English | Telugu

సీతాకాంత్ కి రామలక్ష్మి భరోసా.. భద్రం చేసే మోసంలో వాళ్లు బలి అవుతారా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -296 లో... శ్రీలతతో సారీ చెప్పుంచుకుంటుంది రామలక్ష్మి. త్వరలో సీతా సర్ కి సారీ చెప్పిస్తానని శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది రామలక్ష్మి. మరొకవైపు సీతాకాంత్ ఒక దగ్గర టీ తాగుతుంటే.. అప్పుడే ఒకతను చూసి.. సర్ మీరా? ఇలా అయ్యారేంటి? మీరు ఒక్కప్పుడు బిజినెస్ గురించి యూత్ కి స్పీచ్ ఇచ్చారు.. ఆ స్పీచ్ విని ఇన్ స్పైర్ అయి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాను. ఆ ప్రాజెక్ట్ లో సక్సెస్ కాలేకపోతున్నా.. ప్లీజ్ నాకు సజెషన్ ఇవ్వండి అని అంటాడు. దాంతో సరే అని అతన్ని సీతాకాంత్ ఇంటికి తీసుకొని వెళ్లి ఆ కంపెనీ గురించి తెలుసుకుంటాడు.

అప్పుడే రామలక్ష్మి ఇంటికి వస్తుంది. అతన్ని చూసి ఎవరని అడుగుతుంది. ఫ్రెండ్ అనుకో బిజినెస్ లో హెల్ప్ కావాలంటే చేస్తున్నానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత థాంక్స్ సర్ నాకూ ఏ డౌట్ ఉన్నా మీ దగ్గరికి వస్తాను.. మీరు ఈ సిచువేషన్ కి రావడానికి కారణం నాకు తెలియదు కానీ మళ్ళీ మీరు తల్చుకుంటే ఆ స్థాయి కి రాగలరంటూ సీతాకాంత్ గురించి గొప్ప గా మాట్లాడి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అతని మాటలకి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు శ్రీవల్లి చేసిన పనికి నేను ఆ రామలక్ష్మికి సారీ చెప్పాలిసి వచ్చిందని శ్రీవల్లిపై కోప్పడుతుంది శ్రీలత. ఇప్పుడు మనమే గెలిచాం అత్తయ్య మనం లగ్జరీగా ఉన్నాము.. తను చూసారా కష్టపడుతుందని శ్రీవల్లి అనగానే అవునంటూ శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరొకవైపు రామలక్ష్మికి సీతాకాంత్ గోరింటాకు పెడతాడు. మరుసటి రోజు ధన, సందీప్, భద్రం కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఏంటి రియల్ ఎస్టేట్ గురించి ఆడ్ ఏపించినా కూడా ఒక్కరు కూడా ఫ్లాట్ కొనడానికి ముందుకు రావడం లేదని ధన, సందీప్ లు డిస్సపాయింట్ అవుతుంటారు. అప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి ఫ్లాట్ కొంటూ ఉంటారు. ఆ డబ్బులో కొంత డబ్బు భద్రం తీసుకొని ఇది మీకు అని చెప్పగానే ధన, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నన్ను ఎంత నమ్మితే నాకు అంతే లాభమని భద్రం అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.