్లులయ్యే మహిళలకు పుట్టే పిల్లలకు డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుందట. దీని కారణంగా 40 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు గర్భం దాలిస్తే వాళ్లకే కాకుండా..పుట్టే పిల్లలు కూడా ప్రమాదంలో పుట్టే అవకాశాలు చాలా ఉంటాయి. పుట్టినప్పుడు బిడ్డ బరువు కూడా తక్కువగా పుట్టే ప్రమాదం ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.                            *రూపశ్రీ.

30 ఏళ్ళకే ముసలివాళ్లలా అలసటగా ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి..!

30 ఏళ్ళకే ముసలివాళ్లలా అలసటగా ఉంటుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సరి..! 30ఏళ్ళు అంటే అప్పుడప్పుడే బాధ్యత గల జీవితంలోకి అడుగుపెట్టినట్టు.  పెళ్లి,  భాగస్వామి,  పిల్లలు, ఉద్యోగం.. ఇల్లు చక్కబెట్టుకోవడం.. ఇలా చాలామంది మహిళలు 30 ఏళ్లలో బాధ్యతలలో బిజీగా ఉంటారు.  ఇలాంటి మహిళలు చాలా చురుగ్గా అన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో 30 ఏళ్లకే చాలామంది మహిళలు చాలా భారంగా ఫీలవుతూ ఉంటారు. బలహీనంగా ఫీలవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు. మరీ ముఖ్యంగా శరీరంలో ఎముకలు, కండరాలు బలం లేనట్టుగానూ.. నడుము,కీళ్లు నొప్పులు.. ఇలా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దీన్ని అధిగమించి తిరిగి ఉత్సాహంగా మారడానికి ఫిట్‌నెస్ నిపుణులు కొన్ని అద్భుతమైన చిట్కాలు పంచుకున్నారు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఖాళీ కడుపుతో మెంతినీళ్లు.. చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతుంటారు.  కానీ నానబెట్టిన మెంతి నీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్,   రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది మహిళల్లో పీరియడ్స్ క్రాంప్స్ లేదా PCOSని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. 10 నిమిషాల నడక.. ఈ రోజుల్లో చాలా మందిలో విటమిన్ డి లోపం సర్వసాధారణం. ముఖ్యంగా మహిళలలో, అందునా గృహిణులలో ఎక్కువ. ఎముకలతో పాటు, రోగనిరోధక శక్తి,  హార్మోన్ల నియంత్రణకు విటమిన్ డి చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు  కేవలం 10 నిమిషాలు ఎండలో నడిస్తే,  తగినంత విటమిన్ డి పొందవచ్చు. ఇది  మానసిక స్థితిని మెరుగుపరచడానికి,  సెరోటోనిన్ స్థాయిని పెంచడానికి కూడా పని చేస్తుంది. అల్పాహారం ఇలా.. ఉదయం అల్పాహారం ఎగ్గొట్టడం చాలామంది మహిళలు చేసే పని.  అంతేకాదు..  కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న భోజనం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్,  హార్మోన్ల అసమతుల్యత ప్రమాదం పెరుగుతుంది. 20 ఏళ్లు పైబడిన వారు తమ అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర వద్దు.. ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే  చేర్చుకోవడం ఉత్తమం.  శుద్ధి చేసిన చక్కెరను నివారించాలి. ఇది గుండె జబ్బులు, మధుమేహం,  ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది వాపు,  ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శుద్ధి చేసిన చక్కెర మూత్రపిండాలకు కూడా చాలా హానికరం. నిద్ర.. ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మొదలైన వాటిని మెరుగుపరుస్తుంది. నిద్ర లేకపోవడం  మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.  నిరాశ ప్రమాదాన్ని పెంచుతుంది. తగినంత నిద్ర శరీర కణాలను మరమ్మతు చేస్తుంది.  బరువును నియంత్రణలో ఉంచుతుంది. లింఫాటిక్ మసాజ్.. శోషరస వ్యవస్థకు గుండె లాంటి సహజ పంపు లేదు.  ప్రతి ఉదయం కేవలం 2 నిమిషాల తమకు తాము  మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది నీటి నిలుపుదలని తగ్గిస్తుంది.  రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.                              *రూపశ్రీ.

జాగింగ్ చేసేద్దాం ఇలా...

జాగింగ్ చేసేద్దాం ఇలా... మహిళలు తమ శారీరక ఆరోగ్య స్పృహ పెరిగినప్పుడు చాలామంది ఎంచుకునే వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్. అన్ని వయసుల వారు దీన్ని తమ లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవచ్చు. అయితే ఈ నడిస్కను కాస్త వేగంగా చేస్తే దాన్నే జాగింగ్ అని అంటారు. నడక కంటే కాస్త ఎక్కువ ఫలితాలను ఇచ్చే ఈ జాగింగ్ పెద్ద వయసు వారు తప్ప టీనేజ్ నుండి మధ్యవయసు వారి వరకు ఎవరయిన చేయొచ్చు. అయితే ఇలాంటి ఆరోగ్య  సమస్య కాళ్ళ నొప్పులు వంటివి లేకపోతే 50 ఏళ్ళు దాటినా వారు కూడా జాగింగ్ చేయవచ్చు. వాకింగ్ కు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు లేకపోయినా అది అలా సాగిపోతుంది. కానీ జాగింగ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. దీనివల్ల జాగింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జాగింగ్ చేయడానికి  కంఫర్ట్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి వాటి గురించి కొన్ని ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇవిగో... చాలామందికి జాగింగ్ చేసేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేది అవగాహన ఉండదు. కొందరు మహిళలు చీరల్లో ప్రయత్నం చేస్తుంటారు. అయితే జాగింగ్ చేసేటప్పుడు చుడిదార్  గాని, లూజ్ ప్యాంట్ లేదా జాగింగ్ డ్రస్ ను ధరించాలి, దీనివల్ల కాళ్ళు తొందర తొందరగా కదపడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.  ఇకపోతే జాసింగ్ చేసే సమయం కూడా అన్ధస్రూ దృష్టిలో పెట్టుకోవాలి. ఏవో ఒక పనులున్నాయని, కుదరడం లేదని ఏ సమయం కంటే ఆ సమయంలో జాగింగ్ చేస్తుండటం కరెక్ట్ కాదు. మనం సమయానికి భోజనం చేయడం వల్ల ఎలాగైతే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందో… సమయానికి కరెక్ట్ గా జాగింగ్ చేయడం వల్ల కూడా దానికి తగిన పలితాన్ని పొందగలుగుతాము. అయితే జాగింగ్ కోసం ఎంచుకునే వేళలు ఉదయం లేదా సాయంత్రం అయితే బాగుంటుంది.  జాగింగ్ చేసేవారు ఎక్కువ మంది పాటించనిది ఏదైనా ఉందంటే అది కాళ్ళకు వేసుకునే షూ. చాలాశాతం మంది చెప్పులు వేసుకుంటారు.... అయితే జాగింగ్ కోసం తయారు చేయబడ్డ షూస్ వేసుకోవాలి. షూస్ లోకి  కాటన్ సాక్స్ వేసుకుంటే.... పాదాలకు ఇంకా మంచిది. జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఫిట్ నెస్ కు మంచిదనే అభిప్రాయంతో మొదలుపెట్టినప్పుడు చాలా ఎక్కువగా చేయకూడదు. జాగింగ్ ను ఇంత దూరం, ఇన్ని నిమిషాల సమయం అనే ప్లానింగ్ తో మొదలు పెట్టాలి. ఆ టీసురువత మెల్లగా దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల దూరం పెరిగినా శరీరానికి అలసట తెలియకుండా ఉంటుంది.  టీనేజ్ అమ్మాయిలు, యువతులు వాకింగ్ కంటే జాకింగ్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారుమ్ వారి వయసుకు తగినట్టు జాగింగ్ ను ఎంజాయ్ చేయగలుగుతారు కూడా. అయితే సరైన బ్రా, టీ షర్ట్, షూస్ ఎంపిక చేసుకుని జాగింగ్ చేయడం ఎంతో ముఖ్యం.    జాగింగ్ సాద్స్రణంగా ఉదయం చేస్తుందం మంచిది. అది కూడా ఉదయాన్నే లేవగానే కాస్త  ఫ్రెష్ అయ్యి వాకింగ్, జాగింగ్, యోగ వంటివి చెయ్యాలి. అంతేకానీ ఉదేశ్యం ఆలస్యంగా లేచి టిఫిన్లు గట్రా తిని ఆ తరువాత నింపాదిగా జాగింగ్ చేయకూడదు. అలాగే సాయంత్రం కూడా కాఫీలు, టీలు, స్నాక్స్ అంటూ అన్ని తిని జాగింగ్ చేయకూడదు.   మధ్య వయసు వారిలో కొంతమందిలో కనిపించే బిపి ఉన్నా, హార్ట్ సంబంధించిన అనారోగ్యాలు ఉన్నా డాక్టర్ ను సంప్రదించిన తరువాత వారి సూచనల ప్రకారము మాత్రమే జాగింగ్ చేయాలి. ఇలా కొన్ని జాగింగ్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఆరోగ్యమైన అలవాటును హాయిగా కొనసాగించవచ్చు.                                  ◆నిశ్శబ్ద.

ఫిట్‌నెస్ రహస్యం మన చేతుల్లోనే

ఫిట్‌నెస్ రహస్యం మన చేతుల్లోనే   బాడీ ఫిట్‌నెస్‌తో మైండ్ ఫిట్‌నెస్ కూడా సాధ్యపడుతుంది. అది ఎలా అంటే...మంచి ఆహారం, వ్యాయామం శరీరానికి కావలసిన శక్తినివవడమే గాక ఉత్సాహాన్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. తద్వారా ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం, పోషకాహారం చాలా అవసరం. * బరువు పెరుగుతున్నట్లు తెలియగానే చాలామంది వెంటనే తినడం తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవలసి వస్తుంది. * ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల గంటలో జీర్ణమవగా మిగిలింది కొవ్వుగా మారిపోయి శరీరంలో నిలవ ఉంటుంది. తద్వారా కొవ్వు పరిమాణం పెరిగి బరువు పెరుగుతారు. * దృఢమైన శరీరానికి ఉపయోగపడే ముఖ్య పోషకాలు కార్బోహైవూడేట్లు. ఈ చక్కెర పదార్థాలు దాదాపు అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయల్లో లభిస్తాయి. * 50 శాతం శక్తి వీటి ద్వారానే చేకూరుతుంది. కొవ్వు పదార్థాల నుంచి 35 శాతం, ప్రొటీన్ల నుంచి 15 శాతం శక్తిని పొందగలుగుతాం. * పైగా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న ఒక గంట వరకు మన శరీరంలోని ఎంజైములు అతి చురుకుగా పనిచేస్తాయి. * కాబట్టి ఒక్కసారి ఎక్కువ లాగించేకన్నా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది. ఇకపోతే ఫిట్‌నెస్‌ను పెంచే మరో ముఖ్య కారకం వ్యాయామం. కావలసినదాని కన్నా ఎక్కువ శక్తి చేరినప్పుడు ఆ కేలరీలన్నీ కొవ్వులుగా మారి ఫిట్‌నెస్‌ను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని కరిగించాలంటే క్రమం తప్పని వ్యాయామం అవసరం. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం వల్ల మెదడులో ఎండోమార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. వ్యాయామం ఇలా చేయండి. * వ్యాయామం ప్రారంభించే ముందు ఒకేసారి పెద్ద పెద్ద ఎక్సర్‌సైజులు కాకుండా కనీసం వారానికి మూడుసార్లు ఒక అరగంట సేపు మీరు ఇష్టంగాచేయగలిగే పద్ధతిని ఎంచుకోండి. * కొద్దిరోజులు చేసి మానేయడం కాకుండా మెల్లమెల్లగా రోజూ చేయడానికి ప్రయత్నించండి. * యోగా, వాకింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏదో ఒకటి మీకు సరిపోయే వ్యాయామ పద్ధతిని ఎంచుకోండి. * మీరొక్కరే చేయడానికి విసుగ్గా ఉంటే టీమ్‌గా, ఒకాటలాగా చేయండి. మెల్లగా అలవాటవుతుంది. * ఒక్కటి కన్నా ఎక్కువ వెరైటీలలో ఉండే వ్యాయామ పద్ధతులు ఆసక్తిని పెంచుతాయి. మెదడుకు చురుకుదనం. మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మన మానసిక దృఢత్వం, చురుకుదనం ఆధారపడి ఉంటాయి. కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం మెదడును మత్తుగా ఉంచుతుంది. అన్నం తినగానే నిద్ర ముంచుకురావడానికి కారణం ఇదే. అందుకే సాయంకాలం కార్బోహైవూడేట్‌లను తీసుకోవడం వల్ల సుఖనివూదకు ఆస్కారం ఉంటుంది. ప్రొటీన్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక సామర్థ్యం పెంచుకోవాలంటే ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇక కాఫీ, టీలు మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. ఒక కప్పు కాఫీ మెదడును చైతన్యవంతం చేస్తుంది. కానీ గంటకో కప్పు తీసుకోవడం వల్ల అలసట, ఉద్రేకం, నిద్రలేమి వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అలాగని హఠాత్తుగా మానివేస్తే తలనొప్పి, వికారం వంటివి కనిపిస్తాయి. బాడీ ఫిట్‌నెస్‌తో మైండ్ ఫిట్‌నెస్ కూడా సాధ్యపడుతుంది. అది ఎలా అంటే...మంచి ఆహారం, వ్యాయామం శరీరానికి కావలసిన శక్తినివవడమే గాక ఉత్సాహాన్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. తద్వారా ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం, పోషకాహారం చాలా అవసరం. * బరువు పెరుగుతున్నట్లు తెలియగానే చాలామంది వెంటనే తినడం తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవలసి వస్తుంది. * ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల గంటలో జీర్ణమవగా మిగిలింది కొవ్వుగా మారిపోయి శరీరంలో నిలవ ఉంటుంది. తద్వారా కొవ్వు పరిమాణం పెరిగి బరువు పెరుగుతారు. * దృఢమైన శరీరానికి ఉపయోగపడే ముఖ్య పోషకాలు కార్బోహైవూడేట్లు. ఈ చక్కెర పదార్థాలు దాదాపు అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయల్లో లభిస్తాయి. * 50 శాతం శక్తి వీటి ద్వారానే చేకూరుతుంది. కొవ్వు పదార్థాల నుంచి 35 శాతం, ప్రొటీన్ల నుంచి 15 శాతం శక్తిని పొందగలుగుతాం. * పైగా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న ఒక గంట వరకు మన శరీరంలోని ఎంజైములు అతి చురుకుగా పనిచేస్తాయి. * కాబట్టి ఒక్కసారి ఎక్కువ లాగించేకన్నా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది. ఇకపోతే ఫిట్‌నెస్‌ను పెంచే మరో ముఖ్య కారకం వ్యాయామం. కావలసినదాని కన్నా ఎక్కువ శక్తి చేరినప్పుడు ఆ కేలరీలన్నీ కొవ్వులుగా మారి ఫిట్‌నెస్‌ను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని కరిగించాలంటే క్రమం తప్పని వ్యాయామం అవసరం. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం వల్ల మెదడులో ఎండోమార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. వ్యాయామం ఇలా చేయండి. * వ్యాయామం ప్రారంభించే ముందు ఒకేసారి పెద్ద పెద్ద ఎక్సర్‌సైజులు కాకుండా కనీసం వారానికి మూడుసార్లు ఒక అరగంట సేపు మీరు ఇష్టంగాచేయగలిగే పద్ధతిని ఎంచుకోండి. * కొద్దిరోజులు చేసి మానేయడం కాకుండా మెల్లమెల్లగా రోజూ చేయడానికి ప్రయత్నించండి. * యోగా, వాకింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏదో ఒకటి మీకు సరిపోయే వ్యాయామ పద్ధతిని ఎంచుకోండి. * మీరొక్కరే చేయడానికి విసుగ్గా ఉంటే టీమ్‌గా, ఒకాటలాగా చేయండి. మెల్లగా అలవాటవుతుంది. * ఒక్కటి కన్నా ఎక్కువ వెరైటీలలో ఉండే వ్యాయామ పద్ధతులు ఆసక్తిని పెంచుతాయి. మెదడుకు చురుకుదనం. మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మన మానసిక దృఢత్వం, చురుకుదనం ఆధారపడి ఉంటాయి. కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం మెదడును మత్తుగా ఉంచుతుంది. అన్నం తినగానే నిద్ర ముంచుకురావడానికి కారణం ఇదే. అందుకే సాయంకాలం కార్బోహైవూడేట్‌లను తీసుకోవడం వల్ల సుఖనివూదకు ఆస్కారం ఉంటుంది. ప్రొటీన్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక సామర్థ్యం పెంచుకోవాలంటే ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇక కాఫీ, టీలు మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. ఒక కప్పు కాఫీ మెదడును చైతన్యవంతం చేస్తుంది. కానీ గంటకో కప్పు తీసుకోవడం వల్ల అలసట, ఉద్రేకం, నిద్రలేమి వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అలాగని హఠాత్తుగా మానివేస్తే తలనొప్పి, వికారం వంటివి కనిపిస్తాయి.

Health with coconut oil

Health with coconut oil Money Saving Tips For Women,Money Saving Tips,Work that girls must do,girls must do,women can excel in are psychology and nursing Replace and Enjoy Keeping aside its new taste which might take you some time to get used to, If you'd like to start eating this delicious coconut oil, remember: Replace unhealthy fats with coconut oil; don't add it on top of the fats you're already eating. Eating one to two tablespoons daily is a good amount, but because it is high in calories and fat, i don't recommend eating much more than that. Limiting your intake of unhealthy saturated fats, as well as trans fat, is also recommended.  Working coconut oil into your existing culinary routine is easy. Instead of using butter in baking, substitute coconut oil using a simple 1:1 ratio. Coconut oil is great to cook with, too. Unlike Olive oil, which is a medium-temperature oil (it evaporates when you cook on high flame), coconut oil can be cooked at high-heat making it ideal for dishes like stir-fry. It adds flavor when cooking or roasting any vegetables, and makes a delicious complement to bitter veggies like Karela (Bitter gourd) or Kale. You can also find other ways to substitute coconut oil, such as using it on your morning toast in place of butter.  Choosing to Supplement If you don't like coconut oil or aren't having success working it into your diet, you might consider taking a dietary supplement. To support the health of your entire body, Doctors usually recommend 2000 to 4000 milligrams daily, although you should check with your Doctor to determine the right dosage for you. An Organic extra virgin supplement is a good choice.  As you can see, the coconut palm is not only picturesque but also offers significant health benefits.   

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి..

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించవచ్చు. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు మరియు పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మీరు తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి మరి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇపుడు తెలుసుకుందాం. వెజ్ - శాకాహారం: ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. 2: పండ్లు లేదా టమాటాలు వంటి తాజా కూరగాయలు తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: గ్రీన్ వెజిటబుల్ సోర్ మిల్క్ (దహి) తో రెండు చిన్న చపాతీలు తినాలి. 2: రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్ వంటివి తినాలి. 3: ఒక కప్పు అన్నం మరియు ఒక కప్పు పప్పు ఆహారంగా తీసుకోవాలి. రాత్రి - డిన్నర్ : 1: సూప్ (టమోటా, పాలకూర మరియు స్వీట్ కార్న్) మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: ఒక కప్పు శాకం మరియు రెండు చపాతీలు తీసుకోవాలి. మాంసాహారం: ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు. 2: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: మాంసం లేదా ఒక ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కలు, రెండు చపాతీ మరియు దాల్ తీసుకోవాలి 2: ఏదైనా తక్కువ కాలరీలు మాంసాహార క్రమాలలో సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. రాత్రి - డిన్నర్ : 1: తక్కువ కాలరీలు కల్గిన మాంసాహార సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: చికెన్ 100గ్రాములు మరియు రెండు చపాతీలు, ఒక కప్పు సూప్ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు.  

గర్భిణీ స్త్రీలలో అలసటను నివారించి..ఉత్సాహంగా ఉంచే ఆహారాలు..!

  గర్భిణీ స్త్రీలలో అలసటను నివారించి..ఉత్సాహంగా ఉంచే ఆహారాలు..!   గర్భధారణ సమయంలో, మహిళలు చాలా సులభంగా అలసటకు గురిఅవుతారు. అంతే కాదు నిద్ర వచ్చినట్లు కూడా వారు ఫీల్ అవుతుంటారు . ఈ బద్దక సంకేతాలే అలసటకు ముఖ్య కారణం. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కువగా అలసటకు గురైనట్లు చెబుతుంటారు. చాలా నీరసంగా, బద్దకంగా, అలసటతో , నిదానమైన మరియు ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నట్లు ఈ లక్షణాలన్నీ కూడానూ గర్భధారణ సమయంలో చాలా సాధారణంగా ఉంటాయి. ఈ లక్షణాలను ఎక్కువగా ఫస్ట్ సెమిస్టర్(మొదటి మూడు నెలలు)మరియు థర్డ్ సెమిస్టర్ (చివరి మూడు నలల్లో) గమనించవచ్చు. చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత చాలా బలహీనంగా భావిస్తారు. మానసిక, శారీరిక మరియు హార్మోన్ల మార్పులు వీటివల్లే గర్భధారణలో మహిళలు ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు. ఇంకా వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్ వంటివి ఆ రోజు గడవడాని మరింత నిదానమైన అనుభూతిని కలిగజేస్తుంది. గర్భం ధరించిన మొదటి మూడు నెలలు, హార్మోనుల మార్పుల వల్లే వికారానికి, వేవిళ్ళు, మరియు ప్రొజిస్టిరాన్ హార్మోనుల ఉత్పత్తి, ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీల వికారానికి కారణం అవుతుంది. ఇక థర్డ్ సెమిస్టర్ లో గర్భి ణీ స్త్రీ యొక్క బరువు అధికంగా ఉండటం చేత , గర్భిణీ స్త్రీ తన బరువుతో పాటు తన కడుపులో శిశువు బరువును కూడా మోయడం వల్ల వెన్ను నొప్పి, నిద్రలేమి, తిమ్మిరులు, మరియు కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా మీ ఆలసత్వ అనుభూతికి కలిగిస్తుంది. అలసట నివారించుకోవడానికి ప్రీనేటల్ కేర్ చాలా చాలా ముఖ్యం. గర్భధారణ సమంయలో, మీరు మంచిగా ఆలోచించాలి, మీ శరీరంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా మీరు తీసుకొనే ఆహారంలో మార్పలు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన ఆహారాలు తీసుకోవడం గర్భధారణ సమయంలో చాలా మంచిది. అవి అలసటతో పోరాడుతాయి. అంతే కాదు కొత్త తల్లికి కావల్సిన ఎనర్జీ లెవల్స్ ను అంధిస్తాయి. హెల్తీ ప్రీనేటల్ డైట్ తో పాటు మహిళలు తమంతట తాము జాగ్రత్తలు తీసుకుంటూ తగినంత నిద్రను పొందాలి. నిద్రలేమి కూడా హార్మోనుల అసమతుల్యతకు కారణం అవుతుంది. సరైన నిద్ర పొందడం వల్ల కూడా అలసటను నివారించుకోవచ్చు. మీరు రిఫ్రెష్ గా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అలసటను పోగొట్టే కొన్నే ఎనర్జిటిక్ ఫుడ్ మీరు తెలుసుకోవడానికి...     1 సీఫుడ్ : సీఫుడ్ లో గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఎసెన్సియల్ యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి గర్భణీ స్త్రీలకు మేలు చేస్తాయి.     2  పెరుగు : పెరగులో క్యాల్షియం మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పెరగులో ఉండే ప్రొబైటిక్ బ్యాక్టీరియా అలసటతో పోరాడుతాయి మరియు జీవక్రియను శుభ్రం చేస్తాయి.     3  ఆకుకూరలు : విటమిన్స్, మినిరల్స్, మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ లో ఆకుకూరలు కూడా ఒకటి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. మరియు ఇవి అలసటను దరిచేరనివ్వకుండా పోరాడుతాయి     4  అరటపండు : అరటపండులో ఫొల్లేట్ లేదా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రీనేటల్ విటమిన్లుగా భావిస్తారు. ఫ్లోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచి, బాడీ పెయిన్స్ ను తగ్గిస్తాయి. ఇంకా పుట్టుక లోపాలను నిరోధిస్తుంది   5   మెంతిఆకులు : గర్భధారణ సమయంలో శరీరం నీరసంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలంటే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి అలసటతో పోరాడుతుంది మరియు కొత్త తల్లిలో ఎముకల సాంద్రత పెంచుతుంది. మెంతి ఆకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంది.   6 బాదాం : బాదాంలో యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, బాడీ మెటబాలిజంను పెంచుతుంది, ఆకలి కోరికను తగ్గిస్తుంది మరియు కడుపు పిండం ఆరోగ్యంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.   7 ఆరెంజ్ : సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.   8  కిడ్నీ బీన్స్ : గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్నట్లైతే, రక్తంలోని హీమోగ్లోబిన్ కౌంట్ పెంచుకోవడానికి ఈ కిడ్నీ బీన్స్ చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే ఐరన్ పోస్ట్ నేటల్ స్టేజ్ సేఫ్ గా ఉండేలా సహాయపడుతుంది.   9 టోపు : పన్నీర్ కు మరో ప్రత్యామ్నాయం టోఫు. ఇది ఆరోగ్యకరమైనది. ఇది లో క్యాలరీలను కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది . టోఫు కడుపు నిండేలా చేస్తుంది మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయం అలసటను నుండి విముక్తి పొందాంటే టోఫును మీ డైట్ లో చేర్చుకోవాలి.     10 బార్లీ : బార్లీలో ఐరన్ పుష్కలం. గర్భధారణ సమయంలో అలసటను నివారించండానికి ఒక మంచి ఆహారం ఇది.   11  క్యారెట్స్ : క్యారెట్స్ లో విటమిన్ ఎ మరియు ఫొల్లేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాబోతున్న తల్లికి చాలా ముఖ్యం. క్యారెట్స్ అలాగే పచ్చివాటిలా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.   12  ముల్లంగి దుంప : క్యాల్షియం లోపించడం వల్ల అనేక ఆనారోగ్య వ్యాధులకు కారణం అవుతుంది మరియు గర్భధారణ సమయంలో అలసటకు గురిచేస్తుంది. గర్భధారణ సమయంలో బలంగా ఉండటానికి ముల్లంగి దుంపలు బాగా సహాయపడుతాయి.   13 దానిమ్మ: రెడ్ జ్యూస్ ఫ్రూట్స్ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతాయి. అంతే కాదు అలసటతో పోరాడుతాయి . మరియు బాడీ మెటబాలిజంను పెంచుతాయి.     14  గోధుమలు : గోధుమలు మంచి పోషకాంశాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ ఆహారాలు తీసుకోవడం వల్ల అలసట అనుభూతిని పొందుతారు. అంతే కాదు తిన్న ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణక్రియకు ఎక్కువ శక్తి కావాలి. కాబట్టి, లైట్ ఫుడ్, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. 15 బ్రోకోలి : ఇది ఒక హెల్తీ సూపర్ ఫుడ్. ఇందులో వివిధ రకాల విటమిన్లు మరియు ప్రోటీనలు పుష్కలంగా ఉంటాయి . గర్భధారణ సమయంలో అలసటతో పోరాడో ఆహారల్లో ఇది ఒక అద్భుతమైన ఆహారం.

థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి!

థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి! ఒత్తిడి కారణంగా హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. థైరాయిడ్ స్థాయిలు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ అనేది మెడలో ఉన్న ఒక చిన్న గ్రంధి, ఇది అనేక ముఖ్యమైన హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత మరియు పెరుగుదలకు అవసరం. థైరాయిడ్ స్థాయి పెరగడం లేదా తగ్గడమనే రెండు సందర్భాలు  శరీరానికి హాని కలిగించవచేవే.. యోగా ఆసనాల ద్వారా థైరాయిడ్ గ్రంధి సమతుల్యతగా ఉండేలా చేసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంధి వల్ల హార్మోన్లలో కలిగే మార్పులు మహిళలలో చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. కింద చెప్పుకునే యోగా అసనాలు వేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. సేతుబంధాసనం సేతువు ఆకారంలో భంగిమ ఉండటం వల్ల ఈ ఆసనాన్ని సేతుబంధాసనం అని  అంటారు. వెన్నెముకను బలోపేతం చేయడానికి ఈ యోగాసనం ఉపయోగపడుతుంది. సేతుబంధాసన సాధన ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు. ఈ ఆసనం చేయడానికి వెల్లికిలా పడుకోవాలి.  మోకాళ్లను మీ భుజాల వెడల్పు నుండి కొంచెం దూరంగా వంచాలి. ఇప్పుడు, అరచేతులను తెరచి, చేతులను నేలపై నిటారుగా ఉంచి, శ్వాస తీసుకుంటూ, నడుమును పైకి ఎత్తాలి. ఊపిరి పీల్చుకుంటూ, తిరిగి పాత స్థితికి రావాలి. భుజంగాసనం..   థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి, భుజంగాసనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ భంగిమ గొంతు మరియు థైరాయిడ్‌ను ఉత్తేజపరచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. సంస్కృతంలో భుజంగం అంటే పాము అని అర్థం.  భుజంగాసనంను కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి నేలపై పడుకోవాలి. అరచేతులను భుజం-వెడల్పు వేరుగా నేలపై ఉంచండి. ఇప్పుడు పీల్చేటప్పుడు ఛాతీని నేలపై నుండి పైకెత్తి సీలింగ్ వైపు చూడండి. ఇప్పుడు శరీరాన్ని నేలపైకి తీసుకురండి. ఈ యోగాను పునరావృతం చేయండి. బిటిలాసనం..  థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బిటిలాసనం వేయాలి. దీన్నే పిల్లి-ఆవు భంగిమ అని అంటారు. తులో రక్త ప్రసరణను కొనసాగించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా మణికట్టు మరియు మోకాళ్ల సహాయంతో జంతువు లాంటి భంగిమను వేయండి. లోతైన శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత శ్వాసను మెల్లిగా వదలాలి. ఈ యోగాను ప్రతిరోజూ 10 నిమిషాల పాటు చేయాలి. పశ్చిమోత్తాసనం.. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని ఆనించడానికి  ప్రయత్నిచాలి. అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు..  రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది. తిరిగి పడుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 20 సార్లు చేయాలి.                                        ◆నిశ్శబ్ద.

రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్..

రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్.. రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం... * శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. * శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట. *  రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి. *  స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పగుళ్లు ఏర్పడతాయి. * ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది. * బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. * స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

మంచం దిగకుండానే కొవ్వు దులిపేద్దాం!

మంచం దిగకుండానే కొవ్వు దులిపేద్దాం! ఒంట్లో సులువుగా చేరిపోయే రాక్షసి కొవ్వు. ఏమి తింటున్నాం అనేది కాస్త ఆలోచించుకోవడం మానేసి తినడంలో రెచ్చిపోతే శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయి శరీర షేప్ మార్చేసి మనల్ని ఒకానొక అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. అయితే ఆ కొవ్వు తగ్గించుకోవాలి అంటే వ్యాయాయం లేదా ఆసనాలు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు వణికిస్తున్న చలికి ఉదయం లేవబుద్ది  కాదు, సాయంత్రం అడుగు బయటపెట్టబుద్ది కాదు. అలా వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. చలికి మన తీరు ఇలాగుంటే ఇక వ్యాయామాలు, యోగాసనాలు ఏమి వేస్తాం?? మనలో చేరిపోయిన కొవ్వును ఎలా మాయం చేస్తాం?? అందుకే కాస్త విభిన్నంగా ఆలోచించాలి.  విభిన్నత ఎలా? శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం అవసరమే కదా?? అలాంటి వ్యాయామాన్ని ఉదయం లేవగానే అలాగే మంచం దిగకుండా హాయిగా చేసేస్తే ఎలా ఉంటుంది. ఇదే విభిన్నంగా చెప్పుకుంటున్న విషయం. లేచిన వెంటనే వ్యాయామం కోసం ప్రత్యేకంగా అన్ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగడానికి ఓపికతో పాటు చలి తెచ్చిపెట్టే బద్దకం చాలా ఉంటుంది. అందుకే లేవగానే అలా మంచం మీదనే శరీరంతో విన్యాసాలు చేసేయండి. టిప్ 1:-  ఇప్పుడు చెప్పుకోబోయే ప్రయోగం కాస్త ధనురాసనంను పోలి ఉంటుంది. కాకపోతే కాళ్ళను చేతులతో బంధించాల్సిన అవసరం ఉండదు.  లేచిన వెంటనే అలాగే మంచం మీదనే బోర్లా పడుకోవాలి. ఇలా పడుకున్న తరువాత కడుపును ఆధారంగా చేసి కాళ్ళను, చేతులను ఒకేసారి మెల్లగా పైకి లేపాలి. ఇలా పైకి లేపిన తరువాత కొన్ని సెకెన్ల పాటు అలాగే ఉండాలి. తిరిగి మాములు స్థితిలోకి రావాలి. ఇలా సెట్ లో ఇరవై సార్లు చేయాలి. ఇలాంటివి అయిదు సెట్లు చేయాలి. దీన్ని చేయడం వల్ల వెన్నెముక భుజాలు బలపడతాయి. నడుము దృఢంగా మారుతుంది. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.  టిప్:-2 ఈ రెండవ విధానంలో మంచం మీద చివరలో కూర్చోవాలి. కాళ్ళు నేలకు ఆనుతూ ఉంటాయి. బలాన్ని కాళ్ళ మీద, చేతుల మీద ప్రయోగించి చేతులను మంచం మీద గట్టిగా పట్టుకుని మెల్లగా మంచం మీద నుండి కిందకు దిగాలి. కాళ్ళను ఒంచకూడదు. మంచానికి చేతులు వెనుకగా అలాగే ఆనించి మెల్లిగా కూర్చోవడం లేవడం చేయాలి. దీనివల్ల కాళ్ళు దృఢంగా మారతాయి, చేతులలో బలం పుంజుకుంటుంది. తొడల కండరాలు గట్టి పడతాయి.  టిప్:- 3 పుషప్స్ తీసే బంగిమను ప్లాంక్ అని అంటారు. మంచం మీద బోర్లా పడుకుని కాలి మునివేళ్ళ మీద, మోచేతులు ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. ఆ పొజిషన్ లో కనీసం 40 నుండి 45 సెకెన్ల పాటు ఉండాలి. ఆ తరువాత కొన్ని సెకెన్లు విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ తిరిగి ప్లాంక్ చేయాలి. ఇలా నాలుగు నుండి ఐదు సార్లతో మొదలుపెట్టి వాటి సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దీనివల్ల శరీరం మొత్తం దృఢంగా మారుతుంది. ముఖ్యంగా భుజాలు, మెడ దృఢమవుతాయి. పక్కటెముకల సామర్థ్యం పెరుగుతుంది. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు ఐస్ లాగా కరుగుతుంది. కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి. బట్టి మెటబాలిజం మెరుగవుతుంది. పైన చెప్పుకున్నట్టు ముచ్చటగా మూడు ప్రయోగాలు చేశారంటే బద్దకాన్ని కూడా కాదని శరీరంలో కొవ్వు ఫటాఫట్ అంటూ పారిపోతుంది.                                      ◆ నిశ్శబ్ద.

మహిళలు వర్కౌట్స్ చేయడం మంచిదే కానీ.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి!

మహిళలు వర్కౌట్స్ చేయడం మంచిదే కానీ..ఈ పొరపాట్లు మాత్రం చేయకండి ! మహిళలు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని, కేవలం ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే అది శరీరాన్ని దృఢంగా ఉంచదని ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది మహిళలు వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా వర్కౌట్స్ చేయడం మంచిదే.. కొందరు జిమ్ లలో శిక్షకుల సమక్షంలో వర్కౌట్స్ చేస్తే అధిక శాతం మంది ఆన్లైల్ లో వివిధ ఆసనాలు, ఎక్సర్సైజులు చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అయితే అవహాహన లేకుండా వీటిని ఫాలో అవ్వడం చాలా తప్పు. దీనివల్ల శరీరం ఫిట్ గా మారడం కథ దేవుడెరుగు, ఉన్న ఫిట్నెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంతకీ వర్కౌట్స్ విషయంలో అందరూ తెలియకుండానే చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే.. బరువు తగ్గాలనే ఆలోచనతో చాలా మంది ఎక్కడైనా ఎవరైనా ఒక ఆసనం లేదా వ్యాయామం గురించి ప్రస్తావిస్తే దాన్ని చాలా భీభత్సంగా ఫాలో అవుతారు. అందుకే దేన్నైనా మొదట తేలికగా మొదలుపెట్టడం ఉత్తమం. వర్కౌట్లు చేయడానికి ముందు వార్మప్ ఫాలో కావాలి. దీనివల్ల శరీరంలో కండరాలు, వివిధ అవయవాలు వ్యాయామానికి తగిన విధంగా సిద్దమవుతాయి. వార్మప్ వల్ల శరీరం సాగదీయబడుతుంది. ఇది లేకుండా వ్యాయామం చేస్తే శరీరంలో కండరాలు, వివిధ భాగలు ఎక్కడివక్కడ పట్టుకుపోతాయి. ముఖ్యంగా కాళ్ల కండరాలు, నడుము, పిక్కలు, తొడలు, భుజాలు వంటివి  పట్టుకుపోతాయి. వర్కౌట్స్ చేసి శరీరాన్ని మార్చుకోవాలని అనుకునేవారు నెలల తరబడి వ్యాయామం ఫాలో అవ్వాలి . అన్నిరోజులూ ఒకే రకమైన వ్యాయామం పాలో అవ్వడం  చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకని విభిన్న రకాల వ్యాయామాలను ఎంచుకోవాలి. వీటిని మార్చి మార్చి చేస్తుండాలి. మరీ ముఖ్యంగా వ్యాయామాలు ప్రతిరోజు ఒకే సమయానికి పాలో కావడం మంచిది. దీనివల్ల శరీరం వ్యాయామానికి తగిన విధంగా యాక్టీవ్ అవుతుంది. శరీరంలో మార్పు ఒక క్రమపద్దతిలో సాగుతుంది. బరువు తగ్గడానికో, ఫిట్నెస్ గా ఉండటానికో వ్యాయామం ఫాలో అవుతుంటే అది శరీరం మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది, వ్యాయామం చేసేటప్పుడు ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి డైటింగ్ ఫాలో అవుతూ, వ్యాయామం కూడా చేయడం మంచిది కాదు. దీని వల్ల శరీరం దారుణంగా దెబ్బ తింటుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. శరీరంలో కేలరీలు బర్న్ చేయడానికి వ్యాయామాలను కూడా ఫాలో అవ్వాలి వ్యాయామం తరువాత అందరూ ఇక పనులలో మునిహిపోవడం చేస్తుంటారు. కానీ వ్యాయామానికి ముందు శరీరాన్ని ఎలాగైతే వార్మప్ చేశారో, అలాగే శరీరాన్ని కూల్ డౌన్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాయామం వల్ల ఉత్తేజితమైన కండరాలు, శరీర అవయవాలు మెల్లిగా సాధారణ స్థితికి వస్తాయి. మహిళలు తెలిసీ తెలియక ఈ పొరపాట్లు అన్నీ చేస్తుంటారు. వీటిని సవరించుకుంటేనే శరీరం ఫిట్నెస్ గా మారుతుంది.                                                    *నిశ్శబ్ద.

మహిళలకు ఫిట్నెస్ కావాలంటే ఈ పని చేయొద్దు..

మహిళలకు ఫిట్నెస్ కావాలంటే ఈ పని చేయొద్దు.. ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. ఏమి తినాలి?? ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పాటించడమే చేతకాదు. నిజాన్ని నిజంగా చెప్పుకుంటే ఇదే నిజం. చాలా మంది ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉండాలంటే పోషకాలు తగిన మోతాదులో లభించాలని అనుకుంటారు. శారీరక దృఢత్వానికి సరిపడిన పోషకాలు అవసరమే అయినా వాటిని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కోవిడ్ వచ్చిన సమయాలు గుర్తు చేసుకుంటే ఎంతోమంది తమకు సరిపడా పోషకాలు అందట్లేదని, ఇమ్యూనిటీ తక్కువగా ఉందనే కారణంతో కృత్రిమంగా పోషకాలను తీసుకున్నారు. అంతకు ముందు విటమిన్స్ లోపం అనే సమస్య వస్తే డాక్టర్లు విటమిన్ లోపానికి తగిన పండ్లు, కూరగాయలు వాడమని సలహా ఇచ్చేవారు. కోవిడ్ తరువాత ఈ తీరు మారింది. పండ్లు, కూరగాయలు స్థానంలో విటమిన్ సప్లిమెంట్స్ వచ్చి చేరాయి. ముఖ్యంగా మహిళలకు అంతకు ముందు వరకు కేవలం కాల్షియం టాబ్లెట్స్ మాత్రమే వాడమని సలహా ఇచ్చేవారు. కోవిడ్ తరువాత ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఫిట్టా.. ఫట్టా..  ఫిట్నెస్ కోసం మార్కెట్లో ఉన్న సప్లిమెంట్స్ అన్ని నిజంగానే ఫిట్నెస్ ను ఇస్తున్నాయా?? అనే ప్రశ్న వేసుకుంటే.. ఫిట్నెస్ ఏ మూల ఉందో వెతుక్కోవాల్సి వస్తోంది.  సామాజిక మాధ్యమాల్లో కనిపించే యాడ్ లు, ఫేక్ ప్రమోషన్లు చూసి పొరపడేవాళ్ళు ఎక్కువ. మహిళల చర్మం యవ్వనంగా ఉండటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చర్మం రంగు మారడానికి విటమిన్ సప్లిమెంట్లు విరివిగా తీసుకుంటుంటున్నారు గత రెండేళ్ల నుండి. ఆహారం ద్వారా భర్తీ కావాల్సిన పోషకాలను ఇలా భర్తీ చేసుకుంటున్న వీళ్లను ప్రశ్నిస్తే చాలామంది చెప్పే సమాధానం రోజుకు అవసరమయ్యే పోషకాలు, విటమిన్స్ ఆహారంలో దొరకడం కష్టం కదా అని.  ఈ మాటలో నిజమెంత??  మనకు రోజులో అవసరమయ్యే పోషకాలు మనకు లభ్యం కావు అనే మాట కాస్త ఆత్మ విమర్శ చేసుకుని నిర్ణయిస్తే బాగుంటుంది.  ప్రతిరోజూ సరిపడిన మోతాదులో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే 90% పోషకాలు సులభంగానే మనకు లభిస్తాయి. పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, పాల ఆధారిత పదార్థాలు మొదలైన వాటి నుండి, మాంసం, చేపలు మొదలైన వాటి నుండి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే వీటన్నిటిని తీసుకునే అవసరం లేకుండా కేవలం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుని పోషకాలను భర్తీ చేస్తే శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. విటమిన్ బి12, బయోటిన్, విటమిన్ ఇ, విటమిన్ సి మొదలైనవన్నీ ఇలా సప్లిమెంట్స్ లా తీసుకుంటే శరీర కంధర వ్యవస్థ నుండి కణజాల వ్యవస్థ వరకు అన్నీ దెబ్బ తింటాయి. ఇవి మహిళల్లో ఋతు చక్రానికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఇలాంటి సప్లిమెంట్లకు దూరంగా ఉండండి. ఆహారం నుండే పోషకాలను పొందండి.                                   ◆నిశ్శబ్ద