English | Telugu

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. గెలిచేది ఎవ‌రు?

బిగ్‌బాస్ షో పై గ‌త కొంత కాలంగా తీవ్ర విమ‌ర్శ‌లు, వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా దీన్ని ఆద‌రించే వారి సంఖ్య‌ కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతూనే వుంది. కొంత మంది కోర్టులో కేసులు వేస్తూ వివాదం చేస్తున్నా దీని జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ షోపై కొంతమంది వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుంటే, మ‌రి కొంత మంది మాత్రం షో ఎప్పుడు మొద‌ల‌వుతుందా? టీవీల‌కు అతుక్కుపోదామా అని ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ షోకు ఆద‌ర‌ణ ప్ర‌తీ సీజ‌న్ కి పెరుగుతూనే వుంది.

తెలుగులో ఐదు సీజ‌న్ లు పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లోనే ఆర‌వ సీజ‌న్ కు రెడీ అవుతోంది. ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ నాన్ స్టాప్ మొద‌లైన విష‌యం తెలిసిందే. మొద‌ట్లో కొంత టెక్నిక‌ల్ గా ఇబ్బందిక‌రంగా అనిపించినా త‌రువాత త‌రువాత పుంజుకుంటూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం గ్రాండ్ ఫినాలే స్టేజ్ కి చేరింది. ఈ వారం టాప్ 5 డిసైడ్ కాబోతోంది. హౌస్ లో ప్ర‌స్తుతం 7గురు స‌భ్యులున్నారు. అఖిల్‌, బిందు మాధ‌వి, అరియానా, యాంక‌ర్ శివ‌, బాబా భాస్క‌ర్‌, మిత్ర‌, అనిల్ మిగిలారు. ఈ వారం మ‌ధ్య‌లో ఒక‌రు ఇంటిదారి ప‌ట్టే అవ‌కాశం వుంది.

గ‌త సీజ‌న్ ల మాదిరిగా ఈ సారి వార్ వ‌న్ సైడ్ గా మార‌లేదు. రెండు వైపులా ట‌ఫ్ గానే న‌డుస్తోంది. ఈ సారి టైటిల్ విన్న‌ర్స్ గా ఇద్ద‌రు పోటీప‌డుతున్నారు. బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఒక్క అడుగు దూరంలో టైటిల్ మిస్ చేసుకున్న అఖిల్ ఈ సారి కొంత ట‌ఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఇత‌నికి పోటీగా బిందు మాధ‌వి నిల‌బ‌డి క‌ల‌బ‌డుతోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్యే ప్ర‌ధానంగా పోటీ జ‌ర‌గ‌బోతోంది. అయితే ఈ పోటీలో విజేత‌గా నిలిచేది ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫినాలేలో గెలిచేది ఎవ‌ర‌న్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.