English | Telugu

కైలాష్ బండారం బ‌య‌ట‌పెట్టిన య‌ష్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం` సీరియల్‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో మ‌హిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. మంగ‌ళ వారం ఎంపిసోడ్ విశేషాలేంటో తెలుసుకుందాం. వేద‌కు జ‌రిగిన అవ‌మానాన్నితిప్పికొట్టి త‌న నిజాయితీని నిరూపించాలంటే కైలాష్ కి గుణ‌పాఠం చెప్ప‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని భావించిన య‌ష్ ఆ వైపుగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు. కైలాష్ ఫోన్ ని వాడి సారిక‌కు మెసేజ్ చేస్తాడు. అది నిజ‌మే అని న‌మ్మిన సారిక మెసేజ్ లో చెప్పిన చోటుకి వ‌చ్చేస్తుంది.

య‌ష్ రావ‌డంతో ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. వేద‌కు వ్య‌తిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పావ‌ని, అలా చేయ‌డానికి కార‌ణం ఏంట‌ని సారిక‌ని నిల‌దీస్తాడు య‌ష్‌. నీకు అన్ని విధాలుగా నేను అండ‌గా వుంటాన‌ని, కైలాష్ కి వ్య‌తిరేకంగా గ‌ట్టిగా నిల‌బ‌డాలి అంటాడు. అందుకు సారిక అంగీక‌రిస్తుంది. క‌ట్ చేస్తే వేద అక్క స‌డ‌న్ గా ఇంటికొచ్చి జ‌రిగిన విష‌యం తెలుసుకుని కైలాష్ ని న‌రికేస్తానంటూ ఊగిపోతుంది. వాడిని కోర్టుకీడ్చి బుద్ధి చెబుదామంటుంది. ఈ మాట‌ల‌న్నీ చాటుగా విన్న కాంచ‌న వెంట‌నే వెళ్లి త‌ల్లి మాలినికి చెబుతుంది.

ఇక కైలాష్ త‌న గురించి య‌ష్ కి అనుమానం వ‌చ్చిందంటే చంపేస్తాడ‌ని, అర్జెంట్ గా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. కాంచ‌న వ‌చ్చే స‌రికి డ్రామా మొద‌లు పెడ‌తాడు. ఇద్ద‌రు క‌లిసి బ్యాగ్స్ స‌ర్దుకుని వెళ్ల‌బోతుంటే య‌ష్ ఎంట్రీ ఇస్తాడు. స్వ‌యంగా నేనే మిమ్మ‌ల్ని సాగ‌నంపుతాన‌ని చెప్పాను క‌దా? మీకు ఎందుకు ఇంత తొంద‌ర? అంటూనే స్పెష‌ల్ ప‌ర్స‌న్ వ‌చ్చార‌ని చెప్పి సారిక‌ని పిలుస్తాడు. త‌న‌ని చూడ‌టంతో కైలాష్ కి ద‌డ‌మొద‌ల‌వుతుంది. త‌రువాత ఏం జ‌రిగింది? అంద‌రికి కైలాష్ గురించి తెలిసిపోయిందా? అనేది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.